AP Inter 2nd Year Zoology Notes Chapter 2(a) శరీరద్రవాలు, ప్రసరణ

Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 2(a) శరీరద్రవాలు, ప్రసరణ will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Zoology Notes Lesson 2(a) శరీరద్రవాలు, ప్రసరణ

→ విలియం హార్వే

  • విలియం హార్వే ఇంగ్లీష్ వైద్యుడు మరియు శాస్త్రవేత్త. ఈయన ఏప్రిల్, 1, 1578లో జన్మించినారు. విలియం హార్వే, జేమ్స్-1, మరియు చార్లెస్ -1 రాజులు కొల ఎవులలో ఆస్థాన వైద్యుడిగా పని చేశారు.
  • విలియం హార్వే మానవ శరీరంలో జరిగే రక్తప్రసరణ పద్ధతిని గురించి వివరించారు. ఈయన జూన్ 3 1657లో మరణించారు. ఈయన మరణానంతరం ఆయన పేరుమీదా ఓక హాస్పిటల్ను ఆయన పుట్టిన స్థలం అయిన ఫోల్గన్కు కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఆస్ఫోర్డ్ పట్టణంలో నిర్మించారు.

→ మానవునిలో, ప్రసరణ వ్యవస్థ బంధిత, ద్వంద్వ ప్రసరణ వ్యవస్థగా పేర్కొనవచ్చు.

→ ద్వంద్వ ప్రసరణ వ్యవస్థలో దైహిక, పుపుస ప్రసరణ వ్యవస్థలు ఉంటాయి.

→ పుపుస ప్రసరణ వ్యవస్థ, ఆమ్లజని రహిత రక్తాన్ని గుండె నుండి ఊపిరితిత్తులకు పంపి, అక్కడి నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని గుండె స్వీకరిస్తుంది.

→ దైహిక ప్రసరణ వ్యవస్థలో కణజాలాలకు, మిగతా శరీర భాగాలకు ఆమ్లజని సహిత రక్తాన్ని పంపి వాటినుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని స్వీకరిస్తుంది.

→ మానవుడితో పాటు ఇతర ఉన్నత జీవులు రక్తాన్ని, శోషరసాన్ని ప్రసరణ ద్రవంగా వినియోగిస్తాయి.

→ శోషరస ప్రసరణ వ్యవస్థ స్వేచ్ఛాయుత ప్రసరణ వ్యవస్థ.

→ శోషరసం రక్తంలోని ప్లాస్మాను పోలి ఉంటుంది. అయితే ఇందులో ప్రోటీన్లు, ఇతర పోషకాలు తక్కువగా ఉంటాయి. ఎర్రరక్తకణాలు ఉండవు.

→ శరీర దిగువ భాగాన ఉన్న శోషరస నాళాలు శోషరసాన్ని ఉరః వాహికలోకి చేరుస్తాయి.

→ ఉరః వాహిక శోషరస వ్యవస్థలో అతి పెద్ద శోషరస నాళం.

→ మానవుడి గుండెలో నాలుగు గదులు ఉంటాయి. పై భాగంలో రెండు కర్ణికలు దిగువన కొద్దిగా పెద్ద పరిమాణంలో రెండు జఠరికలు ఉంటాయి.

→ కర్ణికలను, జఠరికలను వేరు చేస్తూ కరోనరి సల్కస్ అనే లోతైన అడ్డు గాడి ఉంటుంది.

→ కర్ణికలు పలుచని గోడలు కలిగి ఉండి రక్తాన్ని స్వీకరించే గదులు.

→ జఠరికలు, మందంగా గల గోడలు కలిగి ఉండి రక్తాన్ని పంప్ చేయగల గదులు.

→ హృదయం సిరాకర్ణికా కణుపు, కర్ణికా జఠరికా కణుపు అనే రెండు ప్రత్యేకమైన కణుపు కణజాలాలను కలిగి ఉంటుంది.

→ సిరాకర్ణికా కణుపును లయారంభకం అంటారు.

AP Inter 2nd Year Zoology Notes Chapter 2(a) శరీరద్రవాలు, ప్రసరణ

→ ఒక హృదయ స్పందన మొదలు కావడం నుంచి మరొక హృదయ స్పందన మొదలయ్యే వరకు జరిగే హృదయ ప్రక్రియలను హార్దిక వలయం అంటారు.

→ హార్దిక వలయం మూడు దశలలో జరుగుతుంది. అవి – కర్ణికల సంకోచం, జఠరికల సంకోచం, హార్ధిక విస్ఫారం.

→ నిమిషానికి ప్రతి జఠరిక ప్రసరంలోకి పంప్ చేసే రక్త ఘనపరిమాణాన్ని హార్దిక వెలువరింత అంటారు. ఇది సుమారు 5 లీటర్లు.

→ సాధారణంగా మానవుడి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. కాబట్టి హార్దిక వలయం అవధి 0.8 సెకన్లు.

→ అధివృక్క గ్రంథి దవ్వ నుంచి విడుదలయ్యే ఎఫినెప్రిన్, నార్టెఫినెఫ్రిన్ హార్మోన్లు కూడా హార్దిక వెలువరింతను పెంచుతాయి.

→ విశ్రాంతి స్థితిలో సాధారణ రక్తపీడనం 120 మి.మీ. Hg (సిస్టోల్)/ 80 మి.మీ. Hg (డయాస్టోల్) గా ఉంటుంది.

→ రక్తపీడనం 140/90 దాటినప్పుడు అధిక రక్తపోటుగా భావిస్తారు.

Leave a Comment