Students can go through AP Inter 2nd Year Chemistry Notes 13th Lesson నైట్రోజన్లో ఉన్న కర్బన సమ్మేళనాలు will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Chemistry Notes 13th Lesson నైట్రోజన్లో ఉన్న కర్బన సమ్మేళనాలు
→ ఎమీన్లు అమోనియా ఉత్పన్నాలు. ఇవి అమోనియాలో ఒకటి లేదా రెండు హైడ్రోజన్లు ఆల్కైల్ సమూహాలతో మార్పిడి వల్ల ఏర్పడతాయి.
→ అమోనియాలో ఒక హైడ్రోజన్ పరమాణువు ఆల్కైల్ సమూహలతో మార్పిడి చెందితే 1° ఎమీన్లు ఏర్పడతాయి. రెండు హైడ్రోజన్లు మార్పిడి ద్వారా 2° ఎమీన్లు ఏర్పడతాయి. మూడు హైడ్రోజన్లు మార్పిడి ద్వారా 3° – ఎమీన్ లు ఏర్పడతాయి.
→ ఎమీన్ ను నైట్రోసమ్మేళనాల క్షయకరణ చర్య, ఎమైడ్ల క్షయకరణం, గేబ్రియల్ థాలిమైడ్ చర్య, హాఫ్మన్ బ్రోమమైడ్ చర్య ద్వారా పొందవచ్చు.
→ అమోనియా కన్నా ఆల్మైల్ ఎమీన్లు బలమైన క్షారాలు (+ I ప్రభావం వలన)
→ ఎలిఫాటిక్ (లేదా) ఏరోమాటిక్ 1° – ఎమైన్లు క్లోరోఫాం మరియు KOH (ఆల్కహాల్) తో చర్య జరిపి ఐసో సయనైడ్లను ఏర్పరచును. (కార్ల్టల్ ఎమీన్ చర్చ)
→ ఎరోమాటిక్ ఎమీన్లు నైట్రస్ ఆమ్లంతో 0–5°C వద్ద చర్చ జరిపి డయజోనియం లవణాలను ఏర్పరచును (డయజోటీకరణ)
→ బెంజీన్ సల్ఫోనైల్ క్లోరైడ్ను హిన్స్బర్గ్ కారకం అంటారు. ఇది 10, 20, 3° – ఎమీన్లను వేరుచేయుటకు ఉపయోగపడును.
→ డయజోనియం లవణాలు Cu(I) అయాన్ సమక్షంలో హేలోబెంజీన్, సయనో బెంజీన్లను ఏర్పరచుటను సాండ్ మేయర్ చర్య అంటారు.
→ డయజోనియం లవణాలు హేలోజన్ ఆమ్ల సమక్షంలో చర్య జరిపి హాలో బెంజీన్ న్ను ఏర్పరచుటను గాటర్మన్ చర్య అంటారు.
→ బెంజీన్ డయజోనియం క్లోరైడ్ ఫినాల్తో చర్య జరిపి P- హైడ్రాక్సీ ఎజోబెంజీన్ ను ఏర్పరచును. ఈ రకమైన చర్యలను యుగళీకరణ చర్యలు అంటారు.