AP Inter 2nd Year Zoology Notes Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Zoology Notes Lesson 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

→ కండరం మధ్యస్త్వచం నుంచి ఏర్పడిన ప్రత్యేకమైన కణజాలం.

→ కండర కణజాలం మూడు ముఖ్య లక్షణాలను ప్రదర్శిస్తుంది. అవి :

  • ప్రేరణశీలత
  • సంకోచశీలత
  • స్థితిస్థాపకత

→ మానవ దేహంలోని ప్రతిరేఖిత కండరం అనేక కండర కట్టలు లేదా ‘ఫాసికిల్’ లతో నిర్మితమైన ఉంటుంది.

→ ప్రతి ఫాసికిల్లో అనేక స్థూపాకార కండర తంతువులు లేదా కండర కణాలు ఉంటాయి.

→ అన్ని ఫాసికిల్ను కప్పి ఉంచుతూ కొల్లాజెన్ నిర్మితమైన ఫాసియా అనే సంయోజక కణజాలపు త్వచం ఉంటుంది.

→ కండర తంతువు ప్లాస్మాత్వచాన్ని సార్కోలెమ్మా అని, దీని జీవపదార్థాన్ని సార్కోప్లాజమ్ అని అంటారు.

→ ప్రతి కండర సూక్ష్మతంతువులో ఏకాంతరంగా నిష్కాంతి, కాంతి పట్టీలు ఉండటం వల్ల అది చారలుగా కనిపిస్తుంది.

→ లేతవర్ణ పట్టీలో ఏక్టిన్ ప్రోటీన్తో పాటుగా ట్రోపోనిన్, ట్రోపోమయోసిన్అనే రెండు నియంత్రణ ప్రోటీన్ లుంటాయి. దీనినే ‘I’ పట్టీ అనికూడా అంటారు.

→ నిష్కాంతి పట్టీని ‘A’ పట్టీ అని అంటారు. ఇందులో మయోసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది.

→ స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం / జారుడు తంతు సిద్ధాంతంను జేన్ హాన్సన్, హ్యుగ్ హక్సలె అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు.

→ కండరంలో ఆక్సిజన్ను నిల్వచేసే ఎర్రని వర్ణకం మయోగ్లోబిన్.

→ ఎముకల గురించి అధ్యయనం చేయడాన్ని ఆస్టియాలజీ అంటారు.

→ మానవుని ప్రౌఢ దశలో అస్థిపంజర వ్యవస్థలో 206 ఎముకలు ఉంటాయి.

→ మానవుని అక్షాస్థిపంజరం 80 ఎముకలచే ఏర్పడుతుంది.

AP Inter 2nd Year Zoology Notes Chapter 3(a) కండర - అస్థిపంజర వ్యవస్థ

→ మానవ పుర్రె 8 కపాల మరియు 14 ముఖ ఎముకలతో నిర్మితమై ఉంటుంది.

→ మానవుడి వెన్నెముకలో 26 వెన్నుపూసలు. ఒక వరుసక్రమంలో అమరి ఉంటాయి.

→ మానవ ఛాతిలో 12 జతల పర్శుకలుంటాయి.

→ మానవ ప్రతి పూర్వాంగములో 30 ఎముకలుంటాయి.

→ మానవ శరీరంలో భుజాస్థి పొడవవైన మరియు దృఢమైన ఎముక

→ మానవ ప్రతి చరమాంగములో ’30 ఎముకలుంటాయి.

→ రెండు ఎముకలు లేదా ఎముక, మృదులాస్థిని సంధించే నిర్మాణాన్ని ‘కీలు’ అంటారు.

→ నిర్మాణపరంగా కీళ్లు, తంతుయుత కీళ్లు, మృదులాస్థి కీళ్లు, సైనోవియల్ కీళ్లు అనే మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

→ కీళ్లలో వాపు ఏర్పడటాన్ని ఆరైటిస్ అంటారు.

→ కీళ్లలో యూరిక్ ఆమ్లం స్ఫటికాల రూపంలో సంచితం అయ్యి కీళ్ల వాపును చూపడాన్ని గౌట్ అంటారు.

→ మరణాదంతరం కండరాలు బిగుసుకోవడాన్ని రిగర్ మార్టిస్ అంటారు.

→ ఆర్నాల్డ్ అడాల్ఫ్ బెర్త్ హోల్డ్
ఆర్నాల్డ్ అడాల్ఫ్ బెర్త్ హోల్డ్ ఒక జర్మని శరీరధర్మ శాస్త్రవేత్త మరియు జంతుశాస్త్రవేత్త. ఈయన గొట్టిన్జెన్ వైధ్యశాస్త్రం అభ్యసించినారు. ద్వితీయలైంగిక లక్షణాల అభివృద్ధికి స్త్రీ/పురుష బీజగ్రంధుల పాత్రను తెలుసుకొనుటకు చేసిన ప్రయోగాలు కారణంగా ఆర్నాల్డ్ అడాల్ఫ్ బెర్త్హోల్డ్ను అంతస్రావిక శాస్త్రవేత్త మార్గదర్శకుడిగా పేర్కొంటారు.

Leave a Comment