AP Inter 2nd Year Zoology Notes Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Zoology Notes Lesson 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

→ శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ. ఈ క్రియలో పరిసరాల నుండి ఆక్సిజన్ గ్రహించబడి ఆహార పదార్థాల ఆక్సీకరణం కోసం వినియోగింపబడుతుంది. ఈ చర్యలో శక్తి వెలువడి CO2, నీరు అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి.

→ శ్వాసక్రియ రెండు దశలలో జరుగుతుంది. అవి :

  • బాహ్యశ్వాసక్రియ
  • అంతర శ్వాసక్రియ

→ బాహ్యశ్వాసక్రియ – వాయుకోశాల, రక్తనాళాల మధ్య వాయువుల వినిమయం.

→ అంతర శ్వాసక్రియ – దైహిక రక్తనాళాలు, కణజాలాల మధ్య వాయువుల వినిమయం.

→ జలచర ఆర్థ్రోపోడ్లు, మొలస్కా జీవులు ప్రత్యేక రక్తనాళికాయుత నిర్మాణాలైన మొప్పలను, భూచర జీవులు రక్తనాళయుత తిత్తులను ఉపయోగించుకొని వాయువుల వినిమయం జరుపుకొంటాయి.

→ సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి.

→ మానవుడి శ్వాసవ్యవస్థలో, బాహ్య నాసికారంధ్రాలు, నాసికా కక్ష్యలు, నాసికాగ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు మరియు ఊపిరితిత్తులు వంటి నిర్మాణాలుంటాయి.

→ పరిసరాలలోని గాలిని ఊపిరితిత్తులలోకి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసం అంటారు.

→ వాయుకోశాల్లోని గాలి బయటికి విడుదల కావడాన్ని నిశ్వాసం అంటారు.

→ మానవుడు సగటున నిమిషానికి 12-16 సార్లు శ్వాసిస్తాడు.

→ ఆరోగ్యవంతుడైన మానవుడు నిమిషానికి 6000 నుంచి 8000 మి॥లీ॥ గాలిని ఉచ్ఛ్వాసించడం లేదా నిశ్వాసించడం జరుగుతుంది.

AP Inter 2nd Year Zoology Notes Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

→ సుమారు 97% ఆక్సిజన్ ను రక్తంలోని ఎర్రరక్తకణాలద్వారా రవాణా అవుతుంది.

→ సాధారణ పరిస్థితులలో ప్రతి 100 మి.లీ. ఆమ్లజనియుత రక్తం కణజాలాలకు 5 మి.లీ. ఆక్సిజన్ విడుదల చేస్తుంది.

→ ప్రతి 100 మి.లీ. సిరా రక్తం సుమారు 4 మి. లీ CO2 ను వాయుకోశాల్లోని గాలిలోకి విడుదల చేస్తుంది.

→ సుమారు 70 శాతం CO2, బైకార్బనేట్ గా రవాణా అవుతుంది.

→ హీమోగ్లోబిన్ ద్విస్వభావ సంయోగ పదార్థం అధిక ఆక్సిజన్ కలిగిన ప్రాంతాలలో ఆక్సిజన్ ను గ్రహించి CO2 ను వదిలివేస్తుంది. అధిక CO2 కలిగిన ప్రాంతాలలో CO2 ను గ్రహించి, O2 ను వదిలివేస్తుంది.

→ ఎరిత్రోసైట్లు, ప్లాస్మాల మధ్య క్లోరైడ్, బైకార్బనేట్ అయాన్ల వినిమయం జరుగుతుంది. దీనినే క్లోరైడ్ విస్తాపం అంటారు.

→ వాయుకోశాలు పలుచని పొరను కలిగి, క్రమరహిత, అధిక ప్రసరణ కలిగిన సంచిలాంటి నిర్మాణాలు. ఇవి ఊపిరితిత్తులలో వాయు వినిమయ ప్రాంతాలు.