AP SSC 10th Class Hindi Solutions उपवाचक Chapter 4 अनोखा उपाय

AP State Board Syllabus AP SSC 10th Class Hindi Textbook Solutions उपवाचक Chapter 4 अनोखा उपाय Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Hindi Solutions उपवाचक Chapter 4 अनोखा उपाय

10th Class Hindi उपवाचक Chapter 4 अनोखा उपाय Textbook Questions and Answers

प्रश्न 1.
राजा कुमारवर्मा के राज्य में अकाल की स्थिति क्यों उत्पन्न हुई होगी?
उत्तर:
अकाल की स्थिति तो प्रकृति से संबंधित अंश है। अकाल की स्थिति का कारण वर्षा की कमी है। यदि वर्षा की कमी हो या वर्षा बराबर नहीं हो तो अकाल की स्थिति उत्पन्न होगी। इसी कारण राजा कुमारवर्मा के राज्य में अकाल की स्थिति उत्पन्न हुई होगी।

प्रश्न 2.
अकाल की समस्या के निवारण के लिए राजा ने क्या-क्या उपाय सोचे होंगे?
उत्तर:
राजा कुमार वर्मा ने अकाल की समस्या के निवारण के लिए कई बुद्धिमानों और विद्वानों को बुलवाया होगा। राजभंडार का अनाज प्रजा में बाँट दिया होगा। अडोस – पडोस के राज्यों से अनाज़ उधार लिये होंगे। सभी तरह से खुशहाल किसी राज्य के राजा से, वहाँ के शासन नियमों के पता प्राप्त करने भेंट किये होंगे।

AP SSC 10th Class Hindi Solutions उपवाचक Chapter 4 अनोखा उपाय

प्रश्न 3.
राजा कुमारवर्मा की जगह पर यदि तुम होते तो अकाल की समस्या से कैसे जूझते?
उत्तर:
राजा कुमारवर्मा की जगह पर यदि मैं होता तो अकाल की समस्या से इस प्रकार जूडता :

  • राज्य के धान्यागार में से धान लेकर सबको बाँट दूँ।
  • अडोस – पडोस के राज्यों के राजाओं से धन – धान्य आदि उदार लेकर जनता में बाँट दूँ।
  • नीतिशास्त्र, धर्मशास्त्र आदि को पढ़कर समस्या को हल करने का प्रयत्न करूँ।
  • नीति कोविद, धर्मकोविद, ज्योतिष्य कोविदों को बुलाकर उनसे अकाल के कारणों के बारे में चर्चा करता।
  • वेदों में लिखा गया है कि यज्ञ यागादि कार्य करने से अकाल की स्थिति दूर होगी। – इस कथन के अनुसार मैं यज्ञ यागादि कार्यक्रम करता।
  • शास्त्र, सांकेतिक वैज्ञानिकता की सहायता से मेघ मदन कार्यक्रम करता।

अनोखा उपाय Summary in English

Once there was a king named Kumara Varma who ruled over the kingdom Harithanagar. He was a good administrator. During his reign, his kingdom flourished well and the people lived happily.

Once a severe famine broke out in the kingdom. The harvests in the kingdom dried up. The ponds, as well as the lakes, dried up. Even the two perennial rivers in the kingdom became small gutters.

There was no fodder for the cattle. Many formers started selling their cattle at cheaper prices. In such a situation the king distributed the grain in the treasury to the people. He borrowed the grain from the neighbouring kingdoms. Yet, he couldn’t find a solution.

“All the neighbouring kingdoms are green and prosperous. The people in those kingdoms are leading a comfortable and happy life. Why all this is happening in my kingdom? What is the reason for it? How can I solve this problem?” – These questions role in the King’s heart. He was deeply moved to see the plight of the kingdom.

He held a meeting with the learned, the scholars, and the geniuses in the kingdom and asked them to find out a solution for the problem.

They advised : “Your Magesty! please visit the best ever kingdom and meet the king there. Know the legislative policies of the administration followed in that kingdom. Take up the reforms in administrative methods existed here, based on them. Through this, the conditions of the kindgom will be set right.”

The King Kumara Varma liked this suggestion. Immediately he decided to meet Satya Sinh, the king of his neighbouring kingdom. He sent a message by his servants to Satya Sinh revealing that the people in his kingdom were facing difficulties due to server famine conditions. He wanted to visit thier kingdom to know the policies adopted there and to seek an advice to solve the problem.

Invited by him, Kumara Varma visited the kingdom of Satya Sinh and received a royal welcome. Kumara Varma was amazed to see that kingdom. The water bodies on the four sides and the rivers appeared to the full. The fields were green with harvests. The groves were full of flowers and fruits. He was overjoyed to see the pleasant atmosphere prevailed there.

AP SSC 10th Class Hindi Solutions उपवाचक Chapter 4 अनोखा उपाय

He said to Satya Sinh, “Friend! Your kingdom is not less than a paradise. You are following good methods unknown to me. It is the reason why your people are living happily. I too want my people to live contentedly. Please advise me concerning good governance.”

Satya Sinh replied, “O king! Don’t implore me. A person who committed a mistake has no right to give guidance to others. I will relate an incident to you. Once I was wandering in the garden accompanied by my bodyguards. At the very moment, I had to meet my royal mother on an urgent matter. I ordered my bodyguards to stay there until I come. Later I forget about them. The following day it rained heavily. Suddenly I remembered them and went to the garden. They got drenched fully and were still waiting for me. As it was my fault, I have no right to give you advice. Hence, forgive me.” Kumara Varma was astounded to hear his words.

Then he met the royal mother and said that he needed a guiding hand in respect of good governance.

She said, “Son! To be frank, I too am faulty. Once my son presented his wife with a beautiful jewel. I was greedy for it. It’s not good on the part of a royal mother to have greed for jewels. I’m not deserved as I committed such a mistake”.

Kumara Varma later met royal preceptor and sought his advice regarding good governance.

Then the royal preceptor said, “O King ! Forgive me. I’m not deserved for it. Once a scholar came to our kingdom from a faraway country and wanted to visit our king. I had to tell the king that he was a great scholar, as there was no time to test his erudition. The king relied on my words and presented him with many gifts. Later I came to know that he was not such an erudite and he was a common scholar. Because of my sloth, I could not guide our king in a proper way. Hence, I’m not deserved”.

The king Kumara Varma sank in thoughts. He learnt a lesson from these three incidents that one should not commit even a small mistake. If one committed any mistake, one should rectify it. He followed this lesson. Within no time his kingdom achieved progress and the people lived happily ever after.

AP SSC 10th Class Hindi Solutions उपवाचक Chapter 4 अनोखा उपाय

This story was extracted from ‘Bangaru Kundelu’ written by a renowned Telugu writer late Sri Ravuri Bhradwaja who won Jnanpith Award for the year 2012. Sri Syed Mateen Ahmed translated this story into Hindi.

अनोखा उपाय Summary in Telugu

చాలా సంవత్సరాల క్రితం నాటి మాట. ఒక రాజ్యం ఉండేది. దాని పేరు హరిత నగరం. హరిత నగరం రాజుగారు కుమారవర్మ. అతడు మంచి పరిపాలకుడు. కుమార వర్మ పరిపాలనా కాలంలో రాజ్యం పచ్చగా ఉంది. కానీ ఒకసారి రాజ్యం మొత్తం పంటలు ఎండిపోయాయి. చెరువులు – కుంటలు ఎండిపోయాయి. కేవలం రెండే రెండు జీవనదులు మిగిలిపోయాయి. అవి కూడా చిన్న – చిన్న కాలువల్లా తయారయ్యాయి.

రాజ్యంలో పశువులకు మేత దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. చాలా మంది రైతులు తమ పశువులను చౌక ధరలకు అమ్మివేయడం ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజభండాగారంలోని ధాన్యాన్ని రాజుగారు ప్రజలకు పంచి పెట్టడం ఆరంభించిరి. ఇరుగు – పొరుగు రాజ్యాల నుండి ధాన్యాన్ని అప్పుగా తీసుకోవడం ప్రారంభించిరి. కానీ రాజుగారికి భవిష్యత్తుపై దిగులు బాధిస్తోంది. రాజుగారు ఉత్పన్నమైన ఈ పరిస్థితులను గురించి గంభీరంగా ఆలోచించసాగిరి. కానీ దీనికి పరిష్కారం లభించలేదు. “ఇరుగు-పొరుగు రాజ్యాలన్నీ పచ్చగా ఉన్నాయి. అక్కడి ప్రజలంతా సుఖంగా ఉన్నారు. కానీ మన రాజ్యంలోనే ఇలా ఎందుకు జరుగుతున్నది? దీనికి కారణం ఏమిటి? ఈ సమస్యను ఎలా పరిష్కరించడం?” – అని రాజుగారి మనస్సులో ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

రాజుగారు కుమారవర్మ ఈ సమస్యను పరిష్కరించుటకు, బుద్ధిమంతులను, విద్వాంసులను, పరిస్థితులను క్షుణ్ణంగా అర్థం చేసుకుని జవాబు చెప్పగల మేధావులను పిలిపించారు.

వారి చర్చలో కొంత మంది బుద్ధిమంతులు “ఓ మహారాజా, తప్పులు చాలా రకాలుగా ఉంటాయి. కొన్ని తప్పులు సరళంగానే గుర్తించబడతాయి, కొన్ని తప్పులను గుర్తించలేం! – అని చెప్పిరి. కొంత మంది “ఓ రాజా! కొన్ని తప్పుల (పొరపాట్లు) కు సంకేతాలు ఉంటాయి. మరికొన్ని తప్పులకు సంకేతాలు ఉండవు అని చెప్పిరి.

కొంత మంది విద్వాంసులు- ఓ ప్రభూ! కొన్ని తప్పులు (పొరపాట్లు) సంస్కరణల రూపంలో ఏర్పడతాయి. మరికొన్ని సంస్కరణలే తప్పులుగా మారతాయి. ఇలాంటిదే ఏదో తెలిసీ – తెలియని విషయం దాగి ఉండవచ్చు. అందువలననే ఈ రోజున మన రాజ్యంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడినది” అని చెప్పిరి.

అప్పుడు రాజుగారు కుమారవర్మ “అలా అయితే మీరే చెప్పండి. ఇప్పుడు నన్ను ఏమి చేయమంటారు?” అని వారిని అడిగెను.

అందరూ తర్జన – భర్జన చేసి రాజుగారికి ఈ సలహా ఇచ్చి – “అన్ని విధాలా సుభిక్షితంగా ఉన్న రాజ్యంలోని రాజుగారిని కలవండి. అక్కడి పరిపాలనా నియమాలను తెలుసుకోండి. వాటి ఆధారంగా ఇక్కడి పరిపాలనా విధానాలలో మార్పులు (సంస్కరణలు) తీసుకురండి. దీని ద్వారా రాజ్యంలోని పరిస్థితులు చక్కబడతాయి”.

AP SSC 10th Class Hindi Solutions उपवाचक Chapter 4 अनोखा उपाय

రాజుగారైన కుమారవర్మకు ఈ సలహా చాలా బాగా నచ్చింది. ఆయన వెంటనే తన పొరుగు రాజ్యపు రాజుగారైన సత్యసింహను కలవడానికి నిర్ణయించుకుని తన సేవకుల ద్వారా ఆ రాజుగారికి సందేశం ఈ విధంగా పంపెను“రాజాధిరాజు, మహారాజు అయిన సత్యసింహనకు సాదర నమస్కారములు. మా రాజ్యంలో కరువు కాటకాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించుటకు మీ ఉచిత సలహా మరియు మీ శాసన నియమాలను తెలుసుకొనుటకు మేము మీ రాజ్యం దర్శించాలని కోరుకుంటున్నాము. మీరు నా కోరికను మన్నిస్తారని ఆశిస్తున్నాను.”

దానికి ప్రత్యుత్తరంగా మహారాజు సత్యసింహ్ తన సందేశం ఈ విధంగా పంపెను. “మీరు – నేను ఇరుగు-పొరుగు రాజులం. ఏదేని ఒక సమస్య విషయంలో ఒకరినొకరు పరస్పరం సహాయం చేసుకోవడం మన కర్తవ్యం. మా రాజ్యానికి మీకు సాదర స్వాగతం. మీరు మా ఆత్మీయ ఆదరణీయ అతిథులు. అతిథి రూపంలో మిమ్ములను సత్కరించు సౌభాగ్యం మాకు కల్గుచున్నందులకు, మేము మీకు కృతజ్ఞులం.”

ఈ ప్రత్యుత్తరం చదవగానే రాజుగారైన కుమారవర్మకు తన రాజ్యానికి సంబంధించిన కరువు కాటకాల సమస్యకు పరిష్కారం కొంతవరకు దొరికినట్లు భావించిరి. అయినప్పటికీ రాజుగారు పొరుగున ఉన్న రాజ్యాన్ని సందర్శించి ఆ రాజును కలుచుట కోరుకొనెను.

చూస్తూ చూస్తుండగానే ఆ రోజు రానే వచ్చింది. రాజుగారైన కుమారవర్మకు పొరుగు రాజ్యం నుండి భవ్యమైన స్వాగతం లభించినది. రాజ్యాన్ని చూసి రాజుగారు ఆశ్చర్యచకితులైరి. నాలుగువైపులా జలాశయాలు నిండుగా ఉన్నవి. నదులన్నీ నిండుగా ఉన్నవి. కాలువలు ప్రవహిస్తూ ఉన్నవి. చల్లని గాలులు వీస్తూ ఉన్నవి. పంట పొలాలన్నీ పచ్చని పైరు పంటలతో నిండుగా ఉన్నాయి. పూల సుగంధం అంతటా వ్యాపిస్తోంది. తోటలన్నీ పండ్లు – పూలతో నిండుగా ఉన్నాయి. వీటన్నిటినీ చూడగానే రాజుగారి మనస్సు అవధులు లేని సంతోషంతో నిండిపోయినది.

మహారాజు కుమారవర్మ మహారాజుగారైన సత్యసింహను కలిసిరి. “మిత్రమా, మీ రాజ్యం ఏ స్వర్గానికి తక్కువ లేదు. నాకు తెలియని శాసన నియమాలను మీరు పాటించుచున్నట్లు ఉన్నారు అని నాకు అన్పించుచున్నది. అందువలననే మీ ప్రజలందరూ సుఖంగా ఉన్నారు. నేను కూడా మా దేశ ప్రజలను సుఖంగా చూడదలచుచున్నాను. దయచేసి మీరు నాకు సుపరిపాలన హితోపదేశం చేయండి”- అని కుమారవర్మ, సత్యసింహను కోరిరి.

మహారాజుగారైన సత్యసింహలవారు మొదట తిరస్కరించిరి. కానీ రాజుగారైన కుమారవర్మగారి ప్రార్థన మీదట ఆయన ఈ విధంగా బదులిచ్చిరి ” లేదు మహారాజా, నన్ను అభ్యర్థించవద్దు. నేను దోషిని. దోషి అయిన వానికి హితోపదేశం చేసే హక్కు లేదు. నేను మీకు ఒక సంఘటన వినిపిస్తాను. నేను ఒకసారి నా అంగరక్షకునితో ఇదే విధంగా తోటలో విహరిస్తూ ఉన్నాను. అప్పుడే నేను రాజమాతతో అత్యవసర విషయమై మాట్లాడుటకు వెళ్ళవలసి వచ్చినది. నేను తిరిగి వచ్చేవరకు అంగరక్షకులను అక్కడే నిలబడి ఉండమని ఆదేశించితిని. రాజమాతతో మాట్లాడుతూ- మాట్లాడుతుండగా రాత్రి అయిపోయినది. అక్కడే నేను భోజనం చేసి నిద్రించితిని. మరుసటి రోజు ఉదయం లేచి చూడగా బాగా వర్షం కురియుచున్నది. నేను తోటలోకి వెళ్ళి చూడగా అంగరక్షకులు అక్కడే నిలబడి తడచిపోతూ ఉండడం గమనించితిని.

AP SSC 10th Class Hindi Solutions उपवाचक Chapter 4 अनोखा उपाय

నేను మాటల్లో అంగరక్షకులను మరచిపోయినంతగా నిమగ్నమైయున్నాను. వాళ్ళను వెళ్ళిపొమ్మని కూడా చెప్పలేనంతగా మాటల్లో మునిగిపోతిని. ఇది నేను చేసిన తప్పు. అందువలన అలా తప్పు చేసిన రాజుకు హితోపదేశం చేయు హక్కు లేదు. నన్ను క్షమించండి.”

రాజుగారైన కుమారవర్మ మహారాజు సత్యసింహ్ చెప్పిన విషయాన్ని సంఘటనను) పూర్తి ధ్యాసతో విన్నారు. రాజమాత గారే తనకు హితోపదేశం చేయగలరని అనుకుని ఆయన రాజమాత దర్శనం చేసుకొని వారిని హితోపదేశం చేయవలసినదిగా కోరిరి.

“కుమారా! నిజం చెప్పవలెనన్న నేను కూడా దోషినే. ఒకసారి నా కుమారుడు తన భార్యకు ఒక అందమైన నగ తయారుచేయించి ఇచ్చెను. నా మనస్సులో ఆ నగ పట్ల దురాశ కలిగినది. నేను నా కుమారుడిని లేదా నా కోడల్ని ఆ నగ ఇమ్మని అడిగినట్లయితే వారెప్పటికీ కాదనరు. ఒక రాజమాతకు నగల పట్ల వ్యా మోహం ఉండడం తప్పు. వేరొకరి వస్తువు పట్ల దురాశ కలగడం తప్పు. అలాంటి తప్పు చేసిన నేను నీకు హితోపదేశం చేసేంత యోగ్యురాలిని కాను”అని రాజుగారైన కుమారవర్మతో రాజమాత చెప్పినది. (రాజా సత్యసింహ గారి తల్లి.)

రాజుగారైన కుమారవర్మ ఆశ్చర్యచకితులైరి. తదుపరి రాజగురువును కలిసి తనకు హితోపదేశం చేయవలసినదిగా కోరిరి.

అప్పుడు రాజగురువుగారు ఇట్లు అనిరి – “మహారాజా నన్ను క్షమించండి. నేను దీనికి యోగ్యుడను కాను. ఒకసారి సుదూర దేశం నుండి ఒక పండితుడు విచ్చేసెను. ఆయన రాజ దర్శనాన్ని కోరెను. అతని పాండిత్యాన్ని పరీక్షించే సమయం లేకపోవడం వల్ల నేను రాజుగారతో అతడు చాలా గొప్ప పండితుడు అని చెప్పాను. రాజుగారు నా పై అంతులేని నమ్మకాన్ని ఉంచుతారు. ఆయన పండితునికి కుప్పలు – తెప్పలుగా బహుమతి ఇచ్చి పంపారు. ముందు ముందు నాకు ఆ పండితునికి అంత పాండిత్యం లేదని సాధారణ పండితుడు మాత్రమేనని తెలిసినది. నా సోమరితనం వల్ల నేను రాజుగారికి తగిన మార్గదర్శకత్వం చేయలేకపోయాను. అలాంటి తప్పు చేసిన నేను నీకు హితోపదేశం చేయగల యోగ్యుడను కాను.”

కుమారవర్మగారు చాలా ఆలోచనలో మునిగిరి. ఈ మూడు సంఘటనల ఆధారంగా తను చిన్న – చిన్న తప్పులు కూడా చేయరాదన్న గుణపాఠం నేర్చుకొనిరి. ఏదైనా తప్పు జరిగితే దానిని సరిదిద్దవలెనని అనుకొనెను. రాజుగారు ఈ గుణపాఠాన్ని పాటించిరి. కొద్దిరోజుల్లోనే తన రాజ్యం తిరిగి సస్యశ్యామలమైనది. సుఖసంతోషాలతో నిండిపోయినది.

(2012 సంవత్సరమునకు జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన స్వర్గీయ శ్రీ రావూరి భరద్వాజ గారు తెలుగులోని ఒక గొప్ప ప్రసిద్ది చెందిన రచయిత. ప్రస్తుత ఈ కథ ఆయన రచించిన బంగారు కుందేలులో నుండి గ్రహించబడినది. దీనిని శ్రీ సయ్యద్ మతీన్ అహ్మద్ గారు హిందీలోనికి అనువదించిరి.)