Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 4(b) రోగనిరోధక వ్యవస్థ will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Zoology Notes Lesson 4(b) రోగనిరోధక వ్యవస్థ
→ ఎడ్వర్డ్ జెన్నర్- రోగనిరోధక శాస్త్ర పితామహుడు.
→ వ్యాధికారక జీవులకు వ్యతిరేకంగా పోరాడే అతిది లేదా జీవి యొక్క సామర్థ్యాన్ని రోగనిరోధకత అంటారు.
→ హానికర, సంక్రమణ జీవులు నుండి దేహానికి రక్షణ కలిగించే అవయవాలను, కణాలను, ప్రోటీన్ లు కలిసి ఏర్పడిన వ్యవస్థనే రోగనిరోధక వ్యవస్థ అంటారు.
→ రోగనిరోధక వ్యవస్థ అధ్యయనాన్ని రోగనిరోధక శాస్త్రం అంటారు.
→ పుట్టుకతోనే కలిగి ఉండే రోగనిరోధక శక్తిని సహజ లేదా స్వాభవిక రోగనిరోధకత అంటారు.
→ జీవి పుట్టిన తరువాత తన జీవిత కాలంలో ఏర్పర్చుకొన్న రోగనిరోధకతను స్వీకృత లేదా ఆర్ణీత రోగనిరోధకత అంటారు.
→ లాలాజలం, కన్నీటిలో ఉండే లైసోజైమ్ అనే ఎన్జైమ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా కణగోడను జీర్ణింపజేస్తుంది.
→ ముర్రుపాలులో Ig A రకపు ప్రతిదేహాలు అధికంగా ఉండి శిశువుకు రోగనిరోధకతను కల్పిస్తాయి.
→ B కణాలు అస్థిమజ్జలోని కాండకణాల నుండి ఉద్భవించి అక్కడే పరిణితిచెందుతాయి.
→ B కణాలు దేహద్రవనిర్వర్తిత రోగనిరోధకత వ్యవస్థలో ముఖ్యపాత్ర వహిస్తాయి.
→ T – కణాలు అస్థిమజ్జలోని కండ కణాల నుంచి ఉద్భవించి, థైమస్ ను చేరి అక్కడ పరిణితి చెందుతాయి.
→ T – కణాలు దేహద్రవనిర్వర్తిత, కణనిర్వర్తిత రోగనిరోధకత వ్యవస్థలో ముఖ్యపాత్ర వహిస్తాయి.
→ ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు – అస్థిమజ్జ, థైమస్ గ్రంథి, పక్షులలో బర్సా ఫాబ్రిసియస్
→ ద్వితియ లింఫాయిడ్ అవయవాలు- ప్లీహం, శోషరస కణుపులు, టాన్సిల్స్, ఉండూకం మొదలైనవి.
→ ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు – లింఫోసైట్ ఉత్పత్తిలోను, పరిణితి చెందించుటలోనూ పాల్గొంటాయి.
→ ద్వితీయ లింఫాయిండ్ అవయవాలు – పరిణతిచెందిన లింఫోసైట్ క్రియాశీల లింఫోసైట్గా మారుతాయి. ప్రతిజనకాలతో లింఫోసైట్ పరస్పరం చర్యలు జరపడానికి ఈ అవయవాలు చోటు కల్పిస్తాయి.
→ ఇంటర్ ఫెరాన్లు ఇవి వైరస్ సంక్రమణ కణాలు ఉత్పత్తి చేసే ప్రతివైరల్ ప్రోటీన్లు ఇది మూడురకాలు α, β మరియుγ – ఇంటర్ ఫెరాన్లు
→ ప్రతిజనకం – దేహంలో గుర్తించగలిగే రోగనిరోధక అనుక్రియను కలుగజేసే పదార్థాన్ని ప్రతిజనకం అంటారు.
→ ప్రతి దేహాలు : వ్యాధిజనక జీవులకు లేదా ప్రతిజనకాలకు ప్రేరణగా B – లింఫోసైట్లు కొన్ని ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి. వీటిని ప్రతిదేహాలు అంటారు.
→ ప్రతి దేహాలు అయిదు రకాలు అవి. IgG, IgA, IgM, IgD మరియు IgE.
→ MHC ప్రోటీన్లు – ఇవి స్వ, పర అణువులను గుర్తించుటలో ముఖ్యపాత్రవహిస్తాయి.
→ కేంద్రకం కలిగిన అన్ని కణాలు క్లాస్ – I MHC ప్రోటీన్లను ఉపరితలం పై ప్రదర్శిస్తాయి.
→ AP కణాలు – క్లాస్ – II MHC ప్రోటీన్లను ఉపరితలం పై ప్రదర్శిస్తాయి.
→ రోగనిరోధక జ్ఞప్తి ఉంచుకోవడం అనే లక్షణం మీద వ్యాక్సినేషన్ లేదా ఇమ్యునైజేషన్ సూత్రం పై ఆధారపడి ఉంటుంది.
→ AIDS, HIV వల్ల కలుగుతుంది.
→ HIV ఒక రిట్రోవైరస్, దీని మధ్యభాగంలో జన్యుపదార్ధంగా ssRNA అణువులుంటాయి.
→ ELISA, HIV ని గుర్తించడానికి ఉపయోగించే ప్రాథమిక పరీక్ష.
→ వెస్ట్రర్న్ బ్లాట్ పరీక్ష ద్వారా మాత్రమే HIV సంక్రమణను ధ్రువీకరిస్తుంది.