AP 10th Class Biology Notes 7th Lesson జీవక్రియలలో సమన్వయం

Students can go through AP Board 10th Class Biology Notes 7th Lesson జీవక్రియలలో సమన్వయం to understand and remember the concept easily.

AP Board 10th Class Biology Notes 7th Lesson జీవక్రియలలో సమన్వయం

→ ఆహారం సరిగా జీర్ణమై శోషణ జరిగి శక్తిని విడుదలచేసే ప్రక్రియలకు మనం తీసుకున్న ఆహారం చిన్నచిన్న రేణువుల రూపంలోకి విడగొట్టబడాలి.

→ మానవ జీర్ణవ్యవస్థలో కండర మరియు నాడీవ్యవస్థలు రెండూ పాల్గొంటాయి.

→ జీర్ణవ్యవస్థలోని ప్రత్యేక నాడీవ్యవస్థలో 100 బిలియన్ల నాడీకణాలు ఉంటాయి. ఇవి కండర సంకోచాలు, రక్త ప్రసరణ, జీర్ణక్రియ మరియు పోషకాల శోషణ, ఆహారనాళంలోని ఇతర క్రియలను సమన్వయపరుస్తాయి.

→ జీర్ణాశయంలో స్రవించబడే గ్రీలిన్ అనే హార్మోన్ ఆకలి కోరికల ప్రచోదాలను కలిగిస్తుంది. లెఫ్టిన్ అనే మరో హార్మోన్ ఆకలిని అణచివేస్తుంది.

→ నాలుకను అంగిలికి, నొక్కడం వలన సులభంగా రుచిని గుర్తుపట్టగలం.

→ రుచి, వాసన దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. ముక్కు మరియు నాలుక పైనున్న రసాయన గ్రాహకాలు సంకేతాలను నాడీ ప్రచోదనాల రూపంలో మెదడుకు చేరవేస్తాయి. తద్వారా వాసన, రుచిని గుర్తించగలుగుతాం.

AP 10th Class Biology Notes 7th Lesson జీవక్రియలలో సమన్వయం

→ స్రవించబడిన లాలాజలం క్షార మాధ్యమాన్ని కలిగి ఉండి పిండిపదార్థాల జీర్ణక్రియలో తోడ్పడుతుంది. స్వయంచోదిత నాడీవ్యవస్థ నియంత్రణలో లాలాజల గ్రంథుల నుండి విడుదలైన లాలాజలం ఆహారాన్ని తేమగా చేయడం వలన నమలడం, మింగడం సులభమవుతుంది.

→ నోటి కుహరంలో గల కండరయుత భాగమే నాలుక. ఇది రుచి తెలుసుకునే అవయవం మాత్రమే కాకుండా నోటి కుహరంలో ఆహారాన్ని కదిలించడం, కలుపడం, మింగడం వంటి పనులను కూడా నిర్వహిస్తుంది.

→ మింగే ప్రక్రియకు సంబంధించిన సమన్వయం మెదడు కాండంలోని చర్యా కేంద్రం అధీనంలో ఉంటుంది.

→ జీర్ణనాళం యొక్క కండరాల సంకోచ సడలికల వలన తరంగాల్లాంటి చలనం ఏర్పడి ఆహారాన్ని ముందుకు నెట్టే క్రియను ‘పెరిస్టాల్సస్’ అంటాం. ఈ కండర తరంగం జీర్ణనాళం అంతటా ప్రయాణిస్తుంది.

→ అనియంత్రితంగా జరిగే ఈ ‘పెరిస్టాలసిస్’ ను స్వయంచోదిత నాడీవ్యవస్థ మరియు జీర్ణనాడీ వ్యవస్థను నియంత్రిస్తాయి.

→ జీర్ణాశయపు కండర సంకోచాల మూలంగా జీర్ణాశయంలోని ఆహారం చిలుకబడి ఏర్పడే అర్థఘన పదార్ధమే కైమ్.

→ ఆంత్రమూలంలో ‘కైమ్’ ప్రవేశాన్ని నియంత్రించే కండరాన్ని “పైలోరిక్ లేదా సంవరిణీ కండరం” అంటారు. బలమైన ఆమ్లమైన HCl జీర్ణాశయంలోని pH ను ఆమ్లయుతంగా ఉంచుతూ ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్ చర్యలకు తోడ్పడుతుంది.

→ జీర్ణాశయంలోని జీర్ణరసాలు ఆహారాన్ని జీర్ణం చేసి మెత్తని మిశ్రమంగా మారుస్తాయి. దానినే “కైమ్” అంటారు.

→ జీర్ణాశయం స్రవించే ఆమ్లాల వలన దానికి హాని జరగకుండా జీర్ణాశయ గోడల్లోని శ్లేష్మస్తరం రక్షిస్తుంది.

AP 10th Class Biology Notes 7th Lesson జీవక్రియలలో సమన్వయం

→ ఆహారాన్ని కొరకడానికి, నమలడానికి దవడను పైకి, కిందకు, వెనుకకు, ముందుకు కదిపి ఆహారాన్ని విసరడంలో దవడ ఉపరితల కండరాలు మరియు దవడ అంతర భాగంలోని కండరాలు తోడ్పడుతాయి.

→ చిన్నప్రేవులోని విల్లి ఉపరితల వైశాల్యాన్ని పెంచి పోషకాలను గ్రహించడంలో తోడ్పడుతుంది.

→ జీర్ణవ్యవస్థలోని ప్రత్యేక నాడీవ్యవస్థను సాంకేతికంగా జీర్ణాంతర నాడీవ్యవస్థ అంటారు. దీనిని రెండవ మెదడు అని కూడా పిలుస్తారు.

→ పెద్ద ప్రేవు నుండి వ్యర్థాలను మలం రూపంలో పాయువు నుండి బయటకు పంపడాన్ని పాయువు వద్దనున్న బాహ్య పాయువు సంవరిణీ కండరం మరియు అంతర పాయువు సంవరిణీ కండరం నియంత్రిస్తాయి.

→ ఆహారపదార్థాల ఆక్సీకరణ, రవాణా మరియు వినియోగం కొరకు జీర్ణక్రియ, శ్వాసక్రియ, రక్తప్రసరణ వంటి జీవ క్రియల మధ్య సమన్వయం అవసరం. ఆయా ప్రక్రియలు సరిగా నిర్వర్తించడానికి కండర మరియు నాడీ నియంత్రణలు తోడ్పడతాయి.

→ వ్యాధి నిరోధక వ్యవస్థ 20% వరకు ఆహార నాళంలో చేరే వ్యాధి కారకాలను సంహరించి బయటకు పంపే చర్యలపై కేంద్రీకరించబడి ఉంటుంది.

→ ఆహార వాహిక నుండి పాయువు వరకు 9 మీ. పొడవు కలిగి జీర్ణనాడీ వ్యవస్థగా (Enteric nervous system) పిలువబడే రెండవ మెదడులోని అనేక నాడులు పొరల రూపంలో జీర్ణనాళపు గోడలలో ఇమిడి ఉంటాయి.

→ ఆహారం జీర్ణాశయం నుండి చిన్న ప్రేగులలోనికి ప్రవేశించినపుడు, సెక్రిటిన్ మరియు కొలిసిస్టోకైనిన్ అనే హార్మోన్లు స్రవించబడతాయి.

AP 10th Class Biology Notes 7th Lesson జీవక్రియలలో సమన్వయం

→ గ్రీలిన్ : జీర్ణాశయ గోడలు స్రవించే హార్మోన్. దీని వలన ఆకలి సంకేతాలు ఉత్పత్తి అవుతాయి.

→ లెఫ్టిన్ : ఆకలిని అణిచివేసే హార్మోన్

→ రుచి గ్రాహకాలు : రుచి మొగ్గలలో రుచిని గ్రహించే కణాలు

→ రసాయన గ్రాహకాలు: రుచి, వాసనను గ్రహించే కణాలు

→ రుచి మొగ్గలు : నాలుక మీద ఉండే ఉబ్బెత్తు నిర్మాణాలు. రుచిని గుర్తించటానికి తోడ్పడతాయి.

→ ఆహార బోలస్ : నోటిలో ఆహారం నమలబడి ముద్దగా మారుతుంది. దీనిని ‘బోలస్’ అంటారు.

→ పెరిస్టాలసిస్ : ఆహారం ప్రయాణిస్తున్నప్పుడు ఆహారవాహికలో ఏర్పడే తరంగచలనం.

→ కైమ్ : పాక్షికంగా జీర్ణమైన ఆహారం

AP 10th Class Biology Notes 7th Lesson జీవక్రియలలో సమన్వయం

→ సంవరిణీ కండరం : జీర్ణాశయం నుండి ఆంత్రమూలంలోకి ప్రవేశించే ఆహారాన్ని నియంత్రించే కండరం

→ సూక్ష్మచూషకాలు : చిన్న ప్రేగు లోపలి తలంలోని ముడతలు. ఇవి శోషణా వైశాల్యాన్ని పెంచుతాయి.

→ మజ్జాముఖం : వెనుక మెదడులోని భాగం. అనియంత్రిత చర్యలను నియంత్రిస్తుంది.

→ మెదడు కాండం : వెనుక మెదడు చివరి భాగము. ఇది క్రిందికి పొడిగించబడి వెన్నుపాముగా మారుతుంది.

AP 10th Class Biology Notes 7th Lesson జీవక్రియలలో సమన్వయం 1