Students can go through AP Board 10th Class Maths Notes 10th Lesson క్షేత్రమితి to understand and remember the concept easily.
AP Board 10th Class Maths Notes 10th Lesson క్షేత్రమితి
→ హెరాన్ క్రీ.శ. 10 – క్రీశ. 70 :
- అలెగ్జాండ్రియాకు చెందిన హెరాన్ (క్రీ.శ. 10 – క్రీ.శ. 70) ఒక ప్రాచీన గ్రీకు గణిత శాస్త్రజ్ఞుడు మరియు ఇంజినీర్.
- హెరాన్ వర్గమూలాన్ని దశదశల పద్ధతిలో గణించే పద్ధతిని వర్ణించాడు.
- త్రిభుజ వైశాల్యాన్ని దాని భుజ పొడవుల నుండి కనుగొన్నందుకు ఆయన పేరుతో హెరాన్ ఫార్ములా రూపొందింది. ఇక
- దృక్ శాస్త్రంలో ప్రిన్సిపల్ ఆఫ్ షార్టెస్ట్ పాథ్ ఆఫ్ లైట్’ను హెరాన్ రూపొందించాడు.
- ఆయన వాస్తవ రచనలు మరియు నమూనాలు చాలా వరకు లభ్యమగుట లేదు. అయితే కొన్ని రచనలు అరబిక్ రాత ప్రతులలో భద్రపరచబడినవి.
- ట్యూబ్ నర్ పబ్లిషింగ్ హౌస్ 1903లో లీగ్ లో హెరాన్ ప్రసిద్ధ రచనలను – 5 సంపుటాలుగా వెలువరించింది.
→ మూడు కొలతలు కలిగిన రేఖీయ ఘనాకృతులు ఈ క్రింది విధంగా కలవు.
→ ఘనాకృతులు ఈ క్రింది వైశాల్యాలు కలిగి ఉండును. అవి :
- ప్రక్కతల / ఉపరితల వైశాల్యాలు,
- సంపూర్ణతల వైశాల్యాలు.
→ దీర్ఘఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం = 2h(l + b)
స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యం = 2πrh.
→ స్థూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం = స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యం + 2 × భూ వైశాల్యము
= 2πrh + 2πr²- = 2πr(r + h)
సమఘనం యొక్క ఘనపరిమాణం V = a2 × a2; V = a3
సూపం యొక్క ఘనపరిమాణం V = πr2 × h; V = πr2h.
సూచన : ఘనాకార వస్తు సముదాయ ఉపరితల వైశాల్యము ఆ ఆకృతిలోని ఘనాకార వస్తువుల ఉపరితల వైశాల్యముల మొత్తమునకు సమానము కాదు. దీనికి గల కారణము కొన్ని ఉపరితలములు, వస్తువులను జతపరిచినప్పుడు ఏకీభవిస్తాయి. కనుక వాటిని పరిగణనలోనికి తీసుకోలేము, కాని ఘనపరిమాణము మాత్రము ఆ వస్తువులోని ఘనాకార ఆకృతుల ఘనపరిమాణముల మొత్తమునకు సమానం.
→ వివిధ ఘనాకృతులు, వాటి ఉపరితల వైశాల్యములు, ఘనపరిమాణములు :
→ కొన్ని ఘనాకృతులు మరియు వాని సమ్మేళన ఆకారాలు :