Students can go through AP Inter 2nd Year History Notes 9th Lesson పారిశ్రామిక విప్లవం will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year History Notes 9th Lesson పారిశ్రామిక విప్లవం
→ మానవ జాతిని ఆధునిక యుగంలో ప్రవేశపెట్టిన రెండు ప్రధాన సంఘటనలలో ఒకటి ఫ్రెంచి విప్లవం, రెండవది పారిశ్రామిక విప్లవం.
→ 18వ శతాబ్దం ద్వితీయార్థంలోను, 19వ శతాబ్దం ప్రథమార్థంలో బ్రిటిష్ వస్తూత్పత్తి స్వభావ, పరిమాణంలో వచ్చిన అనూహ్యమైన మార్పును పారిశ్రామిక విప్లవం అంటారు.
→ ఆర్నాల్డ్ టాయిన్బీ అనే తత్త్వవేత్త తొలిసారిగా పారిశ్రామిక విప్లవం’ అనే పదాన్ని వాడాడు.
→ ఆవిరి యంత్రం కనుగొన్నాక కర్మాగారాలన్నీ బొగ్గు లభించే ప్రాంతాలలో ఏర్పాటయ్యాయి.
→ పరిశ్రమలలో యాంత్రీకరణ వలన పెట్టుబడిదారీ వ్యవస్థ ఏర్పడింది.
→ శాస్త్ర విజ్ఞానం సమాజంలో కలిసిపోవడంతో పాశ్చాత్య ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం సంభవించింది.
→ ఇనుము, బొగ్గు, వస్త్రాల పరిశ్రమ ఆధారంగా ప్రపంచమంతా అనుకరించే నూతన నాగరికతను ఇంగ్లాండ్ రూపొందించింది అని ‘ఫిషర్’ ప్రబోధించాడు.
→ 18వ శతాబ్దం నాటికి ఇంగ్లాండ్ సముద్ర వర్తకంలో ఆధిక్యత నెలకొల్పింది.
→ 1780 నుండి వస్త్ర పరిశ్రమ బ్రిటిష్ పారిశ్రామికీకరణకు చిహ్నంగా మారింది.
→ 18వ శతాబ్దంలో ప్రధాన ఇంధన వనరుగా ఉపయోగపడింది బొగ్గు.
→ ప్రాఫెరాకి చెందిన డరీలు యాభై సంవత్సరాలు కృషి చేసి మిశ్రమలోహ పరిశ్రమలో విప్లవం తెచ్చారు.
→ 1779లో కోల్యూల్ వద్ద పెవర్న్ నదిపై ప్రపంచంలో తొలిసారిగా ఇనుప వంతెన నిర్మించారు.
→ హంపిదేవి సేఫ్టీ లాంబన్ను కనుగొనడంతో గనులలో ప్రమాదాలు నివారించడం సాధ్యపడింది. దీనితో అధిక మొత్తంలో గనుల నుండి ఇనుము, బొగ్గు ఉత్పత్తి చేయడం సాధ్యపడింది.
→ 1769లో జేమ్స్ వాట్ ఆవిరి యంత్రాన్ని రూపొందించాడు.
→ ఆవిరి శక్తి అందుబాటులోకి రావడంతో గణనీయమైన పారిశ్రామికీకరణ సాధ్యపడింది.
→ ఇంగ్లాండ్లో కాలువలు తర్వాత రైల్వేలు సరుకులను, ప్రజలను చేరవేసే రవాణా సాధనాలుగా మారాయి.
→ పారిశ్రామిక విప్లవం ఫలితంగా ఇంగ్లండ్ ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా మారింది.
→ పారిశ్రామిక విప్లవంతో సమాజంలో పెట్టుబడిదారి, శ్రామిక వ్యవస్థలు ఏర్పడ్డాయి.