Students can go through AP Inter 1st Year Zoology Notes 5th Lesson గమనం, ప్రత్యుత్పత్తి will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Zoology Notes 5th Lesson గమనం, ప్రత్యుత్పత్తి
→ ప్రోటోజోవా జీవులు ఆహారసేకరణ, ప్రత్యుత్పత్తులలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి.
→ ఒక మాధ్యమంలో జీవిలో కనపడు కదలికను చలనం అందురు. దీనితో జీవులు ఆహారం, రక్షణ, ప్రత్యుత్పత్తి ఒకస్థానం నుండి మరొక స్థానానికి మారుతాయి.
→ ప్రోటోజోవాలో గమనం 3 రకములు :
- అమీబాయిడ్ గమనం – మిథ్యాపాదాల వల్ల
- ఈదుడు గమనం శైలికలు, కశాభాల వల్ల
- మెటబోలి – కండర తంతువుల వల్ల.
→ మిథ్యాపాదములు నాలుగు రకములు.
→ కశాభాలు సాధారణంగా ఒకటి లేక రెండు ఉంటాయి. కాని శైలికలు అనేకం ఉంటాయి.
→ మాస్టిగోనీముల అమరికను బట్టి కశాభాలు 5 రకాలుగా విభజింపబడినవి.
→ అమీబాయిడ్ గమనమును సాల్-జెల్’ సిద్ధాంతము ద్వారా హైమన్ వివరించెను. పాంటిన్ మరియు మాస్ట్లు దానిని బలపరిచినారు.
→ శైలికలు ఏకకాలిక మరియు బహుకాలిక లయబద్ధ గమనాన్ని చూపుతాయి.
→ కశాభ గమనంలో కశాభం దేహ అక్షానికి లంబకోణంలో నీటిని కొట్టుకొంటుంది.
→ శైలికామయ గమనంలో నీరు కదలిక శైలికలు దేహానికి అతుకున్న తలానికి సమాంతరంగాను, దేహ ఆయత అక్షానికి లంబకోణంలోను ఉంటుంది.
→ గమనానుగతి వల్ల స్నిగ్ధతా ఈడ్చేబలం ఎక్కువ అవుతుంది. ప్రోటోజోవా జీవులు గమనానుగతం పొందలేదు.
→ డైనీన్ భుజాలు డైనీను అనే చాలక ప్రోటీన్ నిర్మితాలు. ఇవి కశాభాలు, శైలికల వంపులో సూక్ష్మనాళికలు జారేటట్లు చేస్తాయి.
→ మిథ్యాపాదాలు ఎల్లప్పుడూ జీవి చలించే దిశలోనే చలిస్తాయి.
→ శైలికామయ ప్రోటోజోవన్ల వంటి జీవులలో నాడీచాలక వ్యవస్థ ఉంటుంది.
→ ప్రత్యుత్పత్తి వల్ల జాతి కొనసాగుతుంది.
→ ప్రోటోజోవన్లలో ప్రత్యుత్పత్తి రెండు రకాలుగా ఉంటుంది.
- అలైంగిక
- లైంగిక ప్రత్యుత్పత్తులు.
→ అలైంగిక ప్రత్యుత్పత్తిలో పిల్ల జీవులు జన్యురీత్యా తల్లి జీవిని పోలి ఉంటుంది.
→ అలైంగిక ప్రత్యుత్పత్తి ఎల్లప్పుడు అనుకూల పరిస్థితులలో జరుగుతుంది.
→ లైంగిక ప్రత్యుత్పత్తి ప్రాక్కేంద్రక కలయిక వల్ల జరుగుతుంది.
→ దీనిలో బీజకణాల ప్రాక్కేంద్రకాల కలయిక వల్ల జరిగే లైంగిక ప్రత్యుత్పత్తిని సంయోగం అని అందురు.
→ సంయోగం చెందే బీజకణాలు సమానమైనవైతే దాన్ని సమసంయోగం అని అందురు.
→ సంయోగం చెందే బీజకణాలు అసమానమైనవైతే దాన్ని అసమసంయోగం అని అందురు.
→ సంయుగ్మం అనేది సంయుగ్మజీవుల ప్రాక్కేంద్రకాలు కలయిక వల్ల జరిగే లైంగిక ప్రత్యుత్పత్తి.
→ ఇవి సాధారణంగా సీలియేట్ జీవులలో జరుగుతుంది.
→ కేంద్రక పునర్వ్యవస్థీకరణ జరిగే ఇతర పద్ధతులు –
- ఆటోగమీ,
- సైటోగమీ,
- ఎండోమిక్సిస్.
→ వర్టిసెల్లా సంయుగ్మంలో పాల్గొనే రెండు సంయుగ్మకాలు స్వరూపరీత్యా, శరీరధర్మరీత్యా భిన్నంగా ఉంటాయి.
→ కాంతి అనువర్తనం (phototropism) : జీవులు కాంతి వైపుగాని లేదా దూరంగా గాని జరగడం అనే ధోరణి.
→ కణాంగం : కణంలో ప్రత్యేక నిర్మాణం, విధి ఉన్న భాగం. ఉదా : మైటోకాండ్రియా, లైసోజోమ్, రైబోజోమ్, గాల్జి సంక్లిష్టం మొదలగునవి.
→ హీలియోపోడియా : ‘సన్ ఏనిమల క్యూల్స్’ లో లాగా దేహమంతటా ఉండే కిరణ పాదాలు లాంటి మిథ్యాపాదాలు. (ఏక్టినోఫ్రిస్, ఏక్టినోస్ఫీరియమ్)
→ ట్యూబ్యులిన్ : ఇది కణాస్తిపంజరం యొక్క సూక్ష్మనాళికలను ఏర్పరిచే ప్రోటీన్.
→ కైనెటోజోమ్ : ఇది మార్పుచెందిన తారావత్కేంద్రం. దీనినుంచి శైలిక, కశాభం ఏర్పడుతుంది.
→ సక్టోరియా : అభివృద్ధి చెందిన సీలియేట్ ప్రోటోజోవన్ల ప్రౌఢజీవుల్లో సక్టోరియల్ స్పర్శకాలు, డింభక దశల్లో శైలికలను కలిగి ఉంటాయి.
ఉదా : ఎసినేటా.
→ సినైల్ : వయస్సు పెరిగిన జీవ సత్తువ కోల్పోవడం.
→ నెక్సిన్ లింకులు : ఏక్సోనీమ్ సవ్యదిశలో ఒక యుగళ సూక్ష్మనాళికలోని A నాళికను మరొక యుగళ సూక్ష్మనాళికలోని B నాళికతో కలిపే ప్రోటీనులను నెక్సిన్ లింకులు అంటారు. అవి రెండు యుగళ సూక్ష్మనాళికలను సమైక్యంగా ఉంచుతాయి.