These AP 10th Class Physics Chapter Wise Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం will help students prepare well for the exams.
AP Board 10th Class Physical Science 10th Lesson Important Questions and Answers విద్యుదయస్కాంతత్వం
10th Class Physics 10th Lesson విద్యుదయస్కాంతత్వం 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
విద్యుత్ ప్రవాహం గల తీగను అయస్కాంత క్షేత్రంలో ఉంచినపుడు ఏం జరుగుతుంది?
జవాబు:
సందర్భం – 1 :
విద్యుత్ ప్రవాహం గల తీగను క్షేత్ర దిశకు లంబంగా గాని, కొంత కోణంతో గాని ఉంచినపుడు :
విద్యుత్ ప్రవాహం గల తీగపై అయస్కాంత క్షేత్రం బలాన్ని ప్రయోగిస్తుంది. (లేక) విద్యుత్ ప్రవాహం గల తీగపై అయస్కాంత క్షేత్రం బలాన్ని ప్రయోగించడం వలన ఆ తీగ బల దిశలో వంగుతుంది.
సందర్భం – 2 :
విద్యుత్ ప్రవాహం గల తీగను క్షేత్రదిశకు సమాంతరంగా ఉంచినపుడు :
తీగపై ఎటువంటి బలమూ ప్రయోగింపబడదు.
ప్రశ్న 2.
దండాయస్కాంత క్షేత్ర బలరేఖలను చూపు పటం గీయుము.
జవాబు:
ప్రశ్న 3.
ఇచ్చిన పటాన్ని లెంజ్ నియమానికి అనుగుణంగా సరిచేసి గీయండి.
జవాబు:
ప్రశ్న 4.
విద్యుత్, అయస్కాంతత్వం మధ్య సంబంధం ఉందని తెలిపే ఆయిర్ స్టెడ్ ప్రయోగాన్ని వివరించుము.
జవాబు:
అయస్కాంత దిక్సూచిని ఒక తీగ కింద ఉంచి, ఆ తీగ గుండా విద్యుత్ ప్రవాహాన్ని పంపితే, అయస్కాంత దిక్సూచిలోని సూచిక కదలడం గమనించవచ్చు. ఈ దృగ్విషయం ద్వారా విద్యుత్, అయస్కాంతత్వం మధ్య పరస్పర సంబంధం ఉందని గమనించవచ్చు.
ప్రశ్న 5.
AC విద్యుత్ మోటార్ లో స్లిప్-రింగ్ ఉపయోగం ఏమిటి?
జవాబు:
తీగ చుట్టలో విద్యుత్ ప్రవాహ దిశను నిరంతరంగా మార్చుటకు స్లిప్ – రింగ్లు ఉపయోగపడతాయి.
ప్రశ్న 6.
క్షేత్రం అనగానేమి?
జవాబు:
ఒక పదార్థం దాని చుట్టూ ఎంత ప్రదేశం మేరకు ఉన్న ఇతర పదార్థాలపై బలాన్ని ప్రయోగించగలదో ఆ ప్రదేశాన్ని ఆ పదార్థం యొక్క ‘క్షేత్రం’ అంటాం.
ప్రశ్న 7.
క్షేత్రానికి గల లక్షణాలేమిటి?
జవాబు:
క్షేత్రానికి రెండు లక్షణాలు కలవు. అవి :
i) క్షేత్రదిశ
ii) క్షేత్రబలం.
ప్రశ్న 8.
అసమక్షేత్రం అంటే ఏమిటి?
జవాబు:
ఏ క్షేత్రం యొక్క బలం, దిశలలో ఏదైనా ఒకటి బిందువు, బిందువుకు మారుతుందో దానిని అసమక్షేత్రం అంటారు.
ప్రశ్న 9.
సమక్షేత్రం అంటే ఏమిటి?
జవాబు:
ఏ క్షేత్రం యొక్క క్షేత్ర బలం, దిశ రెండూ స్థిరంగా ఉంటాయో దానిని సమక్షేత్రం అంటారు.
ప్రశ్న 10.
బలరేఖలంటే ఏమిటి?
జవాబు:
ఒక దండాయస్కాంతానికి బాహ్యంగా ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువానికి వెళ్ళునట్లుగా కన్పించే ఊహాత్మక రేఖలను బలరేఖలంటారు.
ప్రశ్న 11.
అయస్కాంత అభివాహం అంటే ఏమిటి?
జవాబు:
క్షేత్రానికి లంబంగా A వైశాల్యం గల తలం గుండా వెళ్ళే బలరేఖల సంఖ్యను అయస్కాంత అభివాహం అంటారు. దీనిని ‘Φ’ తో సూచిస్తాము.
ప్రశ్న 12.
అయస్కాంత అభివాహసాంద్రత అంటే ఏమిటి? (లేదా) అయస్కాంత క్షేత్ర ప్రేరణను నిర్వచించుము.
జవాబు:
క్షేత్రానికి లంబంగా ఉన్న ప్రమాణ వైశాల్యం గల తలం గుండా వెళ్ళే అయస్కాంత అభివాహాన్ని అయస్కాంత అభివాహ సాంద్రత లేదా క్షేత్రప్రేరణ అంటారు. దీనిని ‘B’ తో సూచిస్తారు.
ప్రశ్న 13.
అయస్కాంత అభివాహానికి, అభివాహ సాంద్రతకు గల ప్రమాణాలను రాయుము.
జవాబు:
S.I. పద్ధతిలో అయస్కాంత అభివాహానికి ప్రమాణం వెబర్. అభివాహ’ సాంద్రతకు ప్రమాణం వెబర్ / మీటర్². దీనినే టెస్లా అని పిలుస్తారు.
ప్రశ్న 14.
కుడిచేతి బొటనవేలు నిబంధనను రాయుము.
జవాబు:
విద్యుత్ ప్రవహించే తీగను మీ కుడిచేతితో పట్టుకున్నట్లుగా భావించిన, బొటనవేలు దిశలో విద్యుత్ ప్రవాహదిశ ఉంటే తీగచుట్టూ ఉన్న మిగతా వేళ్లు అయస్కాంత క్షేత్ర దిశను సూచిస్తాయి.
ప్రశ్న 15.
అయస్కాంత క్షేత్ర దిశకు సమాంతరంగా కదిలే ఆవేశంపై పనిచేసే అయస్కాంత బలం ఎంత?
జవాబు:
అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా ఒక ఆవేశం కదిలితే అయస్కాంత బలం విలువ శూన్యమగును.
ప్రశ్న 16.
విద్యుత్ ప్రవహించే తీగను అయస్కాంత క్షేత్రంలో ఉంచిన ఏం జరుగును?
జవాబు:
అయస్కాంత క్షేత్రంలో ఉంచిన విద్యుత్ ప్రవాహ తీగ, అయస్కాంత బలానికి లోనవుతుంది.
ప్రశ్న 17.
విద్యుదయస్కాంత ప్రేరణ అనగానేమి?
జవాబు:
వలయంలో విద్యుత్ జనకం లేకుండా మారుతున్న అయస్కాంత క్షేత్రం నుండి విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియను విద్యుదయస్కాంత ప్రేరణ అంటారు.
ప్రశ్న 18.
ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమాన్ని తెల్పుము.
జవాబు:
ఒక సంవృత వలయంలో ఏర్పడ్డ విద్యుచ్ఛాలక బలం యొక్క విలువ దాని గుండా పోయే అయస్కాంత అభివాహపు మార్పు రేటుకు సమానం.
ప్రశ్న 19.
ఒక వాహకం ద్వారా కరెంటును ప్రవహింపజేసిన అది ఎలా పనిచేస్తుంది?
జవాబు:
ఒక వాహకం ద్వారా కరెంటును ప్రవహింపజేసిన అది అయస్కాంతము వలె పనిచేస్తుంది.
ప్రశ్న 20.
లెంజ్ నియమమును రాయుము.
జవాబు:
వలయంలో ప్రేరిత విద్యుత్ ప్రవాహము దానిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన మార్పుని వ్యతిరేకించే దిశలో కన్పిస్తుంది.
ప్రశ్న 21.
ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ షరతును రాయుము.
జవాబు:
విద్యుత్ వాహకము సమ అయస్కాంత క్షేత్రంలో కదిలినపుడే ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమం వర్తిస్తుంది.
ప్రశ్న 22.
విద్యుత్ ప్రవాహం గల రాగి తీగలో అయస్కాంత క్షేత్రముంటుందని ప్రతిపాదించినది ఎవరు?
జవాబు:
విద్యుత్ ప్రవాహం గల రాగి తీగలో అయస్కాంత క్షేత్రముంటుందని ‘హేన్స్ క్రిస్టియన్ ఆయిర్ స్టెడ్’ ప్రతిపాదించాడు.
ప్రశ్న 23.
‘విద్యుత్ ప్రవాహం గల తీగ వద్ద అయస్కాంత సూచిని ఉంచినపుడు ఏం జరుగుతుంది? ఎందుకు?
జవాబు:
విద్యుత్ ప్రవాహం గల తీగ వద్ద అయస్కాంత సూచిని ఉంచినపుడు, ఆ తీగచుట్టూ వున్న అయస్కాంత క్షేత్ర ప్రభావం వలన సూచి అపవర్తనం చెందుతుంది.
ప్రశ్న 24.
అయస్కాంత బలరేఖల దిశ ఏది?
జవాబు:
అయస్కాంత బలరేఖలు అయస్కాంత ఉత్తర ధృవం వద్ద బయలుదేరి దక్షిణ దృవం ద్వారా అయస్కాంతంలోకి ప్రవేశించే ఆ ఊహాత్మక రేఖలు.
ప్రశ్న 25.
అయస్కాంత బలరేఖల ఉపయోగమేమి?
జవాబు:
అయస్కాంత బలరేఖల వల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి. అవి :
- అయస్కాంత క్షేత్ర స్వభావం తెలుసుకోవచ్చు.
- బలరేఖకు ఏదైనా బిందువు వద్ద గీయబడిన స్పర్శరేఖ, ఆ బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర దిశను తెలియజేస్తుంది.
ప్రశ్న 26.
A వైశాల్యం గల తలం గుండా ‘θ’ కోణం చేస్తూ వెళ్ళే అయస్కాంత అభివాహమునకు సూత్రం రాయుము.
జవాబు:
Φ = BA cos θ.
ప్రశ్న 27.
క్షేత్రానికి లంబంగా ఉన్న ఏకాంక వైశాల్యం గుండా అభివాహం ఎంత?
జవాబు:
\(B=\frac{\phi}{A}\)
ప్రశ్న 28.
కరెంటు ప్రవహించే తీగచుట్ట లేదా సోలినాయిడ్ వల్ల ఏర్పడిన అయస్కాంత క్షేత్ర దిశను ఎలా కనుగొంటారు?
జవాబు:
కుడిచేతి బొటనవేలి నియమం :
విద్యుత్ ప్రవాహదిశలో మీ చేతివేళ్ళను ముడిస్తే బొటనవేలు దిశ అయస్కాంత క్షేత్ర దిశను సూచిస్తుంది.
ప్రశ్న 29.
అయస్కాంత క్షేత్రానికి కొంత కోణం (θ) చేస్తూ ‘V’ వేగంతో కదిలే ఆవేశంపై పనిచేసే అయస్కాంత బలం ఎంత?
జవాబు:
F = qVB sin θ.
ప్రశ్న 30.
అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా కదిలే ఆవేశంపై పనిచేసే అయస్కాంత బలం ఎంత?
జవాబు:
ఏ బలమూ పనిచేయదు.
ప్రశ్న 31.
కదిలే ఆవేశంపై పనిచేసే అయస్కాంత క్షేత్ర దిశను ఎలా కనుగొంటారు?
జవాబు:
పటంలో చూపిన విధంగా కుడిచేతి చూపుడువేలు, బొటనవేలు, మధ్య వేలు, ఒకదానికొకటి పరస్పరం లంబంగా వుంచితే, చూపుడువేలు ఆవేశ వేగదిశను, మధ్య వేలు క్షేత్రం (B) దిశను సూచిస్తే బొటనవేలు బలం (F) దిశను సూచిస్తుంది.
ప్రశ్న 32.
విద్యుత్ ప్రవాహం కలిగిన తీగను అయస్కాంత క్షేత్రంలో క్షేత్ర దిశకు లంబంగా ఉంచితే ఏం జరుగుతుంది?
జవాబు:
అయస్కాంత క్షేత్ర దిశకు లంబంగా అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ ప్రవాహం కలిగిన తీగను ఉంచితే అది F= IlB కి సమానమైన అయస్కాంత బలానికి లోనౌతుంది.
ప్రశ్న 33.
విద్యుత్ మోటారు పని చేసే నియమం ఏమిటి?
జవాబు:
అయస్కాంత క్షేత్రంలో ఉంచబడిన విద్యుత్ ప్రవాహం గల తీగచుట్టపై ప్రయోగించబడిన బలం ఆధారంగా విద్యుత్ మోటారు పని చేస్తుంది. మోటారు విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది.
ప్రశ్న 34.
ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమం రాయుము.
జవాబు:
తీగ చుట్టలో అయస్కాంత అభివాహాన్ని నిరంతరంగా మారుస్తూ ఉంటే ఆ తీగ చుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది.
ప్రశ్న 35.
అయస్కాంత అభివాహంలో మార్పుకు, ప్రేరిత విద్యుచ్ఛాలక బలానికి మధ్య సంబంధమేమిటి?
జవాబు:
ఒక సంవృత ఉచ్చులో ఏర్పడ్డ విద్యుచ్ఛాలక బలం యొక్క విలువ దాని గుండా పోయే అయస్కాంత అభివాహ మార్పురేటుకు సమానం.
ప్రశ్న 36.
మెటల్ డిటెక్టర్ ఎలా పనిచేస్తుంది?
జవాబు:
- సెక్యూరిటీ చెకింగ్ కోసం ఏర్పాటు చేసే పెద్ద ద్వారంలో ఒక పెద్ద తీగ చుట్టను ఉంచుతారు. అది బలహీనమైన, సహజ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది.
- మనం ఏదైనా ఇనుములాంటి అయస్కాంత క్షేత్ర ప్రభావిత వస్తువును ఆ ద్వారం గుండా తీసుకొని వెళితే తీగచుట్ట యొక్క అయస్కాంత క్షేత్ర అభివాహంలో మార్పు ఏర్పడి, విద్యుత్ ప్రవాహం ఉద్భవించడం వల్ల అలారం మోగుతూ హెచ్చరిస్తుంది.
ప్రశ్న 37.
విద్యుచ్ఛక్తికి, అయస్కాంతతత్వానికి మధ్య గల సంబంధాన్ని మొదట ప్రదర్శించిన శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:
H.C. ఆయిర్ స్టెడ్
ప్రశ్న 38.
అయస్కాంత క్షేత్రము దేనిపై ఆధారపడును?
జవాబు:
అయస్కాంత క్షేత్రము దాని గుండా ప్రవహించే విద్యుత్ పై ఆధారపడును.
ప్రశ్న 39.
సరిత ఒక పుస్తకంలో ఈ క్రింది విషయాన్ని చదివింది.
“ఒక తీగచుట్టలో జనించే ప్రేరిత విద్యుచ్ఛాలక బలం ఆ తీగచుట్ట నిరోధంపై ఆధారపడదు”.
పై సమాచారం సరైనదని నీవెలా విశ్లేషిస్తూ, నిరూపిస్తావు?
జవాబు:
తీగచుట్టలో ఏర్పడు ప్రేరిత విద్యుచ్ఛాలక బలం, అభివాహంలో మార్పుకు అనులోమానుపాతంలో ఉండును. కాని నిరోధంపై ఆధారపడదు. కనుక సరిత చదివిన ప్రవచనము సరైనదే.
10th Class Physics 10th Lesson విద్యుదయస్కాంతత్వం 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
జనరేటర్ తయారీ వెనుక వాడిన నియమాన్ని ఆనంద్ ప్రశంసించాడు. ఆ నియమం పేరేమిటి? ఆ నియమాన్ని తెల్పండి.
జవాబు:
- జనరేటర్ తయారీలో ఇమిడియున్న సూత్రాన్ని ఆనంద్ అభినందించాడు.
- దీనిలో ఇమిడియున్న సూత్రం : ఫారడే నియమం
- ఫారడే నియమం : తీగ చుట్టలో అయస్కాంత అభివాహాన్ని నిరంతరంగా మారుస్తూ ఉంటే ఆ తీగచుట్టలో విద్యుత్ – ప్రవాహం ఏర్పడుతుంది.
ప్రశ్న 2.
కింది పటం సహాయంతో ఉపాధ్యాయుడు అయస్కాంత బలరేఖలు వివృతాలు కావు సంవృతాలు అని వివరించాడు. ఇది సరైనదో కాదో నిర్ధారించుకోవడానికి మీరు అడిగే ప్రశ్నలకు రాయండి.
జవాబు:
a) అయస్కాంతానికి లోపల ఏదైనా అయస్కాంత బలరేఖలు ఉన్నాయా?
b) దండాయస్కాంతం లోపల బలరేఖలున్నా, వాటిదిశ ఏమిటి?
c) అయస్కాంతముకు బాహ్యముగా బలరేఖల దిశ ఏమిటి?
d) బలరేఖల మధ్య ఖాళీస్థలం సమానముగా ఉన్నదా?
e) ధృవాల వద్ద బలరేఖలు దగ్గరగా ఉండుట వలన ఫలితమేమి?
ప్రశ్న 3.
ఉష్ణ బంధక పొర కలిగిన రాగితీగ చుట్ట గాల్వనా మీటరుతో వలయంలో కలుపబడి ఉంది. కింది సందర్భాలలో ఏం జరుగుతుందో వివరించండి.
i) ఆ తీగచుట్టలోకి ఒక దండాయస్కాంతాన్ని నెట్టినప్పుడు.
ii) ఆ తీగచుట్ట నుండి దండాయస్కాంతాన్ని బయటికి లాగినప్పుడు.
iii) దండాయస్కాంతాన్ని తీగచుట్టలో స్థిరంగా ఉంచినప్పుడు.
జవాబు:
i) గాల్వనోమీటరులో సూచిక అపవర్తనం చెందుతుంది. (లేదా) తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది.
ii) గాల్వనోమీటరులో సూచిక అపవర్తనం చెందుతుంది. (లేదా) తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది.
iii) గాల్వనోమీటరులో సూచిక అపవర్తనం చెందదు. (లేదా) తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడదు.
ప్రశ్న 4.
విద్యుత్ ప్రవహిస్తున్న సొలినాయిడ్ చుట్టూ ఏర్పడే అయస్కాంత క్షేత్ర బలరేఖలను, దండాయస్కాంతం చుట్టూ ఏర్పడే అయస్కాంత క్షేత్ర బలరేఖలతో పోల్చండి.
జవాబు:
దండాయస్కాంతం వలన ఏర్పడిన అయస్కాంత క్షేత్ర బలరేఖలు | సొలినాయిడ్ వలన ఏర్పడిన అయస్కాంత క్షేత్ర బలరేఖలు |
2) దండాయస్కాంతం బయట బలరేఖలు దిశ ఉత్తరం నుండి దక్షిణం వైపు ఉంటుంది. | 2) సొలినాయిడ్ బయట బలరేఖలు దిశ ఉత్తరం నుండి దక్షిణం వైపు ఉంటుంది. |
3) దండాయస్కాంతం లోపలి బలరేఖలు దిశ దక్షిణం నుండి ఉత్తరం వైపు ఉంటుంది. | 3) సొలినాయిడ్ లోపలి బలరేఖలు దిశ దక్షిణం నుండి ఉత్తరం వైపు ఉంటుంది. |
4) దండాయస్కాంతం లోపల బలరేఖలను గుర్తించలేము. | 4) సొలినాయిడ్ లోపల బలరేఖలను గుర్తించగలము. |
5) బలరేఖలు సంవృత వలయాలు. | 5) బలరేఖలు సంవృత వలయాలు. |
6) దృవాల వద్ద ఎక్కువ బలరేఖలు ఉండటం వలన అయస్కాంత క్షేత్ర తీవ్రత ఎక్కువగా ఉంటుంది. | 6) ధృవాల వద్ద ఎక్కువ బలరేఖలు ఉండటం వలన అయస్కాంత క్షేతీవ్రత ఎక్కువగా ఉంటుంది. |
7) ఈ అయస్కాంత బల రేఖలు సాలినాయిడ్ వలన ఏర్పడిన అయస్కాంత బలరేఖలను పోలి ఉంటాయి. | 7) ఈ అయస్కాంత బల రేఖలు దండాయస్కాంతం వలన ఏర్పడిన అయస్కాంత బలరేఖలను పోలి ఉంటాయి. |
ప్రశ్న 5.
ఆయిర్ స్టెడ్ ప్రయోగం నిర్వహించుటకు కావలసిన పరికరాల జాబితా రాసి, ప్రయోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలు రాయండి.
జవాబు:
ఆయిర్ స్టెడ్ ప్రయోగం కొరకు కావలసిన పరికరాలు :
బ్యాటరీ, వాహక తీగలు, స్విచ్, అయస్కాంత దిక్సూచి.
జాగ్రత్తలు :
- ప్రయోగ పరికరాలకు దగ్గరలో ఏ ఇతర అయస్కాంతాలు (లేదా) పనిచేస్తున్న విద్యుత్ సాధనాలను ఉంచరాదు.
- ప్రయోగంలోని వాహక తీగకు తగినంత దగ్గరగా దిక్సూచిని ఉంచాలి.
- దిక్సూచి నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే వలయంలో విద్యుత్ ను ప్రసరింపజేయాలి.
ప్రశ్న 6.
పటంలో చూపిన విధంగా ఒక స్ప్రింగ్ ను వ్రేలాడదీసారు. స్ప్రింగ్ రెండు చివరల మధ్య పటంలో చూపిన విధంగా బ్యాటరీ స్విచ్ ను కలిపారు. స్విచ్ ను మూసినపుడు బ్యాటరీ ఏమి జరుగుతుంది. ఊహించండి.
జవాబు:
- స్ప్రింగులో అయస్కాంత ప్రేరణ రేఖలు ఏర్పడును.
- ఇది సోలినాయిడ్ ను పోలి ఉన్నది.
- సోలినాయిడ్, దండయస్కాంతంగా ప్రవర్తించును.
ప్రశ్న 7.
ఒక పొడుగాటి కాపర్ స్థూపాకార గొట్టాన్ని తీసుకోండి. దానిని క్షితిజానికి లంబంగా ఉండేట్లు పట్టుకోండి. ఒక రాయిని, దండయస్కాంతాన్ని పటంలో చూపిన విధంగా రాయిని గొట్టం బయట, అయస్కాంతాన్ని గొట్టంగుండా చలించేట్లు రెంటిని జారవిడిచారు. రెంటిలో ఏది త్వరగా భూఉపరితలాన్ని తాకుతుంది? ఎందుకో ఊహించి చెప్పండి. సహేతుకమైన కారణాలివ్వండి.
జవాబు:
- ముందుగా రాయి భూమిని చేరును.
- రాగి గొట్టం గుండా దండాయస్కాంతం ప్రయాణించున్నప్పుడు విద్యుదయస్కాంత ప్రేరణ ఏర్పడును. ఇది అయస్కాంత చలనంను నిరోధించును.
- ఇక్కడ లెంజ్ నియమమును పాటించుచున్నది.
ప్రశ్న 8.
పటంలో చూపిన విధంగా దండయస్కాంతాన్ని తీగ చుట్టవైపు కదుపుతుంటే తీగచుట్టలో ప్రేరిత విద్యుత్ జనిస్తుంది.
a) ఆ ప్రేరిత విద్యుత్ దిశ ఎటు ఉంటుంది?
b) తీగచుట్ట వద్ద దండాయస్కాంతం వల్ల ఉండే అయస్కాంత క్షేత్రాన్ని ; ప్రేరిత విద్యుత్ వల్ల వచ్చే అయస్కాంత క్షేత్ర దిశలను గీయండి.
జవాబు:
a) ప్రేరిత, విద్యుత్ ప్రవాహదిశ దండయస్కాంత ఉత్తర ధృవంతో పోల్చినప్పుడు అపసవ్య దిశలో ఉండును.
b)
ప్రశ్న 9.
A.C., D.C. ల మధ్య భేదాలను రెండింటిని రాయుము.
జవాబు:
ఏకాంతర విద్యుత్ (A.C.) | ఏకముఖ విద్యుత్ (D.C.) |
1) ఇది ప్రతి క్షణానికి తన ప్రవాహదిశను మార్చుకొను విద్యుత్. | 1) ఇది ప్రతి క్షణానికి తన ప్రవాహదిశను మార్చుకొనని విద్యుత్. |
2) దీనిని దూరప్రాంతాలకు విద్యుత్ ను సరఫరా చేయుటకు ఉపయోగిస్తారు. | 2) దీనిని చిన్న చిన్న వలయాలలో విద్యుత్ ను సరఫరా చేయుటకు ఉపయోగిస్తారు. |
ప్రశ్న 10.
విద్యుత్ మోటర్, జనరేటర్ మధ్య భేదాన్ని వ్రాయుము.
జవాబు:
విద్యుత్ మోటర్ | జనరేటర్ |
ఇది విద్యుత్ శక్తిని యాంత్రికశక్తిగా మార్చును. | ఇది యాంత్రికశక్తిని విద్యుత్ శక్తిగా మార్చును. |
ప్రశ్న 11.
A.C. జనరేటర్, D.C. జనరేటర్ మధ్య భేదాన్ని వ్రాయుము.
జవాబు:
A.C. జనరేటర్ | D.C. జనరేటర్ |
ఇది ఏకాంతర విద్యుత్ ను జనకంగా చేసుకొని పనిచేస్తుంది. | ఇది ఏకముఖ విద్యుత్ ను జనకంగా చేసుకొని పనిచేస్తుంది. |
ప్రశ్న 12.
ఉష్ణ బంధక పొర కలిగిన రాగి తీగ చుట్ట గాల్వనా మీటరుతో వలయంలో కలుపబడి ఉంది. కింది సందర్భాలలో ఏం జరుగుతుందో వివరించండి.
i) ఆ తీగచుట్టలోకి ఒక దండాయస్కాంతాన్ని నెట్టినప్పుడు.
ii) ఆ తీగచుట్ట నుండి దండాయస్కాంతాన్ని బయటికి లాగినప్పుడు.
iii) దండాయస్కాంతాన్ని తీగచుట్టలో స్థిరంగా ఉంచినప్పుడు.
జవాబు:
i) గాల్వనోమీటరులో సూచిక అపవర్తనం చెందుతుంది. (లేదా) తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది.
ii) గాల్వనోమీటరులో సూచిక అపవర్తనం చెందుతుంది. (లేదా) తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది.
iii) గాల్వనోమీటరులో సూచిక అపవర్తనం చెందదు. (లేదా) తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడదు.
ప్రశ్న 13.
అయస్కాంత క్షేత్రాలను ఏర్పరచు మూడు పద్ధతులను రాయండి.
జవాబు:
- విద్యుత్ ప్రవహిస్తున్న తిన్నని తీగ
- సంవృత, వృత్తాకార తీగ గుండా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు
- సోలినాయిడ్ గుండా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు.
ప్రశ్న 14.
2M పొడవు ఉన్న ఒక తీగను 1.8 T ప్రేరణ అయస్కాంత క్షేత్రంలో క్షేత్ర దిశకు లంబంగా ఉంచారు. దాని గుండా 4 ఆంపియర్ల విద్యుత్ ప్రవహిస్తుంటే దానిపై పనిచేసే బలాన్ని లెక్కించండి.
జవాబు:
తీగ పొడవు l = 2m
అయస్కాంత ప్రేరణ B = 1.8 T
విద్యుత్ ప్రవాహం I = 4 ఆంపియర్లు
పనిచేసే బలం F = Bil = 1.8 × 4 × 2 = 14.4 N ∴ F = 14.4N
ప్రశ్న 15.
పటంలో చూపినట్లు దండాయస్కాంతం, తీగచుట్ట ఒకే దిశలో కదులుతూ ఉంటే ఏమి జరుగుతుందో రాయండి.
జవాబు:
- ఫారడే నియమం ప్రకారం, తీగచుట్ట మరియు అయస్కాంతాల మధ్య సాపేక్ష చలనం కారణంగా తీగచుట్టలో అయస్కాంత అభివాహాన్ని నిరంతరం మారుస్తూ ఉంటే ఆ తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది.
- ఇక్కడ, పటంలో చూపినట్లు, తీగచుట్ట మరియు దండాయస్కాంతం రెండూ ఒకే దిశలో కదులుతున్నాయి. కనుక, వాటి వేగాలు సమానమయితే తీగచుట్టలో అయస్కాంత అభివాహంలో మార్పు లేనందువల్ల తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడదు.
- అయస్కాంతం, తీగచుట్ట వేగాలు సమానం కాకపోతే తీగచుట్ట అయస్కాంతం యొక్క క్షేత్రంలో ఉన్నంతవరకు తీగచుట్టలోని అభివాహంలో మార్పు ఉంటుంది. కనుక తీగచుట్టలో విద్యుత్ ప్రేరేపింపబడుతుంది.
10th Class Physics 10th Lesson విద్యుదయస్కాంతత్వం 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
a) కుడిచేతి సూత్రాన్ని పటం గీసి, వివరించండి.
b) ఉష్ణ బంధక పొర కలిగిన రాగి తీగ చుట్ట గాల్వనా మీటరుతో వలయంలో కలుపబడి ఉంది. కింది సందర్భాలలో ఏం జరుగుతుందో వివరించండి.
i) ఆ తీగచుట్టలోకి. ఒక దండాయస్కాంతాన్ని నెట్టినప్పుడు.
ii) ఆ తీగచుట్ట నుండి దండాయస్కాంతాన్ని బయటికి లాగినప్పుడు.
iii) దండాయస్కాంతాన్ని తీగచుట్టలో స్థిరంగా ఉంచినప్పుడు.
జవాబు:
a) కదిలే ఆవేశంపై అయస్కాంత బలదిశ ఏ విధంగా ఉంటుందో కుడిచేతి నిబంధన తెలియజేస్తుంది.
కుడిచేతి బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలును ఒకదానికొకటి పరస్పరం లంబంగా ఉంచితే… చూపుడు వేలు ఆవేశవేగదిశ లేదా విద్యుత్ ప్రవాహం (i) దిశను మధ్యవేలు క్షేత్రం (B) దిశను, బొటనవేలు బలం (F) దిశను సంబంధించిన కుడిచేతి నియమం సూచిస్తుంది.
b) i) గాల్వనోమీటరులో సూచిక అపవర్తనం చెందుతుంది. (లేదా) తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది.
ii) గాల్వనోమీటరులో సూచిక అపవర్తనం చెందుతుంది. (లేదా) తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది.
iii) గాల్వనోమీటరులో సూచిక అపవర్తనం చెందదు. (లేదా) తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడదు.
ప్రశ్న 2.
విద్యుదయస్కాంతత్వంనకు సంబంధించిన ఆయిర్ స్టడ్ ప్రయోగానికి కావలసిన పరికరాల జాబితా రాయండి. ప్రయోగ విధానాన్ని తెల్పండి. ఈ ప్రయోగం ద్వారా మీరు ఏం అవగాహన చేసుకున్నారు?
జవాబు:
ఆయిర్ స్టెడ్ ప్రయోగానికి కావలసిన పరికరముల జాబితా :
బ్యాటరీలు (2), స్విచ్, 24 గేజ్ రాగి తీగ, థర్మాకోల్ షీట్, కర్రముక్కలు 2, అయస్కాంత సూచి.
ప్రయోగ విధానం :
ఒక థర్మాకోల్ షీట్ పై 1 సెం.మీ. ఎత్తున్న రెండు సన్నని కర్ర ముక్కల్ని అమర్చి, ఆ కర్రముక్కల . , గుండా 24 గేజ్ రాగి తీగను పంపి, ఆ తీగకు బ్యాటరీలు, స్విచ్ అమర్చాలి. కర్రముక్కలపై గల రాగితీగ క్రింద ఒక అయస్కాంత సూచిని ఉంచాలి.
ఇప్పుడు స్విచ్ సహాయంతో వలయంలో విద్యుత్ ను ప్రవహింపజేసి అయస్కాంత సూచిలో అపవర్తనాన్ని గమనించాలి. వలయంలో విద్యుత్ ప్రవాహ దిశను మార్చి, అయస్కాంత సూచిలో అపవర్తనాన్ని గమనించాలి.
నిర్ధారణ :
- విద్యుత్ ప్రవహిస్తున్న తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని అర్థం చేసుకున్నాను. (అయస్కాంత సూచి అపవర్తనం వల్ల)
- విద్యుత్ ప్రవాహదిశను మార్చినప్పుడు అయస్కాంత సూచి అపవర్తన దిశలో కూడా మార్పు వస్తుంది.
ప్రశ్న 3.
సోలినాయిడ్ లో అయస్కాంత క్షేత్రం ఏర్పరచుటకు చేయు ప్రయోగ విధానం, పరిశీలనలు రాయుము.
జవాబు:
- ఒక చెక్క పీటను తీసుకొని దానికి ఒక తెల్ల కాగితమును అంటించాలి.
- ఆ చెక్క పీటపై కొంత దూరంలో రెండు రంధ్రాలు చేయాలి.
- వీటికి సమాంతరంగా సమాన దూరంలో మరికొన్ని రంధ్రాలు చేయాలి.
- ఆ రంధ్రాల గుండా రాగి తీగను పంపాలి.
- ఇది ఒక తీగచుట్ట వలే ఉంటుంది. తీగచుట్ట చివరలను స్విచ్, బ్యాటరీలతో వలయంలో శ్రేణిలో కలపాలి.
- స్విచ్ వేయగానే తీగ గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. ఆ తీగ చుట్టూ కొంత ఇనుప రజను చల్లి చక్కపీటను మెల్లగా తట్టాలి.
పరిశీలన :
ఇనుప రజను ఒక క్రమ పద్ధతిలో అమరుతుంది. ఇది దండయస్కాంత బలరేఖలను పోలి ఉంటుంది.
ప్రశ్న 4.
ఒక ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో క్షేత్రదిశకు లంబంగా ఉంచిన విద్యుత్ ప్రవాహం గల తీగ పక్కకు వంగుటకు కారణాన్ని ఆ తీగపై పనిచేసే బలాల దిశలను చూపే పటంతో వివరించండి.
జవాబు:
వివరణ :
రెండు అయస్కాంత క్షేత్రాల ఫలితంగా ఏర్పడిన అయస్కాంత క్షేత్రంలో ఒక వైపున బలరేఖలు దట్టంగానూ, మరోవైపు పలుచగానూ ఉంటాయి. బలరేఖలు దట్టంగా ఉన్నవైపు నుండి పలుచగా ఉన్న వైపుకు బలం ప్రయోగింపబడు తుంది. కనుక విద్యుత్ ప్రవాహ తీగ ఒకవైపుగా నెట్టబడుతుంది.
ప్రశ్న 5.
ఇచ్చిన పటమును పరిశీలించి, క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
1) ఇచ్చిన పట సమాచారము ఏ సాధనము పని తీరును తెలియజేస్తుంది?
జవాబు:
విద్యుత్ మోటార్. 2) అయస్కాంత క్షేత్రంలో AB మరియు CD లు చేసే కోణం?
జవాబు:
AB, CD లు అయస్కాంత క్షేత్ర దిశకు లంబంగా ఉన్నాయి / 90° కోణం చేస్తున్నాయి.
3) AB మరియు CD భుజాలపై పనిచేసే అయస్కాంత బల దిశ ఏ విధంగా ఉంటుంది?
జవాబు:
AB భుజంపై బలం అయస్కాంతబల రేఖలకు లంబంగా పేజీ లోపలికి పని చేస్తుంది.
CD భుజంపై బలం అయస్కాంత బలరేఖలకు లంబంగా పేజీకి వెలుపలికి పనిచేస్తుంది.
4) దీర్ఘ చతురస్రాకార తీగచుట్టపై పనిచేసే ఫలిత బలం ఎంత?
జవాబు:
ఫలిత బలం శూన్యం.
ప్రశ్న 6.
ఏ పరికరంతో గతిజశక్తిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చును? ఆ పరికరం యొక్క చక్కని పటాన్ని గీయండి. భాగాలు గుర్తించండి.
జవాబు:
AC జనరేటర్ (లేదా) DC జనరేటర్ తో గతిజ శక్తిని, విద్యుత్ శక్తిగా మార్చవచ్చును.
(లేదా)
ప్రశ్న 7.
ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచబడిన విద్యుత్ ప్రవహిస్తున్న తీగపై కలగజేయబడే బలాన్ని గమనించుటకు అవసరమయ్యే ప్రయోగంలో వాడే పరికరాలను తెలిపి, ప్రయోగ విధానం వివరించండి.
జవాబు:
కావలసిన పరికరాలు :
1) గుర్రపునాడా అయస్కాంతం,
2) వాహక తీగ,
3) బ్యాటరీ, స్విచ్
ప్రయోగ విధానం :
1) ఒక చెక్కదిమ్మెపై చీలికలుగల రెండు కర్రపుల్లలను బిగుతుగా నిలబెట్టి వాటి ద్వారా వాహక తీగను పంపుతూ బ్యాటరీ, స్విచ్ తో వలయాన్ని ఏర్పాటు చేయాలి.
2) కర్రపుల్లల మధ్య గల వాహక తీగ గుర్రపునాడా అయస్కాంతపు రెండు ధృవాల మధ్య ఉండేటట్లుగా గుర్రపునాడా అయస్కాంతాన్ని స్థిరంగా అమర్చాలి.
3) వలయంలో విద్యుత్ ను ప్రవహింపజేస్తే వాహక తీగ పైకి లేదా కిందికి కదలడం గమనించవచ్చు.
4)
ప్రశ్న 8.
ఇండక్షన్ స్టా పనిచేయు విధానమును వివరించండి.
జవాబు:
- ఇండక్షన్ స్టవ్ విద్యుదయస్కాంత ప్రేరణ నియమంపై ఆధారపడి పనిచేయును.
- స్టవ్ ఉపరితలానికి కింద దానికి ఆనుకొని ఒక లోహపు చుట్ట ఉంటుంది.
- దీనిలో AC విద్యుత్ ప్రవహింపజేస్తే దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది.
- ఒక లోహపాత్రలో నీరు పోసి స్టవ్ పై ఉంచితే దాని అడుగుభాగంలో ఉన్న అయాస్కాంత క్షేత్రం పాత్ర అడుగు భాగాన్ని దాటడం వల్ల పాత్రపై విద్యుచ్చాలక బలం ప్రేరితమవుతుంది.
- పాత్ర లోహంతో తయారు చేసినది కావడం వలన ప్రేరిత EMF పాత్రలో ప్రేరిత విద్యుత్ ను జనింపజేస్తుంది.
- పాత్రకు నియమిత నిరోధం ఉంటుంది.
- అందువలన ప్రవహిస్తున్న విద్యుత్ వల్ల ఉష్ణం జనిస్తుంది.
- ఆ జనించిన ఉష్ణం నీటికి అందజేయబడుతుంది. పాత్రలో పదార్థం వేడి అగును. ఈ విధంగా ఇండక్షన్ స్టా పనిచేయును.
ప్రశ్న 9.
పటంలో చూపిన విధంగా ఒక వృత్తాకార తీగచుట్టను వ్రేలాడదీసారు. ఒక దండాయస్కాంతాన్ని తీగచుట్ట తలానికి లంబంగా, తీగచుట్టవైపు దాని ఉత్తర ధృవం కదిలిస్తున్నారు.
a) తీగచుట్ట గుండా పోయే అభివాహంలో మార్పు ఏ విధంగా ఉంటుంది?
b) తీగచుట్టలో ప్రేరితమయ్యే విద్యుత్ ప్రవాహ దిశ దండాయస్కాంత పరంగా ఏ దిశలో ఉంటుందో తెల్పండి?
c) తీగచుట్ట తలం వద్ద దండాయస్కాంతం వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్రం, ప్రేరిత విద్యుత్ వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్రాలను చూపే పటాన్ని గీయండి.
d) ప్రేరిత విద్యుత్ కు కారణాన్ని వివరించండి.
జవాబు:
a) ఒక దండాయస్కాంతాన్ని తీగచుట్ట తలానికి లంబంగా తీగచుట్ట వైపు దాని ఉత్తర ధృవం కదిలించిన, చుట్టలో ఏర్పడిన అభివాహం విలువ పెరుగును.
b) తీగచుట్టలో ప్రేరితమయ్యే విద్యుత్ ప్రవాహ దిశ, దండాయస్కాంత పరంగా అపసవ్య దిశలో ఉంటుంది. దీనికి కారణం ఉత్తర ధృవ ఫలితమే.
d) తీగచుట్టలో ప్రేరిత విద్యుత్ కు కారణం దాని గుండా ప్రయాణించే అభివాహం మారడమే.
ప్రశ్న 10.
పటంలో చూపిన విధంగా ” పొడవు గల వాహకం దాని పొడవుకు లంబంగా v అనే వడితో చలిస్తుంది. వాహకం అయస్కాంత క్షేత్రం B కు లంబంగా వాహక పొడవు వుంది. వాహకంలో ఎలక్ట్రానులు స్వేచ్ఛగా చలించగలవని భావిద్దాం. ఎలక్ట్రాను ఆవేశం ‘e’ అనుకుందాం.
a) వాహకంలో గల ఎలక్ట్రాన్ పై పని చేసే అయస్కాంతబలం ఎంత?
b) పై బలం ఏ దిశలో పనిచేస్తుంది?
c) ఈ బలం ఎలక్ట్రాన్ల చలనంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది?
జవాబు:
a) వాహకంలో గల ఎలక్ట్రాన్ పై పని చేయు అయస్కాంత బలము = \(\mathrm{F}_{\mathrm{m}}=\mathrm{e}(\overline{\mathrm{V}} \times \overline{\mathrm{B}})=\mathrm{BeV}\)
ఈ బలం పై నుండి క్రిందికి పనిచేయును.
b) వాహకపు కొనలు P మరియు Qగా ఊహించుము. ‘Q’ ఋణాత్మక కొనగా మరియు ‘P’ ధనాత్మక కొనగా లెక్కించిన, ఆవేశము P నుండి Q కు క్రిందకు ప్రవహించును.
c) ఈ అయస్కాంత బలం ఎలక్ట్రాన్ చలనంపై విద్యుచ్ఛాలక బలంను వాహకం యొక్క కొనల వద్ద ఏర్పరచును.
∴ BeV = eE= E = BV
ప్రశ్న 11.
అయస్కాంతబలరేఖలు సంవృత వలయాలవలే ఉంటాయని ప్రయోగపూర్వకంగా నిరూపించాలంటే ఏ ఏ పరికరాలు కావాలి? ఈ సమయంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి?
జవాబు:
ఉద్దేశం :
అయస్కాంత బలరేఖలు సంవృత వలయాలు అని చూపడం.
పరికరాలు :
ఒక చదునైన బల్ల, తెల్లని కాగితం, దండాయస్కాంతం, అయస్కాంత సూచిక.
విధానం :
- ఒక తెల్ల కాగితాన్ని బల్లపై ఉంచండి. ఆ కాగితం మధ్యలో ఒక అయస్కాంత దిక్సూచిని ఉంచి, సూచిక రెండు కొనలను సూచించే రెండు బిందువులను గుర్తించండి.
- ఇప్పుడు ఆ దిక్సూచిని తీసి, గుర్తించిన రెండు బిందువులను కలుపుతూ ఒక సరళరేఖను గీయండి.
- అది ఉత్తర-దక్షిణ దిక్కులను సూచిస్తుంది. ఆ రేఖ పై ఒక దండాయస్కాంతాన్ని దాని ఉత్తర ధృవం భూమి ఉత్తర దిక్కువైపు అయస్కాంత బలరేఖలు సూచించేటట్లు అమర్చండి.
- ఇప్పుడు దండాయస్కాంత ఉత్తర ధృవానికి దగ్గరగా అయస్కాంత దిక్సూచిని ఉంచండి.
- సూచిక నిలకడగా ఉన్న తరువాత దాని ఉత్తర దిశను సూచించే విధంగా కాగితంపై ఒక బిందువును గుర్తించండి.
- దిక్సూచిని అక్కడి నుండి తీసి గుర్తించిన బిందువు వద్ద ఉంచండి. సూచిక మరో దిశను సూచిస్తుంది.
- మరలా సూచిక ఉత్తర దిశను సూచించే విధంగా వేరొక బిందువును గుర్తించండి.
- ఇదే విధంగా దిక్సూచి దండాయస్కాంత దక్షిణ ధృవానికి చేరే వరకు చేయండి.
- ఇప్పుడు దండాయస్కాంత ఉత్తర ధృవం నుంచి దక్షిణ ధృవం వరకు మీరు గుర్తించిన బిందువులన్నీ కలపండి. అలా కలపగా ఒక వక్రరేఖ ఏర్పడుతుంది.
- ఇప్పుడు దండాయస్కాంత ఉత్తర ధృవం వద్ద మరో బిందువును ఎంచుకోండి.
- ఈ విధంగా దండాయస్కాంత ఉత్తర ధృవం వద్ద వివిధ బిందువులతో ఆరంభించి పైన చెప్పిన విధంగా రేఖలు గీయండి. పటంలో చూపిన విధంగా అనేక వక్రాలు ఏర్పడడం గుర్తించవచ్చు.
ప్రశ్న 12.
విద్యుదయస్కాంత ప్రేరణకు శక్తి నిత్యత్వ నియమాన్ని ఎలా అన్వయిస్తారు?
జవాబు:
- ఒక దండయస్కాంత ఉత్తరధృవం, తీగచుట్టకు అభిముఖంగా ఉండేటట్లుగా కదిపితే, ఆ తీగచుట్టలో ప్రేరిత విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది.
- అయస్కాంత ఉత్తరధృవం, తీగచుట్టలో ఉత్తర ధృవాన్ని ప్రేరేపించడం వలన, తీగ చుట్టకు, అయస్కాంతానికి మధ్య వికర్షణ బలం ఏర్పడుతుంది.
- దీనిని అధిగమించడానికి మనం కొంత పనిచేయాలి.
- అయస్కాంతంపై మనం చేసిన పని విద్యుచ్ఛక్తిగా మారుతుంది. ఫలితంగా, అయస్కాంత ఉత్తర ధృవానికి అపసవ్య దిశలో విద్యుత్తు ప్రేరేపించబడుతుంది.
- ఈ విధంగా విద్యుదయస్కాంత ప్రేరణలో శక్తి నిత్యత్వం జరుగుతుంది.
ప్రశ్న 13.
ఇండక్షన్ స్టవ్ పనిచేసే విధానాన్ని వివరించుము.
జవాబు:
- ఇండక్షన్ స్టవ్ విద్యుదయస్కాంత ప్రేరణ నియమంపై ఆధారపడి పనిచేస్తుంది.
- స్టవ్ ఉపరితలానికి కింద దానిని ఆనుకొని ఒక లోహపు చుట్ట వుంటుంది. దీనిలో AC విద్యుతను ప్రవహింపజేస్తే దానిచుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది.
- ఒక లోహపాత్రలో నీరుపోసి స్టవ్ పై ఉంచితే దాని అడుగుభాగంలోనున్న అయస్కాంత క్షేత్రం పాత్ర అడుగుభాగాన్ని దాటడం వల్ల పాత్రపై విద్యుచ్ఛాలక బలం ప్రేరేపితమౌతుంది.
- పాత్ర లోహంతో తయారైనది కావడం వల్ల ప్రేరిత emf పాత్రలో ప్రేరిత విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.
- పాత్రకు నియమిత నిరోధం ఉండడం వల్ల ప్రవహిస్తున్న విద్యుత్ వల్ల ఉష్ణం జనించి ఆ ఉష్ణం నీటికి అందజేయబడుతుంది.
ప్రశ్న 14.
టేప్ రికార్డర్ ధ్వనిని ఎలా పునరుత్పాదించగలుగుతుంది?
జవాబు:
- టేప్ రికార్డర్ విద్యుదయస్కాంత ప్రేరణ నియమంపై ఆధారపడి పనిచేస్తుంది.
- దీనిలో ఉపయోగించే క్యాసెట్ నందు పలుచని ప్లాస్టిక్ టేప్ ఉంటుంది. ఈ టేప్ పై ఐరన్ ఆక్సైడ్ పూత పూయబడి ఉంటుంది.
- ఈ టేప్ పై వివిధ ప్రదేశాలు వివిధ తీవ్రతలతో అయస్కాంతీకరింపబడి ఉంటాయి.
- టేప్ రికార్డర్ లో గల చిన్న తీగ చుట్టను ఈ టేప్ తాకుతూ, కదులుతూ ఉన్నప్పుడు దాని అయస్కాంత క్షేత్రంలో కలిగే మార్పుల వల్ల ఆ చిన్న తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది.
- ఈ విద్యుత్ ప్రవాహం ధ్వనిగా మార్చబడి స్పీకర్ గుండా బయటకు వస్తుంది.
భౌతిక రాశులు మరియు వాటి ప్రమాణాలు భౌతికరాశి
10th Class Physics 10th Lesson విద్యుదయస్కాంతత్వం ½ Mark Important Questions and Answers
1. జతపరుచుము.
i) విద్యుత్ ప్రవాహం వలన అయస్కాంతత్వం a) మోటారు
ii) అయస్కాంతం వలన విద్యుత్ ఫలితం b) జనరేటర్
జవాబు:
i – a, ii – b
2. ఆయిర్ స్టెడ్ ప్రయోగాన్ని నిరూపించుటకు కావలసిన పరికరాలు ఏమిటి?
జవాబు:
1) అయస్కాంత దిక్సూచి,
2) బ్యాటరీ,
3) రాగి తీగ,
4) స్విచ్
3.
1) పై పటంలో చూపిన ప్రయోగం పేరేమిటి?
జవాబు:
ఆయిర్ స్టెడ్ ప్రయోగం
2) ఈ ప్రయోగంలో ఒక పరిశీలన రాయుము.
జవాబు:
విద్యుత్ తీగలో ప్రవహించునపుడు దిక్సూచి అపవర్తనం.
3) ప్రయోగంలో ఏమి ఉత్పత్తి అగుతుంది?
జవాబు:
అయస్కాంత క్షేత్రం
4) పై ప్రయోగంలో దిక్సూచిలో కదలికకు కారణం ఏమిటి?
జవాబు:
అయస్కాంత క్షేత్రం
4. i) దండాయస్కాంత క్షేత్రం త్రిమితీయం.
ii) దండాయస్కాంత క్షేత్రానికి దిశ ఉండదు.
iii) దండాయస్కాంత క్షేత్రం అంతటా సమానంగా ఉంటుంది. పై వాక్యా లలో సరియైనది ఏది?
జవాబు:
(i)
5. దండాయస్కాంత క్షేత్రానికి …………….. లు కలవు.
జవాబు:
దిశ మరియు పరిమాణం
6. అయస్కాంత క్షేత్ర దిశను కనుగొనుటకు నీవు ఉపయోగించే పరికరం ఏమిటి?
జవాబు:
దిక్సూచి
7.
అయస్కాంతం చుట్టూ ఉన్న వక్రరేఖలు ఏమిటి?
జవాబు:
అయస్కాంత క్షేత్ర బలరేఖలు
8. అయస్కాంత బలరేఖకు ఒక బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ దిశ ఆ బిందువు వద్ద ….. ను తెలుపుతుంది.
జవాబు:
క్షేత్రదిశను
9. i) అయస్కాంత బలరేఖలు సంవృత వక్రాలు.
ii) దండాయస్కాంత బలరేఖలు ధృవాల వద్ద ఎక్కువగా ఉంటాయి.
పై వానిలో సరియైనది ఏది?
జవాబు:
రెండూ
10. ఒక దండాయస్కాంతం యొక్క క్షేత్రం బలంగా ఉన్న చోటుని ఎలా గుర్తిస్తావు?
జవాబు:
బలరేఖలు ఎక్కువగా దట్టమైన సమూహంగా ఉన్న చోట.
11. అయస్కాంత అసమక్షేత్రం లక్షణం
A) బలం వివిధ స్థానాల వద్ద మారుట
B) దిశ వివిధ స్థానాల వద్ద మారుట
C) A మరియు B
D) A లేదా B
జవాబు:
D) A లేదా B
12. అయస్కాంత సమక్షేత్రంలో ఏవి స్థిరంగా ఉంటాయి?
జవాబు:
క్షేత్రబలం మరియు దిశ
13. సమక్షేత్రం ఏర్పరచడానికి నీకు కావలసిన పరికరం ఏమిటి?
జవాబు:
గుర్రపునాడాయస్కాంతం
14. క్షేత్రానికి లంబంగా A వైశాల్యం గల తలం గుండా వెళ్ళే బలరేఖల సంఖ్యను ఏమంటారు?
జవాబు:
అయస్కాంత అభివాహం
15. అయస్కాంత అభివాహాన్ని ఏ గుర్తుతో సూచిస్తారు?
జవాబు:
16. అయస్కాంత అభివాహానికి S.I ప్రమాణం ఏమిటి?
జవాబు:
వెబర్
17. ప్రమాణ వైశాల్యం గుండా వెళ్ళే అయస్కాంత అభివాహాన్ని ఏమంటారు?
జవాబు:
అభివాహ సాంద్రత (B)
18. అయస్కాంత క్షేత్ర ప్రేరణ (లేదా) అభివాహ సాంద్రతను ఏ గుర్తుతో సూచిస్తారు?
జవాబు:
‘B’
19. అయస్కాంత క్షేత్ర ప్రేరణ (B) కి సూత్రం రాయుము.
జవాబు:
B = Φ/A
20. అభివాహ సాంద్రతకు ప్రమాణాలు రాయండి.
జవాబు:
\(\frac{w b}{m^{2}}\) (లేదా) టెస్లా.
21. టెస్లా ఏ భౌతికరాశికి ప్రమాణం?
జవాబు:
అయస్కాంత క్షేత్ర ప్రేరణ (లేదా) అభివాహ సాంద్రత
22. అయస్కాంత క్షేత్రం B కి A వైశాల్యం గల తలం యొక్క లంబానికి మధ్య కోణం ‘8’ అనుకుంటే, క్షేత్రానికి లంబంగా ప్రభావం చూపే తలం వైశాల్యం ఎంత?
జవాబు:
A cos θ
23. కొంత కోణంతో తలం గుండా వెళ్ళే అయస్కాంత అభివాహంనకు సూత్రం రాయుము.
జవాబు:
24. Φ (అభివాహం)కి ఒక సూత్రం రాయుము.
జవాబు:
Φ = BA cos θ
25. సరళరేఖలా ఉన్న విద్యుత్ ప్రవాహం గల తీగ వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్రం ఆకారం ఎలా ఉంటుంది?
జవాబు:
వృత్తాకారం
26.
పై పటంలో చూపిన విధంగా అయస్కాంత బలరేఖలు ఏర్పడాలంటే తీగలో విద్యుత్ ఏ దిశలో ప్రయాణించాలి?
జవాబు:
పేపర్ తలానికి లంబంగా బయటకు వచ్చేలా
27. పేపర్ తలానికి లంబంగా లోపలికి పోయేటట్టు విద్యుత్ ప్రవహిస్తున్న తీగ చుట్టూ ఏర్పడిన అయస్కాంత క్షేత్రం దిశ ఎలా ఉంటుంది?
జవాబు:
సవ్యదిశలో
28. అయస్కాంత బలరేఖల దిశను ఏ నిబంధన ప్రకారం గుర్తిస్తాం?
జవాబు:
కుడిచేతి బొటనవేలు నిబంధన
29. కుడిచేతి బొటనవేలు నిబంధన ప్రకారం విద్యుత్ ప్రవాహ దిశను ఏ వేలితో సూచిస్తారు?
జవాబు:
కుడిచేతి బొటనవేలు
30.
తీగచుట్టలో విద్యుత్ ప్రవహించినపుడు అయస్కాంత క్షేత్ర దిశ ఎలా ఉంటుంది?
జవాబు:
తీగచుట్ట తలానికి లంబంగా
31. సోలినాయిడ్ అనగానేమి?
జవాబు:
సమసర్పిలంగా, దగ్గరగా చుట్టబడిన తీగచుట్ట
32. సోలినాయిడ్ వలన ఏర్పడిన బలరేఖలు క్రింది వాని బలరేఖల వలె ఉంటాయి.
A) దండాయస్కాంతం
B) గుర్రపునాడాయస్కాంతం
C) రింగు అయస్కాంతం
D) పైవేవైనా
జవాబు:
A) దండాయస్కాంతం
33. కుడిచేతి నిబంధన ప్రకారం దీని వలన ఏర్పడిన అయస్కాంత క్షేత్ర దిశను తెలుసుకోగలము.
A) తిన్నని తీగలో విద్యుత్ ప్రవాహం
B) తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం
C) సోలినాయిలో విద్యుత్ ప్రవాహం
D) ఏదీ లేదు
జవాబు:
C) సోలినాయిలో విద్యుత్ ప్రవాహం
34. సోలినాయిలో ఏర్పడిన అయస్కాంత బలరేఖలు దండాయస్కాంతం వలన ఏర్పడిన బలరేఖలు
A) వేరువేరుగా ఉంటాయి.
B) ఒకేలా ఉంటాయి.
C) A లేదా BC
D) పోల్చలేము.
జవాబు:
B) ఒకేలా ఉంటాయి.
35.
పై పటం ప్రకారం
• విద్యుత్ దేని గుండా ప్రవహిస్తుంది?
జవాబు:
సోలినాయిడ్ గుండా
• విద్యుత్ ప్రవహించే దిశకు, అయస్కాంత బలరేఖల దిశ సమానంగా ఎక్కడ వుంది?
జవాబు:
సోలినాయిడ్ లోపల
• సోలినాయిలో విద్యుత్ ప్రవేశించే కొస వైపు ఎటువంటి అయస్కాంత ధృవం ఏర్పడింది?
జవాబు:
దక్షిణ ధృవం
36. ఒక దండాయస్కాంతాన్ని TV తెర (CRT TV) కు దగ్గరగా తీసుకుని వస్తే నీవేమి గమనిస్తావు?
జవాబు:
TV తెర మీది చిత్రం ఆకారం మారడాన్ని.
37. q ఆవేశం, v వేగంతో అయస్కాంత క్షేత్రం B కు లంబంగా కదిలేటప్పుడు, ఆ ఆవేశంపై పని చేసే అయస్కాంత బలం ఎంత?
జవాబు:
F = qvB
38. అయస్కాంత క్షేత్రం ‘B’ దిశకు ఆవేశం q, వేగం v, దిశ మధ్య కోణం ‘θ’ అయితే అయస్కాంత బలం ‘F’ కి సమీకరణాన్ని రాయండి.
జవాబు:
F = qvB sin θ
39. అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా ఒకే ఆవేశం కదిలితే అయస్కాంత బలం
A) కనిష్ఠం
B) గరిష్ఠం
C) శూన్యం
D) పైవేవీ కాదు
జవాబు:
C) శూన్యం
40. కుడిచేతి నియమం ప్రకారం ఆవేశ వేగ దిశ, అయస్కాంత క్షేత్రదిశ తెలిస్తే …….. దిశను తెలుసుకోవచ్చును.
జవాబు:
అయస్కాంత బలం
41.
ఈ నిబంధన పేరేమిటి?
జవాబు:
కుడిచేతి నిబంధన
42. తీగలో ప్రతీ ఆవేశం క్షేత్రానికి సమాంతర దిశలో కదులుతూ ఉండడం వలన వాటిపై ఎంత అయస్కాంత బలం పని చేయును?
జవాబు:
ఉండదు
43. అయస్కాంత క్షేత్రం (B) కి లంబంగా ‘L’ పొడవు నిరూపించవచ్చును? గల తీగలో ‘T’ విద్యుత్ ప్రవహిస్తే దానిపై పనిచేసే అయస్కాంత బలం ఎంత వుంటుంది?
జవాబు:
F = ILB
44. పై సందర్భంలో లంబంగా కాకుండా ‘θ’ కోణంతో విద్యుత్ తీగ ఉంటే దానిపై పనిచేసే బలం ఎంత?
జవాబు:
F = ILB sin θ
45. సాధారణంగా కుడిచేతి నిబంధన ఏ ఆవేశానికి సంబంధించినది?
జవాబు:
ధనావేశం
46. సమఅయస్కాంత క్షేత్రంలో, విద్యుత్ ప్రవహిస్తున్న తీగచుట్టను ఉంచినప్పుడు అది నిరంతరంగా ఒకే దిశలో, ఆగకుండా తిరగాలంటే ఏమి చేయాలి?
జవాబు:
ప్రతి అర్ధభ్రమణానికి తీగచుట్టలో విద్యుత్ ప్రవాహ దిశను మార్చాలి.
47. విద్యుత్ మోటారులో విద్యుత్ ప్రవాహదిశను మార్చడానికి సహాయపడే పరికరాలేవి?
జవాబు:
స్లిప్ రింగ్ కమ్యూటేటర్ (బ్రషన్లు, స్లిప్ రింగులు)
48. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం పేరేమిటి?
జవాబు:
విద్యుత్ మోటారు
49. విద్యుత్ మోటారు పనిచేసే సూత్రం ఏమిటి?
జవాబు:
విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది.
50. విద్యుత్ ప్రవాహం లేని తీగచుట్టను అయస్కాంత క్షేత్రంలో తిరిగేటట్లు చేస్తే ఏం జరుగుతుందో ఊహించుము.
జవాబు:
తీగచుట్టలో ప్రేరిత విద్యుత్ జనియించును.
51.
• పై పటంలో చూపిన పరికరంలో ACని పంపితే ఏమవుతుందో ఊహించుము.
జవాబు:
లోహపు రింగు తేలియాడుతుంది.
• DC ని వినియోగిస్తే ఏమవుతుంది?
జవాబు:
రింగు ఒక్కసారి పైకి కదిలి తిరిగి కిందికి వస్తుంది.
• రింగ్ లో అభివాహం నిరంతరంగా మారాలంటే తీగచుట్టలో ఎటువంటి విద్యుత్ ను పంపాలి?
జవాబు:
AC
52.
పై పటంలో చూపిన ప్రయోగం ద్వారా ఏ నియమాన్ని
జవాబు:
ఫారడే నియమం
53. ‘ఫారడే నియమం’ నిరూపించడానికి కావలసిన పరికరాలేవి?
జవాబు:
తీగ చుట్ట, గాల్వనో మీటరు, దండాయస్కాంతం
54. ఒక తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడాలంటే దానిలో దేనిని నిరంతరంగా మార్చవలసి ఉంటుంది?
జవాబు:
అయస్కాంత అభివాహం
55. తీగచుట్టలో ప్రేరిత విద్యుత్ ప్రవాహాన్ని పొందే దృగ్విషయాన్ని ఏమంటారు?
జవాబు:
విద్యుదయస్కాంత ప్రేరణ
56. తీగచుట్టలో ప్రేరిత విద్యుత్ ప్రవాహం ఏర్పరచడానికి కావలసిన పరికరం ఏమిటి?
జవాబు:
దండాయస్కాంతం
57. తీగచుట్టలో అభివాహ మార్పుకి, ప్రేరిత విద్యుత్ ప్రవాహానికి మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
అనులోమానుపాతం
58. పారడే విద్యుదయస్కాంత పేరణ నియమానికి ఒక సూత్రం రాయుము.
జవాబు:
\(\varepsilon=\frac{\Delta \phi}{\Delta \mathrm{t}}\)
59. లెంజ్ నియమాన్ని రాయండి.
జవాబు:
తీగచుట్టలో అభివాహ మార్పును వ్యతిరేకించే దిశలో ప్రేరణ విద్యుత్ ప్రవాహం ఉంటుంది.
60. లెంజ్ నియమం ద్వారా ఏమి తెలుసుకోవచ్చును?
జవాబు:
తీగచుట్టలో ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశ
61. విద్యుత్ సామర్థ్యంను ‘E’ మరియు ‘I’ లలో తెలుపుము.
జవాబు:
P = εI
62. ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణకు ఒక అనువర్తనాన్ని రాయండి.
జవాబు:
ATM కార్డు (అయస్కాంత పట్టీ గలది) (లేదా) ఇండక్షన్ స్టవ్.
63. సెక్యూరిటీ అలారంలు ఏ నియమం ప్రకారం పని చేస్తాయి?
జవాబు:
ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ
64. AC (ఏకాంతర విద్యుత్) అనగానేమి?
జవాబు:
నిర్దిష్ట కాలవ్యవధిలో విద్యుత్ ప్రవాహదిశ మారుతూ ఉంటుంది.
65. AC జనరేటర్ నియమం ఏమిటి?
జవాబు:
యాంత్రిక శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చుట
66. ఏకాంతర విద్యుత్ యొక్క ఒక లక్షణం రాయండి.
జవాబు:
కచ్చితమైన పౌనఃపున్యం కలిగి ఉండటం
67. AC జనరేటర్‌ను DC జనరేటర్ గా మార్చడానికి ఏమి ఉపయోగించాలి?
జవాబు:
రెండు స్లిప్ రింగులు (కమ్యూటేటర్)
68. ప్రవాహ దిశను మార్చుకోని విద్యుత్ జనకం ఏమిటి?
జవాబు:
బ్యాటరీ
69. ‘I’ పొడవు గల వాహకం ‘B’ అయస్కాంత క్షేత్రానికి లంబంగా ‘V’ వేగంతో కదులుతుంటే, ఆ వాహక కొనల మధ్య ఏర్పడే విద్యుచ్ఛాలక బలం ఎంత ఉంటుంది?
జవాబు:
Blv (గమన విద్యుచ్ఛాలక బలం)
70. జతపరుచుము :
a) ప్రేరిత విద్యుత్ ( ) i) లెంజ్
b) విద్యుదయస్కాంతం ( ) ii) ఫారడే
c) ప్రేరిత విద్యుత్ దిశ ( ) iii) ఆయిర్ స్టెడ్
జవాబు:
a – ii, b – iii, c – i
10th Class Physics 10th Lesson విద్యుదయస్కాంతత్వం 1 Mark Bits Questions and Answers
సరియైన సమాధానమును గుర్తించండి.
1. అయస్కాంత క్షేత్ర ప్రేరణ యొక్క S.I. ప్రమాణం
A) టెస్లా
B) వెబర్
C) వెబర్/మీ
D) వెబర్.మీ
జవాబు:
A) టెస్లా
2. జనరేటరులోని తీగచుట్ట ఏ కోణంలో తిరిగినపుడు గరిష్ట ప్రేరిత విద్యుచ్ఛాలక బలం ఏర్పడుతుంది?
A) 180°
B) 90°
C) 2800
D) B మరియు C
జవాబు:
D) B మరియు C
3. విద్యుదయస్కాంత వర్ణపటంలో దృశ్యకాంతితో పాటు అదృశ్యకాంతి అయిన X – కిరణాలు, γ – కిరణాలు, I.R, U.V కిరణాలు, మైక్రోతరంగాలు మరియు రేడియో తరంగాలుంటాయి. వీటిలో తరంగదైర్ఘ్యం అధికంగా గల తరంగాలు ….
A) γ – కిరణాలు
B) U.V. కిరణాలు
C) I.R
D) రేడియో తరంగాలు
జవాబు:
D) రేడియో తరంగాలు
4. విద్యుత్ ను ఉత్పత్తి చేసే సాధనము
A) అమ్మీటర్
B) ఓల్ట్ మీటర్
C) జనరేటర్
D) గాల్వనోమీటర్
జవాబు:
C) జనరేటర్
5. క్రింది వానిలో యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చు పరికరం …….
A) జనరేటర్
B) ఫ్యాన్
C) మిక్సర్ గైండర్
D) బల్బు
జవాబు:
A) జనరేటర్
(OR)
యాంత్రికశక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది
A) విద్యుత్ జనరేటర్
B) విద్యుత్ మోటరు
C) బ్యాటరీ
D) ఎలక్ట్రిక్ స్విచ్
జవాబు:
A) విద్యుత్ జనరేటర్
6. కిందివాటిలో విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమంపై ఆధారపడి పనిచేసే విద్యుత్ సాధనం
A) విద్యుత్ ఫ్యాన్
B) విద్యుత్ బల్బ్
C) విద్యుత్ కుక్కర్
D) L.E.D.
జవాబు:
A) విద్యుత్ ఫ్యాన్
7. విద్యుత్ ఘటం యొక్క (EMF) ను గుర్తించుటకు వాడే పరికరం
A) ఓల్ట్ మీటర్
B) అమ్మీటర్
C) గాల్వనోమీటర్
D) టెస్టర్
జవాబు:
A) ఓల్ట్ మీటర్
8. నిత్యజీవితంలో విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే సాధనం
A) విద్యుత్ బల్బ్
B) విద్యుత్ మోటర్
C) జనరేటర్
D) ఇండక్షన్ స్టవ్
జవాబు:
9. క్రింది వానిలో ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమాన్ని అనుసరించనిది ……..
A) ATM కార్డు
B) ఇండక్షన్ స్టవ్
C) టేప్ రికార్డర్
D) ఇస్త్రీ పెట్టె
జవాబు:
B) ఇండక్షన్ స్టవ్
10. ఎలక్ట్రిక్ జనరేటర్ …….. శక్తిని …….. శక్తిగా మారుస్తుంది.
A) యాంత్రిక, విద్యుత్
B) విద్యుత్, యాంత్రిక
C) కాంతి, విద్యుత్
D) విద్యుత్, కాంతి
జవాబు:
A) యాంత్రిక, విద్యుత్
11. “తీగచుట్టల అభివాహ మార్పు వ్యతిరేక దిశలో ప్రేరణ విద్యుత్ ప్రవాహం ఉంటుంది.” దీనినే …. అంటాం.
A) VSEPR సిద్ధాంతం
B) లెంజ్ నియమం
C) ఫారడే నియమం
D) ఓమ్ నియమం
జవాబు:
B) లెంజ్ నియమం
12. అయస్కాంత అభివాహానికి SI ప్రమాణం
A) వెబర్
B) వోల్ట్
C) ఆంపియర్
D) కూలుంట్
జవాబు:
A) వెబర్
13. “a” ఆవేశం గల ఒక ఆవేశిత కణం “V” వేగంతో, “B” అయస్కాంత క్షేత్రంలోకి అయస్కాంత క్షేత్ర దిశలో 30° కోణం చేస్తూ ప్రవేశించింది. అయిన దానిపై కలగజేయబడు బలం (sin 30° = ½)
జవాబు:
A
14. క్రింది వాటిలో ఏ సందర్భంలో విద్యుత్ ప్రేరిత మవుతుంది?
జవాబు:
(A or D)