AP Inter 2nd Year Zoology Notes Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం

Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 8 అనువర్తిత జీవశాస్త్రం will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Zoology Notes Lesson 8 అనువర్తిత జీవశాస్త్రం

→ పశు సంవర్థనం అనేది పశుగణ ప్రజననం, పెంపకం అనే వ్యవసాయ పద్ధతి.

→ ఎక్కువ పాలిచ్చే గేదె – ముర్రాజాతిది.

→ పాలిచ్చే జంతువుల ప్రజననం, పోషణ యాజమాన్యం, వాటి పాలు, పాల ఉత్పత్తులను అమ్మకానికి అనువుగా తయారుచేసి అమ్మడాన్ని డైరీయింగ్ అంటారు.

→ జంతువులలో అధిక ఉత్పత్తిని సాధించడానికి, ఉత్పత్తుల ఐచ్ఛిక లక్షణాలను అభివృద్ధి చేయడానికి జంతు ప్రజననం అనేది పశు సంవర్థనంలో ముఖ్యమైన అంశం.

→ వంశానుక్రమంలో బాగా దగ్గర సంబంధం గల జీవుల మధ్య జరిగే సంపర్కాన్ని అంతఃప్రజననం అంటారు.

→ మగ జనకజీవి ఆడ సంతతితో, ఆడ జనక జీవి మగ సంతతితో జరిపే సంపర్కాన్ని అతి సన్నిహిత ప్రజననం అంటారు.

→ ఐచ్ఛిక లక్షణం కోసం సన్నిహిత సంబంధం గల జీవుల మధ్య జరిపే వరణాత్మక ప్రజననాన్ని రేఖా ప్రజననం అంటారు.

→ అంతః ప్రజననం సమయుగ్మతను పెంచుతుంది.

→ సంబంధం లేని రెండు జంతువుల మధ్య జరిగే ప్రజననాన్ని బాహ్య ప్రజననం అంటారు.

→ బాహ్య సంపర్కం ఒకే ప్రజననాల మధ్య జరిగే సంపర్కం, కాని 4-6 తరాల వరకు వంశ వృక్షంలో ఇరువైపులా ఒకే పూర్వీకులు ఉండరాదు.

→ ఒక మేలుజాతి మగజీవితో వేరొక మేలుజాతి ఆడజీవిని సంపర్కం చేయడాన్ని పర ప్రజననం అంటారు.

→ వేరువేరు దగ్గరి ప్రజాతులకు చెందిన ఆడ, మగ జీవుల మధ్య సంపర్కం చేయడాన్ని అంతర జాతి సంకరణం అంటారు.

→ కేవలం గుడ్ల ఉత్పత్తి కోసం పెంచే పక్షులను లేయర్లు అంటారు.

→ మాంసం కోసం పెంచే పక్షులను బ్రాయిలర్లు అంటారు.

AP Inter 2nd Year Zoology Notes Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం

→ పద్మశ్రీ డా|| బి.వి. రావు భారతదేశ నవీన పార్టీ పితామహుడు.

→ ఏవియన్ ఫ్లూ పౌల్ట్రీ పక్షులకు సోకే ముఖ్యమైన వ్యాధి.

→ తేనె, మైనం ఉత్పత్తి కోసం తేనెతుట్టెల నిర్వహణ ద్వారా తేనెటీగలు పెంచడాన్ని ఎపికల్చర్ అంటారు.

→ మానవ వినియోగం కోసం చేపలు లేదా మానవుడికి ఆహారంగా ఉపయోగపడే ఇతర జలచర జంతువులను పట్టడం, పెంచడం వివిధ రకాలుగా నిలువ చేయడం, విక్రయించడాన్ని మత్స్య పరిశ్రమ అంటారు.

→ జల సంవర్థనం అంటే చేపలు మరియు ఇతర జలచరాలను నియంత్రిత పరిస్థితులలో పెంచడం.

→ కేవలం చేపలు మాత్రమే పెంచడాన్ని పిసికల్చర్ లేదా చేపల పెంపకం అంటారు.

→ ఇన్సులిన్ క్లోమ గ్రంథిలోని లాంగర్స్ పుటికల బీటా’ కణాల నుంచి ఉత్పత్తి అయ్యే ప్రోటీన్ హార్మోన్.

→ ఇన్సులిన్ 51 ఆమ్లాలతో నిర్మితమై ఉండి, రెండు పాలిపెప్టైడ్ గొలుసులను కలిగి ఉంటుంది.

→ ఒక ప్రత్యేక వ్యాధికి వ్యాధి నిరోధక శక్తిని పెంచే జీవ సంబంధ తయారీనే టీకా అంటారు.

→ తమ జీనోమ్కు అదనంగా అన్య జన్యువును వ్యక్తీకరించడానికి వాటి DNA సవరింపబడిన జంతువులను జన్యు పరివర్తిత జంతువులు అంటారు.

→ కణాల అసాధారణ పెరుగుదలను నియోప్లాసియా’ అంటారు.

→ కార్సినోమా- ఉపకళా కణాల క్యాన్సర్

→ సార్కోమాలు – సంయోజక కణజాలాల క్యాన్సర్.

→ ల్యుకేమియా – అదుపు లేకుండా WBC లను ఉత్పత్తి చేసే ఎముకమజ్ఞ క్యాన్సర్

→ లింఫోమాలు – శోషరస వ్యవస్థ క్యాన్సర్లు.

→ MRI – నిర్మాణాత్మక అవలక్షణాలను, వ్యాధికారక పరిస్థితులను నిర్థారణ చేయడానికి ఉపయోగపడుతుంది.

→ ECG – గుండెలో కలిగే విద్యుత్ మార్పులను నమోదు చేయడానికి సాధారణంగా వాడే హానిలేని పద్ధతి.

→ EEG – మెదడు విద్యుత్ క్రియాశీలతను నమోదు చేసే పద్ధతి.

→ ప్రత్యక్ష ELISA – ప్రతిజనకాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది.

→ అప్రత్యక్ష ELISA – ప్రతిదేహాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది.

AP Inter 2nd Year Zoology Notes Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం

→ వర్గీస్ కురియన్:
వర్గీస్ కురియన్ (26-నవంబం – 1921 నుండి 9-సెప్టెంబర్ – 2012) కేరళలోని కోజికోడ్లో జన్మించారు. కురియన్ భారతదేశంలో క్షీర విప్లవానికి నాంది పలికి, పాడిపరి శ్రమ సమగ్రాభివృద్ధికి దోహదం చేసిన పితామహుడు. ఈయన సుమారు 30 సంస్థలను (Amul, GCMME, IRMA, NDDB మొ||) స్థాపించి రైతులచే నడిపించినవాడు.
కురియన్ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్కు వ్యవస్థాపక ఛైర్మన్. ఈయన సృష్టించిన క్షీర విప్లవం పాల ఉత్పత్తిలో భారతన్ను నిరుపమాన దేశంగా నిలిపింది. కురియన్ను పద్మభూషణ్ గౌరవించింది. రామన్ మేఘసేసే అవార్డు కూడా కురియన్ను వరించింది.