Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 6 జన్యు శాస్త్రం will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Zoology Notes Lesson 6 జన్యు శాస్త్రం
→ జీవుల అనువంశికత, అనువంశిక వైవిధ్యాల గురించి తెలిపే జీవశాస్త్ర శాఖే జన్యుశాస్త్రం.
→ గ్రెగర్ మెండల్ – జన్యుశాస్త్ర పితామహుడు.
→ జనిటిక్స్ – అనే పదాన్ని W. బేట్సన్ ప్రతిపాదించాడు.
→ ఒకే జన్యువు ఎక్కువ దృశ్యరూపాలను ప్రభావితం చేసే దృష్ఠిషియాన్నే ఫియోట్రోపి అంటారు.
→ ఒక జన్యువుకుండే రెండు ప్రత్యామ్నాయ రూపాలను యుగ్మవికల్పాలు అంటారు.
→ ఒక జన్యువుకు సమజాత క్రోమోజోమ్ లోని ఒకేస్థానం వద్ద రెండుకంటే ఎక్కువ యుగ్మ వికల్పాలు ఉండే వాటిని బహుళ యుగ్మవికల్పాలు అంటారు.
ఉదా : ABO రక్తవర్గాలు
→ మానవుడిలో ABO రక్త వర్గాలను మొదటిగా కార్ల్ లాండ్ స్టీనర్ ప్రతిపాదించాడు.
→ A, B ప్రతిజనకాలు RBC ప్లాస్మా త్వచం ఉపరితలంపై ఉండట లేదా ఉండకపోవుటను బట్టి రక్తాన్ని A, B, AB, O రక్తగ్రూపులుగా వర్గీకరించారు.
→ AB+ve రక్తవర్గాన్ని – విశ్వగ్రహీత వర్గం అంటారు.
→ O-ve రక్తవర్గాన్ని విశ్వదాత వర్గం అంటారు.
→ Rh కారకం అననుగుణ్యత వల్ల తల్లి గర్భంలో వృద్ధిచెందే భ్రూణంలో ఏర్పడే రోగనిరోధకా అపస్థితినే ఎరిత్రో బ్లాస్టోసిస్ ఫీటాలిస్ అంటారు.
→ రెండు యుగ్మ వికల్పాలు సమానస్థాయిలో వ్యక్తీకరించబడే లక్షణాన్ని సహబహిర్గతత్వం అంటారు.
→ ఏదేని ఒక లక్షణం అనువంశికతను అనేక జన్యువులు ఒక సమూహంగా ఏర్పడి నియంత్రించే స్థితిని బహుజన్య అనువంశికత అంటారు.
→ క్రోమో-సోమ్ సిద్ధాంతం ఆధారంగా లైంగిక క్రోమోసోమ్లు. లింగనిర్ధారణను నిర్ధేశిస్తాయి.
→ జన్యు సంతులన సిద్ధాంతాన్ని – C.B బ్రిడ్జెస్ ప్రవేశపెట్టాడు.
→ జన్యుసంతులన సిద్ధాంతం ప్రకారం X- క్రోమోసోమ్లపై ఉండే స్త్రీ జన్యువులకూ, ఆటోసోమ్లపై ఉండే పురుష జన్యువులకు గల సంతులనంపై ఆధారపడి ఉంటుంది.
→ లైంగిక క్రోమోసోమ్లపై ఉండి జన్యువులలో నిర్ధారింపబడే లక్షణాల అనువంశికతనే లింగసహలగ్న ఆనువంశికత అంటారు.
→ థామస్ హంట్ మోర్గాన్ – ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు.
→ ఏదైనా ఒక నిర్దిష్ట లక్షణం రెండు లేదా అంతకంటే ఎక్కువ తరాల పాటు, ఒక కుటుంబానికి చెందిన పూర్వికులలో ఏవిధంగా సంక్రమిస్తుందో నమోదు చేసిన చిత్రపటాన్ని వంశవృక్షం అంటారు.
→ ఒక జీవికి చెందిన మొత్తం జన్యుసమాచారాన్ని కలిగిన DNA ను జీనోం అంటారు.
→ మానవ జీనోంలో 3,164.7 మిలియన్ల నత్రజని క్షార జంటలు ఉంటాయి.
→ మానవుడిలో సమారు 30,000 జన్యువులు ఉంటాయి.
→ ఒక జన్యువులో సరాసరి 3000 క్షార జంటలు ఉంటాయి.
→ DNA ఫింగర్ ప్రింటింగ్ అంటే DNA అణువులలోని నత్రజని క్షారాల వరుసక్రమాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి ఆ DNA ఏ వ్యక్తి DNA ని పోలి ఉంటుందో నిర్ధారించే పరీక్ష
→ RFLP లు, VNTR లు, STRలు, SNP ను DNA మార్కర్లు లేదా జన్యు మార్కర్లు అంటారు.
→ థామస్ హంట్ మోర్గాన్:
- థామస్ హంట్ మోర్గాన్ (25- సెప్టెంబర్ 1866 నుండి 4- డిసెంబర్-1945) అమెరికా జీవశాస్త్ర, జన్యుశాస్త్రవేత్త మరియు పిండోత్పత్తి శాస్త్రవేత్త. మోర్గాన్, మెండల్ చేసిన ప్రయోగాలను మరింత లోతుగా, నిశితంగా పరిశీలించి మరికొన్ని జంతువుల మీద పరిశీలించి జన్యుశాస్త్రంలో ఎన్నో విషయాలను మన ముందుకు తెచ్చిన వ్యక్తి. అనువంశికతతో క్రోమోసోమ్ల పాత్ర అనే అంశం మీద చేసిన పరిశోధనలకు మోర్గాన్కు 1933లో నోబెల్ బహుమతి లభించింది. మోర్గాన్ ప్రయోగాల ఫలితంగా లైంగిక ప్రత్యుత్పత్తి వల్ల కలిగే వైవిధ్యాల గుట్టు తెలిసింది.
- ఈయన సహలగ్న జన్యువుల గురించి వివరించాడు మరియు డ్రాసోఫిలింమెల నోగాస్టర్లో లింగ సహలగ్నతను గుర్తించాడు. జన్యుశాస్త్రంలో మోర్గాన్ చేసిన కృషికి అయనను ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడుగా పేర్కొంటారు. మోర్గాన్ చేసిన పరిశోధనలను చదివే సాంప్రదాయక జన్యుశాస్త్ర శాఖను మోర్గానియన్ జెనిటిక్స్ అంటారు.