AP Inter 2nd Year Physics Notes Chapter 16 సంసర్గ వ్యవస్థలు

Students can go through AP Inter 2nd Year Physics Notes 16th Lesson సంసర్గ వ్యవస్థలు will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Physics Notes 16th Lesson సంసర్గ వ్యవస్థలు

→ ఒక చోటునుండి మరొకచోటుకు సమాచారాన్ని (లేదా) సందేశాన్ని బదిలీ చేసే (లేదా) గ్రహించే ప్రక్రియను సంసర్గం అంటారు.

→ మాధ్యమం ద్వారా ప్రసారం అవుతున్న సంకేతం సత్వాన్ని కొలవడాన్ని క్షీణనం (Attenuation) అంటారు.

→ ఒక రూపంలోని శక్తిని మరో రూపంలోకి మార్చే సాధనాన్ని శక్తి రూపాంతరణి అంటారు.

→ ఒక పరికరం పనిచేసే పౌనఃపున్యాల వ్యాప్తిని పట్టీ వెడల్పు అంటారు.

→ సందేశ సంకేతాన్ని ఛానల్ ద్వారా ప్రసారానికి, తదనంతరం సంగ్రహణానికి యోగ్యమైనదిగా మార్చే ప్రక్రియను ప్రసారిణి చేస్తోంది.

→ పరారుణ వికిరణం భూవాతావరణంలో బంధితమవుతుంది. అందువల్ల భూమి వేడిగా ఉంటుంది. దీనినే హరితగృహప్రభావం అంటారు.

→ తక్కువ పౌనఃపున్యాలు గల ఆడియో సంకేతాలను, అధిక పౌనఃపున్యాలు గల వాహక తరంగంతో కలిపే ప్రక్రియను మాడ్యులేషన్ అంటారు..

→ మాడ్యులేషన్ తరంగం నుండి సమాచారాన్ని తిరిగి పొందడాన్ని డీమాడ్యులేషన్ అంటారు.

→ భూమి చుట్టూ ఉండే వాయు పొరను ఐనో ఆవరణం అంటారు.

→ రేడియో తరంగాలు ప్రసార స్టేషన్ నుండి గ్రాహక స్టేషన్కు నేరుగా భూమి ద్వారా ప్రయాణించే తరంగాలను భూతరంగాలు అంటారు.

AP Inter 2nd Year Physics Notes Chapter 16 సంసర్గ వ్యవస్థలు

→ ఐనో ఆవరణం నుండి పరావర్తనం చెందిన తరంగాలు ప్రసార స్టేషన్ నుండి గ్రాహక స్టేషన్కు చేరతాయి. వీటిని ఆకాశ తరంగాలు అంటారు.

→ ‘దూరం నుండి వస్తువు యొక్క పరిమాణం, రంగు, స్వభావం మరియు ప్రాంతం సమాచారాన్ని తెలుసుకునే పద్ధతిని రిమోట్ సెన్సింగ్ అంటారు.

→ హెర్ట్జ్ ఆంటెన్నా పొడవు (l) = \(\frac{\lambda}{2}=\frac{c}{2 v}\)

→ మార్కోని ఆంటెన్నా యొక్క పొడవు (l) = \(\frac{\lambda}{4}=\frac{c}{4 v}\)

→ dT = \(\sqrt{2 R h_T}=\sqrt{2 R h_R}\)

→ కంపన పరిమితి మాడ్యులేషన్ మాడ్యులేషన్ సూచిక (ma)
AP Inter 2nd Year Physics Notes Chapter 16 సంసర్గ వ్యవస్థలు 1

→ కంపన పరిమితి మాడ్యులేషన్ పట్టీ వెడల్పు = 2 × మాడ్యులేషన్ సంకేతం పౌనఃపున్యం

→ పౌనఃపున్య మాడ్యులేషన్లో మాడ్యులేషన్ సూచిక (mf)
AP Inter 2nd Year Physics Notes Chapter 16 సంసర్గ వ్యవస్థలు 2

→ పౌనఃపున్య మాడ్యులేషన్ కంపన పరిమితి = 2n × మాడ్యులేషన్ సంకేతం పౌనఃపున్యం