Andhra Pradesh AP Board 5th Class Maths Solutions 3rd Lesson కూడిక – తీసివేత Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 5th Class Maths Solutions Chapter 3 కూడిక – తీసివేత
I. శంకర్ తన రెండు ఎకరాల పొలములో వరిని సాగుచేశాడు. సాగుచేయడానికి అయిన మొత్తం ఖర్చును తెలుసుకోవాలని అనుకున్నాడు. 5వ తరగతి చదువుతున్న తన కూతురుని ఖర్చు వివరాలు రాయమన్నాడు. ఆమె వివరాలను ఈ కింది విధంగా రాసింది.
జవాబు.
కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
విత్తనాలు చల్లడానికి, పొలాన్ని తయారు చేయడానికి శంకర్ ఎంత పెట్టుబడి పెట్టాడు ?
జవాబు.
విత్తనాలు చల్లుటకు అయిన పెట్టుబడి = 4507
పొలం తయారీకి అయిన పెట్టుబడి = 2545
మొత్తం పెట్టుబడి = ₹ 7052
ప్రశ్న 2.
నూర్పిళ్ళకు మరియు కుప్పలు వేయడానికి అతను ఎంత పెట్టుబడి పెట్టాడు ?
జవాబు.
నూర్పిళ్ళకు అయిన పెట్టుబడి = 4125
కుప్పలు వేయుటకు అయిన పెట్టుబడి = 4675
మొత్తం పెట్టుబడి = ₹ 8800
ప్రశ్న 3.
విత్తనాలు చల్లడానికి, కలుపు తీయడానికి అతను ఎంత పెట్టుబడి పెట్టాడు?
జవాబు.
విత్తనాలు చల్లుటకు అయిన పెట్టుబడి = ₹ 4507
కలుపు తీయడానికి అయిన పెట్టుబడి = ₹ 1235
మొత్తం పెట్టుబడి = ₹ 5742
ప్రశ్న 4.
1 ఎకరం పొలం వ్యవసాయానికి మొత్తం ఎంత ఖర్చు అయింది ?
జవాబు.
1 ఎకరం పొలం వ్యవసాయానికి అయిన మొత్తం ఖర్చు = ₹ 21,787.
ప్రశ్న 5.
2 ఎకరాల పొలం వ్యవసాయానికి మొత్తం ఎంత ఖర్చు అయింది ?
జవాబు.
2 ఎకరాలు పొలం వ్యవసాయానికి అయిన మొత్తం ఖర్చు = ₹ 43,574.
ఇవి చేయండి: (TextBook Page No.67)
I. కింది కూడికలు చేయండి.
అ) 20762 + 12225
జవాబు.
ఆ) 826532 + 153264
జవాబు.
ఇ) 286952 + 394256
జవాబు.
II. కింది సంఖ్యలను నిలువు వరుసలలో కూడండి.
II. మోహన్ ఒక భోజన హోటల్ యజమాని. అతను జనవరి 2020లో ₹ 31,787 పెట్టుబడి పెట్టి, ₹ 53,574 సంపాదించాడు. అయితే ఆ నెలలో అతనికి ఎంత లాభం వచ్చింది ?
జవాబు.
మోహన్ జనవరిలో సంపాదించింది .
జనవరి : ₹ 53,574
అతను ఖర్చు చేసినది ₹ 31,787
అతనికి వచ్చిన ₹ 21,787 లాభం.
ఇవి చేయండి: (TextBook Page No.69)
ప్రశ్న 1.
అ. 860438 – 764859 =
జవాబు.
95,579
ఆ. 56080 – 4398 =
జవాబు.
51,682
ఇ. 600005 – 65095 =
జవాబు.
5,34,910
ఈ. 880056 – 45396 =
జవాబు.
8,34,660
ఉ. 700000 – 75897 =
జవాబు.
6,24,103
ఊ.906004 – 473894 =
జవాబు.
4,32,110
ఋ. 435217 – 383450 =
జవాబు.
51,767
ౠ. 980000 – 573429 =
జవాబు.
4,06,571
ఎ. 650701 – 404107 =
జవాబు.
2,46,594.
ప్రశ్న 2.
అ) 647836 నుండి 76384 ను తీసివేయండి.
జవాబు.
ఆ) 783409 నుండి 8437 ను తీసివేయండి.
జవాబు.
ఇ) 764986 నుండి 386472 ను తీసివేయండి. ..
జవాబు.
ఈ) 705645 నుండి 432010.ను తీసివేయండి.
జవాబు.
ఉ) 900000 నుండి 607080ను తీసివేయండి.
జవాబు.
ఊ) 400000 నుండి 201781ను తీసివేయండి.
జవాబు.
ప్రశ్న 3.
అ. 503267 ను పొందడానికి 153672 కు ఎంత కలపాలి ?
జవాబు.
503267 కు 153672 ల భేదము 349,595
∴ 153672 కు3,49,595 ను కలిపిన 503267 పొందవచ్చును.
ఆ. 999999 ను పొందడానికి 603257 కు ఎంత కలపాలి ?
జవాబు.
999999 కు 603257 ల భేదము 396,742
∴ 603257 కు 3,96,742 ను కలిపిన 999999 పొందవచ్చును.
ఇ. 425067 కంటే 20325 ఎంత తక్కువ ?
జవాబు.
425067 కు 20325 ల భేదము 404,742
∴ 4,04,742 కంటే 20325 సంఖ్య 425067 తక్కువ.
ఈ. 673267 నుండి ఎంత తీసివేసిన 59325 వస్తుంది?
జవాబు. 673267 కు 59325 ల భేదము 6,13,942
∴ 673267 నుండి 6,13,942 తీసివేసిన 59325 వచ్చును. బట్టల దుకాణం.
బట్టల దుకాణం: (TextBook Page No.71)
వనజ కుటుంబం తన కుమార్తె వివాహం నిమిత్తం బట్టలు కొనడానికి నిర్ణయించుకున్నారు. వారు ఆప్కో షోరూంలో కొన్ని బట్టలు కొన్నారు. బట్టల ఖరీదు వివరములు ఈ కింది విధంగా ఉన్నాయి.
ప్రశ్న 1.
డోర్ కర్టెన్స్ కంటే పట్టుచీరలకు ఎంత ఎక్కువ ఖర్చు చేశారు ?
జవాబు.
డోర్ కర్టెన్ కు అయిన ఖర్చు = 9899
పట్టు చీరలకు అయిన ఖర్చు = 8438
వీటి భేదము = 1,461
డోర్ కర్టెన్స్ కంటే పట్టు చీరలకు ₹ 1,461 ఎక్కువ ఖర్చు చేశారు.
ప్రశ్న 2.
కాటన్ చీరల కంటే దుప్పట్లకి ఎంత తక్కువ ఖర్చు చేశారు ?
జవాబు.
కాటన్ చీరలకు అయిన ఖర్చు = 6940
దుప్పట్లుకి అయిన ఖర్చు = 5900 వీటి భేదము = 1040
కాటన్ చీరల కంటే దుప్పట్లకు ₹ 1,040 తక్కువ ఖర్చు చేశారు.
ప్రశ్న 3.
పట్టు చీరలకు మరియు పట్టు పంచెలకు కలిపి ఎంత ఖర్చు చేశారు ?
జవాబు.
పట్టు చీరలకు అయిన ఖర్చు = 9899
పట్టు పంచెలకు అయిన ఖర్చు = 2785
వీటి మొత్తము = 12,684
ప్రశ్న 4.
డోర్ కర్టెన్లు, దుప్పట్లు మరియు తువాళ్ళకి వనజ కుటుంబం ఎంత ఖర్చు చేశారు?
జవాబు.
డోర్ కర్టెన్లకు అయిన ఖర్చు = 8438
దుప్పట్లకు అయిన ఖర్చు = 5900
తువాళ్ళకి అయిన ఖర్పు = 2350
వీటన్నింటికి అయిన మొత్తం ఖర్చు = 16,688
ప్రశ్న 5.
వనజ కుటుంబం షాపింగ్ కి ఎంత ఖర్చు చేశారు?
జవాబు.
వనజ కుటుంబం షాపింగ్ కి ఖర్చు చేసినది = 9899 + 6940 + 2785 + 8438 + 5900 + 2350 = ₹ 36,312.
అభ్యాసం 1:
ప్రశ్న 1.
కింది లెక్కలు చేయండి.
అ. 4986 + 3430 – 5467 =
జవాబు.
2949
ఆ. 78645 – 36789 + 23576 =
జవాబు.
65,432
ఇ. 40376 – 20568 – 76485 + 87364 =
జవాబు.
30,687
ఈ. 643857 + 467896 – 445386 =
జవాబు.
666,367
ప్రశ్న 2.
కింది ఖాళీలను పూరించండి.
జవాబు.
ప్రశ్న 3.
ఒక వ్యక్తి నెలకు ₹ 37,645 మరియు అతని భార్య ₹ 25,367 సంపాదిస్తారు. వారు నెలకు ₹ 38,600 ఖర్చు చేసిన వారు పొదుపు చేసిన సొమ్ము ఎంత?
జవాబు.
నెలకు వ్యక్తి సంపాదన = ₹ 37645
నెలకు భార్య సంపాదన = ₹ 25367
మొత్తం సంపాదన = ₹ 63012
నెలకు ఖర్చు చేసిన సొమ్ము = ₹ 38600
పొదుపు చేసిన సొమ్ము = ₹ 24412
ప్రశ్న 4.
శివ వద్ద ₹ 52,490 ఉన్నాయి. అతను ఒక ఆవును ₹ 15,870కు ఒక గేదెను ₹ 25,785కు కొన్నాడు. ఇపుడు అతని వద్ద ఇంకా ఎంత సొమ్ము మిగిలి ఉంది ?
జవాబు.
ఆవును కొన్నవెల = ₹ 15,870
గేదెను కొన్న వెల = ₹ 25,785
మొత్తం కొన్నవెల = ₹ 41,655
శివ వద్ద ఉన్న సొమ్ము = ₹ 52,490
మిగిలిన సొమ్ము = ₹ 52,490 – 41,655 = ₹ 10,845.
ప్రశ్న 5.
ఒక పాల కేంద్రం ప్రతిరోజు 25,545 లీటర్ల పాలను సరఫరా చేస్తుంది. ఇది వివిధ పాల డిపోలకు 15,625 లీటర్ల పాలను సరఫరా చేసి, మిగిలిన పాలను మార్కెట్ కు పంపుతుంది. అయితే ఎన్ని లీటర్ల పాలను మార్కెట్ కు పంపుతుంది ?
జవాబు.
ప్రతి రోజు ఉత్పత్తి అగు పాలు = 25,545
పాలడిపోలకు సరఫరా చేయు పాలు = 15,625
మార్కెట్టుకు సరఫరా చేయు పాలు = 9,920
ఇవి చేయండి: (TextBook Page No.78)
ప్రశ్న 1.
కూడిక ధర్మాలను ఉపయోగించి క్రింది ఖాళీలను పూరించండి.
1. 35 + 67 = 67 + ___
జవాబు.
35
2. 378 + 894 = ___
జవాబు.
894 + 378
3. 889 + 0 = ___ + ___
జవాబు.
0 + 889
4. 0 + ___ = 6592 + ___
జవాబు.
6592, 0
5. 7634 + 3210 = ___ + 7634
జవాబు.
3210
6. 9345 + 4537 = 4537 + 9345
జవాబు.
4537, 9345.
అభ్యాసం 2:
సమస్యలు సాధించండి.
ప్రశ్న 1.
ఒక పురుగు మందులు పిచికారి చేసే యంత్రం ఖరీదు ₹ 4500 ప్రభుత్వం దీనిపై ₹ 2900 సబ్సిడి ఇస్తుంది. అయితే రైతు దానిని కొనడానికి ఇంకా ఎంత చెల్లించవలసి వస్తుంది ?
జవాబు.
పురుగు మందు పిచికారీ యంత్రం ఖరీదు = ₹ 4500
సబ్సిడీ ధర = ₹ 2900
రైతు చెల్లించే సొమ్ము = ₹ 1600
ప్రశ్న 2.
5 అంకెల పెద్ద సంఖ్యకు, 6 అంకెల చిన్నసంఖ్యకు గల తేడా ఎంత ?
జవాబు.
6 అంకెల చిన్న సంఖ్య = ₹ 100,000
5 అంకెల పెద్ద సంఖ్య = ₹ 99,999
భేదం = ₹ 1
ప్రశ్న 3.
గోకుల్ సంవత్సరానికి ₹ 4,75,000 సంపాదిస్తాడు. అతని ఖర్చు ₹ 3,85,600. అయితే అతను చేసే పొదుపు ఎంత ?
జవాబు.
గోకుల్ సంవత్సర ఆదాయం = ₹ 4,75,000
గోకుల్ సంవత్సర ఖర్చు = ₹ 3,85,600
గోకుల్ సంవత్సర పొదుపు = ₹ 89,400.
ప్రశ్న 4.
ఒక పట్టణంలో 3,25,208 మంది పురుషులు, 3,18,405 మంది స్త్రీలు, 2,98,405 మంది పిల్లలు ఉన్నారు. అయితే ఆ పట్టణ జనాభా ఎంత ?
జవాబు.
పట్టణంలోని పురుషుల సంఖ్య= ₹ 3,25,208
పట్టణంలోని స్త్రీల సంఖ్య = ₹ 3,18406
పట్టణంలోని పిల్లల సంఖ్య = ₹ 2,98,403
పట్టణం జనాభా = ₹ 9,42,018
ప్రశ్న 5.
ఒక జిల్లా పరీక్షలో ఉత్తీర్ణులు అయిన వారు 36,405 అదే పరీక్షలో ఉత్తీర్ణులు కానివారు 4,305 మంది. అయితే మొత్తం. పరీక్షకు ఎంతమంది హాజరయ్యారు?
జవాబు.
పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య = 36,405
పరీక్షలో ఉత్తీర్ణులు కాని విద్యార్థుల = 4,305
పరీక్షకు హాజరైన వారు = 40,710
ప్రశ్న 6.
2018లో పద్మజ ఆదాయం ₹ 5,35,256 తరువాత సంవత్సరంలో ఆమె ఆదాయం ₹ 78,500 పెరుగుతుంది. అయితే 2019లో ఆమె ఆదాయం ఎంత ? ఈ రెండు సంవత్సరాలలో ఆమె సంపాదించిన మొత్తం ఆదాయం ఎంత?
జవాబు.
2018 లో ‘పద్మజ ఆదాయం = ₹ 5,35,256
2019 లో ఆమె పెరిగిన ఆదాయం = ₹ 78,500
= ₹ 5,35,256 + ₹ 78,500 = ₹ 6,13,750
రెండు సంవత్సరాలలో పద్మజ ఆదాయం మొత్తం = ₹ 5,35,256 – ₹ 6,13,750
= ₹ 11,49,006
సమాధానాన్ని అంచనావేసి దగ్గరి సంఖ్యకు సవరించండి. ఇచ్చిన సమస్యలో సందర్భాన్ని బట్టి కూడిక లేక తీసివేత చేయండి.
ప్రశ్న 1.
రఘు రైతు బజారుకు వెళ్ళి ₹ 158 తో కూరగాయలు కొన్నాడు. ₹143 తో సరుకులు కొన్నాడు. అయితే అతను చేసిన ఖర్చు సుమారుగా ?
a) ₹ 200
b) ₹ 300
c) ₹ 400
d) ₹ 500
జవాబు.
b) ₹ 300
ప్రశ్న 2.
రాజు ₹ 7890 తో ఒక చరవాణిని ₹ 3295 తో ఒక కుర్చీని కొన్నాడు. అయితే కుర్చీ కన్నా చరవాణికి అతను ఎంత ఎక్కువ ఖర్చు చేసాడు? –
a) ₹ 4000
b) ₹ 3000
c) ₹ 1000
d) ₹ 5000
జవాబు.
a) ₹ 4000
ప్రశ్న 3.
హసీనా ₹ 5345 కు ఒక చీరను, ₹ 2050 ఒక చొక్కాను కొన్నది. అయితే ఆమె షాపు యజమానికి సుమారుగా ‘ఎంత చెల్లించాలి ?
a) ₹ 5000
b) ₹ 4000
c) ₹ 7000
d) ₹ 2000
జవాబు.
b) ₹ 4000
ప్రశ్న 4.
బన్ని ఒక వీడియో గేమ్ లో 6,776 పాయింట్లను, బాబా 2,373 పాయింట్లను పొందారు. అయితే వీరు పొందిన పాయింట్ల తేడా సుమారుగా ?
a) 5000
b) 8000
c) 7000
d) 6000
జవాబు.
a) 5000
ప్రశ్న 5.
లక్ష్మి 257 పేజీలు గల ఒక పుస్తకాన్ని చదువుతోంది. ఆమె 163 పేజీలు చదివిన, ఇంకనూ ఎన్ని పేజీలు సుమారుగా చదవవలసి ఉంది ?
a) 600
b) 900
c) 100
d) 70
జవాబు.
c) 100
III. ఒక చేనేత కార్మికుడు తన మగ్గంపై చీరలు నేసి, మార్కెట్లో అమ్ముతూ ఉంటాడు. అతను టోకు వ్యాపారి వద్ద కాటన్, దారం, సిల్క్ దారం, జెరి సిల్క్, మొదలైనవి కొంటూ ఉంటాడు. అతడు వాటిని లాభానికి అమ్ముతాడు. కొన్నిసార్లు నష్టానికి కూడా అమ్ముతాడు. వినియోగదారుని కోరిక పై అతడు ఖరీదైన చీరలు నేసి ఇస్తూ ఉంటాడు. అతడు ఒక కాటన్ చీరను రెండు రోజుల్లోనూ, పట్టుచీరను నాలుగైదు రోజుల్లోనూ నేయగలడు. అతను నేసిన చీరల ధరల పట్టికను పరిశీలిద్దాం .
ప్రశ్న 1.
చేనేత కార్మికుడు కాటన్ చీరను 1100కు అమ్మిన, అతనికి లాభమా ? నష్టమా ?
జవాబు.
అమ్మిన వెల > కొన్నవెల
కనుక లాభము వచ్చును.
ప్రశ్న 2.
చేనేత కార్మికుడు సరిగా లేని కాటన్ చీరలను ₹ 400 లకు అమ్మిన, అతనికి లాభమా ? నష్టమా?
జవాబు.
అమ్మిన వెల < కొన్నవెల
కనుక నష్టము వచ్చును.
ప్రశ్న 3.
చేనేత కార్మికుడు పట్టు చీరను ₹ 6000 అమ్మిన, అతనికి లాభమా ? నష్టమా ?
జవాబు.
అమ్మిన వెల > కొన్నవెల
కనుక లాభము వచ్చును.
అభ్యాసం 3:
కింది సమస్యలలో లాభ, నష్టాలను కనుగొనుము.
ప్రశ్న 1.
బియ్యం బస్తా కొన్నధర= ₹ 750 ; అమ్మిన ధర = ₹ 900
జవాబు.
బియ్యం బస్తా కొన్న ధర = ₹ 750
బియ్యం బస్తా అమ్మిన ధర = ₹ 900
అ.వె > కొ.వె. కనుక లాభము వచ్చును.
∴ లాభం = అమ్మిన వెల – కొన్నవెల
= 900 – 750 = ₹ 150
ప్రశ్న 2.
ఒక దుప్పటి కొన్నధర = ₹ 635 ; అమ్మిన ధర = ₹ 815
జవాబు.
దుప్పటి కొన్న ధర = ₹ 635
దుప్పటి అమ్మిన ధర = ₹ 815
అమ్మిన వెల > కొన్నవెల కనుక లాభము వచ్చును.
∴ లాభం = అమ్మిన వెల – కొన్నవెల
= 815 – 635 = ₹ 180
ప్రశ్న 3.
ఒక గొడుగు కొన్నధర = ₹ 105 ; అమ్మిన ధర = ₹ 90
జవాబు.
గొడుగు కొన్న ధర = ₹ 105
గొడుగు అమ్మిన ధర = ₹ 90
అ.వె < కొ.వే కనుక నష్టము వచ్చును.
∴ నష్టము = 105 – 90 = ₹ 15
ప్రశ్న 4.
రవి ఒక ఫ్యాన్ను. ₹ 800 కొన్నాడు. దానిని అతను ₹ 250 లాభానికి అమ్మిన అమ్మిన వెల ఎంత ?
జవాబు.
ఫ్యాను కొన్న వెల = ₹ 800
పొందిన లాభము = ₹ 250
ఫ్యాను అమ్మిన వెల = కొ.వె + లాభము
= 800 + 250 = ₹ 1050
ప్రశ్న 5.
అజయ్ ఒక మోటారు సైకిల్‌ను ₹ 42,500కు కొని అమ్మేశాడు. అతనికి ₹ 1800 నష్టం వచ్చిన అమ్మిన వెల ఎంత ?
జవాబు.
మోటారు సైకిలు కొన్నవెల = ₹ 42,500 .
పొందిన ష్టము = ₹ 1800
మోటారు సైకిలు అమ్మిన వెల = కొ.వె – నష్టం = ₹ 40,700
ప్రశ్న 6.
ఒక దుకాణదారుడు ఒక థర్మోస్ ఫ్లాస్క్ ను ₹ 450 కు కొన్నాడు. అతను ₹ 50. లాభం పొందాలని అనుకున్నాడు. అయితే అతను ‘దానిని ఎంతకు అమ్మాలి ?
జవాబు.
ప్లాస్కు కొన్న వెల = ₹ 450
కావలసిన లాభం = ₹ 50
ప్లాస్కు అమ్మిన వెల = ₹ 500
ప్రశ్న 7.
రేఖ, గీత సినిమాకి వెళ్ళారు. రేఖ రెండు టికెట్లను ₹ 120 లకు కొన్నది. ఒక్కొక్కటి ₹ 30 చొప్పున రెండు పాప్ కార్న్ ను గీత కొన్నది. రేఖ, గీత కంటే ఎంత ఎక్కువ ఖర్చు చేసింది ?
జవాబు.
టిక్కెట్లు కొన్నవెల = ₹ 120
పాప్ కార్న్ కొన్న వెల = ₹ 60
భేదము = ₹ 60
∴ రేఖ, గీత కంటే ₹ 60 ఎక్కువ ఖర్చు చేసింది.