Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Zoology Notes Lesson 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ
→ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రత్యుత్పత్తి: ప్రక్రియలో పాల్గొనే అనేక లైంగిక అవయవాలు శ్రోణి ప్రాంతంలో ఉంటాయి. అవి ఒక జత ముష్కాలు, అనుబంధ గ్రంథులు, అనుబంధ నాళాలు, బాహ్య జననాంగాలు.
→ ముష్కాలు ఉదరకుహరం బయట ముష్కగోణిలో వేలాడుతూ ఉంటాయి.
→ ముష్కగోణి శుక్రణోత్పత్తికి కావలసిన ఉష్ణోగ్రత ఉండేటట్లు సహాయపడుతుంది.
→ ముష్కగోణి కుహరం వాంక్షణ నాళం ద్వారా ఉదర కుహరంతో కలిసి ఉంటుంది.
→ గుబర్నాక్యులమ్, శుక్ర దండం అనే నిర్మాణాలు ముష్కాన్ని ముష్క గోణిలో నిలిపి ఉంచుతాయి.
→ ముష్కాన్ని ఆవరించి ట్యూనికా ఆల్బుజీనియా, ట్యూనికా వెజైనాలిస్ అనే పొరలుంటాయి. ముష్కలంబికలలో శుక్రోత్పాదక నాళికలు ఉంటాయి.
→ సెర్టోలి కణాలు అభివృద్ధి చెందే శుక్రకణాలకు పోషణను అందిస్తాయి.
→ లీడిగ్ కణాలు టెస్టోస్టిరానన్ను ఉత్పత్తి చేస్తాయి.
→ ఎపిడిడైమిస్ శుక్రకణాలను తాత్కాలికంగా నిలువ చేయడానికి, పరిపక్వతకు రావడానికి కావలసిన సమయాన్ని కలుగజేస్తుంది.
→ పురుషులలో ప్రసేకం మూత్ర, జననేంద్రియ వాహికలు కలిసి ఏర్పడిన అంత్యనాళం.
→ మేహనం మూత్రనాళంగానే కాకుండా స్త్రీ జీవి యోనిలో శుక్రద్రవాన్ని విడుదల చేసే ప్రవేశ్యాంగంగా కూడా పనిచేస్తుంది.
→ పురుష అనుబంధ జననేంద్రియ గ్రంథులు ఒక జత శుక్రాశయాలు, ఒకపౌరుష గ్రంథి, మరియు ఒకజత బలోయూరెత్రల్ గ్రంథులు.
→ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజకోశాలు, ఒక జత బీజవాహికలు, గర్భాశయం, యోని, బాహ్యజననాంగాలు శ్రోణి ప్రాంతంలో ఉంటాయి.
→ స్త్రీ బీజకోశాలు స్త్రీ బీజకణాలను, స్త్రీ బీజకోశ హార్మోనులను ఉత్పత్తి చేసే ప్రాథమిక లైంగిక అవయవాలు.
→ ఫాలోపియన్ నాళికలోని కలశికలో అండం ఫలదీకరణం చెందుతుంది.
→ గర్భాశయం దృఢంగా, కండరయుతమై, అధిక ప్రసరణ గల తలక్రిందులైన పియర్ ఆకారంలో ఉండే కోశం లాంటి నిర్మాణం.
→ గర్భాశయకుడ్యం మూడు కణజాలపు పొరలతో నిర్మితమైంది. అవి అంతర ఉపకళ.
→ యోని విశాలంగా ఉండే తంతు కండరయుత నాళం
→ యోని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని యోని పరివృతం అంటారు.
→ యోని రంధ్రం కన్నెపొర (హైమన్) అనే శ్లేష్మపొరతో పాక్షికంగా మూయబడి ఉంటుంది.
→ స్త్రీ ప్రత్యుత్పత్తి అనుబంధ గ్రంథులు – బార్తొలిన్ గ్రంథులు, స్కీన్ గ్రంథులు, క్షీర గ్రంథులు.
→ క్రియాత్మక క్షీరగ్రంథి ఉండటం స్త్రీ క్షీరదాల ప్రత్యేక ‘లక్షణం.
→ క్షీరగ్రంథులు శిశుజననాంతరం మాత్రమే పనిచేయడం ప్రారంభిస్తాయి.
→ పురుషులలో జరిగే బీజకణోత్పత్తిని శుక్రకణోత్పత్తి అని స్త్రీలలో జరిగే బీజకణోత్పత్తిని అండోత్పత్తిఅని అంటారు.
→ శుక్రకణం సూక్ష్మ, నిర్మాణంలో తల, మెడ, మధ్యభాగం, తోక అనే భాగాలుంటాయి.
→ లైంగిక సంపర్క సమయంలో పురుషుడు 200 నుండి 300 మిలియన్ల శుక్రకణాలను స్కలిస్తాడు.
→ శుక్రంలో శుక్రప్లాస్మాద్రవంతో పాటు శుక్రకణాలు ఉంటాయి.
→ పరిణితి చెందిన స్త్రీ బీజకణాలు ఏర్పడే విధానాన్ని అండోత్పత్తి లేదా అండజననం అంటారు.
→ పరిపక్వ పుటికను గ్రాఫియన్ పుటిక అంటారు.
→ స్త్రీ బీజకోశంలో గ్రాఫియన్ పుటిక పగిలి, ద్వితీయ అండ మాతృకణం విడుదల అవడాన్ని అండోత్సర్గం అంటారు.
→ అండోత్సర్గం తరువాత గ్రాఫియన్ పుటికలలోని గ్రాన్యులోసా కణాలు విభజన చెంది కార్పస్ లూటియం ఏర్పడుతుంది.
→ కార్పస్ లూటియం ప్రొజెస్టిరాన్ అనే హార్మోన న్ను స్రవిస్తుంది.
→ ప్రైమేట్స్లోని జరిగే ప్రత్యుత్పత్తి వలయాన్ని రుతుచక్రం అంటారు.
→ పిండాభివృద్ధి మొదటిదశ సంయుక్త బీజం విదళనాలు జరపడం, ఇది పూర్ణభంజిత పరిభ్రమణ, అసమాన పద్ధతిలో జరుగుతుంది.
→ ఫలదీకరణ జరిగిన 6వ రోజు ప్రతిస్థాపన ఆరంభమవుతుంది.
→ గాస్ట్రులేషన్ దశలో ఎపిబ్లాస్ నుంచి భవిష్యత్ అంతస్వచకణాలు లోపలి వైపు వలసపోవడాన్ని ప్రవేశం అంటారు.
→ పరాయుచూషకాలు మరియు గర్భాశయ కణజాలం ఒకదానితో ఒకటి వేళ్లలాగా అల్లుకొని, నిర్మాణాత్మక, క్రియాత్మక జరాయువు ఏర్పడుతుంది.
→ జరాయువు పిండాభివృద్ధికి కావలసిన ఆక్సిజన్, పోషకపదార్ధాలను, మాతృరక్తం నుండి గ్రహించి కార్భన్ డైఆక్సైడు, విసర్జక పదార్థాలను మాతృరక్తంలోకి విడుదల చేస్తుంది.
→ జరాయివు అంతఃస్రావగ్రంథిగా పనిచేసి ప్రొజెస్టిరాన్ హార్మోను స్రవించి 4వ నెల నుంచి గర్భ దారణను కాపాడుతుంది.
→ జరాయువు మాతృ ప్రతి రక్షకాలైన IgG అను పిండానికి రవాణా చేసి, పిండం యొక్క రోగ నిరోధకతను పెంచుతుంది.
→ భ్రూణ గర్భాశయాంతర అభివృద్ధిని గర్భధారణ అంటారు.
→ గరం అభివృద్ధి చెందే కాలాన్ని గర్భావధికాలం అంటారు.
→ గర్భావధికాలం అండం ఫలదీకరణం జరిగిన రోజు నుంచి సుమారు 266 రోజులు లేదా 38 వారాలు కాలం పడుతుంది.
→ గర్భావధి ముగిసే సమయానికి క్షీరగ్రంథులు పాలను ఉత్పత్తి చేస్తాయి. దీనినే చనుపాల ఉత్పత్తి అంటారు.
→ పిల్లలను ఆరోగ్యవంతులుగా పెంచడానికి కనీసం మొదటి పెరుగుదల దశలోనైనా తల్లిపాలు ఇవ్వాలని వైద్యులు సూచిస్తారు.
→ ఎర్నెస్ట్ హెకెల్
ఎర్నెస్ట్ హెకెల్ (ఫిబ్రవరి 16, 1834 – ఆగస్ట్ 9, 1919) జర్మన్ జీవశాస్త్రవేత్త, ప్రకృతి శాస్త్రవేత్త, తత్త్వవేత్త, వైద్యుడు, ఆచార్యుడు మరియు కళాకారుడు ఈయన డార్విన్ ప్రకృతివరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్దాంతం ప్రకారం ఒక జీవి జీవితచరిత్ర (అభివృద్ధి దశలు) ఆజీవి వర్గవికాస చరిత్ర (వాటి పూర్వికుల పరిణామ చరిత్ర)ను పునరావృతం చేస్తుంది. పిండోత్పత్తి శాస్త్రం అభివృద్ధిలో చేసిన కృషికి ఎర్నెస్ట్ హెకెల్ను “పిండోత్పత్తి శాస్త్ర పితామహుడి”గా గుర్తించారు.