AP Inter 2nd Year Chemistry Notes Chapter 12 C,H,O లు ఉన్న కర్బన సమ్మేళనాలు

Students can go through AP Inter 2nd Year Chemistry Notes 12th Lesson C, H, O లు ఉన్న కర్బన సమ్మేళనాలు will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Chemistry Notes 12th Lesson C,H,O లు ఉన్న కర్బన సమ్మేళనాలు

→ హైడ్రోకార్టన్లలో హైడ్రోజన్ స్థానంలో – OH సమూహ మార్పిడి వలన ఆల్కహాల్లు, ఫీనాల్లు ఏర్పడును.

→ హైడ్రోకార్టన్లో హైడ్రోజన్ స్థానంలో ఆల్కాక్సీ (లేదా) ఎరైలాక్సీ సమూహాల మార్పిడి వలన ఈథర్లు ఏర్పడతాయి.

→ ఆల్కహాల్లు మరియు ఫీనాల్లలో – OH సమూహాల సంఖ్యను ఆధారంగా మోనోహైడ్రిక్, డైహైడ్రిక్ (లేదా) పాలీ హైడ్రిక్ ఆల్కహాల్గా వర్గీకరించారు.

→ Csp3 – OH బంధం గల సమ్మేళనాలను 1°, 2° మరియు 3° -ఆల్కహాల్లు, ఎల్లైలిక్, బెంజైలిక్ ఆల్కహాల్లు అంటారు.

→ Csp2 – OH బంధం గల సమ్మేళనాలను వినైలిక్ ఆల్కహాల్లు అంటారు.

→ బంధింపబడిన ఆల్కైల్ సమూహం ఆధారంగా ఈథర్లను సౌష్ఠవ, అసౌష్ఠవ ఈథర్ లుగా వర్గీకరించారు.

→ ఆల్కహాల్లను ఆమ్ల ఉత్ప్రేరణ ఆర్ద్రీకరణ, హైడ్రోబోరేషన్, ఆక్సీకరణం, కార్గోనైల్ సమ్మేళనాల క్షయకరణం, గ్రిగా నార్డ్ కారకం నుండి పొందవచ్చు.

→ ఆల్కహాలు మరియు ఫీనాలు సమాన అణుభారం ఉన్న హైడ్రోకార్టన్లు, ఈథర్లకంటే బాష్పీభవన స్థానాలు ఎక్కువగా ఉంటాయి.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 12 C,H,O లు ఉన్న కర్బన సమ్మేళనాలు

→ ఫీనాల్లను హేలో ఎరీన్లు, డై ఎజోనియం లవణాలు, క్యుమీన్ నుండి తయారుచేయవచ్చు.

→ ఫినాక్సైడ్ అయాన్ రెజోనెన్స్ స్థిరీకరణ వలన ఫీనాల్లు ఆల్కహాల్ కంటే ఎక్కువ ఆమ్లస్వభావం కలిగి ఉంటాయి.

→ కోలె చర్య : ఫీనాల్ NaOH తో చర్యజరిపి తరువాత CO2 తో ఆమ్లయానకంతో చర్యజరిపి సాలిసిలిక్, ఆమ్లం ఏర్పరచును.

→ రీమర్ – టీమన్ చర్య : ఫీనాల్ క్లోరోఫారంతో క్షారసమక్షంలో చర్యజరిపి సాలిసిలాల్డిహైడ్ను ఏర్పరచును.

→ ఈథర్లను ఆల్కహాల్ నిర్జలీకరణ, విలియంసన్ సంశ్లేషణ ద్వారా తయారుచేస్తారు.

→ విలియంసన్ సంశ్లేషణ : ఆలెల్ హాలైడ్లను సోడియం ఆల్కాక్సైడ్ తో చర్యజరిపి ఈథర్లను ఏర్పరచును.

→ α- హైడ్రోజన్ కలిగి ఉన్న కార్బాక్సిలిక్ ఆమ్లాలు క్లోరిన్ లేదా బ్రోమిన్లు తక్కువ పరిమాణం ఎర్ర ఫాస్ఫరస్ సమక్షంలో చర్య జరిపి α- హాలోకార్బాక్సిలిక్ ఆమ్లాలు ఏర్పరచును. దీనినే హెల్ – వోల్ హర్డ్ – జెలెన్స్కీ (HvZ) చర్య అంటారు.
AP Inter 2nd Year Chemistry Notes Chapter 12 C,H,O లు ఉన్న కర్బన సమ్మేళనాలు 1

→ గాటర్మన్ – కోచ్ చర్య ద్వారా : బెంజీన్, దాని ఉత్పన్నాలను అనార్థ అల్యూమినియమ్ క్లోరైడ్ లేదా క్యూప్రస్ క్లోరైడ్ సమక్షంలో కార్టన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ క్లోరైడ్తో చర్చ జరిపి బెంజాల్డిహైడ్, ప్రతిక్షేపిత బెంజాల్డిహైడ్లుగా మార్చవచ్చు.

→ ఆల్డీహైడ్లు, కీటోన్లు న్యూక్లిమోఫిలిక్ సంకలన చర్యలు జరుపుతాయి.

→ టాలెన్స్ కారకం : అపుడే తయారు చేసిన అమ్మోనికల్ సిల్వర్నైట్రేట్ ద్రావణాన్ని టాలెన్స్ కారకం అంటారు. ఆల్టీహైడ్ను టాలెన్స్ కారకంతో వేడిచేస్తే పరీక్షనాళిక గోడలపై మెరిసే వెండిపొర ఏర్పడుతుంది.

→ ఫెహిలింగ్ కారకం ఫెహిలింగ్ A + ఫెహిలింగ్ B కారకాలు
ఫెహిలింగ్ – A CuSO జల ద్రావణం
ఫెహిలింగ్ B – సోడియం పొటాషియం టార్టరేట్ (రోచల్లీ లవణం)
ఎసిటాల్టీహైడ్ ఫెహిలింగ్ కారకంతో చర్య జరిపి ఎర్రటి జేగురు అవక్షేపం ఏర్పరచును

→ మిశ్రమ ఆల్డాల్ సంఘననం : ఆల్జాల్ సంఘనన చర్యలో రెండు వేరువేరు ఆల్డిహైడ్లు లేదా కీటోన్లు పాల్గొంటే ఆ చర్యను మిశ్రమ ఆర్డాల్ సంఘననం అంటారు. రెండు అణువుల్లోను – హైడ్రోజన్లు ఉంటే నాలుగు ఉత్పన్నాల మిశ్రమం ఏర్పడుతుంది. ఉదాహరణకు ఇథనాల్, ప్రొపనాల్ల మిశ్రమ ఆల్దాల్ సంఘననంలో ఏర్పడే ఉత్పన్నాలను చూడండి.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 12 C,H,O లు ఉన్న కర్బన సమ్మేళనాలు

→ కెనిజారో చర్య : α -హైడ్రోజన్లు లేని ఆల్డిహైడ్లను బలమైన గాఢ క్షారంతో వేడిచేస్తే స్వయం ఆక్సీకరణం, ne క్షయకరణం (disproportionation) చర్యలకు అవి లోనవుతాయి. ఈ చర్యలో ఒక అల్డిహైడ్ అణువు ఆల్కహాల్గా క్షయకరణం చెందితే ఇంకొక అణువు ఆక్సీకరణం చెంది కార్టాక్సిలిక్ ఆమ్ల లవణాన్ని ఇస్తుంది.

→ డీకార్బాక్సిలీకరణం : కార్టాక్సిలిక్ ఆమ్లాల సోడియమ్ లవణాలను సోడాలైమ్ (3:1 నిష్పత్తిలో NaOH & CaO) తో వేడిచేస్తే కార్బన్ డయాక్సైడ్ను విలోపనం చేసి హైడ్రోకార్టాన్లను ఏర్పరుస్తాయి. ఈ చర్యను డీకారక్సిలీకరణం అంటారు.

Leave a Comment