AP Inter 2nd Year Botany Notes Chapter 5 మొక్కలలో శ్వాసక్రియ

Students can go through AP Inter 2nd Year Botany Notes 5th Lesson మొక్కలలో శ్వాసక్రియ will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Botany Notes 5th Lesson మొక్కలలో శ్వాసక్రియ

→ మనం ‘ఆహారం’ అని పిలిచే స్థూల అణువులు ఆక్సీకరణం చెందినప్పుడు ‘జీవ’ చర్యలకు కావలసిన శక్తి లభిస్తుంది.

→ హరిత మొక్కలు, సయనోబాక్టీరియమ్లు మాత్రమే తమ స్వంత ఆహారాన్ని తయారు చేసుకుంటాయి.

→ కణంలో ఆక్సీకరణ జరిగినప్పుడు ఆహారంలో ఉండే శక్తి అంతా ఒకేసారి విడుదలకాదు. ఎన్ఎమ్ల నియంత్రణలో

→ జరిగే చర్యల వల్ల శక్తి అంచెలంచెలుగా విడుదలై ATP రూపంలో నిల్వచేయబడుతుంది.

→ కణ ఆక్సీకరణలో తోడ్పడే పదార్థాలను శ్వాసక్రియాధస్థ పదార్థాలు అంటారు.

→ ATP ని కణశక్తి నగదు అంటారు.

→ శ్వాసక్రియ 2 రకాలు

  • వాయుసహిత,
  • అవాయు శ్వాసక్రియ.

→ వాయుసహిత శ్వాసక్రియ 2 సమక్షంలో 4 దశలుగా జరుగుతుంది.

→ గ్లూకోస్ విచ్ఛిన్నం చెంది 2 PAలుగా మారే క్రమాన్ని గ్లైకాలిసిస్ లేదా EMP పథం అంటారు.

→ పైరువిక్ ఆమ్లం పూర్తిగా ఆక్సీకరణం చెంది, హైడ్రోజన్ ను తొలగించి, 300, అణువులను ఏర్పరుస్తుంది.

→ పైరువిక్ ఆమ్లం ఆక్సీకరణ డీకార్టాక్సిలేషన్ చెంది పైరువిక్ డీహైడ్రోజినేజ్ సమక్షంలో కోఎన్జైమ్ – ఎ తో సంగ్రహణం చెంది అసిటైల్ కో. ఎన్జైమ్ A ఏర్పడుతుంది.

→ అసిటైల్ కో ఎన్జైమ్ A సంపూర్ణ ఆక్సీకరణం చెందిన శక్తిని NADPH + H+ రూపంలో క్రెబ్స్ వలయం ద్వారా విడుదల చేస్తుంది.

AP Inter 2nd Year Botany Notes Chapter 5 మొక్కలలో శ్వాసక్రియ

→ NADPH + H+, FADH2 లు ఆక్సీకరణం చెంది విడుదలైన ఎలక్ట్రాన్లు, ETS ద్వారా 1/2 O2 ను చేరి 1నీటి అణువును ఏర్పరుస్తాయి.

→ ATP సంశ్లేషణను పీటర్ మిట్చెల్ కెమీఆస్మాటిక్ సిద్ధాంతం ద్వారా వివరించవచ్చు.

→ 1 గ్లూకోస్ ఆక్సీకరణం చెంది 36 ATPలు ఏర్పడతాయి.

→ శ్వాసక్రియలో విచ్ఛిన్నక్రియ, నిర్మాణక్రియలు రెండూ కనిపిస్తాయి. కావున దానిని ఆంఫీభోలిక్పథం అంటారు.

→ శ్వాసక్రియలో అదస్థ పదార్థం ఆక్సీకరణం చెందినప్పుడు విడుదల అయిన CO2, అణువుల సంఖ్యకు, గ్రహించబడిన O2 అణువులకు మధ్య ఉన్న నిష్పత్తిని శ్వాసక్రియ కోషంట్ అంటారు.

→ కార్బోహైడ్రోట్ల శ్వాసక్రియ కోషంట్ – 1

→ కొవ్వుల శ్వాసక్రియ కోషంట్ – 1కన్నా తక్కువ (0.7)

→ ప్రొటీనుల శ్వాసక్రియ కోషంట్ – 1 కన్నా తక్కువ (0.9)