Students can go through AP Inter 2nd Year Chemistry Notes 2nd Lesson విద్యుత్ రసాయనశాస్త్రం – రసాయన గతికశాస్త్రం will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Chemistry Notes 2nd Lesson విద్యుత్ రసాయనశాస్త్రం – రసాయన గతికశాస్త్రం
→ రెండు లేదా అంతకంటే ఎక్కువ అనుఘటకాల సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారు. దీని సంఘటనం కొన్ని పరిధిలలో మారుతూ ఉండును.
→ మోల్ భాగం : ఒక ద్విగుణాత్మక ద్రావణంలోని ఒక అనుఘటకం (ద్రావితం/ ద్రావణి) మోల్లల సంఖ్యకు, ద్రావణంలోని మొత్తం అనుఘటకాల మోత్ల సంఖ్యకు గల నిష్పత్తినే ఆ అనుఘటక మోల్ భాగం అంటారు.
→ మోలారిటీ : ఒక లీటరు ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత మోల్ల సంఖ్యను మోలారిటీ అంటారు.
→ మోలాలిటీ : ఒక కిలోగ్రామ్ ద్రావణిలో ఉన్న ద్రావిత మోల్ల సంఖ్యను మోలాలిటీ అంటారు.
→ హెన్రీ నియమం : స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవంలో వాయువు ద్రావణీయత, ద్రవం లేదా ద్రావణం ఉపరితలంపై ఉన్న వాయువు పాక్షిక పీడనానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
→ ఎ) రౌల్ట్ (బాష్పశీల ద్రావితం) : బాష్పశీల ద్రవాల ద్రావణంలోని ప్రతి అనుఘటక పాక్షిక బాష్పపీడనం, ఆ అనుఘటకం మోల్ భాగానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
బి) రౌల్ట్ నియమం (అబాష్పశీల ద్రావితం) : అబాషశీల ద్రావితం కలిగియున్న విలీన ద్రావణంలోని సాపేక్ష బాష్పపీడన నిమ్నత, ద్రావిత మోల్భాగానికి సమానమౌతుంది.
→ ఆదర్శ ద్రావణం : అన్ని గాఢతల అవధులలో రౌల్టి నియమాన్ని పాటించే ద్రావణాలను ఆదర్శ ద్రావణాలు అంటారు. ఆదర్శ ద్రావణాలలో ద్రావిత, ద్రావణిల మధ్య రసాయన చర్యలు జరగవు.
→ ఎబులియోస్కోపిక్ స్థిరాంకం : అబాష్పశీల ద్రావితం కలిగియున్న ఒక మోలాల్ ద్రావణంలో పరిశీలించబడిన బాష్పీభవన స్థాన నిమ్నతను ఎబులియోస్కోపిక్ స్థిరాంకం (లేదా) మోలాల్ ఉన్నతి స్థిరాంకం అంటారు.
→ క్రయోస్కోపిక్ స్థిరాంకం : అబాష్పశీల ద్రావితం కలిగి ఉన్న ఒక మోలాల్ ద్రావణంలో పరిశీలించబడిన ఘనీభవన స్థాన నిమ్నతను క్రయోస్కోపిక్ స్థిరాంకం (లేదా) మోలాల్ నిమ్నత స్థిరాంకం అంటారు.
→ ద్రవాభిసరణ పీడనం : ద్రావణి, ద్రావణం అర్ధ ప్రవేశ్యక పొరతో వేరుపరచినపుడు ద్రావణి ద్రావణంలోకి ప్రవేశించకుండా నివారించుటకు ఉపయోగించు పీడనాన్ని ద్రవాభిసరణ పీడనం అంటారు.
→ ఐసోటోనిక్ ద్రావణాలు : “ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ఉన్న ద్రావణాలలో ద్రవాభిసరణ పీడనం సమానంగా ఉన్నట్లయితే వాటిని “ఐసోటోనిక్ ద్రావణాలు” అంటారు.
→ ద్రవ్యరాశి శాతం
→ ఘనపరిమాణ శాతం
→ ppm
→ మోల్ భాగం
→ మోలారిటీ (M)
→ మోలాలిటీ (m)
→ రౌల్ట్ నియమం (విలీన ద్రావణాలకు) = \(\frac{P_0-P_s}{P_o}=\frac{n_s}{n_0}=\frac{w}{m} \times \frac{M}{w}\)
→ బాష్పీభవన స్థాన ఉన్నతి (ΔTb) = \(\frac{K_b \times 1000 \times w}{m \times W}\)
→ ఘనీభవన స్థాన నిమ్నత (ΔTf) = \(\frac{\mathrm{K}_{\mathrm{f}} \times 1000 \times \mathrm{W}}{\mathrm{m} \times \mathrm{W}}\)
→ ద్రవాభిసరణ పీడనం (π) = CRT
→ వాంట్ హాఫ్ గుణకం (i)