AP Inter 2nd Year Zoology Notes Chapter 7 జీవ పరిణామం

Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 7 జీవ పరిణామం will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Zoology Notes Lesson 7 జీవ పరిణామం

→ జీవ పరిణామం అంటే జీవుల పుట్టుక, కాలానుగుణంగా భూమిపై కనిపించే జీవవైవిధ్యం మొదలైన విషయాలను తెలియజేసే జీవశాస్త్ర విభాగం.

→ ప్రత్యేక దృష్టి సిద్ధాంతం- భూమిపై ఉన్న జీవులన్నీ ‘దైవశక్తి’ వల్ల సృష్టించబడ్డాయని తెలుపుతుంది.

→ యాదృఛ్ఛిక దృష్టి సిద్ధాంతం: ఈ సిద్ధాంతం ప్రకారం జీవుల సృష్టి నిర్జీవ లేదా కుళ్ళుతున్న పదార్థాల నుండి జరిగింది.

→ బయోజెనిసిస్ సిద్ధాంతం: ఈ సిద్ధాంతం ప్రకారం జీవులు అంతకు ముందే ఉన్న జీవుల నుంచి ఆవిర్భవించాయి. ఈ సిద్ధాంతాన్ని లూయీపాశ్చర్ ప్రయోగ పూర్వకంగా నిరూపించాడు.

→ జీవపరిణామసిద్ధాంతం: దీని ప్రకారం ప్రాథమిక జీవుల ఆవిర్భావం అకర్బన పదార్థాల నుంచి మెరుపులలోని విద్యుత్ శక్తి, అతినీలలోహిత రేడియోధార్మికత, అగ్నిపర్వతాల విస్ఫోటనం మొదలైన భౌతిక శక్తుల చర్యల వల్ల యాదృచ్ఛికంగా జరిగింది.

→ లామార్క్ సిద్ధాంతం ప్రకారం జీవుల చుట్టూ ఉన్న పరిసరాలు మారినట్లయితే ఆ జీవుల అవసరాలు మారతాయి. మారిన అవసరాలకు అనుగుణంగా కొన్ని శరీరభాగాలు అతిఉపయోగానికి కాని, నిరూపయోగానికి కాని దారి తీస్తాయి.

→ డార్వినిజమ్ – ఛార్లెస్ రాబర్ట్ డార్విన్ ప్రతిపాదించాడు.

→ డార్విన్ ప్రకృతివరణ సిద్ధాంతం: పకృతిలో పరిణామం ఏవిధంగా సంభవిస్తుందో వివరిస్తుంది.

→ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని హ్యూగో డిగ్రీస్ ప్రతిపాదించాడు.

→ ఉత్పరివర్తనం అనేది జీవులలో హఠాత్తుగా, యాదృచ్ఛికంగా కలిగే మార్పు. ఈ మార్పు అనువంశికతను పాటిస్తుంది.

→ హార్డీ – వెయిన్బర్గ్ సూత్రం – ఒక జాతి జనాభాలో జన్యుసంపుటి, జన్యుపౌనఃపున్యాల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది.

AP Inter 2nd Year Zoology Notes Chapter 7 జీవ పరిణామం

→ జనాభాలలోని జన్యు సంపుటిలో మార్పును కలుగజేసే బలాలను ‘జీవపరిణామ బలాలు’ అంటారు. అవి .

  • ప్రకృతివరణం,
  • జన్యు ప్రవాహం,
  • జన్యుభారం,
  • జెనిటిక్ డ్రిఫ్ట్లు మొదలైనవి.

→ ఒక జనాభా నుంచి మరొక జనాభాకు యుగ్మవికల్పాల చలనాన్ని ‘జన్యు ప్రవాహం’ అంటారు.

→ జనాభాలో హానికరమైన యుగ్మ వికల్పాలు లేదా జన్యువులు ఉండడాన్ని జన్యుభారం అంటారు.

→ చిన్న జనాభాలో వరణం వల్ల కాకుండా యాదృచ్ఛికంగా జన్యు పౌనఃపున్యంలో జరిగే మార్పును జెనెటిక్ డ్రిఫ్ట్

→ జాతి : జీవశాస్త్ర సిద్ధాంతం ప్రకారం జాతి అంటే “ఒక నిర్ణీత ప్రాంతంలో జీవిస్తూ, వాటిలో అవి అంతర ప్రజననం జరుపుకొనే శక్తి కలిగిన లేదా అంతర ప్రజననం జరుపుకొని వాటినే పోలిన ఫలవంతమైన సంతతిని ఉత్పత్తి చేయగలిగిన జీవుల జనాభా”.

→ జీవుల మధ్య అంతర ప్రజననాన్ని, సంకరీకరణాన్ని నివారించే అవరోధాన్ని ప్రత్యుత్పత్తి వివక్తత అంటారు.

→ డ్రయోపితికస్- తోక లేని కోతి

→ రామాపితికస్ మనిషిని పోలి ఉంటే జీవి

→ హోమో ఎరెక్టస్, హోమో ఎర్గాస్టర్ ఆఫ్రికాలో విస్తరించి, ఆ తరువాత ఆఫ్రికాను వదిలిన మొదటి జీవులుగా గుర్తించబడ్డాయి.

→ ఐరోపా ప్రాంతానికి చెందిన తొలి ఆధునిక మానవుడిని క్రోమాగ్నన్ మానవుడిగా పిలుస్తారు.

→ ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్
ఆల్ఫ్డ్ ర స్సెల్ వాలెస్ (8-1-1823 నుండి 7-11-1913) బ్రిటీష్ పర్యావరణ శాస్త్ర వేత్త, ఆంధ్రోఫాలజిస్ట్, మరియు జీవశాస్త్రవేత్త. చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన ప్రకృతివరణం ద్వారా జాతుల ఆవిర్భవంకు ప్రేరణ ఇచ్చిన మూడు రచనలలో ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ రచించిన వ్యాసం “మూలరకం నుండి విడిపోయేఉన్ముఖత్వం ప్రదర్శించే రకాలు ఒకటి.