Students can go through AP Inter 2nd Year Physics Notes 1st Lesson తరంగాలు will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Physics Notes 1st Lesson తరంగాలు
→ పదార్థము వాస్తవంగా కదలకుండా అలజడులను (శక్తులను) ప్రసారం చేసే వానిని తరంగాలు అంటారు.
→ యానకం కణాల కంపనాల ద్వారా శక్తి ప్రసారము జరిగే ప్రక్రియను తరంగ చలనం అంటారు.
→ తరంగం ప్రసార దిశకు యానకం కణాలు లంబంగా కంపిస్తే, వాటిని తిర్యక్ తరంగాలు అంటారు.
→ తరంగం ప్రసార దిశకు యానకం కణాలు సమాంతరంగా కంపిస్తే, వాటిని అనుదైర్ఘ్య తరంగాలు అంటారు.
→ కుడివైపు చలించు, పురోగామి తరంగ సమీకరణం y = a (sin ot – kx). ఇక్కడ x = స్థానభ్రంశం, ω = కోణీయ స్థానభ్రంశం, t = కాలం, k = తరంగ స్థిరాంకము.
→ తరంగాల అధ్యారోపణ నియమము : “రెండు లేదా అంతకన్నా ఎక్కువ తరంగాలు ఒకే దిశలో చలిస్తూ కలిస్తే, వాని ఫలిత స్థానభ్రంశం మొత్తం తరంగాల విడివిడి స్థానభ్రంశాల బీజీయ మొత్తంనకు సమానం.
→ తరంగాల అధ్యారోపణ సూత్రం, వ్యతికరణం, వివర్తనం, స్థిర తరంగాలు మరియు విస్పందనాలను వివరిస్తుంది.
→ యానకం చివర నుండి పురోగామి తరంగాలు పరావర్తనం చెందుతాయి. పరావర్తనం ఒక దృఢమైన సరిహద్దు వద్ద జరిగితే, పతన మరియు పరావర్తన తరంగాల మధ్య దశాభేదం 7 కు సమానం. తెరిచిన సరిహద్దు వద్ద పరావర్తన జరిగితే, పతన మరియు పరావర్తన తరంగాలు ఒకే దిశలో ఉంటాయి.
→ ఒకే కంపన పరిమితి మరియు పౌనఃపున్యం ఉన్న పతన మరియు పరావర్తన తరంగాలు పొడవుగల తీగవెంట వ్యతిరేక దిశలలో కలిస్తే, ఫలితంగా స్థిర తరంగం ఏర్పడును.
→ కంపిస్తున్న తీగ పౌనఃపున్యం v = \(\frac{\mathrm{P}}{2 l} \sqrt{\frac{\mathrm{T}}{\mathrm{m}}}\)
→ శూన్య కంపన పరిమితి స్థానాలను అస్పందనాలు అంటారు.
→ గరిష్ఠ కంపన పరిమితి స్థానాలను ప్రస్పందనాలు అంటారు.
→ వ్యవస్థలో సాధ్యమయ్యే తక్కువ సహజ పౌనఃపున్యంను ప్రాథమిక రీతి లేక మొదటి అనుస్వరం అంటారు.
→ బాహ్య పౌనఃపున్యం, సహజ పౌనఃపున్యంనకు దగ్గరగా ఉంటే అనునాదం ఏర్పడుతుంది.
→ T తన్యత, రేఖీయ సాంద్రత ఉన్న తంత్రి వేగం υ = \(\sqrt{\frac{\mathrm{T}}{\mu}}\)
→ B ఆయత గుణకం, p సాంద్రత ఉన్న ప్రవాహిలో ధ్వని వేగం, υ = \(\sqrt{\frac{B}{\rho}}\)
→ లోహ కడ్డీలో అనుదైర్ఘ్య తరంగాల వేగం, υ = \(\sqrt{\frac{Y}{\rho}}\)
→ రెండు వరుస అస్పందనాలు లేక ప్రస్పందనాల మధ్య దూరం కు సమానం.
→ రెండువైపులా దృఢంగా బిగించిన L పొడవుగల సాగదీసిన తీగ పౌనఃపున్యాలు v = \(\frac{\mathrm{nv}}{2 \mathrm{~L}}\), n = 1,2, 3, ……….
→ ఒకవైపు మూసి మరియొక వైపు తెరిచి ఉన్న L పొడవుగల గొట్టం పౌనఃపున్యాలు, v = \(\frac{\mathrm{nv}}{2 \mathrm{~L}}\) n = 1,2, 3, ……….
→ ఒక వస్తువును కంపింపచేసి, స్వేచ్ఛగా వదిలితే, అది చేసే కంపనాలను “సహజ కంపనాలు” అంటారు.
→ ఒక వస్తువు బాహ్య ఆవర్తన బల కంపనాల ప్రభావంతో కంపిస్తే, ఆ కంపనాలను బలాత్కృత కంపనాలు అంటారు.
→ సమీప పౌనఃపున్యాలు గల రెండు హరాత్మక ధ్వని తరంగాలు ఒకే దిశలో వ్యతికరణం చెంది, క్రమ ఆవర్తన కాలంలో ధ్వని వృద్ధి మరియు క్షీణత ఉన్న ధ్వనిని వింటాము. ఈ దృగ్విషయంను విస్పందనాలు అంటారు.
→ ధ్వని జనకం మరియు పరిశీలకుల మధ్య సాపేక్ష చలనం ఉంటే, పరిశీలకుడు వినే దృశ్య పౌనఃపున్యంలోని మార్పును డాప్లర్ ప్రభావం అంటారు.
→ యానకంలో ధ్వని వేగం, v = υλ ఇక్కడ v = \(\frac{1}{T}\)
→ తరంగ వేగం, υ = \(\frac{\omega}{\mathbf{k}}\)
→ తరంగ ప్రసార స్థిరాంకము, K = \(\frac{2 \pi}{\lambda}\)
→ కోణీయ వేగం ω = \(\frac{2 \pi}{\mathrm{T}}\) = 2πυ
→ ధన X-అక్షం దిశలో పురోగామి తరంగ సమీకరణం y = a.sin (ωt – kx). రుణ x అక్షం దిశలో y = a sin(ωt +kx)
→ అధ్యారోపణ సూత్రం నుండి ఫలిత తరంగం y = y1 + y2
→ స్థిర తరంగ సమీకరణం y = 2a sin kx cos ωt లేక y = 2a cos kx sin ωt.
→ సాగదీసిన తంత్రి లేక తీగలో
- తిర్యక్ కంపనాల వేగం υ = \(\sqrt{\frac{\mathrm{T}}{\mu}}\)
- ప్రాథమిక పౌనఃపున్య కంపనము, υ0 = \(\frac{1}{2 l} \sqrt{\frac{\mathrm{T}}{\mu}}\)
- అనుస్వరాల పౌనఃపున్యం, υp = \(\frac{\mathrm{P}}{2 l} \sqrt{\frac{\mathrm{T}}{\mu}}\) ఇక్కడ P అనుస్వరాల సంఖ్యను తెల్పుతుంది.
→ వేర్వేరు యానకంలలో న్యూటన్స్ ధ్వనివేగ సమీకరణము
- ఘన పదార్థంలో υs = \(\sqrt{\frac{Y}{\rho}}\)
- ద్రవ పదార్థంలో υl = \(\sqrt{\frac{K}{\rho}}\)
- వాయువులలో υg = \(\sqrt{\frac{\mathrm{P}}{\rho}}\)
→ వాయువులలో లాప్లాస్ ధ్వని వేగం ఫార్ములా
Y = ఘనపదార్థం యంగ్ గుణకం υg = \(\sqrt{\frac{\gamma \mathbf{P}}{\rho}}\)
k = ద్రవాల ఆయుత గుణకం మరియు P = వాయు పీడనం.
→ మూసిన గొట్టంలో
- ప్రాథమిక పౌనఃపున్యం వద్ద గొట్టం పొడవు l = \(\frac{\lambda}{4}\) ⇒ λ = 4l
- ప్రాథమిక పౌనఃపున్య కంపనము, v = \(\frac{v}{\lambda}=\frac{v}{4 l}\)
- మూసిన గొట్టంలో బేసి అనుస్వరాలను సపోర్టు చేయును. అనుస్వరాల పౌనఃపున్యాల నిష్పత్తి 1:3:5: ….. etc
→ తెరిచిన గొట్టంలో
- ప్రాథమిక పౌనఃపున్యం వద్ద గొట్టం పొడవు, l = \(\frac{\lambda}{2}\) ⇒ λ = 2l
- ప్రాథమిక పౌనఃపున్యం కంపనం, v0 = \(\frac{v}{\lambda}=\frac{v}{2 l}\)
- తెరిచిన గొట్టం సహజ సంఖ్యల అనుస్వరాలను సపోర్టు చేస్తుంది. అనుస్వరాల పౌనఃపున్యాల నిష్పత్తి 1:2:3: ……….. etc
→ విస్పందనాల పౌనఃపున్యం ΔV = v1 – v2
→ డాప్లర్ ప్రభావ సాధారణ సమీకరణం, v’ = \(\left[\frac{v \pm v_0}{v \pm v_s}\right]\)v
→ యానకం ధ్వని వేగం (v) ను పరిగణనలోకి తీసుకుంటే, దృశ్య పౌనఃపున్యం
v’ = \(\left[\frac{v \pm v_0 \pm v_m}{v \pm v_s \pm v_m}\right]\)v సంజ్ఞ సంప్రదాయం పాటిస్తుంది.