Students can go through AP Inter 2nd Year Chemistry Notes 5th Lesson లోహనిష్కర్షణలో సాధారణ సూత్రాలు will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Chemistry Notes 5th Lesson లోహనిష్కర్షణలో సాధారణ సూత్రాలు
→ ప్రకృతిసిద్ధంగా భూమి పై పొరలలో లభించే లోహపు సమ్మేళనాలను ఖనిజాలు అంటారు.
→ లోహం పొందటానికి, అత్యంత అనుకూలమైన ఖనిజాన్ని ధాతువు అంటారు.
→ గాంగ్ : ధాతువు భూమి పై పొరలలోని అనవసరపు రసాయన పదార్థాలతో మరియు ఖనిజాలతో మాలిన్యమై ఉండును. ఈ అనవసరపు పదార్థాలను గాంగ్ అంటారు.
→ ఖనిజ ద్రవీభవనస్థానాన్ని తగ్గించుటకు ఖనిజాలకు బయటనుండి చేర్చిన పదార్థాలను ద్రవకారులు అంటారు.
→ లోహమలం : ద్రవకారీని గాంగ్తో చర్య జరిపినపుడు ఏర్పడే గలన పదార్థాన్ని లోహమలం అంటారు.’
→ ‘Al’ ముఖ్య ధాతువులు బాక్సైట్ (Al2O. 2H2O), క్రయోలైట్ (Na3AlF6).
→ ‘Fe’ ముఖ్య ధాతువులు హెమటైట్ (Fe2O3), మాగ్నటైట్ (Fe3O4)
→ ‘Cu’ ముఖ్య ధాతువు కాపర్ పైరైటిస్ (CuFeS2).
→ ‘Zn’ ముఖ్య ధాతువు జింక్ బ్లెండ్ (ZnS).
→ ప్లవన ప్రక్రియ సల్ఫైడ్ ధాతువుల సాంద్రీకరణకు ఉపయోగపడును.
→ ఇవ్వబడిన ఉష్ణోగ్రత వద్ద చర్య పురోగమించుటకు గిబ్స్ శక్తి విలువ ఋణాత్మకం అయి ఉండాలి.
→ భర్జనం : ఖనిజాన్ని విడిగా గాని, ఇతర పదార్థాలతో కలిపిగాని గాలి సమక్షంలో అధిక ఉష్ణోగ్రతలకు వేడిచేయడాన్ని భర్జనం అంటారు.
భస్మీకరణం : ఖనిజం ద్రవీభవించకుండా దానిలో గల బాష్పశీల పదార్థాలను, గాలి తగలకుండా వేడిచేయటం ద్వారా తొలగించే పద్ధతిని భస్మీకరణం అంటారు.
→ లోహ శోధనకు మండల శోధనం, బాష్ప ప్రావస్థ శోధనం మొదలైన వాటిని ఉపయోగిస్తారు.