Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Zoology Study Material Lesson 1(a) జీర్ణక్రియ, శోషణం Textbook Questions and Answers.
AP Inter 2nd Year Zoology Study Material Lesson 1(a) జీర్ణక్రియ, శోషణం
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
మానవ ప్రౌఢదశలోని దంత ఫార్ములాను తెలపండి. [T.S. Mar. ’15]
జవాబు:
మానవ ప్రౌఢదశలో 32 దంతాలుంటాయి. ప్రతి దవడ సమభాగములో ఉండే దంతాలు I.C.P.M, క్రమంలో అమరి ఉంటాయి. వీటిని దంత ఫౌర్ములాతో పేర్కొంటారు.
మానవ ప్రౌడదశలో దంత ఫార్ములా
\(\frac{2123}{2123}\)
= 32
ప్రశ్న 2.
పైత్యరసంలో జీర్ణ ఎన్జైమ్లు ఉండవు. అయినా జీర్ణక్రియలో ముఖ్యమైంది. ఎలా ? [T.S. Mar. ’16]
జవాబు:
పైత్యరసంలో జీర్ణ ఎన్జైమ్లు ఉండవు, కాని పైత్యరస లవణాలైన సోడియం, పొటాషియం గ్లికోకోలేట్లు, టారోకోలేట్లు ఉంటాయి. పైత్యరసంలో గల ఈ లవణాలు కొవ్వులను ఎమల్సీకరిస్తాయి మరియు లైపేజ్ అనే ఎన్జైములను ఉత్తేజితపరుస్తాయి. ఈ లైపేజ్లు ఎమల్సీకరించిన కొవ్వు పదార్థాలను కొవ్వు ఆమ్లాలు, గ్లిసరాల్గా విడగొడతాయి.
ప్రశ్న 3.
కైమోట్రిప్సిన్ పాత్రను వివరించండి. ఇదే రకానికి చెంది ఇదే గ్రంధి స్రవించిన రెండు ఎన్జైములను పేర్కొనండి.
జవాబు:
కైమోట్రిప్సిన్ ప్రోటీన్లు ప్రోటియోజెస్ మరియు పెప్టోన్ల జీర్ణక్రియలో ముఖ్యపాత్ర వహించి వాటిని ట్రై మరియు డైపెప్టైడ్లుగా మారుస్తుంది. కైమోట్రిప్సిన్, ట్రిప్సిన్ మరియు కార్బాక్సి పెప్టిడేజ్లు ఎండో పెప్టైడేజ్లు. ఇవి క్లోమము నుండి స్రవించబడి ప్రోటీన్ల జీర్ణక్రియలో తోడ్పడతాయి.
ప్రశ్న 4.
జీర్ణాశయంలో HCI స్రవించకపోతే ఏమి జరుగుతుందో వివరించండి.
జవాబు:
జీర్ణాశయంలో గోడలలోగల ఆక్సింటిక్ కణాలు HC ను స్రవిస్తాయి. HC/ ప్రోటీన్ల జీర్ణక్రియలో ముఖ్యపాత్ర వహిస్తుంది. HC/ ఆమ్ల pHని కలుగజేస్తుంది. ఇది పెప్సిన్ చర్యకు శ్రేష్టితమ pH మరియు క్రియారహిత పెప్సినోజనన్ను క్రియాశీల పెప్సిన్గా మారుస్తుంది. అందువలన జీర్ణాశయంలో HCI స్రవించకపోతే పెప్సిన్ క్రియారహితంగానే (పెప్సినోజన్) ఉంటుంది. ఇది ప్రోటీన్ల జీర్ణక్రియపై ప్రభావాన్ని చూపుతుంది.
ప్రశ్న 5.
గర్తదంతి (the codont) ద్వివార దంతి పదాలను వివరించండి.
జవాబు:
గర్తదంతి : మానవుడిలో దవడ ఎముక గర్తాలలో ఇమిడి ఉన్న దంతాలను గర్తదంతి అంటారు.
ద్వివార దంతి : మానవుడితో సహా అనేక క్షీరదాలలో దంతాలు వాటి జీవితకాలంలో రెండుసార్లు ఉద్భవిస్తాయి. బాల్యదశలో తాత్కాలిక పాలదంతాలు లేదా ఊడిపోయే దంతాలు, ప్రౌఢదశలో వాటి స్థానంలో శాశ్వత దంతాలు. ఈ రకం విన్యాసాన్ని ద్వివారదంత విన్యాసం అంటారు.
ప్రశ్న 6.
స్వయం ఉత్ప్రేరణ అంటే ఏమిటి ? రెండు ఉదాహరణలు ఇవ్వండి. [A.P. & T.S. Mar. 17; A.P. Mar. 15]
జవాబు:
ఒక ఉత్ప్రేరక చర్యలో అంతిమంగా ఏర్పడిన ఒక పదార్థం, అదే చర్యకు ఉత్ప్రేరకంగా పాత్రవహించి చర్యను జరిపిన దానిని స్వయం ఉత్ప్రేరకం అంటారు.
ఎంటి రోకైనెజ్
ప్రశ్న 7.
కైమ్ అంటే ఏమిటి ?
జవాబు:
జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమై, ఆమ్ల లక్షణాలున్న ఆహారాన్ని కైమ్ అంటారు.
ప్రశ్న 8.
మానవుడిలోని వివిధ రకాల లాలాజల గ్రంథులను పేర్కొని అవి నోటిలో ఏ ప్రాంతాల్లో ఉన్నాయో తెలపండి.
జవాబు:
మానవుడిలో మూడు జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. అవి
- పెరోటిడ్ గ్రంథులు ఇవి వెలుపలి చెవి పీఠభాగంలో ఉంటాయి.
- అధోజంభికా గ్రంథులు
- అధో జిహ్వికా గ్రంథులు
ఇవి క్రింది దవడ మూల భాగంలో ఉంటాయి.
నాలుక క్రింది భాగంలో ఉంటాయి.
ప్రశ్న 9.
మానవుడి నాలుకపై గల వివిధ సూక్ష్మాంకురాలను పేర్కొనండి.
జవాబు:
నాలుక పై భాగంలో చిన్నగా ముందుకు పొడుచుకొని వచ్చే నిర్మాణాలను సూక్ష్మాంకురాలు అంటారు. మానవుడి నాలుకపై మూడు రకాల సూక్ష్మాంకురాలు ఉంటాయి. అవి
1. ఫంజీఫామ్ సూక్ష్మాంకురాలు 2. తంతురూప సూక్ష్మాంకురాలు 3. సర్కంవెల్లేట్ సూక్ష్మాంకురాలు
ప్రశ్న 10.
మానవుడి దేహంలో అత్యంత కఠిన పదార్ధం ఏది ? అది ఏవిధంగా ఏర్పడుతుంది ?
జవాబు:
దంతానికి కిరీట భాగంలో డెంటినన్ను ఆవరించి పింగాణి పొర ఉంటుంది. ఈ పింగాణి పొర మానవ దేహంలో అతి దృఢమైన పదార్థం. దీన్ని బహిస్త్వచం నుంచి ఏర్పడిన ఎమియోబ్లాస్ట్లు స్రవిస్తాయి.
ప్రశ్న 11.
మానవుడి జీర్ణనాళంలో అవశేష అవయవంగా ఉండి, శాకాహారులలో బాగా అభివృద్ధి చెందిన ఈ భాగం ఏది ? ఇం ఏ రకపు కణజాలంతో ఏర్పడుతుంది ?
జవాబు: ఉండూకం మానవుని జీర్ణనాళంలో అవశేష అవయవం. ఇది అంధనాళం నుంచి పొడుచుకుని వచ్చే సన్నటి వేలు లాంటి నాళికాయుత నిర్మాణం. ఇది శాఖాహారులలో బాగా అభివృద్ధి చెంది, సెల్యూలోస్ జీర్ణక్రియలో ముఖ్యపాత్ర వహిస్తుంది. ఉండూకం లింపాయిడ్ కణజాలంను కలిగి ఉంటుంది. ఇవి రోగ నిరోధక వ్యవస్థలో ముఖ్యపాత్ర వహిస్తాయి.
ప్రశ్న 12.
మింగడం, నమలడం మధ్య బేధాన్ని తెల్పండి.
జవాబు:
మింగడం : తీసుకున్న ఆహారం మింగడం మూడు దశలలో జరుగుతుంది.
- నమిలిన ఆహారాన్ని ముద్దగా సేకరించడం.
- ఈ ఆహారపు ముద్దను గ్రసని ద్వారా ఆహారవాహిక పూర్వాంతరానికి చేర్చడం.
- ఆహార వాహిక నుండి జీర్ణాశయమునకు చేరుతుంది.
నమలడం : తీసుకున్న ఆహారాన్ని కొరకడం, చీల్చడం, నమలడం ద్వారా చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. దంతాలు నమలడం వల్ల, నాలుక కలపడం వల్ల లాలాజలంతో కలిసి ఆహారం మెత్తగా, ముద్దగా మారుతుంది.
ప్రశ్న 13.
నీళ్ళ విరేచనాలు, మలబద్దకం మధ్య భేదాన్ని తెలపండి.
జవాబు:
నీళ్ళ విరేచనాలు : అసాధారణ ఆంత్ర కదలికలు, పలుచని ద్రవరూప మలవిసర్జన దీని లక్షణం. ఆహార శోషణ తగ్గి అధిక నీటి నష్టం జరగడం వల్ల దేహం నిర్జలీకరణకు గురువుతుంది.
మలబద్దకం : పెద్దపేగు కదలికలు తక్కువ కావడం వల్ల మలం పురీషనాళంలో నెమ్మదిగా కదులుతూ ఎక్కువ నీటిని కోల్పోవడం వల్ల గట్టిగా మారుతుంది. దీనివల్ల మలవిసర్జన కష్టమవుతుంది. నీటిని తక్కువగా తాగడం, ఆహారంలో పీచు పదార్థం తగ్గడం, ఎక్కువ కంగారుపడటం కూడా దీనికి కారణాలు.
ప్రశ్న 14.
ఆంత్రమూలంలోని శ్లేష్మస్తరం స్రవించే రెండు హార్మోనులను పేర్కొనండి.
జవాబు:
సెక్రిటిన్, కొలెసిస్టోకైనిన్ (CCK) హార్మోనులు ఆంత్రమూలం శ్లేష్మస్తరం నుండి స్రవించబడతాయి.
ప్రశ్న 15.
శోషణ, స్వాంగీకరణం మధ్య భేదాన్ని తెలపండి.
జవాబు:
శోషణ : జీర్ణక్రియ ఫలితంగా ఏర్పడిన అంత్యపదార్థాలు పేగు గోడలలోని శ్లేష్మస్తరంలోకి, దాని నుంచి రక్తం లేదా శోషరసంలో గ్రహించబడడాన్ని శోషణ అంటారు. ఇది నిష్కియ, సక్రియా యంత్రాంగాల ద్వారా జరుగుతుంది.
స్వాంగీకరణం : శోషణం చెందిన జీర్ణ పదార్థాలు చివరి కణజాలాలకు చేరి, జీవ పదార్థ అనుఘటకాలుగా మార్చబడతాయి. ఇవి శక్తి ఉత్పాదన, పెరుగుదల మరమ్మత్తు చేయడానికి వినియోగపడతాయి. ఈ విధానాన్నే ‘స్వాంగీకరణం’ అంటారు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
దంతం నిలువుకోత పటం గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
ప్రశ్న 2.
జీర్ణాశయంలో మాంసకృత్తుల జీర్ణక్రియను వివరించండి. [T.S. Mar. ’16; A.P. Mar. ’15]
జవాబు:
మాంసకృత్తుల జీర్ణక్రియ జీర్ణాశయంలో మొదలవుతుంది. జీర్ణాశయమును చేరిన ఆహారం ఆమ్ల గుణం గల జఠర రసంతో కలుపబడి, జీర్ణాశయం గోడలలోని కండరాల చర్యవల్ల బాగా చిలకబడి ‘క్రైమ్’ ఏర్పడుతుంది. జఠర రసంలో శ్లేష్మం, బైకార్బోనేట్లు ఉంటాయి. ఇవిశ్లేష్మస్తర ఉపకళను లూబ్రికేట్ చేయడంలోనూ, గాడ HCL నుండి కాపాడటంలోను ముఖ్యపాత్ర వహిస్తాయి.
గాఢ HCl ఆమ్ల pH ని (1.8) కలుగజేస్తుంది. ఇది పెస్సిన్ చర్యకు కావలసిన శ్రేష్ఠతమ pH ఇస్తుంది. జఠర రసంలోని ప్రోఎన్జైమ్లు పెప్సినోజన్, ప్రోరెనిన్లు, హైడ్రోక్లోరిక్ ఆమ్ల సమక్షంలో పెప్సిన్, రెనిన్ అనే చైతన్యవంత ఎన్ఎమ్లుగా మారతాయి. పెప్సిన్ మాంసకృత్తులను ప్రోటియోజ్లు పెప్టోన్లుగా విడగొడుతుంది. రెనిన్, శిశువు జఠరరసం లోగల ప్రోటయోలైటిక్ ఎన్ఎమ్. ఇది పాలలోని కెసీన్ అనే ప్రోటీన్ను, కాల్షియం అయానుల సమక్షంలో కాల్షియం పారకేసినేట్ గా మారుస్తుంది. పెప్సిన్ కాల్షియం పారాకేసినేట్ను పెప్టోన్లుగా మారుస్తుంది. జీర్ణాశయంలో మాంసకృత్తుల జీర్ణక్రియ నాలుగు గంటల సమయం పాటు జరుగుతుంది.
ప్రశ్న 3.
మాంసకృత్తుల జీర్ణక్రియలో క్లోమరస పాత్రను వివరించండి.
జవాబు:
క్లోమరసం క్లోమము నుండి స్రవించబడి, మాంసకృత్తుల జీర్ణక్రియలో ముఖ్యపాత్ర వహిస్తుంది. క్లోమరసంలో ప్రోఎమైన ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్ మరియు ప్రోకార్బాక్సి పెప్టిడేజ్ వంటి ప్రోటీన్ హైడ్రోలైజింగ్ ఎంజైములు ఉంటాయి. కాని ఇవి క్రియాశీలరహితంగా ఉంటాయి.
ట్రిప్సినోజనన్ను ఆంత్ర శ్లేష్మస్తరం స్రవించే ఎంటిరోకైనేజ్ అనే ఎన్జైమ్ ఉత్తేజితం చేసి క్రియాశీల ట్రిప్సిన్గా మారుస్తుంది. ఇది తిరిగి క్లోమరసంలోని ఇతర ఎన్ఎమ్లను క్రియాశీలంగా చేయడమే కాకుండా స్వయం ఉత్ప్రేరణ (auto catalysis) ద్వారా ట్రిప్సినోజన్ ను ట్రిప్సిన్ గా మారుస్తుంది.
క్లోమరసం యొక్క కైమోట్రిప్సిన్, ట్రిప్సిన్ కార్బాక్సి పెప్టిడేజ్లు, క్రైమ్ లో గల ప్రోటీన్లు, ప్రోటియోజ్లు, పెప్టోన్లపై పనిచేసి వాటిని ట్రై మరియు డై పెప్టైడ్లుగా మారుస్తాయి. ఇవి మరల ట్రై మరియు డై పెప్టిడేజ్ల చేత జలవిశ్లేషణ చెంది అంత్య పదార్థాలు అయిన అమైనో ఆమ్లాలను ఏర్పరుస్తాయి.
ప్రశ్న 4.
పాలిశాకరైడ్, డైశాకరైడ్లు ఏవిధంగా జీర్ణమవుతాయి ?
జవాబు:
మనం తీసుకొనే ఆహారంలో పిండిపదార్థాలైన స్టార్చ్ గ్లైకోజన్ వంటి పాలిశాకరైడ్లు, డై శాకరైడ్లు ఉంటాయి. ఈ పిండి పదార్థాల జీర్ణక్రియ ఆస్యకుహరంలో ప్రారంభమవుతుంది.
- ఆస్యకుహరంలో పిండిపదార్థాల జీర్ణక్రియ: ఆస్యకుహరంలో ఆహారం నమలడం వల్ల లాలాజలంతో కలియును. లాలాజలంలో గల పిండిపదార్థాలను జల విశ్లేషణ చేసే టయలిన్/ లాలాజల ఎమైలేజ్ వంటి ఎన్జైములు స్టార్చ్ వంటి పిండి పదార్థాలను (30%) జలవిశ్లేషణ జరిపి మాల్టోజ్ వంటి డై శాకరైడ్లుగా మారుస్తుంది.
- జీర్ణాశయంలో పిండిపదార్థాల జీర్ణక్రియ : జీర్ణాశయంలో పిండిపదార్థాలు జీర్ణం కావు. జఠర రసంలో పిండి పదార్థాలను విడగొట్టు (జీర్ణింపజేయు) ఎన్జైములు లేవు. కాని, అధిక ఆమ్ల pH వల్ల కొంత సుక్రోజ్ జల విశ్లేషణ చెందవచ్చు.
- చిన్న ప్రేగులో పిండిపదార్థాల జీర్ణక్రియ : చిన్న ప్రేగును చేరిన పిండి పదార్థాలు క్లోమ మరియు ఆంత్ర రసాలతో బాగుగా కలియును.
లాలాజలంలో ఎమైలేజ్ చర్య జరపగా మిగిలిన 70% పిండిపదార్ధాలను క్లోమరసంలోని ఎమైలేజ్ జలవిశ్లేషణ జరిపి మాల్టోజ్ (డైశాకరైడ్)గా మారుస్తుంది. ఆంత్రరసంలోని మాల్టేజ్ దాన్ని గ్లూకోజ్ గా మారుస్తుంది. ఇంతేకాకుండా ఆంత్రరసంలోని సుక్రేజ్, లాక్టేజ్లు డైశాకరైడ్లైన సుక్రోజ్, లాక్టోజ్లపై చర్యజరిపి మోనోశాకరైడ్లను ఏర్పరుస్తాయి.
ప్రశ్న 5.
మీ ఆహారంలో వెన్న తీసుకుంటే, అది ఏవిధంగా జీర్ణం అవుతుందో, శోషణం చెందుతుందో వివరించండి.
జవాబు:
వెన్నలో కొవ్వు పదార్థం ఉంటుంది. కొవ్వు పదార్థాలు జీర్ణాశయంలో జీర్ణంకాని స్థితిలోనే ఉంటాయి.
చిన్న పేగులో కొవ్వు పదార్థాల జీర్ణక్రియ: చిన్న పేగులో, కొవ్వు పదార్థాలు పూర్తిస్థాయిలో జీర్ణమవుతాయి. చిన్న పేగును చేరిన కొవ్వు పదార్ధాలు, పైత్యరసం మరియు క్లోమరసంలో గల శక్తివంతమైన లైపేజ్ చర్య వల్ల జీర్ణమవుతాయి. పైత్యరస లవణాలు సోడియం/పొటాషియం గ్లెకోకోలేట్టు మరియు టారోకోలేట్లు కొవ్వు పదార్థాలను ఎమల్సీకరిస్తాయి. ఎమల్సీ కరణం వల్ల కొవ్వు పదార్థాలు చిన్నచిన్న సూక్ష్మమైసెల్లెలుగా విడగొట్టబడతాయి. క్లోమరసంలోని లైపేజ్ (స్ట్రియాప్సిన్), ఆంత్రరసంలోని లైపేజ్లు ఎమల్సీకరించిన కొవ్వు పదార్థాలను కొవ్వు ఆమ్లాలు, గ్లిసరాల్ ను విడగొట్టబడతాయి.
శోషణ : కొవ్వు ఆమ్లాలు, మోనోడైగ్లిజరైడ్లు నీటిలో కరుగవు. ఇవి రక్తంలోకి నేరుగా శోషణం చెందలేవు. ఇవి మొదట సూక్ష్మ బిందువులుగా మార్చబడతాయి. వీటిని మైసెల్లేలు అంటారు. ఇవి పేగు శ్లేష్మస్తర కణాలలోకి వ్యాపనం ద్వారా ప్రవేశిస్తాయి. ఉపకళ కణంలో మోనోగ్లిజరైడ్లు, కొవ్వు ఆమ్లాలు తిరిగి ట్రైగ్లిజరైడ్లుగా సంశ్లేషణం చెంది, కొద్ది మొత్తంలో ఫాస్ఫోలిపిడ్లు, కొలెస్టిరాల్తో కలిసి ప్రోటీన్లతో ఆవరింపబడి చిన్న చిన్న కొవ్వు గుళికల రూపంలో మారతాయి. వీటినే కైలోమైక్రాన్లు అంటారు. ఇవి ఆంత్ర సూక్ష్మ చూషకాలలో ఉండే లాక్టియల్ అనే శోషరస సూక్ష్మనాళికలోనికి కణ బహిష్కరణ (exocytosis) పద్ధతిలో ప్రవేశిస్తాయి. శోషరస నాళాలు చివరికి శోషణం చెందిన కొవ్వు పదార్థాలను అధోజత్రుకాసిర, ఉరఃనాళం ద్వారా రక్త ప్రవాహంలోకి విడుదల చేస్తాయి. ఈ కైలో మైక్రాన్లు ఎండోథీలియల్ గోడల నుంచి విడుదలైన లైపోప్రోటీన్ లైపేజ్ ఎన్ఎమ్ చర్య ద్వారా విచ్ఛిన్నం చెంది కొవ్వు ఆమ్లాలు, గ్లిసరాల్ గా మారతాయి. ఇవి ఎడిపోస్ కణజాలంలోని ఎడిపోసైట్లలోకి వ్యాపనం చెంది తటస్థ కొవ్వుగా, కాలేయంలోకి వ్యాపనం చెంది కణజాల కొవ్వుగా నిలువ ఉంటాయి.
ప్రశ్న 6.
కాలేయం విధులను పేర్కొనండి. [AP TS Mar 15]
జవాబు:
కాలేయం అనేక విధులను నిర్వహిస్తుంది. అవి సంశ్లేషణ (synthesis) నిలువ, అనేక స్రావాలను స్రవించడం. అవి కింది విధంగా ఉంటాయి.
1. కాలేయం, పసుపు ఆకుపచ్చ రంగులో ఉన్న పైత్యరసాన్ని స్రవిస్తుంది. పైత్యరసం సోడియం /పోటాషియం గ్లైకోకోలేట్లు, టారోకోలెట్ల వంటి లవణాలను కలిగి ఉంటుంది. ఇవి కొవ్వుల జీర్ణక్రియలో తోడ్పడతాయి.
2. కాలేయం, కార్బోహైడ్రేట్ల జీవక్రియలో ముఖ్యపాత్ర వహిస్తుంది.
a) గ్లైకోజెనిసిస్ : గ్లూకోజ్ నుండి గ్లైకోజన్ ఏర్పడుట
b) గ్లైకోజినోలైసిన్ : గ్లైకోజన్ విచ్ఛిన్నం చెంది గ్లూకోజ్ను ఏర్పర్చుట
c) గూకోనియోజెనిసిస్ : వివిధ అమైనో ఆమ్లాలు, లాక్టిక్ ఆమ్లం, గ్లిసరాల్ నుండి గ్లూకోజ్ సంశ్లేషణం చెందుట
3. కొలెస్టిరాల్, ట్రైగ్లిసరైడ్ల సంశ్లేషణలో కాలేయం ముఖ్యపాత్ర వహిస్తుంది.
4. ఆమైనో ఆమ్లాలను డి-ఎమినేషన్ చేసి విడుదలైన అమ్మోనియాను ఆర్నిథిన్ వలయం ద్వారా యూరియాగా మారుస్తుంది.
5. ఆహారం ద్వారా ప్రేగులోకి ప్రవేశించిన విష పదార్థాలను విషరహితంగా మారుస్తుంది.
6. కాలేయం ఉష్ణక్రమత అవయవంగా పనిచేస్తుంది.
7. పిండ దశలో కాలేయం రక్త కణోత్పాదక అంగంగా ప్రౌఢదశలో ఎర్రరక్తకణ విచ్ఛిత్తి అంగంగా పనిచేస్తుంది.
8. కాలేయం ప్లాస్మా ప్రోటీన్లను సంశ్లేషిస్తుంది. అవి ఆల్బుమిన్, గ్లోబ్యులిన్లు రక్త స్కందన కారకాలైన ఫైబ్రినోజన్, ప్రోత్రాంబిస్ మొదలైనవి మరియు ప్రతి రక్తస్కందకం అయిన హెపారిన్ ను కూడా ఉత్పత్తి చేస్తుంది.
9. వాయు రహిత కండర సంకోచంలో ఏర్పడిన లాక్టిక్ ఆమ్లాన్ని కోరి వలయం ద్వారా గ్లెకోజన్ గా మారుస్తుంది.
10. కుఫర్ కణాలు పెద్దవైన భక్షక కణాలు. ఇవి కాలేయంలోకి ప్రవేశించిన అనవసర పదార్థాలను, సూక్ష్మజీవులను క్రిమిభక్షణ (phagocytic) పద్ధతిలో తొలగిస్తాయి.
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
మానవుడి జీర్ణవ్యవస్థలో వివిధ రకాల ఆహార పదార్థాల జీర్ణక్రియా విధానాన్ని వివరించండి.
జవాబు:
సంక్లిష్టమైన శోషింపబడలేని ఆహార పదార్థాలు, సరళమైన శోషించబడగలిగిన సరళరూపంలోకి మార్చబడే విధానాన్నే జీర్ణక్రియ అంటారు. జీర్ణక్రియ అనేది యాంత్రిక, జీవరసాయన ప్రక్రియల ద్వారా జరుగుతుంది.
I. ఆస్యకుహరంలో జీర్ణక్రియ: ఆస్యకుహరం రెండు ప్రధాన విధులను నిర్వహిస్తుంది. అవి ఆహారాన్ని నమలడం, మింగడంలో ‘సహాయపడటం. దంతాలు నమలడం వల్ల, నాలుక కలపడం వల్ల, లాలాజలం నీటిని సమకూర్చి శ్లేష్మంతో లూబ్రికేట్ చేయడం వల్ల ఆహారం మెత్తగా, ముద్దగా మారుతుంది. దీన్నే “బోలస్” అంటారు. లాలాజలంలో నీరు, Nat, K+, CIF, HCO3 వంటి విద్యుత్ విశ్లేష్యకాలు, శ్లేష్మం, ఎన్జైములైన లాలాజల ఎమైలేజ్ (టయలిన్), లైసోజైములు ఉంటాయి. పిండి పదార్థాలు జీర్ణక్రియ లాలాజల ఎమైలేజ్తో (టయలిన్) ఆస్యకుహరంలో ప్రారంభమవుతుంది. ఇది సుమారు 30% పిండిపదార్థాన్ని జలవిశ్లేషణ జరిపి డైశాకరైడ్ అయిన మాల్టోజ్ గా మారుస్తుంది.
లైసోజైము ఆహారంలో ఉన్న బ్యాక్టీరియాను నశింపజేస్తుంది.
II. జీర్ణాశయంలో జీర్ణక్రియ: ఆస్యకుహరం నుండి ‘బోలస్’ జీర్ణాశయమును చేరుతుంది. జీర్ణాశయములో పిండి పదార్థాల జీర్ణక్రియ ఆగి, మాంసకృతుల జీర్ణక్రియ మొదలవుతుంది. జీర్ణాశయంలో ఆహారం ఆమ్ల గుణం గల జఠరరసంతో కలుపబడి, జీర్ణాశయం గోడలలోని కండరాల చర్యవల్ల బాగా చిలకబడి కైమ్’ ఏర్పడుతుంది. జఠరరసంలో శ్లేష్మం, బైకార్బోనేట్లు ఉంటాయి. ఇవి శ్లేష్మస్తర ఉపకళను లూబ్రికేట్ చేయడంలోనూ, గాఢ HCI నుంచి కాపాడటంలోను ముఖ్యపాత్ర వహిస్తాయి. గాఢ HC౭ ఆమ్ల pH ని (1.8) కలుగజేస్తుంది. ఇది పెప్సిన్ చర్యకు కావలసిన శ్రేష్ఠతమ pH ఇస్తుంది. జఠర రసంలోని ప్రోఎన్జైములు పెప్సినోజన్, ప్రోరెనిన్లు, హైడ్రోక్లోరిక్ ఆమ్ల సమక్షంలో పెప్సిన్, రెనిన్ అనే చైతన్యవంత ఎన్జైములుగా మారుతాయి. పెప్సిన్ మాంసకృత్తులను ప్రోటియోజ్లు, పెప్టోన్లుగా విడగొడుతుంది. రెనిన్ శిశువు జఠరరసంలోగల ప్రోటియోలైటిక్ ఎన్ఎమ్. ఇది పాలలోని కెసీన్ అనే ప్రోటీన్ ను, కాల్షియం అయానుల సమక్షంలో కాల్షియం పారాకేసినేట్గా మారుస్తుంది. పెప్సిన్ కాల్షియం పారాకేసినేట్ను పెప్టోన్లుగా మారుస్తుంది. జీర్ణాశయంలో మాంసకృత్తుల జీర్ణక్రియ నాలుగు గంటల సమయంపాటు జరుగుతుంది.
III. చిన్న పేగులో జీర్ణక్రియ : చిన్న పేగు కుడ్యంలోని బాహ్య కండర స్తరంలోని కండరాలు అనేక రకాల కదలికలను కలుగజేస్తాయి. ఈ కదలికలు పైత్యరసం, క్లోమరసం, ఆంత్రరసాలను కైమ్తో బాగా కలపడం వల్ల పేగులో జీర్ణక్రియ సులువుగా జరుగుతుంది. క్లోమం స్రవించే శ్లేష్మం, బైకార్బోనేట్లు ఆంత్ర శ్లేష్మస్తరాన్ని ఆమనీబి మాధ్యమం నుంచి రక్షిస్తూ ఆమ్ల మాధ్యమాన్ని క్షారయుతంగా మార్చి ఎన్ జైమ్ చర్యలకు కావలసిన క్షారమాధ్యమాన్ని కలుగజేస్తాయి. ఆంత్రమూలం సమీపాగ్ర భాగంలోని కణాలు ఎక్కువ మోతాదులో బైకార్బోనేట్లను ఉత్పత్తి చేసి జఠర రసాన్ని పూర్తిగా తటస్థీకరించి ఆంత్రంలోకి ఆమ్ల ప్రవేశం లేకుండా చేస్తాయి. క్లోమరస, ఆంత్రరస ఎన్జైములు క్షార మాధ్యమంలోనే సమర్ధవంతంగా పనిచేస్తాయి.
i) ప్రోటీన్ల జీర్ణక్రియ : క్లోమరసంలో ప్రోఎన్జైములైన ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, మరియు ప్రోకార్బాక్సి పెప్టిడేజ్ వంటి క్రియాశీల రహిత ప్రోటీన్ హైడ్రోలైజింగ్ ఎన్జైములు ఉంటాయి. ట్రిప్సినోషన్ను ఆంత్ర శ్లేష్మస్తరం స్రవించే ఎంటిరోకైనేజ్ అనే ఎన్ జైమ్ ఉత్తేజితం చేసి క్రియాశీల ట్రిప్సిన్గా మారుస్తుంది. ఇవి తిరిగి క్లోమరసంలోని ఇతర ఎన్జైములను క్రియాశీలంగా చేయడమే కాకుండా స్వయం ఉత్ప్రేరణ (auto catalysis) ద్వారా ట్రిప్సినోజన్ ను ట్రిప్సిన్ గా మారుస్తుంది.
క్లోమరసం యొక్క కైమోట్రిప్సిన్, ట్రిప్సిన్, కార్బాక్సీ పెప్టిడేజ్లు, క్రైమ్ లోగల ప్రోటీన్లు, ప్రోటియోన్లు, పెప్టోన్లపై పనిచేసి వాటిని ట్రై మరియు డై పెప్టైడ్లుగా మారుస్తాయి. ఇవి మరల ట్రై మరియు డై పెప్టిడేజ్ల చేత జల విశ్లేషణ చెంది అంత్య పదార్థాలు అయిన అమైనో ఆమ్లాలను ఏర్పరుస్తాయి.
ii) కొవ్వుల జీర్ణక్రియ : కొవ్వు పదార్థాలను పైత్యరస లవణాలు ఎమల్సీకరిస్తాయి. ఎమల్సీ. కరణం వల్ల కొవ్వు పదార్థాలు చిన్న చిన్న సూక్ష్మ మైసెల్లెలుగా విడగొట్టబడతాయి. క్లోమరసంలోని లైపేజ్ (స్ట్రియాప్సిన్), ఆంత్రరసం లైపేజ్లు ఎమల్సీకరించిన కొవ్వు పదార్థాలను కొవ్వుఆమ్లాలు మరియు గ్లిజరాల్ ను విడగొట్టబడతాయి.
iii) కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ: కైమ్ లో పిండి పదార్థాలను (మిగిలిన 70%) క్లోమరసంలోని ఎమైలేజ్ జలవిశ్లేషణ జరిపి మాల్టోజ్ మారుస్తుంది. ఆంత్రరసంలోని మాల్టేజ్ దాన్ని గ్లూకోజ్ మారుస్తుంది. ఇంతేకాకుండా ఆంత్రరసంలోని సుక్రేజ్, లాక్టేజ్, డైశాకరైడ్లైన ‘సుక్రోజ్, లాక్టోజ్లపై చర్య జరిపి మోన్ శాకరైడ్లను ఏర్పరుస్తాయి.
iv) కేంద్రకామ్లాల జీర్ణక్రియ: క్లోమరసంలోని న్యూక్లియేజ్లు కేంద్రకామ్లాలను న్యూక్లియోటైడ్ లు, నూక్లియోసైడ్లుగా మారుస్తాయి. ఆంత్రరసంలో న్యూక్లియోటైడేజ్, న్యూక్లియోసైడేజ్ ఎంజైములు ఉంటాయి. ఇవి న్యూక్లియోటైడ్, న్యూక్లియోసైడ్లను పెంటోజ్ చక్కెర, నత్రజని క్షారాలుగా మారుస్తాయి.
జీర్ణక్రియ ఫలితంగా ఏర్పడిన అంత్య పదార్థాలు పేగు గోడలలోని శ్లేష్మస్తరంలోకి శోషించబడి, దాని నుండి రక్తం లేదా శోషరసంలోకి గ్రహించబడతాయి. ఇవి నిష్క్రియ (passive), సక్రియ (active) రవాణా యంత్రాంగాల ద్వారా శోషించబడతాయి.
ప్రశ్న 2.
మానవ జీర్ణవ్యవస్థ పటం గీచి, భాగాలు గుర్తించి, వివరించండి.
జవాబు:
మానవ జీర్ణవ్యవస్థ వివిధ అంగాల మరియు కణజాలాల సమూహము ఇవి సంక్లిష్టమైన శోషించబడలేని ఆహార పదార్థాలు, సరళమైన శోషించబడగలిగిన సరళ రూపంలోకి మార్చును.
మానవ జీర్ణవ్యవస్థలో ఆహార నాళం, అనుబంధగ్రంధులు ఉంటాయి.
ఆహారనాళం/ జీర్ణనాళం:
మానవ ఆహారనాళం పూర్వభాగంలో నోటితో మొదలై పర భాగంలో పాయువుతో అంతమవుతుంది. ఆహారనాళం యొక్క భాగాలు :
- నోరు మరియు ఆస్యకుహరం
- గ్రసని
- ఆహారవాహిక
- జీర్ణాశయం
- చిన్న ప్రేగు
- పెద్ద పేగు
1. నోరు మరియు ఆస్యకుహరం : నోరు ఆహారనాళంలో మొదటి భాగము. నోటిని ఆవరించి కదిలే పై, క్రింది పెదవులను కలిగి వుంటుంది. నోరు ఆస్యకుహరంలోకి తెరచుకుంటుంది. తాలువు ఉదర ఆస్యకుహరాన్ని పృష్ఠ నాసికా కక్ష్య నుండి వేరు చేయడం వల్ల, ఆహారం నమలడం, శ్వాసించడం ఏక కాలంలో జరుగుతాయి. దవడ ఎముకపై నాలుగు రకాల దంతాలు ఉంటాయి. నాలుక ఆస్యకుహరం ఆధారం దగ్గర అతికి ఉంటుంది.
(i) దంతాలు : దంతాలు బాహ్య – మధ్యత్వచం నుంచి ఉద్భవిస్తాయి. మానవుని ప్రౌఢదశలో 32 శాశ్వత దంతాలు ఉంటాయి. ఇవి నాలుగు రకాలు. అవి : కుంతకాలు (Incisors), రదనికలు (Canines), అగ్ర చర్వణకాలు (Premolars) చర్వణకాలు (Molars). ఇవి ఆహారాన్ని కొరకడానికి, చీల్చడానికి, నమలడానికి ఉపయోగపడతాయి.
ఈ దంతాల అమరికను దంతఫార్ములాతో పేర్కొంటారు.
మానవ ప్రౌఢదశలో దంత ఫార్ములా = \(\frac{2123}{2123}\)= 32
(ii) నాలుక : నాలుక స్వేచ్ఛగా కదిలే, కండరయుతమైన జ్ఞానాంగం. ఇది ఆస్య కుహర అడుగు భాగంలో ఫ్రెన్యులమ్ అనే మడతలాంటి కణజాలంతో అతికి ఉంటుంది. నాలుక పై భాగంలో చిన్నగా ముందుకు పొడుచుకొని వచ్చే నిర్మాణాలను సూక్ష్మాంకురాలు అంటారు. వీటిలో కొన్ని రుచిగుళికలను (taste buds) కలిగి ఉంటాయి. నాలుక పళ్లను శుభ్రపరచడానికి, లాలాజలాన్ని ఆహారంతో కలపడానికి, రుచిని గుర్తించడానికి, మింగడానికి, మాట్లాడటానికి సహాయపడుతుంది.
2. గ్రసని : ఆస్యకుహరం పొట్టిగా ఉండే గ్రసనిలోకి తెరుచుకుంటుంది. ఇది ఆహారం, గాలి ప్రయాణించే ఐక్య మార్గం. మృదు తాలువు గ్రసనిని, నాసికా గ్రసని, ఆస్య గ్రసని, స్వరపేటికా గ్రసనిగా విభజిస్తుంది. ఆహార వాహిక, వాయునాళం స్వరపేటికా గ్రసనిలోకి తెరుచుకుంటాయి. వాయునాళం స్వరపేటికా గ్రసనిలోకి కంఠబిలం (glottis) ద్వారా తెరచుకుంటుంది. మృదులాస్థితో తయారైన ఉపజిహ్విక (epiglottis) ఆహారాన్ని మింగేటప్పుడు కంఠబిలంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
3. ఆహారవాహిక : ఆహారవాహిక పలుచని, పొడవైన నాళం. ఇది మెడ, ఉరః కుహరం విభాజక పటలం ద్వారా పరభాగానికి ప్రయాణించి, జీర్ణాశయములోకి తెరచుకుంటుంది. కండరయుతమైన జఠర-ఆహారవాహిక లేదా హృదయ సంవరణి, ఆహారవాహిక జీర్ణాశయంలోకి తెరచుకోవడాన్ని నియంత్రిస్తుంది.
4. జీర్ణాశయం : జీర్ణాశయం వెడల్పైన స్పీతి చెందగల కండరయుత సంచిలాంటి ‘J’ ఆకారపు నిర్మాణం. ఇది ఉదర కుహర పూర్వభాగంలో ఎడమవైపున విభాజక పటలానికి కింద అమరి ఉంటుంది. ఇది మూడు ముఖ్యభాగాలను కలిగి ఉంటుంది. పూర్వ హార్థిక భాగంలోకి ఆహారవాహిక తెరచుకుంటుంది. మధ్య భాగమైన ఫండిక్ జీర్ణక్రియకు ముఖ్యమైనభాగం. పర జఠరనిర్గమ భాగం చిన్నప్రేగు మొదటి భాగంలోనికి జఠర నిర్గమ రంధ్రం ద్వారా తెరచుకుంటుంది. ఈ రంధ్రాన్ని నియంత్రించ డానికి జఠర నిర్గమ సంవరిణి ఉంటుంది.
5. చిన్న పేగు : ఆహారనాళంలో చిన్న పేగు చాలా పొడవుగా ఉండే భాగం. దీనిలో వరుసగా మూడు భాగాలను గుర్తించవచ్చు. ఇవి సమీపాగ్రంలో ఆంత్రమూలం, మధ్యలో పొడవుగా, మెలికలు పడిన జెజునం, దూరాగ్రంలో ఎక్కువగా మెలికలు తిరిగిన శేషాంత్రికం ఉంటాయి. ఆంత్రమూలంలోకి ఐక్య కాలేయం – క్లోమనాళం తెరచుకుంటుంది. శేషాంత్రికం పెద్ద పేగులోకి తెరచుకుంటుంది.
6. పెద్ద పేగు : ఈ భాగంలో అంధనాళం, కొలాన్, పురీషనాళం ఉంటాయి. అంధనాళం చిన్న అంధకోశాన్ని కలిగి సహజీవనం చేసే సూక్ష్మజీవులకు ఆతిథ్యం ఇస్తుంది. అంధనాళం నుండి పొడుచుకొని వచ్చే సన్నని, వేలువంటి నాళికాయుత నిర్మాణాన్ని క్రిమిరూప ఉండూకం అంటారు. అందనాళం కొలాన్ లోకి తెరచుకొంటుంది. ఇది ఆరోహ, అడ్డు, అవరోహ భాగాలుగా, సిగ్మాయిడ్ కొలాన్ ఏర్పడి, పురీషనాళంగా మారుతుంది. పురీషనాళం చిన్న విస్ఫాత తిత్తిలాంటి నిర్మాణం. ఇది పాయుకాలువగా ముందుకు సాగి, పాయువు ద్వారా బయటకు తెరచుకుంటుంది.
జీర్ణగ్రంథులు :
1. లాలాజల గ్రంథులు : మానవునిలో మూడు జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. అవి
1. పెరోటిడ్ గ్రంథులు 2. అధో జంబికా గ్రంథులు 3. అధో జహ్వికా గ్రంథులు
ఈ గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. లాలాజలంలో నీరు, విద్యుత్ విశ్లేషకాలు, శ్లేష్మం, ఎన్జైములైన – ఎమైలేజ్, లైసోజైమ్లు ఉంటాయి.
2. జఠర గ్రంథులు : ఇవి జీర్ణాశయం గోడలలో ఉపకళా తలానికి దిగువగా ఉంటాయి. ఇవి మూడు రకాలు అవి.
1. హార్దిక గ్రంథులు ఇవి శ్లేష్మాన్ని స్రవిస్తాయి.
2. జఠర నిర్గమ గ్రంథులు – ఇవి శ్లేష్మాన్ని మరియు గాస్ట్రిన్ హార్మోన్ను స్రవిస్తాయి.
3. ఫండిక్/ ఆక్సింటిక్ గ్రంథులు ఇవి శ్లేష్మాన్ని, ప్రోఎన్జైములైన పెప్సినోజన్ మరియు ప్రోరెనిన్లను, HCI, ఇంట్రిన్సిక్ కారకాన్ని మరియు కొంత గ్యాస్ట్రిక్ లైపేజ్న కూడా స్రవిస్తాయి.
3. ఆంత్ర గ్రంథులు : ఇవి రెండు రకాలు
1. బ్రన్నర్ గ్రంథులు
2. లీబర్ కూన్ గుహికలు
ఇవి ఆంత్ర రసాన్ని స్రవిస్తాయి. ఆంత్ర రసంలో పెప్టిడేజ్లు, డైశాకరైడేజ్లు మరియు ఎంటిరోకైనేజ్లు ఉంటాయి.
4. కాలేయం : కాలేయం దేహంలోని అతిపెద్ద గ్రంథి. కాలేయం పైత్యరసాన్ని స్రవిస్తుంది. పైత్యరసంలో పైత్యరస లవణాలు ఉంటాయి. ఇవి కొవ్వుల జీర్ణక్రియలో తోడ్పడతాయి.
5. క్లోమం : క్లోమం మానవ దేహంలో రెండవ అతిపెద్ద గ్రంథి. క్లోమంలోని నాళ గ్రంథి భాగం క్లోమరసాన్ని స్రవిస్తుంది. క్లోమరసంలో సోడియంబైకార్బనేట్, ప్రొఎన్జైములైన ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, ప్రోకార్బాక్సి పెప్టిడేజ్, ఎన్జైములైన 0:- ఎమైలైజ్ (స్టియాప్సిన్), న్యూక్లియేజ్లోన DNase, RNase లు ఉంటాయి.