Students can go through AP Inter 2nd Year History Notes 10th Lesson జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్ will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year History Notes 10th Lesson జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్
→ ఆధునిక చరిత్రలో ఇటలీ, జర్మనీలలో ఏకీకరణ ఉద్యమాలు జరగడం ఒక చర్రితాత్మక సంఘటన.
→ ఉత్తర ఇటలీ ఆస్ట్రియా ఆధీనంలోను, మధ్య ఇటలీ పోప్ ఆధీనంలో దక్షిణ ఇటలీలు బూరన్ ల ఆధిపత్యం క్రింద ఉంది.
→ జోసెఫ్ మాజిని 1831లో ‘యంగ్ ఇటలీ’ అనే సంస్థను స్థాపించాడు.
→ కౌంట్ కపూర్ లీడ్మాంట్ నాయకత్వంలో ఇటలీ ఏకీకరణ సాధ్యమవుతుందని బలంగా నమ్మి రాజ్యాంగబద్ధ రాజరికం స్థాపించాలని ఆశించాడు.
→ ఫ్రాన్స్, ఇంగ్లాండ్లకు ఇటలీ చేసిన సేవలకు గుర్తుగా 3వ నెపోలియన్, కవూర్ను ఫ్లాంబియర్స్కు ఆహ్వానించి ఆస్ట్రియాతో యుద్ధానికి కుట్ర పన్ని ఇటలీ నుండి తరిమివేయడానికి అంగీకరించాడు.
→ గారిబాల్డి రెడ్ఆర్ట్స్’ అనే స్వచ్ఛంద సైనిక దళాన్ని నిర్మించి సిసిలీ ప్రజలకు అండగా నిలిచాడు.
→ గారిబాల్డి ప్రజాస్వామిక వాది, అంతకు మించిన గొప్ప దేశభక్తుడు. జాతీయ సమైక్యత కోసం స్వప్రయోజనాన్ని ప్రక్కన పెట్టి సిసిలీ రాజ్యాన్ని విక్టర్ ఇమ్మాన్యుయేల్కు అప్పగించాడు.
→మొదటి నెపోలియన్ జర్మనీలో జాతీయతా భావం, ప్రజాస్వామ్యాలకు బీజం వేసాడు. జర్మనీలో పవిత్రరోమన్ సామ్రాజ్యాన్ని రద్దు చేసాడు.
→ 1830లో ఫ్రాన్స్ జరిగిన విప్లవం జర్మనీలకు ప్రేరణ కలిగించింది. జర్మనీ ఐకమత్యానికి జర్మన్లు వారి పాలకులపై తిరుగుబాట్లు చేసారు.
→ 1819లో 12 జర్మన్ రాష్ట్రాలతో ప్రష్యా ఏర్పరచిన వర్తక సుంకాల సంస్థ జోల్వెరిన్,
→ ప్రష్యారాజు ఫ్రెడరిక్ విలియం విప్లవకారులు కోరిన ప్రకారం ఉదార రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు.
→ 1848 సంవత్సరంలో ఎన్నుకున్న జర్మన్ జాతీయ అసెంబ్లీని ఫ్రాంక్ఫర్ట్ అసెంబ్లీ అంటారు.
→ కఠిన దండనీతి Policy of Blood and Iron మాత్రమే జర్మనీ ఏకీకరణకు పరిష్కారం అని బిస్మార్క్ భావించాడు. దీనినే రక్తపాత విధానం అన్నారు.