AP Inter 2nd Year Maths 2A Formulas Chapter 4 సమీకరణ వాదం

Use these Inter 2nd Year Maths 2A Formulas PDF Chapter 4 సమీకరణ వాదం to solve questions creatively.

AP Intermediate 2nd Year Maths 2A సమీకరణ వాదం Formulas

→ n రుణేతర పూర్ణసంఖ్య; a0, a1, a2, ……, an లు వాస్తవ లేదా సంకీర్ణ సంఖ్యలు, an ≠ 0 అయితే, అప్పుడు f(x) = a0 xn + a1 xn-1 + a2 xn-2 + ….. + an సమాసాన్ని x లో nవ తరగతి బహుపది అంటాం.

→ f(x) = a0 xn + a1 xn-1 + a2 xn-2 + ….. + an = 0 సమీకరణాన్ని nవ తరగతి బీజీయ సమీకరణం లేదా బహుపది సమీకరణం అంటాం. ఇచ్చట a0 ≠ 0

→ f(α) = 0 అయితే, సంకీర్ణ సంఖ్య α ను బహుపది f(x) = 0 సమీకరణానికి మూలం అని అంటాం.

→ f(α) = 0 అయిన f(x) సమాసానికి (x – α) ఒక కారణాంకం అవుతుంది.

AP Inter 2nd Year Maths 2A Formulas Chapter 4 సమీకరణ వాదం

→ సమీకరణ మూలాలు, గుణకాల మధ్య సంబంధం:
(i) x3 + p1x2 + p2x + p3 = 0 సమీకరణ మూలాలు α1, α2, α3, అయితే, అప్పుడు

  • s1 = α1 + α2 + α3 = -p1
  • s2 = α1α2 + α2α3 + α3α1 = p2
  • s3 = α1α2α3 = -p3

(ii) x4 + p1x3 + p2x2 + p3x + p4 = 0 సమీకరణ మూలాలు α1, α2, α3, α4 అయిన, అప్పుడు

  • s1 = α1 + α2 + α3 + α4 = -p1
  • s2 = α1α2 + α2α3 + α3α4 + α1α3 + α1α4 + α2α4 = p2
  • s3 = α1α2α3 + α2α3α4 + α3α4α1 + α1α2α4 = -p3
  • s4 = α1α2α3α4 = p4

→ ఒక ఘన సమీకరణ మూలాలు

  • అంకశ్రేఢిలో ఉంటే వాటిని a – d, a, a + d గా తీసుకొంటాం.
  • గుణశ్రేఢిలో ఉంటే \(\frac{a}{r}\), a, ar గా తీసుకుంటాం.
  • హరాత్మక శ్రేఢిలో ఉంటే వాటిని \(\frac{1}{a-d}, \frac{1}{a}, \frac{1}{a+d}\) గా తీసుకొంటాం.

→ ఒక ద్వివర్గ సమీకరణ మూలాలు

  • అంకశ్రేఢిలో ఉంటే వాటిని a – 3d, a – d, a + d, a + 3d గా తీసుకొంటాం.
  • గుణశ్రేఢిలో ఉంటే వాటిని \(\frac{a}{r^3}, \frac{a}{r}\), ar, ar3 గా తీసుకొంటాం.
  • హరాత్మక శ్రేఢిలో ఉంటే వాటిని \(\frac{1}{a-3 d}, \frac{1}{a-d}, \frac{1}{a+d}, \frac{1}{a+3 d}\) గా తీసుకొంటాం.

→ వాస్తవ సంఖ్యలు గుణకాలుగా గల బహుపదీయ సమీకరణానికి సంకీర్ణ మూలాలు సంయుగ్మంగా ఉంటాయి.

AP Inter 2nd Year Maths 2A Formulas Chapter 4 సమీకరణ వాదం

→ అకరణీయ సంఖ్యలు గుణకాలుగా గల బహుపదీయ సమీకరణానికి కరణీయ మూలాలు సంయుగ్మాలు.
ఉదా: 2 + √3 ఒక మూలమైతే, 2 – √3 కూడా మూలం అవుతుంది.

→ α1, α2, ….., αn లు f(x) = 0 కు మూలాలైన,

  • 1, -α2, ……, -αn లు మూలాలుగా గల బహుపది సమీకరణం f(-x) = 0 అవుతుంది.
  • 1, kα2, ….. kαn లు మూలాలుగా గల సమీకరణం f(\(\frac{x}{k}\)) = 0, (k ≠ 0)
  • \(\frac{1}{\alpha_1}, \frac{1}{\alpha_2}, \ldots \frac{1}{\alpha_n}\) లు మూలాలుగా గల సమీకరణం f(\(\frac{1}{x}\)) = 0
  • α1 + h, α2 + h, ……., αn + h లు మూలాలుగా గల సమీకరణం f(x – h) = 0
  • α1 – h, α2 – h, ……, αn – h లు మూలాలుగా గల సమీకరణం f(x + h) = 0
  • \(\alpha_1^2, \alpha_2^2, \ldots \alpha_n^2\) లు మూలాలుగా గల సమీకరణం f(√x) = 0

→ f(x) = p0 xn + p1 xn-1 + p2 xn-2 + …… + pn = 0 సమీకరణంలో రెండవ పదం తొలగింపు చేయటానికి f(x) = 0 ను f(x + h) = 0 గా రూపాంతరం చెందించాలి. ఇచ్చట h = \(\frac{-p_1}{\text { (n) } p_0}\) అవుతుంది.

→ f(x) = 0 బహుపది సమీకరణంలో x బదులు \(\frac{1}{x}\) ప్రతిక్షేపించినా, ఆ సమీకరణంలో మార్పు లేనట్లయితే f(x) = 0 ను వ్యుత్కృమ సమీకరణం (Reciprocal equation) అంటారు.

→ f(x) = 0 వ్యుత్కృమ సమీకరణంలోని గుణకాలన్నీ pi = pn-i (i = 0, 1, 2, …., n) పాటిస్తే మొదటి కోవకు (Class one) చెందిన వ్యుత్త మ సమీకరణమనీ; pi = -pn-i; పాటిస్తే రెండో కోవకు (Class two) చెందిన వృత్తమ సమీకరణమనీ అంటాం.

→ మొదటి కోవకు చెందిన బేసి వ్యుత్ప్రమ సమీకరణానికి -1 ఒక మూలం అవుతుంది. ఈ సందర్భంలో రెండో కోవకు చెందిన వ్యుతమ సమీకరణానికి 1 మూలం అవుతుంది.

AP Inter 2nd Year Maths 2A Formulas Chapter 4 సమీకరణ వాదం

→ రెండో కోవకు చెందిన సరిపరిమాణ వ్యుతమ సమీకరణానికి 1, -1 లు మూలాలు అవుతాయి.

→ f(x) = 0 సమీకరణం n వ తరగతికి చెందినదై, దానిలో ‘r’ వ పదాన్ని తొలగించటానికి దానిని f(x + h) = 0 కు రూపాంతరం చెందించిన, (h స్థిరాంకం) f(n-r+1) (h) = 0 కావలయును (i.e.,.) f(x) యొక్క (n – r + 1) వ అవకలనం x = h వద్ద సున్నా కావలయును.

→ f(x) = 0 మూలాన్ని కనుక్కోవటానికి f(x) = 0 ని తృప్తిపరిచే x విలువను కనుక్కోవాలి. కొన్ని సందర్భాలలో పరిశీలన ద్వారా ఈ పని చేయవచ్చు. ఈ పద్ధతిని యత్న-దోష పద్ధతి అంటాం.