AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Zoology Study Material Lesson 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Zoology Study Material Lesson 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

కండరం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కండరం, నాడికి సంబంధించి ‘చాలక ప్రమాణం’ అంటే ఏమిటి ?
జవాబు:
ఒక చాలక నాడీకణం అక్షీయ తంతువులోని టీలోడెండ్రైట్లు అంతమయ్యే కండర తంతువు భాగాన్ని ‘చాలక ప్రమాణం’ అంటారు.

ప్రశ్న 2.
త్రయావ్యవస్థ అంటే ఏమిటి ? [T.S. Mar. ’16, ’15 Mar. 14]
జవాబు:
ప్రతి T – నాళికను సార్కోప్లాజమిక్ రెటిక్యులమ్ యొక్క అంత్యసిస్టర్నేలు సన్నిహితంగా చుట్టి ఉంటాయి. ఒక T – నాళిక దానికి సన్నిహితంగా ఉన్న రెండు సిస్టర్నేలను కలిపి త్రయావ్యవస్థ అంటారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

ప్రశ్న 3.
ఏక్టిన్, మయోసిన్ మధ్య భేధమేమి ? [A.P. Mar. ’15]
జవాబు:
ఏక్టిన్

  1. ఏక్టిన్ ఒక సన్నని సంకోచశీల ప్రోటీన్
  2. ఏక్టిన్ కాంతివంతపు పట్టీలో ఉంటుంది. దీనినే సమప్రసారక పట్టీ అంటారు.
  3. ప్రతి ఏక్టిన్ తంతువులోనూ రెండు తంతుయుత F-ఏక్టిన్ తంతువులు కుండలిగా చుట్టుకొని ఉంటాయి. అవి ట్రోపోమయోసిన్, ట్రోపోనిన్ ప్రోటీన్లు.

మయోసిన్

  1. మయోసిన్ ఒక దళసరి సంకోచశీల ప్రోటీన్
  2. మయోసిన్; నిష్కాంతి పట్టీలో ఉంటుంది. దీనినే అసమ ప్రసారక పట్టీ అంటారు.
  3. ప్రతి మయోసిన్, మీరోమయోసిన్ అనే మోనోమర్లతో తయారయ్యి ఉంటుంది. ప్రతి మీరోమయోసిన్లో తల, తోక అనే రెండు ప్రధాన భాగాలుంటాయి.

ప్రశ్న 4.
ఎర్రని కండర తంతువులు, తెల్లని కండర తంతువుల మధ్య ఉండే భేదాలను తెల్పండి.
జవాబు:
ఎర్రని కండర తంతువులు

  1. ఎరుపు కండర తంతువులు పలుచగా ఉండి పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి.
  2. ఈ కండర తంతువులలో మయోగ్లోబిన్ అధికంగా ఉండటం వల్ల ఎర్రని వర్ణంలో కనిపిస్తాయి.
  3. ఈ తంతువులలో మైటోకాండ్రియంల సంఖ్య అధికంగా ఉంటుంది.
  4. వీటిని వాయుకండరాలు అని అంటారు.

తెల్లని కండర తంతువులు

  1. తెల్లని కండర తంతువులు దళసరిగా ఉండి పరిమాణంలో తక్కువగా ఉంటాయి.
  2. ఈకండర తంతువులలో మయోగ్లోబిన్ తక్కువగా ఉండటంవల్ల పాలిపోయి తెల్లని వర్ణంలో కనిపిస్తాయి
  3. ఈ తంతువులలో మైటోకాండ్రియాలు తక్కువ సంఖ్యలో ఉంటుంది.
  4. వీటిని అవాయు కండరాలు అంటారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కండర సంకోచానికి సంబంధించి జారుడు తంతు సిద్ధాంతాన్ని గురించి లఘుటీక రాయండి.
జవాబు:
కండర సంకోచించే విధానాన్ని జారుడు తంతు సిద్ధాంతం ద్వారా వివరించవచ్చు. జారుడు తంతు సిద్ధాంతాన్ని జేన్ హన్సన్, హ్యుగ్ హక్సలె అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు ఈ సిద్ధాంతం ప్రకారం కండర సంకోచ సమయంలో సన్నని ఏక్టిస్ తంతువులు, దళసరి మయోసిన్ తంతువుల మీదుగా / మధ్యగా జారడం జరుగుతుంది.

ప్రతి కండర సూక్ష్మ తంతువులో ఏక్టిన్, మయోసిన్ అనే కండర ప్రోటిన్లు అమరిక వల్ల నిష్కాంతి, కాంతి పట్టీలుగా ఏర్పడి చారలుగా కనిపిస్తాయి. కాంతివంతపు పట్టీని ‘T – పట్టీ అంటారు. ఇందులో పలుచని సంకోచించే ఏక్టిన్ ప్రోటీన్ ఉంటుంది. నిష్కాంతి పట్టీని ‘A’ – పట్టీ అంటారు. ‘A’ – పట్టీలో మయోసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. T పట్టీ మధ్యభాగంలోని స్థితిస్థాపక ‘Z’- గీత ఉంటుంది. A పట్టీ మధ్య భాగంలో ఏక్టిన్ తంతువులు లేని ప్రాంతాన్ని ‘H’ – మండలం అంటారు. ఈ మండలంలో సన్నని తంతువులు లేనందువల్ల మిగతా ‘A’ పట్టీ కంటే కొంచెం లేత వర్ణంలో ఉంటుంది.

కండర సంకోచ సమయంలో, మయోసిన్ తలభాగం ఏక్టిన్ చైతన్య స్థానంలో బంధితమయ్యి, అడ్డువంతెన ఏర్పడుతుంది. మయోసిన్ అడ్డు వంతెనలతో బంధింపబడిన ఏక్టిన్ తంతువులు ‘A’ పట్టీ మధ్య భాగంలోకి లాగబడతాయి. ఏక్టిన్ తంతువులను పట్టీ ఉన్న ‘Z’ గీతలు కూడా రెండు వైపుల నుంచి లోనికి లాగబడతాయి. అందువల్ల ‘T’ పట్టీ పొడవు తగ్గిపోతుంది. కాని ‘A’ పట్టీ పొడవు మాత్రం యధాతధంగా ఉండిపోతుంది. ఈ సమయంలో సన్నని ఏక్టిన్ తంతువులు దళసరి ‘A’ పట్టీలోనికి లోతుగా లాగటం వల్ల ‘H’ మండలం సన్నగా మారుతుంది. సార్కోమియర్ పొడవు తగ్గి పొట్టిగా మారుతుంది. దీనినే కండర సంకోచం అంటారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

ప్రశ్న 2.
కండర సంకోచంలోని ముఖ్యమైన దశలను వివరించండి.
జవాబు:
కండర సంకోచ సమయంలో సన్నని ఏక్టిన్ తంతువులు, దళసరి మయోసిన్ తంతువుల మీదుగా / మధ్యగా జారుతుంది. కండర సంకోచంలో ముఖ్యమైన దశలు:
1) కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి చాలక నాడీ తంతువుల ద్వారా నాడీ ప్రచోదనం కండర తంతువులను చేరినప్పుడు కండరం ఉద్దీపనం చెంది సంకోచం ప్రారంభమవుతుంది.

2) ఈనాడీ ప్రచోదనం అసిటైల్ కొలైన్ ద్వారా సార్కోప్లాజమిక్ రెటిక్యులమ్లోని సిస్టర్నేలను చేరడం వల్ల వాటి నుండి సార్కోప్లాజమ్ లోనికి ‘కాల్షియం అయాన్లు’ విడుదలవుతాయి.

3) సార్కోప్లాజమ్ లోనికి కాల్షియం అయాన్లు విడుదల కాగానే ఏక్టిన్ చైతన్యస్థానాలు బహిర్గతం అవుతాయి. ATP జలవిశ్లేషణ ఫలితంగా పొందిన శక్తిని ఉపయోగించుకొని, మయోసిన్ తల ఏక్టిన్ చైతన్యస్థానంతో బంధితమవుతుంది.

4) మయోసిన్ అడ్డువంతెనలతో బంధింపబడిన ఏక్టిన్ తంతువులు, దళసరి ‘A’ పట్టీలోనికి లోతుగా లాగబడటం వల్ల ‘H’ మండలం సన్నగా మారుతుంది. సార్కోమియర్ పొడవు తగ్గి పొట్టిగా మారుతుంది. దీనినే కండర సంకోచం అంటారు.

5) కండర సంకోచం తరువాత, మయోసిన్ తిరిగి తన సాధారణ స్థితిలోచేరి ADPని విడుదల చేస్తుంది. ఒక కొత్త ATP మయోసిన్ తలతో బంధింతమవడం వల్ల అడ్డువంతెన విడిపోతుంది. మరియు Ca+2 అయాన్ల గాఢత తగ్గిపోతుంది. ఈకారణంగా సార్కోమియర్ పొడవు యధాస్థితికి వస్తుంది. దీన్నే సడలడం అంటారు.

ప్రశ్న 3.
అస్థి కండర నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
1) మనదేహంలోని అస్థికండరం / రేఖిత కండరం అనేక కండర కట్టలు లేదా ఫాసికిల్లలో నిర్మితమై ఉంటుంది. ప్రతి ఫాసికల్లో అనేక స్థూపాకార కండర తంతువులు లేదా కండర కణాలు ఉంటాయి. అన్ని ఫాసికిల్స్ను కప్పి ఉంచుతూ కొల్లా జెన్ నిర్మితమైన ఫాసియా అనే సంయోజక కణజాలపు త్వచం ఉంటుంది.

కండర తంతువు సూక్షమమ నిర్మాణం :

  1. కండర కణాలు పొడవైన తంతువుల లాగా ఉంటాయి. కండర తంతువు ప్లాస్మాత్వచాన్ని సొర్కోలెమ్మా అని దీని జీవపదార్థాన్ని సార్కోప్లాజమ్ అని అంటారు.
  2. రేఖిత కండరతంతువు బహు కేంద్రక సిన్సిషియల్ స్థితిని ప్రదర్శిస్తుంది. పిండదశలో ఏకకేంద్రక మయోబ్లాస్ట్ కణాలు అనేకం కలసి ఒక కండర తంతువును ఏర్పర్చడం వల్ల అది బహుకేంద్రక స్థితిని పొందుతుంది.
  3. కండర తంతువు యొక్క సార్కోలెమ్మా కిందిభాగంలో పరిధీయంగా అనేక కేంద్రకాలు ఉండటం కండర తంతువు ప్రత్యేకత.
  4. కండర తంతువులోని అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని సార్కోప్లాజమిక్ రెటిక్యులమ్ అంటారు. ఇందులో కాల్షియం అయాన్లు నిలువ ఉంటాయి.
  5. కండర తంతువులోని సార్కోప్లాజంలో అనేక కండర సూక్ష్మతంతువులు ఒకదాని కొకటి సమాంతరంగా అమరి ఉంటాయి.

ప్రశ్న 4.
సంకోచశీల ప్రోటీన్లను గురించి లఘు వాఖ్య రాయండి.
జవాబు:
ఏక్టిన్ మరియు మయోసిన్లు సంకోచశీల ప్రోటీన్లు
ఏక్టిన్ :

  1. ప్రతి ఏక్టిన్ తంతువులోనూ రెండు తంతుయుత F – ఏక్టిన్ ‘తంతువులు కుండలిగా చుట్టుకొని ఉంటాయి.
  2. ప్రతి F – ఏక్టిన్ తంతువులో అనేక గోళాకార ప్రమాణాలు ఉంటాయి. వీటిని G – ఏక్టిన్ అంటారు. ఇది ఒక వరుసక్రమంలో పాలీమరీకరణం చెందడం వల్ల F – ఏక్టిన్ ఏర్పడుతుంది.
  3. ఏక్టిన్ తంతువులకు సమాంతరంగా ట్రోపోమయోసిన్, ట్రోపోనిన్ అనే మరో రెండు ప్రోటీన్లు కూడా అమరి ఉంటాయి. వీటిలో ట్రోపోమయోసిన్ F – ఏక్టిన్ తంతువు పొడవుగా అమరి ఉంటుంది. కాని ట్రోపోనిన్ సంక్లిష్ట ప్రోటీన్ మాత్రం నిర్ణీత అవధులలో ట్రోపోమయోసిన్ పై అమరి ఉంటుంది.
  4. ట్రోపోనిన్ మూడు ఉప ప్రమాణాలుంటాయి. అవి Tn – T, Tn – I మరియు In – C, Tn – T, ట్రోపోమయోసిన్తో, Tn – C; Ca2+ అయాన్లతో బంధింపబడతాయి. ట్రోపోనిన్ – I (Tn – I) ఉప ప్రమాణం ట్రోపోమయోసిన్ ద్వారా ఏక్టిన్ తంతువు పై ఉండే ‘మయోసిన్ బంధన స్థలాలను కప్పి ఉంచడాన్ని స్థిరపరుస్తుంది. కాల్షియం అయాన్లు ట్రోపోనిన్తో బంధించబడినప్పుడు ఈ అడ్డు తొలగించబడి మయోసిన్ బంధన స్థలాలు బహిర్గతమవుతుంది.
  5. ఈ విధంగా బహిర్గతమైన చైతన్య స్థానాలతో మయోసిన్ తలలు బంధించబడినప్పుడు కండరం సంకోచిస్తుంది. ఈకారణంగానే ట్రోపోనిన్, ట్రోపోమయోసిన్లను నియంత్రణ ప్రోటీన్లు అంటారు.

మయోసిన్ :-

  1. మయోసిన్ ఒక చాలక ప్రోటీన్ ఇది ATP అణువులలోని రసాయనిక శక్తిని యాంత్రికశక్తి గా మార్చే శక్తి కలిగి ఉంటుంది.
  2. ప్రతి దళసరి మయోసిన్ తంతువు పాలీమరీకరణం చెందిన ప్రోటీన్ నిర్మాణం. దీనిలో మీరోమయోసిన్లు అనే మోనోమర్లు ఉంటాయి.
  3. ప్రతి మీరోమయోసిన్లో తల, తోక అనే రెండు ప్రధాన భాగాలుంటాయి. తల గోళాకారంలో ఉండి, పొట్టిగా ఉండే భుజం లేదా మెడను కలిగి ఉంటుంది.
  4. తల, మెడ భాగాలను కలిపి భారపు మీరోమయోసిన్ అనీ, తోకను తేలిక మీరోమయోసిన్ అనీ అంటారు.
  5. మెడ భాగం తల, తోకలను కలుపుతూ వాటి మధ్య తేలికగా వంగే నిర్మాణంగా పనిచేస్తుంది.
  6. ప్రతి దళసరి మయోసిన్ తంతువులో సుమారు 200-300 వరకూ మయోసిన్ అణువులుంటారు.
  7. మయోసిన్ తల, మెడ భాగాలు మయోసిన్ తంతువుల పై అక్కడక్కడ బయటికి చొచ్చుకొని వచ్చి ఉపరితలంపై లాగా కనిపిస్తాయి. వీటిని అడ్డు భుజాలు లేదా అడ్డువంతేనలు అంటారు.
  8. ప్రతి అడ్డు వంతెన తలలో రెండు బంధన తలాలు ఉంటాయి. ఒకటి ATP కి, మరొకటి ఏక్టిన్ తంతువు పైగల చైతన్య స్థానంతో బంధితం కావడానికి ఉపయోగపడతాయి.

ప్రశ్న 5.
కండర తంతువు అతిసూక్ష్మ నిర్మాణం చక్కని పటం గీయండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 1

ప్రశ్న 6.
కండర ఖండితం (సార్కోమియర్) చక్కని పటం గీచి భాగాలను గుర్తించండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 2

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

ప్రశ్న 7.
కోరివలయం- అంటే ఏమిటి ? ప్రక్రియ గురించి వివరించండి.
జవాబు:
కండరాలలో అవాయు గ్లైకాలిసిన్ జరిగినపుడు లాక్టిక్ ఆమ్లము ఏర్పడి, కాలేయంనకు చేరుతుంది. అక్కడ గ్లూకోజ్ మారుతుంది. ఏర్పడిన ఈ గ్లూకోజ్ మరల రేఖిత కండరాలను చేరి లాక్టిక్ ఆమ్లముగా మారుతుంది. ఈవిధంగా రేఖిత కండరానికి, కాలేయానికి మధ్య జరిగే ద్వంద్వ రవాణాను ‘కోరివలయం’ అంటారు.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 3

కోరివలయం: కండర సంకోచం వేగంగా జరిగే సమయంలో ఏర్పడిన. లాక్టిక్ ఆమ్లం పాక్షికంగా మాత్రమే కండరంలో ఆక్సీకరణ చెందుతుంది. ఎక్కువభాగం లాక్టిక్ ఆమ్లం రక్తం ద్వారా కాలేయానికి చేరి అక్కడ అది పైరువిక్ ఆమ్లంగా మార్చబడుతుంది. దీని నుంచి గ్లూకోనియోజెనిసిస్ ద్వారా గ్లూకోజ్ ఏర్పడుతుంది. ఈవిధంగా ఏర్పడిన గ్లూకోజ్ రక్తం ద్వారా తిరిగి కండరాలకు చేరి, కండర సంకోచంలో వినియోగించబడుతుంది. కండర సంకోచం నిలిచిన సందర్భంలో ఈ గ్లూకోజ్ నిలవ గ్లైకోజెన్ గ్లైకోజెనిసిస్ ద్వారా మారి నిలవ చేయబడుతుంది. ఈ విధంగా కండరానికి, కాలేయానికి మధ్య జరిగే ద్వంద్వరవాణాను ‘కోరివలయం’ అంటారు.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కండర సూక్ష్మ, నిర్మాణాన్ని సంకోచ ప్రక్రియను వివరించండి.
జవాబు:
1) మనదేహంలోని అస్థికండరం / రేఖిత కండరం అనేక కండర కట్టలు లేదా ఫాసికిల్లలో నిర్మితమై ఉంటుంది. ప్రతి ఫాసికల్లో అనేక స్థూపాకార కండర తంతువులు లేదా కండర కణాలు ఉంటాయి. అన్ని ఫాసికిల్స్ను కప్పి ఉంచుతూ కొల్లా జెన్తో నిర్మితమైన ఫాసియా అనే సంయోజక కణజాలపు త్వచం ఉంటుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 4

కండర తంతువు సూక్షమమ నిర్మాణం:

  1. కండర కణాలు పొడవైన తంతువుల లాగా ఉంటాయి. కండర తంతువు ప్లాస్మాత్వచాన్ని సొర్కోలెమ్మా అని దీని జీవపదార్థాన్ని సార్కోప్లాజమ్ అని అంటారు.
  2. రేఖిత కండరతంతువు బహు కేంద్రక సిన్సిషియల్ స్థితిని ప్రదర్శిస్తుంది. పిండదశలో ఏకకేంద్రక మయోబ్లాస్ట్ కణాలు అనేకం కలసి ఒక కండర తంతువును ఏర్పర్చడం వల్ల అది బహుకేంద్రక స్థితిని పొందుతుంది.
  3. కండర తంతువు యొక్క సార్కోలెమ్మా కిందిభాగంలో పరిధీయంగా అనేక కేంద్రకాలు ఉండటం కండర తంతువు ప్రత్యేకత.
  4. కండర తంతువులోని అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని సార్కోప్లాజమిక్ రెటిక్యులమ్ అంటారు. ఇందులో కాల్షియం అయాన్లు నిలువ ఉంటాయి.
  5. కండర తంతువులోని సార్కోప్లాజంలో అనేక కండర సూక్ష్మతంతువులు ఒకదాని కొకటి సమాంతరంగా అమరి ఉంటాయి.
  6. ప్రతి కండర సూక్ష్మ తంతువులో ఏక్టిన్, మయోసిన్ అనే కండర ప్రోటీన్ల అమరిక వల్ల నిష్కాంతి, కాంతి పట్టీలుగా ఏర్పడి చారలుగా కనిపిస్తాయి.
  7. కాంతివంతపు పట్టీని ‘I’ – పట్టీ అంటారు. ఇందులో పలుచని సంకోచించే ఏక్టిన్ ప్రోటీన్ ఉంటుంది.
  8. నిష్కాంతి పట్టీని ‘A’ – పట్టీ అంటారు. A పట్టీలో మయోసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది.
  9. 1 పట్టీ మధ్య భాగంలోని స్థితిస్థాపక ‘Z’ – గీత ఉంటుంది.
  10. ‘A’ పట్టీ మధ్యభాగంలో ఏక్టిన్ తంతువులు లేని ప్రాంతాన్ని ‘H’ – మండలం అంటారు.

ఈ మండలంలో సన్నని తంతువులు లేనందువల్ల మిగతా ‘A’ పట్టీ కంటే కొంచెం లేత వర్ణంలో ఉంటుంది.

కండరం సంకోచించే ప్రక్రియ:-
కండరం సంకోచించే విధానాన్ని స్లైడింగ్ ఫిలిమెంట్ సిద్ధాంతం లేదా జారుడు తంతు సిద్ధాంతం ద్వారా వివరించవచ్చు. ఈ సిద్ధాంతం ప్రకారం కండర సంకోచ సమయంలో సన్నని ఏక్టివ్ తంతువులు, దళసరి మయోసిన్ తంతువుల మీదుగా / మధ్యగా జారడం జరుగుతుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

కండర సంకోచ ప్రక్రియలో ముఖ్య దశలు:-
i) కండర ఉద్దీపనం:

  1. కేంద్రనాడీ వ్యవస్థు నుంచి చాలక నాడీ తంతువుల ద్వారా నాడీ ప్రచోదనం కండర తంతువులను చేరినప్పుడు కండరం ఉద్దీపనం చెంది సంకోచం ప్రారంభమౌతుంది.
  2. ఈ నాడీ ప్రచోదనం అసిటైల్ కొలైన్ ద్వారా సార్కోప్లాజమిక్ రెటిక్యులమ్ లోని సిస్టర్నేలను చేరడం వల్ల, వాటి నుండి సార్కోప్లాజమ్ లోనికి “కాల్షియం” అయాన్లు విడుదలవుతాయి.

ii) అడ్డువంతెనలు ఏర్పడటం:

  1. సార్కోప్లాజమ్ లోనికి కాల్షియం అయాన్లు విడుదల కాగానే అవి ట్రోపోనిన్ ఉపప్రమాణం (Tn – C) తో బంధించబడతాయి. దీని ఫలితంగా, ఏక్టిన్ చైతన్యస్థానాలు బహిర్గతం అవుతాయి.
  2. ATP జలవిశ్లేషణ ఫలితంగా పొందిన శక్తిని ఉపయోగించుకొని మయోసిన్ తల ఏక్టిన్ చైతన్యస్థానంతో బందితమవుతుంది.

iii) పవర్ స్ట్రోక్:
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 5

  1. మయోసిస్ అడ్డు వంతెనలతో బంధింపబడిన ఏక్టిన్ తంతువులు సార్కోమియర్ లోని A – పట్టీ మధ్యభాగంలోనికి లాగబడతాయి.
  2. ఏక్టిన్ తంతువులను పట్టీ ఉన్న Z గీతలు కూడా రెండు వైపుల నుంచి లోనికి లాగబడతాయి. అందువల్ల ‘I’ పట్టీ పొడవు తగ్గిపోతుంది. కాని ‘A’ పట్టీ పొడవు మాత్రం యధాతధంగా ఉండిపోతుంది.
  3. ఈ సమయంలో సన్నని ఏక్జిన్ తంతువులు దళసరి ‘A’ పట్టీలోనికి లోతుగా లాగబడటం వల్ల ‘H’ మండలం సన్నగా మారుతుంది. సార్కోమియర్ పొడవు తగ్గి పొట్టిగా మారుతుంది. దీనినే కండర సంకోచం అంటారు.

iv) రికవరీ స్ట్రోక్:
జారుడు తంతువులు

  1. రివకరిస్ట్రోక్ మయోసిన్ తిరిగి తన సాధారణ స్థితిని చేరి, ADP ని విడుదల చేస్తుంది.
  2. ఒక కొత్త ATP మయోసిన్ తలతో బందితమవడం వల్ల అడ్డువంతెన విడిపోతుంది.
  3. ఈ కొత్త ATP, ATP ఏజ్ (ATPase) వల్ల జలవిశ్లేషణ చెంది అడ్డువంతెన వలయం పునరావృతం అవుతుంది. దీనివల్ల ఏక్టిన్ తంతువులు జారుతూ ఉండడం అధికం అవుతుంది.

v) కండరం సడలడం:

  1. కండరానికి చాలక నాడీ ప్రచోదనం ఆగిన వెంటనే కాల్షియం అయాన్ల గాఢత తగ్గుతుంది. ఫలితంగా ట్రోపోనిస్ నుంచి Ca+2 అయాన్లు వైదొలుగుతాయి. అందువల్ల ట్రోపోమయోసిన్ తిరిగి ఏక్టిన్ తంతువులపై నున్న చైతన్యస్థానాలను కప్పివేయడంతో అవి మరుగున పడతాయి.
  2. ఫలితంగా ఏక్టిన్ తంతువుల పై నున్న చైతన్యస్థానాలు మయోసిన్ తలతో బంధితమయ్యే అవకాశం ఉండదు. కారణంగా ‘Z’ త్వచం తిరిగి తన యధాస్థితిని చేరుతుంది. దీన్ని సడలడం అంటారు.

ప్రశ్న 2.
కండర సంకోచ సమయంలోని అంశాలను వరుసక్రమంలో వివరించండి.
జవాబు:
కండర సంకోచ సమయంలో సన్నని ఏక్టిన్ తంతువులు, దళసరి మయోసిన్ తంతువుల మీదుగా / మధ్యగా జారడం జరుగుతుంది.

కండర సంకోచ సమయంలో వివిధ అంశాలు:
1. కేంద్రక నాడీ వ్యవస్థ (CNS) నుంచి చాలక నాడీ తంతువుల ద్వారా నాడీ ప్రచోదనం కండర తంతువులను చేరినప్పుడు కండరం ఉద్దీపన చెంది సంకోచం ప్రారంభమౌతుంది.

2. నాడీ ప్రచోదన కండర నాడీ సంధిని చేరగానే అసిటైల్ కొలైన్ అనే నాడీ అభివాహకం విడుదలై సార్కోలెమ్మ వద్ద క్రియాశక్మం ఉత్పత్తి అవుతుంది.

3. ఈ క్రియాశక్మం త్రయా వ్యవస్థ ద్వారా సార్కోప్లాజమిక్ రెటిక్యులమ్ లోని సిస్టర్నేలను చేరడం వల్ల వాటి నుంచి సార్కోప్లాజమ్ లోనికి కాల్షియం అయాన్లు విడుదల అవుతాయి.

4. సార్కోప్లాజమ్ లోనికి కాల్షియం అయాన్లు విడుదల కాగానే అది ట్రోపోనిన్ ఉపప్రమాణం. Tn – Cతో బంధింపబడతాయి. దీని ఫలితంగా, ట్రోపోమయోసిన్ సంక్లిష్టం స్థానభ్రంశం చెంది ఏక్టిన్ చైతన్య స్థానాలు బహిర్గతం అవుతాయి.

5. ATP జలవిశ్లేషణ ఫలితంగా పొందిన శక్తిని ఉపయోగించుకొని, మయోసిన్ల ఏక్టిన్ చైతన్య స్థానంతో బంధితమవుతుంది.

6. మయోసిన్ అడ్డువంతెనలతో బంధింపబడిన ఏక్టిన్ తంతువులు సార్కోమియర్లోని A-పట్టీ మధ్యభాగంలోనికి లాగబడతాయి. ఏక్టిన్ తంతువులను పట్టీ ఉన్న Z గీతలు కూడా రెండు వైపుల నుంచి లోనికి లాగబడతాయి. అందువల్ల I-పట్టీ పొడవు తగ్గిపోతుంది. కాని ‘A’ పట్టీ పొడవు మాత్రం యధాతధంగా ఉండిపోతుంది.

7. ఈ సమయంలో సన్నని ఏక్టిన్ తంతువులు దళసరి A- పట్టీలోనికి లోతుగా లాగబడటం వల్ల ‘H’ సన్నగా మారుతుంది. సార్కోమియర్ పొడవు తగ్గి పొట్టిగా మారుతుంది. దీనినే కండర సంకోచం అంటారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

కండర సంకోచం ఆగిపోవడంలో వివిధ అంశాలు:-

1) అసిటైల్ కొలైన ఎస్టరేజ్ చర్య వల్ల నాడీ ప్రచోదన కండరనాడీ సంధి దగ్గర ఉన్న అసిటైల్ కొలైన్ విడిపోతుంది. ఈ చర్య వల్ల కండరానికి చాలక నాడీ ప్రచోదన ఆగిపోతుంది.

2) నాడీ ప్రబోదన ఆగిన వెంటనే కాల్షియం అయాన్లు తిరిగి సార్కోప్లాజమిక్ రెటిక్యులమ్ సిస్టర్నెలలోనికి Ca+2 ATP ఏజ్ ఎన్ఎమ్ ద్వారా పంప్ చేయబడటం వల్ల సార్కోప్లాజమ్లో Ca+2 అయాన్ల గాఢత తగ్గుతుంది. ఫలితంగా ట్రోపోనిస్ నుంచి Ca+2 అయాన్లు వైదొలుగుతాయి.

3) అందువల్ల ట్రోపోమయోసిన్ తిరిగి ఏక్టిన్ తంతువుల పై నున్న చైతన్య స్థానాలను కప్పివేయడంతో అవి మరుగునపడతాయి.

4) ఫలితంగా ఏక్టిన్ తంతువుల పై నున్న చైతన్యస్థానాలు మయోసిన్ తలతో బంధితమయ్యే అవకాశం ఉండదు. ఈకారణంగా ‘Z’ త్వచం తిరిగి తన యధాస్థితిని చేరుతుంది. దీన్నే ‘సడలడం’ అంటారు.

అస్థి పంజరం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రెండు కపాల సూదనాల పేర్లు తెలిపి, అవి ఉండే ప్రదేశాలను పేర్కొనండి.
జవాబు:

  1. కిరీట సూదనం: ఇది లాలాటికా మరియు కుడ్యార్థుల మధ్య ఉంటుంది.
  2. లాంబ్దాయిడ్ సూధనం: ఇది కుడ్యాస్థులు మరియు అనుకపాలాస్థి. మధ్య ఉంటుంది.

ప్రశ్న 2.
కపాలంలో కీలక ఎముక ఏది ? అది ఎక్కడ ఉంటుంది.
జవాబు:
స్పీనకీయం – ఇది కపాలంలో ఇతర ఎముకలన్నింటితోను అనుసంధానం చెందడం వల్ల దీన్ని కీలకమైన ఎముకగా పేర్కొనవచ్చు. ఇది కపాలం పీఠ మధ్యభాగంలో ఉంటుంది.

ప్రశ్న 3. మానవ పుర్రెను ద్వికందయుత పుర్రె అనడానికి కారణమేమి ? [Mar. ’14]
జవాబు:
పుర్రెలో గల రెండు అనుకపాలాస్థులు మధ్య గల మహావిహారం రంధ్రాన్ని ఆవరించి ఇరువైపుల రెండు అనుకపాల కందాలు ఉంటాయి. అందువల్ల మానవ పుర్రెను ద్వికందయుత పుర్రె అంటారు.

ప్రశ్న 4.
మానవుడి చెవిలోని అస్థిఖండాల పేర్లు, పరిణామ రీత్యా వాటి పుట్టుకను పేర్కొనండి. [T.S. & A.P. Mar.’16]
జవాబు:

  1. కూటకం ఇది క్రింది దవడలోని ఆర్టికులార్ రూపాంతరం
  2. దాగిలి ఇది ప్రలంబం యొక్క రూపాంతరం
  3. కర్ణాంతరాస్థి – ఇది అదోహనువు యొక్క రూపాంతరం

ప్రశ్న 5.
కింది వాటి మధ్య ఉండే కీళ్ల రకాలను పేర్కొనండి.
a) శీర్షధరం / అక్షకశేరుక
b) మణిబంధకాస్థి / కరాబాస్థి
జవాబు:
a) శీర్షధరం / అక్షకశేరుక మధ్య – బొంగరపుకీలు
b) మణిబంధకాస్థి / కరాబాబ్ది మధ్య – శాడిల్కీలు

ప్రశ్న 6.
కింది వాటి మధ్య ఉండే కీళ్ల రకాలను పేర్కొనండి.
a) శీర్షధరం / అక్షకశేరుకం
b) తొడ ఎముక / ఉదూఖలం
జవాబు:
a) శీర్షధరం / అక్షకశేరుక: బొంగరపు కీలు
b) తొడఎముక – ఉదూఖలం:- బంతి గిన్నే కీలు

ప్రశ్న 7.
కింది ఎముకల మధ్య కీలు ఏది ?
a) కపాల ఎముకలు
b) చీలమండ ఎముకలు
జవాబు:
a) కపాల ఎముకల మధ్యలో – సూదనం (పైదబస్కీలు ) ఉంటుంది.
ఉదా: కిరీటసూదనం, లాంబ్దయిడ్ సూదనం
b) చీలమండ ఎముకల మధ్యలో – జారెడుకీలు ఉంటుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవ కపాలంలోని ఎముకలను పేర్కొనండి.
జవాబు:
కపాలం మొదడును రక్షించే పెట్టెలాంటి నిర్మాణమే కపాలం. ఇది మొత్తం 8 బల్లపరపు చదునైన ఎముకలచే నిర్మితమై ఉంటుంది. అవి.

  1. లలాటికాస్థి (1):- ఈఎముకు నుదురు, కపాలం పూర్వ ఉదరభాగాన్ని, నేత్రగుళిక పై భాగాన్ని ఏర్పరుస్తుంది.
  2. కుడ్యాస్థులు: (2):- ఇవి కపాలకుహరం పై కప్పును, పక్క భాగాలను ఏర్పరుస్తాయి.
  3. కణతాస్థులు: (2):- ఇవి కపాలం యొక్క పార్శ్వభాగాలను, ఉదరభాగాన్ని ఏర్పరుస్తాయి.
  4. అనుకపాలాస్థులు: (1):- ఇవి కపాలం పరాంత పీఠభాగాన్ని ఏర్పరుస్తాయి.
  5. స్ఫీనకీయం (1):- ఇది కపాలం పీఠమధ్యభాగంలో ఉంటుంది. ఇది కపాలంలోని ఇతర ఎముకలన్నింటితోను అనుసందానం చెందడం వల్ల దీన్ని కీలకమైన ఎముకగా పేర్కొనవచ్చు.
  6. సేవకం (1):- ఇది కపాలం పీఠభాగపు పూర్వాంతంలోని ఎముక.

ప్రశ్న 2.
మానవుడి పర్శుకల పై లఘుటీక రాయండి.
జవాబు:
మనవ ఛాతిలో 24 పర్శుకలు, 12 జతలుగా అమరి ఉంటాయి.
ఈ ఎముకలు ఛాతిభాగంలో గల అవయవాల చుట్టూ అమరి వాటికి రక్షణిస్తాయి. ప్రతి పర్ముక బల్లపరుపుగా ఉండి పృష్ఠతలంలో వెన్నెముకతోనూ, ఉదరతలంలో ఉరోస్థితోను అతికి ఉంటుంది. ఈ పర్శుకలను మూడు రకాలుగా విభజించారు.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 6

1. నిజపర్శుకలు లేదా కశేరు ఉరోస్థి పర్శుకలు: మొదటి ఏడుజతల పర్శుకలను నిజపర్శుకలు అంటారు. ఇవి పృష్టి తలంలో ఉరఃకశేరుకలతోనూ, ఉదర తలంలో ఉరోస్థితోనూ కచాభ మృదులాస్థి సహాయంతో అతికి ఉంటాయి.

2. మిథ్యాపర్శుకలు: మిగిలిన పర్ముకలను మిథ్యా పర్శుకలు అంటారు. వీటిలో 8వ, 9వ, 10వ జత పర్శుకలు నేరుగా ఉరోస్థితో కలవకుండా 7వ జత పర్ముకకు చెందిన కచాభ మృదులాస్థి ద్వారా ఉరోస్థితో కలుస్తాయి. అందువల్ల వీటిని కశేరు మృదులాస్థి పర్శుకలు లేదా మిథ్యాపర్చుకలు అందురు.

3. ప్లవక పర్శుకలు: చివరి రెండు జతల పర్శుకలు (11వ మరియు 12వ) ఉదరతలంలో ఉరోస్థితో కాని, పూర్వభాగపు పర్శుకలతో కాని అంటి ఉండవు. ఇవి ఉదరతలంలో స్వేచ్ఛగా ఉంటాయి. అందువల్ల వీటిని ప్లవక పర్శుకలు అంటారు. ఉరః కశేరుకలు, పర్శుకలు, ఉరోస్థి కలసి పర్శుకల బోనును ఏర్పరుస్తాయి.

ప్రశ్న 3.
మానవుడి పూర్వాంగపు ఎముకలను పేర్కొనండి.
జవాబు:
మానవుడిలో ఒక్కో పూర్వాంగము 30 ఎముకలను కలిగి ఉంటాయి. అవి:

  1. భుజాస్థి (1):- పూర్వాంగపు ఎముకలో పొడవైన ఎముక, ఇది భుజము నుండి మోచేయి వరకు ఉంటుంది. 2) రత్ని మరియు అరత్ని (1) అమరి ఉంటాయి.
  2. ఈ ఎముకలు ముంజేయి ఎముకలు ఇవి మోచేయి మరియు మణికట్టు మధ్యలో
  3. మణిబంధకాస్థులు (8): ఇది మణికట్టు ఎముకలు, ఇవి ఎనిమిది ఎముకలు.
  4. కరభాస్థులు (5): కరభస్థులు 5, ఇవి అరచేతి ఎముకలు
  5. అంగుళ్యాస్థులు (14): ఇవి మొత్తం 14 ఎముకలు. ఇవి చేతివ్రేళ్ళలో అమరి ఉన్న ఎముకలు. ఒక్కొక్క వ్రేలిలో 3 చొప్పున ఉండి, బ్రొటన వ్రేలిలో మాత్రం రెండు ఎముకలుంటాయి.

ప్రశ్న 4.
మానవుడి కాలిలోని ఎముకలను పేర్కొనండి.
జవాబు:
మానవుడి కాలిలో (చరమాంగంలో) 30 ఎముకలుంటాయి. అవి

  1. తుంటి ఎముక లేదా తొడ ఎముక (1):- ఇది తొడ భాగంలో ఉంటుంది. ఇవి మానవశరీరంలో కెల్లా పొడవైన మరియు దృఢమైన ఎముక.
  2. అంతర్జంఘిక మరియు బహిర్జంఘిక (1.1):- ఈ రెండు ఎముకలు మోకాలికి, చీలమండ మధ్యలో అమరి ఉండి క్రింది కాలిని ఏర్పరుస్తాయి.
  3. చీలమండ ఎముకలు (7):- ఈ ఎముకలు కలిసి కాలి చీలమండను ఏర్పరుస్తాయి.
  4. ప్రపాదార్థికలు (5):- ఇవి నాళకారపు ఎముకలు.
  5. అంగుళ్యాస్థులు (14):- ప్రతిపాదం 14 అంగుళ్యాస్థులను కలిగి ఉంటాయి. ప్రతికాలి వ్రేలిలో మూడు ఎముకలు చొప్పున ఉంటాయి. కాని బ్రొటన వ్రేలిలో రెండు ఎముకలు మాత్రమే ఉంటాయి.
  6. మోకాలి చిప్ప (1):- మోకాలి కీలును కప్పి ఉంచే గిన్నె లాంటి ఎముక.

ప్రశ్న 5.
మానవుడి పూర్వాంగపు ఎముకల పటాన్ని గీయండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 7

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

ప్రశ్న 6.
శ్రేణి మేఖల చక్కని పటాన్ని గీయండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 8

ప్రశ్న 7.
సైనోవియల్ కీళ్లు నిర్మాణాన్ని చక్కని పటం ద్వారా వివరించండి.
జవాబు:
రెండు ఎముకల సంధితలాల వద్ద సైనోవియల్ ద్రవం నిండిన సైనోవియల్ కుహరం కలిగి ఉండే కీళ్ళను సైనోవియల్ కీళ్ళు అంటారు.

సైనోవియల్ కీలు నిర్మాణం: సైనోవియల్ కీలును కప్పి ఉంచుతూ రెండు పొరలతో ఏర్పడిన సైనోవియల్ గుళిక ఉంటుంది. గుళిక వెలుపలి పొర క్రమరహిత తంతుయుత సంయోజక కణజాలంతో ఏర్పడి అధిక కొల్లాజెన్ తంతువులతో ఉంటుంది. ఈ పొర రెండు పర్యస్థికలను కలుపుతూ కీళ్లు సాగే గుణాన్ని నిరోధించి స్థానభ్రంశం చెందకుండా నిరోధిస్తుంది. స్థితిస్థాపక తంతువులతో కూడిన ఈ పొరలోని కొన్ని తంతువులు కట్టలుగా కలిసి బంధకాలుగా ఏర్పడతాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 9

సైనోవియల్ గుళిక లోపలిపొర ఏరియోలార్ కణజాలంతో ఏర్పడుతుంది. ఈ పొర చిక్కని సైనోవియల్ ద్రవాన్ని స్రవిస్తుంది. సైనోవియల్ ద్రవంలో హయలురోనిక్ ఆమ్లం, భక్షక కణాలు మొదలైనవి ఉంటాయి. సైనోవియల్ ద్రవం కీళ్ల వద్ద కందెనగా పనిచేసి ఎముకల మధ్య రాపిడిని తగ్గిస్తుంది.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవుడి అక్షాస్థిపంజరాన్ని గురించి వివరించండి ? [A.P. Mar. ’17] [Mar. ’14]
జవాబు:
దేహంలో ప్రధానాక్షంగా ఏర్పడిన అస్థి పంజరాన్ని అక్షాస్థిపంజరం అంటారు. ఇది 80 ఎముకలచే ఏర్పడుతుంది. దీనిలో పుర్రె, వెన్నెముక, ఉరోస్థి పర్శుకలు అనే భాగాలుంటాయి.
1) పుర్రె (Skull): పుర్రెలోని మొత్తం 22 ఎముకలు. కపాల, ముఖ ఎముకల సమూహాలుగా ఉంటాయి.
కపాలం: మెదడును రక్షించే పెట్టె లాంటి నిర్మాణమే కపాలం. ఇది మొత్తం 8 బల్లపరుపు ఎముకలచే నిర్మితమై ఉంటుంది. అవి

  1. లలాటికాస్థి (1): ఈ ఎముక నుదురు, కపాలం పూర్వ ఉదరభాగాన్ని, నేత్రగుళిక పైభాగాన్ని ఏర్పరుస్తుంది.
  2. కుడ్యార్థులు (2): ఇవి కపాలకుహరం పై కప్పును, పక్క భాగాలను ఏర్పరుస్తాయి.
  3. కణతాస్థులు (2): ఇవి కపాలం యొక్క పార్శ్వభాగాలను, ఉదరభాగాన్ని ఏర్పరుస్తాయి.
  4.  అనుకపాలాస్థులు (1): ఇవి కపాలం పరాంత పీఠభాగాన్ని ఏర్పరుస్తాయి.
  5. స్ఫీనకీయం (1): ఇది కపాలం పీఠ మధ్య భాగంలో ఉంటుంది. ఇది కపాలంలోని ఇతర ఎముకలన్నింటితోను అనుసంధానం చెందడం వల్ల దీన్ని కీలకమైన ఎముకగా పేర్కొనవచ్చు.
  6. సేవకం: ఇది కపాలం పీఠభాగపు పూర్వాంతం లోని ఎముక.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

ముఖఎముకలు: పుర్రె ముఖ ప్రాంతంలో 14 ఎముకలు ఉంటాయి.

  1. నాసికాస్థులు (2): ఇవి ముక్క పై వారధిని ఏర్పరిచే ఒకజత ఎముకలు
  2. జంభాకలు (2): ఇది పై దవడను ఏర్పరిచే జంట ఎముకలు.
  3. జైగోమాటిక్ ఎముకలు (2): ఇవి చెంపలకు ఆధారాన్ని ఇచ్చే జంట ఎముకలు.
  4. అశ్రు అస్థులు (2): ఇవి నేత్ర గుళికలలో అశ్రు గ్రంధులకు ఆధారాన్నిచ్చే ఎముకలు. ఇవి ముఖభాగంలో ఉండే అతి చిన్న ఎముకలు.
  5. తాల్వాస్థులు (2): ఇవి ఘనతాలువు పరాంతభాగాన్ని ఏర్పరచే జంట ఎముకలు
  6. నాసికాశంఖువులు (2): ఇవి నాసికాకక్ష్య పార్శ్వతలాన్ని ఆవరించి ఉండే చుట్ట వంటి ఎముకలు.
  7. సిరిక (1): ఇది నాసికాకుహరం ఉదర తలంలో ఉండే త్రిభుజాకార ఎముక.
  8. హనువు (1): ఇది కింది దవడలో ఉండే ‘U’ ఆకారపు ఎముక. పుర్రె మొత్తం ఎముకలలో కదిలే ఎముక ఇది ఒక్కటి మాత్రమే.
    AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 10

2) వెన్నెముక: మానవుని వెన్నెముకలో 26 వెన్నుపూసలు లేదా కశేరుకలు ఒక వరుస క్రమంలో ఉంటాయి.
ప్రతి కశేరుకంలో మధ్యభాగంలో ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. దీన్ని నాడీకులు అంటారు. దీని ద్వారా వెన్నుపాము ప్రయాణిస్తుంది. పుర్రె వద్ద ప్రారంభించి. వెన్నుముకను గ్రీవాకశేరుకలు (7), ఉరఃకశేరుకలు (12), కటికశేరుకలు (5), త్రికం (1) సంయుక్త, అనుత్రిక (1) సంయుక్త ప్రాంతాలుగా విభజించవచ్చు. త్రికం, ఐదు త్రిక కశేరుకలు కలవడం వల్ల ఏర్పడిన త్రిభుజాకార ఎముక. అలాగే అనుత్రికం, నాలుగు కశేరుకలు కలిసిపోవడం వల్ల ఏర్పడిన త్రిభుజాకార ఎముక.

3) ఉరోస్థి: ఇది వక్షం ఉదర మధ్యరేఖలో అమరి ఉండే బల్లపరపు ఎముక. దీనిలో మూడుభాగాలుంటాయి. దీని అగ్రభాగాన్ని మెనూబ్రియం అనీ, మధ్యభాగాన్ని దేహం అని పరాంతంలోని నిమ్నభాగాన్ని జిఫాయిడ్ కీలితం అని అంటారు. ఉరోస్థి ఉరఃపర్శుకలు, ఉదరపర్శుకలు అంటిపెట్టుకోవడానికి ఆదార తలాన్ని ఇస్తాయి.

4) పర్శుకలు: మనవ ఛాతిలో 24 పర్శుకలు, 12 జతలుగా అమరి ఉంటాయి. ఈ ఎముకలు ఛాతిభాగంలో గల అవయవాల చుట్టూ అమరి వాటికి రక్షణిస్తాయి. ప్రతి పర్ముక బల్లపరుపుగా ఉండి పృష్ఠతలంలో వెన్నెముకతోనూ, ఉదరతలంలో ఉరోస్థితోను అతికి ఉంటుంది. ఈ పర్శుకలను మూడు రకాలుగా విభజించారు.
i) నిజపర్శుకలు లేదా కశేరు – ఉరోస్థి పర్శుకలు: మొదటి ఏడుజతల పర్శుకలను నిజపర్శుకలు అంటారు. ఇవి పృష్టి తలంలో ఉరఃకశేరుకలతోనూ, ఉదరతలంలో ఉరోస్థితోనూ కఛాభ మృదులాస్థి సహాయంతో అతికి ఉంటాయి.

ii) మిథ్యాపర్శుకలు: మిగిలిన పర్శుకలను మిథ్యా పర్శుకలు అంటారు. వీటిలో 8వ, 9వ, 10వ జతపర్శుకలు నేరుగా ఉరోస్థితో కలవకుండా 7వ జత పర్ముకకు చెందిన కచాభ మృదులాస్థి ద్వారా ఉరోస్థితో కలుస్తాయి. అందువల్ల వీటిని కశేరు మృదులాస్థి పర్శుకలు లేదా మిథ్యాపర్శుకలు అందురు.

iii) ప్లవక పర్ముకలు: చివరి రెండు జల సర్ముకలు (11వ మరియు 12వ) ఉదరతలంలో ఉరోస్థితో కాని, పూర్వభాగపు పర్శుకలతో కాని అంటి ఉండవు. ఇది ఉదరతలంలో స్వేచ్ఛగా ఉంటాయి. అందువల్ల వీటిని ప్లవక పర్శుకలు అంటారు. ఉరః కశేరుకలు, పర్శుకలు, ఉరోస్థి కలసి పర్శుకల బోనును ఏర్పరుస్తాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 11