AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 3rd Lesson జాతీయ ఆదాయం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 3rd Lesson జాతీయ ఆదాయం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలో జాతీయాదాయ పెరుగుదల ధోరణులను విశ్లేషించండి.
జవాబు:
ఒక దేశంలో ఒక సంవత్సరకాలంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల నికర విలువను జాతీయాదాయం అంటారు. కేంద్ర గణాంక సంస్థ జాతీయాదాయ అంచనాలను, వర్తమాన ధరలను మరియు స్థిర ధరలలో మదింపు చేస్తుంది. ప్రస్తుత ధరల వద్ద జాతీయాదాయము పెరుగుదల రెండు అంశాలను ప్రభావితం చేస్తుంది.

  1. వాస్తవిక వస్తు సేవల పెరుగుదల
  2. ధరలలో పెరుగుదల.

వస్తుసేవల ఉత్పత్తి వల్ల జాతీయాదాయం పెరిగితే వాస్తవిక ఆర్థికవృద్ధిని సూచిస్తుంది. రెండవ కారణం వల్ల జాతీయాదాయం పెరిగితే ద్రవ్యరూపంలో పెరిగిన ఆదాయాన్ని స్థిర ధరల వద్ద ఆదాయాన్ని కుదించి వాస్తవిక ఆదాయాన్ని లెక్కించవలసి వస్తుంది. స్థిర ధరల వద్ద నికర జాతీయోత్పత్తి సమాజం యొక్క ఉత్పాదక సామర్థ్యాన్ని సూచిస్తుంది.
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 1

1R: మొదటిసారి సరిచేసిన అంచనాలు 2R: రెండవసారి సరిచేసిన అంచనాలు 3R మూడవసారి సరిచేసిన అంచనాలు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

1950 – 51వ సంవత్సరంలో నికర జాతీయోత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం 9,464 కోట్ల రూపాయలు ఉండగా 2013 -14 నాటికి రూ. 91,71,045 లకు పెరిగింది. తలసరి నికర జాతీయోత్పత్తి 1950-51వ సం॥లో రూ.264 ఉండగా 2013-14లో రూ.74,380లుగా ఉంది.
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 2
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 3

1, 2 పంచవర్ష ప్రణాళికలలో నికర జాతీయోత్పత్తి 4.2 శాతంగా ఉంది. 3వ ప్రణాళికలో 2.6 శాతంకు తగ్గినది. దీనికి కారణం తీవ్ర కరువు. 4వ ప్రణాళికలో 3.2 శాతం కాగా 5వ ప్రణాళికలో 4.9%, 6వ ప్రణాళికలో 3.1%, 11వ ప్రణాళికాకాలంలో 7.5% గా ఉంది. ఇదే ప్రణాళికలలో తలసరి నికర జాతీయోత్పత్తి వరుసగా 1వ ప్రణాళికలో 2.4% ఉండగా 11వ ప్రణాళికలో 5.9గా ఉంది.

ప్రశ్న 2.
జాతీయోత్పత్తిలో వివిధ రంగాల వాటాలను వివరించండి.
జవాబు:
జాతీయాదాయములో వివిధ రంగాల వాటా వివరాలు అత్యధిక ప్రాధాన్యత కలిగిన అంశము. ఒకవేళ ఆర్థికాభివృద్ధి ముఖ్యంగా వివిధ రంగాలు జాతీయాదాయమునకు సమకూర్చే వాటాలపై ఆధారపడును. జాతీయాదాయములో ఏ రంగానికి ఎంతెంతవాటా ఉన్నదీ పరిశీలిస్తే ఆయారంగాల ప్రాధాన్యతలు, వాటి పోకడలు తెలుస్తాయి. ముఖ్యంగా మనదేశంలో జాతీయాదాయ ప్రాథమిక రంగం, ద్వితీయ, తృతీయ రంగాల ఆదాయంతో సంయోజనమవుతుంది. సాధారణంగా జాతీయాదాయమునకు వ్యవసాయరంగం వాటా అధికముగా ఉన్న ఆ దేశము అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పవచ్చును.

స్థూలదేశీయోత్పత్తిలో ప్రాథమిక రంగం వాటా: స్వాతంత్ర్యం తరువాత భారతదేశంలో స్థూల దేశీయోత్పత్తిలో. ప్రాథమిక రంగం (వ్యవసాయం, అడవులు, చేపల పెంపకం) వాటా 1950 – 51 లో 55.4 శాతము ఉండగా 1980 81 నాటికి 38 శాతానికి 2013-14 (ముందస్తు అంచనాలు) 13.9 శాతానికి తగ్గినది. దీనికి కారణము ప్రాథమిక రంగంలో కేవలం వ్యవసాయరంగపు వాటా భారీగా తగ్గుట. జాతీయాదాయంలో అటవీ ఉత్పత్తుల విలువకూడా తగ్గుచున్నది. జాతీయాదాయానికి చేపల ఉత్పత్తుల విలువ స్థిరంగా ఉన్నది. రవాణా, వ్యాపారం, బ్యాంకింగ్, భీమా, ఇతర సేవల వ్యవసాయరంగం కంటే వేగంగా అభివృద్ధి చెందడం వలన జాతీయాదాయాన్ని వ్యవసాయేతర రంగాలు ఎక్కువగా ప్రభావితము చేయుచున్నవి. భారతదేశ జాతీయోత్పత్తిలో ఇప్పటికీ వ్యవసాయరంగము వాటా ముఖ్యమైనదిగా పరిగణింపవచ్చును.

ద్వితీయరంగపు వాటా: ద్వితీయ రంగమనగా గనులు, తయారీ, నిర్మాణము, విద్యుచ్ఛక్తి, గ్యాస్, నీటి సరఫరా, మొదలగునవి ఉంటాయి. జాతీయాదాయంలో ఈ రంగం వాటా క్రమంగా పెరుగుచున్నది. 1950-51 లో ద్వితీయ రంగం వాటా 15 శాతము. 1980-81 నాటికి ఈ రంగం వాటా 24 శాతానికి పెరిగింది. 2013-14 నాటికి కేవలము 2. 2శాతము పెరిగి 26.2% ఉన్నది.

తృతీయరంగపు వాటా: ఈ రంగం అనగా వ్యాపారము, రవాణా, ఫైనాన్సింగ్, భీమా, రియల్ ఎస్టేట్, బ్యాంకులు, సామాజిక వ్యక్తిగత సేవలు. జాతీయాదాయములో ఈ రంగం వాటా 1950-51లో 29.6 శాతము, 1980-81లో 38 శాతము, 2013-2014 నాటికి ఎక్కువ పెరుగుదలను కలిగి 59.9 శాతానికి పెరిగినది. 1980-81 తరువాత తృతీయ రంగపు వాటా ఎక్కువగా ఉన్నది. జాతీయాదాయములో వ్యాపారము, రవాణా, కమ్యూనికేషన్స్ వాటా 1950-51లో 11.3 శాతము నుంచి మూడురెట్లుకు పైగా పెరిగి 2013-14 నాటికి 26.4 శాతముగా ఉన్నది. స్థూలదేశీయోత్పత్తిలో ఫైనాన్స్, భీమా, రియల్ ఎస్టేట్ మరియు వ్యాపార సేవలవాటా 1950-51 లో 7.7 శాతముకాగా, 30 సంవత్సరముల కాలంలో 0.2% తగ్గి 1980-81 నాటికి 7:5 శాతముగా ఉన్నది. తరువాత దాదాపు మూడురెట్లు దాకా పెరిగి 2013-14లో 20.6 శాతముగా ఉన్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

ప్రశ్న 3.
ఆదాయ – సంపద పంపిణీలోని అసమానతలకు గల కారణాలను వివరింపుము.
జ.
భారతదేశములోని ఆదాయ అసమానతల వలన అట్టడుగు వర్గ ప్రజల జీవితాలు దుర్భరమౌతున్నాయి. ఆకలి చావులకు కారణమౌతున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 4

1) భూ యాజమాన్యంలో అసమానత: బ్రిటీష్వారు ప్రవేశపెట్టిన జమీందారీ పద్ధతి ఫలితంగా భూ సంపద కొద్దిమంది చేతులలో కేంద్రీకృతమైనది. స్వాతంత్ర్యానంతరము భారత ప్రభుత్వము జమీందారీ పద్ధతిని రద్దు చేసినప్పటికీ యాజమాన్య పద్ధతిలో పెద్దగా మార్పులేదు. 2010-11వ సంవత్సరములో మొత్తము వ్యవసాయదారులలో 67 శాతము మంది ఉపాంత కమతాలను కల్గి ఉన్నారు. (ఒక హెక్టారుకన్నా తక్కువ) మొత్తము సాగుభూమిలో వీరు సాగుభూమిలో వీరు సాగుచేయుచున్నది. కేవలము 22.2 శాతము మాత్రమే. పెద్ద కమతాలను (10 హెక్టార్ల కంటే ఎక్కువ) కలిగి ఉన్నావారు కేవలం 0.7 శాతముగా ఉండి మొత్తము సాగు విస్తీర్ణములో 10.9 శాతపు భూమిని వీరు సాగుచేయుచున్నారు.

భూస్వాములు పొదుపుచేసే శక్తిని కలిగి ఉండడమేగాక సంస్థాపూర్వక రుణాలను కూడా సులభంగా పొందగలిగి నూతన ఉత్పత్తి పద్ధతులను ప్రవేశపెట్టి అధిక ఆదాయమును ఆర్జించుట ఆదాయ అసమానతలకు కారణము.

2) ప్రైవేటు కార్పొరేటు రంగంలో ఆస్తుల కేంద్రీకరణ: భారీ పారిశ్రామికవేత్తల ఆధీనంలో సంపద కేంద్రీకరించ బడినది. 1975-76వ సంవత్సరము ఆచరణాత్మక ఆర్థిక పరిశోధనపై జాతీయ సంస్థ (NCAER), పై 10 శాతము ప్రజల ఆధీనంలో 46.28 శాతపు పట్టణ సంపద కేంద్రీకృతమైనది. అట్టడుగు 60% ప్రజల ఆధీనంలో కేవలం 11.67 శాతపు సంపద కేంద్రీకృతమైనది. మార్చి 31, 1991 నాటికి భారీ ప్రైవేటు పరిశ్రమల మొత్తము ఆస్తి 45,830 కోట్ల రూపాయలు 2013-14 నాటికి ఒక్క రిలయన్స్ పరిశ్రమల మొత్తము ఆస్తుల 3,62,375 రూపాయలు. ఇదే సంవత్సరము రిలయన్స్ పరిశ్రమ, టాటా మోటార్స్, భారతి ఎయిర్టెల్ మరియు లార్సన్ మరియు టూబ్రో అను 5 ప్రైవేటు కంపెనీల మొత్తము ఆస్తులు 9,80,764 రూపాయలుగా ఉన్నవి.

3) వృత్తి నైపుణ్యాలలో అసమానత: వ్యాపార కార్యనిర్వాహకులు, ఇంజనీర్లు, సమాచార సాంకేతిక నిపుణులు, న్యాయవాదులు మరియు ఇతర వృత్తి నైపుణ్యాలు గల వారి ఆదాయాలు ఎక్కువ. సమాజంలో ఉన్నత వర్గాల పిల్లలకు మాత్రమే ఉన్నత మరియు సాంకేతిక (వృత్తి) విద్య అందుబాటులో ఉన్నది. వ్యవసాయ కూలీలు, పారిశ్రామిక శ్రామికులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ఇటువంటి విద్య అందుబాటులో లేదు. కావున విద్య, శిక్షణ అవకాశాల్లో ఉన్న వ్యత్యాసాలు ఆదాయ అసమానతలకు కారణము.

4) ద్రవ్యోల్బణము మరియు ధరల పెరుగుదల: భారతదేశంలో 1950 దశకం మధ్యకాలం నుంచి సాధారణ ధరల స్థాయి క్రమంగా పెరుగుచున్నది. దీని వలన పేదవర్గాల వాస్తవిక ఆదాయము తగ్గుచున్నవి. ద్రవ్యోల్బణ ప్రభావము ధనవంతులపై ఉండదు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు, విక్రయం కాగల మిగులును కల్గివున్న వ్యవసాయదారులు ద్రవ్యోల్బణము ద్వారా లబ్ధిపొందుతారు. ఈ విధముగా ధనిక, పేద వర్గాల మధ్య ఆదాయ వ్యత్యాసాలు అధికమవుతున్నాయి.

5) నగరాలవైపు ప్రైవేటు పెట్టుబడి భారతదేశంలో 70శాతం మంది ప్రజలు గ్రామాలలో జీవిస్తున్నారు. కాని దాదాపు 70% ప్రైవేటు పెట్టుబడి పట్టణ ప్రాంత పారిశ్రామిక రంగానికి వెళ్ళుచున్నది. ప్రైవేటు పెట్టుబడిదారులు గ్రామీణ ప్రాంతములో పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపడములేదు. శ్రామిక సప్లయికి అనుగుణంగా భారీ పరిశ్రమలు ఉపాధిని కల్పించలేకపోవుట ఆదాయపంపిణీలో అసమానతలకు కారణము.

6) పరపతి సౌకర్యాలలో అసమానత: భారీ పారిశ్రామిక వేత్తలకు, పెద్ద వ్యాపారస్తులకు సులభంగా సంస్థాపూర్వక రుణాలు లభిస్తాయి. వ్యవసాయదారులకు, వ్యవసాయధార సంస్థలకు, చిన్న ఉద్యమదారులకు తక్కువ పరిమాణములో రుణాలను సమకూరుస్తారు. కావున వీరి అధిక వడ్డీరేటుకు రుణాలను పొందుటకు వడ్డీవ్యాపారులపై ఆధారపడవలసి వస్తున్నది. వివిధ ఉత్పత్తి వర్గాల మధ్య ఆదాయ అసమానతలు పెరగుటకు పరపతి వివక్ష ముఖ్య కారణము.

7) ప్రభుత్వ పాత్ర: సంక్షేమ పథకాలైన విద్య, వైద్య, గృహనిర్మాణము, సాంఘిక భద్రతా పథకాలపై (వితంతు, వృద్ధాప్య, అంగవైకల్య, ఫించన్లు, ఫీజురీయింబర్స్మెంట్) ప్రభుత్వ వ్యయవిధానాలు సాపేక్ష ఆదాయాల వారికి అందుచున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత లోపించుట అసమానతలకు కారణము.

8) అసమంజసమైన పన్నుల విధానము మొత్తం పన్నుల రాబడిలో ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నుల వాటా హెచ్చుగా ఉంటుంది. పరోక్ష పన్నుల భారము పేదవారిపై అధికంగా ఉంటుంది. ప్రత్యక్ష పన్నుల నుంచి తప్పించుకోవడానికి లేదా పన్ను చెల్లింపులను ఎగవేయడానికి ధనిక వర్గాలు తీవ్రంగా ప్రయత్నించి సఫలీకృతులగుట | ఆర్థిక అసమానతలకు కారణము.

ప్రశ్న 4.
ఆదాయ అసమానతలను తొలగించుటకు తీసుకోవలసిన చర్యలను సంక్షిప్తంగా వివరింపుము.
జవాబు:
భారతదేశ ఆర్థిక ప్రణాళికల ముఖ్య లక్ష్యము ఆర్థిక అసమానతలను నిర్మూలించి, ప్రజలందరికీ సాంఘీక న్యాయాన్ని కల్పించుట. ఈ లక్ష్యసాధనకు భారతప్రభుత్వము క్రింది నియంత్రణా చర్యలను చేపట్టింది.
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 5
1) భూ సంస్కరణలు: గ్రామీణ ప్రాంతాలలో అసమానతలకు కారణము భూపంపిణీలోని అసమానతలు. ప్రభుత్వము భూసంస్కరణలలో భాగంగా జమీందారీ పద్ధతిని రద్దుచేసి “దున్నేవానిదే భూమి” అను చట్టాన్ని చేసినప్పటికీ భూపంపిణీలోని అసమానతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కౌలు సంస్కరణలలో భాగంగా కౌలు పరిమాణమును తగ్గించి, కౌలుదారునికి భద్రత కల్పించినప్పటికీ, కౌలుదారులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

2) ఏకస్వామ్య వ్యాపార కార్యకలాపాల నియంత్రణ: డిసెంబర్, 1969వ సంవత్సరములో ప్రవేశపెట్టిన ఏకస్వామ్య వ్యాపార నియంత్రణ చట్టము (Monopolies Restrictive Trade Practices Act) జూన్ 1, 1970 నుంచి అమలులోకి వచ్చినది. ఈ చట్టము ఏకస్వామ్య ధోరణి కల్గిన సంస్థలను నియంత్రించుటకు ఉద్దేశించినది. పరిశ్రమల విస్తరణ, ఏకీకరణ మొదలగు వాటిని ఈ చట్టము నియంత్రించును.

3) సహకార చర్యలు: పెద్ద పరిశ్రమల స్థాపన ఆర్థికస్థోమత కేంద్రీకరణకు దారితీస్తుంది. సహకార రంగములో సంస్థలు నెలకొల్పిన అవి ఆర్జించు లాభాలు అందులో సభ్యులైన అందరూ పంచుకోవటము ద్వారా ఆదాయ అసమానతలు తగ్గించవచ్చును. సహకార సంస్థల లక్ష్యము ప్రజల ప్రయోజనాలను కాపాడుట.

4) నూతన సంస్థలను ప్రోత్సహించుట: ఒకే కుటుంబం అనేక సంస్థలను నెలకొల్పుట ద్వారా ఆర్థికస్థోమత కేంద్రీకరణకు తోడ్పడును. ప్రభుత్వము ప్రోత్సాహకాలను ప్రకటించుట ద్వారా నూతన సంస్థలను ప్రోత్సహించాలి. ఇదివరకే పరిశ్రమలను కలిగి ఉన్న వారికి మరల పరిశ్రమల స్థాపనకు లైసెన్సును ఇవ్వకుండా జాగ్రత్త వహించి, ఆర్థిక శక్తి కేంద్రీకరణను నివారించవచ్చును.

5) సాంఘీక భద్రత: ప్రభుత్వము “సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధిరేటు” లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తరచూ ప్రకటిస్తుంది. ప్రభుత్వము వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు సాంఘిక భద్రతాచర్యలలో భాగంగా భరణము (ఫించను) ఇస్తున్నవి. పరిశ్రమలలో ప్రమాదవశాత్తు గాయపడిన వారికి నష్టపరిహారము, ప్రసూతి వసతులు, కనీస వేతన అమలు, ఉద్యోగులకు భీమా, భవిష్యత్తు నిధి మొదలగు వసతులను కల్పించుట ద్వారా ఆదాయాల పెంపునకు కృషిచేస్తున్నది.

6) పన్నుల విధానము: సంపద కేంద్రీకృత ధోరణిని నివారించే విధంగా భారతదేశము పురోగామి పన్నుల విధానమును అమలుచేస్తున్నవి. అధిక ఆదాయము కలవారు తమ ఆదాయ మొత్తాన్ని లెక్కల్లో చూపడము లేదు. పారిశ్రామిక వేత్తలు, న్యాయవాదులు, వైద్యులు, కాంట్రాక్టర్లు ఆదాయ పన్ను ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తారు. కావున ప్రత్యక్ష పన్నులను సక్రమముగా అమలుపరచిన ఆర్థిక అసమానతలను కొంతవరకు తగ్గించవచ్చును.

7) ఉపాధి మరియు వేతన విధానము: ఆదాయ అసమానతలు తగ్గించడానికి భారత ప్రభుత్వము అనేక ఉపాధి కల్పనా పథకాలను అమలు చేస్తున్నది. ఉదాహరణకు సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకము, జాతీయ గ్రామీణ ఉపాధి పథకము, జవహర్ గ్రామ సమృద్ధియోజన, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకము మొదలగునవి.
ఎక్కువమంది పనిచేయుచున్న అసంఘటిత రంగ శ్రామికుల వేతనాల స్థాయి చాలా తక్కువ. వీరికి కనీస వేతనాలను అమలుచేయుట ద్వారా ఆదాయ అసమానతలను తగ్గించవచ్చు.

8) చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం కుటీర చిన్నతరహా పరిశ్రమలు భారీపరిశ్రమలకు ప్రత్యమ్నాయాలుగా అభివృద్ధి పరచగలిగిన, ఇవి ఆర్జించు లాభాలు అనేకమంది పంచుకొనుట ద్వారా ఆర్థిక స్థోమత కేంద్రీకరణను నివారించవచ్చు. కొన్ని వస్తువుల తయారీని చిన్న పరిశ్రమలకు కేటాయించి, జాతీయ బ్యాంకులు సులభ నిబంధనలతో రుణాలివ్వాలని ప్రభుత్వము నిర్ణయించి, అమలుచేయగలిగితే ఆదాయ అసమానతలు తగ్గించవచ్చును.

ప్రశ్న 5.
భారతదేశములో పేదరికానికి కారణాలు ఏవి ? [Mar ’17]
జవాబు:
పేదరికము మానవ జీవితానికి ఒక శాపములాంటిది. పేదరికము ఒక సాంఘీక, ఆర్థిక సమస్య. సమాజంలో ఒక వర్గం వారు కనీస అవసరాలైన ఆహారము, గృహము, వస్త్రము పొందలేని పరిస్థితిని పేదరికం అంటారు. భారతదేశంలో 2013వ సంవత్సరమున మొత్తము జనాభాలో 230 మిలియన్ల ప్రజలు అనగా 17.59 శాతము మంది పేదరిక రేఖకు దిగువన ఉన్నారు. పేదరిక సమస్యను సమగ్రంగా అర్థంచేసుకోవడానికి నిరపేక్ష మరియు సాపేక్ష పేదరిక భావనలను ఉపకరిస్తాయి.

నిరపేక్ష పేదరికము (Absolute Poverty): సమాజంలో కనీస జీవన అవసరాలను కూడా పొందలేని వారిని నిరపేక్ష పేదవారుగా పేర్కొంటాము.

సాపేక్ష పేదరికము (Relative Poverty): సాపేక్ష పేదరికమనేది ఆదాయ అసమానతలను ఆధారంగా చేసుకొని చెప్పవచ్చు. దేశంలో అధిక ఆదాయ వర్గ ప్రజలతో పోల్చుకొని తక్కువ ఆదాయముతో కనీస వసతులు మాత్రమే పొందేవారిని సాపేక్ష పేదవారుగా పేర్కొంటాము.

పేదరిక కారణాలు: పేదరికం ఒక సాంఘిక, ఆర్థిక సమస్య. ఇందు అనేక సాంఘీక, ఆర్థిక, రాజకీయ, వ్యవస్థాపక కారణాలున్నాయి. పేదరిక ప్రభావము ఒక విషవలయములాంటిది. పేదరికము, నిరుద్యోగము ఒకదానిపై ఒకటి ఆధారపడును. పేదరికము నిరుద్యోగానికి, నిరుద్యోగము పేదరికానికి కారణము

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 6
1. వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ: పేదరికానికి ప్రధాన కారణం భారత ఆర్థికవ్యవస్థ వెనుకబడి ఉండుట దండేకర్ మరియు రధ అభిప్రాయము ప్రకారం లాభసాటికాని వ్యవసాయము మరియు అల్పమూలధన సంచయనము భారత గ్రామీణ పేదరికమునకు కారణము. వ్యవసాయరంగంలోని చిన్న కమతాలు, కమతాల విఘటన, ఉత్పాదకాల కొరత, పరపతి సౌకర్యాల కొరత, కౌలుదారునికి భద్రత లేకుండుట ద్వారా భారత వ్యవసాయరంగం వెనుకబడి గ్రామీణ పేదరికానికి కారణమగుచున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

2. నిరుద్యోగము మరియు అల్పవేతనాల స్థాయి: అల్పఉద్యోగిత మరియు నిరుద్యోగితతో పాటు తక్కువస్థాయి వేతనాలు పేదరికానికి కారణము. దీనికి ముఖ్యకారణము భారతదేశంలో శ్రామిక డిమాండ్ కన్నా శ్రామిక సప్లయ్ ఎక్కువగా ఉండుట. మూలధన కొరత వలన పారిశ్రామికరంగం ఎక్కువమంది ప్రజలకు ఉపాధిని కల్పించలేకపోవుట పేదరికానికి కారణం.

3. జనాభా విస్ఫోటనము: భారతదేశంలో కుటుంబ సంక్షేమ కార్యక్రమ అమలు వల్ల మరణాల రేటు తగ్గి జననముల రేటు అధికంగా వున్నది. మనదేశంలో 1951 సంవత్సరంలో 361.09 మిలియన్ల ఉన్న జనాభా 2011 నాటికి 1210.19 మిలియన్లకు పెరిగినది. గత 60 సంవత్సరములలో జనాభా మనదేశంలో 31/2 రెట్లు పెరిగినది. మూలధన కొరత మరియు అల్పసాంకేతిక పరిజ్ఞానం వలన అధిక జనాభాకు అవసరమైన వస్తుసేవలను ప్రజలందరికీ అవసరమైన మేరకు అందడం లేదు. జనాభా వృద్ధిరేటు కన్నా జాతీయాదాయ వృద్ధిరేటు తక్కువగా వున్నది. తక్కువ జాతీయాదాయాన్ని ఎక్కువమంది జనాభా పంచుకొనుట ద్వారా తలసరి ఆదాయం తక్కువగా ఉండి పేదరికాన్ని అనుభవిస్తున్నారు.

4. ఆదాయ, ఆస్తుల పంపిణీలో అసమానతలు: జాతీయాదాయ పంపిణీలో అసమానత సాపేక్ష పేదరికానికి కారణం. భారతదేశంలో ఎక్కువ వ్యవసాయ కుటుంబాలు ఒక హెక్టారుకన్నా తక్కువ వ్యవసాయ భూమిని కలిగివున్నారు. ఫలితంగా ఆధునిక పద్దతులలో వ్యవసాయ కార్యక్రమాన్ని నిర్వర్తించలేక తక్కువ ఆదాయాన్ని పొందుట పేదరికానికి కారణం. పారిశ్రామిక సంస్థల వాటాలను, సంస్థల యాజమాన్యంలోని అసమానతలు పట్టణ పేదరికానికి కారణం.

5. తక్కువ అందుబాటులో ఉన్న నిత్యావసరాలు: నిత్యావసరాలైన ఆహారం, బట్టలు, వసతిగృహం ప్రజలందరికీ అందుబాటులో లేవు. తీవ్రజనాభా పెరుగుదలకు అవసరమైన వస్తుసేవలను మనదేశం ఉత్పత్తి చేయలేకున్నది. ప్రథమ శ్రేణి (వినియోగ) వస్తువుల అల్ప లభ్యత ప్రజల అల్పజీవన ప్రమాణానికి కారణం. ధనిక, పేద ప్రజల మధ్య వినియోగస్థాయిలో ఎక్కువ తారతమ్యం వున్నది. ఇది సాపేక్ష పేదరికాన్ని సూచిస్తుంది.

6. ద్రవ్యోల్బణం: దేశంలో నిరంతరం పెరుగుచున్న అల్పాదాయ వర్గాల ప్రజల పేదరికానికి కారణం. ముఖ్యంగా వ్యవసాయ, వ్యవసాయేతర కూలీలకు స్థిర ఆదాయముండదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి ధరల పెరుగుదలను అధిగమించడానికి కరువు భత్యం లభించదు. మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల ప్రజలు కనీస అవసరాలను తీర్చుకోవడానికి వీలులేక పేదరికానికి గురవుతున్నారు. ‘

7. పంచవర్ష ప్రణాళికల వైఫల్యం: పంచవర్ష ప్రణాళికల ప్రధాన లక్ష్యం ప్రజలందరికీ కనీస అవసరాలను కల్పించడం. ప్రభుత్వము పన్నెండు పంచవర్ష ప్రణాళికలలో అనేక పేదరిక నిర్మూలనా పథకాలను అమలు చేసినప్పటికీ పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించలేకపోయినది. మనదేశంలో ప్రణాళికల ద్వారా సాధించే వృద్ధిరేటు పేదరిక నిర్మూలనకు దోహదపడుట లేదు.

8. సాంఘీక కారణాలు: దేశంలో కులవ్యవస్థ, ఉమ్మడి కుటుంబ విధానం. వారసత్వ చట్టాలు, ఆర్థికాభివృద్ధికి ఆదాయ పెరుగుదలకు అవరోధాలుగా ఉన్నాయి. భారతదేశంలోని సామాజిక వ్యవస్థ ఆలోచనా సరళి ప్రజల పురోగతికి ప్రతిబంధకాలు, ప్రజలలోని మూఢనమ్మకాలు, పాపభీతి, దైవభక్తి, అనుత్పాదకతా వ్యయాన్ని పెంచి పేదరికానికి కారణమగుచున్నది. పండుగలకు, పుట్టినరోజు వేడుకలు, పెళ్ళిళ్లు, మరణాలు మొదలగు వాటిపై చేయు విపరీతమైన ఖర్చులు ప్రజల పేదరిక విషవలయానికి కారణం.
బలహీనపడింది.

9. రాజకీయ కారణాలు: బ్రిటీషు వారి వలస ఆర్థిక విధానం ద్వారా భారతదేశం ఆర్థికంగా స్వాతంత్య్రానంతరం దేశంలోని రాజకీయ నాయకులు తమస్వార్థ ప్రయోజనాల కోసం పేదవారిని మరీ పేదవారిగా వుంచే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. భూసంస్కరణలు సమర్థవంతంగా ఆమలు కాకపోవడం, భారతదేశ పరిపాలకులలోని అసమర్థత, లంచగొండితనము, పేదరికరేటు ఎక్కువగా ఉండుటకు కారణం. చట్టసభలలో పేదప్రజల అభ్యున్నతికి చట్టాలను తీసుకురావడంలో వెనుకబడి వున్నాము.

10. వ్యవస్థాపరమైన కారణాలు: పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో వున్న వ్యవస్థాపూర్వకమైన సమస్యలు ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలోని భూస్వామ్యవ్యవస్థ పేదరికానికి కారణము. గ్రామీణ ప్రాంతములోని తక్కువ భూమి గల రైతులు ఆర్థికంగా వెనుకబడి ఉండుట, నూతన వ్యవసాయ వ్యూహాన్ని అనుసరించలేక హరితవిప్లవంలోని ప్రయోజనాన్ని పొందలేకున్నారు. వ్యవస్థాపూర్వక ప్రతిబంధకము మరియు రాజకీయ ప్రాబల్యము లేనందున ప్రభుత్వ సబ్సిడీల ద్వారా లభించే ఎరువులు, విత్తనాలు ఇతర ఉత్పాదకాలు పేదవారికి లభ్యం కావడం లేదు. ప్రభుత్వం సమకూర్చే గృహవసతి, ఇతర ఫించను పథకాలు కొంతవరకు రాజకీయ జోక్యంతో పేదవారికి దక్కడము లేదు. వ్యవస్థాపక ప్రతిబంధకాల వలన ప్రభుత్వము కల్పించే విద్య, వైద్య సదుపాయాలు పేదవారికి లభ్యంకావడము లేదు.

ప్రశ్న 6.
భారతదేశంలో పేదరికం నిర్మూలించడానికి తీసుకోవలసిన చర్యలు ఏవి ?
జవాబు:
2000 సంవత్సరం సెప్టెంబర్ నెల, ఐక్యరాజ్యసమితి మిలీనియం శిఖరాగ్ర సమావేశంలో 189 ప్రపంచదేశాల “నాయకులు ప్రపంచ పేదరికానికి ముగింపు పలకాలనే నిర్ణయాన్ని తీసుకొస్తున్నారు. మిలీనియం అభివృద్ధి లక్ష్యాలుగా భావించే పేదరిక నిర్మూలన, మానవ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం, ప్రపంచశాంతిని నెలకొల్పడం, పర్యావరణ నిలకడగల స్థితిని పెంపొందించడం మొదలైన లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా సాధించడానికి కృషిచేయాలని ఈ దేశ నాయకులు అంగీకరించారు. పేదరికాన్ని రెండు రకాల స్థాయిలో, స్థానికంగా వున్న సమాజాభివృద్ధి ద్వారానూ, వ్యక్తుల, ఎంపిక చేసిన వర్గాల అభివృద్ధి ద్వారాను నివారించవచ్చును. వ్యక్తుల యొక్క ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలను పెంచుతూ అన్ని రంగాలనూ బలోపేతం చేస్తూ పేదరికాన్ని నిర్మూలించుట.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

1. సరళీకరణ, దేశీయ ఉత్పత్తి వృద్ధి కంటే పేదవారి వృద్ధి వ్యూహాన్ని ఎంపికచేసుకొనుట: మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజ్పాయ్ 15 ఆగస్టు 2001 స్వాతంత్య్రదినోత్సవ సందేశంలో “సరళీకరణ ఫలితాలు గ్రామీణ పేద ప్రజలకు చేరడములేదు. ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయి” అని పేర్కొన్నారు. అసంఘటిత రంగంలోని నిరుద్యోగిత తొలగింపునకు ప్రాధాన్యతనివ్వాలి. “పనిహక్కు” (Right to work) ను ప్రాథమిక మానవహక్కుగా గుర్తించాలి. ఈ పద్దతిలో నీటి సంరక్షణ, నీటిపారుదలకు ప్రాధాన్యత నివ్వాలి. సహాకార వ్యవసాయాన్ని బలపరచాలి.

2. వ్యవసాయ వృద్ధిరేటును పెంపొందించుట: వ్యవసాయ వృద్ధిరేటు 9వ పంచవర్ష ప్రణాళికలో 2.7 శాతము 10వ పంచవర్ష ప్రణాళికలో 1.7 శాతము మాత్రమే ఉన్నది. ఈ విధమైన అల్పవృద్ధిని అధిగమించుటకు భారత ప్రభుత్వం ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త యం.ఎస్. స్వామినాథన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసినది. ఈ కమిటీ వ్యవసాయ రంగాల వృద్ధికి అంశాలు కార్యాచరణ ప్రణాళికను సూచించినవి. అవి:

  1. భూమి సారవంతాన్ని పెంచే కార్యక్రమాన్ని అమలుచేయుట.
  2. పంట రుణాలపై వడ్డీని 4 శాతానికి తగ్గించుట.
  3. రైతులకు అధునాతన వ్యవసాయ విధానాలపై శిక్షణ ఇచ్చుటకు కృషి విజ్ఞాన కేంద్రాలను నెలకొల్పుట మొదలైనవి.

3. అసంఘటిత రంగములో వృత్తి నైపుణ్యాన్ని, ఉత్పాదకతను పెంచుట: అసంఘటిత శ్రామికుల ఆదాయాలు తక్కువగా ఉండి పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ప్రభుత్వము వీరి వృత్తి నైపుణ్యాలను పెంచి అసంఘటిత రంగాన్ని లాభసాటిగా మార్చాలి. అసంఘటిత రంగంలో 10 మిలియన్ల ఉద్యోగాల కల్పనకై లక్ష్యంగా 2002 సంవత్సరములో యస్.పి. గుప్తా అధ్యక్షతన నేషనల్ డెమోక్రటిక్ అలియెన్స్ (ఎన్.డి.ఎ) ప్రభుత్వము కమిటీని నియమించినది. దీనిద్వారా నిరుద్యోగాన్ని, పేదరికాన్ని నిర్మూలించవచ్చును.

4. వృద్ధి ప్రక్రియలో వేతనాల రేటును పెంచి పేదరికాన్ని నిర్మూలించుట:
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 7
ఆర్థికవృద్ధి నిర్మాణంలో వేతనాల వాటాను పెంచుట ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చు. వేతనాల వాటా 1989-90లో 70.8 శాతము ఉండగా 2009-10 సంవత్సరమునకు 36.5 శాతానికి తగ్గినది. లాభాల వాటా 1989-90 సంవత్సరములో కేవలము 19.1 శాతము ఉండగా 2009-10 నాటికి 56.2 శాతానికి పెరిగినది. లాభాల వాటాలో వచ్చిన గణనీయ మార్పులు, వేతనాల వాటాలో వచ్చిన తగ్గుదల పేదరికము తక్కువ స్థాయిలో తగ్గుటకు కారణం.

5. విద్య, నైపుణ్యాల విషయంలో పేదవారిని శక్తివంతులను చేయుట: భారతదేశంలో వృద్ధిచెందిన విద్యావ్యవస్థలో 378 విశ్వవిద్యాలయాలు, 18,064 కళాశాలు, 152 లక్షల ఉన్నత పాఠశాలలు మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడుతూ పేదరికాన్ని అరికడుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రప్రభుత్వము జాతీయ నైపుణ్యాల అభివృద్ధి సంస్థ నెలకొల్పినది.

6. మంచి ఆరోగ్యవసతుల ద్వారా పేదవారిని శక్తివంతులను చేయుట: ఆరోగ్యానికి, పేదరికానికి మధ్యగల సంబంధాన్ని గుర్తించాలి. దీర్ఘకాలిక ఎక్కువఖర్చుతో కూడిన అనారోగ్యమునకు గురైన పేదరికాన్ని ఎదుర్కోక తప్పదు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NRHM) మరియు జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (NUHM) అను రెండు సంస్థలు పేదలను, ఆరోగ్యవంతులను అందుబాటులోకి తెచ్చినవి. పేదరిక ఉచ్చునుండి బయటపడటానికి, అసంఘటిత రంగంలోని శ్రామికులకు ఆరోగ్యభీమా సౌకర్యాన్ని కల్పించాలి.

7. పేదవారికి ఇంటి వసతిని కల్పించాలి: గ్రామీణ మరియు పట్టణ పేదవారికి ఇల్లు ప్రధాన అవసరము. రాబోవు 20 సంవత్సరాల కాలంలో ఇందిరా ఆవాస్ యోజన అనుగొప్ప నిర్మాణ పథకాన్ని, పౌరులందరికీ కనీస వసతుల కల్పనకు, కేంద్ర ప్రభుత్వము ఒక పధకాన్ని ప్రవేశపెట్టినది. ప్రాథమిక అవసరాలైన త్రాగునీరు, విద్యుత్తు వంటి వసతులను పేదలకు కల్పించాలి.

8. ఐటి రంగాన్ని, విస్తృతపరచి, నైపుణ్యాల ద్వారా పేదలను శక్తివంతులను చేయడము: సమాచార సాంకేతికతను వృద్ధిచేయడము ద్వారా ఎక్కువ ఉద్యోగాలు సృష్టించి పేదరికాన్ని నిర్మూలింపవచ్చు. ఎక్కువ మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను మంజూరుచేయాలి. ప్రభుత్వము విద్యాసంస్థలను ఆర్థికంగా, వ్యవస్థాపరమైన సౌకర్యాలను కల్పిస్తూ’ పేద విద్యార్థులకు విద్యను అందించాలి.

9. జాతీయ ఉపాధి గ్రామీణ పథకము: జాతీయ గ్రామీణ ఉపాధి హమీ చట్టము వెనుకబడిన 200 జిల్లాలో 2006వ సంవత్సరము నుంచి ప్రారంభించి ఏప్రిల్ 1, 2008 నుంచి దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరించబడినది. |2010-11 కేంద్ర బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయలు కేటాయించుట ద్వారా గ్రామీణ జనాభాకు ఉపాధిని కల్పించి తద్వారా పేదరికాన్ని నిర్మూలించుటకు ప్రభుత్వము సంకల్పించినది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

ప్రశ్న 7.
నిరుద్యోగితకు కారణాలను మరియు నిరుద్యోగిత నివారణ చర్యలను వివరింపుము.
జవాబు:
భారతదేశంలో నిరుద్యోగితకు కారణాలు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 8
నిరుద్యోగ సమస్యకు అనేక సాంఘిక, ఆర్థిక, వ్యవస్థాపరమైన కారణాలున్నాయి.
1. అధికరేటులో వృద్ధి చెందే జనాభా: అధికరేటులో వృద్ధిచెందే జనాభాకు అనుగుణముగా శ్రామిక సప్లయ్ పెరుగును. మనదేశంలో 1960 ప్రాంతములో సాలుసరి జనాభా వృద్ధిరేటు 2.2 శాతము కాగా సాలుసరి శ్రామిక శక్తి 1.9 శాతముగా ఉన్నది. 2011-12 సంవత్సరముల మధ్య పెరిగిన నికర శ్రామిక జనాభాకు లాభసాటి ఉపాధిని కల్పించుట మన ఆర్థిక వ్యవస్థకు దుర్లభము.

2. ఉపాధి రహితవృద్ధి: స్వాతంత్య్రానంతర మూడు దశాబ్దాల ప్రణాళికా కాలంలో సాంవత్సరిక స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 3.5 శాతముగా ఉన్నది. ఈ కాలంలో సాంవత్సరిక ఉపాధి అవకాశాలు కేవలము 2 శాతము మాత్రమే. 1999-2000 నుంచి 2004-05 మధ్య 5 సంవత్సరాల కాలంలో సాంవత్సరిక ఉపాధి వృద్ధిరేటు 2.9 శాతము కాగా 2004-05 నుంచి 2009-10 మధ్య ఉపాధి వృద్ధి రేటు దాదాపు శూన్యము.

3. ప్రతికూల సాంకేతికం: భారతదేశము మూలధన కొరతను కల్గి అధిక శ్రామిక శక్తిని కల్గిఉన్నది. మార్కెట్ శక్తులు స్వేచ్ఛగా సమర్ధవంతముగా నిర్వహించిన శ్రమసాంద్రత ఉత్పత్తి పద్ధతిని ఎంపికచేసుకోవలసి వస్తుంది. పారిశ్రామిక రంగంలోనే గాక వ్యవసాయ రంగంలో కూడా ఉత్పత్తిదారులు శ్రమకు బదులుగా మూలధనాన్ని (యాంత్రీకరణను) ఉపయోగించుటవలన నిరుద్యోగిత పెరుగుచున్నది.

4. గ్రామీణ పరిశ్రమలు విస్తరించకపోవుట భారతదేశములో గ్రామీణ పరిశ్రమలు విస్తరించకపోవుట వలన, జనాభా మొత్తము వ్యవసాయముపై ఆధారపడుట వలన వ్యవసాయ రంగంలో ఒత్తిడి అధికమై వ్యవసాయరంగమే వెనుకబడినది. వ్యవసాయరంగము అధికరేటులో పెరిగే జనాభాకు ఉపాధిని కల్పించలేక నిరుద్యోగము అధికమగుచున్నది.

5. లోపభూయిష్ట విద్యావిధానము: బ్రిటీష్ వారి కాలములో మెకాలే ప్రవేశపెట్టిన విద్యావిధానము నేటికీ కొనసాగుచున్నది. గున్నార్ మీర్జాల్ ప్రకారము “మానవ వనరుల అభివృద్ధి లక్ష్యంగా భారతదేశ విద్యావిధానము లేదని” పేర్కొనుట సమంజసము. ఇతని ప్రకారము ఇంకనూ ఈ విద్యా విధానము కేవలం ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో క్లర్క్స్ ను మరియు తక్కువస్థాయి కార్యనిర్వాహకులను మాత్రమే ఉత్పత్తి చేస్తుందని పేర్కొనెను. లోపభూయిష్ట విద్యావిధానము వలన మానవ వనరులు అభివృద్ధి చెందనంత వరకు విద్యనభ్యసించిన వారందరికి ఉపాధిని కల్పించుట కష్టము.

6. మానవ వనరుల వృద్ధిలో లోపము: భవిష్యత్లో అవసరమైన నైపుణ్యము కలిగిన శ్రామికులకు అనుగుణంగా తగిన విద్యాభోదన. అందుకు అవసరమైన కోర్సులను ప్రారంభించడములో వెనుకబడుట నిరుద్యోగమునకు కారణము.

7. సాంఘీక కారణాలు: స్వాతంత్య్రానంతరము స్త్రీలు పురుషులతో పాటు విద్యనభ్యసించుచున్నారు. ఉద్యోగం పురుషలక్షణం అనే నానుడి గతించినది. ప్రస్తుతము అన్ని రంగాలలో పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉద్యోగాలను పొందటంలో పోటీపడుచున్నారు. ప్రభుత్వములు కూడా స్త్రీలకు ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించుచున్నది. ఆర్థిక వ్యవస్థ అన్ని వర్గాల వారికి ఉద్యోగితను కల్పించే స్థాయికి చేరకపోవుట నిరుద్యోగితకు కారణము.

8. స్వయం ఉపాధిపై మక్కువ లేకుండుట: గ్రామీణ ప్రాంతంలోని ఉపాంత రైతులు మరియు వ్యవసాయ కూలీలు స్వయం ఉపాధిపై దృష్టిపెట్టక అల్ప ఉద్యోగితను మరియు నిరుద్యోగితను ఎదుర్కొనుచున్నారు. విద్యాధికులైన యువకులలో ఉద్యమిత్వ సామర్థ్యము కొరవడి అతితక్కువ వేతనాలకు ప్రభుత్వ ఉద్యోగాల కొరకు సంవత్సరముల తరబడి నిరీక్షిస్తూ నిరుద్యోగితను అనుభవిస్తున్నారు.

9. కుటీర పరిశ్రమలు క్షీణించుట: గ్రామీణ ప్రాంత భూమిలేని ప్రజలకు కుటీర పరిశ్రమలు ఉపాధిని కల్పించింది. జీవనోపాధి కొరకు ఎక్కువ మంది ఆధారపడే కుటీర పరిశ్రమలు పారిశ్రామికీకరణ ఫలితంగా క్షీణించినవి. అధునాతన పారిశ్రామిక ఉత్పత్తులలో కుటీరపరిశ్రమల ఉత్పత్తులు పోటీపడలేకుండుట దీనికి కారణము. దీని ఫలితంగా ఈ పరిశ్రమలపై ఆధారపడిన వారు ఉపాధిని కోల్పోయి నిరుద్యోగులుగా ఉన్నారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

నిరుద్యోగిత – నివారణ చర్యలు:
నిరుద్యోగ సమస్య స్వభావాన్ని, తీవ్రతను, వీటి కారణాలను విశ్లేషించిన అనంతరం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలను, ప్రభుత్వ స్పందనను పరిశీలించాలి.
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 9

1. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి: నూతన ఆర్థిక విధానాలను ప్రోత్సహించి, పెట్టుబడులను పెంచి ఆర్ధికాభివృద్ధిని వేగవంతము చేయాలి. పారిశ్రామిక రంగంలో ఉపాధిని పెంచుట ద్వారా వ్యవసాయరంగంపై ఒత్తిడిని తగ్గించి గ్రామీణ నిరుద్యోగితను అరికట్టవచ్చును.

2. స్వయం ఉపాధికి విరివిరిగా రుణాలిచ్చుట ఉద్యమిత్వ సామర్థ్యము కలిగిన విద్యాధికులు స్వతహాగా. నిర్వహించే పరిశ్రమలు, సేవలరంగానికి విరివిగా రుణసౌకర్యాలను కల్పించిన నిరుద్యోగితను అరికట్టవచ్చును.

3. చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించుట: చిన్నతరహా పరిశ్రమలు శ్రమ సాంద్రతమైనది. ప్రభుత్వము పెద్దపరిశ్రమలతో పోటీని నివారించుటకు కొన్ని వస్తువుల ఉత్పత్తిని చిన్నతరహా పరిశ్రమలకు రిజర్వుచేయాలి.

4. ప్రభుత్వ ప్రధాన ఉద్యోగితా పథకాలు: భారత ప్రభుత్వము దేశం ఎదుర్కొనే ప్రధాన సమస్య అయిన నిరుద్యోగితను తొలగించాలనే ధృడ సంకల్పముతో అనేక ఉద్యోగితా పథకాలను అమలు చేస్తుంది.

  1. సమీకృత గ్రామీణాభివృద్ధి పధకము (IRDP): ఈ పధకాన్ని 1978 – 79లో స్వయం ఉపాధి లక్ష్యంగా ప్రవేశపెట్టబడినది.
  2. స్వయం ఉపాధికోసం గ్రామీణ యువత శిక్షణ పథకము (TRYSEM): గ్రామీణ యువత ఎదుర్కొనే నిరుద్యోగితను తొలగించడానికి 1979 సంవత్సరములో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడమైనది.
  3. జవహర్ రోజ్ గార్ యోజన (JRY): దేశంలో బాగా వెనుకబడిన 120 జిల్లాల్లో ఉపాధిని పెంచుటకు ఫిబ్రవరి 1989లో ఈ పథకం ప్రారంభించబడినది.
  4. జాతీయ గ్రామీణ ఉపాధి పథకము (NREP): వ్యవసాయ పనులు లేనికాలంలో గ్రామీణ జనాభాకు వేతనం, ఉద్యోగితను కల్పించే లక్ష్యంతో 6వ పంచవర్ష ప్రణాళికలో దీనిని ప్రవేశపెట్టడమైనది.
  5. దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన (DDUGKY): పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 98వ జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 25, 2014న ఈ పథకము ప్రారంభించబడినది. మేధావంతులైన గ్రామీణయువతకు ఉద్యోగితను కల్పించుట ఈ పథకము ఉద్దేశ్యము.

ప్రశ్న 8.
భారతదేశములో పేదరికాన్ని నివారించుటలో సూక్ష్మ విత్త పాత్రను వివరింపుము.
జవాబు:
సూక్ష్మవిత్త ఆవశ్యకత ప్రపంచబ్యాంకు పరిశోధన ప్రకారము ప్రపంచములో 1/3వ వంతు పేదవారు భారతదేశంలో ఉన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పేదరిక నిర్మూలన పథకములు అమలుచేస్తున్నప్పటికీ, సూక్ష్మవిత్తము యొక్క పాత్ర మనదేశంలో ఎక్కువ. గత కొన్ని దశాబ్దాలుగా పేదరిక నిర్మూలనలో సూక్ష్మవిత్తము ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నది. సూక్ష్మవిత్తము ద్వారా ప్రజలు అధిక ఆదాయాన్ని పొందుతూ జీవన ప్రమాణస్థాయిని పెంచుకొంటున్నారని అనేక నివేదికలు భారతదేశములో తెలియజేస్తున్నాయి.

బ్యాంకుల స్థానంలో సూక్ష్మవిత్త సంస్థలు పేదవారికి మెరుగైన సేవలను అందిస్తున్నాయి. ఈ సంస్థలు విత్తేతర సేవలను శిక్షణ, కౌన్సిలింగ్, భీమా మొదలగునవి కూడా ప్రజలకు అందిస్తున్నాయి. ఋణగ్రహీతల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా తిరిగి చెల్లింపులు ఉంటూ వారి ఇంటి వద్దకే సేవలను అందిస్తున్నాయి. ‘ఇవి వాణిజ్య బ్యాంకులకన్నా ఎక్కువ వడ్డీని వసూలు చేస్తున్నాయి.

సూక్ష్మవిత్త మార్గాలు (Channels of Micro finance):
1. స్వయం సహాయక సమూహం (Self Help Group): జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకుచే ప్రోత్సాహించబడి, బ్యాంకు ద్వారా సూక్ష్మపరపతిని అందించుట. సాధారణంగా 10 నుంచి 15 మంది స్త్రీలు ఒక స్వయం సహాయక సమూహముగా ఏర్పడుట. బృందంలోని సభ్యులంతా తరచు కొంతమొత్తాన్ని పొదుపుచేసి అందునుంచి అవసరనిమిత్తము రుణాలు పొందుట. ఈ విధానము బహుళ ప్రాచుర్యము పొందినది. స్వయం సహాయక బృందాలు స్వయం పోషక స్థాయికి ఎదిగిన స్వచ్ఛంద సంస్థలు (Non Government Organization) మరియు భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (SIDBI) సహకారముతో స్వంతంగా మనుగడను కొనసాగించగలవు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

2. సూక్ష్మవిత్త సంస్థలు: సూక్ష్మవిత్త సహాయాన్ని అందించుట ఈ సంస్థల ముఖ్య లక్ష్యము బృంద సమిష్ఠి జవాబుదారితనాన్ని ఆధారంగా చేసుకొని రుణాల్విడము జరుగును. పరస్పర హామీ పద్ధతిలో వ్యక్తిగత లేదా గ్రూప్ అవసరాలకు అనియత (Informal) పద్ధతిలో 5 నుండి 10 మంది సభ్యులు కలిగిన సమిష్టి జవాబుదారితనము కలిగిన సమూహము బ్యాంకు రుణాలను పొందును.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలో నిరుద్యోగ వ్యాప్తి.
జవాబు:
భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో నిరుద్యోగ సమస్య ఒకటి. అమలులో ఉన్న వేతనం రేటుకు ఇష్టపడి పనిచేయటానికి సిద్ధపడినప్పుడు వారికి పని దొరకని స్థితిని నిరుద్యోగితగా నిర్వచించవచ్చు. భారతదేశంలో 1983 నుంచి 2012 సం॥ల మధ్య నిరుద్యోగిత రేటు సగటున 7.58 శాతంగా ఉన్నది. 2009 సంవత్సరమున నిరుద్యోగిత రేటు గరిష్టంగా 9.4 శాతంగాను, 2012 సంవత్సరము నిరుద్యోగిత రేటు తక్కువ స్థాయిలో అనగా 5.20 శాతంగా ఉంది.

భారతదేశంలో సాధారణ స్థితి నిరుద్యోగిత 1977-78వ సంవత్సరములో 4.23% ఉండగా ఇది 1999-2000 సంవత్సరం నాటికి 2.81 శాతమునకు తగ్గినది. తిరిగి 2004-05 సంవత్సరం నాటికి సాధారణ స్థితి నిరుద్యోగిత 3.06 శాతమునకు పెరిగినది. 2011-12 నాటికి సాధారణ స్థితి నిరుద్యోగిత 2.7% అంచనా వేయబడినది.
మనదేశంలో వర్తమాన రోజువారి స్థితి నిరుద్యోగిత 1977-78వ సం||న 8.18 శాతంగా ఉన్నది. ఈ నిరుద్యోగిత 2004-05 సం॥నాటికి తిరిగి 8.28 శాతమునకు పెరిగింది.

ప్రశ్న 2.
వివిధ రకాలైన పేదరిక భావనలు వివరించండి. [Mar ’16]
జవాబు:
పేదరికం ఒక సాంఘీక ఆర్థిక సమస్య. సమాజంలో ఒక వర్గం వారు కనీస అవసరాలైన ఆహారము, గృహము, వస్త్రము పొందలేని పరిస్థితిని పేదరికం అంటారు. భారతదేశంలో 2013వ సం॥ మొత్తం జనాభాలో 230 మిలియన్ల ప్రజలు అనగా 17.59% మంది పేదరిక రేఖకు దిగువన ఉన్నారు.

పేదరికపు భావనలు:
1. నిరపేక్ష పేదరికం: సమాజంలో కనీస జీవన అవసరాలు కూడా పొందలేని వారిని నిరపేక్ష పేదవారుగా పేర్కొంటాము. నిర్ణయించిన కనీస ఆదాయం లేదా వినియోగ వ్యయాన్ని కూడా పొందలేని వారిని నిరపేక్ష పేదవారుగా చెప్పవచ్చు.

2. సాపేక్ష పేదరికం: దీనిని ఆదాయ అసమానతలను ఆధారంగా చేసుకొని చెప్పవచ్చు. దేశంలో అధిక ఆదాయ వర్గ ప్రజలతో పోల్చుకొని తక్కువ ఆదాయంతో కనీస వసతులు మాత్రమే పొందేవారిని సాపేక్ష పేదవారుగా చెప్పవచ్చు.

3. దారిద్ర్యపు రేఖ: పేదరికాన్ని కొలవడానికి పేదరిక గీత అనే భావనను ఉపయోగిస్తారు. దేశంలోని ప్రజల కనీస అవసరాల వినియోగ వ్యయాన్ని అంచనావేసి, దాని కన్నా తక్కువ వినియోగ వ్యయాన్ని కల్గిన ప్రజలందరు, పేదరిక రేఖకు దిగువన ఉన్నట్లు చెప్పవచ్చును. పేదరిక గీతను నిర్ధారించుటకు దోహదపడే అంశాలు.

  1. కనీస జీవన వినియోగ స్థాయి
  2. కనీస పోషక పదార్థాల వ్యయం
  3. తలసరి, నెలసరి వినియోగ వ్యయం

ప్రశ్న 3.
వివిధ రకాలైన నిరుద్యోగాలు. [Mar ’17]
జవాబు:
నిరుద్యోగాన్ని నిర్వచించడం చాలా కష్టం. వ్యక్తి పనిచేయాలనే కోరిక ఉన్నప్పటికీ పని కల్పించలేక పోవడాన్ని నిరుద్యోగితగా పేర్కొంటారు. భారతదేశంలో నిరుద్యోగిత ఎక్కువగా వ్యవస్థాపరమైనది.
నిరుద్యోగితను ప్రధానంగా 1. పట్టణ ప్రాంత నిరుద్యోగిత (2) గ్రామీణ ప్రాంత నిరుద్యోగిత అని రెండు రకాలుగా పేర్కొనవచ్చు.
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 10
I. పట్టణ ప్రాంత నిరుద్యోగిత: పట్టణ ప్రాంతంలో వ్యవసాయేతర రంగాల ప్రాధాన్యత ఎక్కువ. ఈ ప్రాంతంలో
రెండు రకాల నిరుద్యోగిత కనిపించును.

  1. విద్యావంతులలో నిరుద్యోగిత: లోపభూయిష్ట విద్యావిధానము, సృజనాత్మకత కొరవడం, సాంకేతిక విద్యలో వెనుకబడుట, డిమాండ్కు తగిన నైపుణ్యాలు కల్పించలేకపోవటం విద్యావంతులలో నిరుద్యోగిత అధికముగా ఉన్నది.
  2. పారిశ్రామిక నిరుద్యోగిత: మనదేశంలో పారిశ్రామిక రంగం వృద్ధి చెందుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఉద్యోగ కల్పన చేయలేక పోవుచున్నది. దీనికి కారణం వృద్ధిరేటు కన్నా జనాభా మరియు శ్రామిక సప్లయి పెరగడం. పట్టణాలు, దాని సమీప ప్రాంతాలలో కుటీర, చిన్నతరహా పరిశ్రమలు క్షీణించుట పారిశ్రామిక నిరుద్యోగితకు కారణం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

II. గ్రామీణ ప్రాంత నిరుద్యోగిత: ఇది కూడా రెండు రకాలు.
1. ఋతుసంబంధమైన నిరుద్యోగం: మనదేశంలో ఈ రకమైన నిరుద్యోగిత వ్యవసాయరంగంలో కనిపిస్తుంది. వ్యవసాయ కార్యక్రమాలు ఋతు సంబంధంగా ఉండటమే ఇందుకు కారణము. వ్యవసాయ కార్మికులకు నాట్లు, కోతల సమయంలోనే పనిదొరుకుతుంది. మిగతా సమయంలో నిరుద్యోగులుగా ఉంటారు. సం॥లో 6 నుండి 8 మాసాలు మాత్రమే పని దొరుకుతుంది.

2. ప్రచ్ఛన నిరుద్యోగం: ఇది కూడా మనదేశంలో వ్యవసాయ రంగంలో కనిపించును. వ్యవసాయ రంగంలో అవసరానికి మించి ఎక్కువ మంది పనిచేస్తుంటారు. వీరిని పనినుండి తొలగించినప్పటికీ ఉత్పత్తిలో ఎటువంటి తగ్గుదల ఉండదు. వీరి ఉపాంత ఉత్పాదకత శూన్యం. దీనినే ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు.

III. ఇతర నిరుద్యోగాలు:

  1. చక్రీయ నిరుద్యోగం: అభివృద్ధి చెందిన దేశాలలో ఈ నిరుద్యోగిత కనిపించును. కీన్స్ ప్రకారం సార్థక డిమాండ్ కొరతవల్ల చక్రీయ నిరుద్యోగిత ఏర్పడును.
  2. వ్యవస్థాపరమైన నిరుద్యోగం: శ్రామిక మార్కెట్ పనిచేయడానికి సిద్దంగా ఉన్న వారందరికి పనిని కల్పించలేకపోవడం వ్యవస్థాపరమైన నిరుద్యోగం. ఇది జనాభా అధికంగా ఉండే మనలాంటి దేశాలలో ఉంటుంది. దీనినే బహిరంగ నిరుద్యోగిత అంటారు.
  3. అల్ప ఉద్యోగిత: ఒక వ్యక్తి తన ఉత్పాదక శక్తి కంటే తక్కువ స్థాయిలో పనుల్లో పనిచేయటాన్ని అల్ప ఉద్యోగిత అంటారు. ఉదా॥ ఇంజనీరింగు పూర్తిచేసిన వారు ప్రైవేటు స్కూల్లో గుమస్తాగా పనిచేయడం.
  4. సంఘృష్ట నిరుద్యోగం: శ్రామికులు ఒక వృత్తి నుంచి మరొక వృత్తికి మార్పు చెందే కాలంలో ఏర్పడిన నిరుద్యోగితను సంఘృష్ట లేదా ఘర్షణ నిరుద్యోగిత అంటారు.

ప్రశ్న 4.
ఉపాధి హామీ పథకాన్ని గూర్చి సంక్షిప్తంగా వ్రాయుము.
జవాబు:
దీనినే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉద్యోగ హామీ పథకం (MGNREGS) అంటారు. దీనిని అక్టోబర్ 2, 2009న ఈ పథకం ప్రారంభించారు. ప్రతి గ్రామీణ కుటుంబంలో ఒకరికి నైపుణ్య రహిత పనులు చేయటకు అర్థిక సంవత్సరంలో 100 రోజులు వేతన ఉద్యోగితను కల్పించుట ఈ పథకం ఉద్దేశ్యం: 33 శాతం మంది లబ్ధిదారులు ఖచ్ఛితంగా స్త్రీలు ఉండాలి. బాంకులు, పోస్టాఫీసుల ద్వారా వేతనాలు ఇవ్వబడును. రోజుకు రూ.100/- వేతనం ఇవ్వబడును. నీటి సంరక్షణ, కరువు నివారణ పనులు, భూమి అభివృద్ధి మొదలగు పనుల నిర్వహణలో ఉపాధి కల్పన. ఈ పథకం క్రింద 2012-13లో 39,661 కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టి 229.93 కోట్ల పనిదినాలు కల్పించబడినవి.

ప్రశ్న 5.
దీనదయాళ్ ఉపాధ్యాయ కౌశల యోజన గూర్చి సంక్షిప్తంగా వ్రాయండి.
జవాబు:
దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన (DDUGKY): పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 98వ జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 25, 2014న ఈ పథకము ప్రారంభించబడినది. మేధావంతులైన గ్రామీణ యువతకు ఉద్యోగితను కల్పించుట ఈ పథకము ఉద్దేశ్యము వీరికి ఉద్యోగాలను కల్పించుటకు భారత ప్రభుత్వము నైపుణ్యాల అభివృద్ధి పథకము (skill development scheme)ను ప్రారంభించినది.

DDUGKY ప్రధాన లక్షణాలు:
– 2017 నాటికి 10 లక్షల గ్రామీణ యువతకు ఉద్యోగితను పొందే విధంగా తర్ఫీదు ఇచ్చుట.
ఈ పథకము క్రిందికి రావటానికి కనీస వయసు 15 సంవత్సరములు.
గ్రామీణ ప్రాంత నిరుద్యోగ సమస్యను అధిగమించుటకు నైపుణ్యాభివృద్ధి తర్ఫీదు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యాలను అందిస్తూ ప్రధానమంత్రి “భారతదేశంలో తయారీ”కి తోడ్పడాలి.
2015 – 16 బడ్జెట్లో ఈ పథకానికి 1500 కోట్ల రూపాయలు కేటాయించుట. నిరుద్యోగితను తగ్గించగలదనుటలో సందేహము లేదు.

ప్రశ్న 6.
సూక్ష్మ విత్తము.
జవాబు:
1976 సం॥లో బంగ్లాదేశ్కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయుట ద్వారా ఆధునిక సూక్ష్మ విత్తానికి పునాది వేయడము జరిగినది. భారతదేశంలో ప్రభుత్వేతర సంస్థలుగా (NGOs) సూక్ష్మ ఆర్థిక సంస్థలు అమలులో ఉన్నాయి. బాంకింగేతర విత్త సంస్థలు, వాణిజ్యబాంకులు, ప్రాంతీయ గ్రామీణ బాంకులు, సహకారసంస్థలు పెద్ద స్థాయి గల రుణదాతలు మొదలైన 25 కంపెనీలు సూక్ష్మవిత్త సంస్థలకు పునర్విత్త సహాయాన్ని అందిస్తున్నాయి.

అల్పాదాయ వర్గాల వారికి బాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశము తక్కువ. స్వయం ఉపాధికి మరియు వినియోగ ఖర్చులకు విత్త సేవలను అందించుట సూక్ష్మవిత్త ఉద్దేశ్యము. పట్టణాల్లో, గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణస్థాయిని పెంచడానికి రుణము, పొదుపు, భీమా మొదలగు విత్తపరమైన శిక్షణ మరియు కౌన్సిలింగ్ వంటి విత్తేతర సేవలను సూక్ష్మవిత్తం అంటారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

సూక్ష్మవిత్త లక్షణాలు:

  • రుణాలు పొందేవారు అల్పాదాయ వర్గాలుగా ఉండాలి.
  • రుణాలు చిన్న మొత్తంలో ఉంటాయి.
  • రుణ కాలవ్యవధి చాలా తక్కువ.
  • రుణాలు పొందడానికి అదనపు హామీ లేదా భద్రత అవసరములేదు.
  • తరచూ ఋణాలు తిరిగి చెల్లించుట ఎక్కువ సార్లుగా ఉంటుంది (Repayment of Loans).
  • ఆదాయ పెంపుదలకు సాధారణముగా రుణాలు ఇవ్వబడును.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.
జవాబు:
వ్యవసాయ పనులు లేని కాలంలో గ్రామీణ జనాభాకు వేతన ఉద్యోగితను కల్పించే లక్ష్యంతో 6వ పంచవర్ష ప్రణాళికలో దీనిని ప్రవేశపెట్టడమైనది.

ప్రశ్న 2.
సాపేక్ష పేదరికం.
జవాబు:
అధిక ఆదాయ వర్గాల వినియోగ వ్యయంతో అల్పాదాయ వర్గాల వారి వినియోగ వ్యయం పోల్చి చెప్పటం. అభివృద్ధి చెందిన దేశాలలో ఇటువంటి పేదరికం ఉంటుంది.

ప్రశ్న 3.
TRYSEM. [Mar ’16]
జవాబు:
స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువత శిక్షణ పథకం: ఈ పథకాన్ని గ్రామీణ యువత ఎదుర్కొనే నిరుద్యోగితను తొలగించడానికి 1979 సం॥లో ప్రవేశపెట్టారు. సంవత్సరానికి 2 లక్షల యువతకు స్వయం ఉపాధి లక్ష్యంగా ఈ పథకం ఉద్దేశించబడినది.

ప్రశ్న 4.
ప్రచ్ఛన్న నిరుద్యోగిత.
జవాబు:
ఈ నిరుద్యోగిత మనలాంటి దేశాలలో వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. అవసరాన్ని కన్నా ఎక్కువమంది పనిచేయటం వారిని పనినుండి తొలగించిన ఉత్పత్తిలో ఎటువంటి తగ్గుదల ఉండదు. వారి ఉపాంత ఉత్పాదకత శూన్యముగా ఉంటుంది.

ప్రశ్న 5.
పేదరిక వ్యత్యాస సూచిక.
జవాబు:
పేదరిక రేఖ కన్నా దిగువ సగటు వినియోగ స్థాయికి మధ్య ఉన్న అనుపాత స్థాయిని పేదరిక వ్యత్యాసంగా పేర్కొంటారు. పేదవారి ఆదాయాన్ని పెంచి వారిని పేదరికరేఖ వద్దకు చేర్చి పేదరికాన్ని తొలగించడాన్ని పేదరిక వ్యత్యాసం తెలుపుతుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 11

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

ప్రశ్న 6.
సాధారణ స్థితి నిరుద్యోగిత.
జవాబు:
సంవత్సరము మొత్తం కాలంలో నిరుద్యోగులుగా ఉన్న వారిని సాధారణ స్థితి నిరుద్యోగిత అంటారు.

ప్రశ్న 7.
నిరపేక్ష పేదరికం.
జవాబు:
కనీస అవసరాలైన ఆహారం, బట్టలు, వసతి గృహం లేని వారిని నిరపేక్ష పేదరికం అంటారు. భారతదేశంలోని | పేదరికము నిరపేక్ష పేదరికం.

ప్రశ్న 8.
సూక్ష్మ విత్తం.
జవాబు:
1976వ సంవత్సరములో బంగ్లాదేశ్కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ సూక్ష్మ విత్తానికి పునాది వేయడం జరిగింది. పేద ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచటానికి తక్కువ మొత్తంలో రుణం, విత్తపరమైన సేవలు, పొదుపును ప్రోత్సహించాడు.

ప్రశ్న 9.
తలసరి ఆదాయం.
జవాబు:
ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. ఒక దేశ జాతీయాదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించగా వచ్చే దానిని తలసరి ఆదాయం అంటారు.
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 12

ప్రశ్న 10.
దారిద్ర్యరేఖ.
జవాబు:
పేదరికాన్ని కొలవడానికి ‘పేదరిక గీత’ అనే భావనను ఆర్థికవేత్తలు ఉపయోగిస్తారు. గ్రామీణ ప్రజలు తలసరి ఆహారధాన్యాల వినియోగం రోజుకు 2,400 కాలరీలు, పట్టణ ప్రజల తలసరి ఆహారధాన్యాల వినియోగం రోజుకు 2,100 కాలరీలు కూడా పొందలేని వారు పేదరిక రేఖకు క్రిందన ఉన్నారు.

ప్రశ్న 11.
సంఘృష్ట నిరుద్యోగిత.
జవాబు:
శ్రామికులు ఒక వృత్తి నుంచి వేరొక వృత్తికి మార్పుచెందే కాలంలో ఏర్పడిన నిరుద్యోగితను సంఘృష్ట నిరుద్యోగిత అంటారు. శ్రామికులకు ఉద్యోగ అవకాశాల గురించి సరియైన అవగాహన లేకపోవడం వల్ల ఈ నిరుద్యోగిత ఏర్పడును.

ప్రశ్న 12.
అల్ప ఉద్యోగిత.
జవాబు:
ఒక వ్యక్తి తన ఉత్పాదక శక్తి కంటే తక్కువ స్థాయి పనుల్లో పనిచేయటాన్ని అల్ప ఉద్యోగిత అంటారు. పూర్తి స్థాయిలో పనిచేసే శక్తి ఉండి పార్టెమ్ పనిని నిర్వర్తించడంను అల్ప ఉద్యోగిత అంటారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

ప్రశ్న 13.
చక్రీయ నిరుద్యోగిత.
జవాబు:
ఆర్థిక కార్యకలాపాలలో వచ్చే చక్రీయ మార్పులు ఈ నిరుద్యోగితకు కారణం. అభివృద్ధి చెందిన దేశాలలో వ్యాపార కార్యకలాపాల్లో మందకొడితనం ఏర్పడటం వల్ల సాధారణంగా ఏర్పడే నిరుద్యోగితను చక్రీయ నిరుద్యోగిత అంటారు.