AP Inter 2nd Year Botany Notes Chapter 2 ఖనిజ పోషణ

Students can go through AP Inter 2nd Year Botany Notes 2nd Lesson ఖనిజ పోషణ will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Botany Notes 2nd Lesson ఖనిజ పోషణ

→ అన్ని జీవులకు పెరుగుదల, వృద్ధికి కార్టోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు వంటి స్థూల అణువులు, నీరు, వివిధ ఖనిజాలు ఎంతో అవసరము.

→ మొక్కలను నిర్దిష్ట మూలకాల ద్రావణంలో పెంచే సాంకేతిక పద్ధతిని హైడ్రోపోనిక్స్ అంటారు.

→ C, H, O, N, P, K, Ca, Mg మరియు Sలు స్థూల మూలకాలు.

→ Fe, Mn, In, MO, Cu, Cl, B మరియు Ni లు సూక్ష్మ మూలకాలు.

→ C, H, O లను నిర్మాణాత్మక మూలకాలు అంటారు.

→ మొక్కలలో శక్తి సంబంధ రసాయన పదార్థాలలో భాగంగా ఉన్న ఆవశ్యక మూలకాలు Mg, ఫాస్పరస్.

→ నికెల్, యూరియేజ్ అను ఎన్జైమ్కు ఉత్ప్రేరకము. ఇది నత్రజని జీవక్రియలో పాల్గొంటుంది.

→ ఆవశ్యక మూలకం గాఢత తక్కువైనపుడు మొక్క పెరుగుదల ఆగిపోయినట్లయితే ఆ గాఢతను సందిగ్ధ గాఢ అంటారు.

→ నత్రజని, పొటాషియమ్, మెగ్నీషియమ్ లోప లక్షణాలు వృద్ధ పత్రాలలో గోచరిస్తాయి.

→ సల్ఫర్, కాల్షియంల లోప లక్షణాలు మొదట లేత పత్రాలలో కనిపిస్తాయి.

→ పత్రాలు పత్రహరితాన్ని కోల్పోయి, పసుపు వర్ణంలోకి మారుటను నిర్హరితం అంటారు.

→ Ca, Mg, Cu మరియు K లోపం వల్ల కణజాలాలు చనిపోవడం జరుగును.

→ నికెల్ లోపం వల్ల పెకాన్ లో మౌస్ ఇయర్ వ్యాధి కలుగును.

→ అయాన్లు నిష్క్రియా లేక సక్రియా పద్ధతి ద్వారా శోషించబడతాయి.

→ ఖనిజ మూలకాలు బాష్పోత్సేకకర్షణ వల్ల దారువులో ఊర్ధ్వముఖంగా వహనం చెందుతున్న నీటి ద్వారా స్థానాంతరణ చెందుతాయి.

AP Inter 2nd Year Botany Notes Chapter 2 ఖనిజ పోషణ

→ మొక్కల పెరుగుదలకు, అభివృద్ధికీ ‘కావలసిన అత్యధిక పోషకాలు శైథిల్యమైన (విచ్ఛిన్నం చెందిన) శిలల నుంచి ఏర్పడిన మృత్తిక ద్వారా వేర్లకు అందించబడతాయి.

→ నత్రజని సజీవులలో అత్యధికంగా ఉన్న మూలకము.

→ నత్రజని క్షయకరణం చెందించే నైట్రోజినేజ్ ఎన్జైమ్ ప్రత్యేకంగా కేంద్రకపూర్వ జీవులలోనే ఉంటుంది. వాటిని N2 స్థాపక జీవులు అంటారు.

→ నైట్రోజినేజ్ ఎన్జైమ్ MO – Fe ప్రొటీను. ఇది వాతావరణ నైట్రోజన్ ను అమ్మోనియాగా మారుస్తుంది.

→ నైట్రోజినేజ్ ఎన్జైమ్లను రక్షించడానికి లెగ్ హీమోగ్లోబిన్ అను ఆక్సిజన్ సమ్మారకం ఉంటుంది.

→ అమైడ్లు (ఆస్పర్జిన్, గ్లూటమిన్) లు మొక్కలలో ఎక్కువగా లభిస్తాయి. ఇవి ఎక్కువగా నత్రజనిని కలిగి ఉంటాయి. కనుక అవి మొక్కల దారునాళాల ద్వారా ఇతర భాగాలకు రవాణా చెందుతాయి).