Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 6th Lesson తృతీయ రంగం Textbook Questions and Answers.
AP Inter 2nd Year Economics Study Material 6th Lesson తృతీయ రంగం
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న1.
సేవల రంగమంటే ఏమిటి నిర్వచించి, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సేవలరంగం ప్రాధాన్యతను గూర్చి వివరించండి.
జవాబు:
సేవా రంగాన్నే తృతీయ రంగం లేదా మూడవ రంగమని పిలుస్తారు. బాంకులు, అంతర్జాతీయ వర్తకం, కమ్యూనికేషన్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులు మొదలైన సేవలన్నీ తృతీయ రంగంలోకి వస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తృతీయ రంగం నుండి ఎక్కువగా స్థూల జాతీయదాయం సమకూరుతుందని, ఎక్కువ మందికి ఉపాధి ఈ రంగం కల్పిస్తూ ఉంటుందని మరియు ఎగుమతి ఆదాయం ఈ రంగం నుంచి ఎక్కువగా సమకూరుతుందని, ఎక్కువ మందికి ఉపాధిని ఈ రంగం కల్పిస్తూ ఉంటుందని మరియు ఎగుమతుల అదాయం ఈ రంగం నుంచి ఎక్కువగా సమకూరుతుందని అర్థికవేత్తల అభిప్రాయం. తృతీయరంగం వాటా జాతీయోత్పత్తిలో అమెరికా మొదటి స్థానంలోను, ఇండియా పదకొండవ స్థానంలోను ఉంది.
1) స్థూల జాతీయోత్పత్తిలో వాటా:
దేశాలు వారీగా స్థూల జాతీయోత్పత్తిలో వాటి వాటాలు పరిశీలిస్తే 2001 నుంచి 2013 మధ్యకాలంలో సేవలరంగం వాటా పెరిగింది. మొదటి మూడు స్థానాల్లో ఇంగ్లాండు, ఆమెరికా, ఫ్రాన్సు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పట్టికను బట్టి భారతదేశం జాతీయోత్పత్తిలో సేవలరంగం వాటా 2001లో 51.3 శాతం కలిగి ఉండగా 2013 నాటికి 57.0 శాతం పెరిగింది.
దేశాల వారిగా జాతీయోత్పత్తి సేవల రంగం వాటా
2) శ్రామికుల శాతం:
సేవల రంగంలో పనిచేసే వారి సంఖ్య శాతం మిగతా రంగాలలో పనిచేసేవారి సంఖ్యశాతం కంటే ఎక్కువగా ఉంది. వివరాలను గమనిస్తే ఇండియా, చైనా తప్ప మిగతా దేశాలలో సేవల రంగంలో పనిచేసే వారి సంఖ్య 2001 మరియు 2013 సంవత్సరాల మధ్య 60 మరియు 80 శాతం మధ్య ఉంది. భారతదేశంలో తృతీయ రంగంలో పనిచేసే శ్రామికుల శాతం 2001 లో 24.0 శాతం నుంచి 2013 నాటికి 28.1 శాతం పెరిగింది.
3) సేవల ఎగుమతులు:
ప్రస్తుత కాలంలో ప్రతి అర్థిక వ్యవస్థకు ఎగుమతులు అనేవి అర్థికాభివృద్ధికి ఇంజను లాంటిది. ఎగుమతులు, విదేశీ మారకద్రవ్యాన్ని సమకూరుస్తుంది. ఎగుమతుల విలువ దిగుమతుల విలువ కంటే ఎక్కువగా ఉంటే విదేశీ చెల్లింపుల శేషం అనుకూలంగా ఉన్నట్లు చెప్పవచ్చును.
ఇంగ్లాండు (35.1%), భారతదేశం (32.5%), అమెరికా (29.5%) మరియు ఫ్రాన్సు (29.0%) సేవలరంగం ఉత్పత్తులను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి.
ప్రశ్న 2.
భారతదేశంలో అవస్థాపనా సౌకర్యాలు ఆర్థికాభివృద్ధికి ఎట్లా దోహదపడుతుందో వివరించండి.
జవాబు:
సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి అవస్థాపనా సౌకర్యాలు అవసరమని చెప్పవచ్చును. స్వాతంత్య్రానంతరం, ప్రణాళికా కర్తలు అర్థికాభివృద్ధికి అవస్థాపన సౌకర్యాలు ప్రాధాన్యతను గుర్తించడం జరిగింది. అర్థిక అవస్థాపనా సౌకర్యాలైన విద్యుత్, రవాణా, బ్యాంకింగ్, కమ్యూనికేషన్ మొదలైన వాటిపై పెట్టుబడులు భారీగా ఉంటాయి. అంతేకాకుండా వీటిని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరం. అందుకని అవస్థాపన సౌకర్యాలకై సరళీకరణ విధానాన్ని ఉపయోగించి ప్రైవేటు మరియు విదేశీ పెట్టుబడిని ప్రోత్సహించింది.
సాధారణంగా అవస్థాపన సౌకర్యాలను రెండుగా వర్గీకరించవచ్చును. అవి ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు మరియు సాంఘిక అవస్థాపన సౌకర్యాలు. ఇవి:
- శక్తి: బొగ్గు, విద్యుచ్ఛక్తి, పెట్రోల్, సాంప్రదాయ, సాంప్రదాయేతర వనరులు.
- రవాణా: రోడ్లు, రైల్వేలు, నౌక మరియు వైమానిక సర్వీసులు..
- సమాచారం: తంతి తపాలా, టెలిఫోన్, టెలీకమ్యూనికేషన్.
- బ్యాంకింగ్, ఫైనాన్స్ మరియు భీమా.
- సాంఘీక అవస్థాపనా సౌకర్యాలు: విద్య, వైద్యం, పరిశుభ్రత.
ఆర్థిక అవస్థాన మూలధనం, సాంఘీక అవస్థాపన మూలధనం అనేవి సేవారంగంలో ఉపరంగాలుగా చెప్పవచ్చును. అవస్థాపనా సౌకర్యాలు బాగా లభిస్తే తలసరి స్థూల జాతీయోత్పత్తి పెరగటంతో పాటు కింది ఫలితాలు కూడా లభిస్తాయి.
- ఉత్పత్తి ప్రక్రియ యొక్క ఉత్పాదకత పెరుగుతుంది.
- మార్కెట్లను అందుబాటులోకి తెస్తుంది.
- వ్యాపార వ్యయాలను తగ్గిస్తుంది. వ్యాపార ఆస్తుల, చరమూలధనాల మీద చేసే వ్యయాన్ని తగ్గిస్తుంది. 4) ఉపాధి అవకాశాలను పెంచుతుంది.
- వర్తకంలోను, ఉత్పత్తులలోను వైవిధ్యాన్ని, ఆధునికతను సాధించే వీలు కలుగచేస్తుంది.
- సంక్షేమం అంటే ఏమిటో తెలియజేస్తుంది. దారిద్ర్యాన్ని తగ్గిస్తూ, ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందటానికి తగిన హామీనిస్తుంది.
- జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది.
- వ్యవసాయేతర ఉపాధి అవకాశాలను పెంచుతుంది.
- మానవ ఆవాసాల యొక్క పర్యావరణ సుస్థిరతను పెంపొందిస్తుంది.
- ప్రజారోగ్యాన్ని సంరక్షిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలను అందిస్తుంది.
అవస్థాపన సౌకర్యాలు కలిగించే ప్రయోజనకరమైన ప్రభావాలను దృష్టిలో ఉంచుకొని మనదేశ ప్రభుత్వ గ్రామీణ ప్రాంతాల్లో ఈ సౌకర్యాలను అభివృద్ధి పరచటానికి మొత్తం చేయనున్న రూ.14,36,559 కోట్ల పెట్టుబడుల్లో రూ.4,35,349 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టడానికి నిశ్చయించింది. ఈ మొత్తాన్ని విద్యుత్, రోడ్లు, టెలీకమ్యూనికేషన్స్, సాగునీరు, నీటి సరఫరా, పరిశుభ్రత సౌకర్యాలను అభివృద్ధి చేయాడానికి కేటాయించడం జరిగింది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
సేవా రంగంలో స్థూల జాతీయోత్పత్తి స్థాయిని వివరించండి.
జవాబు:
ఒక దేశం యొక్క జాతీయాదాయంలోని పెరుగుదల ఆ దేశంలోని వస్తు-సేవల ఉత్పత్తిలోని పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది. అర్థికవ్యవస్థలో ఈ రంగం నుండి ఎక్కువగా స్థూల జాతీయదాయం సమకూర్చుతుంది. సేవా రంగంలో సేవలను అందించే వివిధ సంస్థలుంటాయి అవి రవాణా, బ్యాంకింగ్, భీమా సంస్థలు, హోటల్స్, గ్రంథాలయాలు మొదలైనవి.
జాతీయాదాయంలో సేవరంగం వాటా క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇది ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో వచ్చే అశించదగిన పరిణామం. 1950-51లో స్థూల దేశీయోత్పత్తిలో సేవరంగం వాటా 28% కాగా 2013లో ఇది 57.0% చేరింది. దేశాల వారిగా స్థూల జాతీయోత్పత్తిలో వాటి వాటాలను పరిశీలిస్తే 2001 నుంచి 2013 మధ్యకాలంలో సేవల రంగం వాటా పెరిగింది.
దేశాల వారిగా జాతీయోత్పత్తి సేవల రంగం వాటా
పై పట్టికలో మొదటి మూడు స్థానాలలో ఇంగ్లండు, అమెరికా, ఫ్రాన్సు ఉన్నాయి. పై పట్టికలో ఇండియాలో జాతీయోత్పత్తి సేవారంగం వాటా 2001 లో 57.3% ఉండగా 2013 నాటికి 57.0% పెరిగింది.
ప్రశ్న 2.
భారతదేశ సేవారంగంలో తలచిన కార్యకలాపాలు ఏమిటి ?
జవాబు:
మన దేశంలో ఇటీవల కాలంలో తృతీయరంగం ఎక్కువ మందికి ఉపాధి కలిస్పూ, మన జాతీయాదాయంలో ఎక్కువ వాటాను అందించుచున్నది. సేవారంగంలో రకరకాల కార్యకలాపాలను కొన్ని ప్రధాన తరగతులుగా విభజించవచ్చును.
- వ్యాపారం
- రవాణావ్యవస్థ
- హోటళ్లు, రెస్టారెంట్లు
- నిర్మాణాలు
- గిడ్డంగులు
- బ్యాంకులు, భీమా సంస్థలు
- ప్రభుత్వ పాలన మరియు రక్షణ
- విద్య, వైద్య, మత, సామాజిక సేవలు మొదలైనవి
- కమ్యూనికేషన్లు
- స్థిరాస్తి వ్యాపారం మరియు వర్తక సేవలు
ప్రశ్న 3.
రోడ్డు రవాణా వల్ల లాభాలు ఏమిటి ? [Mar ’17, ’16]
జవాబు:
ఒక ప్రదేశాన్ని, మరొక ప్రదేశాన్ని కలిపేటటువంటి రోడ్డు రవాణా మనదేశంలో పూర్వకాలం నుంచి ఉన్నటువంటి ప్రధాన రవాణా పద్ధతి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు అత్యంత కీలకంగా పనిచేస్తాయి. సమీకృతంగా ఉండే రవాణా వ్యవస్థలో రోడ్లు అత్యంత కీలకమైనవిగా చెప్పవచ్చు. మనదేశం ప్రపంచ దేశాలలో అతి పెద్ద రోడ్డు వ్యవస్థ గల దేశం. మనదేశంలో 48.65 లక్షల కిలోమీటర్ల పొడవైన రోడ్లు ఉన్నాయి.
లాభాలు:
- అన్ని గ్రామలను, ప్రాంతాలను కలిపేది రోడ్డు రవాణా, రైల్వే మార్గాలలో కలవనటువంటి ప్రదేశాలను రోడ్లు కలుపుతాయి.
- తొందరగా చెడిపోయే, చెడిపోవడం చాలా తక్కువగా ఉంటుంది.
- రైల్వే రవాణా వ్యవస్థకు సరుకులను, ప్రయాణికులను చేరవేస్తుంది.
- సరుకులు నష్టపోవడం, చెడిపోవడం చాలా తక్కువగా ఉంటుంది.
- గ్రామీణ, పట్టణ నగరాల్లో చాలా అనుకూలమైన రవాణా సౌకర్యాలను అందజేస్తుంది.
- రోడ్డు రవాణా వ్యవస్థలో మూలధన వ్యయం తక్కువగా ఉంటుంది.
- అత్యవసర పరిస్థితులలో ఇతర మార్గాల ద్వారా చేరలేని ప్రదేశాలను రక్షణ బలగాలను త్వరగా చేర్చేందుకు సహాయపడతాయి.
ప్రశ్న 4.
రైల్వేలు ప్రాముఖ్యత వివరించండి.
జవాబు:
- ఆర్థికాభివృద్ధికి రైల్వే రవాణా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ప్రయాణీకులను, సరుకులను రవాణా చేసే ప్రధాన వ్యవస్థల్లో రైల్వే రవాణా ఒకటి.
- ముడి పదార్థాలు, యంత్ర సామాగ్రి తయారీ వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు మొదలైన వాటి రవాణాకు `దేశీయ, విదేశీ వ్యాపారాభివృద్ధికి, శ్రామిక గమనశీలతకు రైల్వేలు ఎంతో దోహదపడతాయి.
- వ్యవసాయాన్ని, పరిశ్రమలను అభివృద్ధిపర్చడంలో డై ప్రధానపాత్రను పోషిస్తున్నాయి.
- ప్రయాణికులకు కావలసిన సౌకర్యాలను మెరుగుపర్చడం, సాంకేతిక విజ్ఞానాన్ని మరియు ఆధునికం చేయడం ఎంతైనా అవసరం.
ప్రశ్న 5.
పర్యాటకం అంటే ఏమిటి ? మన దేశ ఆర్థిక వ్యవస్థలో దాని ప్రాధాన్యతను గూర్చి వివరించండి.
జవాబు:
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ప్రకారం “విశ్రాంతి కోసం గాని, వ్యాపారనిమిత్తం గాని, ఇతర ప్రయోజనాల కోసం గాని ప్రజలు (ప్రయాణీకులు) వారి సాధారణ పరిసరాల నుండి దూరంగా వరసగా ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం ప్రయాణిస్తూ ఒక స్థలంలో నిలిచి ఉండే వారి కార్యకలాపాలనే పర్యాటకం” అని అంటారు.
పర్యాటకం తృతీయ రంగంలో ఒక ఉపవిభాగము ప్రత్యేకించి సేవలరంగంలో ముఖ్యమైన విభాగము. పర్యాటక రంగానికి ఉన్నటువంటి అంతర్జాతీయ ధృక్కోణాల కారణంగా ఈ రంగాన్ని ‘అదృశ్యవాణిజ్యం’ అని ‘ధూమరహిత ‘పరిశ్రమ’ అని అంటారు. ఈ పర్యాటకరంగం వలన అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలకు ఆర్థికపరమైన ఆర్థికేతరమైన లాభాలు కలుగుతున్నాయని నిపుణుల అభిప్రాయము.
పర్యాటకం – లక్షణాలు:
“ప్రయాణీకులు అనేక అవసరాలను సంతృప్తిపరిచే అన్ని కార్యకలాపాలను పర్యాటకం” అని చెప్పవచ్చును. ప్రయాణాలను పర్యాటకం అని చెప్పడానికి క్రింది లక్షణాలుండాలి.
- ప్రయాణం తాత్కాలికమైనదై ఉండాలి.
- ప్రయాణం ఐచ్ఛికమైనదై ఉండాలి.
- ప్రయాణం స్థానికేతరులు చేసినదై ఉండాలి.
- ఒక ప్రతిఫలాన్నిచ్చే ఉపాధి లక్ష్యంగా ప్రయాణం ఉండరాదు.
- ఆ ప్రయాణం వస్తు సేవలకు గిరాకీని కల్పించేదై ఉండాలి.
- ప్రయాణీకులు ఎక్కడికైతే పర్యటిస్తూ ఉంటారో అక్కడి వస్తుసేవలను వారు వినియోగించాలి.
- ప్రయాణీకులు ఒక చోట 24 గంటలకంటే ఎక్కువ సమయం నిలిచి ఉండాలి.
- ప్రయాణం, తిరుగు ప్రయాణం చేసేదిగా ఉండాలి.
ప్రశ్న 6.
భారతదేశంలో బాంకింగ్ రంగ పద్దతి గూర్చి వివరించండి.
జవాబు:
అసంఘటిత విభాగంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రాచీన కాలం నుండి నిర్వహించబడుతూనే ఉన్నాయి. కాని ఒక శతాబ్దం కాలం నుండి బ్యాంకింగ్ వ్యవస్థ సంఘటిత విభాగంలో అభివృద్ధి చెందసాగింది. బ్యాంకింగ్ వ్యవస్థ ప్రజల పొదుపును సమీకరించి, పెట్టుబడికి మళ్ళిస్తుంది. వనరులను ఉత్పాదకంగా ఉపయోగించడానికి, మూలధన కల్పనకు బాంకులు సమర్ధవంతమైన ఏజెంట్లుగా పనిచేస్తాయి. ఇటీవల కాలంలో బాంకులు మనదేశంలో సాంఘీక, అర్థికాభివృద్ధిని సాధించడంలో కీలకపాత్రను పోషిస్తున్నాయి.
మనదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను మూడు విధాలుగా విభజించవచ్చు.
- వాణిజ్య బ్యాంకులు
- సహకార బ్యాంకులు
- కేంద్ర బ్యాంకు లేదా భారత రిజర్వు బాంకు
వాణిజ్య బ్యాంకులను దశల వారీగా 1969లోనూ, 1980లోనూ జాతీయం చేశారు. S.B.I, దాని అనుబంధ బ్యాంకులను, ఇతర 20 బ్యాంకులను జాతీయ బ్యాంకులు అంటారు. జాతీయం చేయబడని బ్యాంకులను ప్రైవేటు బ్యాంకులు అంటారు.
స్వల్పకాలిక ఋణాలనందిస్తూ సహకార బ్యాంకుల వ్యవస్థ పరిధి క్రిందకు వచ్చే రాష్ట్ర సహకార బ్యాంకులను, జిల్లా కేంద్ర బ్యాంకులు మొదలైన వాటిని సహకార బ్యాంకులు అంటారు.
భారత రిజర్వు బ్యాంకు 1935లో స్థాపించి 1949లో జాతీయం చేశారు. ఇది మనదేశంలో అత్యన్నత స్థాయి బ్యాంకు. షెడ్యులు బ్యాంకు ద్రవ్యాన్ని భవిష్యత్తు ఉపయోగాల కోసం తన వద్ద రిజర్వు ఉంచుకుంటుంది.
ప్రశ్న 7.
భారతదేశ భీమా పరిశ్రమలో గల ముఖ్యమైన అంశాలేమిటి ?
జవాబు:
ఖాతాదారులు తమకు కలిగినటువంటి నష్టాలనుంచి లేదా ప్రమాదాల నుంచి ఆర్థికంగా రక్షణ పొందేందుకు గాను ఒక సంస్థలో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని భీమా అంటారు. అభివృద్ధి చెందిన భీమా రంగం వల్ల నష్టాభయాన్ని భరించే కార్యకాలాపాలను చేపట్టడంతో పాటు దీర్ఘకాలిక పొదుపు పెరుగుతుంది. పొదుపు పెరుగుదల ఆర్థికాభివృద్ధి కీలకమైనది.
భీమా పరిశ్రమలో రెండు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి.
- జీవిత భీమా
- సాధారణ భీమా
1. జీవిత భీమా: కుటుంబంలో అదాయాన్ని ఆర్జించే కుటుంబ యాజమాని అకాల మరణ నష్ట భయం నుంచి భద్రత కల్పించడానికి ఉద్దేశించినది.
2. సాధారణ భీమా: అనారోగ్యం, ప్రమాదాలు, ఆస్తి నష్టం మొదలైన నష్ట భయాల భద్రతలకు సంబంధించినది. ఇది కంపెనీ మోటారు వాహనాలు, జల రవాణా, వస్తు రవాణా మరియు ఆగ్ని ప్రమాదాలు అనే మూడు రకాలైన వ్యాపారాలు చేస్తుంది.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
సేవారంగం. [Mar ’17]
జవాబు:
సేవారంగాన్నే తృతీయ లేదా మూడవ రంగమని పిలుస్తాం. బాంకులు, అంతర్జాతీయ వర్తకం, రవాణా, కమ్యూనికేషన్లు, హోటళ్ళు, లాయర్లు, డాక్టర్లు మొదలైన సేవలన్నీ తృతీయరంగంలోకి వస్తాయి. మనలాంటి దేశాలు వ్యవసాయ, పరిశ్రమ రంగాలు సేవలరంగం మీద ప్రత్యక్షంగా ఆధారపడి వృద్ధి చెందుతూ ఉంటాయి.
ప్రశ్న 2.
అవస్థాపన.
జవాబు:
అవస్థాపన సౌకర్యాలను సాంఘిక వ్యవస్థా మూలధనం అని కూడా అంటారు. వీటివల్ల కలిగే ప్రయోజనం సమాజం అంతటికి వరిస్తుంది. అవస్థాపనలో ప్రధాన విభాగాలు శక్తి, రవాణా, సమాచారం, బాంకులు, ఆరోగ్యం, విద్య, పరిశుభ్రత మొదలైనవి.
ప్రశ్న 3.
రవాణా.
జవాబు:
ప్రయాణికులను, సంపదను ఒక చోటు నుండి వేరొక చోటుకు తరలించడాన్నే రవాణా అంటారు. ప్రసుత్తం మన దేశంలో రవాణా వ్యవస్థలో రైల్వేలు, రోడ్డు రవాణా, జలరవాణా, వాయు రవాణా ముఖ్యమైనవి. వివిధ రవాణా సాధనాలను సంవిధానపరచటం వ్యవసాయ పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ఎంతగానో అవసరం.
ప్రశ్న 4.
జల రవాణా. [Mar ’16]
జవాబు:
అధిక పరిమాణం, బరువుగల సరుకులను రవాణా చేయడానికి జలరవాణా ఉపయోగపడుతుంది. ఇది రెండు రకాలు 1. దేశీయ జల రవాణా 2. అంతర్జాతీయ జల రవాణా
అంతర్జాతీయ నౌక రవాణా మరియు తీర నౌక రవాణా అని, ఓవర్సీస్ షిప్పింగ్ అని విభజించటం జరిగింది. దేశీయ జల రవాణాను నదుల మీద, కాలువల మీద కొనసాగించవచ్చు.
ప్రశ్న 5.
విమానయానం.
జవాబు:
ఆర్థికాభివృద్ధిలో ఈ వ్యవస్థ అత్యంత కీలకమైనది. విమానయానం ఖరీదైనప్పటికి కాలాన్ని ఆదా చేయవచ్చు. దూర ప్రాంతాల ప్రయాణానికి ఇది ఉపకరిస్తుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు దేశంలో 125 విమానయాన సేవలు అందిస్తున్నారు.
ప్రశ్న 6.
పర్యాటకం. [Mar ’17, ’16]
జవాబు:
పర్యాటకం తృతీయ రంగంలో ఒక ఉప విభాగం. దీనిని “అదృశ్య వాణిజ్యం” అని “ధూమరహిత పరిశ్రమ” అని అంటారు.
ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకారం “విశ్రాంతి కోసంగాని, వ్యాపారం నిమిత్తంగాని, ఇతర ప్రయోజనాలకోసం గాని ప్రజలు వారి సాధారణ పరిసరాల నుంచి దూరంగా, వరుసగా ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం ప్రయాణిస్తూ ఒక స్థలంలో నిలిచి ఉండే వారి కార్యకలాపాలనే పర్యాటకం” అంటారు.
ప్రశ్న 7.
జీవిత భీమా సంస్థ (LIC).
జవాబు:
దీనిని 1956 సం॥లో స్థాపించిరి. ఇది ప్రజల నుండి చిన్న చిన్న పొదుపు మొత్తాలను సేకరించి నిర్మాణాత్మక కార్యక్రమాలలో ఉపయోగిస్తుంది. ఇది ప్రత్యేకంగా వ్యక్తుల జీవితానికి భద్రత కల్పించును అనుకోని సంఘటనల వల్ల వ్యక్తి ప్రాణానికి ప్రమాదం ఏర్పడినప్పుడు నిర్ణీత మొత్తంలో భీమా సంస్థ నష్టపరిహారం అందచేయును. వివిధ పాలసీల ద్వారా, స్కీముల ద్వారా భీమా సంస్థ వినియోగదార్లకు సౌకర్యాలు కల్గిస్తుంది.
ప్రశ్న 8.
సాధారణ భీమా సంస్థ (GIC).
జవాబు:
దీనిని కేంద్ర ప్రభుత్వం 1972 సం॥లో స్థాపించిరి. జాతీయం చేసిన తరువాత 107 సాధారణ భీమా కంపెనీలన్నింటిని కలిపి నాలుగు కంపెనీలుగా విభజించారు. అనారోగ్యం, ప్రమాదాలు, ఆస్తినష్టం మొదలైన నష్టభయాల భద్రతకు సంబంధించినది సాధారణ భీమా. సాధారణ భీమా కంపెనీ మోటారు వాహనాలు, జలరవాణా మరియు అగ్ని ప్రమాదాలు అనే మూడు రకలైన వ్యాపారాలు చేస్తోంది.
ప్రశ్న 9.
సూక్ష్మ భీమా.
జవాబు:
సూక్ష్మ విత్త విధానంలో ఇది అంతర్భాగం. ప్రజలకు విస్తృతమైన, పరిపూరకమైన సేవలను అందించడానికి, రవాణాతో పాటు పొదుపును పెంపొందించే పథకానికి అనుగుణంగా సూక్ష్మ భీమా విధానం అమల్లోకి వచ్చింది. చాలా తక్కువ ప్రీమియంతో ఈ భీమా సౌకర్యాన్ని వాడుకోవచ్చు. స్వయం సహాయక బృందాల్లోని సభ్యులకు, రైతులకు, చిన్న వ్యాపారులకు, షెడ్యూల్డు తెగల వారికి సూక్ష్మ భీమా పథకం వర్తించును.
ప్రశ్న 10.
సమాచార వ్యవస్థ.
జవాబు:
ఇది అర్థికాభివృద్ధిలో ఒక అంతర్భాగం. మార్కెట్లకు సంబంధించిన సమాచారాన్ని, వస్తుసేవల వివరాలను అందిస్తూ కొనుగోలుదారులను, అమ్మకందారులను దగ్గరకు చేరుస్తుంది. సమాచారం తపాలా సేవలు, టెలీకమ్యూనికేషన్లు, ప్రసార సాధనాలు, టెలివిజన్లు, ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్ సేవల ద్వారా ప్రసారమవుతుంది.
ప్రశ్న 11.
శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం.
జవాబు:
ఆర్థికాభివృద్ధిని సాధించడానికి తోడ్పడే సాధానాల్లో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాల సేవలు అత్యంత అవసరమైనవి. విజ్ఞానం పెరుగుదల శాస్త్రమైతే, యంత్రపరికరాల ఆధునీకరణ సాంకేతిక పరిజ్ఞానం అవుతుంది. ఆర్థికాభివృద్ధి సాధించాలంటే శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలను వ్యవసాయ, రవాణా, ఆర్థిక, ఆర్థికేతర రవాణాలకు విస్తరించాలి.
ప్రశ్న 12.
సాఫ్ట్వేర్ పరిశ్రమ ప్రగతి.
జవాబు:
ఈ పరిశ్రమ 1960 సం॥లో ప్రారంభమైనది మనదేశంలో సమాచార సాంకేతిక విజ్ఞాన రంగానికి చెందిన అతి ముఖ్యమైన రంగాల్లో సాఫ్ట్వేర్ పరిశ్రమ ఒకటి. 2012 13 అంచనాల ప్రకారం ఈ పరిశ్రమ మనదేశ స్థూల జాతీయోత్పత్తి 14.1 % అదాయం సమకూర్చింది. 2013 – 14లో 3.1 మిలియను మందికి ఉపాధి కల్పించింది. 2011 – 12లో మనదేశం నుంచి 69 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువ గల సాఫ్ట్వేర్ ఎగుమతులు జరిగాయి.