AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Zoology Study Material  Lesson (b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Zoology Study Material Lesson (b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
లైంగిక సంపర్క వ్యాధులు సోకకుండా తీసుకొనే నివారణ చర్యలను తెలపండి. [A.P. Mar. ’17]
జవాబు:
లైంగిక సంపర్క వ్యాధులు సోకకుండా తీసుకొనే నివారణ చర్యలు :

  1. తెలియని భాగస్వామి / బహుభాగస్వాములతో లైంగిక సంబంధాన్ని పెట్టుకోకపోవడం.
  2. సంపర్క సమయంలో కండోమ్లను తప్పక ఉపయోగించడం.
  3. లైంగిక సంపర్క వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించడంలో నిష్ణాతుడైన వైద్యుణ్ణి సంప్రదించి ఒకవేళ వ్యాధి సంక్రమించినట్లయితే సంపూర్ణ చికిత్సను పొందడం.

ప్రశ్న 2.
జనాభా విస్ఫోటనానికి రెండు కారణాలు తెల్పండి.
జవాబు:

  • నిరక్షరాస్యత.
  • గర్భనిరోధక పద్ధతుల పై అవగాహన లేక పోవడం.
  • అతిచిన్న వయస్సులో వివాహం జరగడం.
  • ఆరోగ్య సంరక్షణ పద్ధతులు పెరగడం, మరణ రేటు తగ్గడం మొదలైనది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం

ప్రశ్న 3.
MTP అనేది నిజానికి జనాభా నియంత్రణకై ఉద్దేశించబడింది కాదు అయినా భారత ప్రభుత్వం ఎందుకు MTP ని చట్టబద్ధం చేసింది ? [T.S. Mar. ’15, ’14]
జవాబు:
గర్భం పూర్తి కాకుండానే ఉద్దేశపూర్వకంగా, వాంఛితంగా గర్భాన్ని వైద్యరీత్యా తీసివేయడాన్ని MTP లేదా ప్రేరేపిత గర్భస్రావం అంటారు. కొన్ని సందర్భాలలో గర్భం కొనసాగడం వల్ల తల్లికి గాని, పిండానికి గాని లేదా ఇద్దరికి అపాయం, ప్రాణహాని ఉన్నప్పుడు MTP తప్పనిసరి. అందువల్ల 1971లో భారత ప్రభుత్వం MTP దుర్వినియోగం కాకుండా కొన్ని నియంత్రణలు, నింబంధనలను విధించి చట్టబద్దత కల్పించింది.

ప్రశ్న 4.
‘ఉల్బద్రవ పరీక్ష’ (ఆమ్నియో సెంటిసిస్) అంటే ఏమిటి ? ఉల్బద్రవ పరీక్ష ద్వారా కనుక్కొనే రెండు అవక్రమాల పేర్లను పేర్కొనండి. A.P. Mar. ’17, ’16 Mar. ’14
జవాబు:
గర్భస్థ శిశువు (పిండం)లో జన్యులోపాలను కనుక్కొనే రోగ నిర్ధారక పరీక్షను ఉల్బద్రవ పరీక్ష అంటారు. ఈ విధానంలో వైద్యుడు పొడవైన ఇంజెక్షన్ సూదిని జాగ్రత్తగా తల్లి ఉదరకుడ్యం గుండా ఉల్బకోశంలోకి ప్రవేశపెట్టి కొంత ఉల్బద్రవ నమూనాను సేకరిస్తారు. ఉల్బద్రవాన్ని సెంట్రిఫ్యూజ్ చేయడం వల్ల పిండ కణాలను వేరు చేసి, కణాలను వర్ధనం చేసి క్రోమోసోమ్ల కేరియోటైప్ ను తయారు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఉల్బద్రవ పరీక్షను సాధారణంగా డౌన్, ఎడ్వర్డ్స్, టర్నర్, క్లెన్ఫల్టర్ సిండ్రోమ్ వంటి అపస్థితులను కనుక్కొనుటకు ఉపయోగిస్తారు.

ప్రశ్న 5.
క్షీరోత్పాదక రుతుస్రావ నిరోధక పద్ధతి వల్ల కలిగే లాభాలను పేర్కొనండి.
జవాబు:
ప్రసవం అయిన తరువాత పాల ఉత్పత్తి జరుగుతున్నప్పుడు సాధారణంగా అండోత్సర్గం జరగదు. దీనినే క్షీరోత్పాదక రుతుస్రావ నిరోధకం అంటారు.
లాభాలు :

  1. పాలను ఇస్తున్నంత వరకూ గర్భధారణ అవకాశం దాదాపు శూన్యం (సుమారు 6నెలలు)
  2. చనుపాలు వల్ల బిడ్డకు రోగనిరోధకత పెరగడం, అలర్జీల నుంచి రక్షణ పొందడం మొదలైనవి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవుల్లో సాధారణంగా వచ్చే లైంగిక సంపర్క వ్యాధులను సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే అంటువ్యాధులను సమిష్టిగా లైంగిక సంపర్క వ్యాదులు లేదా సుఖవ్యాధులు లేదా ప్రత్యుత్పత్తి మార్గ అంటువ్యాధులు అంటారు.
సాధారణమైన లైంగిక సంపర్క వ్యాధులు (STDs), వాటికి కారణమైన జీవులు హెపటైటిస్ – బి, జననాంగ హెర్పెస్, HIV సంక్రమణ తప్ప మిగిలిన పై వ్యాధులను తొలిదశలో గుర్తించి సరియైన చికిత్స చేసినట్లయితే నయం చేయబడతాయి.

వ్యాధి పేరు — కారణమైన జీవి
1. గనేరియా — 1. నైసెరియా గనేరియా
2. సిఫిలిస్ — 2. ట్రైపోనిమా పాల్లిడిమ్
3. జననాంగ హెర్పెస్ — 3. హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ (HSV)
4. జననాంగ కంతులు, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ — 4. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV)
5. ట్రైకోమోనియాసిస్ — 5. ట్రైకోమోనాస్ వెజినాలిస్
6. క్లామిడియాసిస్ — 6. క్లామిడియా ట్రాకోమాటిస్
7. హెపటైటిస్ — 7. HBV
8. AIDS / HIV సంక్రమణ — 8. HIV

AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం

లైంగిక సంపర్క వ్యాధులు సాధారణంగా వ్యాపించే మార్గాలు :

  1. వ్యాధి సోకిన వారికి వాడిన ఇంజక్షన్ సూదులు వాడడం.
  2. శస్త్రచికిత్స పనిముట్లు ఇంకొకరికి ఉపయోగించడం.
  3. వ్యాధిసోకిన రక్తాన్ని మార్పిడి చేసినప్పుడు.
  4. వ్యాధి సోకిన తల్లి నుండి పిండానికి సోకడం మొదలైనవి.

లైంగిక సంపర్క వ్యాధుల తొలి సాధారణ లక్షణాలు :

  • జననాంగ ప్రాంతంలో దురద.
  • రసికారడం.
  • కొద్ది పాటి నొప్పి, వాయడం మొదలైనవి.
    చికిత్స చేయించని యెడల ఇది స్త్రీలలో జటిల లక్షణాలకు దారి తీస్తాయి. అవి
  • శ్రోణి ఉజ్వలన వ్యాధులు.
  • గర్భస్రావాలు, గర్భాశయ బాహ్య గర్భధారణ.
  • వంధ్యత్యం లేదా ప్రత్యుత్పత్తి మార్గ క్యాన్సర్ మొదలైనవి.
    సాధారణంగా ఈ వ్యాధులు 15-24 వయస్సు గల వ్యక్తులలో లైంగిక సంపర్క వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి.

నియంత్రణ నియమాలు :

  1. తెలియని భాగస్వామి / బహుభాగస్వాములతో లైంగిక సంబంధాన్ని పెట్టుకోకపోవడం.
  2. సంపర్క సమయంలో కండోమ్లను తప్పక ఉపయోగించడం
  3. లైంగిక సంపర్క వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించడంలో నిష్ణాతుడైన వైద్యుణ్ణి సంప్రదించి ఒకవేళ వ్యాధి సంక్రమించినట్లయితే సంపూర్ణ చికిత్స పొందడం.

ప్రశ్న 2.
గర్భనిరోధక శస్త్ర చికిత్స పద్ధతులను విశదీకరించండి.
జవాబు:
శస్త్రచికిత్స విధానంలో గర్భధారణను నివారించడాన్ని గర్భనిరోధక లేదా వంధ్యీకరణ శస్త్రచికిత్స అంటారు. పురుషులలో వంధ్యీకరణ విధానాన్ని ‘వేసెక్టమీ’ అని, స్త్రీలలో అయితే ‘ట్యూబెక్టమీ’ అని అంటారు.

1) వేసెక్టమీ : ముష్కగోణి మీద చిన్న గాటు చేసి రెండు వైపులా ఉన్న శుక్రవాహికలను కత్తిరించి, కొద్ది భాగం తీసివేసి లేదా కత్తిరించిన చివరలు ముడివేసి వాటిని యథాస్థానంలో ఉంచి గాటును మూసివేస్తారు. ఈవిధంగా శుక్రకణాలు శుక్రాశయంలోకి రావడం నివారించబడుతుంది. కాబట్టి వేసెక్టమీ చేయించుకొన్న పురుషుల శుక్రంలో శుక్రకణాలు ఉండవు, అనుబంధ గ్రంథుల స్రావం మాత్రమే ఉంటుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం 1

2) ట్యూబెక్టమీ : ట్యూబెక్టమీ స్త్రీలలో పొత్తి కడుపుకు గాటు ద్వారా గాని, యోని ద్వారంగుండా గాని చేయవచ్చు. గర్భాశయానికి ఇరువైపులా ఉండే ఫాలోపియన్ నాళాలను కత్తిరించి చిన్న భాగాన్ని తీసివేయడం లేదా కత్తించిన చివరలను మూసివేయడం జరుగుతుంది. దీని వల్ల అండాలు ఫాలోపియన్ నాళాలలోకి ప్రవేశించవు, కాబట్టి గర్భధారణ జరగదు.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం 2

AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం

ప్రశ్న 3.
కింది వాటిలో రెండింటికి లఘుటీకలను రాయండి.
ఎ) ఐ.వి.ఎఫ్. (IVF)
బి) ఐ.సి.యస్.ఐ. (ICSI)
సి) ఐ.యు.డి.లు (IUDs)
జవాబు:
ఎ) ఐ.వి.ఎఫ్. (IVF) : స్త్రీ శరీరం బయట అండాన్ని శుక్రకణాలతో ఫలదీకరింప చేయడాన్ని దేహ బాహ్య ఫలదీకరణం అంటారు. ఫలితంగా ఏర్పడిన తొలి పిండ దశను తరువాత అభివృద్ధి కోసం తల్లి గర్భాశయంలోకి బదిలిచేస్తారు. ఈ పద్ధతినే టెస్ట్యూబ్ బేబి విధానం అని అంటారు.

ఈ పద్ధతిలో భార్య / స్త్రీ దాత నుంచి అండాన్ని, భర్త / పురుష దాత నుంచి శుక్రబీజ కణాన్ని సేకరించి ప్రయోగశాలలో స్త్రీ దేహ సారూప్య పరిస్థితులు కలిపించి రెండు బీజకణాలను కలిపి సంయుక్త బీజం ఏర్పరచడానికి ప్రేరేపిస్తారు. ఒకవేళ తల్లి గర్భాశయం దేహం బయట ఉత్పత్తి చేసిన పిండాన్ని స్వీకరించడానికి అనువుగా లేనట్లయితే, ఈ పిండాన్ని పెంచడానికి ఇష్టపడిన మరొక స్త్రీ (అరువు తల్లి) గర్భాశయంలోకి బదిలీ చేయవచ్చు.

బి) ఐ.సి.యస్.ఐ. (ICSI) (జీవద్రవ్యంలోకి శుక్రకణాలను ఇంజెక్ట్ చేయడం ) : ఈ పద్ధతిలో శుక్రకణాలను సూక్ష్మ దర్శిక సూది సహాయంతో నేరుగా అండ కణద్రవ్యంలోకి ఇంజెక్ట్ చేస్తారు. తరువాత పిండాన్ని తరువాతి అభివృద్ధికై గర్భాశయం లేదా ఫాలోపియన్ నాళంలోకి బదిలీ చేస్తారు. శుక్రకణోత్పత్తి తక్కువగా ఉండి శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్న దంపతులకు ఈ పద్ధతి ద్వారా సహాయం అందించబడుతుంది.

సి) ఐ.యు.డి.లు (IUDs) (గర్భాశయాంతర సాధనాలు) : ఈ సాధనాలను (IUDs) యోని ద్వారా గర్భాశయంలోక వైద్యులు లేదా శిక్షణ పొందిన నర్సులు ప్రవేశపెడతారు.

(IUDs) రకం — ఉదాహరణ.
1. ఔషధ రహిత — 1. లిప్సెస్ లూప్
2. రాగిని విడుదల చేసేవి — 2. CuT, Cu 7, మల్టీలోడ్ 375
3. హార్మోన్లను విడుదల చేసేవి — 3. ప్రొజెస్టాసెర్ట్, LNG – 20.

ఈ IUDSలు గర్భాశయంలోని తెల్లరక్త కణాలను ప్రేరేపించి శుక్రకణాలను భక్షింపచేస్తాయి. IUDSల నుండి విడుదలైన కాపర్ అయాన్లు శుక్రకణాల కదలికలను, జీవన సామర్థ్యాన్ని ఫలదీకరణ సామర్థ్యాన్ని అణచివేస్తాయి. వీటికి అదనంగా విడుదల చేసే IUDSలు గర్భాశయాన్ని పిండ ప్రతిస్థాపనకు, గర్భాశయ ముఖ ద్వారాన్ని గర్భధారణను వాయిదా వేయడానికి, శుక్రకణాలకు ప్రతికూలంగా ఉండేటట్లు చేస్తాయి. IUDSలు అనేవి ఆలస్యంగా సంతానం, శిశువుల మధ్య ఎక్కువ వ్యవధి కావాలనుకొనే స్త్రీలకు అనువైన గర్భనిరోధకాలు. ఇది భారతదేశంలో అత్యధిక ఆదరణ పొందిన గర్భ నిరోధక విధానం.

ప్రశ్న 4.
సంతానసాఫల్యత లేని దంపతులు సంతానాన్ని పొందడానికి సహాయపడే పద్ధతులను కొన్నింటిని తెల్పండి.
జవాబు:
ఒక వ్యక్తి గర్భదారణకు తన వంతు పాత్ర పోషించలేని జీవ సంబంధ అసామర్థ్యాన్ని సంతాన రాహిత్యం అంటారు. వీటికి శారీరక, జన్యుపర, కొన్ని రకాల వ్యాధులు మొదలైనవి కారణాలు కావచ్చు. వీటిలో కొన్ని చికిత్స ద్వారా సరిచేయలేక పోవచ్చు. అటువంటి వారికి ప్రత్యుత్పత్తి సహాయక సాంకేతిక (ART) పద్ధతుల ద్వారా పిల్లలు కలిగించడానికి సహాయ పడవచ్చు. అవి :

1) శరీర బాహ్య ఫలదీకరణం, పిండబదిలీ (IVF – ET) : స్త్రీ శరీరం బయట అండాన్ని శుక్రకణాలతో ఫలదీకరింప చేయడాన్ని దేహ బాహ్య ఫలదీకరణం అంటారు. ఫలితంగా ఏర్పడిన తొలిపిండ దశను అభివృద్ధి కోసం తల్లి గర్భాశయంలోకి బదిలీ చేస్తారు. ఈ పద్ధతినే టెస్ట్యూబ్ బేబీ విధానం అంటారు. ఈ పద్ధతిలో భార్య / స్త్రీ దాత నుంచి అండాన్ని, భర్త / పురుష దాత నుంచి శుక్రబీజాన్ని సేకరించి ప్రయోగశాలలో స్త్రీ దేహ సారుప్య పరిస్థితులు కల్పించి రెండు బీజకణాలను కలిపి సంయుక్త బీజం ఏర్పడడానికి ప్రేరేపిస్తారు. ఉత్పత్తి అయిన ఈ పిండాన్ని పెంచడానికి తల్లి లేదా అరువుతల్లి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు.

2) ఫాలోపియన్ నాళాంతర సంయుక్త బీజ బదిలీ (ZIFT) : ఈ పద్ధతిలో అండాన్ని సేకరించి, శరీర బాహ్య ఫలదీకరణ గావించి ఏర్పడిన సంయుక్త బీజాలు స్త్రీ ఫాలోపియన్ నాళంలోకి తరువాతి అభివృద్ధికై బదిలీ చేస్తారు.

3) ఫాలోపియన్ నాళాంతర సంయోగ బీజ బదిలీ (GIFT) : స్త్రీ బీజకోశ వ్యాధులు / లోపాల వల్ల కొంత మంది స్త్రీలు అండాన్ని ఉత్పత్తి చేయలేరు. కాని ఫలదీకరణకు, తరువాత పిండాభివృద్ధికి అవసరమయ్యే సరైన గర్భాశయ వాతావరణాన్ని కలిగి ఉంటారు. అట్లాంటి సందర్భాలలో అనుకూల దాత నుంచి అండాన్ని సేకరించి పై వాతావరణం గల గ్రహీత ఫాలోపియన్ నాళంలోకి బదిలీ చేస్తారు. ఈ పద్దతినే GIFT అంటారు.

4) కణజీవద్రవ్యంలోకి శుక్రకణాలను ఇంజెక్ట్ చేయడం (ICSI) : ఈ పద్ధతిలో శుక్రకణాలను సూక్ష్మదర్శిక సూది సహాయంతో నేరుగా అండ కణద్రవ్యంలోకి ఇంజెక్ట్ చేస్తారు. తరువాత పిండాన్ని అభివృద్ధికై గర్భాశయం లేదా ఫాలోఫియన్ నాళంలోకి బదిలీ చేస్తారు.

5) కృత్రిమ శుక్ర నివేషణం (AI) : పురుష భాగస్వామికి స్త్రీ ప్రత్యుత్పత్తి మార్గంలోకి శుక్రకణాలను విడుదల చేసే సామర్థ్యం లేనప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ విధానంలో పురుష భాగస్వామి / భర్త / దాత నుంచి శుక్రాన్ని సేకరించి స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెట్టి అండాన్ని ఫలదీకరణ చేయిస్తారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం

ప్రశ్న 5.
పాఠశాలల్లో లైంగిక విద్య అవసరమా ? ఎందుకు ?
జవాబు:
పాఠశాలల్లో లైంగిక విద్య అవసరం. పాఠశాలల్లో లైంగిక విద్యను ప్రవేశపెట్టడం వల్ల యౌవనులకు లైంగికత, తత్సంబంధ విషయాలపై సరియైన అవగాహన ఏర్పడుతుంది. ప్రత్యుత్పత్తి అవయవాలు, యౌవనం, దానికి సంబంధించిన మార్పులు, లైంగిక పరిశుభ్రత, సురక్షిత, ఆరోగ్యకరమైన లైంగిక సాధనాలు, HIV / AIDS హైపటైటిస్ – బి, హెర్పెస్ లాంటి లైంగిక సంపర్క వ్యాధులు మొదలైన వాటిపై ప్రజలకు ముఖ్యంగా యౌవనులకు సరియైన సమాచారం ఇవ్వడం వల్ల ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యకర జీవితాన్ని గడుపుతారు. అంతేకాకుండా లైంగిక విద్య ద్వారా, పెళ్ళీడు వయస్సులో వారికి అందుబాటులో ఉన్న జననియంత్రణ పద్ధతులు, గర్భిణీస్త్రీల సంరక్షణ, శిశుజననాంతర మాతృ, శిశుసంరక్షణ, స్తన పోషణ ప్రాముఖ్యం మొదలగు వాటి గురించి తెలుస్తుంది. అలాగే ఆడ, మగ శిశువులకు సమాన ప్రాధాన్యత మొదలైన విషయాల గురించి తెలియజేయబడుతుంది. ఇవి ఆరోగ్యవంతమైన కుటుంబాలను కావలసిన పరిమాణంలో అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. సమాజంలో అనియంత్రిత జనాభా పెరుగుదల, సామాజిక రుగ్మతలైన లైంగిక దుర్వినియోగం, లైంగిక సంబంధ నేరాలు మొదలైన వాటిపై అవగాహన ఏర్పడుతుంది.