AP Inter 2nd Year Zoology Study Material Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Zoology Study Material 8th Lesson అనువర్తిత జీవశాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Zoology Study Material 8th Lesson అనువర్తిత జీవశాస్త్రం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఏ కారకాలు కలిస్తే పాడిపరిశ్రమ ఏర్పడుతుంది ?
జవాబు:
పాలిచ్చే జంతువుల ప్రజననం, పోషణ యాజమాన్యం, వాటి పాలు, పాల ఉత్పత్తులను అమ్మకానికి అనువుగా తయారుచేసి లాభానికి అమ్మడాన్ని పాడి పరిశ్రమ అంటారు.
పాల ఉత్పత్తిని, నాణ్యతను పెంచడానికి అవసరమయ్యే కారకాలు:

  • వ్యాధి నిరోధక ‘శక్తి కలిగి, అధిక ఉత్పత్తి సామర్థ్యం గల మంచి ప్రజననాలను ఎన్నిక చేయడం.
  • ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి సరియైన నివాసం, సరిపడే గాలి, వెలుతురు, తగిన ఉష్ణోగ్రత మొదలైనవి అవసరం.

ప్రశ్న 2.
అంతః ప్రజననం యొక్క ఏవైనా రెండు ప్రయోజనాలను ఉదహరించండి.
జవాబు:

  1. అంతః ప్రజననం సమయుగ్మజను పెంచుతుంది. కాబట్టి శుద్ధ ప్రజననాలను సాధించాలంటే అంతః ప్రజననం అవసరం.
  2. ఇది మేలు రకపు జన్యువులను సంచితం చేయడానికీ, ఉపయుక్తం కాని జన్యువులను తొలగించడానికి సహాయ పడుతుంది.

ప్రశ్న 3.
ఔట్ – క్రాస్; క్రాస్ – బీడ్ మధ్య భేదం తెలపండి.
జవాబు:
బాహ్య సంపర్కం (ఔట్ క్రాస్): ఇది ఒకే ప్రజననాల మధ్య సంపర్కం చెందించే విధానం కాని 4-6 తరాల వరకు ఆ వంశ వృక్షంలో ఇరువైపులా ఒకే పూర్వీకులు ఉండరాదు.

  • కొన్నిసార్లు ఒకే ఒక్క బాహ్య సంపర్కం అంతః ప్రజనన మాంధ్యం నుండి బయటపడటానికి సహాయపడుతుంది.

పర ప్రజననం (బీడ్ క్రాస్): ఈ విధానంలోని ఒక మేలుజాతి మగజీవితో వేరొక మేలుజాతి ఆడజీవిని సంపర్కం చేస్తారు.

  • పర ప్రజననం రెండు వేర్వేరు ప్రజననాలతో ఉన్న ఐచ్ఛిక లక్షణాలను కలపడానికి దోహదపడుతుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం

ప్రశ్న 4.
లేయర్లు, బ్రాయిలర్ పదాలను నిర్వచించండి. [A.P. Mar. ’17, ’15]
జవాబు:
లేయర్లు: కేవలం గుడ్ల ఉత్పత్తి కోసం పెంచే పక్షులను లేయర్లు అంటారు. బ్రాయిలర్లు: మాంసం కోసం మాత్రమే పెంచే పక్షులను బ్రాయిలర్లు అంటారు.

ప్రశ్న 5.
ఎపికల్చర్ అంటే ఏమిటి ? [A.P. & T.S. Mar.’17; T.S. Mar. ’15 Mar. ’14 ]
జవాబు:
తేనె, మైనం ఉత్పత్తి కోసం తేనెతుట్టెల నిర్వహణ ద్వారా తేనెటీగల్ని పెంచడాన్ని ఎపికల్చర్ అంటారు. ఎపికల్చర్ చాలా పురాతన కుటీర పరిశ్రమ.

ప్రశ్న 6.
తేనెటీగ కాలనీలో డ్రోన్, కూలీ ఈగ మధ్య భేదాలను తెలపండి.
జవాబు:
డ్రోన్లు

  1. ఇవి వంధ్య పురుష తేనెటీగలు.
  2. ఇవి ఫలదీకరణం చెందని అండాల నుంచి మగ అనిషేక జనన పద్ధతిలో అభివృద్ధి చెందినవి.
  3. ఇవి చాలా తక్కువ కాలం జీవిస్తాయి.

కూలీ ఈగలు

  1. ఇవి వంధ్య స్త్రీ తేనెటీగలు.
  2. ఇవి ఫలదీకరణం చెందిన అండాల నుంచి అభివృద్ధి చెందినవి.
  3. ఇవి రెండు మూడు నెలలు మాత్రమే జీవిస్తాయి.

ప్రశ్న 7.
ఫిషరీ అనే పదాన్ని నిర్వచించండి.
జవాబు:
ఫిషరీ (మత్స్య పరిశ్రమ) అంటే మానవ వినియోగం కోసం చేపలు లేదా మానవుడికి ఆహారంగా ఉపయోగపడే ఇతర జలచర జంతువులను పట్టడం, పెంచడం, వివిధ రకాలుగా నిలువ చేయడం, విక్రయించడం.

ప్రశ్న 8.
ఆక్వాకల్చర్, పిసికల్చర్ల మధ్య వ్యత్యాసం తెల్పండి.
జవాబు:
ఆక్వాకల్చర్: ఆక్వాకల్చర్ అంటే కేవలం చేపల పెంపకమే కాకుండా ఇతర జలచరాలను నియంత్రిత పద్ధతులలో పెంచి మెరుగైన ఉత్పత్తిని సాధించడం.
పిసికల్చర్: కేవలం మత్స్యాలను మాత్రమే పెంచడాన్ని పిసికల్చర్ అంటారు.

ప్రశ్న 9.
హైపోపైజేషన్ అనే పదాన్ని నిర్వచించండి. [A.P. Mar. ’16; T.S. Mar. ’15]
జవాబు:
అధిక మొత్తం లేదా కావలసిన మొత్తంలో కార్ట్సిడ్స్ను పొందుటకు చేపలను కృత్రిమ ప్రజననానికి సంసిద్ధత చేయుటను హైపోపైజేషన్ అంటారు.

ప్రశ్న 10.
ఏవైనా రెండు భారత, రెండు విదేశీ కార్ప్ చేపల పేర్లు తెలపండి. [T.S. Mar. ’17]
జవాబు:
భారతదేశ కార్ప్ చేపలు:

  1. కట్ల కట్ల (కట్ల)
  2. సిరైనస్ మ్రిగాలా (మ్రిగాల్

విదేశీ కార్ప్ చేపలు

  1. గ్రాస్ కార్ప్
  2. సిల్వర్ కార్ప్

ప్రశ్న 11.
ఏవైనా నాలుగు చేప ఉత్పత్తులను ఉదహరించండి.
జవాబు:

  1. సొర, కాడ్ కాలేయ నూనె
  2. చేప గ్వానో
  3. షాగ్రీన్
  4. ఐసిస్ గ్లాస్

ప్రశ్న 12.
ఇన్సులిన్ ఎన్ని అమైనో ఆమ్లాలు, ఎన్ని పాలిపెప్టైడ్ గొలుసులు ఉంటాయి ?
జవాబు:

  • ఇన్సులిన్ 51 అమైనో ఆమ్లాలతో నిర్మితమై ఉంది.
  • ఇది రెండు పాలిపెప్టైడ్ గొలుసులను కలిగి ఉంటుంది.
    పాలిపెప్టైడ్ గొలుసు A – 21 అమైనో ఆమ్లాలు
    పాలిపెప్టైడ్ గొలుసు B – 30 అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి.

ప్రశ్న 13.
వ్యాక్సీన్ పదాన్ని నిర్వచించండి. [A.P. Mar. ’16]
జవాబు:
ఒక ప్రత్యేక వ్యాధికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచే జీవ సంబంధ తయారీనే వ్యాక్సిన్ అంటారు. వ్యాక్సిన్లో వ్యాధిని కలిగించే సూక్ష్మజీవిని పోలిన కారకం ఉంటుంది. ఈ కారకం బలహీనపరచబడిన లేదా చంపబడిన సూక్ష్మజీవి లేదా సూక్ష్మజీవుల ఉపరితల ప్రోటీన్లు లేదా క్రియారహితంగా చేయబడిన సూక్ష్మజీవుల నుంచి విడుదలయ్యే విష పదార్థాలు.

ప్రశ్న 14.
PCR కు సంబంధించి ఏవైనా రెండు లక్షణాలను తెలపండి.
జవాబు:

  1. తక్కువ సాంద్రతలో బ్యాక్టీరియా, వైరస్ల లు ఉన్నప్పటికి PCR ద్వారా బాక్టీరియా, వైరస్ల న్యూక్లికామ్లాలను బహుగుణీకృతం చేయడం ద్వారా గుర్తించవచ్చు.
  2. చిన్న DNA తునకను PCR చర్యతో బహుగుణీకృతం చేయడం ద్వారా తక్కువ మొత్తంలో ఉన్న DNA ను కూడా గుర్తించవచ్చు.
  3. అనుమానాస్పద సందర్భాలలో HIVని గుర్తించుటకు, క్యాన్సర్ను గుర్తించడానికి PCR ను వాడుతున్నారు.

ప్రశ్న 15.
ADA దేన్ని సూచిస్తుంది ? ADA లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది ?
జవాబు:

  • ADA – ఎడినోసిన్ డి ఎమినేజ్
  • ADA లోపం వల్ల తీవ్ర సమ్మిళిత వ్యాధి నిరోధక లోపం కలుగుతుంది.

ప్రశ్న 16.
జన్యు పరివర్తిత జంతువు పదాన్ని నిర్వచించండి.
జవాబు:
తమ జీనోమ్కు అదనంగా అన్య జన్యువును వ్యక్తీకరించడానికి వాటి DNA సవరించబడిన జంతువులను జన్యుపరివర్తిత జన్యువులు అంటారు.

ప్రశ్న 17.
‘గార్డియన్ ఏంజెల్ ఆఫ్ సెల్ జీనోమ్’ అని దేన్ని సాధారణంగా పిలుస్తారు ? [TS. Mar. ’16]
జవాబు:
P53 ని గార్డియన్ ఏంజెల్ ఆఫ్ సెల్సీమ్ అని అంటారు. ఇది కో జన్యువు కణుతుల అభివృద్ధిని, పెరుగుదలను అణచివేస్తాయి. ఇది DNA సమగ్రతను కాపాడుతుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం

ప్రశ్న 18.
క్యాన్సర్ కణాల ఏవైనా నాలుగు లక్షణాలను తెలపండి.
జవాబు:

  • క్యాన్సర్ కణాలు స్పర్శ నిరోధాన్ని కోల్పోతాయి.
  • క్యాన్సర్ కణాలు లంగరు ఆధారం అనే ధర్మాన్ని కోల్పోతాయి.
  • క్యాన్సర్ కణాలలో అంతరకణ జిగురు ప్రొటీన్లైన్ కడరిన్లతో అతకబడే లక్షణం కనిపిస్తుంది.
  • ఈ కణాలు ప్రణాళికాబద్ధ కణమరణానికి గురికావు.

ప్రశ్న 19.
రేడియోగ్రాఫ్లను ఏ విధంగా పొందుతారు ? [Mar. ’14]
జవాబు:
X-కిరణ ఉత్పాదక యంత్రాల ద్వారా ఉత్పత్తి చేసిన X-కిరణ కాంతి పుంజాన్ని దేహంలోని భాగాలపై ప్రసరింపచేస్తారు. దేహ భాగాల గుండా ప్రసరించిన కిరణాలను ఫోటోగ్రఫిక్ ఫిల్మ్ని అభివృద్ధి చేస్తారు. ఈ విధంగా X-కిరణాల ద్వారా అభివృద్ధి పరచిన ఫోటోగ్రాఫ్లను రేడియోగ్రాఫ్లు అంటారు.

ప్రశ్న 20.
టోమోగ్రామ్ అంటే ఏమిటి ?
జవాబు:
ప్రతిబింబాల / చిత్రాల ఖచ్చితత్వం కోసం స్కానింగ్ పూర్తయిన తరువాత కంప్యూటర్ ఉత్పత్తి చేసిన చిత్రాలను దేహభాగాల పలుచని కోతల చిత్రాలుగా ఫిల్మ్ కు మార్చవచ్చు. ఈ చిత్రాలను టోమోగ్రామ్ అంటారు.

ప్రశ్న 21.
MRI స్కాన్ హానికరం కాదు నిరూపించండి.
జవాబు:
X-కిరణం లాగా అయనీకరణ రేడియోధార్మికతను ఉపయోగించదు. కాబట్టి ఇది హానిలేని చాలా సురక్షితమైన విధానం.

ప్రశ్న జవాబు:
ఎలక్ట్రోకార్డియోగ్రఫి అంటే ఏమిటి ? ECG లో సాధారణ భాగాలు ఏవి ? [A.P. Mar. ’15]
జవాబు:
ఎలక్ట్రోకార్డియోగ్రఫి – గుండెలో కలిగే విద్యుత్ మార్పులను నమోదు చేయడానికి సాధారణంగా వాడే హానిలేని పద్ధతి. ECG లోసాధారణ భాగాలు:

  1. తరంగాలు
  2. అంతరాలు
  3. భాగం / ఖండం
  4. సంక్లిష్టాలు.

ప్రశ్న జవాబు:
దీర్ఘకాల P – R అంతరం దేన్ని సూచిస్తుంది ?
జవాబు:
దీర్ఘకాల P – R అంతరం సిరాకర్ణికా కణుపు నుంచి కర్ణికా జఠరికా కణుపుకు జరిగే ప్రసరణ వహనపు ఆలస్యాన్ని సూచిస్తుంది.
P – R అంతరం బ్రాడీకార్డియా పరిస్థితులలో పెరుగుతుంది.

ప్రశ్న 24.
ప్రాథమిక, ద్వితీయ ప్రతిదేహాల మధ్య భేదాన్ని తెలపండి.
జవాబు:
ప్రాథమిక ప్రతిదేహం

  1. ప్రతి జనకానికి వ్యతిరేకంగా ఈ ప్రతిదేహాలు ఏర్పడతాయి.
  2. ఇవి అభిరుచి గల కావలసిన ప్రతి జనకాలతో చర్య జరుపుతాయి.

ద్వితీయ ప్రతిదేహం

  1. ఇవి బయట నుంచి వచ్చిన ప్రాథమిక ప్రతి దేహాలకు వ్యతిరేకంగా ఏర్పడతాయి.
  2. ఇవి ప్రాథమిక ప్రతిదేహాలతో చర్య జరుపుతాయి.

ప్రశ్న 25.
ప్రత్యక్ష, అప్రత్యక్ష ELISA ద్వారా సాంపిల్ లో ఏ పదార్థాలను గుర్తించవచ్చు ?
జవాబు:
ప్రత్యక్ష ELISA ప్రతి జనకాలను గుర్తించడానికి ఉపయోగపడే ELISA
అప్రత్యక్ష ELISA – ప్రతిదేహాలను గుర్తించడానికి ఉపయోగపడే ELISA

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పశు సంపదను మెరుగుపరచడానికి జంతు ప్రజననంలో వాడే వివిధ పద్ధతులు ఏవి ?
జవాబు: జంతువుల్లో అధిక ఉత్పత్తిని సాధించడానికి, ఉత్పత్తుల ఐచ్ఛిక లక్షణాలను అభివృద్ధి చేయడానికి జంతు ప్రజననం అనేది పశు సంవర్థనంలో ముఖ్యమైన అంశం.
జంతు ప్రజననంలో ముఖ్యంగా రెండు పద్ధతులున్నాయి. అవి 1) అంతఃప్రజననం 2) బాహ్య ప్రజననం.
1) అంతః ప్రజననం: వంశానుక్రమంలో బాగా దగ్గర సంబంధం గల జీవుల మధ్య జరిగే సంపర్కాన్ని అంతః ప్రజననం అంటారు.

అంతః ప్రజననం రెండు రకాలు:

  1. అతి సన్నిహిత ప్రజననం
  2. రేఖా ప్రజననం

i) అతి సన్నిహిత ప్రజననం: మగ జనకజీవి ఆడ సంతతితో, ఆడ జనక జీవి మగ సంతతితో జరిపే సంపర్కాన్ని అతి సన్నిహిత ప్రజననం అంటారు.

ii) రేఖా ప్రజననం: ఐచ్ఛిక లక్షణం కోసం సన్నిహిత సంబంధం గల మధ్య (అతి సన్నిహిత ప్రజననం కాదు) జరిపే వరణాత్మక ప్రజననం రేఖా ప్రజననం అంటారు.

2) బాహ్య ప్రజననం: సంబంధం లేని జంతువుల మధ్య జరిగే ప్రజననాన్ని బాహ్య ప్రజననం అంటారు. ఇది మూడు రకాలు.

  1. బాహ్య సంపర్కం
  2. పర ప్రజననం
  3. అంతర జాతి సంకరణం.

i) బాహ్య సంపర్కం: ఇది ఒకే ప్రజననాల మధ్య సంపర్కం చెందించే విధానం. కాని 4-6 తరాల వరకు ఆ వంశ వృక్షంలో ఇరువైపులా ఒకే పూర్వీకులు ఉండరాదు. ఈ రకమైన సంపర్కాన్ని బాహ్య సంపర్కం అంటారు. వచ్చే సంతతిని బాహ్య సంపర్కులు అంటారు.

ii) పర ప్రజననం: ఈ విధానంలో ఒక మేలుజాతి మగజీవితో వేరొక మేలుజాతి ఆడజీవిని సంపర్కం చేస్తారు. ఈ రకమైన సంపర్కం ద్వారా పుట్టిన సంతతిని పర ప్రజనితాలు అంటారు.

iii) అంతర జాతి సంకరణం ఈ పద్ధతిలో వేరు వేరు దగ్గరి ప్రజాతులకు చెందిన మగ, ఆడజీవుల మధ్య సంపర్కం జరుగుతుంది. దీని సంతతి రెండు జనకుల ఐచ్ఛిక లక్షణాలు కలిగి ఉండి వాటి జనకులకు భిన్నంగా ఉంటాయి.

ప్రశ్న 2.
‘ప్రజననం’ అనే పదాన్ని నిర్వచించండి. జంతు ప్రజననంలో ఉద్దేశ్యాలు ఏమిటి ?
జవాబు:
ప్రజననం: చాలా లక్షణాల్లో అంటే ఆకృతి, పరిమాణం కనిపించడం మొదలైన వాటిలో సామ్యాన్ని కలిగియుండి వంశానుక్రమం వల్ల సంబంధం కలిగియున్న జంతు సమూహాన్ని ప్రజననం అంటారు.
జంతు ప్రజననంలో ఉద్దేశ్యాలు:

  1. వ్యాధి నిరోధకత
  2. పాలు, మాంసం, ఉన్ని మొదలైన వాటి పరిమాణం, నాణ్యతను పెంచడానికి 3) వేగవంతమైన పెరుగుదల రేటు
  3. పాడి పశువుల జన్యు ప్రతిభను పెంచటం ద్వారా ఉత్పాదకత జీవితాన్ని పెంచడం.
  4. ముందస్తు పరిపక్వత
  5. దాణా / మేతలో మిత వ్యయం.

ప్రశ్న 3.
మానవ సంక్షేమంలో పశు సంవర్ధన పాత్రను వివరించండి.
జవాబు:
పశు సంవర్థనం అనేది పశుగణ ప్రజననం, పెంపకం అనే వ్యవసాయ పద్ధతి. మానవ ఉపయోగం కోసం పెంపుడు జంతువుల పెంపకం, వీటిలో పశువులు (గేదెలు, ఆవులు, ఎద్దులు), పందులు, గొర్రెలు, మేకలు, గుర్రాలు, ఒంటెలు మొదలైనవి మరియు కోళ్ళ పెంపకం, చేపల పెంపకం.

మానవుడు ఎంతోకాలం నుంచి తేనెటీగలు, పట్టుపురుగులు, రొయ్యలు, చేపలు, పక్షులు, పశువులు, పందులు, గొర్రెలు, ఒంటెలు మొదలైన వాటిని తేనె, పట్టు, మాంసం, పాలు, తోలు, ఉన్ని మొదలైన ఉత్పత్తుల కోసం పెంచుతున్నారు.

పశువుల పెంపకం, పాడి పరిశ్రమ, కోళ్ళ పెంపకం, జలసంవర్థనం మొదలైనవి. వాటి ద్వారా అనేక జనులకు ఆహార అవసరాలను తీర్చడంలో, ఉపాధి కల్పించడంలో, రాబడిని ఇవ్వడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి.

ప్రశ్న 4.
MOET లో సహాయపడే వివిధ స్థాయిలను పేర్కొనండి.
జవాబు:
బహుళ అండోత్సర్గం, పిండ బదిలీ సాంకేతికత (MOET) లో ఈ క్రింది స్థాయిలు ఉంటాయి.

  1. పుటికా ఉద్దీపన హార్మోన్ (FSH) లాంటి క్రియాశీలత గల హార్మోన్లను ఆవులకు ఇస్తారు.
  2. ఇది పుటికా పరిపక్వతను, అధి అండోత్సర్గాన్ని (super ovulation) ప్రేరేపిస్తుంది (అధి అండోత్సర్గంలో, సాధారణ ఈస్ట్రస్ చక్రంలో ఉత్పత్తి అయ్యే ఒక అండానికి బదులు 6 8 అండాలు ఉత్పత్తి అవుతాయి).
  3. ఈ విధంగా బహుళ అండాలు విడుదలైన ఆవును ఉత్తమజాతి ఎద్దుతో సంపర్కం జరిపి గాని, కృత్రిమ శుక్రనివేషణం ద్వారా గాని దాని అండాలను ఫలదీకరణ గావిస్తారు.
  4. 8-32 కణాల దశలో ఉన్న పిండాలను శస్త్ర చికిత్స లేని విధానం ద్వారా సేకరించి తాపంలో ఉన్న వేరే ఆవు (అరువు తల్లి – surrogate mother) గర్భాశయంలోకి మారుస్తారు.

ఇప్పుడు జన్యుతల్లి మరొకసారి అధి అండోత్సర్గానికి సిద్ధపడుతుంది. ఈ సాంకేతికత పశువులు, గొర్రెలు, కుందేళ్ళు, బర్రెలు, గుర్రాలు మొదలైన వాటిలో వినియోగంలో ఉంది. తక్కువ కాల వ్యవధిలో మంద పరిమాణం పెంచి ఎక్కువ పాలనిచ్చే ఆడ ప్రజననాలను అధిక నాణ్యత గల మాంసం (కొవ్వు తక్కువగా ఉండేది) ఉత్పత్తి చేసే గిత్తలను ప్రజననం ద్వారా పొందడంలో విజయవంతమయ్యారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం

ప్రశ్న 5.
నియంత్రిత ప్రజనన ప్రయోగాలపై లఘు వ్యాఖ్య రాయండి.
జవాబు:

  • నియంత్రిత ప్రజనన ప్రయోగం కృత్రిమ శుక్ర నివేషణం, బహుళ అండోత్సర్గం, పిండ బదిలీ సాంకేతికతని ఉపయోగించి చేయవచ్చు. దీని ద్వారా మనకు కావలసిన ప్రజనన లక్ష్యాన్ని పొందవచ్చు.
  • ఈ పద్ధతిలో ముందుగా మేలురకపు ఎద్దుల నుండి శుక్రాన్ని సేకరిస్తారు. ఈ శుక్రాన్ని అప్పటికప్పుడే ఉపయోగించవచ్చు లేదా దాన్ని ఘనీభవించి నిలువచేసి భవిష్యత్తులో ఉపయోగించవచ్చు లేదా రవాణా చేయవచ్చు.
  • ఇదే సమయంలో ఆవులకు FSH లాంటి క్రియాశీలత గల హార్మోనులను ఇస్తారు.
  • FSH పుటికా పరిపక్వతను, అధి అండోత్సర్గాన్ని ప్రేరేపిస్తుంది.
  • ఇప్పుడు ఆవును కృత్రిమ శుక్రనివేషణం ద్వారా దాని అండాలను ఫలదీకరణం గావిస్తారు.
  • 8-32 కణాల దశలో ఉన్న, పిండాలను శస్త్ర చికిత్స లేని విధానం ద్వారా సేకరించి పిండం అభివృద్ధి కోసం తాపంలో ఉన్న వేరే ఆవు (అరువు తల్లి) గర్భాశయంలోకి మారుస్తారు.

ఈ పద్ధతి ద్వారా పాడి రైతుకు కావలసిన ఉత్తమంగా, నిరూపించబడిన సైర్లను, ఎద్దులను ఉపయోగించి తన పశు సంపదను జన్యుపరంగా మెరుగుపరచుకొని సుఖరోగాలు రాకుండా నియంత్రించుకోవడానికి దోహదపడుతుంది.

ప్రశ్న 6.
పౌల్ట్రీ యాజమాన్యంలో ముఖ్యమైన అంశాలను వివరించండి.
జవాబు:
పౌల్ట్రీ యాజమాన్యంలో ముఖ్యాంశాలు:
1) వ్యాధిరహిత, అనువైన ప్రజననాలను ఎంచుకోవడం: ఎంపిక చేయబడ్డ ప్రజననాలు వివిధ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడాలి. భారతదేశంలో ఉపయోగించే సంకర లేయర్లు BV-300, హైలైన్, పూనా పెరల్స్ మొదలైనవి. హబ్బర్డ్, వెంకాబ్ మొదలైనవి భారతదేశపు వాణిజ్య బ్రాయిలర్ రకాలు.

2) దాణా / మేత యాజమాన్యం (సరియైన మేత, నీరు): ఉత్పత్తులను గరిష్ఠపరిచేందుకు సంతులిత ఆహారం ఇవ్వడం అత్యవసరం. వివిధ దిశల్లో ఉన్న లేయర్లకు బ్రూడర్ / చిక్ మాష్, గ్రోయర్ మాష్, ప్రీలేయర్ మాష్, లేయర్ మాష్లను ఆహారంగా ఇవ్వాలి. అలాగే బ్రాయిలర్లకు ప్రీస్టార్టర్ మాష్, స్టార్టర్ మాష్, ఫినిష్ మాష్లను ఆహారంగా ఇవ్వాలి. వాటరర్ల ద్వారా సురక్షితమైన నీటిని ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి.

3) ఆరోగ్యపరమైన జాగ్రత్తలు: వైరల్ వ్యాధులకు వాక్సినేషన్ ఇవ్వాలి. బాక్టీరియల్ వ్యాధులకు యాంటిబయాటిక్స్ ఇచ్చి చికిత్స చేసి కోళ్ళను వ్యాధిరహితంగా ఉంచాలి. కోళ్ళ పరిశ్రమకు సంక్రమించే శిలీంధ్ర వ్యాధులు బ్రూడర్స్, న్యుమోనియా, ఎఫ్లోటాక్సికోసిన్, త్రష్,

ప్రశ్న 7.
ఏవియన్ ‘ఫ్లూ’ గురించి సంక్షిప్తంగా చర్చించండి.
జవాబు:
ఏవియన్ ఫ్లూ: ఇది పక్షులకు సోకే వ్యాధి. ఒక్కొక్కసారి మానవుడికి సోకే అపాయకరమైన వ్యాధి.
వ్యాధికారక జీవి: H5N1 అనే “ఏవియన్ ఫ్లూ వైరస్” ద్వారా బర్డ్ ఫ్లూ వస్తుంది. పక్షులకు సోకే వైరస్ మనుషులకు కూడా సోకుతుంది. ఇది ఏకకాలంలో ప్రపంచ వ్యాప్తంగా సోకే అంటువ్యాధి (పాండెమిక్ వ్యాధి).

వ్యాధి సోకే విధానం: ఇది అంటువ్యాధి. ఇన్ఫ్లూయెంజా రకపు వైరస్ సోకిన పక్షులు లాలాజలం, మలపదార్థం ద్వారా 10 రోజుల వరకు ఈ వైరస్ ను విడుదల చేస్తాయి. వీటిని తాకిన ఇతర పక్షులు, మానవులకు ఈ వ్యాధి సోకుతుంది. వ్యాధి సోకిన మానవుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఏర్పడ్డ ఎయిరోసాల్ పీల్చినా, రోగి లాలాజలం శ్వాస తుంపరలతో కలుషితమైన ఉపరితలాలు తాకినా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

వ్యాధి లక్షణాలు: మానవులలో H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ సాధారణ ఫ్లూ లాంటి లక్షణాలు కలిగి ఉంటుంది. దీనితోపాటు దగ్గు (కఫంతో కూడిన లేదా పొడిదగ్గు), డయేరియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, తలనొప్పి, వ్యాకులత, కండరాల నొప్పి, గొంతునొప్పి మొదలైనవి ఉంటాయి.

నివారణ:
1) సరిగా వండని కోడిమాంసం తినకుండా ఉన్నట్లయితే ఏవియన్ ఫ్లూ బారినపడే ఆపదను తగ్గించవచ్చు. 2) పక్షులతో పనిచేసే మనుష్యులు రక్షణగా ఉండే దుస్తులు, ప్రత్యేకమైన గాలి పీల్చుకునే ముసుగు ధరించాలి. 3) వ్యాధి సోకిన పక్షులను పూర్తిగా పూడ్చి పెట్టి గానీ, తగులబెట్టి గానీ కల్లింగ్ చేయాలి.

ప్రశ్న 8.
రాణీఈగ గురించి సంక్షిప్తంగా చర్చించండి.
జవాబు:

  • రాణీఈగ సహనివేశంలో అతిపెద్ద జీవి.
  • ఇది తుట్టెకు ఒకటి ఉండి ఫలవంతమైనదిగానూ, ద్వయస్థితిక ఆడజీవిగానూ గుడ్లు పెట్టేదిగానూ ఉంటుంది.
  • ఇది 5సం||ల వరకు జీవించి ఉండి, గుడ్లు పెట్టడం అనే ఏకైక విధిని నిర్వర్తిస్తుంది.
  • రాణీఈగ శోభన ఉడ్డయనంలో (డ్రోన్ల (పురుష తేనెటీగలు) నుంచి శుక్రకణాలను గ్రహించి వాటిని శుక్రాశయంలో నిల్వ చేసుకొని ఫలవంతమైనవి, ఫలవంతం కానివి అనే రెండు రకాల అండాలను విడుదల చేస్తుంది.
  • ఫలవంతమైన అండాలు అన్నీ ఆడ ఈగలుగా అభివృద్ధి చెందుతాయి.
  • ఫలవంతమైన అండాల నుండి అభివృద్ధి చెందిన డింభకాలకు, మొదటి నాలుగు రోజులు రాయల్ జెల్లీని ఆహారంగా ఇస్తాయి. ఆ తరువాత ఏదైతే రాణీఈగగా అభివృద్ధి చెందాలో దానికి మాత్రమే రాయల్ జెల్లీని ఆహారంగా ఇస్తాయి.
  • మిగతా డింభకాలు తేనెటీగ రొట్టెని (తేనె, పుప్పొడి) ని తీసుకొని కూలీ ఈగలుగా మార్పు చెందుతాయి.
  • ఫలదీకరణం చెందని అండాల నుండి డ్రోన్లుగా అభివృద్ధి చెందుతాయి.

ప్రశ్న 9.
తేనెటీగలు ఆర్థికరీత్యా ప్రాముఖ్యమైనవి నిరూపించండి. [A.P. Mar. ’16]
జవాబు:
కీటక ప్రపంచంలో అధిక ఆర్థిక ప్రాముఖ్యత గల తేనెటీగలు, తేనెటీగల్ని పెంచడానికి ఎపికల్చర్ లేదా తేనెటీగల పెంపకం అంటారు.
తేనెటీగల ఆర్థిక ప్రాముఖ్యం: తేనెటీగ ఉత్పత్తులైన తేనె, మైనం, ప్రొపోలిన్, తేనెటీగల విషం అనేక విధాలుగా ఉపయోగిస్తారు.

  1. తేనె ఫ్రక్టోస్, గ్లూకోజ్, ఖనిజాలు, విటమిన్లు, నీటికి మంచి వనరు.
  2. బీ మైనాన్ని సౌందర్య సాధనాలు, అనేక రకాల పాలిష్ లు, కొవ్వొత్తుల తయారీలో వాడతారు..
  3. ప్రొపోలిస్ు కాలిన ఉపరితల గాయాలకు, వాపులకు ఉపయోగిస్తారు.
  4. కూలిఈగల కొండెం నుంచి తీసిన విషాన్ని రుమటాయిడ్ కీళ్ళవ్యాధి చికిత్సలో వాడతారు.
  5. పరాగ సంపర్కం: పొద్దు తిరుగుడు, బ్రాసికా, ఏపిల్, పియర్ లాంటి మొక్కలలో పరాగ సంపర్కం చేసేవి తేనెటీగలే.

ప్రశ్న 10.
తేనెటీగల పెంపకానికి కావలసిన వివిధ కారకాలు ఏవి ?
జవాబు:
తేనె, మైనం ఉత్పత్తి కోసం తేనెతుట్టెల నిర్వహణ ద్వారా తేనెటీగలను పెంచడాన్ని ఎపికల్చర్ లేదా తేనెటీగల పెంపకం అంటారు.
తేనెటీగల పెంపకం విజయవంతం కావడానికి కావలసిన కారకాలు, అవసరతలు:

  1. తేనెటీగల అలవాట్లు, ప్రకృతి మీద అవగాహన
  2. తేనెపట్టును ఉంచడానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేయడం (ఏపియరీ లేదా బీయార్డ్)
  3. తేనెపట్టును ఒక రాణిఈగ, చిన్న కూలి ఈగల గుంపుతో పెంచడం.
  4. వివిధ రుతువులలో తేనెపట్టుల యాజమాన్యం.
  5. తేనె, బీ మైనాన్ని సంగ్రహించి వాడుకోవడం.

ప్రశ్న 11.
భారత ఆర్థిక వ్యవస్థలో ఫిషరీస్ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. వివరించండి.
జ.
మత్స్య పరిశ్రమకు ఉన్న ఆర్థిక ప్రాముఖ్యత కారణంగా భారత ఆర్థిక వ్యవస్థలో మత్స్య పరిశ్రమ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.

ఆర్థిక ప్రాముఖ్యత:
1) ఆహారంగా: చేప మాంసం సాధారణంగా ప్రోటీన్లకు, విటమిన్లకు, ఖనిజాలకు మూలం మరియు చేపలలో అయోడిన్ సమృద్ధిగా లభిస్తుంది. ట్యూనాలు, ష్రింప్లు, పీతలు తినడానికే కాకుండా, ఎగుమతి విలువలను కలిగి ఉన్నాయి.

2) ఉప ఉత్పత్తులు:

  1. సొర, కాడ్ కాలేయనూనెలలో విటమిన్ A, విటమిన్ D పుష్కలంగా లభిస్తాయి.
  2. సార్లైన్, సాల్మన్ చేపల నూనెలో ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలు విరివిగా లభిస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించడం, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడం వంటి ధర్మాలను కలిగి ఉన్నాయి.
  3. చేపగ్వానో – స్క్రాప్ చేపల నుంచి తయారుచేసిన ఎరువు.
  4. షాగ్రీన్, ఐసిన్గ్లాస్ – వైనను శుద్ధి చేయడంలో ఉపయోగించే పిల్లి చేపల పదార్థం.
    చేపల పెంపకానికి అనుబంధంగా రొయ్యల పెంపకం, పీతలు, ముత్యపు చిప్పల పెంపకం వల్ల విదేశీ ఎగుమతుల నం మిలియన్ల డాలర్ల విదేశీ మారకాన్ని ఆర్జిస్తున్నాం.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం

ప్రశ్న 12.
ఇన్సులిన్ నిర్మాణాన్ని సంక్షిప్తంగా వివరించండి. [A.P. Mar. ’15.]
జవాబు:
ఇన్సులిన్ క్లోమగ్రంథిలోని లాంగర్ హాన్స్ పుటికల బీటా కణాల నుంచి ఉత్పత్తి అయ్యే ప్రోటీన్ హార్మోన్.
ఇన్సులిన్ నిర్మాణం:

  • ఇది 51 అమైనో ఆమ్లాలతో నిర్మితమై, రెండు పాలిపెప్టైడ్ గొలుసులను కలిగి ఉంటుంది. అవి గొలుసు A మరియు గొలుసు B
  • గొలుసు – A 21 అమైనో ఆమ్లాలను, గొలుసు B – 30 అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి.
  • ఈ రెండు గొలుసులు రెండు ద్విసల్ఫైడ్ బంధాలతో కలపబడి ఉంటాయి.
  • రెండు ద్వి సల్ఫైడ్ బంధనాలలో ఒకటి A7 – B7 ల మధ్య మరియు
  • రెండవది A20 – B19, మధ్య ఏర్పడతాయి. వీటికి అదనంగా ‘A’ గొలుసులపై అమైనో ఆమ్లం, 6 మరియు 11ల మధ్య కాకుండా ఒక డై సల్ఫైడ్ బంధనం ఉంటుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం 1

మానవులలో (క్షీరదాలు అన్నింటిలో కూడా) ఇన్సులిన్ ఒక ప్రోహార్మోన్ రూపంలో సంశ్లేషించబడుతుంది. ఈ ప్రోహార్మోన్ ‘C’ పెప్టైడ్ గొలుసును అదనంగా కలిగి ఉంటుంది. క్రియాశీలంగా మారే సమయంలో ప్రోహార్మోన్ నుండి ‘C’ పెప్టైడ్ గొలుసు తొలగించబడి A మరియు B గొలుసులతో కలిగిన క్రియాశీల ఇన్సులిన్ మారుతుంది.

ప్రశ్న 13.
వ్యాక్సిన్ను నిర్వచించండి. వివిధ రకాల వ్యాక్సిన్ల గురించి చర్చించండి.
జవాబు:
ఒక ప్రత్యేక వ్యాధికి నిరోధక శక్తిని పెంచే జీవ సంబంధ తయారీనే వ్యాక్సిన్ (టీకా) అంటారు. వ్యాక్సిన్లో వ్యాధిని కలిగించే సూక్ష్మజీవిని పోలిన కారకం ఉంటుంది. ఈ కారకం బలహీనపరచబడిన లేదా చంపబడిన సూక్ష్మజీవి లేదా సూక్ష్మజీవుల ఉపరితల ప్రోటీన్లు లేదా క్రియాశీల రహితంగా చేసిన సూక్ష్మజీవుల విష పదార్థాలు కావచ్చు.
వివిధ రకాల వ్యాక్సిన్లు:
సాంప్రదాయ వ్యాక్సిన్లు:
1) వ్యాధి కారకత క్షీణించిన సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్లు: ఇది తక్కువ సామర్థ్యం గల (తీవ్రత తగ్గించిన) సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. చాలా వరకు ఇవి వైరస్ వ్యాధుల నుంచి రక్షణ ఇస్తాయి. ఉదా:’ ఎల్లో జ్వరం, మశూచి, రుబెల్లా, గవదలు, టైఫాయిడ్ లాంటి బ్యాక్టీరియా వ్యాధులు.

2) నిష్క్రియా సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్లు: ఇది మృత సూక్ష్మజీవులను (చంపబడక ముందు తీవ్రత గల) కలిగి ఉంటుంది. ఉదా: ఇన్ఫ్లుయెంజా, కలరా, బ్యుబోనిక్ ప్లేగు, పోలియో, హైపటైటిస్ – A, రేబిస్, సాబిన్స్ నోటిపోలియో వ్యాక్సిన్.

3) టాక్సాయిడ్లు: కొన్ని సూక్ష్మజీవుల నిష్క్రియాత్మక బాహ్యవిషాలు. ఉదా: డిప్తీరియా, టిటానస్ వ్యాక్సిన్లు. ఈ వ్యాక్సిన్లు కృత్రిమ ఆర్జిత క్రియాత్మక వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపిస్తాయి. వీటిని వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు.

జీవ సాంకేతిక వ్యాక్సిన్లు:
1) పునఃసంయోజక వాహక వ్యాక్సిన్లు: వ్యాధికారక జీవుల ముఖ్యమైన జన్యువులను వ్యాధికారకత తగ్గించబడిన బాక్టీరియా లేదా వైరస్లోకి ప్రవేశపెట్టి వాటిని అతిథేయిలోకి టీకా రూపంలో ప్రవేశపెడతారు.

2) DNA టీకాలు: వ్యాధికారక ప్రతిజనక ప్రోటీన్లను సాంకేతీకరించే DNA ను ప్రత్యక్షంగా స్వీకర్త కండరంలోకి ఇంజెక్ట్ చేస్తారు.
ప్రస్తుతం DNA టీకాలను మలేరియా, AIDS, ఇన్ఫ్లూయెంజా వంటి వాటికి వ్యతిరేకంగా ఉత్పత్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రశ్న 14.
జన్యు చికిత్సలో రకాలను సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
జన్యుచికిత్స అంటే జన్యువుల్ని వ్యక్తి యొక్క కణాలు, కణజాలాల్లోకి అనువంశిక వ్యాధుల్ని నయం చేయడానికి ప్రవేశపెట్టడం. మానవులకు రెండు రకాల ప్రాథమిక జన్యు చికిత్సా విధానాలను అనువర్తించవచ్చు. అవి:

  1. దేహకణ శ్రేణి
  2. బీజకణ శ్రేణి

1) దేహకణ శ్రేణి: ఈ చికిత్సా విధానంలో క్రియాత్మక జన్యువులను రోగి దేహ కణంలోకి ప్రవేశపెడతారు. ఈ విధానం వ్యాధికి గురైన వ్యక్తి దేహ కణాలకు చికిత్స చేసి వ్యాధి దృశ్య రూపాన్ని నయం చేయడానికి ఉపయోగిస్తారు.
ఈ విధమైన జన్యు చికిత్సలో వచ్చిన మార్పులు అనువంశికమైనవి కావు. దేహకణ శ్రేణి చికిత్స రెండు రకాలు. అవి:

  1. దేహ బాహ్య జన్యు చికిత్స
  2. దేహం లోపల జన్యు చికిత్స

i) దేహబాహ్య జన్యు చికిత్స: ఈ పద్ధతిలో కణాలు దేహం బయట మార్పు చేయబడి తిరిగి దేహంలో ప్రతిస్థాపించబడతాయి.
ii) దేహ లోపల జన్యు చికిత్స: ఈ విధానంలో కణాలు దేహంలో ఉండగానే వాటి జన్యువులను మార్పు చేస్తారు.

2) బీజకణ. శ్రేణి: ఈ చికిత్సా విధానంలో క్రియాత్మక సాధారణ జన్యువులను శుక్రకణాలు లేదా స్త్రీ బీజకణాలలో ప్రవేశపెట్టి వాటి జీనోమ్లతో సమైక్యం చేస్తారు. కాబట్టి ఈ జన్యు మార్పు అనువంశికం చెందగలుగుతుంది. అనేక సాంకేతిక, నైతిక,కారణాల వల్ల బీజకణ శ్రేణి జన్యు చికిత్స శైశవ స్థాయిలోనే ఉండిపోతుంది.

ప్రశ్న 15.
క్యాన్సర్ కణాల ఏవైనా నాలుగు ముఖ్య లక్షణాలను విశదీకరించండి.
జవాబు:
క్యాన్సర్ కణాల ముఖ్య లక్షణాలు:’

  • సాధారణ కణాలు పెరుగుతున్నప్పుడు వాటి ప్లాస్మాత్వచం వేరొకదానికి తాకినప్పుడు అది తన విభజనను నిలిపివేస్తుంది. కానీ ఈ ధర్మాన్ని క్యాన్సర్ కణాలు కోల్పోతాయి.
  • సాధారణ కణాలు అంతరకణ జిగురును ప్రోటిన్న కెడ్హరిన్ల తో అతకబడతాయి. కాన్సర్ కణాలలో ఈ గుణం లోపిస్తుంది.
  • క్యాన్సర్ వ్యాధితో ఉత్పరివర్తనం చెందిన కణాలు ప్రణాళికా బద్ధ కణమరణానికి (apoptosis) కు గురికావు. * క్యాన్సర్ కణాల కణ ఉపరితల ప్రోటీన్ లు అసాధారణ మార్పులకు లోనయి, అసామాన్య ఉపరితల ప్రతిజనకాలను కలిగి ఉంటాయి.
  • క్యాన్సర్ కణాలు క్రియాశీలంగా విభజన చెందుతూ పెరగడం వల్ల పోషకాల కోసం సాధారణ కణాలతో పోటీపడి, వాటికి పోషకాలు అందకుండా చేస్తాయి.
  • క్యాన్సర్ కణితులు వృద్ధి కారకాలను విడుదల చేయుట ద్వారా కొత్త రక్త నాళాలను వృద్ధి చేసుకుంటాయి.
  • సాధారణ కణాలు సంవర్థక పాత్రకు అతికి ఉండి ఒకే కణమందం గల స్తరాన్ని ఏర్పరుస్తాయి. కాని క్యాన్సర్ కణాలు పోషక పదార్థాలున్నంత వరకు ఒకదానికి ఒకటి తాకినా విభజన జరుపుతూ, సంవర్థక పాత్రకు అతికి ఉండక అనేక కణమందం గల స్తరాన్ని ఏర్పరుస్తాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం

ప్రశ్న 16.
వివిధ రకాల క్యాన్సర్లను వివరించండి. [T.S. Mar.’17, ’15 Mar. ’14]
జవాబు:
క్యాన్సర్ను కలుగజేసే కణాల ఆవిర్భావాన్ని ఆధారంగా నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి:

  1. కార్సినోమా
  2. సార్కోమా
  3. ల్యుకేమియా
  4. లింఫోమా

1) కార్సినోమా: కార్సినోమా అనేది ఉపకళ కణాలతో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్స్. ఈ క్యాన్సర్ కణాలు చర్మం, శ్వాస, జీర్ణ, మూత్ర మరియు జనన వ్యవస్థలలోని ఉపకళా కణాల నుంచి ఏర్పడతాయి లేదా దేహంలోని వివిధ గ్రంథులు. ఉదా: క్షీరగ్రంథులు, నాడీకణజాలం నుంచి ఏర్పడతాయి. వీటి నామకరణం ఆవిర్భవించిన అవయవాలనాధారంగా చేస్తారు. దేహంలో ఏర్పడే క్యాన్సర్లలో 85% కార్సినోమా రకానికి చెందినవే.
ఉదా: ఎడినో కార్సినోమా – ఎడినాయిడ్స్లో క్యాన్సర్. గ్లియోబ్లాస్టోమా (నాడీకణజాలపు క్యాన్సర్) – మెదడులో ట్యూమర్స్ ఏర్పడతాయి.

 

2) సార్కోమా: సంయోజక కణజాలంలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్ను సార్కోమా అంటారు. ఈ ట్యూమర్లు మధ్యస్త్వచం నుండి ఏర్పడిన కణజాలం నుంచిగాని, మధ్యస్త్వచం నుంచి ఏర్పడిన అవయవాల నుంచిగాని ఏర్పడతాయి.
ఉదా: ఆస్టియో సార్కోమా (ఎముక), కాండ్రోసార్కోమా (మృదులాస్థి), ఆంజియోసార్కోమా (రక్తనాళాలలో).

3) ల్యుకేమియా: శోషరస గ్రంథులలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్స్. ఇవి ఎక్కువగా రక్త కణాలను ప్రభావితం చేసేవి. ముఖ్యంగా మజ్జాలో ఏర్పడే తెల్ల రక్తకణాలను ప్రభావితం చేస్తాయి. వీటిని ద్రవరూప ట్యూమర్స్ అని కూడా అంటారు. ఉదా: క్రానిక్ మైలియోసైటిక్ ల్యుకేమియా, దీర్ఘతర T కణ ల్యుకేమియా (acute T-cell leukemia)

4) లింఫోమా: ప్లీహం, శోషరస నాడులలో ఉండే తెల్ల రక్తకణాలతో ఏర్పడే మాలిగ్నెంట్స్ ట్యూమర్లు, దేహంలో ఏర్పడే ట్యూమర్లలో లింఫోమాలు 4% ఉంటాయి.
ఉదా: బుర్కెట్ లింఫోమా (Burkett Lymphoma).

ప్రశ్న 17.
MRI ఉపయోగించే విధానాన్ని రాయండి. [A.P. Mar. ’17]
జవాబు:
MRI అయనీకరణ రేడియో ధార్మికతను ఉపయోగించదు. అందువల్ల ఇది హానిలేని చెడు ప్రభావాలు కనిపించని వైద్య చిత్రీకరణ పద్ధతి. ఇది వైద్యులకు నిర్మాణాత్మక అవలక్షణాలను లేదా వ్యాధికారక పరిస్థితులను నిర్ధారణ చేయడానికి సహాయపడుతుంది.

MRI స్కానింగ్ విధానం:
1) MRI స్కానింగ్ యంత్రం అనేది ఒక పెద్ద వృత్తాకార అయస్కాంత గొట్టం. రోగిని కదిలే పరుపుపై ఉంచి దాన్ని అయస్కాంత గొట్టంలోకి పంపిస్తారు.

2) మానవ దేహం ప్రధానంగా నీటి అణువులతో ఏర్పడి ఉంటుంది. నీటి అణువులో రెండు హైడ్రోజన్ కేంద్రకాలు / ప్రోటాన్లు ఉంటాయి.

3) MRI లోని అయస్కాంతం బలమైన అయస్కాంత క్షేత్రాన్ని కలుగజేస్తుంది. ఇది దేహ నీటిలోని ప్రోటాన్లను అయస్కాంత క్షేత్ర దిశకు సమాంతరంగా అమరేటట్లు చేస్తుంది.

4) రెండవ రేడియో తరంగ దైర్ఘ్యపు విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని, కొద్దిసేపు దేహంలోకి పంపుతారు. ఈ రేడియో తరంగాల నుంచి కొంత శక్తిని దేహ నీటి అణువులోని ప్రోటాన్లు గ్రహిస్తాయి.

5) రెండవ రేడియో పౌనఃపున్యం ఉద్గార క్షేత్రాన్ని ఆపివేయగానే ప్రోటాన్లు గ్రహించిన శక్తిని MRI స్కానర్ గుర్తించగలిగే రేడియో పౌనఃపున్యం రూపంలో విడుదల చేస్తాయి.

6) వివిధ రకాల కణజాలాలు వివిధ ‘క్వాంటాల’ శక్తిని ఉద్గారిస్తాయి. వివిధ తరంగ దైర్ఘ్యాల రూపంలో అసాధారణ కణజాలాలైన కణితులు మొదలైన వాటిని గుర్తించవచ్చు. ఎందుకంటే వివిధ రకాల కణజాలాలలోని ప్రోటాన్లు వివిధ రేట్లలో సమతాస్థితికి తిరిగి వస్తాయి.

7) తక్కువ నీరుగల కణజాలాలైన అస్థి మొదలైనవి MRI చిత్రాలలో వేరే విధంగా కనిపిస్తాయి. దాని వల్ల ‘వివిధ కణజాలాల’ .చిత్రాల మధ్య నీటి స్థాయిలను బట్టి వ్యత్యాసం ఉంటుంది.

8) ఒకే కణజాలంలో సహితం ‘సాధారణ ఆరోగ్యకర కణాలు’, ‘వ్యాధికారక కణాలు’ వేర్వేరు శక్తి తరంగ దైర్ఘ్యాలను ఉద్గారిస్తాయి. కాబట్టి వివిధ రకాల కణాలు వివిధ ప్రతిబింబాలు / చిత్రాలను ఏర్పరుస్తాయి.

9) వెలువడిన రేడియో తరంగదైర్ఘ్య సమాచారం కంప్యూటర్ ద్వారా విధానీకరింపబడి ఒక ప్రతిబింబాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి చేసిన ప్రతిబింబం వివరాలు స్పష్టంగా ఉండి దేహ నిర్మాణాల్లో స్వల్ప మార్పులను కూడా గుర్తించగలుగుతుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం

ప్రశ్న 18.
ECG లో వివిధ తరంగాలు, అంతరాలను గూర్చి సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
ECG అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ లేదా ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అని అర్థం. ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ గుండెలో కలిగే విద్యుత్ మార్పులను నమోదు చేయడానికి సాధారణంగా వాడే హానిలేని పద్ధతి. ECG హార్థిక వలయంలో జరిగి విద్యుత్ వలయాలకు సంబంధించిన వరుస తరంగాలను చూపిస్తుంది.
ఒక సాధారణ ECG వీటిని కలిగి ఉంటుంది.

  1. తరంగాలు
  2. అంతరాలు
  3. భాగం
  4. సంక్లిష్టాలు.

i) తరంగాలు: సాధారణ ECG లో నమోదు అయ్యే తరంగాలు వరుసగా P, Q, R, S, T. ఒక సాధారణ హృదయ స్పందన వల్ల ఏర్పడే ECG లో ఒక P తరంగం, ఒక QRS సంక్లిష్టం, ఒక T తరంగం ఉంటాయి.

P తరంగం: ఇది కర్ణికా విధృవణాన్ని లేదా కర్ణికా సంకోచాన్ని సూచిస్తుంది. కర్ణిక గుండా కదిలే ప్రేరణను P తరంగం చూపిస్తుంది. P తరంగం కాలవ్యవధి 0.1 సెకను.
“QRS” సంక్లిష్టం: ఇది జఠరికా సంకోచాన్ని సూచిస్తుంది. Q తరంగం ఒక చిన్న ఋణ తరంగం, R తరంగం ఒక పెద్ద ధన తరంగం, S తరంగం ఋణ తరంగం. QRS తరంగం కాలవ్యవధి 0.08 నుంచి 0.1 సెకన్లు.
T తరంగం: ఇది జఠరికా పునఃధృవణాన్ని తెలియజేస్తుంది. దీని కాలవ్యవధి 0.2 సెకన్లు.

ii) అంతరాలు:
P – R అంతరం: P తరంగం ప్రారంభానికి, Q తరంగం ప్రారంభానికి మధ్య అంతరం. P – R అంతరం సాధారణంగా 0.12 – 0.2 సెకన్లు ఉంటుంది.

Q-T అంతరం: Qతరంగం ప్రారంభానికి, T-తరంగం అంతానికి మధ్య ఉంటుంది. ఇది జఠరికా కండరాల విద్యుత్ క్రియాశీలతను తెలియజేస్తుంది. దీని అవధి 0.4 సెకన్లు.

R-R అంతరం: ఒక హార్దిక వలయ కాలవ్యవధిని తెలియజేస్తుంది. ఇది 0.8 సెకనులలో ముగుస్తుంది.

iii) భాగం/ఖండాలు: S – T ఖండం S తరంగం అంతానికి T తరంగ ప్రారంభానికి మధ్య ఉంటుంది. ఇది విద్యుత్ శూన్య ఓల్టేజ్ కాలం.

ప్రశ్న 19. అప్రత్యక్ష ELISA విధానాన్ని సంక్షిప్తంగా చర్చించండి. [T.S. Mar. ’16]
జవాబు:
ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్జెంట్ అస్సెకు ELISA పొట్టిరూపం.

అప్రత్యక్ష ELISA: దీన్ని ఇచ్చిన మచ్చుకలో ఉన్న ప్రతిదేహాలను గుర్తించడానికి వాడతారు. పరీక్ష జరిపే వ్యక్తి రక్తాన్ని సేకరించి స్కందనం జరిగే వరకు ఉంచుతారు. ప్రాథమిక ప్రతిదేహాలను కలిగిన పారదర్శక సీరంను పొందడానికి ఘనీభవించిన రక్తాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తారు.
చేయు విధానం:

  1. ప్రతిజనకాన్ని తీసుకొని ELISA ఫలకపు గుంతలో అధిశోషణ గావిస్తారు.
  2. రోగి యాంటి సీరము ప్రతిజనకాన్ని పూసిన ELISA ఫలకపు గుంతలో తీసుకోవాలి.
  3. దానిని ప్రతిజనకాలు, ప్రతిదేహాలు చర్య జరుపుటకు కొంత సమయం వదిలిపెట్టాలి.
  4. రోగి యాంటిసీరమ్ ప్రతిదేహాలు గుంత ఉపరితలంపై అధిశోషింపబడిన ప్రతిజనకాలకు బంధించబడతాయి.
  5. తరువాత ELISA గుంతను కడగాలి. దీనిద్వారా బంధింపబడిన ప్రతిదేహాలు తొలగించబడతాయి.
  6. ఎంజైమ్ అనుసంధానిత యాంటి హ్యూమస్ సీరమ్ గ్లోబ్యూలిన్లు కలుపుతారు. ఇవి అప్పటికే ప్రతిజనకాలకు అతకబడిన ప్రాథమిక ప్రతిదేహాలకు అతుక్కొంటాయి. మరల కడగగా బంధింపబడిన ఎంజైమ్ అనుసంధానిత యాంటి హ్యూమస్ సీరమ్ గ్లోబ్యూలిన్లు తొలగించబడతాయి.
  7. ఎంజైమ్ అథస్థ పదార్థాన్ని కలపగా చర్య జరిపి రంగులో మార్పును చూపిస్తుంది. దీన్ని స్పెక్ట్రోఫోటోమీటరు ద్వారా కొలవవచ్చు.

ఒకవేళ సీరమ్ సాపిల్లో యాంటి HIV ప్రతిదేహాలు లేకపోయినట్లయితే ప్రతిజనకాలకు ప్రాథమిక ప్రతిదేహాలు అతుక్కోవు. కాబట్టి ఎంజైమ్ అనుసంధానిత ద్వితీయ ప్రతిదేహాలు కూడా ప్రాథమిక ప్రతిదేహాలకు అతుక్కోవు. అక్కడ ఏవిధమైన ఎన్లైమాటిక్ చర్య ఉండదు. రంగులో మార్పు ఉండదు కాబట్టి, పరీక్ష ఫలితాన్ని నెగిటివ్ గా పరిగణిస్తారు.

ELISA సాధారణంగా HIV లాంటి రోగ నిర్ధారణకు ఉపయోగించే ప్రాథమిక పరీక్ష.

ప్రశ్న 20.
EEG మీద లఘు వ్యాఖ్య వ్రాయండి.
జవాబు:
ఎలక్ట్రో ఎన్సెఫలో గ్రఫీ (EEG): తల చర్మం మీద కొన్ని ఎలక్ట్రోడ్లను ఉంచి EEG యంత్రం సహాయంతో మెదడు విద్యుత్ క్రియాశీలతను నమోదు చేసే పద్ధతిని ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీ అంటారు.

EEG తరంగాలు: EEG నమోదు చేసిన తరంగాలు వీటిని కలిగి ఉంటాయి.
i) సాధారణ ఆరోగ్యకరంగా ఉన్న మానవులలో ఏకరీతి (Synchronized) తరంగాలు సహజంగా ఉంటాయి.

ii) కొన్ని న్యూరోలాజికల్ పరిస్థితులలో తరంగాలు అసమరీతి (desynchronized) చెందుతాయి. (క్రమ పద్ధతి లేని తరంగ తీరు). ఈ తరంగ తీరుని (α) ఆల్ఫా, (β) బీటా, (θ) థీటా, (δ) డెల్టా తరంగ రీతులుగా స్థూలంగా వర్గీకరించవచ్చు. మస్తిష్క వల్కలంలోని వివిధ భాగాలలో జరిగే క్రియాశీలత తీవ్రతను బట్టి తరంగాల స్వభావం ఉంటుంది.
ఆల్ఫా (α) తరంగాలు: ఇవి లయబద్ధంగా ఉంటే సెకనుకు 8-13 వలయాలను కలిగి ఉంటాయి. ఈ రకమైన తరంగాల తీరు మత్తుగా / నిద్రావస్థలో కళ్ళు మూసుకొని ఉన్న వ్యక్తులలో కనిపిస్తుంది.

బీటా (β) తరంగాలు: ఈ తరంగాలు ఎక్కువ పౌనఃపున్యంతో సెకనుకు 13-40 వలయాలను కలిగి ఉంటాయి. వాటి కంపన పరిమితి తక్కువ. ఇవి మానసికంగా బాగా క్రియాశీలంగాను, ఒత్తిడితో ఉన్న మనుష్యులలో ఈ ‘అసమరీతి చెందిన తరంగాలు’ నమోదు అవుతాయి.

డెల్టా (δ) తరంగాలు: వీటి పౌనఃపున్యం చాలా తక్కువ (సెకనుకు 3 వలయాల కంటే తక్కువ) అయినప్పటికీ అవి ఎక్కువ కంపన పరిమితిని కలిగి ఉంటాయి. పూర్వ బాల్యదశలో మెలకువగా ఉన్న స్థితిలో ఇవి సాధారణం. పెద్దవాళ్ళలో ఇవి గాఢ నిద్రలో సంభవిస్తాయి. మెదడులో కణితులు, మూర్ఛ, మానసిక వ్యాకులత మొదలైనవి ఉన్నప్పుడు ఈ తరంగాలు మేల్కొని ఉన్న పెద్దవాళ్ళలో కూడా కలుగుతాయి.

ఢీటా (θ) తరంగాలు: వీటి పౌనఃపున్యం సెకనుకు 4 నుంచి 7 వలయాలు ఉంటుంది. ఈ తరంగాలు 5 సంవత్సరాల కంటే తక్కువ పిల్లల్లో సాధారణంగా ఉంటాయి. అవి పెద్దవాళ్ళలో కూడా భావ ప్రధాన ఉద్విగ్నతల్లో (ఒత్తిడి) నమోదవుతాయి.

ఉపయోగాలు:

  • నాడీసంబంధ అధ్యయనాల్లో EEG ప్రధాన డయాగ్నోస్టిక్ అనువర్తనం.
  • మూర్ఛని నిర్ధారణ చేయడంలో EEG ఉపయోగపడుతుంది.
  • EEG కోమా, మెదడు మరణం నిర్థారణలో కూడా ఉపయోగపడుతుంది.
  • నిద్రలేమిని విశ్లేషించుటలో EEG సహాయపడుతుంది.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బాహ్య ప్రజననాన్ని సవివరంగా రాయండి.
జవాబు:
బాహ్య ప్రజననం: సంబంధం లేని జంతువుల మధ్య జరిగే ప్రజననాన్ని బాహ్యప్రజననం అంటారు. ఇది భిన్న ప్రజననాల మధ్య సంపర్కం. బాహ్య ప్రజననం మూడు రకాలు. 1. బాహ్య సంపర్కం, 2. పర ప్రజననం, 3. అంగ జాతి సంకరణం.

1. బాహ్య సంపర్కం (Out crossing): ఇది ఒకే ప్రజననాల మధ్య సంపర్కం చెందించే విధానం. కాని 4-6 తరాల వరకు ఆ వంశ వృక్షంలో ఇరువైపులా ఒకే పూర్వీకులు ఉండరాదు. ఈ రకమైన సంపర్కం ద్వారా వచ్చే సంతతిని బాహ్య సంపర్కులు అంటారు. తక్కువ పెరుగుదల రేటు (బీఫ్ పశువులలో), తక్కువ సగటు పాల ఉత్పత్తి కలిగిన జంతువులలో ఇది ఉత్తమమైన ప్రజనన విధానం. కొన్నిసార్లు ఒకేఒక్క బాహ్య సంపర్కం అంతఃప్రజనన మాంధ్యం నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం

2. పర ప్రజననం (Cross-breeding): ఈ విధానంలో ఒక మేలు జాతి మగజీవితో వేరొక మేలు జాతి ఆడజీవిని సంపర్కం చేస్తారు. ఈ రకమైన సంపర్కం ద్వారా పుట్టిన సంతతిని పర ప్రజనితాలు అంటారు. పర ప్రజననం రెండు వేర్వేరు ప్రజననాలలో ఉన్న ఐచ్ఛిక లక్షణాలను కలవడానికి దోహదపడుతుంది. ఈ సంతానం వాణిజ్య ఉత్పత్తికే కాకుండా అంతః ప్రజననానికి, వరణం ద్వారా ఉన్న జాతుల కంటే మేలైన స్థిర ప్రజననాలను (stable breeds) అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకు పంజాబ్లో బికనీర్ యూస్ (Bikaneer ewes), మరీనో రామ్స్ (Marino rams) ను సంపర్కం చేసి హిసార్డోల్ (Hisardale అనే కొత్త ప్రజనన గొర్రెను అభివృద్ధి చేసారు.

3. అంతర జాతి సంకరణం (Interspecific hybridisation): ఈ పద్ధతిలో వేరువేరు దగ్గరి ప్రజాతులకు చెందిన మగ, ఆడజీవుల మధ్య సంపర్కం జరుగుతుంది. దీని సంతతి రెండు జనకుల ఐచ్ఛిక లక్షణాలు కలిగి ఉండి వాటి జనకులకు భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు ఒక మగ గాడిద (jack/ass) ను ఒక ఆడ గుర్రం (mare) తో సంపర్కం జరపగా వంధ్య మ్యూల్ (mule) జన్మిస్తుంది. అలాగే మగ గుర్రాన్ని (stallion) ఆడ గాడిద (jennet) తో సంపర్కం చేయగా వంధ్య హిన్ని (Hinny) పుడుతుంది. మ్యూల్ చాలా ఆర్థిక విలువలు కలిగి ఉంది.

ప్రశ్న 2.
ECG నుంచి క్లినికల్ అనుమతులను సవివరంగా వివరించండి.
జవాబు:
ECG అంటే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ లేదా ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ అని అర్థం. ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ గుండెలో కలిగే విద్యుత్ మార్పులను నమోదు చేయడానికి సాధారణంగా వాడే హానిలేని పద్ధతి. ECG హార్థిక వలయంలో జరిగి విద్యుత్ వలయాలకు సంబంధించిన వరుస తరంగాలను చూపిస్తుంది.
ఒక సాధారణ ECG వీటిని కలిగి ఉంటుంది.

  1. తరంగాలు
  2. అంతరాలు
  3. భాగం
  4. సంక్షిప్తాలు.

i) తరంగాలు: సాధారణ ECG లో నమోదు అయ్యే తరంగాలు వరుసగా P, Q, R, S, T. ఒక సాధారణ హృదయ స్పందన వల్ల ఏర్పడే ECG లో ఒక P తరంగం, ఒక QRS సంక్లిష్టం, ఒక T తరంగం ఉంటాయి.

P తరంగం: ఇది కర్ణికా విదృవణాన్ని లేదా కర్ణికా సంకోచాన్ని సూచిస్తుంది. కర్ణిక గుండా కదిలే ప్రేరణ P తరంగం చూపిస్తుంది. P తరంగం కాలవ్యవధి 0.1 సెకను.
“QRS” సంక్లిష్టం: ఇది జఠరికా సంకోచాన్ని సూచిస్తుంది. Q తరంగం ఒక చిన్న ఋణ తరంగం, R తరంగం ఒక పెద్ద ధన తరంగం, S తరంగం ఋణ తరంగం. QRS తరంగం కాలవ్యవధి 0.08 నుంచి 0.1 సెకన్లు.

T తరంగం: ఇది జఠరికా పునఃదృవణాన్ని తెలియజేస్తుంది. దీని కాలవ్యవధి 0.2 సెకన్లు.

ii) అంతరాలు:
P – R అంతరం: P తరంగం ప్రారంభానికి, Q తరంగం ప్రారంభానికి మధ్య అంతరం. P – R అంతరం సాధారణంగా 0.12 – 0.2 సెకన్లు ఉంటుంది.
Q-T అంతరం: Q తరంగం ప్రారంభానికి, T-తరంగం అంతరానికి మధ్య ఉంటుంది. ఇది జఠరికా కండరాల విద్యుత్ క్రియాశీలతను తెలియజేస్తుంది. దీని అవధి 0.4 సెకన్లు.
R- R అంతరం: ఒక హార్థిక వలయ కాలవ్యవధిని తెలియజేస్తుంది. ఇది 0.8 సెకనులలో ముగుస్తుంది.

iii) భాగం మండాలు: S – T ఖండం S తరంగం అంతానికి T-తరంగ ప్రారంభానికి మధ్య ఉంటుంది. ఇది సమవిద్యుత్ శూన్య ఓల్టేజ్ కాలం.

ECG క్లినికల్ అనుమతులు:
1) పెరిగిన P తరంగం, పెద్దదైన/పెరిగిన కర్ణికను సూచిస్తుంది.

2) QRS సంక్లిష్టంలో కాలావధి, డోలన పరిమితి, స్వరూపంలో కలిగే వైవిధ్యాలు బండిల్ శాఖా అవరోధం అవ్యవస్థతను తెలియజేస్తుంది. (బండిల్ ఆఫీస్ శాఖలు ద్వారా జరిగే ప్రసరణ వహనంలో అవరోధాలు).

3) P-R అంతరం కాలావధి పెరిగినట్లయితే సిరాకర్ణికా కణపు (లయారంభకం) నుంచి కర్ణికా జఠరికా కణపు (A-V node) కు జరిగే ప్రసరణ వహనపు ఆలస్యాన్ని సూచిస్తుంది. బ్రాడీకార్డియాలో (హృదయస్పందన రేటు తక్కువగా ఉండటం) P-R అంతరం ఎక్కువగా టాకీకార్డియా (హృదయస్పందన రేటు వేగంగా ఉండటం) లో P-R అంతరం తక్కువగా ఉండటం జరుగుతుంది.

4) Q-T అంతరం ఎక్కువసేపు ఉన్నట్లయితే ‘మయోకార్డియల్ ఇన్ఫార్గాన్’ (గుండెపోటు)ను, హైపోథైరాయిడిజమ్ న్ను సూచిస్తుంది. Q-T అంతరం తక్కువగా ఉంటే ‘హైపర్ కాల్సీమియా’ (రక్తంలో కాల్షియం అయానులు అధికంగా ఉండటం) ను సూచిస్తుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం

5) S-T ఖండం పెరిగినట్లయితే ‘మయోకార్డియల్ ఇన్ఫారన్ (గుండెపోటు)ను సూచిస్తుంది.

6) ఎత్తైన T – తరంగం ‘హైపర్ కాలీమియా’ (రక్తంలో అధిక పొటాషియం)ను చిన్న చదునైన లేదా తిరగబడిన T-తరంగం హైపోకాలీమియా (రక్తంలో తక్కువ పొటాషియం)ను సూచిస్తుంది.