AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Zoology Study Material  Lesson 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Zoology Study Material Lesson 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవ మెదడును కప్పి ఉంచే రక్షణ పొరల పేర్లు తెలపండి.
జవాబు:
మానవ మెదడు మూడు సంయోజక కణజాలపు పొరలచే కప్పబడి ఉంటుంది. ఈ రక్షణ పొరలన్నింటిని కలిపి మెనింజెస్ అంటారు.

  1. వరాశిక
  2. లౌతికళ
  3. మృద్వి

ప్రశ్న 2.
కార్పస్కెల్లోసమ్ అంటే ఏమిటి ? [A.P. Mar. ‘ 17; T.S. Mar. ’15]
జవాబు:
కుడి, ఎడమ మస్తిష్కార్థ గోళాలు రెంటినీ కలుపుతూ లోపలివైపున వల్కలం కిందగా బల్లపరుపు మయలిన్ సహిత నాడీ పట్టీ ఉంటుంది. దీన్ని కార్పస్కెల్లోసమ్ అంటారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

ప్రశ్న 3.
ఆర్బోరి ్వటే గురించి మీరు తెలుసుకున్నదేమిటి ?
జవాబు:
అనుమస్తిష్కంలో ఉండే తెలుపు వర్ణ పదార్థం అనేక శాఖలు కలిగి చెట్టులాగా ఉంటుంది. అందువల్ల అనుమస్తిష్కపు తెలుపు పదార్థాన్ని ఆర్బోరిటే (జీవవృక్షం) అని అంటారు.

ప్రశ్న 4.
సహానుభూత వ్యవస్థను ఉరఃకటి విభాగం అంటారు. ఎందువల్ల ? [T.S. Mar. ’17; A.P. Mar. ’16]
జవాబు:
పూర్వ నాడీసంధి నాడీకణాలు వెన్నుపాములోని ఉరః కటి ప్రాంతంలోని బూడిద వర్ణ పదార్థంలో ఉంటాయి. అందువల్ల సహానుభూత విభాగాన్ని ఉరః కటి విభాగం అంటారు.

ప్రశ్న 5.
సహసహానుభూత వ్యవస్థను కపాల త్రిక విభాగం అంటారు. ఎందువల్ల ?
జవాబు:
సహ సహానుభూత నాడీ విభాగానికి ఒక నిర్దిష్ట నిర్మాణం ఉండదు. అయితే దీనికి చెందిన నాడీ సంధి పూర్వ నాడీకణాల కణదేహాలు మెదడులోనూ, వెన్నుపాము త్రికనాడీ ప్రాంతంలోనూ ఉంటాయి. అందువల్లనే సహసహానుభూత విభాగాన్ని కపాల త్రిక విభాగం అంటారు.

ప్రశ్న 6.
పరమ అనుద్రిక్తతా వ్యవధి, సాపేక్ష అనుద్రిక్తతా వ్యవధి మధ్య ఉండే భేదాలు రాయండి.
జవాబు:

  • పరమ అనుద్రిక్తతా వ్యవధిలో ప్రేరణ బలం ఎంత అధికంగా ప్రయోగించినా క్రియాశక్మం ఏర్పడదు.
  • సాపేక్ష అనుద్రిక్తతా వ్యవధిలో ప్రేరణ బలం త్రెషోల్డ్ కన్నా ఎక్కువగా ఉంటే క్రియాశక్మం ఏర్పడుతుంది.

ప్రశ్న 7.
పూర్ణ లేదా శూన్య అనుక్రియ అంటే ఏమిటి ?
జవాబు:
ప్రేరణ బలం త్రెషోల్డ్ కంటే తక్కువగా ఉన్నప్పుడు, నాడీ కణంలో క్రియాశక్మం ఏర్పడదు. కానీ త్రెషోల్డ్ తగినంతగా ఉన్నప్పుడు లేదా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా క్రియాశక్మం ఏర్పడుతుంది. ఈ లక్షణాన్నే పూర్ణ లేదా శూన్య అనుక్రియ అంటారు.

ప్రశ్న 8.
రసాయనికంగా, క్రియాత్మకంగా కంటిలోని దండకణాలు, శంఖుకణాలు మధ్య భేదం ఏమిటి ?
జవాబు:
దండకణాల్లో విటమిన్ – ఎ ఉత్పన్నం అయిన ఎర్రని రోడాప్సిన్ ప్రోటీన్ ఉంటుంది. ఇది మసక చీకటిలో దృష్టికి ఉపయోగపడుతుంది. శంఖు కణాల్లో అయోడాప్సిన్ అనే దృశ్య వర్ణ ద్రవ్యం ఉంటుంది. ఇది ఫోటాప్సిన్ అనే ప్రోటీన్ నిర్మితం. శంఖు కణాలు పగటి పూట దృష్టికి, రంగులు గుర్తించడానికి ఉపయోగపడతాయి.

ప్రశ్న 9.
అంధచుక్క, పసుపుచుక్క మధ్య భేదం ఏమిటి ?
జవాబు:
నేత్రపటలం పరాంత మధ్య భాగాన్ని పసుపుచుక్క అంటారు. పసుపుచుక్క మధ్య భాగంలో ఉండే చిన్న లోతైన ప్రదేశాన్ని ఫోవియా సెంట్రాలిస్ అంటారు. దీనిలో శంఖు కణాలు మాత్రమే ఉంటాయి. నడిచేటప్పుడు, చదివేటప్పుడు, వాహనాన్ని నడిపేటప్పుడు ఫోవియా తీక్షణ దృష్టికి తోడ్పడుతుంది.

నేత్రపటలం, నేత్రనాడి కలిసే ప్రాంతాన్ని అంధచుక్క అంటారు. ఈ ప్రాంతంలో ఏ విధమైన కాంతి గ్రాహకాలు ఉండవు. అందువల్ల ఈ ప్రదేశంలో ప్రతిబింబాలు ఏర్పడవు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

ప్రశ్న 10.
కోర్టి అంగం అంటే ఏమిటి ? [A.P. Mar. ’17, ’15]
జవాబు:
కర్ణావర్తనం ఉపకళ బేసిల్లార్ త్వచం పై ఒక జ్ఞానగట్టును ఏర్పరుస్తుంది. దీనినే కోర్టి అంగం అంటారు. దీనిలో శ్రవణ గ్రాహకాలుగా పనిచేసే రోమ కణాలు ఉంటాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవ వెన్నుపాము అడ్డుకోత చక్కని పటం గీచి, భాగాలు గుర్తించండి. [T.S. Mar. 16; A.P. & T.S. Mar. ’15]
జవాబు:
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం 1

ప్రశ్న 2.
దైహిక నాడీవ్యవస్థ, స్వయంచోదిత నాడీవ్యవస్థల మధ్య తేడాలు రాయండి.
జవాబు:
దైహిక నాడీవ్యవస్థ

  1. దైహిక నాడీ వ్యవస్థ బాహ్య పరిసరాల ఉద్దీపనలకు అనుగుణంగా అస్థికండరాల చర్యలను నియంత్రిస్తుంది.
  2. దీనిలో జ్ఞాన, చాలక నాడీకణాలు రెండూ ఉంటాయి.
  3. దైహిక నాడీవ్యవస్థ చర్యలన్నీ ఇచ్ఛాపూర్వకంగా, నియంత్రితంగా జరుగుతాయి.
  4. ఈ వ్యవస్థలో జ్ఞాన కణాలు, వివిధ బాహ్యగ్రాహకాల నుంచి జ్ఞాన ప్రచోదనాలను సేకరించి కేంద్ర నాడీ వ్యవస్థకు చేరవేస్తాయి. కేంద్ర నాడీవ్యవస్థ తన ప్రతిస్పందనలను చాలక నాడీకణాల ద్వారా అస్థి కండరాలకు పంపిస్తుంది. తద్వారా సంకోచించి తగిన చర్యలు తీసుకొంటుంది.
  5. అసిటైల్ కొలైన్ నాడీ అభివాహకాలుగా పనిచేస్తాయి.

స్వయంచోదిత నాడీవ్యవస్థ

  1. స్వయంచోదిత నాడీవ్యవస్థ దేహంలోని అంతర్గత పరిసరాలకు అనుగుణంగా నునుపు, హృదయ కండరాలను క్రమబద్దీకరిస్తుంది.
  2. చాలావరకు దీనిలో చాలక నాడీకణాలు ఉంటాయి.
  3. వీటి చర్యలన్నీ అనియంత్రితమైనప్పటికినీ మెదడు ల ని మజ్జాముఖం, అధోపర్యంకం వీటిని పర్య వేక్షిస్తూ ఉంటాయి.
  4. ఈ వ్యవస్థ ఒక చాలక వ్యవస్థగా పనిచేస్తుంది. అంత రంగ అవయవాలైన జీర్ణ, హృదయ, ప్రసరణ, విసర్జన, అంతస్రావక, ప్రత్యుత్పత్తి వ్యవస్థల చర్యలన్నీ స్వయంచోదిత నాడీవ్యవస్థ ఆధీనంలోనే ఉంటాయి.
  5. అసిటైల్ కొలైన్ లేదా నార్ఎపినెఫ్రిన్లు నాడీ అభివాహకాలుగా పనిచేస్తాయి

ప్రశ్న 3.
మానవుడి కంటిలోని నేత్రపటలం (రెటీనా) గురించి రాయండి.
జవాబు:
నేత్రపటలం, నేత్రగోళంలోని లోపలి పొర. దీనిలో వర్ణయుత ఉపకళ, నాడీప్రాంతం అనే రెండు భాగాలు ఉంటాయి. వర్ణయుత ఉపకళ ఒక మెలనిన్ ఆచ్ఛాదం. నాడీ ప్రాంతంలో మూడు పొరలుంటాయి. అవి కాంతి గ్రాహకస్తరం, ద్విధ్రువ కణ స్తరం, నాడీసంధి కణస్తరం.

కాంతిగ్రాహకస్తరంలో దండకణాలు, శంఖుకణాలు అనే రెండు రకాల కాంతి గ్రాహకాలుంటాయి. దండకణాల్లో విటమిన్ – ఎ ఉత్పన్నాలు అయిన రోడాప్సిన్ ఉంటుంది. ఇది మసక చీకటిలో దృష్టికి ఉపయోగపడుతుంది. శంఖు కణాల్లో అయోడాప్సిస్ అనే దృశ్యవర్ణద్రవ్యం ఉంటుంది. ఇది ఫోటాప్సిన్ అనే ప్రోటీన్ నిర్మితం. శంఖు కణాలు పగటి పూట దృష్టికి రంగులు గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఇవి ఎరుపు, నీలం, ఆకుపచ్చ వర్ణాలను గుర్తిస్తాయి.

నేత్రపటలం పరాంత మధ్య భాగాన్ని పసుపుచుక్క అంటారు. పసుపు చుక్క మధ్యభాగంలో ఉండే చిన్న లోతైన ప్రదేశాన్ని ‘ఫోనియా సెంట్రాలిస్’ అంటారు. దీనిలో శంఖుకణాలు మాత్రమే ఉంటాయి. ఇవి నడిచేటప్పుడు, చదివేటప్పుడు, వాహనాన్ని నడిపేటప్పుడు, ఫోవియా తీక్షణ దృష్టికి తోడ్పడుతుంది. నేత్రపటలం, నేత్రనాడి కలిసే ప్రాంతాన్ని అంధచుక్క అంటారు. ఈ ప్రాంతంలో ఏ విధమైన కాంతి గ్రాహకాలుండవు. అందువల్ల ఈ ప్రదేశంలో ప్రతిబింబాలు ఏర్పడవు.

ప్రశ్న 4.
నాడీకణ సంధి అభివహనాన్ని విశదీకరించండి.[T.S. Mar.’17; A.P. Mar. ’16]
జవాబు:
ఒక కణం నుంచి మరో నాడీ కణానికి ప్రచోదనలు ప్రత్యేకమైన సంధుల ద్వారా అభివహనం చెందుతాయి. వీటినే నాడీ కణ సంధులు అంటారు. నాడీకణ సంధులు రెండు రకాలు. అవి : విద్యుత్ నాడీకణ సంధులు, రసాయన నాడీకణ సంధులు. విద్యుత్ నాడీకణ సంధులు : విద్యుత్ నాడీకణ సంధిలో నాడీకణ సంధి పూర్వ, పర త్వచాలు, రసాయన నాడీకణ సంధి కన్నా సన్నిహితంగా దగ్గరగా ఉంటాయి. ఈ విద్యుత్ నాడీకణ సంధిలో పాల్గొనే రెండు నాడీకణాల మధ్య నాడీ ప్రచోదనాలు విద్యుత్ తరంగాల రూపంలో అంతర సంధులు అనే ప్రత్యేక నిర్మాణాల ద్వారా ప్రసరిస్తాయి. విద్యుత్ నాడీ కణ సంధి ద్వారా నాడీ ప్రచోదన, రసాయన నాడీకణ సంధి కంటే ఎక్కువ వేగంగా జరుగుతుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

రసాయన నాడీ కణ సంధులు: రసాయన నాడీకణ సంధి ద్వారా ప్రచోదనాల ప్రసారానికి నాడీ అభివాహకాలు అనే రసాయనాలు ఉపయోగపడతాయి. తంత్రికాక్షపు అంత్యాలు ఈ నాడీ అభివాహకాలతో నిండిన ఆశయాలను కలిగి ఉంటాయి. నాడీ ప్రచోదనం తంత్రికాక్షపు అంత్యాన్ని చేరిన వెంటనే, నాడీసంధి పూర్వ కణత్వచం విధ్రువణం చెందుతుంది. ఫలితంగా కాల్షియం వోల్టేజ్ గేటెడ్ ఛానళ్ళు తెరుచుకుంటాయి. ఈ ఛానళ్ళ ద్వారా కాల్షియం అయాన్లు లోనికి ప్రవేశించి నాడీకణ సంధి ఆశయాలలో రంధ్రాలు కలుగచేస్తాయి. అవి నాడీకణ త్వచం వద్దకు చేరి దానితో కలిసిపోయి నాడీ అభివాహకాన్ని కణ బహిష్కరణ అనే చర్య ద్వారా నాడీకణ సంధి చీలికలోనికి విడుదల చేస్తాయి.

అభివాహకం పర నాడీకణ సంధి త్వచంలో ఉండే నిర్దిష్ట గ్రాహకాలతో బంధితమవుతుంది. ఫలితంగా అది విధ్రువణం చెంది క్రియాశక్మం ఏర్పడి ఆ కణం వెంబడి వహనం చెందుతుంది. ఎసిటైల్ కోలిన్ ప్రధాన నాడీ అభివహనంగా పనిచేస్తుంది. ఎపినెఫ్రిన్, డోపమైన్, సెరటోనిన్ వంటి రసాయనాలు నిరోధక లేదా ఉత్తేజక నాడీ అభివాహకంగా పనిచేస్తాయి. గ్లైసీన్, GABAలు నిరోధక నాడీ అభివాహకాలుగా పనిచేస్తాయి.

నాడీకణ సంధి పరత్వచంలో లైగాండ్ గేటెడ్ ఛానళ్ళు ఉంటాయి. వీటికి రసాయన అభివాహకాలు బంధించబడినప్పుడు అయాన్ ఛానళ్ళు తెరచుకొని వాటి ద్వారా Na+ మొదలైన అయాన్లు నాడీకణసంధి పరనాడీకణం లోనికి ప్రవేశించి కొత్త నాడీ ప్రచోదనాన్ని కలిగిస్తాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం 2

ప్రశ్న 5.
అంతరంగాలపై సహానుభూత నాడీవ్యవస్థ, సహసహానుభూత నాడీవ్యవస్థల ప్రభావంలో గల భేదాలు పేర్కొనండి.
జవాబు:
సహానుభూత నాడీవ్యవస్థ

  1. వెన్నుపాము ఉరః, కటి ప్రాంతాల నుంచి ఏర్పడుతుంది.
  2. నాడీ సంధులన్నీ కలసి రెండు గొలుసుల లాగా ఏర్పడతాయి.
  3. నాడీసంధి పూర్వ తంత్రికాక్షాలు పొట్టివిగానూ, నాడీసంధి పరతంత్రికాక్షాలు పొడవుగానూ ఉంటాయి.
  4. నాడీసంధి పర తంత్రికాక్షాల అంత్యాల నుంచి నార్ఎపినెఫ్రిన్ (norepinephrine) లేదా నార్ అడ్రినాలిన్(noradrenalin) అనే నాడీ అభివాహకం (neurotransmitter) విడుదల అవుతుంది. అందువల్ల వీటిని అడ్రినర్జిక్ నాడులు (adrenergic nerves) అంటారు.
  5. ఒత్తిడి సమయంలో చైతన్యవంతమై దేహాన్ని ఒత్తిడిని ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది.
  6. సాధారణంగా ఈ వ్యవస్థ ప్రభావం ఉత్తేజపరచడం.

సహసహానుభూత నాడీవ్యవస్థ

  1. మెదడు కపాల ప్రాంతం, వెన్నుపాము త్రిక ప్రాంతాల నుంచి ఏర్పడుతుంది.
  2. నాడీ సంధులు విడివిడిగానే ఉంటాయి.
  3. నాడీ సంధి పూర్వ తంత్రికాక్షాలు పొడవుగానూ, నాడీ సంధి పరతంత్రికాక్షాలు పొట్టివిగానూ ఉంటాయి.
  4. నాడీసంధి పర తంత్రికాక్షాల అంత్యాల నుంచి ఎసిటైల్ కోలిన్ అనే నాడీ అభివాహకం విడుదల అవుతుంది. అందువల్ల వీటిని కొలెనర్జిక్ నాడులు (cholinergic nerves) అంటారు.
  5. విరామ సమయంలో చైతన్యంగా ఉంటుంది. ఒత్తిడి తరువాత సాధారణ స్థితికి తీసుకువస్తుంది.
  6. సాధారణంగా ఈ వ్యవస్థ ప్రభావం నిరోధించడం.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవుడి మెదడు నిర్మాణం, విధులను గురించి సంక్షిప్త వివరణ రాయండి.
జవాబు:
మెదడు సమాచార విశ్లేషణ, నియంత్రణ కేంద్రం. ఇది కపాల కుహరంలో భద్రపరచబడి, మూడు సంయోజక కణజాలపు పొరలు లేదా కపాల పొరలచే కప్పబడి ఉంటుంది. అవి : వరాశిక, లౌతికళ, మృద్వి, మెదడు రక్షణ పొరలన్నింటిని కలిపి ‘మెనింజెస్’ అంటారు.
“మెదడును మూడు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. అవి :

  1. పూర్వ మెదడు
  2. మధ్య మెదడు
  3. అంత్య మెదడు

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

1) పూర్వ మెదడు : పూర్వ మెదడులో ఘ్రాణ లశునం, మస్తిష్కం, ద్వారగోర్థం అనే మూడు భాగాలుంటాయి.
i) ఘ్రాణ లశునం : ఘ్రాణ ఉపకళ నుంచి వాసనకు సంబంధించిన ప్రచోదనాలను ఘ్రాణ లశునాలు గ్రహిస్తాయి.
ii) మస్తిష్కం : మెదడులో ఎక్కువ భాగం మస్తిష్కం ఆక్రమిస్తుంది. ఇది నిలువుగా ‘ఆయత విదరం’ చే కుడి, ఎడమ మస్తిష్కార్థ గోళాలుగా విభజింపబడుతుంది. మస్తిష్కార్ధ గోళాలు రెండింటినీ కలుపుతూ లోపలివైపున వల్కలం కిందగా బల్లపరపు మయలిన్ సహిత నాడీ పట్టీ ఉంటుంది. దీన్ని ‘కార్పస్ కెల్లోసమ్’ అంటారు. కార్పస్ కెల్లోసమ్ కుడి, ఎడమ మస్తిష్కార్ధ గోళాల మధ్య సమన్వయాన్ని చేకూరుస్తుంది. మస్తిష్కం ఉపరితలం బూడిద వర్ణ పదార్థాన్ని కలిగి ఉంటుంది. దీన్ని మస్తిష్క వల్కలం అంటారు. మస్తిష్క వల్కలంలో నాడీకణ దేహాలు సాంద్రీకరించబడి ఉంటాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం 3

మస్తిష్క వల్కలం ఉపరితలంలో అనేక మడతలు గాడులను కలిగి ఉంటుంది. ఈ మడతలను ‘గైరి’ అని, మడతల మధ్యగల లోతైన గాడులను ‘సల్పి’ అని అంటారు. గైరి, సల్పీలు మస్తిష్క వల్కలం ఉపరితల వైశాల్యాన్ని అధికం చేస్తాయి. మస్తిష్క వల్కలంలో జ్ఞాన, చాలక, అనుబంధ ప్రదేశాలు అనే మూడు క్రియాత్మక ప్రదేశాలు ఉంటాయి.

  • జ్ఞానప్రదేశాలు : జ్ఞాన ప్రచోదనలను స్వీకరించి విశ్లేషణ చేస్తాయి.
  • చాలక ప్రదేశాలు : అనియంత్రిత కండరాల కదలికలను నియంత్రిస్తాయి.”
  • అనుబంధ ప్రదేశాలు : ఇవి అత్యంత సంక్లిష్టమైన జ్ఞాపకశక్తి, సమాచార కేంద్రంగా పనిచేస్తుంది.

మస్తిష్క దవ్వలో మయలిన్ సహిత తంత్రికాక్షాలు ఉంటాయి. అందువల్ల అది తెల్లగా ఉంటుంది. ప్రతి మస్తిష్కార్ధ గోళం 4 లంబికలుగా విభజింపబడి ఉంటుంది. అవి పూర్వ లంబిక, పార్శ్వ లంబిక, శంఖు లంబిక, అనుకపాల లంబిక.

iii) ద్వార గోర్థం : పూర్వ మెదడులో పరభాగమే ద్వారగోర్థం. దీనిలో ఊర్థ్వ పర్యంకం, పర్యంకం, అధో పర్యంకం అనే మూడు ప్రధాన భాగాలు ఉంటాయి.

ఎ) ఊర్థ్వ పర్యంకం : ద్వార గోర్ధం పై కప్పును ఊర్ధ్వ పర్యంకం అంటారు. దీనిలో నాడీరహిత భాగం వరాశికతో కలిసి పూర్వ రక్త ప్లక్షంను ఏర్పరుస్తుంది. పూర్వరక్త ప్లక్షం వెనుకభాగంలో ఊర్థ్వ పర్యంకంపై “పీనియల్ వృంతం”, దాని చివర గుండ్రని పీనియల్ గ్రంథి ఉంటాయి.

బి) పర్యంకం : మధ్య మెదడుకు పై స్థానంలో పర్యంకం ఉంటుంది. ఇది జ్ఞాన, చాలక ప్రచోదనాల సమన్వయ కేంద్రంగా పనిచేస్తుంది.

సి) అధోపర్యంకం : పర్యంకం ఉదర ఆధార కుడ్యాన్ని అధోపర్యంకం అంటారు. అధోపర్యంకం కింది వైపు ఒక గరాటు వంటి కాలాంచిక ఉంటుంది. దీని చివరిలో పీయూష గ్రంథి ఉంటుంది. అధోపర్యంకంలో అనేక నాడీ స్రావక కణాలుంటాయి. వీటి నుంచి అధోపర్యంక హార్మోన్లు స్రవించబడతాయి. అధోపర్యంకం స్వయంచోదిత నాడీవ్యవస్థ నియంత్రణ, సమన్వయ కేంద్రంగా పనిచేస్తూ ద్రవాభిసరణ, ఉష్ణ నియంత్రణ, దప్పిక, ఆకలి, తృప్తి వంటి చర్యలను సమన్వయం చేస్తుంది.

2) మధ్యమెదడు : మధ్యమెదడు అధోపర్యంకం, పాన్స్వరోలి మధ్యగా ఉంటుంది. మధ్య మెదడు ఉదరతలంలో ఒక జత ఆయత నాడీ తంతువుల పట్టీలుంటాయి. వీటిని సెరిబ్రల్ పెడన క్కుల్స్ అంటారు. ఇవి మస్తిష్కార్ధ గోళాలను పాన్స్ వరోలితో కలుపుతాయి. మధ్య మెదడు పృష్ఠభాగంలో నాలుగు లంబికలుండే కార్పోరా క్వాడ్రిజమైనా అనే నిర్మాణం ఉంటుంది. దీని పూర్వాంతంలో పెద్దవిగా ఉండే రెండు లంబికలను సుపీరియల్ కాలిక్యులి అని, పరాంతంలోని చిన్నవిగా ఉండే రెండు లంబికలను ఇన్ఫీరియర్ కాలిక్యులి అనీ అంటారు. ఇవి దృష్టి, శ్రవణ విధులను నియంత్రిస్తాయి.

3) అంత్య మెదడు : అంత్య మెదడులో అనుమస్తిష్కం, పాన్స్వరోలి, మజ్జాముఖం అను భాగాలుంటాయి.
అనుమస్తిష్కం : ఇది మెదడులో రెండవ అతిపెద్ద భాగం. దీనిలో రెండు అనుమస్తిష్కార్ధ గోళాలు, మధ్య భాగంలో వర్మిస్ ఉంటాయి.

ఎ) అనుమస్తిష్కం : ప్రతి అనుమస్తిష్కార్ధ గోళంలో మూడు లంబికలుంటాయి. అవి : పూర్వాంత లంబిక, పరాంత లంబిక, ఫ్లాక్యులార్ లంబిక అనుమస్తిష్కంలో ఉండే తెలుపు వర్ణ పదార్థం అనేక శాఖలు కలిగి చెట్టులాగా ఉంటుంది. అందువల్ల అనుమస్తిష్కపు తెలుపు పదార్థాన్ని ఆర్బోర్ విటే అంటారు. దీని చుట్టూ బూడిద వర్ణ పదార్థం ఒక పొరలాగా అమరి ఉంటుంది.

బి) పాన్వరోలి : ఇది అనుమస్తిష్కానికి ముందుగా, మజ్జా ముఖానికి వెనుకగా మధ్య మెదడు కింద ఉంటుంది. దీనిలోని నాడీ తంతువులు ఇరువైపులా అనుమస్తిష్కార్ధ గోళాల మధ్య ఒక వంతెన లాగా ఏర్పడి ఉంటాయి. ఇది అనుమస్తిష్కానికీ, వెన్నుపాముకు మిగతా మెదడు అన్నింటికీ మధ్య ఒక పునః ప్రసార కేంద్రంగా పనిచేస్తుంది. పాన్స్వరోలి న్యూమోటాక్సిక్ కేంద్రం శ్వాస కండరాల కదలికలను నియంత్రించి, తద్వారా ఉచ్ఛ్వాస క్రియలో ఒక వ్యక్తి పీల్చే వాయువుల ఘనపరిమాణాన్ని క్రమపరుస్తుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

సి) మజ్ఞాముఖం : ఇది మెదడు పరాంతభాగం. పాన్స్వరోలి వద్ద ప్రారంభమై వెన్నుపాముగా కొనసాగుతుంది. దీనిలో పరాంత రక్తపక్షం ఉంటుంది. హృదయ స్పందన, శ్వాసక్రియ, మింగడం, వాంతి, దగ్గు, తుమ్ము, వెక్కిళ్ళు మొదలైన వాటి నియంత్రణా కేంద్రాలు మజ్జాముఖంలో ఉంటాయి.
మధ్యమెదడు, పాన్స్వరోలి, మజ్జాముఖాలను కలిపి మెదడు మూలం అని కూడా అంటారు.

ప్రశ్న 2.
నాడీ ప్రచోదనం స్వభావాన్ని, వహన విధానాన్ని సరైన చిత్రపటాల సహాయంతో వివరించండి.
జవాబు:
నాడీ తంతువును ఉత్తేజ పరచడానికి కావలసిన ప్రేరణను త్రెషోల్డ్ ప్రేరణ అంటారు. ఈ ప్రేరణ వలన నాడీ తంతువులలో జీవక్రియా తరంగము ప్రసారితమయ్యేటప్పుడు జరుగు భౌతిక, రసాయనిక చర్యల సముదాయాన్ని నాడీ ప్రచోదనము అంటారు.

1) నాడీ ప్రచోదనం స్వభావం, ఆవిర్భావం : గ్రాహకాలు అనేక రకాలైన ఉత్తేజనాలను గ్రహించి నాడీ కణాల ద్వారా మెదడుకు పంపుతాయి. ఉత్తేజనాల స్థాయి త్రెషోల్డ్ విలువ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు నాడీకణంలో విద్యుత్ ప్రేరణ ఏర్పడుతుంది. ఈ విద్యుత్ ప్రేరణ నాడీ కణంలో జరిగే విద్యుత్ సంఘటనకు మూలాధారము. నాడీకణంలో జరిగే ముఖ్యమైన విద్యుత్ సంఘటనలు ఈ క్రింది విధంగా ఉంటాయి. అవి : i) విరామశక్మం, ii) క్రియాశక్మం.

i) విరామశక్మం : విరామస్థితిలో ఉండే సమయంలో నాడీకణాల ప్లాస్మాత్వచం వెలుపలి వైపు, ధనావేశాన్ని, లోపలివైపు ఋణావేశాన్ని కలిగి ఉంటుంది. విరామ సమయంలో నాడీత్వచంలో కనిపించే ఈ స్థితిని ధ్రువితస్థితి అంటారు. ఈ స్థితిలో కనిపించే విద్యుదావేశాల్లో భేదాన్ని విరామశక్మం అంటారు. నాడీకణాలలో విరామశక్మం విలువ దాదాపు 70 మిల్లీ వోల్టులు ఉంటుంది. దీనికి కారణం నాడీకణానికి వెలుపల, అంటే కణ బాహ్య ద్రవంలో అధిక మొత్తంలో Na+, Cl అయాన్లు, కణత్వచం లోపలివైపు అధిక మొత్తంలో K+ అయాన్లు, ఋణావేశం కలిగిన ప్రోటీన్ లు, స్వేచ్ఛా అమైనోఆమ్లాలు, కార్బాక్సిల్ ఆన్ అయాన్లు విస్తరించి ఉండటం. ఈ విధంగా ఋణావేశం నాడీకణ బాహ్య ద్రవ్యం కంటే నాడీకణ త్వచం లోపలివైపు అధికంగా ఉండటం వల్ల నాడీత్వచం లోపలి తలంలో 70 మిల్లీ వోల్టుల ఋణశక్మం కొనసాగించబడుతుంది.

ii) క్రియాశక్మం : నాడీ ప్రచోదనం ఒక నాడి ద్వారా ప్రసరించే సమయంలో దానిలోని విరామశక్మం తాత్కాలికంగా మాయమై, ఆస్థానంలో క్రియాశక్మం అనే ఒక విద్యుత్ దృగ్విషయం ఏర్పడుతుంది. ఈ సమయంలో నాడీకణం లోపలి, వెలుపలి తలాలలో విద్యుదావేశాలు మారిపోతాయి. ఫలితంగా నాడీత్వచం లోపలివైపు ధనావేశం, వెలుపలి వైపు ఋణావేశం ఏర్పడతాయి. ఈ విధమైన విద్యుదావేశాల మార్పును ఆసిల్లో స్కోప్ అనే పరికరంతో నమోదు చేసినప్పుడు లభించే చిత్రపటాన్ని క్రియాశక్మం అంటారు. దీన్ని విశ్లేషించడం ద్వారా నాడీ ప్రచోదనాన్ని అవగాహన చేసుకోవచ్చు.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం 4

ధ్రువిత స్థితిలో ఉండే నాడీకణాన్ని ప్రేరేపించినప్పుడు క్రియాశ్మకం ఏర్పడుతుంది. ఆ సమయంలో సోడియం అయాన్లు నాడీకణంలోకి ప్రవేశిస్తాయి. నాడీత్వచం వోల్టేజ్ పెరిగినప్పుడు దానిలో ఉండే వోల్టేజ్ సున్నిత సోడియం ఛానళ్ళు తెరచుకోవడం వల్ల సోడియం అయాన్లు లోనికి ప్రవేశించి ధనావేశాన్ని కలిగిస్తాయి. ఫలితంగా విరామశక్మం ఋణావేశాన్ని కోల్పోయి, ధనావేశాన్ని పొందుతుంది. అదే సమయంలో – 70 మి. వోల్టులు ఉన్న విరామత్వచ శక్మం దాదాపు +40 మి|| వోల్టులు వరకూ పెరుగుతుంది. ఈ స్థితిని విధ్రువణం అంటారు. ప్రారంభంలో విధృవణం నాడీత్వచం కొంతభాగంలో ఏర్పడినా క్రమంగా అధోనాడీ అక్షీయ తంతువు చివరి వరకూ విస్తరిస్తుంది. అందువల్ల క్రియాశక్మాన్ని స్వయం ప్రసారశీల విధ్రువణ తరంగం అంటారు. విధ్రువణం చెందిన నాడీత్వచంలో అధిక వోల్టేజ్ ఏర్పడటం వల్ల వోల్టేజ్ సున్నిత పొటాషియం ఛానళ్ళు తెరుచుకుంటాయి. వీటి K+ అయాన్లు వెలుపలికి చేరుకొని త్వచ విరామశక్మాన్ని తిరిగి ద్వారా 70 మి. వోల్టులకు పునరుద్ధరిస్తాయి. ఈ స్థితిని పునఃధ్రువణం అంటారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

2) నాడీ ప్రచోదన వహనం: నాడీకణాలలో ఆవిర్భవించే క్రియాశక్మాన్నే నాడీప్రచోదనం అంటారు. నాడీ ప్రచోదనం ఒక విధ్రువణ తరంగం వలే నాడీత్వచం ఉపరితలం వెంబడి తంత్రికాక్షం చివరి వరకు ప్రసరిస్తుంది. నాడీ ప్రచోదనం వహనం చెందే పద్ధతిని రెండు సిద్ధాంతాల ద్వారా వివరిస్తారు. అవి : i) స్థానిక వలయ సిద్ధాంతం ii) లంఘన వహన సిద్ధాంతం.

i) స్థానిక వలయ సిద్ధాంతం: ఈ సిద్ధాంతం మయలిన్ రహిత తంత్రికాక్షాలలో నాడీ ప్రచోదనం వహనం చెందే విధానాన్ని వివరిస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం క్రియాశక్మం స్థానిక విద్యుద్వలయాల రూపంలో స్వయం ప్రేరణ పద్ధతిలో ప్రసరణ చెందుతుంది. ఈ పద్ధతిలో A బిందువు వద్ద ఏర్పడిన ధనాత్మక అయాన్లు B బిందువు వద్ద ఉండే ఋణాత్మక అయాన్లను ఆకర్షించి లాక్కొంటాయి. అంటే క్రియాశక్మం ఒక విధ్రువణ ప్రాంతం నుంచి దాని పక్కనే ఉండే ధ్రువిత ప్రాంతానికి ప్రసరిస్తుంది. ఈ విధంగా తంత్రికాక్ష జీవపదార్థంలో ధన, ఋణ అయాన్లు వాటి స్థానాలు మార్చుకోవడం వల్ల స్థానిక విద్యుద్వలయాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియ తంత్రికాక్షం పొడవునా పునరావృతమవుతుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం 5

ii) లంఘన వహన సిద్ధాంతం: ఈ సిద్ధాంతం మయలిన్ సహిత తంత్రికాక్షాలలో జరిగే నాడీ ప్రచోదన వహన విధానాన్ని వివరిస్తుంది. మయలిన్ ఆచ్ఛాదం గల తంత్రికాక్షాల చుట్టూ ష్వాన్ కణాలు ఒక వరుసక్రమంలో అమరి ఉంటాయి. ప్రతి రెండు ష్వాన్ కణాల మధ్య రాన్వియర్ కణుపులు అనే నగ్న ప్రాంతాలు ఉంటాయి. ఈ ప్రాంతాలలో మాత్రమే విధ్రువణం జరిగి క్రియాశక్మం ఏర్పడుతుంది. ష్వాన్ కణాలు అవహన ఆచ్ఛాదాలుగా పనిచేయడం వల్ల ఆ ప్రాంతాలలో విధ్రువణ జరుగదు. అందువల్ల ఒక కణుపు వద్ద ఏర్పడ్డ క్రియాశక్మం దాని పక్కన ఉండే మరొక కణపు వద్దకు దూకుతూ ప్రసరిస్తుంది. ఈ ప్రక్రియలో ఏర్పడ్డ కణుపు వద్ద ఏర్పడ్డ ధనావేశం వల్ల Na+ ఛానళ్ళు తెరచుకొని సోడియం అయాన్లు లోనికి ప్రవేశిస్తాయి. ఫలితంగా ఆ కణుపు వద్ద క్రియాశక్మం ఏర్పడుతుంది. అనంతరం అక్కడి నుంచి Na+ లు పక్కన ఉండే కణుపు వద్దకు లంఘిస్తాయి. అక్కడ రెండవ క్రియాశక్మం ఏర్పడుతుంది. ఈ చర్యలు గొలుసుకట్టు ప్రతి చర్యల లాగా నిరవధికంగా సాగుతూ విధ్రువణ తరంగాన్ని తంత్రికాక్షం చివరి వరకూ వ్యాపిస్తాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం 6

3) వహన వేగం : నాడీ ప్రచోదన ప్రసరణ వేగం రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి తంత్రికాక్ష వ్యాసం, మయలిన్ ఆచ్ఛాదం. సన్నటి తంత్రికాక్షాలలో కంటే ఎక్కువ వ్యాసం కలిగిన వాటిలో నాడీ ప్రచోదనం వేగంగా ప్రసరిస్తుంది. అదే విధంగా మయలిన్ ఆచ్ఛాదం ఉండే తంత్రికాక్షాలలో నాడీ ప్రచోదనం మరింత వేగంగా ప్రసరిస్తుంది. అకశేరుకాలలోని మయలిన్ రహిత తంతువులలో నాడీ ప్రచోదన వేగం ఒక సెకనుకు 20 నుంచి 30 మీటర్లు ఉండగా సకశేరుకాలలోని మయలిన్ తంతువులలో సెకనుకు దాదాపు 120 మీటర్లు వేగంతో ప్రసరిస్తుంది.