AP Inter 2nd Year Botany Study Material Chapter 14 మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Botany Study Material 14th Lesson మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Botany Study Material 14th Lesson మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎందువల్ల ‘స్విస్ జున్ను’ పెద్ద రంధ్రాలను కలిగి ఉంటుంది ? దీనికి కారణమైన బ్యాక్టీరియమ్ పేరును తెలపండి. [A.P. Mar. ’16 Mar. ’14]
జవాబు:
స్విస్ జున్నులో ఉండే పెద్ద రంధ్రాలు “ప్రొపియోనిబాక్టీరియం షర్మనై” అను బాక్టీరియమ్ ఎక్కువ CO్కను ఉత్పత్తి చేయడం వల్ల ఏర్పడతాయి. .

ప్రశ్న 2.
ఫెర్మెంటర్స్ (Fermentors) అనేది ఏమిటి ? [Mar. ’14]
జవాబు:
సూక్ష్మజీవులను పారిశ్రామిక పరంగా అధిక సంఖ్యలో పెంచే చాలా పెద్ద పాత్రలను ఫెర్మెంటర్స్ అంటారు.

ప్రశ్న 3.
స్టాటిన్ ఉత్పత్తి కోసం ఉపయోగించే సూక్ష్మజీవి పేరును తెలపండి. రక్తంలోని కొవ్వుస్థాయిని తగ్గించడానికి ఈ స్టాటిన్లు ఏవిధంగా ఉపయోగపడతాయి ? [T.S. Mar. ’16 Mar. ’15]
జవాబు:
మోనాస్కస్ పర్ప్యూరస్ అనే ఈస్ట్ రక్తంలో క్రొవ్వు తగ్గించే స్టాటిన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ సంశ్లేషణకు సంబంధించిన ఎన్జైమ్ చర్యకు పోటీపడే నిరోధకంగా పనిచేస్తుంది.

AP Inter 2nd Year Botany Study Material Chapter 14 మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు

ప్రశ్న 4.
మురుగునీటి ద్వితీయ శుద్ధి విధానాన్ని, జీవశాస్త్ర విధానమని పిలవడానికి మనం ఎందుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం ?
జవాబు:
ప్రాథమిక ద్రవ్య వ్యర్థాన్ని, పెద్దవిగా గాలి ప్రవహించే ట్యాంక్ లోకి పంపిస్తారు. తద్వారా యంత్రాలు కదులుతూ ఉండుటా వల్ల గాలి ఈ వ్యర్థానికి అందేటట్లు చూస్తారు. ఫలితంగా వాయు సహిత సూక్ష్మ జీవులు గుంపులుగా పెరిగి, ద్రవ్య వ్యర్థం నుంచి ఎక్కువ శాతంలో కర్బన పదార్థాలను వినియోగించుకుంటాయి. దీనివల్ల BOD (జీవరసాయన ప్రాణవాయువు) తగ్గిపోతుంది.

ప్రశ్న 5.
న్యూక్లియోపాలి హెడ్రొవైరస్ (Nucleopolyhedrovirus) లను ఈ రోజుల్లో ఎందుకు వాడుతున్నారు. [T.S. Mar. ’17]
జవాబు:
న్యూక్లియోపాలి హెడ్రొవైరస్లు జాతి – విశిష్టమైన కీటకనాశనులుగా పనిచేయడంలో శ్రేష్టమైనవి. ఇవి మొక్కలు, జంతువులు, క్షీరదాలు, పక్షులు, చేపలు వంటి వాటిపై ఎటువంటి ప్రభావం చూపవు.

ప్రశ్న 6.
ఆస్పరిజిల్లస్ నైజర్, క్లాస్ట్రీడియమ్ బ్యుటిలికం, లాక్టోబాసిల్లస్లు ఒకే రకంగా చూపే ముఖ్యమైన లక్షణం ఏది ?
జవాబు:
ఇవి ఆమ్లాలను ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు ఆస్పరిజిల్లస్ నైజర్ (శిలీంధ్రం) నుంచి సిట్రికామ్లము, అసిటోబాక్టర్ (బాక్టీరియమ్) నుంచి అసిటిక్ ఆమ్లం, కాస్ట్రీడియం బ్యుటిలికం నుంచి బ్యుటిరికామ్లం, లాక్టోబాసిల్లస్ (బాక్టీరియమ్) నుంచి లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతాయి.

ప్రశ్న 7.
ఏవైనా రెండు జన్యురూపాంతరం చెందిన పంటల పేర్లను పేర్కొనండి.
జవాబు:
Bt పత్తి, Bt వంకాయ

ప్రశ్న 8.
పారిశ్రామికంగా ఉపయోగపడే రెండు ఎన్ఎమ్లు తెలపండి.
జవాబు:
లైపేజ్, స్ట్రెప్టోకైనేజ్

ప్రశ్న 9.
ఒక రోగనిరోధకతను అణచివేసే కారకం పేరును తెలపండి. అది దేనినుండి లభిస్తుంది ?
జవాబు:
సైక్లోస్పోరిన్ – A. ఇది ట్రైఖోడెర్మా పాలీస్పోరమ్ అను శిలీంద్రం నుండి లభిస్తుంది.

ప్రశ్న 10.
పశువుల జీర్ణాశయం, మురుగునీటి అడుగు నుండే ముద్దమట్టి ఏరకమైన బాక్టీరియమ్ల సమూహాన్ని కలిగి ఉంటాయి ?
జవాబు:
మిథనోజెన్లు – మిథనోబాక్టీరియమ్లు

ప్రశ్న 11.
పెనిసిలిన్ ను ఆంటీబయోటిక్గా ఉపయోగించే కార్యవిధానం చూపించిన శాస్త్రవేత్తల పేర్లను తెలపండి.
జవాబు:
ఎరెస్ట్ చైన్, హోవార్డ్ ఫ్లోరె (అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తర్వాత)

AP Inter 2nd Year Botany Study Material Chapter 14 మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు

ప్రశ్న 12.
బయోగ్యాస్ రసాయన స్వభావాన్ని తెలపండి. బయోగ్యాస్ ఉత్పత్తిలో పాల్గొనే బాక్టీరియా పేరు తెల్పుము. [TS Mar. ’15]
జవాబు:
బయోగ్యాస్లో మీథేన్, CO2, కొద్దిగా HS మరియు తేమ ఉంటాయి. దీని తయారీలో మిథనోజెన్లు (మిథనోబేసిల్లస్) పాల్గొంటాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మైకోరైజా శిలీంధ్రాలు మొక్కలను అంటిపెట్టుకుని ఏ విధంగా వాటికి సహాయపడతాయి ?
జవాబు:
శిలీంధ్రాలకు, నాళికా కణజాలయుత మొక్కల వేర్లకు మధ్య ఉన్న సంబంధాన్ని మైకోరైజా అంటారు. గ్లోమస్ ప్రజాతికి చెందిన అనేక శిలీంధ్రాలు శిలీంధ్రమూలాన్ని ఏర్పరుస్తాయి. సహజీవన సహవాసంలోని శిలీంధ్రం, మొక్కచేత మృత్తిక నుంచి ఫాస్ఫరస్ శోషించే విధంగా చేస్తుంది. ఇటువంటి సహవాసంతో కూడిన మొక్కలు, వేరు తొలిచే వ్యాధి జనకం నుంచి ప్రతిరోధకత, ఉప్పునీటికి, నీటికొరతకు ఓర్చుకొనుటకు, మొక్క పెరుగుదల అభివృద్ధి మొత్తంగా జరిగేలా చూస్తాయి.
AP Inter 2nd Year Botany Study Material Chapter 14 మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు 1

ప్రశ్న 2.
బయోగ్యాస్ రసాయనిక స్వభావాన్ని తెలపండి. బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియను వివరించండి.
జవాబు:
యోగ్యాస్ లో మీథేన్, CO2 హైడ్రోజన్ సల్ఫైడ్, తేమ ఉంటాయి. దీనిని పశువుల వ్యర్థం (పేడ) నుండి ఉత్పత్తి చేస్తారు. దీని ఉత్పత్తిలో ఒక సిమెంట్ ట్యాంక్ (14 15 అడుగుల లోతు) ఉంటుంది. దీనిలోనికి జీవ వ్యర్థ పదార్థాలను సేకరించి దానికి పలుచగా ఉండే పేడను కలుపుతారు. పలచని పేడ భాగంపై తేలుతూ ఉండే ఒక మూతను ఉంచాలి. సూక్ష్మజీవుల వల్ల ట్యాంక్ లోపల వాయువు ఏర్పడి, ఈ మూసిన భాగం పైపైకి జరుగుతుంది. ఈ వాయువు, బయటకు ఒక పైపు ద్వారా వస్తుంది. ఉపయోగించబడిన పేడ మరొక మార్గం ద్వారా విడుదలవుతుంది. దీనిని ఎరువుగా వినియోగించవచ్చు. ఇలా ఉత్పత్తి అయిన బయోగ్యాస్ దీపకాంతిగా, వంట చేయుటకు వినియోగిస్తారు. ఇది మిథనోకోకస్ మిథ నోబాసిల్లస్ అను బాక్టీరియాల ద్వారా ఉత్పత్తి అవుతుంది. వాటిని మిథనోజన్లు అంటారు. ఇవి మురుగు నీటిని శుద్ధిచేసే ప్రక్రియలోని వాయురహిత మురుగు మట్టిలోను, పశువుల జీర్ణకోశంలోని ఒక భాగంలో కూడి ఉంటుంది.

ప్రశ్న 3.
జీవ ఎరువులు అంటే ఏమిటి ? రెండు ఉదాహరణలను ఇచ్చి జీవ ఎరువులుగా వాటి పాత్రను చర్చించండి.
జవాబు:
మృత్తిక పోషణ సహజగుణాన్ని పెంచే జీవులను జీవ ఎరువులు అంటారు.
ఉదా : బాక్టీరియమ్, శిలీంధ్రాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు.
AP Inter 2nd Year Botany Study Material Chapter 14 మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు 2
1. బాక్టీరియమ్ : లెగ్యూమ్ మొక్కల వేరు బుడిపెలలో ఉన్న రైజోబియమ్ బాక్టీరియమ్ వాతావరణంలోని నత్రజనిని స్థాపించి కర్బన రూపాలుగా మార్చడం వల్ల మొక్క దీనిని పోషకంగా గ్రహిస్తుంది. అజోస్పైర్లిలమ్, అజోటోబాక్టర్ వంటి బాక్టీరియమ్ల వల్ల కూడా మృత్తికలో నత్రజని భాగం పెరుగుతుంది.
AP Inter 2nd Year Botany Study Material Chapter 14 మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు 3

2. శిలీంధ్రాలు : శిలీంధ్రాలకు, నాళికా కణజాలయుత మొక్కల వేర్లకు మధ్య ఉన్న సంబంధాన్ని మైకోరైజా అంటారు. గ్లోమస్ ప్రజాతికి చెందిన అనేక శిలీంధ్రాలు శిలీంధ్రమూలాన్ని ఏర్పరుస్తాయి. సహజీవన సహవాసంలోని శిలీంధ్రము, మొక్క చేత మృత్తిక నుంచి ఫాస్ఫరస్ ను శోషించే విధంగా చేస్తుంది. ఇటువంటి సహవాసాలతో కూడిన మొక్కలు, వేరు తొలిచే వ్యాధి జనకం నుంచి ప్రతిరోదకత, ఉప్పునీటికి, నీటికొరతకు ఓర్చుకొనుటకు, మొక్క పెరుగుదల అభివృద్ధి మొత్తంగా జరిగేలా చూస్తాయి.

AP Inter 2nd Year Botany Study Material Chapter 14 మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మురుగునీటి శుద్ధి విధానంలో సూక్ష్మజీవులు గురించి క్లుప్త వ్యాసము వ్రాయుము.
జవాబు:
నగరాలలోను, పట్టణాలలోను ప్రతిరోజు ఎక్కువ మొత్తంలో పనికిరాని నీరు, వ్యర్ధమైన నీరు, మనుష్యులమలంతో ఉత్పత్తి అవుతుంది. దీనిని మురుగునీరు అంటారు. మురుగునీరులో ఎక్కువశాతంగా కర్బన సంబంధ పదార్థము, సూక్ష్మజీవులు ఉంటాయి. కావున ఈ మురుగునీటిని శుద్ధి చేసి నదులలోకి విడుదలచేయుటవల్ల తక్కువ కాలుష్యం కలుగచేస్తుంది. ఈ శుద్ధి విధానము 2 దశలుగా జరుపబడుతుంది.

1) ప్రాథమిక శుద్ధి విధానము : ఈ విధానంలో భౌతికంగా కనిపించే పెద్ద, చిన్న పదార్థ భాగాలను మురుగునీటి నుంచి వడపోత, అవసాదనము ద్వారా తీసివేస్తారు. ముందుగా, తేలుతున్న వ్యర్థపదార్థాలను వరుస వడపోతలతో తీసివేస్తారు. తరువాత గ్రిట్ అనగా మట్టి, చిన్న చిన్న రాళ్ళను అవసాదనము ద్వారా తీసివేస్తారు. అడుగున ఉన్న దానిని ప్రాథమిక ఘనపదార్థమని, మిగతా పై భాగాన్ని ద్రవ వ్యర్థము అని అంటారు. ద్రవ వ్యర్థాన్ని ద్వితీయ శుద్ధి కోసం తీసుకుంటారు.
AP Inter 2nd Year Botany Study Material Chapter 14 మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు 4

2) ద్వితీయ శుద్ధి విధానము : ప్రాథమిక ద్రవ వ్యర్థాన్ని చాలా పెద్దవిగా, గాలి ప్రవహించే టాంక్ల ద్వారా ప్రవహింపచేస్తారు. యంత్రాలు అదే పనిగా కదులుతూ ఉండుటవల్ల గాలి ఈ వ్యర్థంలోకి ప్రసారం అవుతుంది. ఫలితంగా ఉపయోగకరమైన వాయు సహిత సూక్ష్మజీవుల గుంపులు తేజోవంతంగా పెరుగుతాయి. ఇవి ద్రవ వ్యర్థంలోని కర్బన పదార్థాన్ని ఎక్కువగా వినియోగించుకుంటాయి. దీనివల్ల వ్యర్థ ద్రవ పదార్థంలో గణనీయంగా జీవరసాయన ప్రాణవాయువు (BOD) తగ్గిపోతుంది.

మురుగునీటిలో BOD తగ్గిన తర్వాత, వ్యర్థ ద్రవపదార్థాన్ని బ్యాక్టీరియమ్లు గుంపులుగా ఉన్న ట్యాంక్ లోనికి పంపించినప్పుడు, అవి ముద్దగా అడుగుకు చేరుతాయి. దీనిని చురుకైన ఘన పదార్థము అంటారు. దీనిలో కొంత భాగాన్ని తిరిగి జలయంత్రం ద్వారా వాయుపూరిత టాంక్లోనికి అంతర్నివేశంగా పనిచేయుటకు ఉపయోగిస్తారు. మిగిలిన స్థూలభాగాన్ని జలయంత్రాల సహాయంతో పెద్దవిగా ఉండే అవాయుసహిత ఘనపదార్థ జీర్ణ సహకారులను టాంక్ లోనికి పంపుతారు. ఇక్కడ ఇతర రకాల బ్యాక్టీరియములు, మట్టి పదార్థంలోని బాక్టీరియాలను, శిలీంద్రాలను జీర్ణింపచేస్తాయి. ఈ జీర్ణక్రియలో బ్యాక్టీరియాలు మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్, CO2 లాంటి మిశ్రమ వాయువులను ఉత్పత్తి చేస్తాయి. ఇవి బయోగ్యాస్గా ఏర్పడి, మండే గుణం కల్గి, శక్తిగా వినియోగపడతాయి. ద్వితీయ శుద్ధి విధానం తర్వాత ఏర్పడి ద్రవ వ్యర్థపదార్థాన్ని సాధారణంగా ప్రకృతిసిద్ధమైన నీటి వనరులు అయిన నదులు, సరస్సుల్లోకి విడుదల చేస్తారు.

అభ్యాసాలు

ప్రశ్న 1.
బాక్టీరియమ్ను సాధారణ నేత్రాలతో చూడలెం, కాని వీటిని ఒక సూక్ష్మదర్శిని సహాయంతో చూడవచ్చు. మీరు ఒక శాంపిల్ భాగాన్ని మీ ఇంటి నుంచి మీ జీవశాస్త్ర ప్రయోగశాలకు తీసుకొని వెళ్ళవలసి వచ్చినప్పుడు, అక్కడ సూక్ష్మదర్శినితో సూక్ష్మజీవుల ఉనికిని ప్రదర్శించడానికి మీరు ఏ శాంపిలు మీతో తీసుకొని వెళతారు ? ఎందువల్ల ?
జవాబు:
పెరుగు. పెరుగులో అనేక లాక్టిక్ ఆమ్ల బాక్టీరియాలు ఉంటాయి. ఇవి పాలను పెరుగుగా మారుస్తాయి. వీటిని సూక్ష్మదర్శిని ద్వారా చూడగలము.

AP Inter 2nd Year Botany Study Material Chapter 14 మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు

ప్రశ్న 2.
జీవక్రియ జరిగేటప్పుడు సూక్ష్మజీవులు వాయువులను విడుదల చేస్తాయని ఉదాహరణలతో నిరూపించండి.
జవాబు:
బాక్టీరియా మరియు శిలీంధ్రాలు మురుగునీరు శుద్ధి చేయునప్పుడు మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్, CO2 లాంటి మిశ్రమ వాయువులను ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువులు బయోగ్యాస్ ఏర్పడి, శక్తిగా వినియోగించుటకు ఉపయోగపడతాయి.

ప్రశ్న 3.
గంగా కార్యాచరణ పథకంలో ఏయే రాష్ట్రాలు నిమగ్నమై ఉన్నాయి ?
జవాబు:
UP, ఉత్తరాఖండ్

ప్రశ్న 4.
గోధుమ, వరి, శనగలతో తయారయ్యే కొన్ని సాంప్రదాయ భారతదేశ ఆహారాలను పేర్కొనండి. ఈ ఆహారాలలో ఏవి సూక్ష్మజీవులను ఉపయోగించుకుంటాయి ?
జవాబు:
గోధుమ – బ్రెడ్, కేక్ ; వరి ఇడ్లీ, దోస ; శనగలు – డోక్లా, కాండ్స్
వరి, గోధుమ నుండి తయారయ్యే ఆహార పదార్థాలలో సూక్ష్మజీవులు పాల్గొంటాయి.

ప్రశ్న 5.
హానికరమైన బాక్టీరియమ్ల వల్ల కలిగే వ్యాధులను నివారించడంలో సూక్ష్మజీవులు ఏ విధంగా ముఖ్యమైన భూమికను పోషిస్తున్నాయి ?
జవాబు:
సూక్ష్మజీవులు యాంటిబయాటిక్లలు అనే రసాయన పదార్థాలను ఉత్పత్తి చేసి ఇతర వ్యాధికారక సూక్ష్మజీవులను చంపటం లేదా వాటి పెరుగుదలను ఆపుదల చేస్తాయి. ఉదా : పెనిసిలియం నొటేటమ్ అను శిలీంధ్రం నుండి పెనిసిలిన్ అను సూక్ష్మజీపే నాశకం లభిస్తుంది. ఇది స్టాఫైలోకోకస్ బాక్టీరియా పెరుగుదలను ఆపివేస్తుంది.

ప్రశ్న 6.
సూక్ష్మజీవులను కూడా ఇంధనానికి మూలంగా ఉపయోగించవచ్చునని మీరు భావిస్తున్నారా ? మీ సమాధానం ‘అవును’ అయితే ఏవిధంగా ?
జవాబు:
సూక్ష్మజీవులు అయిన మిథనోకోకస్, మిథనో బేసిల్లస్లను ఉపయోగించి పేడను అవాయు శ్వాసక్రియ ద్వారా కుళ్ళింపచేసి మీథేన్ H2S మరియు CO2 లను విడుదల చేస్తాయి. ఇవి గోబర్ గ్యాస్గా మారి శక్తిగా ఉపయోగపడుతుంది.

ప్రశ్న 7.
సూక్ష్మజీవులను ఉపయోగించడం ద్వారా రసాయన ఎరువులు, చీడ నాశన ఉపయోగాన్ని తగ్గించవచ్చు. ఇది ఏవిధంగా జరుగునో వివరించండి.
జవాబు:
సూక్ష్మజీవులను జీవ ఎరువులుగా వాడి రసాయన ఎరువులు, చీడ నాశకాలపై ఆధారపడుట తగ్గించవచ్చు. జీవ ఎరువులుగా వాడే సూక్ష్మజీవులు మృత్తికను పోషకాల ద్వారా సారవంతం చేసి దాని నాణ్యతను పెంచుతాయి. వీటిలో ముఖ్యంగా రైజోబియమ్, అజటోబాక్టర్, అజోస్పైరిల్లమ్లు, సయనో బాక్టీరియాలు ముఖ్యమైనవి. ఇవి వాతావరణంలోని N2 గ్రహించి NO3గా మార్చి మొక్కకు అందిస్తాయి. కొన్ని బాక్టీరియమ్లు “బాసిల్లస్ ధరింజియెన్సిస్ “జీవ బీజనాశకంగా ఉపయోగపడుతుంది.

ప్రశ్న 8.
నదిలోని నీరు, శుద్ధి పరచని మురుగునీరు, ద్వితీయ శుద్ధిపరిచిన తరువాత మురుగు యంత్రం నుంచి విడుదలయ్యే నీరు, శాంపిల్స్న BOD పరీక్షకు గురిచేసారు. వీటికి A, B, C అని గుర్తింపునిచ్చారు. అయితే పరిశోధనా సహాయకుడు దేనికి ఏది అని గుర్తించలేదు. ఈ మూడు శాంపిల్స్ BOD విలువలు 20 mg/L, 8 mg/L, 400 mg/L అని వరుసగా నమోదు చేసాడు. వీటిలో ఏ నీరు ఎక్కువ కాలుష్యానికి గురి అయినది ? నదిలోని నీరు తేటగా ఉందని భావిస్తూ మీరు ప్రతిదానికి సరియైన గుర్తింపును ఇవ్వగలరా ?
జవాబు:
ఒక లీటర్ నీటిలోని కర్బన పదార్థముతో బాక్టీరియమ్ ద్వారా ఆక్సీకరణం చెందిన తర్వాత వినియోగించుకునే ఆక్సిజన్ పరిమాణంను BOD (జీవ రసాయన ఆక్సిజన్ అవసరం) అంటారు. అపరిశుద్ధమైన నీటిలో ఎక్కువ BOD ఉంటే అది దారి హెచ్చు కాలుష్యానికి గుర్తుగా భావిస్తారు. దీనినిబట్టి ఇచ్చిన 3 శాంపిల్స్ BOD విలువలు 20 mg/L, 8 mg/L, 400 mg/L లలో ‘C’ శాంపిల్ 400 mg/L ఎక్కువ కలుషితము. తర్వాత శాంపిల్ 20 mg/L BOD విలువను కలిగి ఉన్నది. శాంపిల్ విలువను కల్గి ఉన్నది.

ప్రశ్న 9.
సైక్లోస్పోరిన్ A (నిరోధకత నివారించే ఔషధం) స్టాటిన్ ను (రక్తంలో క్రొవ్వు పదార్థాన్ని తగ్గించే సహకారం) పొందే సూక్ష్మజీవుల పేర్లను తెలపండి.
జవాబు:
సైక్లోస్పోరిన్ A – టైకోడెర్మా పాలీస్పోరమ్ ;
స్టాటిన్లు మోనాస్కస్ పర్ప్యూరియస్

AP Inter 2nd Year Botany Study Material Chapter 14 మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు

ప్రశ్న 10.
ఈ క్రింది పేర్కొన్న వాటిలో సూక్ష్మజీవుల పాత్ర గురించి తెలుసుకొని, మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
a) ఏక కణ ప్రొటీన్ (SCP) b) మృత్తిక
జవాబు:
a) ఏక కణ ప్రొటీన్ : మంచి ప్రొటీనుకోసం సూక్ష్మజీవులను పారిశ్రామికంగా పెంచుతున్నారు. ఉదా: శైవలాలు, శిలీంధ్రాలు, బాక్టీరియమ్లు. ఇవి వ్యర్థ పదార్థాలపై పెరుగుతూ, ఎక్కువ మొత్తంలో ప్రొటీనులను తమ కణాలలో నిల్వ చేసి ఉంచుతాయి. వాటిని సేకరించి ఎండబెట్టి ఏకకణ ప్రోటీనులుగా జంతువులకు, మానవులకు ఆహారంగా వాడవచ్చు. ఉదా : (శైవలము), కాండిడా (ఈస్ట్), మిథైలోపిలస్ (బాక్టీరియమ్)
స్పైరులినా

b) మృత్తిక : వివిధ రకాల మృత్తికా రేణువులు, సూక్ష్మజీవులు, వాయువులు నీరు కలిసి ఉన్న సారవంతమైన భూ ఉపరితలపు పొర. దీనిలో పూతికాహార బాక్టీరియమ్లు చనిపోయిన వృక్ష, జంతు దేహాలను కుళ్ళింపచేసి, వాటిలోని పోషకాలను నేలకు అందిస్తాయి మరియు పరిసరాలను శుభ్రపరుస్తున్నాయి మరియు కొన్ని సూక్ష్మజీవులు N, స్థాపన చేసి సారవంతత పెంచుతున్నాయి.

ప్రశ్న 11.
ఈ క్రింది వాటిని అవరోహణ క్రమం (Descending Order) లో మానవ సమాజ సంక్షేమంలో ప్రాముఖ్యతను బట్టి అమర్చండి. మీ సమాధానానికి తగిన వివరణ ఇవ్వండి. బయోగ్యాస్, సిట్రిక్ ఆమ్లం, పెనిసిలిన్, పెరుగు.
జవాబు:
పెనిసిలియమ్ – బయోగ్యాస్ – సిట్రిక్ ఆమ్లము – పెరుగు
a) పెనిసిలిన్ అను సూక్ష్మ జీవనాశకము ఇతర బాక్టీరియమ్ వ్యాధులను నివారిస్తుంది.
b) బయోగ్యాస్ – జీవ ఇంధనంగా ఉపయోగిస్తారు.
c) సిట్రిక్ ఆమ్లము – ఆహార పదార్థాల నిల్వకు ఉపయోగిస్తారు.
d) పెరుగు – లాక్టోబాసిల్లస్ వల్ల పాల నుండి ఏర్పడే ఆహారము.

ప్రశ్న 12.
మురుగునీరు అంటే ఏమిటి ? ఏ విధంగా మురుగునీరు మనకు హానికరమైనది ?
జవాబు:
పట్టణాలలోను, నగరాలలోను, పనికిరాని, వ్యర్థమైన, మనుష్యుల మలంతో నిండి ఉన్న నీటిని మురుగునీరు అంటారు.
దీనివల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది. దీనివల్ల చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి.

ప్రశ్న 13.
ప్రాథమిక, ద్వితీయ మురుగు నీటి శుద్ధి విధానంలోని ముఖ్యమైన తేడా ఏమిటి ?
జవాబు:
ప్రాథమిక నీటి శుద్ధ విధానము

  1. మురుగునీరు నుండి భౌతికంగా కనిపించే పెద్ద, చిన్న పదార్థ భాగాలను వడపోత, అవసాదనం ద్వారా తీసివేస్తారు.
  2. దీనికి ఖర్చు ఉండదు.
  3. ఇది సులువైన ప్రక్రియ. తీసివేస్తారు.

AP Inter 2nd Year Botany Study Material Chapter 14 మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు

ద్వితీయ నీటి శుద్ధ విధానము

  1. సూక్ష్మజీవుల చర్య ద్వారా మురుగునీటి నుంచి వ్యర్థాలను తీసివేస్తారు.
  2. ఇది ఖర్చుతో కూడుకున్న పని.
  3. ఇది క్లిష్టమైన ప్రక్రియ.