Students can go through AP Inter 2nd Year Physics Notes 3rd Lesson తరంగ దృశాశాస్త్రం will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Physics Notes 3rd Lesson తరంగ దృశాశాస్త్రం
→ తరంగ దృశాశాస్త్రం ప్రకారం విద్యుదయస్కాంత తరంగాలు.
→ ఒకే దశలో డోలనాలు చేసే బిందువుల బిందుపథాన్ని తరంగాగ్రం అంటారు. అంటే స్థిరమైన దశ గల ఉపరితలాన్ని తరంగాగ్రం అంటారు.
→ రెండు కాంతి తరంగాలు అధ్యారోపణం చెందుటవల్ల యానకంలో శక్తి ఏకరీతిగా వితరణ చెందదు. దీనిని వ్యతికరణం అంటారు.
→ ఒకే పౌనఃపున్యము (లేదా) తరంగదైర్ఘ్యము మరియు స్థిరదశాభేదము గల రెండు కాంతి జనకాలను సంబద్ధ జనకాలు అంటారు.
→ నిర్మాణాత్మక వ్యతికరణంలో రెండు జనకాల మధ్య పథ భేదము λ కు పూర్ణాంక గుణిజాలుగా ఉంటుంది.
→ వినాశాత్మక వ్యతికరణంలో రెండు జనకాల మధ్య పథ భేదము \(\frac{\lambda}{2}\) కు బేసి గుణిజాలుగా ఉంటుంది.
→ వ్యతికరణ నమూనాలో చీకటి మరియు వెలుగు పట్టీలు ఒకే మందము కలిగి ఉంటాయి. యంగ్ జంట చీలికల ప్రయోగంలో, పట్టీలు అతిపరావలయ ఆకారంలో ఉంటాయి.
→ యంగ్ జంట చీలికల ప్రయోగంలో, స్వల్ప వ్యతికరణ నమూనాలో పట్టీలు తిన్నగా ఉంటాయి.
→ కాంతి అడ్డు యొక్క అంచుల వద్ద వంగి, జ్యామితీయచ్ఛాయా ప్రదేశంలోకి ప్రవేశిస్తుంది. ఈ దృగ్విషయాన్ని వివర్తనం అంటారు.
→ ఏకచీలిక వివర్తనంలో, అన్ని గౌణ గరిష్ఠాలు మరియు కనిష్టాలు ఒకే మందము కలిగి ఉంటాయి.
→ ఏకచీలిక వివర్తనంలో కేంద్ర గరిష్ఠం మందము, ఏదైనా గౌణ గరిష్ఠం (లేదా) కనిష్ఠం మందానికి రెట్టింపు ఉంటుంది.
→ దృశాపరికరాల దృక్ సామర్థాన్ని వివర్తనం ద్వారా తెలుసుకోవచ్చును.
→ కేవలం తిర్యక్ తరంగాల వల్ల మాత్రమే ద్రువణం సాధ్యమవుతుంది.
→ జనకం నుండి వచ్చు సాధారణ కాంతి అధ్రువిత కాంతి.
→ కాంతి కంపనాలు కేవలం ఒకే తలానికి మాత్రమే పరిమితమైతే దానిని ధ్రువణం అంటారు.
→ కాంతి కిరణము ధ్రువణ కోణముతో పతనమైతే, పరావర్తన కిరణము, వక్రీభవన కిరణానికి లంబంగా ఉంటుంది.
→ చీలిక నుండి తెర వరకు గల దూరాన్ని ఫ్రెనెల్ దూరం అంటారు.
→ రెండు బిందు వస్తువులు వేరు చేసినట్లుగా కనిపించినప్పుడు, వాటిమధ్య స్వల్ప దూరాన్ని (రేఖీయ (లేదా) కోణీయ) పృథఃక్కరణ అవధి అంటారు.
→ పృథఃక్కరణ అవధి యొక్క ఉత్రమాన్ని పృధఃక్కరణ సామర్థ్యం అంటారు.
→ బ్రూస్టర్ కోణము యొక్క టాంజెంట్ విలువ యానకం వక్రీభవన గుణకానికి సమానం. μ = tan ip. దీనిని బ్రూస్టర్ నియమం అంటారు.
→ విశ్లేషణకారి గుండా పోయే ధ్రువత కాంతి తీవ్రత, విశ్లేషణకారి మరియు ధ్రువణకారి మధ్యగల కొసైన్ కోణానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దీనిని మాలస్ నియమం అంటారు.
I ∝ cos2θ
→ దశా భేదము = \(\frac{2 \pi}{\lambda}\) × పథ భేదము
→ గరిష్ట తీవ్రత నిబంధన, Φ = 2nπ
→ కనిష్ఠ తీవ్రత నిబంధన, Φ = (2n + 1)π
→ పథ భేదము S2P – S1P = nλ(గరిష్ఠం)
S2P – S1P = (2n + 1)\(\frac{\lambda}{2}\) (కనిష్టం)
→ ఫ్రెనెల్ దూరము (ZF) = \(\frac{\mathrm{a}^2}{\lambda}\)
→ వెలుగుపట్టీ స్థానము (xn) = \(\frac{\mathrm{n} \lambda \mathrm{D}}{\mathrm{d}}\)
→ చీకటిపట్టీ స్థానము (x) = (2n + 1)\(\frac{\lambda D}{d}\)
→ దూరదర్శిని యొక్క పృథఃక్కరణ సామర్థ్యము = \(\frac{1}{\mathrm{~d} \theta}=\frac{\mathrm{D}}{1.22 \lambda}\)
→ సూక్ష్మదర్శిని యొక్క పృథఃక్కరణ సామర్థ్యము = \(\frac{1}{d}=\frac{2 \mu \sin \theta}{\lambda}\)
→ బ్రూస్టర్ నియమం, μ = Tan iB
→ మాలస్ నియమం I = I0 cos2θ