AP Inter 2nd Year Chemistry Notes Chapter 1 ఘనస్థితి

Students can go through AP Inter 2nd Year Chemistry Notes 1st Lesson ఘనస్థితి will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Chemistry Notes 1st Lesson ఘనస్థితి

→ ఒక పదార్థం స్వాభావిక రీతిలో ఘటక నిర్మాణాత్మక యూనిట్లు నిర్దిష్ట జ్యామితీయ క్రమంలో అమర్చబడియున్న దాన్ని స్ఫటిక ఘన పదార్థం అంటారు.

→ ఒక ఘన పదార్థంలో ఒక పరమాణువు (లేదా) అయాన్కి అత్యంత సమీపంలో ఉన్న పరమాణువులు లేదా అయాన్ల సంఖ్యను దాని ‘సమన్వయ సంఖ్య’ అంటారు.

→ తన ప్రభావం ఉన్నంత మేరకు లోహపు అయాను, చలిస్తున్న ఎల క్ట్రాన్ లతో బంధించి వుంచే బలాలను లోహబంధం అంటారు.

→ Be, Mg, Cd, CO, Zn, Ti, Tl లకు షట్కోణీయ సన్నిహిత కూర్పు (hcp) వుంటుంది. వీటికి కోఆర్డినేషన్ సంఖ్య 12.

→ Na, K, Rb, Cs, Ba, Cr, Mo, W లకు అంతఃకేంద్రిత ఘన రచన (bcc) వుంటుంది.

→ Al, Cu, Au, Pb, Pt, Ni, Ca లకు గోళాల ఫలక కేంద్రిత ఘనరచన (fcc) వుంటుంది.

→ అస్ఫాటిక పదార్థాలలో దీర్ఘ విస్తృత క్రమాలు వుండవు. గలన క్వార్టజ్ను త్వరగా చల్లారిస్తే అస్ఫాటిక ఘనపదార్థం వస్తుంది.

→ అస్ఫాటిక పదార్థాలలో స్ఫటిక నిర్మాణాలుగానీ యూనిట్ సెల్లుగానీ ఉండవు.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 1 ఘనస్థితి

→ స్ఫటిక ప్రదేశంలో బిందువులు మళ్ళీ మళ్ళీ వస్తూ క్రమమైన పద్ధతిలో అమరివుంటే దాన్ని ప్రాదేశిక జాలకం అంటారు.

→ త్రిమితీయ మౌలిక నిర్మాణాన్ని “యూనిట్ సెల్” అంటారు.
యూనిట్ సెల్లో బిందువు ఉంటే “మధ్యస్థమయిన యూనిట్ సెల్” అంటారు.

→ స్ఫటికాలను ‘7’ స్ఫటిక వ్యవస్థలుగా విభజించవచ్చు.

→ nλ = 2d sin θ బ్రాగ్ సమీకరణం

→ యూనిట్ సెల్ మూలన ఉన్న జాలక బిందువును 8 యూనిట్ సెల్లు పంచుకొంటాయి.

→ స్ఫటిక పదార్థం సాంద్రతను (ρ) = \(\frac{z M}{N_o a^3}\) ఫార్ములాతో కనుగొనవచ్చు.
ρ = సాంద్రత, z = యూనిట్ సెల్లో పరమాణువుల సంఖ్య, M = జాలక కణం అణుభారం, a = యూనిట్ సెల్ పొడవు.

→ త్రిమితీయంగా ఉన్న పొరల మధ్య ఖాళీలను ‘రంధ్రాలు’ అంటారు. రెండు రకాల రంధ్రాలు సాధ్యం కావచ్చు. అవి టెట్రాహెడ్రల్ రంధ్రాలు, అష్టభుజీయ రంధ్రాలు.

→ స్ఫటిక లోపాల వల్ల స్ఫటిక ధర్మాలు ప్రభావితమవుతాయి.

→ స్పటిక లోపాలు : ఆంతరికలోపాలు, బాహ్యలోపాలు, బిందులోపాలు మరియు విస్తరణలోపాలు.

→ జాలకం సాధారణ స్థానం నుంచి ఒక పరమాణువు లేదా అయాన్ ను తీసివేస్తే వచ్చే బిందు లోపాన్ని షాట్కీలోపం అంటారు. ఈ లోపం అధిక అయానిక స్వభావం గల సమ్మేళనాల్లో ఉంటుంది.

→ సాధారణ జాలక స్థానంలో ఉండే పరమాణువు లేదా అయాన్గాని ఇతర స్థానాల వద్దకు మారతాయి. ఈ బిందు లోపాన్ని ఫ్రెంకెల్ లోపం అంటారు.

→ లోహాల విద్యుద్వాహకత వాటి పరిమాణంలో ఉన్న వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య పై ఆధారపడుతుంది.

→ లోహం వాహకత ఉష్ణోగ్రత పెరిగితే తక్కువవుతుంది. జాలక బిందువుల్లో కంపనాలు పెరగటం వలన ఇది జరగవచ్చు.

→ శుద్ధ ‘Si’ అవిద్యుద్వాహకం. ‘B’ లేదా ‘AS’ కలిపితే అర్థవాహకం అవుతుంది.

→ ‘Ge’ వాహకత మార్చడానికి B, P, As లను చేర్చడాన్ని ‘డోపింగ్’ అంటారు.

→ V (లేదా) 15 వ గ్రూపు మూలకంతో డోపింగ్ జరిపిన సిలికాన్ను ‘n’ రకం అర్ధవాహకం అంటారు.

→ రంధ్రాన్ని సృష్టించే పదార్థాలతో డోపింగ్ చేసిన సిలికాన్ న్ను ‘P’ రకం అర్ధవాహకం అంటారు.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 1 ఘనస్థితి

→ పారా అయస్కాంత పదార్థాలు వర్తిత అయస్కాంత క్షేత్రంలోకి ఆకర్షితమవుతాయి.

→ ఫెర్రో అయస్కాంత పదార్థాలు వర్తిత అయస్కాంత క్షేత్రాన్ని తీసివేస్తే కూడా శాశ్వత అయస్కాంత ధర్మాలను చూపిస్తాయి.
ఉదా : Fe, Co, Ni లు.