Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 4(a) అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Zoology Notes Lesson 4(a) అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం
→ స్టార్లింగ్ అనే శాస్త్రవేత్త హార్మోన్ అనే పదకల్పన చేశాడు.
→ సెక్రిటిన్ అనే హార్మోన్ ను మొదట కనుగొన్నారు.
→ హార్మోన్లు కణాంతర వాహకాలుగా పనిచేసే, అతిస్వల్ప ప్రమాణంలో ఉత్పత్తి అయ్యే పోషక పదార్థం కాని రసాయనాలు.
→ అంతస్రావక గ్రంథులు హార్మోన్లను స్రవిస్తాయి.
→ హైపోథలామస్, అంతస్రావక వ్యవస్థ యొక్క నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుంది.
→ పిట్యూటరీ లేదా పీయూష గ్రంథిని హైపోఫైసిస్ అని అంటారు.
→ పూర్వపిట్యూటరీ ఆరు ముఖ్య పెప్టైడ్ హార్మోన్లను స్రవిస్తుంది. అవి: పెరుగుదల హార్మోన్, ప్రొలాక్టిన్, థైరాయిడ్ హార్మోన్, ఎడ్రినో కార్టికో ట్రోపిక్ హార్మోన్, పుటికా ప్రేరక హార్మోన్, ల్యుటినైజింగ్ హార్మోన్లు.
→ పరపిట్యూటరీ ఆక్సిటోసిన్, వాసోప్రెస్సిన్ అనే రెండు హార్మోన్లను స్రవిస్తుంది.
→ థైరాయిడ్ గ్రంథిఅంతస్త్వచం నుంచి ఉద్భవించే అతిపెద్ద అంతస్థాపక గ్రంథి. ఇదిT,T, హార్మోన్లను స్రవిస్తుంది.
→ పీనియల్ గ్రంథి మెలటోనిన్ అనే హార్మోన్ ను స్రవిస్తుంది.
→ విటమిన్ – D ఒక క్రియాశీల రహిత హార్మోన్ దీనినే కాల్సిట్రయల్ అంటారు.
→ థైమస్ గ్రంథి, థైమోసిన్ అనే హార్మోన్ ను స్రవిస్తుంది. ఇది కణ నిర్వర్తిత మరియు దేహద్రవ నిర్వర్తిత రోగనిరోధకతకు దోహదం చేస్తుంది.
→ అధివృక్క వల్కలం కార్టికాయిడ్ హార్మోన్లను స్రవిస్తుంది. ఉదా: గ్లూకోకార్టికాయిడ్లు, మినరలో కార్టికాయిడ్లు
→ అధివృక్కదవ్వ ఎపినెఫ్రిన్, నార్ఎపినెఫ్టిన్ అనే రెండు హార్మోన్లను స్రవిస్తుంది. వీటినే పోరాట లేదా పలాయన హార్మోన్లు అంటారు.
→ లాంగర్ హాన్స్ పుటికలో CCL – కణాలు గ్లూకగాను, B కణాలు ఇన్సులిన్ హార్మోన్ ను స్రవిస్తాయి.
→ ముష్కాలు పురుష ప్రత్యుత్పత్తి అంగాలు. ముష్కాలలో గల లీడిగ్ కణాలు టెస్టోస్టిరాన్అనే హార్మోన్లను స్రవిస్తాయి. ఇది ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిలో మరియు శుక్రజననంలో ముఖ్యపాత్ర వహిస్తాయి.
→ స్త్రీ బీజకోశాలు, స్త్రీ బీజగ్రంథులు. ఇవి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ అనే రెండు స్టిరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి స్త్రీ ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిలో ముఖ్యపాత్ర వహిస్తాయి.
→ మూత్రపిండంలో ఉండే రక్తనాళికా గుచ్ఛసన్నిధి పరికరం ఎరిత్రోపోయిటిన్అనే పెప్టైడ్ హార్మోన్లు స్రవిస్తుంది. ఇది అస్థిమజ్జలో ఎర్రరక్తకణోత్పాదనక్రియను ప్రేరేపిస్తుంది.
→ గాస్టిన్ హార్మోన్ జఠరగ్రంథుల పై ప్రభావం చూపి HCl, పెప్సినోజెన్ విడుదలను ప్రేంపిస్తుంది.
→ ఆంత్రమూలపు శ్లేష్మస్తరం సెక్రిటిన్ హార్మోన న్ను ఉత్పత్తి చేస్తుంది. సెక్రిటిన్ క్లోమపు బహిస్రావక భాగం పై ప్రభావం చూపి నీరు, బైకార్బోనేట్ అయాన్ల విడుదలను ప్రేరేపిస్తుంది.
→ కొలిసిస్టోకైనిన్ ఆంత్రమూలంలో కైమ్ కొవ్వులకు ప్రతిస్పందనగా ఉత్పత్తి అవుతుంది. ఇది పిత్తాశయాన్ని సంకోచింపజేసి పైత్యరసం విడుదలను, క్లోమాన్ని ప్రేరేపించి క్లోమరసం స్రవించడానికి తోడ్పడుతుంది.
→ హార్మోనులు ప్రాథమిక వార్తా వాహకాలుగా పనిచేస్తాయి.
→ CAMP, ఇనోసిటాల్ ఫాస్పేట్, కాల్షియంలు ద్వితీయ వార్తాహరులుగా పనిచేస్తాయి.
→ మానవ పెరుగుదల హార్మోన్, అస్థీకరణ కంటే ముందుగా అధికంగా ఉత్పత్తి జరిగితే అతికాయత లేదా మహాకాయత అనే అపస్థితి ఏర్పడుతుంది.
→ శిశువులలో పెరుగుదల హార్మోన్ అల్పోత్పత్తి ఫలితంగా పిట్యూటరీ కుబ్బులుకు దారి తీస్తుంది.
→ ప్రౌఢ మానవునిలో hGH అధికోత్పత్తి జరిగితే ఆక్రోమెగాలి అనే అపస్థితి ఏర్పడుతుంది.
→ హైపర్ గ్లైసీమియా స్థితి చాలాకాలం కొనసాగితే డయాబెటిస్ మెల్లీటస్ అనే వ్యాధికి దారి తీస్తుంది.
→ వాసోప్రెస్సిన్ హార్మోన్ లోపం డయాబెటిస్ ఇన్సిపిడస్కు దారితీస్తుంది.
→ అడ్రినల్ వల్కలం స్రవించే గ్లూకోకార్డికాయిడ్ అల్పోత్పత్తి వల్ల అడిసన్స్ వ్యాధి కలుగుతుంది.
→ పారాథైరాయిడ్ హార్మోన్ అల్పోత్పత్తి ‘టెలూనీ’కి దారి తీస్తుంది.
→ గ్లూకోకార్డికాయిడ్ హార్మోన్ల అధికోత్పత్తి వల్ల కుషింగ్స్ సిండ్రోమ్ అనే అపస్థితి కలుగుతుంది.
→ ప్రౌఢ స్త్రీలలో హైపోథైరాయిడిజమ్ వల్ల రుతుచక్ర క్రమం తప్పుతుంది.
→ ప్రౌఢ మానవునిలో హైపోథైరాయిడిజమ్ వల్ల మిక్సిడిమా అనే అసాధారణ స్థితి ఏర్పడుతుంది.
→ ఎడ్వర్డ్ జెన్నర్
ఎడ్వర్డ్ జెన్నర్ (17-మే-1749 నుండి 26-జనవరి-1823) ఒక ఇంగ్లీష్ వైద్యుడు మరియు గ్లోస్టర్ షైర్లోని బర్కిలీలో తన సహజ పరిసరాలను అధ్యయనం చేసిన శాస్త్రవేత్త. జెన్నర్ మశూచి టీకా మందును కనిపెట్టుట ద్వారా ప్రపంచంలో అత్యధికుల ప్రాణాలను కాపాడిన వ్యక్తిగా మరియు రోగనిరోధక శాస్త్ర పితామహుడుగా గుర్తింపు పోందారు.