Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Zoology Study Material Lesson 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ Textbook Questions and Answers.
AP Inter 2nd Year Zoology Study Material Lesson 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
మానవుడిలో ముష్కాలు ఎక్కడ ఉంటాయి ? ప్రతి ముష్కాన్ని ఆవరించి ఉండే రక్షణ కవచాలేవి ?
జవాబు:
- ఒక జత ముష్కాలు ఉదరకుహరం బయట ముష్కగోణిలో వ్రేలాడుతూ ఉంటాయి.
- ముష్కాలను ఆవరించి ఉండే రక్షణ కవచాలు. ట్యూనికా ఆల్బుజీనియా మరియు ట్యూనికా వెజైనాలిస్.
ప్రశ్న 2.
ముష్కగోణులలోని కుహారాలను, ఉదరకుహరంతో కలిపే నాళాలను ఏమంటారు ? ముష్కాలను తమస్థానంలో నిలిపి 2 ఉంచే నిర్మాణాలేవి ?
జవాబు:
- ముష్కగోణులలోని కుహరాలను, ఉదరకుహంతో కలిపే నాళాలు వాంక్షణ నాళం
- ముష్కాన్ని ముష్కగోణిలో నిలిపి ఉంచుతూ గుబర్నాక్యులమ్, శుక్రదండం అనే నిర్మాణాలుంటాయి.
ప్రశ్న 3.
మానవ శుక్రోత్పాద నాళికలలోని సెర్టోలి కణాల, లీడిగ్ కణాల విధులేమిటి ? [A.P. & T.S. Mar. ’15]
జవాబు:
సెర్టోలి కణాలు: ఇవి అభివృద్ధి చెందుతున్న శుక్రకణాలకు పోషణ అందిస్తాయి. మరియు ఇన్హిబిన్ అనే హార్మోన్ను స్రవిస్తాయి. ఈ హార్మోన్ FSH హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది.
లీడిగ్ కణాలు: ఇవి పురుష లైంగిక హార్మోన్ అయిన ఆండ్రోజెన్స్ ను ఉత్పత్తి చేస్తాయి. వీటిలో టెస్టోస్టిరాన్ ముఖ్యమైంది. ఈహార్మోన్ ద్వితియ లైంగిక లక్షణాలు అభివృద్ధిని శుక్రకణోత్పత్తిని నియంత్రిస్తుంది.
ప్రశ్న 4.
మానవుడిలో సంపర్కావయవం ఏది ? దానిలో ఉండే మూడు రకాల కణజాల స్తంభాల పేరేమిటి ?
జవాబు:
మానవుడిలో సంపర్కావయవం – మేహనం
మేహనంలో నిలువుగా మూడు స్పంజికా కణజాలపు స్తంభాలు ఉంటాయి అవి: కార్పోరా కావెర్నోసా’ అనే రెండు పృష్టభాగంలోని స్తంభాలు, ఈ రెండు స్తంభాల కింద ఉదర మధ్య భాగంలో కార్పస్ స్పాంజియోజమ్ అనే ఒక స్తంభం.
ప్రశ్న 5.
స్పెర్మియేషన్, స్పెర్మియోజెనిసిస్ అంటే ఏమిటి ?
జవాబు:
స్పెర్మియోజెనిసిస్: ఏకస్థితిక చలన రహిత శుక్రోత్పాదకాలు విబేధనం చెంది చలన సహిత శుక్రకణాలుగా రూపాంతరం చెందే ప్రక్రియను స్పెర్మియోజెనిసిస్ అంటారు.
స్పెర్మియోషన్: క్రియాశీలక శుక్రకణాలు శుక్రోత్పాదక నాళికల నుంచి శుక్రోత్పాదనాళికా కుహరంలోకి విడుదల ప్రక్రియను స్పెర్మియేషన్ అంటారు.
ప్రశ్న 6.
అండోత్సర్గం తరువాత పగిలిన పుటికలో సంచితమై ఉన్న పసుపు కణాల ముద్దను ఏమంటారు ? అది స్రవించే హార్మోన్ ఏది ? దాని విధి ఏమిటి ? [A.P. Mar. ’16]
జవాబు:
- అండోత్సర్గం తరువాత పగిలిన పుటికలో సంచితమై ఉన్న పసుపు కణాల ముద్దను – కార్పస్లూటియం అంటారు.
- కార్పస్ లూటియం ప్రొజెస్టిరాన్ అనే హార్మోను స్రవిస్తుంది.
విధులు:
- పిండ ప్రతిస్థాపనకు అవసరమయ్యే ఎండోమెట్రియమ్ ఎదుగుదలను ప్రేరేపిస్తుంది.
- ఇది అండోత్సర్గాన్ని నివారించి గర్భాశయ కండరాల సంకోచాలను నిరోధించి గర్భాన్ని నిలిచేటట్లు చేస్తుంది.
ప్రశ్న 7.
గర్భావధి అంటే ఏమిటి ? మానవుడిలో గర్భావధి ఎంత ?
జవాబు:
- గర్భం అభివృద్ధి చెందే కాలాన్ని గర్భావధి కాలం అంటారు
- మానవుడిలో గర్భావధి కాలం అండం ఫలదీకరణం జరిగిన రోజు నుంచి సుమారు 266 రోజులు (38వారాలు) కాలం పడుతుంది.
ప్రశ్న 8.
పిండ ప్రతిస్థాపన అంటే ఏమిటి ?
జవాబు:
ట్రోపోబ్లాస్ట్ కణాలు గర్భాశయాల గోడలోకి చొచ్చుకొని పోయి, గర్భాశయరక్త కేశ నాళికలకు సన్నిహితంగా మారుతాయి. ఈ విధంగా పిండం గర్భాశయపు గోడకు అతకబడటాన్ని పిండ ప్రతిస్థాపన అంటారు.
ప్రశ్న 9.
ఎపిబ్లాస్ట్, హైపోబ్లాస్ట్ల మధ్య వ్యత్యాసం ఏమిటి ?
జవాబు:
పిండ చక్రాభం లోపలి తలాన అంటే కుహరం ఎదురు తలంలో ఒక స్తరంగా ఏర్పడుతుంది. ఈ స్తరం హైపోబ్లాస్ట్గా రూపొందుతుంది. ఇది భవిష్యత్తులో పిండ బాహ్య అంతస్త్వచాన్ని ఏర్పరుస్తుంది. మిగిలిన పిండ చక్ర భాగాన్ని ఎపిబ్లాస్ట్ అంటారు.
ప్రశ్న 10.
ముష్కాల, స్త్రీ బీజకోశాలను ఒక్కొదానికి రెండు ముఖ్య విధులు రాయండి.
జవాబు:
ముష్కాలు: ఇవి ప్రాథమిక పురుష లైంగిక అవయవాలు.
- ఇది శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది.
- ముష్కాలలోని లీడిగ్ కణాలు పురుష లైంగిక హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ను ఉత్పత్తి చేస్తుంది. ఈహార్మోన్ ద్వితియ లైంగిక లక్షణాలు అభివృద్ధిని, శుక్రకణోత్పత్తిని నియంత్రిస్తుంది.
స్త్రీ బీజకణాలు: ఇది ప్రాథమిక స్త్రీ లైంగిక అవయవాలు.
- స్త్రీ బీజకోశాలు రుతుచక్ర సమయంలో స్త్రీ బీజకణాలను (అండాలను) ఉత్పత్తి చేస్తాయి.
- ఇవి స్త్రీ లైంగిక హార్మోన్లు అయిన ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరాన్లను ఉత్పత్తి చేస్తుంది.
ప్రశ్న 11.
శుక్రకణం పటం గీచి భాగాలను గుర్తించండి.
జవాబు:
ప్రశ్న 12.
శుక్రద్రవంలోని ముఖ్యమైన అనుఘటకాలు ఏవి ?
జవాబు:
శుక్రద్రవం చిక్కగా క్షారయుతంగా ఉండి, ప్రక్టోజ్, ప్రోటీన్లు, సిట్రిక్ ఆమ్లం, అకర్బన పాస్ఫేట్, పొటాషియం, ప్రోస్టాగ్లాండిన్లు, విటమిన్ ‘సి’ లను కలిగి ఉంటుంది. శుక్రద్రవంను శుక్రాశయాలు స్రవిస్తాయి.
ప్రశ్న 13.
రుతుచక్రం అంటే ఏమిటి ? రుతుచక్రాన్ని క్రమపరిచే హార్మోన్లు ఏవి ?
జవాబు:
ప్రైమేట్స్లోని స్త్రీ జీవులలో జరిగే ప్రత్యుత్పత్తి వలయాన్ని రుతుచక్రం అంటారు. రుతు చక్రాన్ని ముఖ్యంగా నాలుగు
- ల్యూటినైజింగ్ హార్మోన్ (LH)
- ఈస్ట్రోజన్ మరియు
- ఫాలిక్యూలర్ స్టిములేటింగ్ హార్మోన్ (FSH)
- ప్రొజెస్టిరాన్.
ప్రశ్న 14.
ప్రసవం అంటే ఏమిటి ? ప్రసవంలో పాల్గొనే హార్మోన్లు ఏవి ?
జవాబు:
భ్రూణం పరిపూర్ణంగా ఎదిగిన తరువాత, గర్భాశయ కండరాల సంకోచ సడలికలు శిశువును, జరాయువును గర్భాశయం నుండి బయటకు నెట్టి వేస్తాయి. దీన్నే ప్రసవం అంటారు.
ప్రసవ సమయంలో ఆక్సిటోసిన్ ముఖ్య పాత్రవహిస్తుంది.
ప్రశ్న 15.
ఒక ఆడకుక్క ఆరు (6) పిల్లలను జన్మనిచ్చిందనుకుంటే ఆ కుక్క స్త్రీబీజకోశం ఎన్ని అండాలను విడుదల చేసి ఉండొచ్చు.
జవాబు:
6 పిల్లలకు జన్మనిచ్చిన ఆడకుక్క, అండోత్సర్గ సమయంలో ఆ కుక్క స్త్రీబీజకోశం 6′ అండాలను విడుదల చేసి ఉంటుంది.
ప్రశ్న 16.
శుక్రకణాల ‘కెపాసిటేషన్’ అంటే ఏమిటి ?
జవాబు:
శుక్రకణాలు స్త్రీ జననేంద్రియ మార్గంలో కొన్ని మార్పులకు లోనైన తరువాత అండాన్ని ఫలదీకరించే సామర్థ్యాన్ని పొందుతాయి. ఈ మార్పులను కెపాసిటేషన్ అంటారు.
ప్రశ్న 17.
మానవ పిండాభివృద్ధిలో ‘కాంపాక్షన్’ అంటే ఏమిటి ? A.P. Mar. ’15
జవాబు:
కాంపాక్షన్ అనేది మానవపిండాభివృద్ధి జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియ వల్ల మారూలా లోని ఖండితాలు దగ్గరగా లాగబడి సాంద్రంగా అమరుతాయి. సంయుక్త బీజ ఖండితాలు రెండు రకాల కణాలుగా తయారవుతాయి. అవి:
- ఉపరితల బల్లపరపు కణాలు
- అంతరకణ సముదాయం.
ప్రశ్న 18.
మానవ పిండాభివృద్ధిలో ‘అంతర్వలనం’, ‘ఇంగ్రెషన్’ (ప్రవేశం)ల మధ్య వ్యత్యాసం ఏమిటి ?
జవాబు:
అంతర్వలనం: పిండాభివృద్ధి దశలో బ్లాస్టులా గ్రాస్టులాగా మార్పు చెందుతున్నప్పుడు ఒక కణాల సమూదాయం లోపలి వైపు పెరగడం, లోపలికి మెలితిరగడం జరుగుతుంది. దీన్నే అంతర్వలనం అంటారు.
ప్రవేశం: గ్రాస్ట్రులేషన్ దశలో ఎపిబ్లాస్ట్ నుంచి భవిష్యత్ అంతస్వచ కణాలు లోపలి వైపు వలసపోవడం.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
మానవ ‘ముష్కం’ సూక్ష్మ నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
ఒకజత అండాకార ముష్కాలు ఉదరకుహరం బయట ముష్కగోణిలో వేలాడుతూ ఉంటాయి. ఇవి ప్రాథమిక లైంగిక అవయవాలు. ముష్కగోణి ముష్కాలకు రక్షణనిస్తూ శుక్రకణోత్పత్తికి కావలసిన ఉష్ణోగ్రత (శరీర ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 2.5°C తక్కువ) ఉండేటట్లు సహాయపడుతుంది.
ప్రతి ముష్కాన్ని ఆవరించి ట్యూనికా ఆల్బుజీనియా అనే తంతుయుత కణజాలకవచం ఉంటుంది. ఇది ముష్కంలోకి వ్యాపించి అడ్డు విభాజకాలను ఏర్పరిచి ముష్కాన్ని లంబికలుగా విభజిస్తుంది. ప్రతి ముష్కంలో సుమారు 250 ముష్కలంబికలు ఉంటాయి. ప్రతీ లంబికలో 1 నుంచి 3 మెలికలు తిరిగి ఉండే శుక్రోత్పాదక నాళికలు ఉంటాయి. ప్రతి ముష్కబాహ్య తలాన్ని ఆవరించి సీరస్ త్వచం అనే ఆంత్రవేష్టన పొర ఉంటుంది. దీన్ని ట్యూనికా వెజైనాలిస్ అంటారు.
ప్రతి శుక్రోత్పాదక నాళికను ఆవరించి జనన ఉపకళ ఉంటుంది. దీనిలో విభేదనం చెందని మాతృకణాలు అనే పురుషబీజ మాతృకణాలు ఉంటాయి. శుక్ర మాతృకణాలు విభజన చెంది ప్రాథమిక స్పెర్మటోసైట్లను ఏర్పరుస్తాయి. ఇవి క్షయకరణ విభజన చెంది శుక్రకణాలు లేదా పురుషబీజకణాలను ఏర్పరుస్తాయి. శుక్రకణాల మధ్య సెర్టోలీకణాలు అనే పోషక కణాలు ఉంటాయి. ఇవి అభివృద్ధి చెందే శుక్రకణాలకు పోషణను అందిస్తాయి. సెర్టోలి కణాలు ‘ఇసాబిన్’ అనే హార్మోన్ను కూడా స్రవిస్తాయి, ఈహార్మోన్ (FSH) ఉత్పత్తిని నిరోధిస్తుంది. శుక్రోత్పాదక నాళికల బయట ఉన్న ప్రాంతాలను మధ్యాంతర ప్రదేశాలు అంటారు. ఈ ప్రదేశాలలో లీడిగ్ కణాలు ఉంటాయి. ఇది ఆండ్రోజెన్స్న ఉత్పత్తి చేస్తాయి. శుక్రోత్పాదక నాళికలు రీటేముష్కలం ద్వారా శుక్రనాళికలలోకి తెరచుకొంటాయి.
ప్రశ్న 2.
మానవ ‘స్త్రీ బీజకోశం’ సూక్ష్మ నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
స్త్రీ బీజకోశాలు ప్రాథమిక స్త్రీ లైంగిక అవయవాలు. ఒక జత స్త్రీ బీజకోశాలు ఉదర కింది భాగంలోని శ్రేణి కుహరంలో గర్భాశయానికి ఇరువైపులా ఒక్కొక్కటి చొప్పున ఉంటాయి. మీసోఒవేరియం అనే ద్విస్తరిత ఆంత్రవేష్టనం మడత స్త్రీ బీజకోశానికి ఉదర కుహర కుడ్యానికి బంధిస్తుంది.
స్త్రీ బీజకోశాలను ఆవరించి ఉండే సరళ ఘనాకార ఉపకళను స్త్రీ బీజకోశ జనన ఉపకళ అంటారు. నిజానికి ఇది ఆంత్రవేష్టన పొర. ఈ పొర కింద మందంగా ఉన్న సంయోజక కణజాలపు గుళిక ఉంటుంది. దీన్ని ట్యూనికా ఆల్బుజీనియా అంటారు. స్త్రీ బీజకోశంలోని స్ట్రోమా బయటి వల్కలం, లోపలి దవ్వ అనే రెండు నిర్ధిష్టమైన భాగాలుగా విడగొట్టబడి ఉంటుంది. వల్కలం మందుగా ఉండి, వివిధ దశలలో అభివృద్ధి చెందుతున్న అండాశయ పుటికలు ఉండటం వల్ల కణికాయుతంగా కనిపిస్తుంది. దవ్వ వదులుగా ఉన్న సంయోజక కణజాలం. దీనిలో రక్తనాళాలు, శోషరస నాళాలు, నాడీ తంతువులు అధికంగా ఉంటాయి.
ప్రశ్న 3.
మానవ ‘స్త్రీ’లో గ్రాఫియన్ పుటికను వివరించండి.
జవాబు:
స్త్రీ బీజకోశ ఉపరితలం నుంచి అనేక గుండ్రని ఉబ్బెత్తుల వంటి నిర్మాణాలుంటాయి. వీటిని గ్రాఫియన్ పుటికలు అని అంటారు.
ప్రత్యుత్పత్తి కాలంలో ద్వితీయ పుటికలో ఉన్న ప్రాథమిక అండ మాతృకణం పరిమాణంలో పెరుగుతూ క్షయకరణ విభజన – I నుపూర్తి చేసుకొని, ఒక స్థూల ఏకస్థితిక ద్వితీయ అండమాతృకణం మరియు ఒక సూక్ష్మ ఏకస్థితిక ప్రథమ దృవ దేహం ఏర్పడుతుంది. ఈ ద్వితీయ అండ మాతృకణం, ప్రాథమిక అండ మాతృకణంలోని అధిక పోషకత కలిగిన కణపదార్థాన్ని ఎక్కువ మొత్తంలో ఉంచుకొంటుంది. అప్పుడు క్షయకరణ విభజన II ఆరంభమై మధ్యస్థ దశలో ఆగిపోతుంది. ద్వితీయ పుట్టిక తరువాతి మార్పులకు గురై పరిపక్వ పుట్టికను ఏర్పరుస్తుంది. దీన్ని గ్రాఫియన్ పుటిక అంటారు.
ద్రవంతో నిండి ఉన్న కుహరాన్ని ఏస్ట్రమ్ అని అంటారు. అండమాతృకణాన్ని ఆవరించి ఉన్న కణాల సమూహాన్ని కుమ్యులస్ ఊఫోరస్ అంటారు. పుటిక బయట వ్యాపించి సాంద్రీకరించి ఉన్న సంయోజక కణజాలంను బయటి తొడుగు అని, దానిలో లోపలి ఉన్న స్ట్రోమా కణాల లోపలితొడుగు అని అంటారు.
స్త్రీ బీజకోశంలో గ్రాఫియన్ పుటిక పగిలి ద్వితీయ అండ మాతృకణం విడుదల చేస్తుంది. దీన్ని అండోత్సర్గం అంటారు.
ప్రశ్న 4.
మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం గీచి భాగాలను పేర్కొనండి.
జవాబు:
ప్రశ్న 5.
మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం గీచి, భాగాలను పేర్కొనండి.
జవాబు:
ప్రశ్న 6.
శుక్రకణోత్పాదక నాళిక నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
ప్రతిముష్కంలో సుమారు 250 ముష్కలంబికలుంటాయి. ప్రతి లంబికలో 1నుంచి 3 మెలికలు తిరిగి ఉండే శుక్రోత్పాదక నాళికలు ఉంటాయి. ప్రతీ శుక్రోత్పాదక నాళికను ఆవరించి. జనన ఉపకళ ఉంటుంది. దీనిలో విభేదనం చెందని శుక్రమాతృకణాలు అనే పురుషబీజ మాతృకణాలు ఉంటాయి. శుక్ర మాతృకణాలు విభజన చెంది ప్రాథమిక స్పెర్మటోసైట్లను ఏర్పరుస్తాయి. ఇవి క్షయకరణ విభజన చెంది శుక్రకణాలు లేదా పురుషబీజకణాలను ఏర్పరుస్తాయి. శుక్ర మాతృ కణాల మధ్య సెర్టోలి కణాలు అనే పోషక కణాలు ఉంటాయి. ఇవి అభివృద్ధి చెందే శుక్రకణాలను పోషణను అందిస్తాయి. సెర్టోలి కణాలు ‘ఇన్హిబిన్’ అనే హార్మోన్ను కూడా స్రవిస్తాయి. ఈ హార్మోన్ FSH ఉత్పత్తిని నిరోధిస్తుంది. శుక్రోత్పాదక నాళికల బయట ఉన్న ప్రాంతాలను మధ్యాంతర ప్రదేశాలు అంటారు. ఈ ప్రదేశాలలో లీడిగ్ కణాలు ఉంటాయి. ఈ లీడిగ్ కణాలు ఆండ్రోజెన్సన్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్ ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిని శుక్రకణోత్పత్తిని నియంత్రిస్తుంది. శుక్రోత్పాదక నాళికలు రీటేముష్కం ద్వారా శుక్రనాళికలలోకి తెరచుకుంటాయి.
ప్రశ్న 7.
శుక్రకణోత్పాదన అంటే ఏమిటి ? మానవుడిలో జరిగే శుక్రకణోత్పత్తిని గురించి సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
పురుషులలో జరిగే బీజకణోత్పత్తిని శుక్రకణోత్పత్తి అని అంటారు. ముష్కంలోని శుక్రమాతృకణాలనే అపరిపక్వ పురుష బీజకణాలు యౌవన దశ ఆరంభం నుంచి శుక్రకణోత్పత్తి ద్వారా శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. శుక్రోత్పాదక నాళికలలో ఉన్న శుక్రమాతృకణ మూలకణాలు సమవిభజనల ద్వారా విభజన చెంది, వాటి సంఖ్యను వృద్ధి చేసుకుంటాయి. ప్రతీ శుక్రమాతృకణ మూలకణం ద్వయస్థితిక స్థితిలో ఉండి 46 క్రోమోజోమ్లను కలిగి ఉంటుంది. కొన్ని శుక్ర మాతృకణ మూలకణాలు ప్రాథమిక శుక్రమాతృ కణాలుగా అభివృద్ధి చెంది క్షయకరణ విభజన చెందుతాయి.
ఒక ప్రాథమిక శుక్రమాతృకణం దాని మొదటి క్షయకరణ విభజన జరిపి ఒకే పరిమాణంలో ఉన్న 23 క్రోమోజోమ్లు గల ఏకస్థితిక ద్వితీయ శుక్రమాతృ కణాలను ఏర్పరుస్తాయి. ఈ ద్వితీయ శుక్రమాతృకణాలు ద్వితీయ క్షయకరణ విభజనను జరిపి నాలుగు ఒకే పరిమాణంలో ఉన్న ఏకస్థితిక చలన రహిత శుక్రోత్పాదకాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ చలన రహిత శుక్రకణాలు విభేదనం చెంది చలనసహిత శుక్రకణాలుగా రూపాంతరం చెందుతాయి. ఈ ప్రక్రియను శుక్రకణ జననం అంటారు. శుక్రజననం తరువాత, శుక్రకణాల తలలు సెర్టోలి కణాల కణద్రవ్యలలో అంతస్థగితంగా ఉంటాయి. చివరికి ఈ క్రియాశీలక శుక్రకణాలు శుక్రకణోత్పాదక నాళికల నుంచి శుక్రోత్పాదనాళిక కుహరంలోకి విడుదల అవుతాయి. దీనినే శుక్రకణాల విడుదల అంటారు.
శుక్రకణోత్పత్తి యౌవనదశ ఆరంభంలో “గొనాడో ట్రోపిన్ విడుదల హార్మోన్” (GnRH) ను హైపోథాలమస్ అధికంగా స్రవించడం వల్ల శుక్రకణోత్పత్తి ప్రారంభమవుతుంది. అధిక స్థాయిలో ఉన్న GnRH పూర్వ పిట్యూటరీని ప్రేరేపించి FSH, LH లను స్రవింపజేస్తుంది. LH లీడిగ్ కణాల పై పనిచేసి ఆండ్రోజెన్లను స్రవింపజేయడాన్ని ప్రేరేపిస్తుంది. ఈ ఆండ్రోజెన్స్లు తిరిగి శుక్రకణోత్పత్తిని ప్రేరేపిస్తాయి. FSH సెర్టోలి కణాల పై పనిచేసి, కొన్ని కారకాలను విడుదల చేయించుట ద్వారా శుక్రకణ జననానికి సహాయపడతాయి.
ప్రశ్న 8.
అండోత్పత్తి అంటే ఏమిటి ? స్త్రీలో జరిగే అండోత్పత్తిని సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
పరిణితి చెందిన స్త్రీ బీజకణాలు ఏర్పడే విధానాన్ని అండోత్పత్తి అంటారు. పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడే ప్రతి భ్రూణ స్త్రీ బీజకోశంలో అండకణోత్పత్తి ఆరంభమై రెండు మిలియన్ల అండమాతృకణాలు ఏర్పడి తరువాత విభజనలు జరగకుండా నిలిచిపోతాయి. శిశుజననం తరువాత అండ మాతృకణాలు కొత్తవి ఏర్పడటం జరగదు. ఈ కణాలు విభజనను ప్రారంభించి క్షయకరణ విభజన -I లోని ప్రథమదశ -1 లోనే ఆగిపోతాయి. ఈ దశలోని కణాలను ప్రాథమిక అండ మాతృకణాలు అంటారు. వీటిలో చాలా వరకు క్షీణించి యవ్వన దశకు వచ్చేసరికి 60,000 – 80,000 పుటికలు మాత్రమే ప్రతి స్త్రీ బీజకోశంలో మిగిలిపోతాయి. తరువాత ఈ పుటికలు గ్రాన్యులోసా కణాలచే ఆవరించబడతాయి. ఈ అభివృద్ధి దశలోని పుటికలను ప్రాథమిక పుటికలు అంటారు.
క్రమంగా ప్రాథమిక పుటికలను ఆవరించిన గ్రాన్యులోసా కణాలతో కూడిన పొరలు అధికమై, థీకా అనే కొత్త పొర ఏర్పడుతుంది.
ఈపుటికలను ద్వితీయ పుటికలు అంటారు. ద్వితీయ పుటికలు వెంటనే తృతియ పుటికలుగా మార్పుచెంది, ద్రవంతో నిండిన కుహారాన్ని ఏర్పర్చుకొంటుంది. ఈ కుహరాన్ని ఎస్ట్రమ్ అంటారు. ఈ కుహరం పరిమాణంలో పెరగడంవల్ల పుటిక కుడ్యం పలుచగా మారుతుంది. పుటిక వ్యాపించి కొద్ది గ్రాన్యులోసా స్తరం చుట్టూ ఉన్న స్ట్రోమా కణాలు సాంద్రీకరణం చెంది లోపలి తొడుగు ఏర్పరుస్తాయి. తరువాత ఈ లోపలి తొడుగును ఆవరిస్తూ కొంత సంయోజక కణజాలం సాంద్రీకరణ చెంది ఇంకొక పొర ఏర్పడుతుంది. దీన్ని బయటి తొడుగు అంటారు. లోపలి తొడుగు కణాలు ఈస్ట్రోజన్లు అనే హార్మోన్లను స్రవిస్తాయి. ఈదశలో ద్వితీయ పుటికలో ఉన్న ప్రాథమిక అండ మాతృకణం పరిమాణంలో పెరుగుతూ క్షయకరణ విభజన – I ను పూర్తి చేస్తుంది. ఇది అసమాన విభజన, దీని ఫలితంగా ఒక స్థూల ఏకస్థితిక ద్వితీయ అండ మాతృకణం, ఒక సూక్ష్మ ఏకస్థితిక ప్రథమ ధృవ దేహం ఏర్పడతాయి. ఈ ద్వితీయ అండ మాతృకణం, ప్రాథమిక అండ మాతృకణంలోని అధిక పోషకత కలిగిన కణపదార్థాన్ని ఎక్కువ మొత్తంలో ఉంచుకుంటుంది. అప్పుడు క్షయకరణ విభజన -II ఆరంభమై మధ్యస్థ దశలో ఆగిపోతుంది. ద్వితీయ పుటిక తరువాతి మార్పులకు గురై పరిపక్వ పుటికను ఏర్పరుస్తుంది. దీన్ని గ్రాఫియన్ పుటిక అంటారు. స్త్రీ బీజకోశంలోని ఈ పుటిక పగిలి అండాన్ని విడుదల చేస్తుంది. దీన్ని అండోత్సర్గం అంటారు.
ప్రశ్న 9.
గ్రాఫియన్ పుటిక నిర్మాణం పటం గీచి, భాగాలను గుర్తించండి.
జవాబు:
ప్రశ్న 10.
మానవ సమాజంలో స్త్రీలు ఆడపిల్లలను కంటున్నందుకు తరచూ నిందించబడతారు. ఎందుకు ఇది నిజంకాదో మీరు తెలుపగలరా ?
జవాబు:
శిశువు ఆడ, మగ అనేది తండ్రి మీద ఆధారపడి ఉంటుంది. కాని తల్లి దీనికి కారణం కాదు. శిశువు యొక్క లింగనిర్ధారణ ఫలదీకరణం సమయంలోనే నిర్దేశించబడుతుంది.
పురుషులు XY అనే లింగ క్రోమోజోములను, స్త్రీలు XX అనే లింగక్రోమోజోములను కలిగి ఉంటారు. కాబట్టి స్త్రీలు ‘X క్రోమోజోమ్ కలిగిన అండాలను, పురుషులు 50% X క్రోమోజోమ్ కలిగిన శుక్రకణాలను మిగిలిన 50% Y క్రోమోజోమ్ కలిగిన శుక్రకణాలను ఉత్పత్తి చేస్తారు. ఫలదీకరణ సమయంలో X – అండం, Y క్రోమోజోమ్ కలిగిన శుక్రకణంతో కలిస్తే మగ శిశువు గాను (XY), X – క్రోమోజోమ్ కలిగిన శుక్రకణంతో కలిస్తే ఆడశిశువుగాను వృద్ధి చెందుతుంది.
పై వివరణను బట్టి శిశువు లింగనిర్ధారణ తండ్రి పై ఆధారపడి ఉంటుంది. కాని తల్లి మీద కాదు. కాబట్టి ఆడ పిల్లలను కంటున్నందుకు స్త్రీలను నిందించడం తప్పు.
ప్రశ్న 11.
మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సంబంధం ఉన్న అనుబంధ గ్రంథులను వివరించండి.
జవాబు:
పురుష అనుబంధ గ్రంథులు వరుసగా ఒక జత శుక్రాశయాలు, ఒక పౌరుషగ్రంథి, బల్బో యూరెత్రల్ గ్రంథులు.
1. శుక్రాశయాలు: ఇవి శ్రోణి ప్రాంతంలో మూత్రాశయం పరాంత కింది భాగంలో ఉండే ఒకజత సాధారణ నాళాకార గ్రంథులు ప్రతీశుక్రాశయం ఆవైపు శుక్ర వాహికలోకి అది పౌరుషగ్రంథిలోకి ప్రవేశించే ముందు తెరుచుకుంటుంది. శుక్రకోశాలు స్రవించే స్రావం శుక్రద్రవం ఘనపరిమాణంలో సుమారు 60శాతం ఉంటుంది. ఇది చిక్కగా, క్షారయుతంగా, ఉండి ఫ్రక్టోజ్, ప్రోటీన్లు, సిట్రిక్ఆమ్లం, అకర్బనాఫాస్పేట్, పొటాషియం, ప్రోస్టాగ్లాండిన్లు, విటమిన్-సి లను కలిగి ఉంటుంది. ఈ ద్రవం స్కలన నాళంలో శుక్రంతో కలిసినప్పటి నుంచి ఫ్రక్టోజ్ దానికి శక్తి వనరుగా పనిచేస్తుంది. ప్రోస్టాగ్లాండిన్లు ఫలదీకరణకు, అండంవైపు శుక్రకణాల కదలికలకు సహాయపడతాయి. శుక్రాశయాల స్రావం క్షారంగా ఉండటం వల్ల యోనిలో సహజంగా ఉండే ఆమ్లత్వాన్ని తటస్తీకరిస్తుంది.
2. పౌరుషగ్రంథి: మూత్రాశయం కింద పౌరుషగ్రంథి ఉంటుంది. ఇది ప్రసేకపు మొదటి భాగాన్ని ఆవరించి, దాని స్రావాలను అనేక వాహికల ద్వారా ప్రసేకంలోకి పంపుతుంది. మానవుడిలో పౌరుషగ్రంథి శుక్రద్రవంలో 15-30 శాతం భాగాన్ని స్రవిస్తుంది. దీని స్రావం తేటగా, స్వల్ప ఆమ్లత్వంతో ఉండి శుక్రకణాలను ఉత్తేజపరచడంలో, పోషణ అందించడంలో సహాయపడుతుంది.
3. బల్బోయూరెత్రల్ గ్రంథులు: పౌరుషగ్రంథి కింద, ప్రకానికి ఇరువైపులా బఠాణి గింజ పరిమాణంలో మేహనం మొదలయ్యే చోట ఒక జత బల్బోయూరెత్రల్ గ్రంథులు లేదా కౌపర్ గ్రంథులు ఉంటాయి. వీటి స్రావం తేటగా, జారేటట్టుగా, క్షారత్వంతో ఉంటుంది. పురుషులలో లైంగిక ప్రేరణ ప్రారంభమైనప్పుడు ఈ గ్రంథుల స్రావం స్రవించబడి ప్రసేకంలో మూత్రం వల్ల కలిగిన ఆమ్లత్వాన్ని తటస్థీకరించి ప్రసేకాన్ని, మేహనం చివరకు జారేటట్టు చేయడం వల్ల సంపర్కంలో ఒరిపిడి తగ్గి శుక్రం ప్రసేకం ద్వారా సులభంగా జారడం జరుగుతుంది. ఇది శుక్రద్రవానికి క్షారత్వాన్నిచ్చి, యోని ఆమ్లత్వాన్ని తటస్థీకరిస్తుంది.
ప్రశ్న 12.
స్త్రీలోని జరాయువు నిర్మాణం, విధులను తెల్పండి.
జవాబు:
పిండ ప్రతిస్థాపన జరిగిన తరువాత ట్రోఫోబ్లాస్ట్ నుంచి వెళ్ళవంటి నిర్మాణాలు ఏర్పడి గర్భాశయ అంతర ఉపకళలోకి చొచ్చుకొనిపోతాయి. వీటిని పరాయు ముషకాలు అంటారు. పరాయు చుషకాలు, గర్భాశయ కణజాలం ఒకదానితో ఒకటి వేళ్ళలాగా అల్లుకొని అత్యంత సన్నిహిత సంబంధమేర్పరుచుకొని ఎదుగుతున్న పిండానికి, తల్లికి మధ్యన ఒక నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణమైన జరాయువును ఏర్పరుస్తాయి. మాతృ, భ్రూణ రక్త ప్రవాహాలు ఒకదానిలో ఒకటి కలవవు. అవి జరాయువుస్తరాల చేత వేరుచేయబడతాయి.
జరాయువులో రెండు ముఖ్య భాగాలుంటాయి. గర్భాశయ అంతర ఉపకళ నుంచి ఏర్పడిన మాతృ భాగం, పిండ బాహ్యత్వచాల నుంచి ఏర్పడిన పిండభాగం జరాయువులోని మాతృభాగంలో వరుసగా
- గర్భాశయ ఉపకళా కణజాలం
- గర్భాశయ సంయోజక కణజాలం
- గర్భాశయ కేశనాళికాయుత ఎండోథీలియం ఉంటాయి.
పిండ భాగంలో వరుసగా:
- భ్రూణ పరాయు ఉపకళా కణజాలం
- భ్రూణ సంయోజక కణజాలం
- భ్రూణ కేశనాళికాయుత ఎండోథీలియం ఉంటాయి.
మానవుల్లో పిండ బాహ్యత్వచాలైన అళిందం, పరాయువు కలిసి జరాయువు ప్రసరణను ఏర్పరుస్తాయి. ఈ రకాన్ని అళిందపరాయు జరాయువు అంటారు. ఈ జరాయువు చక్రాభ రకానికి చెందినది. ఇందులో చూషకాలు ప్రారంభదశలో పరాయువు ఉపరితలం మొత్తం సమానంగా విస్తరించి క్రమేణా ఇవి పిండ చక్రాభం పృష్టతలానికి పరిమితమవుతాయి. జరాయువులో కణజాలాల అమరిక ప్రకారం ఇది హీమోకోరియల్ రకానికి చెందింది. అంటే పిండ పరాయువు చూషకాలు నేరుగా మాతృకణంతో సంబంధాన్ని ఏర్పరుచుకుంటాయి. ప్రసవ సమయంలో జరాయువులోని పిండ త్వచాలతో పాటు గర్భాశయ కుడ్యకణజాలం కూడా విచ్ఛేదన చెంది విసర్జించబడటం వల్ల అధికంగా రక్తస్రావ జరుగుతుంది. కాబట్టి దీన్ని పతఃజరాయువు అంటారు.
విధులు:
- జరాయువు పిండాభివృద్ధికి కావలసిన ఆక్సిజన్, పోషక పదార్థాలను మాతృరక్తం నుంచి గ్రహించి CO2, విసర్జక పదార్ధాలను మాతృరక్తంలోకి విడుదల చేస్తుంది.
- అంతఃస్రావక గ్రంథిగా పనిచేస్తూ ప్రొజెస్టిరాన్ హార్మోను స్రవించి 4వ నెల నుంచి గర్భధారణను కాపాడుతుంది.
- జరాయువు ఈస్ట్రోజనను స్రవించి గర్భాశయం పెరుగుదలకు, క్షీరగ్రంథుల అభివృద్ధికి తోడ్పడుతుంది.
- hCG ను ఉత్పత్తి చేసి, LH (లూటినైజింగ్ హార్మోన్) చేసే చర్యలను నిర్వహిస్తుంది.
- జరాయువు మానవజరాయు లాక్టోజన్ ను విడుదల చేసి భ్రూణ అభివృద్ధిలో సహాయపడుతుంది.
- జరాయువు మాతృ ప్రతిరక్షకాలైన IgG లను పిండానికి రవాణా చేసి, పిండం యొక్క రోగనిరోధకతను పెంచుతుంది.
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
పటం సహాయంతో మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి వివరించండి. [A.P. & T.S. Mar. ’15]
జవాబు:
స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజకోశాలు, ఒక జత స్త్రీ బీజవాహికలు, గర్భాశయం, యోని, బాహ్య జనాంగాలు శ్రోణి ప్రాంతంలో ఉంటాయి. ఈ వ్యవస్థలోని భాగాలు ఒక జత క్షీరగ్రంథులతో నిర్మాణాత్మకంగా, క్రియాత్మకంగా, సమాకలనం చెంది అండోత్సర్గం, ఫలదీకరణం, గర్భధారణ, శిశుజననం, సంతాన పాలన మొదలయిన ప్రత్యుత్పత్తి విధులు నిర్వర్తిస్తాయి.
స్త్రీ బీజకోశాలు: స్త్రీ బీజకోశాలు స్త్రీ బీజకణాలను (అండాలు), వివిధ స్తిరాయిడ్ హార్మోన్ల (స్త్రీ బీజకోశ హార్మోన్లు)ను ఉత్పత్తి చేసే ప్రాథమిక స్త్రీ లైంగిక అవయవాలు. ఒక జత స్త్రీ బీజకోశాలు ఉదర క్రింది భాగంలోని శ్రోణి కుహరంలో గర్భాశయానికి ఇరువైపులా ఒక్కొక్కటి చొప్పున ఉంటాయి.
స్త్రీ బీజకోశాలను ఆవరించి ఉండే సరళ ఘనాకార ఉపకళను స్త్రీ బీజకోశ జనన ఉపకళ ఉంటారు. నిజానికి ఇది ఆంత్రవేష్టన పొర. ఈ పొర కింద మందంగా ఉన్న సంయోజక కణజాలపు గుళిక ఉంటుంది. దీన్ని ‘ట్యూనికా ఆల్బుజీనియా’ అంటారు. స్త్రీ బీజకోశంలోని స్ట్రోమా బయటి వల్కలం లోపలి దవ్వ అనే రెండు నిర్దిష్టమైన భాగాలుగా విడగొట్టబడి ఉంటుంది.
వల్కలం మందంగా ఉండి, వివిధ దశలలో అభివృద్ధి చెందుతున్న అండాశయ పుటికలు ఉండటం వల్ల కణికాయుతంగా కనిపిస్తుంది. దవ్వ వదులుగా ఉన్న సంయోజక కణజాలం. దీనిలో రక్తనాళాలు, శోషరస నాళాలు, నాడీ తంతువులు అధికంగా ఉంటాయి.
ఫాలోపియన్నాళాలు (స్త్రీ బీజవాహికలు): ఫాలోపియన్ నాళాలు ఒక జత ఉంటాయి. ప్రతీ ఫాలోపియన్ నాళం కండర నిర్మితమై, బీజకోశ పరిధి నుంచి గర్భాశయం వరకు వ్యాపించి ఉంటుంది. స్త్రీబీజకోశం సమీపంలో గరాటు ఆకారంలో ఉన్న ఫాలోపియన్ భాగాన్ని కాలాంచిక అంటారు. దీని వెలుపలి అంచున ఉన్న ఫింబ్రియే అనే సన్నటి వేళ్లలాంటి నిర్మాణాలు ||923 అండోత్సర్గం తరువాత శరీర కుహరంలో విడుదలైన అండాలను సేకరిస్తాయి. కాలంచిక స్త్రీ బీజవాహిక తరవాతి భాగమైన కలశికలోకి, కలశిక చివరిభాగమైన సన్నటి గ్రీవం (ఇస్తుమస్ – (isthumus) ద్వారా గర్భాశయంలోకి తెరచుకొంటుంది. ఫాలోపియన్ నాళంలోని కలశికలో అండం ఫలదీకరింపబడుతుంది. ఫాలోపియన్ నాళంలో జరిగే అంతరాంగ చలనం వల్ల అండం లేదా సంయుక్త బీజ గర్భాశయం వైపుకు పంపబడుతుంది.
గర్భాశయం: గర్భాశయం శ్రోణి ప్రాంతంలో మూత్రాశయానికి, పురీషనాళానికి మధ్య విశాలంగా, ధృడంగా కండరయుతమై, అధిక ప్రసరణ గల తల క్రిందులైన పియర్ ఆకారం పరిమాణంలో ఉండే కోశం లాంటి నిర్మాణం. ఇది శ్రోణి కుడ్యానికి, మీసోమెట్రియం అనే ఆంత్రవేష్టనంతో ఏర్పడ్డ బంధకాల సహాయంతో అతికి ఉంటుంది. గర్భాశయం దాని కింద ఇరుకుగా ఉన్న గర్భాశయ ముఖద్వారం గుండా యోనిలోకి తెరచుకొంటంది. గర్భాశయ ముఖద్వారంలోని సన్నటి కుల్యను గర్భాశయ ముఖద్వార కుల్య అంటారు. ఇది యోనితో కలసి శిశుజనన మార్గాన్ని ఏర్పరుస్తుంది.
గర్భాశయ కుడ్యం మూడు కణజాలపు పొరలతో నిర్మితమైంది. వెలుపలి పలుచగా ఉన్న పొరను పరిఉపకళ అని, మధ్య మందంగా ఉన్న నునుపు కండరాలు పొరను కండర ఉపకళ అని, లోపలి గ్రంథియుతంగా ఉన్న పొరను అంతర ఉపకళ అని అంటారు. గర్భాశయ ఎండోమోట్రియం రుతు చక్రంలో చక్రీయ మార్పులకు లోనైతే ప్రసవ సమయంలో గర్భాశయ మయోమెట్రియం ధృడమైన సంకోచాలను ప్రదర్శిస్తుంది.
యోని: యోని విశాలంగా ఉండే తంతు కండరయుత నాళం. ఇది గర్భశయ ముఖద్వారం నుంచి అళిందం (లోపలి పెదవుల మధ్య ఉన్న ప్రదేశం) వరకు వ్యాపిస్తుంది. దీని లోపలి తలం కెరటిన్ రహిత స్తరిత శల్కల ఉపకళను కలిగి ఉంటుంది. ఇది అధిక ప్రసరణ కలిగి యోనిరంధ్రం ద్వారా అళిందం వద్ద తెరచుకొంటుంది.
యోని పరివృతం: యోని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఉల్వా లేదా యోని పరివృతం అంటారు. ఇది స్త్రీ బాహ్య జననాంగాలను సూచిస్తున్న ప్రాంతం, ఆళిందం రెండు రంధ్రాలను కలిగి ఉంటుంది. అవి ఊర్ధ్వ బాహ్య ప్రసేక రంధ్రం, నిమ్న యోనిరంధ్రం, యోనిరంధ్రం హైమన్ (కన్నెపొర) అనే శ్లేష్మపొరచే పాక్షికంగా మూయబడి ఉంటుంది.
అళిందం రెండు జతల చర్మపు మడతలచే ఆవరించబడుతుంది. అవి పలుచని లోపలి పెదువులు, పెద్దగా మందంగా ఉండే బయటి పెదవులు. లోపలి పెదవులు కలిసే పై భాగంలో ఒక సున్నితమైన స్తంబించగల గుహ్యంగాంకురం అనే నిర్మాణం ఉంటుంది. ఇది పురుష మేహనానికి సమజాతం. బయటి పెదవులపై భాగంలో ఉండే ఉబ్బత్తు ప్రాంతాన్ని మాన్స్ప్యూబిస్ అంటారు. దీనిచర్మంపై జఘనరోమాలు, చర్మం కింద కొవ్వు కణజాల దిండు ఉంటుంది.
స్త్రీ జననేంద్రియ అనుబంధ గ్రంథులు: స్త్రీలలో ప్రత్యుత్పత్తి అనుబంధ గ్రంథులు వరుసగా 1. బార్తొలిన్ గ్రంథులు, 2. స్కీన్ గ్రంథులు, 3. క్షీరగ్రంథులు.
- బార్తొలిన్ గ్రంథులు: అళింద కుడ్యంలో యోని రంధ్రానికి కొద్ది క్రిందుగా ఇరువైపులా అమరి ఒకజత బార్తొలిన్ గ్రంథులు ఉంటాయి. వీటి శేష్మస్రావం యోని మార్గాన్ని సులభంగా జారేటట్లు చేస్తుంది.
- స్కీన్ గ్రంథులు: యోని పూర్వాంతకుడ్యం వద్ద, ప్రసేకం కింద ఈ గ్రంథులు ఉంటాయి. ఇది ప్రేరేపించబడినపుడు క్షార, జిగట ద్రవాన్ని స్రవిస్తాయి.
- క్షీరగ్రంథులు: క్రియాత్మక క్షీరగ్రంథులు ఉండటం ఆడక్షారదాల ప్రత్యేక లక్షణం ఇవి గ్రంథియుత కణజాలాన్ని వివిధ మొత్తాలలో కొవ్వు కణజాలాన్ని కలిగి ఉంటాయి. క్షీరగ్రంథులు శిశుజననాంతరం మాత్రమే పనిచేయడం ప్రారంభిస్తాయి.
ప్రశ్న 2.
పటం సహాయంతో మానవ “పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను” ను వివరించండి. [A.P. & T.S. Mar.’17, ’16 Mar. ’14 ]
జవాబు:
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రత్యుత్పత్తి ప్రక్రియలో పాల్గొనే అనేక లైంగిక అవయాలు శ్రోణి ప్రాంతంలో ఉంటాయి. అవి ఒక జత ముష్కాలు, అనుబందగ్రంథులు, అనుబంధ నాళాలు, బాహ్య జననాంగాలు.
ముష్కాలు: ఒక జత అండాకార మష్కాలు, ఉదరకుహరం బయట ముష్కగోణిలో వేలాడుతూ ఉంటాయి. ముష్కగోణి, ముష్కాలకు రక్షణనిస్తూ శుక్రకణోత్పత్తికి కావలసిన ఉష్ణోగ్రత ఉండేటట్లు చేస్తుంది. ముష్కగోణి కుహరం వాంక్షణ నాళం ద్వారా ఉదరకుహరంతో కలసి ఉంటుంది. ముష్కాన్ని ముష్కగోణిలో నిలిపి ఉంచుతూ గుబర్నాక్యులమ్, శుక్రదండం అనే నిర్మాణాలుంటాయి. ముష్కాన్ని ఆవరించి ట్యూనికా ఆల్బుజీనియా అనే తంతుయుత కణజాల కవచం ఉంటుంది. ఇది ముష్కంలోకి వ్యాపించి అడ్డు విభాజకాలను ఏర్పరచి ముష్కన్ని లంబికలుగా విభజిస్తుంది. ప్రతి లంబికలో 1-3 మెలికలు తిరిగి ఉండే శుక్రోత్పదక నాళికలు ఉంటాయి. ప్రతీ ముష్కబాహ్య తలాన్ని ఆవరించి ట్యూనికా వెజైనాలిస్ అనే త్వచం ఉంటుంది.
శుక్రోత్పాదక నాళికలు: శుక్రోత్పాదక నాళికను ఆవరించి జనన ఉపకళ ఉంటుంది. దీనిలో విభేదనం చెందని శుక్రమాతృకణాలు ఉంటాయి. ఇవి క్షయకరణ విభజన చెంది శుక్రకణాలను ఏర్పరుస్తాయి. శుక్రమాతృకణాల మధ్య సెర్టోలి కణాలు అనే పోషక కణాలు ఉంటాయి. ఇవి అభివృద్ధి చెందే శుక్రకణాలకు పోషణను అందిస్తాయి. శుక్రోత్పాదక నాళికలు బయట ప్రాంతంలో ఉన్న లీడిగకణాలు ఆండ్రోజన్స్న ఉత్పత్తి చేస్తాయి. శుక్రోత్పాదక నాళికలు రీటేముష్కం ద్వారా శుక్రనాళికలలోకి తెరచుకుంటాయి.
ఎపిడిడైమిస్: ముష్కం నుంచి శుక్రనాళికలు బయటికి వచ్చి సన్నని ముష్క పరాంత తలం వెంబడి చుట్టలు చుట్టుకొని ఉన్న నాళంతోకి తెరచుకొంటాయి. ఈ నాళాన్ని ‘ఎపిడిడైమిస్’ అంటారు. ఇది శుక్రకణాలను తాత్కాలికంగా నిలవచేయడానికి, శుక్రకణాలు పరిపకత్వకు రావడానికి కావలసిన సమయాన్ని కలుగజేస్తుంది.
శుక్రవాహికలు (Vasa Deferentia): రెండు శుక్రవాహికలు ఎడమ, కుడి వైపున ఒక్కోటి ఉండి ఆ వైపున ఎపిడిడైమిస్, స్కలన నాళాలను కలుపుతూ శుక్రకణ రవాణాలో ఉపయోగపడతాయి. శుక్రవాహిక సన్నగా, పొడవుగా ఉండే కండరయుతమైన నాళం. ఇది పుచ్చ ఎపిడిడైమిస్ నుంచి బయలుదేరి వాంక్షణ నాళం ద్వారా ఉదర కుహరంలోకి ప్రవేశించి, మూత్రాశయం పై నుంచి శిక్యంలా మారి శుక్రాశయం నుంచి వచ్చే వాహికతో కలసి స్కలన నాళంను ఏర్పరుస్తుంది. రెండు వైపుల నుంచి వచ్చే స్కలననాళాలు శుక్రకణాలను, శుక్రాశయాలు స్రవించిన ద్రవాన్ని రవాణా చేస్తూ పౌరుషగ్రంథి మధ్యభాగంలో కలసి ప్రసేకంలోకి తెరచుకొంటాయి. ప్రసేకం శుక్రకణాలను బయటికి రవాణా చేస్తుంది.
ప్రసేకం: పురుషులలో ప్రసేకం మూత్ర, జననేంద్రియ వాహికలు కలసి ఏర్పడిన అంత్యనాళం. ప్రసేకం మూత్రాశయం నుంచి ప్రారంభమై మేహనం ద్వారా వ్యాపించి యూరెత్రర్మీటస్ (urethral meatus) అనే రంధ్రం ద్వారా బయటికి తెరచుకొంటుంది. మూత్రం, స్కలింపబడిన శుక్రం రెండూ ప్రసేకం ద్వారా ప్రయాణించి బయటికి వస్తాయి.
మేహనం: మేహనం, ముష్కగోణి పురుషులలోని బాహ్య జననాంగాలు. మేహనం మూత్రనాళంగానే కాకుండా స్త్రీ జీవి యోనిలో శుక్రద్రవాన్ని విడుదల చేసే ప్రవేశ్యాంగం గా కూడా పనిచేస్తుంది. మానవ మేహనంలో నిలువుగా ఉన్న మూడు స్పంజికా కణజాలపు స్తంభాలు ఉంటాయి. అవి కార్పోరా కావెర్నోసా అనే రెండు పృష్ట భాగంలోని స్తంభాలు, ఈ రెండు స్తంభాల కింద ఉదర మధ్య భాగంలో ‘కార్పస్ స్పాంజియోజమ్’ అనే ఒక స్తంభం. చర్మం, అధశ్చర్మపొర మూడు నిలువుగా ఉన్న కణజాలపు స్తంభాలు ఆవరించి ఉంటాయి. ప్రత్యేకించిన కణజాలం ఉండటం వల్ల మేహనం నిటారుగా, కడ్డీలాగా మారి శుక్రాన్ని విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఉబ్బి, బల్బులాగా ఉన్న మేహనం చివరి భాగాన్ని గ్లాన్స్ మేహనం అని, దాన్ని ఆవరించి వదులుగా ఉన్న చర్మం మడుతలను ముందు చర్మం (ప్రెప్యూస్) అని అంటారు.
పురుష అనుబంధ జననేంద్రియ గ్రంధులు:
పురుష అనుబంధ గ్రంధులు వరుసగా:
- ఒక జత శుక్రాశయాలు
- ఒక పౌరుగ్రంధి
- ఒక జత బల్బోయూరెత్రల్ గ్రంధులు
శుక్రాశయాలు (Seminal Vesicles): శుక్రాశయాలు శ్రోణి ప్రాంతంలో మూత్రాశయం పరాంత కింది భాగంలో ఉండే ఒక జత సాధారణ నాళాకారగ్రంథులు. ప్రతీ శుక్రాశయం ఆ వైపు శుక్రవాహికలోకి అది పౌరుషగ్రంథిలోకి ప్రవేశించే ముందు తెరచుకొంటుంది. శుక్రకోశాలు స్రవించే స్రావం శుక్రద్రవం ఘనపరిమాణంలో సుమారు 60 శాతం ఉంటుంది.
ఇది చిక్కగా, క్షారయుతంగా, ఉండి ఫ్రక్టోజ్, ప్రోటీన్లు, సిట్రిక్ ఆమ్లం ఆకర్బన ఫాస్పేట్ (Pi) పొటాషియం, ప్రోస్టాగ్లాండిన్లు, విటమిన్ ‘సి’ లను కలిగి ఉంటుంది. ఈ శుక్రద్రవంలో ప్రక్టోజ్ శక్తి వనరుగా, ప్రాస్టాగ్లాంజిన్లు ఫలదికరణకు వీలు కల్పించుటకు సహాయపడుతుంది. శుక్రాశయాలస్రావం క్షారంగా ఉండటంవల్ల యోనిలో సహజంగా ఉండే ఆమ్లత్వాన్ని తటస్థీకరిస్తుంది.
పౌరుషగ్రంథి: మూత్రాశయం కింద పౌరుషగ్రంథి ఉంటుంది. ఇది ప్రసేకపు మొదటి భాగాన్ని ఆవరించి, దాని స్రావాలను అనేక వాహికల ద్వారా ప్రసేకంలోకి పంపుతుంది. మానవుడిలో పౌరుషగ్రంథి శుక్రద్రవంలో 15-30 శాతం భాగాన్ని స్రవిస్తుంది. దీని స్రావ తేటగా, స్వల్ప ఆమ్లత్వంతో ఉండి శుక్రకణాలను ఉత్తేజపరచడంలో, పోషణ అందించడంలో సహాయపడుతుంది.
బల్బోయూరెత్రల్ గ్రంథులు: పౌరుషగ్రంథి కింద, ప్రసేకానికి ఇరుప్రక్కలా బఠాణిగింజ పరిమాణంలో మేహనం మొదలయ్యేచోట ఒక జత బల్బోయూరెత్రల్ గ్రంథులు ఉంటాయి. వీటి స్రావం తేటగా, జారేటట్టుగా ఉంటుంది. ఇది సంపర్కసమయంలో ఒరిపిడి తగ్గించి, ప్రసేకం సులభంగా జారెటట్లు చేస్తుంది.
ప్రశ్న 3.
మానవ పిండాభివృద్ధిలోని వివిధ సంఘటనల గురించి వ్యాసం రాయండి.
జవాబు:
మానవుడిలో పిండాభివృద్ధి వివిధ దిశలలో జరుగుతుంది. అవి
- ఫలదీకరణం
- గాస్ట్రులేషన్
- అవయవోత్పత్తి
- జరాయువు ఏర్పడటం
- గర్భధారణ మరియు ప్రసవం
1) ఫలదీకరణం: ఫలదీకరణం, ఫాలోపియన్ నాళ కలాశికలో జరుగుతుంది. ఎప్పుడైతే చలనరహిత శుక్రకణం పరిణితి చెందిన అండాన్ని చేరుకొంటుందో అది కరోనా రేడియేటా జోనాసెల్యుసిడాలను చేధించుకొని లోనికి ప్రవేశిస్తుంది. అనేక జోనా శుక్రకణాలు జోనాపెల్యుసిడాను చేధించి పరిపీతిక ప్రదేశంలోకి చేరినప్పటికి, ఒక శుక్రకణం మాత్రమే అండంలోకి ప్రవేశిస్తుంది. అండంలోకి శుక్రకణం ప్రవేశం వల్ల ద్వితీయ అండమాతృకణం ప్రేరేపించబడి రెండవ క్షయకరణ విభజన పూర్తవుతుంది. రెండు బీజాల కేంద్రకంలు కలిసి సంయుక్త కేంద్రాన్ని ఏర్పరుస్తాయి. దీన్ని ‘సింకేరియాన్’ అంటారు. ఫలదీకరణం చెందిన అండాన్ని సంయుక్తబీజం అంటారు.
a) విదళనం: పిండాభివృద్ధి మొదటి దశ సంయుక్త బీజం విధజనాలు జరపడం. మానవుడిలో అండాలు మైక్రోలెసిథల్ రకానికి చెందడం వల్ల విదళనం పూర్ణ భంజిత, పరిభ్రమణ, అనిర్ధారిత, అసమాన పద్ధతిలో జరుగుతుంది. సంయుక్త బీజం గర్భాశయం వైపుకు స్త్రీబీజవాహికలోని గ్రీవం గుండా చలిస్తున్నప్పుడు విదళనం మొదలవుతుంది. విదళనం వల్ల ఏర్పడిన పిల్ల కణాలను సంయుక్తబీజ ఖండితాలు అంటారు.
b) మారులా: 8-16 సంయుక్త బీజ ఖండితాలతో ఉండే పిండం మల్బరీ పండులాగా ఉంటుంది. కాబట్టి దీన్ని మారులా అంటారు. మారులా ఫాలోపియన్ నాళంలో అభివృద్ధి చెందుతూ గర్భాశయాన్ని చేరుతుంది. అసమాన విదళనం వల్ల సూక్ష్మ, స్థూల సంయుక్త బీజ ఖండితాలు ఏర్పడతాయి. కాంపాక్షన్ ప్రక్రియ వల్ల మారులాలోని ఖండితాలు దగ్గరగా లాగబడి సాంద్రంగా అమరుతాయి. సంయుక్త బీజ ఖండితాలు రెండు రకాల కణాలుగా తయారవుతాయి. అవి (1) ఉపరితల బల్లపరుపు కణాలు (2) అంతర కణ సముదాయం. ఉపరితల బల్లపరుపు కణాలు ట్రోఫోబ్లాస్ట్ లేదా పోషక బహిస్త్వచంగా ఏర్పడి చూషకాలను ఏర్పరుచుకొని పిండాన్ని గర్భాశయ గోడకు అతికిస్తాయి. అంతర కణ సముదాయం, పిండాన్ని ఏర్పరిచే రూపోత్పాదక కణాలుగా మారుతాయి. దీనితో కణవిభేదనం మొదలవుతుంది.
c) బ్లాస్టోసిస్ట్: గర్భాశయ కుహరం నుంచి కొంత ద్రవం మారులాలోకి ప్రవేశించి, పాక్షికంగా అంతర కణ సముదాయ కణాలను ట్రోఫోబ్లాస్ట్ నుంచి వేరుచేస్తుంది. ద్రవ పరిమాణం పెరుగుతున్నకొద్దీ, మారులా ఒక కోశంగా తయారవుతుంది. ట్రోపోబ్లాస్ట్ కణాలు బల్లపరుపుగా మారతాయి. అంతరకణ సముదాయం లోపల ఒకేవైపున ట్రోఫోబ్లాస్టికి అతికి ఉంటుంది. దీన్ని పిండ లేదా జాంతవధ్రువం అంటారు. ఇప్పుడు మారులా బ్లాస్టోసిస్ట్గా మారుతుంది. అంతర కణ సముదాయం పైభాగాన ఉన్న ట్రోఫోబ్లాస్ట్ కణాలను రాబర్ కణాలు అంటారు.
d) ప్రతిస్థాపన: బ్లాస్టోసిస్ట్ని ఆవరించి ఉండే జోనాపెల్యుసిడా క్రమంగా అదృశ్యమవుతుంది. ఫలితంగా ట్రోఫోబ్లాస్ట్ గర్భాశయ అంతర ఉపకళకు అతికి, దానిలో పూర్తిగా అంతర్గతం అయ్యేవరకు చొచ్చుకొనిపోతుంది. దీన్ని మధ్యాంతర ప్రతిస్థాపన అంటారు. ఫలదీకరణం జరిగిన 6వ రోజున ప్రతిస్థాపన ఆరంభమవుతుంది. ప్రతిస్థాపనకు ట్రోఫోబ్లాస్ట్ ఉత్పత్తిచేసే ప్రోటియాలైటిక్ ఎన్జైమ్లు, గర్భాశయ శ్లేష్మస్తరం సహాయపడతాయి.
e) ద్విపటలికా పిండి చక్రాభం ఏర్పడటం: రెండవ వారాంతానికి బ్లాస్టోసిస్ట్ ప్రతిస్థాపన పూర్తి అవుతుంది. అంతర కణ సముదాయం పిండి చక్రాభంగా మారుతుంది. వెంటనే రాబర్ కణాలు అదృశ్యమై పిండ చక్రాభం బహిర్గతమవుతుంది. పిండ చక్రాభం లోపలి కింది భాగం నుంచి కొన్ని కణాలు డీలామినేషన్ ద్వారా వేరై పిండ చక్రాభం లోపలి తలాన అంటే కుహరం ఎదురు తలంలో ఒక స్తరంగా ఏర్పడతాయి. ఈ కణాల స్తరం హైపోబ్లాస్ట్ గా రూపొంది భవిష్యత్తులో పిండ బాహ్య అంతస్త్వచాన్ని ఏర్పరుస్తుంది. మిగిలిన పిండ చక్రాభ భాగాన్ని ఎపిబ్లాస్ట్ అంటారు. కాబట్టి ఈ పిండి చక్రాన్ని “ద్విపటలికా పిండ చక్రాభం” అంటారు. ఇది పిండంగా మారుతుంది. ట్రోపోబ్లాస్ట్ కింద ఈ హైపోబ్లాస్ట్ పొర చివరికి ఒక కుహరాన్ని ఆవరిస్తుంది. ఈ కుహరాన్ని సొన సంచి లేదా నాభికోశం అంటారు. ఇంతలో పిండాచక్రాభం మందం పుచ్ఛభాగం వైపుకు పెరుగుతుంది. క్రమంగా పిండ చక్రాభం అండాకారంగా మారుతుంది.
2) గాస్ట్రులేషన్: గాస్ట్రులేషన్ ప్రక్రియలో పిండంలోని కణాల విభేదనం, కదలికలు జరుగుతాయి.
a) త్రిపటలికా పిండం – ప్రాథమిక జనన స్తరాలు ఏర్పడటం: ఎన్ఐలోని కొన్ని భవిష్యత్ అంతస్త్వచ కణాలు ప్రవేశం చెంది, పిండం హైపోబ్లాస్ట్ కణాలను స్థానభ్రంశం చేసి అంతస్త్వచంగా ఏర్పడతాయి. భవిష్యత్ మధ్యస్త్వచ కణాలు ఆది మడతల వద్దకు చేరి, ఆదికుల్య ద్వారా అంతర్వలనం చెంది, ఎన్లాస్ట్, ఎండోకర్స్గా మధ్యకు చేరతాయి. ఈ విధంగా ఎపిబ్లాస్ట్ నుంచి మధ్యస్త్వచం వేరైన తరువాత ఎప్లస్ ను బాహ్యస్త్వచం అంటారు. ఎస్ఇ బ్లాస్ట్, హైపోబ్లాస్ట్కు మధ్య ఉన్న కుహరంలోకి ఎపిబ్లాస్ట్ కణాలు చొరబడటాన్ని గాస్ట్రులేషన్ అంటారు. గాస్ట్రులేషన్ ప్రక్రియ ద్విపటలికా పిండ చక్రాన్ని “త్రిపటలికా పిండ చక్రాభం” గా మారుతుంది.
పిండ బాహ్య త్వచాలు: మానవ పిండాభివృద్ధిలో ఇతర ఉల్బదారులలో లాగా నాలుగు రకాల పిండ బాహ్య త్వచాలు లేదా భ్రూణ త్వచాలు ఏర్పడతాయి. అవి పరాయువు, ఉల్బం, ఆళిందం, సొనసంచి. గ్రాస్టులేషన్ పూర్తయి, అన్ని పిండ బాహ్య త్వచాలు ఏర్పడిన తరువాత పిండాభివృద్ధి తరువాత దశ అవయవాలు ఏర్పడటంతో ప్రారంభమవుతుంది.
3) అవయవోత్పత్తి: అవయవాల ఉత్పత్తి వివిధ దశలలో జరుగుతుంది.
పృష్ఠవంశం, నాడీనాళం ఏర్పడుట: పృష్ఠవంశ మధ్యస్త్వచ కణాలు హెన్పన్స్ కణుపు వద్దకు కేంద్రీకృతమై అంతర్వలనం చెంది పృష్ట వంశ అవశేష్ఠంగా ముందుకు వ్యాపిస్తాయి. తరువాత ఈ నిర్మాణం గట్టి కడ్డీ లాంటి పృష్ఠ వంశంగా మార్పు చెందుతుంది. ఈ పిండ అక్షాస్థిపంజర స్థానంలో కశేరు దండం ఏర్పడుతుంది. పృష్ఠవంశ మధ్యస్త్వచం దానిపై ఉన్న బహిస్త్వచ కణాలను ప్రేరేపించి నాడీఫలకాన్ని ఏర్పరుస్తుంది. ఈ ఫలకం పృష్ఠవంశం వైపుకు అంతర్వర్తనం చెంది నాడీగాడి ఏర్పడి దీని పార్శ్వ ఉపాంతాలు నాడీ మడతలుగా మారి ముందుకు సాగి పృష్ఠ మధ్యరేఖ వద్ద కలవడం వల్ల నాడీనాళం ఏర్పడుతుంది. దీన్నే న్యూరులేషన్ అంటారు.
మధ్యస్త్వచ విభేదనం, సీలోమ్ ఏర్పడటం: వెలుపలి బాహ్యస్త్వచం, లోపలి అంతస్త్వచం మధ్యలో పిండాంతస్త మధ్యస్త్వచం అన్నివైపులా విస్తరిస్తుంది. పృష్ఠవంశానికి, నాడీ నాళానికి ఇరువైపులా ఉన్న ఆయత మధ్యస్త్వచ స్తంభాన్ని ఎపిమియర్ అంటారు. ఆంత్రనాళాన్ని చుట్టి ఉన్న మధ్యస్త్వచాన్ని హైపోమియర్ అంటారు. ఈ రెండింటి మధ్యగల మధ్యస్త్వచాన్ని మీసోమియర్ అంటారు.
ఎపిమియర్ క్రమంగా ఖండీభవనం చెంది సోమైట్లను ఏర్పరుస్తుంది. ప్రతీసోమైట్ మయోటోమ్, స్లీరోటోమోమ్, డెర్మోటోమ్ విభేదనం చెందుతాయి. స్త్రీ రోటోమ, వెన్నెముక గాను, డెర్మోటోమ్ అంతశ్చర్మం, సంయోజక కణజాలం గాను, మయోటోమ్ నియంత్రిత కండరాలుగాను విబేధనం చెందుతాయి. మీసోమియర్ మూత్రజననేంద్రియ అవయవాలను, వాటి నాళాలను ఏర్పరుస్తాయి. హైపోమియర్ వెలుపలి సొమాటిక్, లోపలి సాంక్నిక్, మధ్యస్త్వచ పొరలుగా చీలుతుంది. ఈ రెండు పొరల మధ్య ఏర్పడిన కుహరం పిండాంతస్థ కుహరం, పిండి కుహరం నుంచి హృదయావరణ, పుపుసి, ఆంత్రవేష్టని కుహరాలు ఏర్పడతాయి.
4) జరాయువు ఏర్పడటం: పిండ ప్రతిస్థాపన జరిగిన తరువాత ట్రోఫోబ్లాస్ట్ నుంచి వేళ్ళ వంటి నిర్మాణాలు ఏర్పడి గర్భాశయ అంతర ఉపకళలోకి చొచ్చుకొనిపోతాయి. వీటిని పరాయు చూషకాలు అంటారు. పరాయు చూషకాలు, గర్భాశయ కణజాలు, ఒకదానితో ఒకటి వేళ్లలాగా అల్లుకొని అత్యంత సన్నిహిత సంబంధమేర్పరుచుకొని ఎదుగుతున్న పిండానికి, తల్లికి మధ్యన ఒక నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణమైన జరాయువును ఏర్పరుస్తాయి.
- జరాయువు పిండాభివృద్ధికి కావలసిన O2, పోషక పదార్థాలను, మాతృ రక్తం నుంచి గ్రహించి CO2కను విసర్జక పదార్థాలను మాతృ రక్తంలోకి విడుదల చేస్తాయి.
- జరాయువు ప్రొజెస్టిరాన్ ను స్రవించి గర్భధారణను కాపాడుతుంది.
- సొమాటో మెమ్మెట్రోపిన్ను విడుదలచేసి భ్రూణ అభివృద్ధిలో సహాయపడుతుంది.
5) గర్భధారణ: పిండ గర్భాశయాంతర అభివృద్ధిని గర్భధారణ అంటారు. గర్భం అభివృద్ధి చెందే కాలాన్ని గర్భావధి కాలం అంటారు. గర్భావధి కాలం 266 రోజులు లేదా 38 వారాలు పడుతుంది.
గర్భావధిని సులువుగా ఉండటానికి 3 త్రైమాసాలుగా విభజించవచ్చు. మొదట త్రైమాసంలో అవయవాల ఉత్పత్తి జరిగి, శరీర అంగాలు అభివృద్ధి జరుగుతుంది.
- గర్భధారణ జరిగిన మొదట నెల చివరన – హృదయం ఏర్పడుతుంది.
- రెండవ నెల చివరన – పిండంలో కాళ్ళు, చేతులు వాటి వేళ్ళు వృద్ధి చెందుతాయి.
- మూడవ నెలలో- ముఖ్య అవయవ వ్యవస్థలు ఏర్పడతాయి.
- ఐదవ నెలలో – భ్రూణ కదలికలు, తల మీద వెంట్రుకలు రావడం.
- ఆరవ నెల చివరలో – సున్నితమైన రోమాలతో శరీరం కప్పి ఉండటం, కనురెప్పలు తెరవడం, కనురెప్ప వెంట్రుకలు ఏర్పడటం జరుగుతాయి.
- తొమ్మిదవ నెలలో – భ్రూణం పరిపూర్ణంగా ఎదిగి, ప్రసవం కోసం సిద్ధంగా ఉంటుంది.
6) ప్రసవం: పురిటి నొప్పులు క్రమంగా దృఢంగా లయబద్ధంగా జరిగి, గర్భాశయ కండరాల సంకోచ సడలికల వల్ల శిశువును, జరాయువును గర్భాశయం నుంచి బయటకు నెట్టివేస్తాయి. దీన్నే ప్రసవం అంటారు.