Students can go through AP Board 10th Class Maths Notes 3rd Lesson బహుపదులు to understand and remember the concept easily.
AP Board 10th Class Maths Notes 3rd Lesson బహుపదులు
→ పావులూరి మల్లన 11వ శతాబ్దం :
- పావులూరి మల్లన ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు. ఇతడు 11వ శతాబ్దానికి చెందిన తూర్పు .
- చాళుక్యరాజైన రాజరాజనరేంద్రుని ఆస్థాన పండితుడు. ఇతను నన్నయ భట్టుకు సమకాలికుడు.
- పావులూరి మల్లన మహావీరాచార్యునిచే రచింపబడిన ‘గణితసార సంగ్రహం’ అనే ఆ సంస్కృత భాషలోని గణితగ్రంథాన్ని స్వతంత్ర అనువాద పద్దతిలో తెలుగు భాషలోకి అనువదించాడు. దీని పేరు “సారసంగ్రహ గణితం”. చాలా సరళమైన శైలిలోని ఈ గణిత గ్రంథము ఒక పద్యకావ్యంలా ఉంటుంది. ఆ కాలం ఆ మూల గంథమైన ‘గణిత సారసంగ్రహం ‘లో పరికర్మ, భిన్న, ప్రకీర్ల, తైరాశిక, మిత్ర క్షేత్ర, ఖాత, ఛాయవ్యవహారములు అని 8 ప్రకరణాలుగా ఉంటే మల్లన మిశ్ర గణితాన్ని సూత్ర గణితం, సువర్ణ గణితం అని రెండు భాగాలుగా చేశాడు.
- మూలములోని గణిత విధానములను మాత్రమే తీసుకొని సమస్యలు, ఉదాహరణలు, తనదైన పద్ధతిలో స్వతంత్రముగా ఇచ్చాడు. భిన్నాంకముల సమస్యలలో ‘ఇష్టకర్మము’ , అనే గణిత వ్యవహారంలో కూడా మల్లన అనేకమైన ఉదాహరణలు ఇచ్చాడు.
- సార సంగ్రహ గణితం’ గ్రంధాన్ని పాటి గణితం, క్షేత్ర గణితం మరియు బీజ గణితం – అనే మూడు విభాగాలుగా వ్రాశాడు. పావులూరి గణితంగా ప్రసిద్ది చెందిన “సార సంగ్రహగణితం” తొలి తెలుగు గ్రంథం. తొలి తెలుగు గణిత గ్రంథం వ్రాసిన ఘనత – పావులూరి మల్లనకు దక్కింది.
→ బహుపది . చరరాశుల యొక్క ఘాతాంకాలు రుణేతర పూర్ణసంఖ్యలుగా గల బీజీయ సమాసాలను ‘బహుపదులు అంటారు.
ఉదా :
- 3x + 9
- 4x2y + 3xy2 – 7xy + 7
- x3 – √3 x2 + 7x – 9
→ బహుపది పరిమాణం : బహుపది వివిధ పరిమాణాలలో గరిష్ఠ పరిమాణమే బహుపది పరిమాణము.
ఉదా : p(x) = 7x4 – 3×3 + 5×2 + 9x + 3 యొక్క పరిమాణం : 4
ply) = 9×3 – 7×5 – 8 + 7×2 – Q యొక్క పరినూణం : 5
సూచన : p(x) ఒక బహుపది అయిన X యొక్క గరిష్ఠ ఘాతాంకము p(x) యొక్క పరిమాణం అవుతుంది.
→ n వ పరిమాణ బహుపది యొక్క సాధారణ రూపం :
p(x) = a0xn + a1 xn-1 + a2 xn-2 + …. + an-1 x + an. ఇక్కడ a0, a1, a2, . . an-1, a లు వాస్తవ సంఖ్యలు మరియు a0 ≠ 0.
- స్థిర బహుపది : ‘సున్న’ పరిమాణంగా గల బహుపది
ఉదా : p(x) = 8
p(y) = – 4 . - రేఖీయ బహుపది : పరిమాణం ‘1’ గా గల బహుపది
ఉదా : p(x) = 5x – 4
p(x) = 9z + 27 . - వర్గ బహుపది : పరిమాణం ‘2’ గా గల బహుపది
ఉదా : p(x) = x2 + 5x + 6 .
p(y) = 4y2 – 12y + 9 - ఘన బహుపది : పరిమాణం ‘3’ గా గల బహుపది
ఉదా : p(x) = 8x3 – 4x2 + 9x + 8
p(y) = y3 + 8y2 – 3y + 4
సూచన : బహుపది యొక్క పరిమాణం ఆ బహుపదిలోని పదాలకన్నా 1 తక్కువ p(x) లో n పదాలు ఉంటే p(x) యొక్క పరిమాణం : n – 1.
→ బహుపది విలువ : బహుపది p(x) లోని చరరాశి x కు k ను ప్రతిక్షేపించగా వచ్చే విలువను x = k వద్ద p(x) యొక్క బహుపది విలువ అంటారు. దీనిని p(k) తో సూచిస్తారు.
ఉదా : p(x) = x2 – 5x + 6
x = 1 వద్ద p(x) విలువ
p(1) = (1)2 5 (1) + 6
= 1 – 5 + 6 = 2
x = 1 వద్ద p(x) విలువ p(1) = 2
→ బహుపది శూన్య విలువ : బహుపది p(x) లోని చరరాశి x యొక్క ఏ విలువకు p(x) బహుపది విలువ శూన్యం (‘0’) అవుతుందో. x యొక్క ఆ విలువను బహుపది p(x) శూన్య విలువ అంటారు
ఉదా :
(1) p(x) = 5x – 10
x = 2 అయిన p(2) = 5(2)
10 = 10
10 = 0
p(2) = 0
కావున p(x) = 5x
10 యొక్క శూన్య విలువ ‘2’ అవుతుండ
(2) p(x) = x2 – 3x + 2
x = 3 అయిన
p(3) = (3)2 – 3(3) + 2 = 2
p(3) = 2
p(3) ≠ 0 కావున p(x) కు 3 శూన్య విలువ కాదు.
(1) రేఖీయ బహుపది p(x) = ax + b ఒకే ఒక శూన్య విలువ x =-b/a ను కలిగి ఉంటుంది.
(2) (i) వర్గ బహుపది p(x) = ax2 + bx + c గరిష్ఠంగా రెండు శూన్య విలువలను కలిగి ఉంటుంది.
(ii) p(x) = ax2 + bx + c వర్ణ బహుపది కావున
- D = b2 – 4ac > 0 అయిన రెండు శూన్య విలువలు (α ≠ β), α, β ∈ R ను కలిగి ఉంటుంది.
- D = b2 – 4ac = 0 అయిన ఒకే ఒక శూన్య విలువ (α = β), α ∈ R ను కలిగి ఉంటుంది.
- D = b2 – 4ac < 0 అయినప్పుడు p(x) కు వాస్తవ శూన్య విలువలు ఉండవు.
(iii) వర్గ బహుపది p(x) యొక్క శూన్య విలువలు
- D = b2 – 4ac > 0 అయినప్పుడు α ≠ β
α = \(\frac{-b+\sqrt{D}}{2 a}\) మరియు β = \(\frac{-b-\sqrt{D}}{2 a}\) - D = b2 – 4ac = 0 అయినప్పుడు α = β
α = \(\frac{-b}{2 a}\)
(3) ఘన బహుపది p(x) = ax3 + bx2 + cx + d గరిష్ఠంగా 3 శూన్య విలువలను కలిగి ఉంటుంది.
(4) 1వ పరిమాణ బహుపది గరిష్ఠంగా n శూన్య విలువలను కలిగి ఉంటుంది.
→ బహుపదులను రేఖీయ చిత్రాలుగా చూపడం :
- రేఖీయ బహుపది p(x) = ax + bని జ్యా మితీయంగా చిత్రించినపుడు ‘వచ్చే గ్రాఫ్ ఒక సరళరేఖను సూచిస్తుంది.
y = p(x) = ax + b, a ≠ 0 గ్రాఫ్ సూచించే సరళరేఖ
X – అక్షాన్ని ఒకే ఒక బిందువు ( \(\frac{-b}{a}\), 0) వద్ద ఖండిస్తుంది. ఈ ఖండన బిందువులోని X – నిరూపకం \(\frac{-b}{a}\), p(x) = ax + b యొక్క శూన్య విలువ అవుతుంది. - వర్గ బహుపది y = p(x) = ax2 + bx + c రేఖీయ చిత్రం ఒక పరావలయాన్ని సూచిస్తుంది. p(x) లో x2 గుణకం a > 0 అయిన పరావలయం పైవైపు వివృతంగాను a < 0 అయిన క్రిందివైపు వివృతంగాను ( ) ఉంటుంది. ఈ రెండు రకాల పరావలయాలు X – అక్షాన్ని గరిష్ఠంగా రెండు బిందువుల వద్ద ఖండిస్తాయి. ఈ రెండు బిందువులలోని X – నిరూపకాలే p(x) యొక్క శూన్య విలువలు అవుతాయి.
సూచన :
p(x) = ax2 + bx + c, X- అక్షాన్ని (\(\frac{-b+\sqrt{b^{2}-4 a c}}{2 a}\), 0) మరియు (\(\frac{-b-\sqrt{b^{2}-4 a c}}{2 a}\), o) అనే బిందువుల వద్ద ఖండిస్తుంది.
→ ఘన బహుపది : ఘన బహుపది p(x) = ax3 + bx2 + cx + d రేఖాచిత్రం X – అక్షాన్ని గరిష్టంగా మూడు బిందువుల వద్ద ఖండిస్తుంది. ఈ మూడు బిందువులలోని X- నిరూపకాలు p(x) యొక్క శూన్య విలువలు అవుతాయి.
→ ఘన బహుపది రేఖాచిత్రము – వివిధ సందర్భాలలో : p(x) = ax3 + bx2 + cx + d:
→ బహుపదుల భాగహార అల్ గారిథమ్ (బహుపదుల భాగహార నియమం) : p(x) మరియు g(x) లు రెండు బహుపదులు, g(x) = 0 అయిన p(x) = g(x) × q(x) + r(x) అయ్యేటట్లు q(x) మరియు r(x) అనే బహుపదులను కనుగొనవచ్చును. ఈ ఫలితాన్నే ‘బహుపదుల భాగహార అల్గారిథమ్’ అంటారు. ఇక్కడ r(x) = 0 లేదా r(x) పరిమాణం < g(x) పరిమాణం .
పై నియమం నుండి మనం క్రింది విషయాలు తెలుసుకొనవచ్చును.
- g(x) రేఖీయ బహుపది అయితే r(x) = స్థిరాంకము.
- q(x) పరిమాణం 1 అయిన p(x) పరిమాణం = 1 + g(x) పరిమాణం.
- q{x} పరిమాణం n అయిన p(x) పరిమాణం = n + g(x) పరిమాణం
- p(x) ను X – a చే భాగించగా వచ్చే శేషము p(a) అవుతుంది.
- శేషము r = 0 అయితే p(x) కు g(x) కారణాంకము అవుతుంది.
అనగా p(x) = g(x) × q(x) అవుతుంది.