AP Inter 2nd Year Botany Notes Chapter 3 ఎన్జైమ్లు

Students can go through AP Inter 2nd Year Botany Notes 3rd Lesson ఎన్జైమ్లు will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Botany Notes 3rd Lesson ఎన్జైమ్లు

→ అన్ని ఎన్జైమ్లు దాదాపుగా ప్రొటీనులే. కొన్ని కేంద్రకామ్లాలు ఎన్జైమ్లుగా పనిచేస్తాయి. వీటిని రైబోజైమ్లు అంటారు. 23 ‘S’ rRNA.

→ అధస్థ పదార్థము ‘S’ ఎన్జైమ్ నొక్కు లేదా సంచులుగా ఉండే క్రియాశీల స్థానానికి బంధితమై ES సంక్లిష్టం ఏర్పడుతుంది. ఈ బంధం విచ్చిన్నమై ఉత్పాదితం ‘P’ మరియు మార్పులేని ఎన్జైమ్ విడుదల అవుతాయి.

→ ES సంక్లిష్టం ఏర్పడే విధానాన్ని ఇమిల్ఫిషర్ ప్రతిపాదించిన తాళం – కప్ప, తాళం చెవి పరికల్పన, ఆ తరువాత డానియల్ ఇ-కోషాండ్ ప్రతిపాదించిన ‘ఇండ్యూస్డ్ ఫిట్ పరికల్పనలు వివరిస్తాయి.

→ ఎన్జైమ్లు ఒక నిరిష్ట ఉష్ణోగ్రత, pH ల వద్ద పనిచేస్తాయి. వాటిని యుక్తతమ ఉష్ణోగ్రత, యుక్తతమ pH అంటారు.

→ రసాయనం బందితం కావడంతోనే ఎన్జైమ్ క్రియాశీలత ఆగిపోయే విధానాన్ని నిరోధకత అంటారు. ఆ రసాయనాన్ని నిరోధకం అంటారు.

→ నిరోధకం తన అణునిర్మాణంలో అధస్థ పదార్థాన్ని దగ్గరగా పోలి ఉండి, ఎన్జైమ్ క్రియాశీలతను నిరోధిస్తే దానిని పోటీపడే నిరోధకము అంటారు.

AP Inter 2nd Year Botany Notes Chapter 3 ఎన్జైమ్లు

→ నిరోధకం అధస్థపదార్థంతో నిర్మాణాత్మక పోలికను కలిగి ఉండక, క్రియాశీల స్థానం దగ్గర కాకుండా వేరేస్థానం వద్ద ఎన్జైమ్ నిరోధక సంక్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. దీనిని పోటీపడని నిరోదకము అంటారు.

→ ఎన్జైమ్లను ఆరు విభాగాలుగా వర్గీకరించారు. అవి :

  • ఆక్సిడోరిడక్టేజ్లు
  • ట్రాన్స్ ఫరేజ్లు
  • హైడ్రోలేజ్లు
  • లయేజ్లు
  • ఐసోమరేజ్లు
  • లైగేజ్లు

→ గ్లూకోజ్ – 6 – ఫాస్ట్రోట్రాన్స్ఫరేజ్ కు ఎన్జైమ్ సంఖ్య 2.7.1.2. దీనిలో మొదటి సంఖ్య ఎన్జైమ్ విభాగమును, రెండో సంఖ్య ఎన్జైమ్ ఉపవిభాగమును, మూడో సంఖ్య ఉప-ఉప విభాగమును, నాలుగో సంఖ్య ఎన్జైమ్ వరుస సంఖ్యను తెలియచేస్తుంది.

→ ఎన్జైమ్లోని ప్రొటీను భాగాన్ని అవోఎన్జైమ్ అని, ప్రొటీను కాని భాగమును సహకారము అని అంటారు.

→ అపోఎన్జైమ్కు వదులుగా బందితమైన సేంద్రియ సహకారకాలను సహ ఎన్జైమ్లు అంటారు.

→ అపో ఎన్జైమ్కు గట్టిగా బందితమైన ఉన్న సేంద్రియ పదార్థాలను ప్రాస్థటిక్ సమూహాలు అంటారు.

→ వివిధ రకాల ఎన్జైమ్లు పాల్గోనే ఉత్ప్రేరక చర్యల్లో సహ ఎన్జైమ్ల అవశ్యక రసాయన అనుఘటకాలు విటమిన్లుగా ఉంటాయి.
ఉదా : NAD, NADP లు రెండు నియాసిన్లను కలిగి ఉంటాయి.

→ కార్టాక్సి పెద్డడేజ్కి జింక్ ఒక సహకారకంగా పనిచేస్తుంది.