AP 10th Class Biology Notes 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

Students can go through AP Board 10th Class Biology Notes 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు to understand and remember the concept easily.

AP Board 10th Class Biology Notes 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

→ చాలా దగ్గర సంబంధం గల జీవులలోనూ వైవిధ్యాలు కనిపిస్తాయి.

→ వైవిధ్యాలు ఒక తరం నుండి మరొక తరానికి ఎలా అందించబడతాయనే సమస్యను గురించి తెలుసుకోవడానికి 1857వ సంవత్సరంలో గ్రెగర్ జాన్ మెండల్ పరిశోధనలు ప్రారంభించాడు.

→ పువ్వుల రంగు, స్థానం, విత్తనాల రంగు, ఫలం ఆకారం, కాండం పొడవు మొదలైన బరానీ మొక్కలను ఏడు ప్రత్యేక లక్షణాల ప్రయోగాల కోసమై మెండల్ ఎన్నుకున్నాడు.

→ బఠానీల మొదటి సంతతి లేదా F1 తరంలోని విత్తనాలు పసుపురంగులో ఉంటాయి.

→ F2 తరంలో 75% పసుపురంగు విత్తనాలలో 25% ఆకుపచ్చనివి. దీనినే దృశ్యరూపం అంటారు. దృశ్యరూప నిష్పత్తి 3 : 1.

→ F2 తరంలో 75% పసుపురంగు విత్తనాలలో 25% శుద్ధజాతికి చెందినవి (YY) కాగా, 50% మొక్కలు పసుపురంగు బహిర్గత లక్షణంగా, ఆకుపచ్చ అంతర్గత లక్షణంగా కలిగి ఉన్నవి. మిగిలిన 25% శుద్ధ ఆకుపచ్చ జాతికి చెందినవి. దీనినే జన్యురూపం అంటారు. జన్యురూప నిష్పత్తి 1 : 2 : 1.

→ బఠానీ మొక్క ప్రతీ ధర్మానికి లేదా లక్షణానికి బాధ్యత వహించే రెండు కారకాలను కలిగి ఉంటుంది. వాటినే “యుగ్మవికల్పకాలు” (Allele) అని అంటారు.

→ ఒక జత లక్షణాలకు కారణమైన కారకాలు ఇతర లక్షణాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా సంతతికి అందించబడడాన్ని “స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం” అని అంటారు.

AP 10th Class Biology Notes 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

→ పసుపు మరియు ఆకుపచ్చ విత్తనాలనిచ్చే మొక్కల మధ్య సంకరీకరణం జరిపితే సంతతి మొత్తం పసుపు విత్తనాలిచ్చేదే అవుతుంది. ఎందుకంటే పసుపురంగు బహిర్గత కారకం కనుక.

→ జనకులు తమ యుగ్మ వికల్పకాలలోని ఏదో ఒక కారకాన్ని యథేచ్ఛగా సంతతికి అందిస్తారు.

→ జనకుల నుండి లక్షణాలు లేదా గుణాలను సంతతి పొందే ప్రక్రియనే ‘అనువంశికత’ (Heredity) అని అంటారు.

→ ప్రతీ మానవ కణంలో 23 జతల క్రోమోజోమ్లుంటాయి. వీటిలో 22 జతలను శారీరక క్రోమోజోమ్ ని, 1 జతను లైంగిక క్రోమోజోమ్ లని అంటారు.

→ ఆర్జిత లక్షణాలు లేదా గుణాలను సంతతి ద్వారా తర్వాతి తరాలకు అందించబడతాయని లామార్క్ ప్రతిపాదించాడు.

→ ప్రతీ జీవజాతి తమ సంఖ్యను వృద్ధి చేసుకోవడం కోసం అధికంగా సంతతిని ఉత్పత్తి చేస్తాయి. వాటిలో మనుగడ కోసం పోరాటం జరిగి, బలమైనవి మాత్రమే గెలుస్తాయి జీవిస్తాయి.

→ సహజాత, సమాన అవయవాలు మరియు పిండాభివృద్ధిలోని వివిధ దశలు పరిణామ సంబంధాలను వివరించడానికి ఋజువులుగా ఉపయోగపడతాయి.

→ విభిన్న జీవుల్లోని కొన్ని లక్షణాలలో పోలికలు ఉండవచ్చు. ఎందుకంటే అవన్నీ ఒకే పూర్వీకుల నుండి పరిణామక్రమంలో ఏర్పడి ఉండవచ్చు.

→ ప్రాచీన యుగాల్లో నివసించిన జీవులు, వృక్షాలు సహజ ప్రక్రియల కారణంగా పూర్తిగా కుళ్ళిపోకుండా మిగిలిపోయిన వాని ఋజువులనే ‘శిలాజాలు’ అంటారు.

AP 10th Class Biology Notes 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

→ శిలాజాల అధ్యయనాన్ని ‘పురాజీవశాస్త్రం’ అంటారు.

→ పురాజీవ శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ ప్రక్రియను ఉపయోగించి శిలాజాల వయస్సును నిర్ణయిస్తారు.

→ ఆర్కియోప్టెరిక్స్ సరీసృపాలకు, పక్షులకు సంధాన సేతువు.

→ పరిణామక్రమంలో అవసరం లేని అవయవాలు క్షీణించిపోతాయి. కానీ అలా క్షీణించిపోకుండా నిరుపయోగంగా మిగిలిపోయిన అవయవాలను అవశేష అవయవాలు అంటారు.

→ మానవునిలో 180 అవశేష అవయవాలు ఉన్నాయి. అందుచేత మానవుడిని నడిచే “అవశేష అవయవాల మ్యూజియం” అంటారు.

→ ఆధునిక మానవుడి రూపు సంతరించుకొనే వరకు జరుగుతూ ఉన్న పరిణామ ప్రక్రియను మానవ పరిణామం అంటారు.

→ మానవులందరూ ఆఫ్రికా నుండి వచ్చినవారే. మానవుల అతిపురాతన జీవి హోమోసెపియన్స్ ను ఇక్కడనే కనుగొన్నారు.

→ భూగ్రహంలోని అన్ని జీవజాతుల వలనే మానవులు కూడా జీవపరిణామంలో చిక్కుకున్న వారే. అలాగే సాధ్యమైనంత వరకు ఉత్తమంగా జీవించుటకు ప్రయత్నిస్తున్న వారే.

AP 10th Class Biology Notes 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

→ వైవిధ్యాలు : జీవులలో ఉండే భేదాలు.

→ సంతతి : జనకుల నుండి ఏర్పడిన కొత్త జీవులు.

→ లక్షణాలు : ప్రతి జీవి నిర్దిష్ట లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి జన్యువులచే నియంత్రించబడతాయి.

→ దృశ్యరూపం : బయటకు కనిపించే లక్షణాల సమూహం.

→ జన్యురూపం : జీవి యొక్క జన్యు స్థితి.

→ విషమయుగ్మజం : వ్యతిరేక లక్షణాలు ఉన్న జన్యువుల జత.

→ సమయుగ్మజం : ఒకే రకమైన జన్యువుల జత.

→ స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం : సంయోగబీజాలు ఏర్పడేటప్పుడు, యుగ్మ వికల్పకాలలోని జన్యువులు స్వతంత్రంగా వ్యవహరించి, యథేచ్చగా సంతతికి చేరతాయి.

→ యుగ్మ వికల్పకాలు : ఒక లక్షణానికి కారణమయ్యే జన్యువుల జత.

→ అనువంశికత : జనకుల నుండి లక్షణాలు లేదా గుణాలను సంతతి పొందే ప్రక్రియనే “అనువంశికత” అని అంటారు.

AP 10th Class Biology Notes 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

→ శారీరక క్రోమోజోమ్ లు : శారీరక లక్షణాలను నిర్ణయించే జన్యువులు గల క్రోమోజోమ్స్. వీటి సంఖ్య 22 జతలు.

→ లైంగిక క్రోమోజోమ్ లు : జీవి లైంగికతను నిర్ణయించే క్రోమోజోమ్స్, వీటి సంఖ్య ఒక జత.

→ ప్రకృతి వరణం : అనుకూలనాలు కలిగిన జీవులు మాత్రమే ప్రకృతిలో జీవించగలగటం.

→ సహజాత అవయవాలు : ఒకే నిర్మాణం కలిగిన విభిన్న జీవులలోని వేరు వేరు పనులు నిర్వహించే అవయవాలు.

→ పిండాభివృద్ధి నిదర్శనాలు : జీవుల పిండాభివృద్ధిలో అన్నీ ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉంటాయి. దీనిని బట్టి జీవులు ఒక పూర్వపు జీవి నుండి పరిణామం చెందాయని చెప్పవచ్చు.

→ మానవ పరిణామం : ఆధునిక మానవుడి రూపు సంతరించుకునే వరకు జరుగుతూ ఉన్న పరిణామ ప్రక్రియ.

AP 10th Class Biology Notes 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 1