AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం
AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 7th Lesson మా ప్రయత్నం
10th Class Telugu 7th Lesson మా ప్రయత్నం 2 Marks Important Questions and Answers
ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
పీఠిక అంటే ఏమిటి? వివరించండి. (June 2017)
(లేదా)
‘పీఠిక’ సాహిత్య ప్రక్రియను వివరింపుము. (March 2017)
ఒక పుస్తకం యొక్క తాత్త్వికతను, అంతస్సారాన్ని తెలియజేసే దానిని ‘ముందుమాట’ లేదా ‘పీఠిక’ అంటారు గదా ! ‘పీఠిక’ ప్రక్రియ గురించి వ్రాయండి. (March 2019)
జవాబు:
ఒక గ్రంథాన్నీ, గ్రంథ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ వ్రాసే ముందుమాటను పీఠిక అంటారు. దీనిని రచయిత కానీ, విమర్శకుడు కానీ, వేరే వ్యక్తి కానీ వ్రాయవచ్చు.
పీఠికకు ముందుమాట, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం అని కూడా అంటారు.
ప్రశ్న 2.
‘మహిళావరణం’ అనే పుస్తకానికి రచయిత్రులు రాసిన ‘పీఠిక’ ప్రక్రియ వివరించండి. (S.A. I – 2018-19)
(లేదా)
మా ప్రయత్నం పాఠ్యాంశ ప్రక్రియను రాయండి. (S.A. I – 2019-20)
జవాబు:
ఒక గ్రంథాన్నీ, గ్రంథ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ వ్రాసే ముందుమాటను పీఠిక అంటారు. దీనిని రచయిత కానీ, విమర్శకుడు కానీ, వేరే వ్యక్తి కానీ వ్రాయవచ్చు.
పీఠికకు ముందుమాట, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం అని కూడా అంటారు.
ప్రశ్న 3.
ఓల్గా గారి గురించి వ్రాయండి.
జవాబు:
ఈమె ప్రముఖ స్త్రీవాద రచయిత్రి. ఈమే తన కథలు, కవితలు, నవలలతో తెలుగు సాహిత్యంలో స్త్రీవాద ఉద్యమానికి ఉత్తేజాన్ని అందించింది. ఈమె ఎన్నో పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. అనేక పురస్కారాలు, అవార్డులను ఆమె అందుకొన్నారు.
ప్రశ్న 4.
వసంత కన్నబిరాన్ గురించి వ్రాయండి.
జవాబు:
ఈమె 1930లో హైదరాబాద్ లో జన్మించారు. ఈమె ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేశారు. మానవహక్కులు, స్త్రీ సమానత్వం కోసం ఆమె కృషి చేస్తున్నారు. ఆమె “నేషనల్ అలయెన్స్ ఆఫ్ ఉమెన్”, “ఇండియన్ నేషనల్ సోషల్ యాక్షన్ ఫోరం”లో పనిచేస్తున్నారు.
ప్రశ్న 5.
కల్పన కన్నబిరాన్ గురించి వ్రాయండి.
జవాబు:
ప్రముఖ న్యాయవాది కె.జి. కన్నబిరాన్, రచయిత్రి వసంత కన్నబిరాన్ల కుమార్తె కన్నబిరాన్. ఈమె హైదరాబాద్లోని ‘సెంటర్ ఫర్ నేషనల్ డెవలప్ మెంట్’ కు సంచాలకులుగా పనిచేస్తున్నారు. సామాజిక న్యాయం, సామాజిక ఉద్యమాలలో క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘జెండర్ స్టడీస్’, ‘క్రిమినల్ లా’లో విస్తృత అధ్యయనం, పరిశోధనలు చేశారు. చాలా విలువైన గ్రంథాలు రాశారు.
10th Class Telugu 7th Lesson మా ప్రయత్నం 4 Marks Important Questions and Answers
ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
“స్త్రీలు ప్రధానమైన చరిత్ర నిర్మాతలు” అని రచయిత్రులు భావించడానికి గల కారణాలను ‘మా ప్రయత్నం’ పాఠం ఆధారంగా వివరించండి. (June 2018)
జవాబు:
- కొత్త కాలంలోకి అడుగు పెడుతున్న కాలంలో గడచిన కాలాన్ని గుర్తుకు తెచ్చుకొని భవిష్యత్తుపై ఒక అంచనాకు రావటం సహజం.
- గత శతాబ్దపు సామాజిక మార్పులలో, అభివృద్ధిలో స్త్రీల భాగస్వామ్యాన్ని గురించి ఆలోచించిన రచయిత్రులకు చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావం కలిగింది.
- గడచిన శతాబ్దంలో స్త్రీలు చేసిన పోరాటాలూ, వారు నడిపిన ఉద్యమాలూ, రాణించిన రంగాలు ఎన్నో ఉండటమే ఆ భావనకు ప్రధాన కారణం.
- మొదటిసారి చదువుకొన్న స్త్రీలు, మొదటి వితంతు వివాహం చేసుకొనే సాహసం చేసిన స్త్రీలు, స్త్రీ విద్య కోసం పాటుపడినవారు, ఉద్యమాలలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళేందుకు తెగించిన స్త్రీలు, కళారంగంలో తొలిసారి కాలుమోపిన మహిళలు, మొదటి తరం డాక్టర్లూ, శాస్త్రవేత్తలూ – వారు చేసిన పోరాటాలు రచయిత్రుల భావాన్ని బలపరిచాయి.
- స్త్రీలకు తగిన గుర్తింపు లభించలేదని, సంప్రదాయ చరిత్రకారులు స్త్రీలకు తగిన ప్రాధాన్యం, ప్రాతినిధ్యం ఇవ్వలేదని రచయిత్రులు భావించారు.
- చరిత్ర అనే జగన్నాథ రథ చక్రాల క్రింద నలిగిపోయినందున చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు లభించలేదని, కానీ, ప్రధాన చరిత్ర నిర్మాతలుగా వారిది తిరుగులేని స్థానమని రచయిత్రులు భావించారు.
ప్రశ్న 2.
“మహిళావరణం” పుస్తక రూపకల్పనలో రచయిత్రులు పడిన శ్రమను, పొందిన అనుభవాలను తెల్పండి. (March 2018)
జవాబు:
1) గడచిన శతాబ్దంలో సామాజికాభివృద్ధిలో, సామాజిక మార్పులలో, స్త్రీల యొక్క భాగస్వామ్యం గురించి ఆలోచించిన – ఓల్గా తదితర స్త్రీవాద రచయితల ముందుకు ఎన్నో విషయాలు వచ్చాయి. గడచిన శతాబ్దంలో చాలా అంశాలలో స్త్రీల భాగస్వామ్యం అధికంగా ఉందని చరిత్ర నిర్మాతలుగా వారిది తిరుగులేని స్థానమని రచయిత్రులు భావించారు.
2) ఆ విషయాన్ని సాధికారికంగా, సోదాహరణంగా నిరూపించటానికి రచయిత్రులు ఒక పుస్తకాన్ని తీసుకురావాలను కొన్నారు. అలా “మహిళావరణం” పుస్తక రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో వారెన్నో కష్టాలనెదుర్కొన్నారు. ఒళ్ళు పులకించే అనుభవాలను పొందారు.
3) గడచిన శతాబ్దంలో స్త్రీలు చేసిన పోరాటాలు, రాణించిన రంగాలు ఎన్నో ఉన్నాయి. ఆ స్త్రీలను అందరినీ ఒకచోట చేర్చటం రచయిత్రులకెంతో ఉత్సాహాన్నిచ్చింది. ఇంతమంది స్త్రీలను ఒకే చోట చూడటం వలన, స్త్రీలు వెనుకబడిపోయారనే భావంతో ఉన్న రచయిత్రులకు కనువిప్పు కలిగింది. ఒక చైతన్య ప్రవాహంగా స్త్రీలను వాళ్ళు చూడగలిగారు.
4) ఎక్కడో ఒకచోట కొంతమంది స్త్రీలను గురించి చదవటానికి, ఒకేసారి వందమందికి పైగా స్త్రీలను, వివిధరంగాలలో వారు చేసిన కృషిని, సాధించిన విజయాలను తెలుసుకోవటానికి గల తేడాను, అనుభూతిలో గల భేదాన్ని రచయిత్రులు గ్రహించారు.
5) చరిత్రను నిర్మించడానికి ఆనాటి స్త్రీలు ఎంత మూల్యం చెల్లించారో తలచుకొంటే రచయిత్రుల గుండెలు బరువెక్కాయి. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఎంతో శ్రమకోర్చి. రచయిత్రులు ఈ “మహిళావరణం” పుస్తకాన్ని రూపొందించారనటం అక్షర సత్యం.
ప్రశ్న 3.
సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు ఎందుకు గుర్తింపు లభించదో వివరించండి.
జవాబు:
చరిత్ర రచయితలకు, స్త్రీలను గూర్చి, వారు చేసిన కృషిని గురించి, అంతగా గౌరవమూ, శ్రద్ధ లేకపోవడం వల్లనే, స్త్రీలు చరిత్రలో ఎక్కకపోవడానికి కారణం అయి ఉంటుంది. చరిత్ర అనే జగన్నాథ రథచక్రాల క్రింద, ఆ స్త్రీల యొక్క ఉనికి, ముక్కలయ్యింది.
అదీగాక చరిత్రకారులకు, స్త్రీలపై చిన్నచూపు ఉండడం కూడా అందుకు కారణం అయి ఉంటుంది. చరిత్రకారుడికి ఆ స్త్రీలను గూర్చి అంతగా వివరంగా తెలియకపోవడం కూడా ఒక కారణం అయి ఉంటుంది. అందుకే సంప్రదాయ చరిత్ర రచయితలు స్త్రీలను చరిత్రలో అక్కడక్కడ పౌడర్ అద్దుతారు. బాగా ప్రసిద్ధులయిన స్త్రీలను గురించి మాత్రమే ఆ చరిత్రకారులు రాసి ఉంటారు. అదీగాక, ఈనాటి వలె ఆ రోజుల్లో సమాచారం అంతగా తెలిసికోడానికి సాధనాలు కూడా లేవు. అందువల్లనే ఆయారంగాల్లో అక్కడక్కడ కృషి చేసిన స్త్రీల గూర్చి ఆ చరిత్రకారుల దృష్టికి సరిగా వచ్చి ఉండదు. కొంతమంది ఉద్యమ స్త్రీలను గురించి, చరిత్ర రచయిత విని ఉన్నా, ఆ స్త్రీల వివరాలు, వారు చేసిన కృషి, చరిత్రకారుల దృష్టికి వచ్చియుండకపోవచ్చు.
అందువల్లనే సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా పెక్కుమంది స్త్రీలకు గుర్తింపు లభించలేదని మనం గ్రహించాలి.
ప్రశ్న 4.
“మహిళావరణం” శీర్షిక గురించి మీ అభిప్రాయాలు రాయండి.
జవాబు:
గడచిన 20వ శతాబ్దంలో స్త్రీలు ఆయారంగాల్లో కీలకస్థానాల్లో కీలక సమయాలలో పనిచేసి, అక్కడ తమ ముద్రవేసిన వందమంది స్త్రీలను గురించి మహిళావరణం సంపాదకులు ఒక పుస్తకం తీసుకువచ్చారు. ఆ పుస్తకానికి “మహిళావరణం” అని పేరు పెట్టారు. ‘మహిళావరణం’ అంటే, స్త్రీలను వరించడం, అనగా కోరుకోవడం అని భావము. 20వ శతాబ్దంలో విభిన్నరంగాలలో కీలక సమయాల్లో, కీలక స్థానాల్లో పనిచేసిన నారీమణులను, ఈ పుస్తకం సంపాదకులు కోరి వారికి తమ గ్రంథములో చోటు కల్పించారు. వారి దృష్టికి, ఎంతోమంది స్త్రీలు చరిత్రకు ఎక్కవలసినవారు కనిపించారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అందులో కొంతమందినే ఏరి కోరుకొని, ఈ పుస్తకంలో, వారికి, చోటు కల్పించారు.
అంటే ఈ పుస్తకంలోకి ఎక్కిన స్త్రీలు, సంపాదకులు కోరి వరించిన వారన్న మాట. అందుకే ఈ పుస్తకానికి ‘మహిళావరణం’ అని, సంపాదకులు అర్థవంతమైన చక్కని పేరు పెట్టారని నా అభిప్రాయము.
అయితే, ఈ పుస్తకానికి “20వ శతాబ్దపు ప్రసిద్ధ నారీమణులు” అని కూడా పేరుపెట్టవచ్చు. సంపాదకుల దృష్టికి సుప్రసిద్ధ నారీమణులు సుమారు 300 మంది వచ్చారు. వారిలో కేవలం 118 మంది మహిళామణులనే ఏరి కోరుకొని, స్థానం కల్పించారు. అందువల్లనే ‘మహిళావరణం’ అన్న పేరు “సమంజసంగా ఉంది.
ప్రశ్న 5.
చరిత్ర సాగిన క్రమాన్ని ప్రతివాళ్ళూ ఎందుకు ప్రశ్నించారు?
జవాబు:
మహిళావరణం సంపాదకులు, విభిన్నరంగాల్లో విశిష్ట కృషి చేసిన స్త్రీమూర్తులను కలసికొన్నారు. అందులో వారు సరిదె మాణిక్యాంబగారిని కలిసినప్పుడు, వేశ్యాకులం వారిని మొదట ఆడవద్దని ప్రభుత్వం వారు, వారి మాన్యాలను తీసికొన్నారని, కానీ ఇప్పుడు అన్ని కులాలవారు జీవనోపాధి కోసం ఆడుతున్నారనీ, వేశ్యలను నాట్యం చేయవద్దనడం నేరం కదా అని ప్రశ్నించింది.
ఈ విధంగా మాణిక్యాంబగారే కాక, మరెందరో స్త్రీలు చరిత్ర సాగిన క్రమాన్నీ, అందులో స్త్రీలకు జరిగిన అన్యాయాన్నీ ప్రశ్నించారు. ఆ రోజుల్లో స్త్రీలకు ఉన్నత విద్య చదువుకొనే అవకాశం ఉండేది కాదు. స్త్రీలు రేడియో, సినిమా వంటి రంగాల్లో పనిచేయడానికి అవకాశం ఉండేది కాదు.
వితంతు స్త్రీలకు తిరిగి వివాహం చేసుకొనే హక్కు ఉండేది కాదు. అందుకే సాహసవంతులయిన స్త్రీ మూర్తులు నాడు చరిత్ర సాగిన క్రమాన్ని ప్రశ్నించారు.
ప్రశ్న 6.
ప్రతివాళ్ళూ ప్రశ్నించే విధంగా చరిత్ర ఎందుకు సాగింది? దీనికి కారణాలు ఏమిటి? విశ్లేషించండి.
జవాబు:
20వ శతాబ్దం నాటికి సంఘంలో నేడు ఉన్నంత చైతన్యం లేదు. పెద్దవాళ్ళు పాటించిన రీతిలోనే చరిత్ర సాగిపోయేది. స్త్రీలకు బాల్యవివాహాలు ఉండేవి. విధవ వివాహాలు చేసేవారు కారు. స్త్రీలకు అన్నిరంగాల్లోనూ ప్రవేశం ఉండేది కాదు. స్త్రీలు ఉన్నత విద్య చదివే సావకాశం లేదు.
స్త్రీలు బిడియపడుతూ ఉండేవారు. ఆనాడు అంతా మనుధర్మశాస్త్రం ప్రకారం అంటూ, మూఢాచారాలు పాటించేవారు, ఆ రోజుల్లోనే కందుకూరి వీరేశలింగము, రాజ్యలక్ష్మి, విలియం బెంటిక్, రాజారామమోహనరాయ్ వంటి సంఘ సంస్కర్తల ప్రభావంతో సంఘంలో కొంత మార్పు వచ్చింది.
స్త్రీ సహగమనము వంటి దురాచారాలు తగ్గాయి. విధవా పునర్వివాహాలు, సామాన్య స్త్రీలు విద్యాభ్యాసం చెయ్యడం వంటివి సాగించారు. మొత్తంపై ఆ 20వ శతాబ్దంలో మొదట్లో కొన్ని సాంఘిక దురాచారాల వల్ల స్త్రీలు అంతగా రాణించలేకపోయారు.
అందువల్లనే ప్రతివాళ్ళూ ప్రశ్నించే విధంగా నాడు చరిత్ర సాగింది. ఆ స్త్రీలు అందరూ చరిత్రను మార్చటానికి గట్టిగా ప్రయత్నించారు.
ప్రశ్న 7.
చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనడానికి కారణాలను వివరించండి.
జవాబు:
20వ శతాబ్దం సామాజికాభివృద్ధిలో, సామాజిక మార్పులలో, స్త్రీల భాగస్వామ్యాన్ని గూర్చి ఆలోచిస్తే, 20వ శతాబ్దపు చరిత్ర నిర్మాతలుగా, వారికి తిరుగులేని స్థానం ఉందని సంపాదకులకు అనిపించింది.
20వ శతాబ్దంలో స్త్రీలు చేసిన పోరాటాలు, వారు పాలుపంచుకున్న ఉద్యమాలు, రాణించిన రంగాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. అటువంటి స్త్రీలు ఎంతోమంది సంపాదకులకు గుర్తుకు వచ్చారు.
20వ శతాబ్దంలో మొదటిసారి చదువుకున్న స్త్రీలు, ఉద్యమాల్లో చేరి జైలుకు వెళ్ళడానికి సైతం సిద్ధపడిన స్త్రీలు, మొదటగా వితంతు వివాహం చేసుకునేందుకు సాహసించిన స్త్రీలు, స్త్రీ విద్యకోసం ఉద్యమించిన స్త్రీలు, నాటకం, రేడియో, సినిమా రంగాలలో మొదటిసారి అడుగు పెట్టిన స్త్రీలు, మొదటి తరం డాక్టర్లూ, శాస్త్రవేత్తలూ, సంగీత నృత్య కళాకారిణులూ, విద్యావేత్తలూ ఎందరో సంపాదకులకు కనిపించారు. దానితో చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావన సంపాదకులకు కలిగింది.
ప్రశ్న 8.
‘స్త్రీలే ప్రధానమైన చరిత్ర నిర్మాతలు’ – సమర్థించండి.
జవాబు:
20వ శతాబ్దపు సామాజికాభివృద్ధిలో, సామాజిక మార్పులలో, స్త్రీలకు కల భాగస్వామ్యాన్ని గురించి ఆలోచిస్తే, ఎన్నో విషయాలు మహిళావరణం సంపాదకుల ముందుకు వచ్చాయి. 20వ శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా చెప్పవచ్చునని వారికి అనిపించింది. జరిగిన శతాబ్దం చరిత్ర నిర్మాతలుగా, స్త్రీలకు తిరుగులేని స్థానం ఉందని వారికి అనిపించింది.
గడిచిన 20వ శతాబ్దంలో స్త్రీలు చేసిన పోరాటాలు, వారు పాలుపంచుకున్న ఉద్యమాలు, వారు రాణించిన రంగాలు ఎన్నో ఉన్నాయి. 20వ శతాబ్దంలో మొదటిసారి చదువుకున్న స్త్రీలు, మొదటి వితంతు వివాహం చేసుకున్న సాహసురాండ్రు, స్త్రీ విద్య కావాలని, ఉద్యమించిన స్త్రీలు, ఉద్యమాలు చేసి జైలుకు వెళ్ళిన స్త్రీలూ ఉన్నారు. నాటకం, సినిమా, రేడియో, వంటి రంగాలలో స్త్రీలు మొదటిసారిగా 20వ శతాబ్దంలోనే అడుగుపెట్టారు. స్త్రీలలో ఎందరో మొదటితరం డాక్టర్లు, శాస్త్రవేత్తలు, కళాకారిణులు, విద్యాధికులు నాడు ఉన్నారు.
శరీరం పులకరింపజేసే ఎందరో సాహసమూర్తులు, ఆ శతాబ్దంలోనే ఉన్నారు. అందువల్లనే 20వ శతాబ్దంలో స్త్రీలే .. ప్రధానమైన చరిత్ర నిర్మాతలు అని చెప్పవచ్చు.
ప్రశ్న 9.
చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు నిలదొక్కుకొనేందుకు ఎంత కష్టపడి ఉంటారు?
జవాబు:
చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు నిలదొక్కుకోడానికి వారు చాలా కష్టపడి యుంటారు. ఆ విషయం తలచుకోగానే ఈ గ్రంథము సంపాదకులకు గుండెలు బరువెక్కాయట. ఆ స్త్రీలు, వాస్తవ జీవితానికి వ్యతిరేకమైన పరిస్థితులతో పోరాడారు. ఆ స్త్రీలు కొత్త కలలు కనడానికి, కొత్త జీవిత విధానాలు కనుక్కోడానికి, వారు ఎన్నో కఠిన పరీక్షలకు గురి అయ్యారు. మొదటిసారిగా వివాహం చేసుకున్న వితంతువు పరిస్థితి తలచుకొంటే, ఆ సామాన్య స్త్రీల సాహసం అసామాన్యమైనదని, సంపాదకులకు అనిపించింది.
ఉద్యమాలలో చేరి జైలుకు వెళ్ళిన స్త్రీ మూర్తులను, మొదటిసారి సినిమాలలో నటించిన స్త్రీలను చూస్తే వారు ఆనాడు ఎంత సాహసం చేశారో మనకు తెలుస్తుంది. ఆనాడు సమాజంలో స్త్రీలకు నేటి స్వాతంత్ర్యం లేదు. ఎన్నో కట్టుబాట్లు ఉండేవి. ఆ పరిస్థితులలో చరిత్ర నిర్మాతలుగా నిలదొక్కుకోడానికి ఆనాటి స్త్రీలు చాలా కష్టపడి ఉంటారని మనం గ్రహింపవచ్చు.
ప్రశ్న 10.
రచయిత్రుల గుండెలు ఎందుకు బరువెక్కాయి?
జవాబు:
స్త్రీలు దేశం కోసం, తమ కోసం ఒక సమూహంగా చేసిన పోరాటాలకూ, వారు పడిన సంఘర్షణలకూ, వారు సాధించిన విజయాలకూ చరిత్రలో సరైన గుర్తింపు దొరకలేదు. చరిత్ర అనే జగన్నాథ రథచక్రాల కింద వారి సామూహిక ఉనికి ముక్కముక్కలయ్యింది.
మహిళావరణం పుస్తకంలో స్త్రీమూర్తులందరినీ గూర్చి వరుసగా రాయడం జరిగింది. ఆ స్త్రీలందరి గూర్చి చదివేటప్పటికి, వారు సాధించిన విజయాలను గూర్చి తెలిసికొనేటప్పటికి, స్త్రీల చైతన్య ప్రవాహవేగం, జీవం, ఆ ప్రవాహక్రమంలోని మార్పులూ ఈ గ్రంథ సంపాదకులకు ఒక కొత్త విషయాన్ని చెపుతున్నట్లు అనిపించింది.
ఆ స్త్రీలు అందరూ చరిత్ర నిర్మాణానికి ఎంత కష్టపడి ఉంటారో కదా! అని తలచుకొనేటప్పటికి, సంపాదకుల గుండెలు బరువెక్కాయి. ఆ స్త్రీలు వాస్తవ జీవిత ప్రతికూల పరిస్థితులతో తలపడ్డారు. వారు కొత్త కలలు కనడానికీ, కొత్త జీవిత విధానాలు కనుక్కోడానికీ, ఎన్నో కఠిన పరీక్షలకు గురయ్యారు. అవి తలచుకుంటే, ఆ సామాన్య స్త్రీల సాహసం అసామాన్యమైనదని సంపాదకులకు అనిపించింది.
ఆ స్త్రీలు చరిత్రను నిర్మించేందుకు ఎంతగానో కష్టనష్టాలకు గురై ఉంటారని సంపాదకులు అభిప్రాయపడ్డారు.
10th Class Telugu 7th Lesson మా ప్రయత్నం Important Questions and Answers
ప్రశ్న 1.
మహిళల ప్రగతిని వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
ఈనాడు సమాజంలో స్త్రీలు అన్ని రంగాల్లో అగ్రగాములుగా ఉంటున్నారు. చదువుల్లో వారు సరస్వతీమూర్తులుగా మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. వారు విమానాలను నడుపుతున్నారు. మిలటరీలో కూడా చేరి రాణిస్తున్నారు. శాస్త్రవేత్తలుగా ఎన్నో చక్కని పరిశోధనలు చేసి పేరు గడిస్తున్నారు. ఐ.ఎ.యస్, ఐ.పి.యస్ ఆఫీసర్లుగా పరిపాలనా రంగంలో స్త్రీలు చక్కగా రాణిస్తున్నారు.
M.L.Aలుగా, MLC లుగా, MP లుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా, కేంద్రమంత్రులుగా స్త్రీలు చక్కగా రాణిస్తున్నారు. స్త్రీలు గొప్ప పరిపాలనాదక్షలుగా నిరూపించుకున్నారు. నిరూపించుకుంటున్నారు.
ఒకనాడు స్త్రీలు ఉన్నత విద్యారంగంలో ఉండేవారు కాదు. అటువంటిది ఈనాడు స్త్రీలకు ప్రత్యేక కళాశాలలు, విశ్వవిద్యాలయాలు వచ్చాయి. పురుషులతో సమానంగా స్త్రీలు విద్యావంతులై రాణిస్తున్నారు. స్త్రీలలో మంచి డాక్టర్లు, ఇంజనీర్లు నేడు ఉన్నారు. స్త్రీలు పంచాయతీ బోర్డు మెంబర్ల దగ్గర నుండి, దేశ ప్రధానులుగా కూడా తమ పరిపాలనా దక్షతను ప్రదర్శిస్తున్నారు. ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్, సిరిమావో- భండారనాయకే, జయలలిత, మమత వంటి స్త్రీమణులు, మంచి పరిపాలన దక్షలుగా రాణించారు. రాణిస్తున్నారు.
స్త్రీలల్లో మంచి క్రీడాకారిణులు ఉన్నారు. ఉషా, అశ్వినీ వంటి స్త్రీలు, పరుగుపందెంలో రాణించారు. సైనా నెహ్వాల్, సెరెనా విలియమ్స్, హంపి, సానియామీర్జా వంటి క్రీడాకారిణులు వివిధమైన ఆటలలో ప్రపంచంలో మొదటివారుగా ఉన్నారు.
వ్యాపార రంగంలో ఎందరో స్త్రీలు చక్కగా రాణిస్తున్నారు. కిరణ్ బేడీ వంటి మంచి పోలీసు ఆఫీసర్లు స్త్రీలలో ఉన్నారు. ఈ విధంగా స్త్రీలు అన్ని రంగాలలో నేడు ముందంజలో ఉంటున్నారు. నేటి మహిళల ప్రగతికి, 20వ శతాబ్దంలో స్త్రీ విద్యకై పోరాడిన స్త్రీ మూర్తులే కారణం అని మనం ఎప్పుడూ మరువకూడదు.
ప్రశ్న 2.
అత్యున్నత స్థాయికి చేరిన ఒక మహిళ ఆత్మకథ రాయండి.
జవాబు:
నాకు నచ్చిన మహిళ (శ్రీమతి ఇందిరా గాంధీ) : భరతమాత ముద్దుబిడ్డలలో, ఇందిరాగాంధీ ఒకరు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహిళామణులలో, ఇందిర సుప్రసిద్ధురాలు. ఈమె 1917వ సంవత్సరము నవంబరు 19వ తేదీన అలహాబాదులో జవహర్లాల్ నెహ్రూ – కమలా నెహ్రూ దంపతులకు జన్మించింది.
ఇందిర శాంతినికేతన్లో రవీంద్రుని వద్ద చదివింది. ఈమె గొప్ప దేశ భక్తురాలు. ఈమె భర్త ఫిరోజ్ గాంధీ, మహమ్మదీయుడు. ఆ వివాహం ఈమెకు మత సహనాన్ని నేర్పింది. ఈమె తండ్రితో పాటు దేశ విదేశాలు పర్యటించి, రాజనీతి చతురజ్ఞ అయ్యింది.
ఈమె భారతదేశ ప్రధానమంత్రిగా 15 సంవత్సరాలు పనిచేసింది. ఆ కాలంలో ఈమె బ్యాంకులను జాతీయం చేసింది. రాజభరణాలను రద్దు చేసింది. భూ సంస్కరణలను చేపట్టింది. ‘గరీబీ హఠావో’ అని ఈమె ఇచ్చిన నినాదం భారతదేశం అంతటా మారుమ్రోగింది.
ఈమె బడుగువర్గాల ఆశాజ్యోతిగా, దళిత వర్గాల కన్నతల్లిగా పేరు తెచ్చుకొంది. ఈమె గొప్ప సాహసురాలు. గొప్ప రాజనీతిజ్ఞురాలు.
ప్రశ్న 3.
మహిళల పట్ల చూపుతున్న వివక్షను, వారిపై జరుగుతున్న దాడులనూ ఖండిస్తూ నినాదాలు రాయండి.
జవాబు:
- ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి – ఆమెను పువ్వుల్లా చూడండి.
- స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే – స్త్రీలపట్ల వివక్ష విడవండి.
- స్త్రీలు నీకు కన్నతల్లులు, సోదరీమణులు – స్త్రీలను నీవు గౌరవించు.
- స్త్రీలను అవమానించావా! నిర్భయ చట్టానికి లొంగుతావు జాగ్రత్త.
- ఆడపిల్లల జోలికి వస్తే – అడుగంటిపోతావు జాగ్రత్త.
- మహిళలు లక్ష్మీ స్వరూపిణులు, సరస్వతీ స్వరూపిణులు. వారిని గౌరవించండి.
- పార్లమెంటులో స్త్రీలకు రిజర్వేషన్లు కల్పించండి – స్త్రీ పురుష సమానత్వాన్ని గౌరవించండి.
- స్త్రీలపై దాడిచేస్తే – మాడు పగులుగొడతారు జాగ్రత్త.
- ఆడా మగా తేడావద్దు – స్త్రీ పురుష భేదం నేటితో రద్దు.
- భ్రూణహత్యలను నివారించండి – మహిళామణులను ఆదరించండి.
ప్రశ్న 4.
మహిళలను గౌరవించవలసిన ఆవశ్యకతను గురించి వివరిస్తూ, మీ మిత్రునికి లేఖ వ్రాయండి.
జవాబు:
లేఖ, ఒంగోలు, ప్రియమైన స్నేహితుడు శంకరు, నేను క్షేమంగానే ఉన్నాను. అక్కడ మన మిత్రులంతా క్షేమంగా ఉన్నట్లు తలచెదను. స్త్రీలను గౌరవించడం మన భారతీయ ధర్మం కదా ! మొన్న ఒక రోడ్ సైడు రోమియో ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే చూశాను. స్త్రీలు ఆనందించిన చోట దేవతలు ఉంటారు. సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. మన అమ్మ, అక్క, చెల్లి, ఉపాధ్యాయురాలు కూడా స్త్రీయే, స్త్రీలను గౌరవించలేని సమాజం అనాగరిక సమాజం. అందుకే స్త్రీలను గౌరవించాలి. స్త్రీలను హేళన చేయడం, దూషించడం తప్పు. నా ఎదురుగా ఇటువంటి పనులు చేస్తే పోలీసు కంప్లైంటు ఇస్తాను అని చెప్పాను. దానితో వాడు పరారైపోయాడు. ఈ ఉంటాను మరి. మీ అమ్మగారికి, నాన్నగారికి నా నమస్కారాలని చెప్పు. మన స్నేహితులందరినీ అడిగినట్లు చెప్పు. ఇట్లు, చిరునామా : |
10th Class Telugu 7th Lesson మా ప్రయత్నం 1 Mark Bits
1. దీపావళి పండుగరోజు ఆబాలగోపాలం ఆనందిస్తారు – గీత గీసిన పదం ఏ సమాసం? (June 2017)
A) బహుజొహి
B) అవ్యయీభావం
C) తత్పురుషం
D) కర్మధారయం
జవాబు:
B) అవ్యయీభావం
2. అవ్యయీభావ సమాసానికి ఉదాహరణను గుర్తించుము. (March 2017)
A) సేవావృత్తి
B) మృదుమధురం
C) అనుకూలం
D) పదాబ్దములు
జవాబు:
C) అనుకూలం
3. ప్రతిదినము పాఠశాల అసెంబ్లి సమయంలోపే పాఠశాలకు రావాలి – గీత గీసిన పదం సమాసం పేరు గుర్తించండి. (June 2018)
A) అవ్యయీభావ సమాసం
B) రూపక సమాసం
C) షష్టీతత్పురుష సమాసం
D) ద్వంద్వ సమాసం
జవాబు:
A) అవ్యయీభావ సమాసం
4. క్రింది వానిలో సంభావన పూర్వపద కర్మధారయ సమాసానికి సరియైన ఉదాహరణ గుర్తించండి. (June 2018)
A) రామబాణం
B) గంగానది
C) మూడు రోజులు
D) తల్లిదండ్రులు
జవాబు:
B) గంగానది
5. విద్యార్థులు ప్రతిదినము పాఠాలను చదవాలి. (సమాసం గుర్తించండి) (S.A. I – 2018-19)
A) అవ్యయీభావ సమాసం
B) ద్విగు సమాసం
C) ద్వంద్వ సమాసం
D) షష్ఠీ తత్పురుష
జవాబు:
A) అవ్యయీభావ సమాసం
6. ఆహా ! ఎంత బాగుందీ ! (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) ఆశ్చర్యార్థకం
B) విధ్యర్థకం
C) ప్రేరణార్థకం
D) సందేహార్ధకం
జవాబు:
A) ఆశ్చర్యార్థకం
7. రమేష్ బడికి వస్తాడో, రాడో. (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) ప్రార్థనార్థకం
B) సందేహార్థకం
C) ప్రశ్నార్థకం
D) నిషేధార్థకం
జవాబు:
B) సందేహార్థకం
8. ప్రతి పనికి లాభం ఉంటుంది – దీనికి వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి. (March 2017)
A) ప్రతి పనికి లాభం ఉంటుందా?
B) ప్రతి పనిలో లాభం ఉంటుంది.
C) ప్రతి పనికి లాభం ఉండే ఉంటుంది.
D) ప్రతి పనికి లాభం ఉండదు.
జవాబు:
D) ప్రతి పనికి లాభం ఉండదు.
9. సోముడు అడవికి వెళ్ళి, కట్టెలు తెచ్చాడు – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) సంయుక్తం
B) సంక్లిష్టం
C) ప్రశ్నార్థకం
D) ఆశ్చర్యార్థకం
జవాబు:
B) సంక్లిష్టం
10. ‘ఆకాశం నీలంగా ఉంటుంది’ – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) సంక్లిష్టం
B) చేదర్థకం
C) సామాన్యం
D) సందేహార్థకం
జవాబు:
C) సామాన్యం
11. “నీవు శాస్త్రవేత్తవు కాగలవు” – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) సామర్థ్యార్థకం
B) సందేహార్థకం
C) సంక్లిష్ట వాక్యం
D) సంయుక్త వాక్యం
జవాబు:
A) సామర్థ్యార్థకం
12. ‘ఆహా’ ఎంత రుచిగా ఉందో ! – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) చేదర్థకం
B) సందేహార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) అప్యర్థకం
జవాబు:
C) ఆశ్చర్యార్థకం
13. ‘వాహనాన్ని వేగంగా నడుపవద్దు’ – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) నిషేధాకం
B) ఆశ్చర్యార్థకం
C) ప్రశ్నార్థకం
D) సందేహార్థకం
జవాబు:
A) నిషేధాకం
14. “మీరంతా పాఠం చదవండి” – ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) చేదర్థకం
B) ప్రశ్నార్థకం
C) సందేహార్థకం
D) విధ్యర్థకం
జవాబు:
D) విధ్యర్థకం
15. ‘తిండి కలిగితే కండ గలదు’ – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) విధ్యర్థకం
B) చేదర్థకం
C) అభ్యర్థకం
D) అనుమత్యర్ధకం
జవాబు:
B) చేదర్థకం
16. ప్రతివాళ్ళు ప్రశ్నించారు చరిత్ర సాగిన క్రమాన్ని – కర్మణి వాక్యం గుర్తించండి. (June 2018)
A) చరిత్ర సాగిన క్రమాన్ని ఎందుకు ప్రశ్నించాలి.
B) ప్రతి ఒక్కడు ప్రశ్నించకూడదు చరిత్ర సాగిన క్రమాన్ని.
C) చరిత్ర సాగిన క్రమం ప్రతి వాళ్ళచేత ప్రశ్నించబడింది.
D) ఎవరూ ప్రశ్నించలేదు చరిత్ర సాగిన క్రమాన్ని.
జవాబు:
C) చరిత్ర సాగిన క్రమం ప్రతి వాళ్ళచేత ప్రశ్నించబడింది.
17. విమల టి.వి. చూస్తూ నృత్యం చేస్తున్నది – ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (June 2018)
A) అప్యర్థక వాక్యం
B) సంయుక్త వాక్యం
C) చేదర్థక వాక్యం
D) శత్రర్థక వాక్యం
జవాబు:
D) శత్రర్థక వాక్యం
18. రవి లెక్కలు బాగా చేయగలడు – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (June 2018)
A) సామర్థ్యార్థకం
B) సంభావనార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) ఆశీరర్థకం
జవాబు:
A) సామర్థ్యార్థకం
19. నేను తప్పక వస్తాను – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (June 2018)
A) అనుమత్యకం
B) విధ్యర్థకం
C) నిశ్చయార్థక వాక్యం
D) నిషేధకం
జవాబు:
C) నిశ్చయార్థక వాక్యం
20. సీత ఆటలు ఆడి అన్నం తిన్నది – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి.
A) అభ్యర్థకము
B) విధ్యర్థకము
C) చేదర్థకము
D) క్వార్థకము
జవాబు:
D) క్వార్థకము
21. భారతదేశంలో వస్తువుల ఉత్పత్తి పెరిగినా ధరలు తగ్గలేదు – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (June 2018)
A) అష్యకము
B) విధ్యర్థకము
C) క్వార్ధకము
D) చేదర్థకము
జవాబు:
A) అష్యకము
22. తామంతా కుటుంబ స్త్రీలం కామా ? అని శ్యామలగారన్నారు. (ప్రత్యక్ష కథనం గుర్తించండి)
A) “మేమంతా కుటుంబ స్త్రీలం కామా?” అని శ్యామల గారన్నారు.
B) “మనమంతా కుటుంబ స్త్రీలం కామా?” అని శ్యామల గారన్నారు.
C) “తామంతా కుటుంబ స్త్రీలం కామా?”, అని శ్యామల గారన్నారు.
D) “మీరు, మేము అంతా కుటుంబ స్త్రీలంకామా”, అని శ్యామల గారన్నారు.
జవాబు:
A) “మేమంతా కుటుంబ స్త్రీలం కామా?” అని శ్యామల గారన్నారు.
23. మా కంటె సీరియస్ గా ఆలోచించి, ప్రశ్నించి, సలహాలిచ్చారు. ఇది ఏ వాక్యమో గుర్తించండి) (S.A.I – 2018-19)
A) సంయుక్త వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సామర్థ్యార్థక వాక్యం
D) ప్రార్థనార్థక వాక్యం
జవాబు:
B) సంక్లిష్ట వాక్యం
24. కాలధర్మం చెందుట : పుట్టిన జీవికి కాలధర్మం చెందుట తప్పదు. (June 17, Mar 18)
25. గుండెలు బరువెక్కడం : “మిక్కిలి బాధపడటం” అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. (March 17, 18, S.A.I – 2018-19)
26. కనువిప్పు : గురువులు చెప్పిన మాటలతో అజ్ఞానము తొలగి నాకు కనువిప్పు కలిగింది. (March 2017 S.A. I – 2018-19)