AP Inter 2nd Year Zoology Notes Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Zoology Notes Lesson 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

→ ద్విస్తరిత జీవులలో ప్రాథమికంగా ధృవరహిత వ్యాపన నాడీవల లాగా ఏర్పడిన నాడీ వ్యవస్థ, అభివృద్ధి చెందిన జీవులలో ఒక సమన్వయ వ్యవస్థగా ఏర్పడి, ఆలోచనా కేంద్రమైన మెదడుగా రూపాంతరం చెందింది.

→ నాడీ కణజాలంలో నాడీ కణాలు అనుబంధకణాలైన గ్లియల్ కణాలు ఉంటాయి.

→ మానవ మెదడులో రెండు రకాల జ్ఞాపకాలుంటాయి. అవి : దీర్ఘకాలిక జ్ఞాపకాలు, స్వల్పకాలిక జ్ఞాపకాలు.

→ మానవ నాడీవ్యవస్థలో రెండు భాగాలు ఉన్నాయి. అవి : కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీవ్యవస్థ.

→ కేంద్రనాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపాము ఉంటాయి.

→ పరిధీయ నాడీ వ్యవస్థలో కపాలనాడులు, కశేరునాడులు ఉంటాయి.

→ మెదడు సమాచార విశ్లేషణ, నియంత్రణ కేంద్రం. ఇది కపాల కుహరంలో భద్రపరచబడి, మూడు కపాల పొరలచే కప్పబడి ఉంటుంది. అవి వరాశిక, లౌతికళ, మృద్వి,

→ మెదడు రక్షణ పొరలన్నింటిని కలిపి మెనింజెస్ అంటారు.

AP Inter 2nd Year Zoology Notes Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

→ మెదడును మూడు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. అవి : పూర్వమెదడు, మధ్యమెదడు, అంత్యమెదడు.

→ మానవుడిలో మొత్తం 31 జతల కశేరునాడులుంటాయి. వీటిని వాటి ప్రదేశాన్ని బట్టి ఐదు సమూహాలుగా విభజించవచ్చు. అవి :

  • గ్రీవా కశేరునాడులు – 8 జతలు.
  • ఉరః కశేరునాడులు
  • కటి కశేరునాడులు – 5 జతలు
  • త్రిక కశేరునాడులు – 5 జతలు
  • అనుత్రిక కశేరునాడి – 1 జత

→ క్రియాత్మకంగా పరిధీయనాడీ వ్యవస్థను దైహిక నాడీ వ్యవస్థ, స్వయంచోదిత నాడీవ్యవస్థగా విభజించారు.

→ దైహిక నాడీ వ్యవస్థ చర్యలన్నీ ఇచ్ఛాపూర్వకంగా, నియంత్రితంగా జరుగుతాయి.

→ స్వయంచోదిత నాడీ వ్యవస్థ చర్యలన్నీ అనియంత్రితంగా జరుగుతాయి.

→ కన్ను దృష్టికి సంబంధించిన జ్ఞానాంగం.

→ నేత్రగోళ కుడ్యంలో మూడు పొరలు ఉంటాయి. అవి వరుసగా వెలుపలి నుంచి తంతు పటలం, ప్రసరణ పటలం, నేత్ర పటలం.

→ కాంతిగ్రాహక స్తరంలో దండకణాలు, శంఖుకణాలు అనే రెండు కాంతి గ్రాహకాలు ఉంటాయి.

→ దండకణాలు మసక చీకటిలో దృష్టికి ఉపయోగపడుతుంది.

→ శంఖు కణాలు పగటి పూట దృష్టికి, రంగులు గుర్తించడానికి ఉపయోగపడతాయి.

→ నేత్రపటలం, నేత్రనాడి కలిసే ప్రాంతాన్ని అందచుక్క అంటారు. ఈ ప్రాంతంలో ఎటువంటి గ్రాహకాలు ఉండవు.

→ అందువల్ల ఈ ప్రదేశంలో ప్రతిబింబాలు ఏర్పడవు.

→ చెవి వినికిడిని, సమతాస్థితిని గ్రహించే ద్వంద్వ జ్ఞానాంగం.

AP Inter 2nd Year Zoology Notes Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

→ 65 సం॥లు వయస్సు దాటిన వారిలో సాధారణంగా కనిపించే మెదడుకు సంబంధించిన మతిమరపు వ్యాధిని అల్జీమర్స్ వ్యాధి అంటారు.

→ మెదడు, వెన్నుపాము రక్షణపొరలు వాపుకు గురికావడం వల్ల కలిగే వ్యాధిని మెనింజైటిస్ అంటారు.

→ పార్కిన్ సన్స్ వ్యాధి మెదడులోని నాడీ కణ క్షీణత వల్ల కలిగే వ్యాధి. దీనివల్ల దేహకదలికలు, కండర సంకోచం, సమతాస్థితి ప్రభావితమవుతాయి.

Leave a Comment