AP Inter 2nd Year Zoology Notes Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన

Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Zoology Notes Lesson 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన

→ శరీరంలో ఏర్పడిన నత్రజని, ఇతర వ్యర్థపదార్థాలను బయటికి పంపడాన్ని విసర్జన అంటారు.

→ జంతువులు, నత్రజని రూపంలో బయటికి విసర్జించలేదు కాని నత్రజని అంత్య పదార్థాలైన అమ్మోనియా, యూరియా మరియు యూరికామ్ల రూపంలో విసర్జిస్తాయి.

→ అమ్మోనియాను ముఖ్య నత్రజని వ్యర్థ పదార్థంగా విసర్జించడాన్ని అమ్మోనోటెలిజం అని దీన్ని విసర్జించే జంతువులను అమ్మోనోటెలిక్ జంతువులు అని అంటారు.

→ యూరియానుముఖ్య నత్రజని వ్యర్థ పదార్థంగా విసర్జించడాన్ని యూరియోటెలిజం అని, ఈ విధంగా విసర్జించే జంతువులను యూరియోటెలిక్ జంతువులు అని అంటారు.

→ యూరికామ్లాన్ని వ్యర్థపదార్థంగా విసర్జించడాన్ని యూరికోటెలిజం అని దీన్ని విసర్జించే జంతువులను యూరికోటెలిక్ జంతువులని అంటారు.

→ జీవక్రియలలో ఏర్పడిన వ్యర్థపదార్థాలను విసర్జించుటలో ఉపయోగపడే అవయవాలను విసర్జక అవయవాలు అంటారు.

→ మానవ విసర్జక వ్యవస్థలో ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, ఒక మూత్రాశయం, ప్రసేకం ఉంటాయి.

→ మానవునిలో మూత్రపిండాలు ముఖ్య విసర్జక అవయవాలు.

→ ఒక్కొక్క మూత్రపిండంలో సుమారు ఒక మిలియన్ నిర్మాణాత్మక, క్రియాత్మక వృక్కప్రమాణాలు ఉంటాయి.

AP Inter 2nd Year Zoology Notes Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన

→ ప్రతి వృక్కప్రమాణంలో మాల్పీగియన్ దేహం, వృక్కనాళిక అనే రెండు భాగాలుంటాయి.

→ సుమారు నిముషానికి 1100 – 1200 ml ల రక్తాన్ని కిడ్నీల ద్వారా గాలనం అవుతుంది.

→ రెండు మూత్రపిండాలు నిముషానికి ఉత్పత్తిచేసే గాలిత ద్రవ ఘనపరిమాణాన్ని (గ్లామరులార్) గాలిత రేటు అంటారు.

→ ADH, దూరాగ్ర సంవళిత నాళిక, సంగ్రహణ నాళం నుంచి నీటి పునఃశోషణకు తోడ్పడి, మూత్రం ద్వారా నీటి నష్టాన్ని నివారిస్తుంది.

→ ఆరోగ్యవంతుడైన వ్యక్తిలో గ్లామరులార్ గాలితరేటు సుమారు 125 మి.లీ॥ /ని॥ ఉంటుంది. అందులో 99% గాలిత ద్రవం వృక్కనాళికల ద్వారా పునఃశోషణ చెందుతుంది.

→ మానవుడు ప్రౌఢదశలో రోజుకు సుమారు 1 నుండి 1.5 లీ॥ మూత్రమును, సుమారు 25-30 గ్రాముల యూరియాను విసర్జిస్తాడు.

→ మూత్రపిండాలకు అదనంగా ఊపిరితిత్తులు, కాలేయం, చర్మం వ్యర్థ పదార్థాల విసర్జనకు తోడ్పడతాయి.

→ రక్తంలో యూరియా అధికస్థాయిలో ఉండటాన్ని యూరిమియా అంటారు.

→ మూత్రాన్ని విసర్జించే ప్రక్రియను మిక్టురిషన్ అంటారు.

→ రక్తాన్ని డయలైజర్తో వడపోయడాన్ని హీమోడయాలిసిస్ అంటారు.