Students can go through AP Inter 2nd Year Botany Notes 4th Lesson ఉన్నత మొక్కలలో కిరణజన్యసంయోగక్రియ will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Botany Notes 4th Lesson ఉన్నత మొక్కలలో కిరణజన్యసంయోగక్రియ
→ ఆకు పచ్చని మొక్కలు కిరణజన్యసంయోగక్రియ అనే భౌతిక రసాయనిక చర్య ద్వారా కాంతిశక్తిని వాడుకుని కార్బోహైడ్రేట్లను సంశ్లేషణకు ఉపయోగించుకుంటాయి.
→ ఇది భూమి మీద ఉన్న సకల జీవులకు మూలాధారమైన ఆహారం తయారీకి, వాతావరణంలోని ప్రాణవాయువు విడుదలకు ఈ ప్రక్రియ దోహదపడుతుంది.
→ మోల్స్ అర్థ పత్రప్రయోగం ద్వారా, కిరణజన్యసంయోగక్రియకు CO2, అవసరమని నిరూపించారు.
→ పచ్చని మొక్కలు పెరగడంలోగాలి ఆవశ్యకతను నిరూపించడానికి 1970లో జోసెఫ్ ప్రీస్ట్రీ ప్రయోగాలు చేసారు. జాన్ ఇంజన్ హౌజ్ ఒక నీటిమొక్కతో ప్రయోగాలు జరిపి, కేవలం మొక్కల ఆకుపచ్చని భాగాలే ఆక్సిజన్ ను విడుదలచేస్తాయని నిరూపించారు.
→ జూలియస్ వాన్ సాక్స్ మొడ్లల్లోని ఆకుపచ్చని భాగాలు గ్లూకోజ్ను తయారు చేస్తాయని అది పిండిపదార్థ రూపంలో నిల్వచేయబడుతుందని గుర్తించారు.
→ కిరణజన్యసంయోగక్రియలో నీటినుండి O2 విడుదల అవుతుంది.
→ మొక్కల ఆకుపచ్చని భాగాలైన పత్రాలలోనే కాక, ఇతర ఆకుపచ్చని భాగాలలో కిరణజన్యసంయోగక్రియ జరుగుతుంది.
→ త్వచవ్యవస్థ కాంతిశక్తిని శోషించి ATP, NADPH లుగా ఏర్పడటానికి దోహదంచేస్తాయి.
→ ఆవర్ణికలో ఉన్న ఎన్జైమ్ చర్యలతో మొక్కలోకి CO2, స్థాపించబడి, చక్కెర తయారుచేయబడి, అది పిదప పిండిపదార్థంగా మారుతుంది.
→ పత్రంలో కనిపించే రంగు ఒక వర్ణద్రవ్యం వల్ల గాక నాలుగు భిన్నమైన వర్ణద్రవ్యాల వలన కలుగుతుంది. అవి పత్రహరితం -ఎ, పత్రహరితం-బి, జాంథోఫిల్ మరియు కెరోటినాయిడ్లు.
→ వివిధ తరంగదైర్ఘ్యాల వద్ద కిరణజన్యసంయోగక్రియా రేటు తెలిపే చిత్రాన్ని చర్యవర్ణపటం అంటారు.
→ వివిధ వర్ణద్రవ్యాల కాంతిశోషణ సామర్థ్యాన్ని తెలిపే పటాన్ని శోషణ వర్ణపటము అంటారు.
→ కిరణజన్యసంయోగక్రియకు కావలసిన ముఖ్య వర్ణద్రవ్యం- పత్రహరితం
→ పత్రహరితం బి కెరోటినాయిడ్ లు జాంథోఫిల్ లును అదనపు వర్ణద్రవ్యాలు అంటారు.
→ చక్రియ కాంతి ఫాస్ఫారిలేషన్లో PS-I మాత్రమే పాల్గోంటుంది.
→ అచక్రియ కాంతి ఫాస్ఫారిలేషన్లో లో PS-I \ PS-II రెండూ పాల్గొంటాయి.
→ నీటి అణువు కాంతి సమక్షంలో నిన్నం చెంది 2Ht, 2e, 10, ఏర్పడతాయి.
→ థైలకాయిడ్ త్వచాలకిరువైపులా ప్రోటాన్ ప్రవణత ఏర్పటం వల్ల ATP సంశ్లేషణ జరుగుతుంది.
→ చక్కెర పదార్థాల తయారీకి దారితీసే ప్రక్రియలు జరగటంలో ATP – NADPH లు ఉపయోగపడతాయి. ఈ దశను జీవ సంశ్లేణ దశ అంటారు.
→ CO2 స్ధాపన లో మొదటి ఉత్పాదితము PGA (3C) అయిన, ఆ మొక్కలను C3, మొక్కలు అంటారు. OAA (4C) అయినవాటిని C4, మొక్కలు అంటారు.
→ క్యాన్ వలయము 3 దశలలో జరుగును.
a) కార్బాక్సిలేషన్
b) క్షయకరణ దశ
c) పునరుద్ధరణ దశ.
→ ప్రతి CO2 అణుప్రస్థాపనకు 3ATP లు, 2NADPH లు అవసరము.
→ C2, మొక్కలలో క్రాంజ్ అంతర్నిర్మాణం కనిపిస్తుంది. ఇవి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి. అధికకాంతి తీవ్రతలకు ప్రతిస్పందిస్తాయి. వీటిలో కాంతి శ్వాసక్రియ జరగదు. ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది.
→ C3, C4, పథాలకు ప్రత్యామ్నాయంగా క్రాస్సులేసియస్ ఆమ్ల జీవక్రియా ద్వారా CO2 స్థాపన జరుగుతుంది. ఉదా : కాక్టై (కాస్సులేసి)
→ కాంతి సమక్షంలో ఆకు పచ్చని కణజాలం O2 ను గ్రహించి CO2 ను విడుదల చేసే ప్రక్రియను కాంతిశ్వాస క్రియ అంటారు.