Students can go through AP Inter 2nd Year Physics Notes 13th Lesson పరమాణువులు will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Physics Notes 13th Lesson పరమాణువులు
→ J.J. థామ్సన్ పరమాణు నిర్మాణంను ప్రతిపాదించాడు.
→ థామ్సన్ ప్రతిపాదిత పరమాణు నమూనాను రూథర్ ఫర్డ్ మరియు నీల్బోర్లు మార్పు చేశారు.
→ రూథర్ ఫర్డ్ α – కణం పరిక్షేపణ ప్రయోగం కేంద్రకం ఉనికిని తెలుపుతుంది.
→ అత్యంత సామీప్యదూరంతో, కేంద్రకం పరిమాణంను లెక్కకట్టవచ్చు.
→ రూథర్వర్డ్ పరమాణు నమూనా పరమాణు స్థిరత్వంను మరియు పరమాణు రేఖా వర్ణపటంను వివరించలేదు.
→ పరమాణు స్థిరత్వంను మరియు పరమాణు రేఖావర్ణపటంను వివరించుటకు క్రొత్త నమూనాను బోర్ ప్రతిపాదించాడు.
→ బోర్ ప్రతిపాదన ప్రకారము ఎలక్ట్రాన్లు నిర్ధిష్ఠ వికిరణం ఉద్గారంలేనికక్ష్యలలో తిరుగుతాయి. mvr = \(\frac{\mathrm{nH}}{2 \pi}\)
→ వికిరణ ఉద్గారం లేని కక్ష్యలను స్థావర కక్ష్యలు అంటారు.
→ స్థావర కక్ష్యలలో ఎలక్ట్రాన్లు సమదూరంలో ఉండవు.
→ హైడ్రోజన్ పరమాణు మొదటి కక్ష్య వ్యాసార్థంను బోర్ వ్యాసార్థం అంటారు.
→ కక్ష్యలో ఎలక్ట్రాన్ మొత్తం శక్తి, ఆ కక్ష్యలో రుణాత్మక గతిజశక్తికి సమానము.
→ ఒక మూలకం అయోనైజేషన్ పొటెన్షియల్ స్థిరం. కాని వేర్వేరు మూలకాలకు అయోనైజేషన్ పొటెన్షియల్లు వేర్వేరుగా ఉంటాయి.
→ H-పరమాణువు అయోనైజేషన్ పొటెన్షియల్ = 13.6 V.
→ α – కణం, పరమాణు కేంద్రకం నుండి దూరం వెళ్తూ ఉన్నప్పుడు, కేంద్రం నుండి అతిసమీప లంబదూరంను అభిఘాత పరామితి అంటారు.
→ ప్రమాణ పొడవులో పూర్తి తరంగాల సంఖ్యను తరంగదైర్ఘ్యం అంటారు.
→ n = 1 సంబంధించి ఎలక్ట్రాన్ శక్తిస్థాయిని భూస్థాయి అంటారు.
→ n = 2, 3…. సంబంధించి ఎలక్ట్రాన్ శక్తిస్థాయిలను ఉత్తేజిత స్థాయిలు అంటారు.
→ ఎలక్ట్రానన్ను భూస్థాయి నుండి ఉత్తేజిత స్థాయికి చేరుటకు ఉత్తేజిత శక్తి అవసరము.
→ పరమాణువు నుండి ఎలక్ట్రాన్ ను బయటకు తీసుకొచ్చు ప్రక్రియే అయనీకరణం.
→ పరమాణువు నుండి ఎలక్ట్రానన్ను పూర్తిగా బయటకు తీసుకురావటానికి కావాల్సిన శక్తిని అయనీకరణ శక్తి అంటారు.
→ అత్యంత సామీప్య దూరం, r0 = \(\frac{1}{4 \pi \varepsilon_0} \times \frac{\mathrm{Ze}^2}{\frac{1}{2} \mathrm{mv}^2}\)
→ అభిఘాత పరామితి, b = \(\frac{1}{4 \pi \varepsilon_0} \times \frac{\mathrm{Ze}^2 \cot \theta / 2}{\frac{1}{2} \mathrm{mv}^2}\)
→ బోర్ క్వాంటికృత షరతు mvr = \(\frac{\mathrm{nh}}{2 \pi}\)
→ బోర్ పౌనఃపున్య షరతు hv = Ei – Ef
→ బోర్ nవ కక్ష్య వ్యాసార్థం r = 4πε0 \(\frac{n^2 h^2}{4 \pi^2 m e^2}\)
→ nవ కక్ష్యలో భ్రమణం చెందు ఎలక్ట్రాన్ వడి, vn = \(\frac{1}{4 \pi \varepsilon_0} \frac{2 \pi \mathrm{e}^2}{\mathrm{nh}}\)
→ రిడ్ బర్గ్ స్థిరాంకం RH = \(\left(\frac{1}{4 \pi \varepsilon_0}\right)^2 \frac{2 \pi^2 m \mathrm{e}^4}{\operatorname{ch}^3}\)
→ nవ కక్ష్యలో ఎలక్ట్రాన్ శక్తి,
En = \(-\left(\frac{1}{4 \pi \varepsilon_0}\right)^2 \frac{2 \pi^2 m \mathrm{e}^4}{\mathrm{n}^2 \mathrm{~h}^2}\)
→ ఉద్గార వికిరణం శక్తి
E = \(\left(\frac{1}{4 \pi \varepsilon_0}\right)^2 \frac{2 \pi^2 m \mathrm{e}^4}{\mathrm{~h}^2}\left[\frac{1}{\mathrm{n}_{\mathrm{f}}^2}-\frac{1}{\mathrm{n}_{\mathrm{i}}^2}\right]\)