These AP 10th Class Physical Science Chapter Wise Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు will help students prepare well for the exams.
AP Board 10th Class Physical Science 2nd Lesson Important Questions and Answers ఆమ్లాలు-క్షారాలు-లవణాలు
10th Class Physics 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
పరీక్షనాళికలో నీరు తీసుకొని కొద్దిగా గాఢ H2SO4) ను కలిపి కదపండి. పరీక్షనాళిక అడుగుభాగం వేడిగా ఉంటుంది. H2SO4 కి బదులుగా NaOH బిళ్ళలు నీటికి కలిపితే పరీక్షనాళిక అడుగు భాగం ఏ విధంగా ఉంటుంది?
జవాబు:
పరీక్షనాళిక అడుగుభాగం వేడిగా ఉండును. దీనికి కారణము ఆమ్లాలు, క్షారాలు నీటితో చర్య జరుపుట అనునది ఒక ఉష్ణమోచక చర్య.
ప్రశ్న 2.
కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను పొడి పరీక్షనాళికలో తీసుకొని వేడి చేస్తే ఏం జరుగుతుందో రాయండి.
జవాబు:
- కాపర్ సల్ఫేటు స్పటికాలను పొడి పరీక్షనాళికలో తీసుకొని వేడి చేస్తే, పరీక్షనాళీక గోడలపై నీటి బిందువులు ఏర్పడతాయి.
- అంతేకాకుండా, నీలి రంగులో ఉన్న స్పటికాలు తెలుపు రంగులోకి మారుతాయి.
- దీనికి కారణం, నీలిరంగు CuSO4 5H2O లో గల 5 నీటి అణువులు బాష్పీభవనం చెంది తెలుపు రంగు CuSO4 ఏర్పడటమే.
ప్రశ్న 3.
వ్యవసాయ భూములలో మట్టి యొక్క pH విలువను ఎందుకు పరీక్షిస్తారు?
జవాబు:
- మొక్కలు ఆరోగ్యవంతంగా పెరగడానికి నిర్దిష్ట పరిమితిలో pH విలువ కలిగియున్న మట్టి అవసరం.
- వ్యవసాయ భూములలో మట్టి యొక్క pH విలువను పరీక్షించటం ద్వారా మట్టి యొక్క ఆమ్ల లేదా క్షారపు స్వభావాన్ని కనుగొని, ఆ స్వభావానికనుగుణంగా కావలసిన లవణాలను కలిపి కావలసిన pH విలువను పొందడం కొరకు వ్యవసాయ భూములలో మట్టి యొక్క pH విలువను పరీక్షిస్తారు.
ప్రశ్న 4.
ఇంటిలో ఎక్కువగా ఉపయోగించే ఉప్పు, వంటసోడాల అణుఫార్ములాను రాయండి.
జవాబు:
సాధారణ ఉప్పు : NaCl
వంటసోడా : NaHCO3
ప్రశ్న 5.
“ఆమ్లాలు జల ద్రావణంలో మాత్రమే అయాన్లను ఏర్పరుస్తాయి” అని చూపే ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాయండి.
జవాబు:
- ప్రయోగంలో వెలువడిన వాయు రూపంలోని ఆమ్లాన్ని మొదట ‘పొడి’ లిట్మస్ కాగితంతో పరీక్షించాలి. తర్వాత ‘తడి’ లిట్మస్ కాగితంతో పరీక్షించాలి.
- అనార్థ CaCl2 గల గార్డ్ ట్యూబ్ ను ఉపయోగించాలి.
ప్రశ్న 6.
సహజ సూచికలకు ఉదాహరణలివ్వండి.
జవాబు:
లిట్మస్, రెడ్ క్యాబేజి రసం, పసుపు కలిపిన జల ద్రావణం, పుష్పాల ఆకర్షక పత్రాలు, బీట్ రూట్ రసం.
ప్రశ్న 7.
కృత్రిమ రసాయన సూచికలకు ఉదాహరణలివ్వండి.
జవాబు:
మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్తలీన్ మొదలైనవి.
ప్రశ్న 8.
సార్వత్రిక ఆమ్ల – క్షార సూచికలు అనగానేమి?
జవాబు:
సేంద్రియ రంజనాల మిశ్రమాలను లేదా సూచికల మిశ్రమాలను సార్వత్రిక ఆమ్ల – క్షార సూచికలు అంటారు. ఇవి ఆమ్ల, క్షార బలాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.
ఉదా : pH పేపరు
ప్రశ్న 9.
బలమైన ఆమ్లాలు అనగానేమి ? ఉదాహరణలివ్వండి.
జవాబు:
జల ద్రావణంలో పూర్తిగా అయనీకరణం చెంది అధిక H3O+ అయాన్లు ఇచ్చే వాటిని బలమైన ఆమ్లాలు అంటారు.
ఉదా : HCl, H2SO4, HNO3.
ప్రశ్న 10.
బలహీన ఆమ్లాలు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
జల ద్రావణంలో పూర్తిగా అయనీకరణం చెందిన ఆమ్లాలను బలహీన ఆమ్లాలు అంటారు.
ఉదా : CH3COOH, H2CO3, H3PO4.
ప్రశ్న 11.
ఓల్ ఫ్యాక్టరీ సూచికలు అనగానేమి?
జవాబు:
కొన్ని పదార్థాలు ఆమ్ల, క్షార మాధ్యమంలో వేర్వేరు వాసనలను ప్రదర్శిస్తాయి. వీటిని ఓల్ ఫ్యాక్టరీ సూచికలు అంటారు.
ప్రశ్న 12.
విలీనత అనగానేమి?
జవాబు:
విలీనత :
ఆమ్లానికి లేదా క్షారానికి నీటిని కలుపుట వలన ప్రమాణ ఘనపరిమాణం గల ద్రావణం యొక్క గాఢత తగ్గే దృగ్విషయాన్ని విలీనత అంటారు.
ప్రశ్న 13.
బలమైన క్షారాలు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
జల ద్రావణంలో పూర్తిగా అయనీకరణం చెంది ఎక్కువ OH- అయాన్లు ఇచ్చే వాటిని బలమైన క్షారాలు అంటారు.
ఉదా : NaOH, KOH.
ప్రశ్న 14.
బలహీన క్షారాలు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
జల ద్రావణంలో పూర్తిగా అయనీకరణం చెందని క్షారాలను బలహీన క్షారాలంటారు.
ఉదా : NH4OH, Ca(OH)2, Mg(OH)2.
ప్రశ్న 15.
pH స్కేలు అనగానేమి?
జవాబు:
హైడ్రోజన్ గాఢత యొక్క ఋణ సంవర్గమానాన్ని pH స్కేలు అంటారు. దీనిని సొరెన్సన్ కనుగొన్నాడు.
pH = – log [H+]
ప్రశ్న 16.
ఏంటాసిడ్ అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
ఒక బలహీన క్షారం జీర్ణాశయంలో తయారైన అధిక పరిమాణంలోని ఆమ్లాలను తటస్థీకరించి ఉపశమనం కలుగజేయును. దీనినే ఏంటాసిడ్ అంటాం.
ఉదా : జెలూసిల్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా.
ప్రశ్న 17.
తటస్థీకరణం అనగానేమి?
జవాబు:
ఒక ఆమ్లం, క్షారంతో చర్య జరిపి లవణాన్ని, నీటిని ఏర్పరచే చర్యను తటస్థీకరణ చర్య అంటారు.
ప్రశ్న 18.
అలోహ ఆక్సెలు అనగానేమి? ఇవి ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి?
జవాబు:
అలోహాలు ఆక్సిజన్ తో కలిసి ఏర్పరచే ఆక్సెను అలోహ ఆక్సెలు అంటారు. ఇవి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి.
ఉదా : CO2, NO2, SO2
ప్రశ్న 19.
క్షార ఆక్సెన్లు అనగానేమి? ఇవి ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి?
జవాబు:
లోహాలు ఆక్సిజన్ తో కలిపి ఏర్పరచే ఆక్సెలను క్షార ఆక్సెన్లు అంటారు. వీటికి క్షార స్వభావం ఉండును. వీటిని లోహ ఆక్సెట్లు లేదా క్షార ఆక్సెలు అంటాం.
ఉదా : Na2O, MgO, CaO.
ప్రశ్న 20.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అగానేమి?
జవాబు:
కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ CaSO4. ½H2O ను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటారు.
ప్రశ్న 21.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉపయోగమేమి?
జవాబు:
విరిగిన ఎముకలకు కట్లు కట్టడానికి, బొమ్మల తయారీలోనూ, సీలింగ్ చేయడానికి, వాటర్ ఫిల్టర్ లో క్యాండిల్స్ గాను వాడతారు.
ప్రశ్న 22.
సోడియం క్లోరైడ్ నుండి తయారు చేసే పదార్థాలేవి?
జవాబు:
సోడియం క్లోరైడ్ నుండి 1) NaOH క్షారం 2) బ్లీచింగ్ పౌడర్ 3) బేకింగ్ పౌడర్ 4) బట్టల సోడాలను తయారు చేస్తారు.
ప్రశ్న 23.
బ్లీచింగ్ పౌడరును ఎలా తయారు చేస్తారు?
జవాబు:
తేమ లేని కాల్షియం హైడ్రాక్సైడ్ ను Ca(OH), పై క్లోరిన్ వాయువు చర్య వలన బ్లీచింగ్ పౌడర్ ఏర్పడును.
Ca(OH)2 + Cl2 → CaOCl2 + H2O
ప్రశ్న 24.
జిప్సం అనగానేమి? ఉపయోగాలేవి?
జవాబు:
CaSO4 2H2O ను జిప్పం అంటారు.
- దీనిని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తయారీలో ఉపయోగిస్తారు.
- పొలాలలో ఆమ్లత్వాన్ని తటస్థీకరించడానికి జిప్సం చల్లుతారు.
- ఇళ్లకు, షాపులకు సీలింగ్ చెయ్యటానికి జిప్సం షీట్ లను విరివిగా వాడుచున్నారు.
ప్రశ్న 25.
వివిధ అణువులలోని స్ఫటిక జలం అణువుల సంఖ్యను తెలపండి.
జవాబు:
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లో ½ నీటి అణువు, జిప్సంలో 2 నీటి అణువులు, కాపర్ సల్ఫేట్ లో 5 నీటి అణువులు, వాషింగ్ సోడాలో 10 నీటి, అణువులు కలవు.
ప్రశ్న 26.
pH స్కేలును తయారు చేసిన సొరెన్సన్ కృషిని ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
ద్రావణాలలో హైడ్రోజన్ అయాను గాఢతల ఋణాత్మక విలువలను గుర్తుపెట్టుకోవడం కష్టంగా మారిన తరుణంలో pH స్కేలును కనిపెట్టిన సొరెన్సన్ అభినందనీయుడు. ఈయన కనిపెట్టిన pH స్కేలు వ్యవసాయంలో, వైద్యరంగంలోను ఆహారపదార్థాల తయారీలో విరివిగా వాడుచున్నారు. ఈయన చేసిన కృషిని అభినందించవలసి యున్నది.
ప్రశ్న 27.
NaCl ఆహారానికి మంచి రుచిని తీసుకురావడమే కాకుండా అనేక రసాయనాల తయారీకి ఉపయోగపడును. NaCl పట్ల ఎటువంటి సానుభూతిని కలిగి ఉంటావు?
జవాబు:
సాధారణ లవణం లేదా సోడియం క్లోరైడ్ ఆహారపదార్థాలకు మంచి రుచిని ఇస్తుంది. అంతేకాకుండా బ్లీచింగ్ పౌడర్, బేకింగ్ సోడా, బట్టల సోడా తయారీలో ముడిపదార్థంగా ఉపయోగపడును. కావున NaClను ప్రత్యేక పదార్థంగా చూడవలసిన అవసరం ఉన్నది.
ప్రశ్న 28.
సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సెడ్ లాంటి అలోహ ఆక్సెలు తాజ్ మహల్ లాంటి గొప్ప నిర్మాణాలను పాడుచేస్తున్నాయి. దీనిని ఏ విధంగా అరికడతావు?
జవాబు:
తాజ్ మహల్ వంటి మహాకట్టడంను మార్బుల్ తో నిర్మించడం జరిగినది. మార్బుల్ అనగా కాల్షియం కార్బోట్ (CaCO3). ఇది గాలిలోని SO2తో చర్య జరుపుట వలన పసుపురంగులోకి మారి రోజురోజుకు తాజ్ మహల్ అందం తగ్గుచున్నది. కాబట్టి వాతావరణంలో SO2 వాయువు కలవకుండా జాగ్రత్తపడవలసి ఉన్నది.
ప్రశ్న 29.
రాగి పాత్రలు వాడుకలో తమ మెరుపును కోల్పోతాయి. కాని చింతపండుతో రుద్దితే తళతళ మెరుస్తాయి. ఎందుకు?
జవాబు:
రాగి పాత్రలు ఎల్లప్పుడు వాతావరణంలోని ఆక్సిజన్, CO2లతో చర్య జరిపి క్షార స్వభావం గల కాపర్ ఆక్సెడ్, కాపర్ కార్బోనేట్ గా మారి పాత్రలపై చిలుము పొరలుగా ఏర్పడతాయి. అందువలన పాత్రల మెరుపు తగ్గుతుంది.
మనం చింతపండుతో పాత్రలను రుద్దితే చింతపండులోని టార్టారిక్ ఆమ్లం కాపర్ ఆక్సెడ్, CuCO3 లతో తటస్థీకరణ చర్యజరిపి కాపర్ టార్టారే గా మారి నీటితో కలిసి బయటకు పోవును. కావున పాత్రలు తళతళ మెరుస్తాయి.
ప్రశ్న 30.
తడి సున్నం, తడి చాపీతో వ్రాసిన కొంతసేపటి తర్వాత తెల్లగా, స్పష్టంగా కన్పించును. ఎందుకు?
జవాబు:
తడిసున్నం లేదా తడి చాక్ పీ లో Ca(OH)2 అనే బలహీన క్షారం ఉండును. దీనిని గోడలపై సున్నం కొట్టినా లేదా బోర్డుపై రాసినా వాతావరణంలోని CO2 తో చర్య జరిపి కాల్షియం కార్బోనేట్ ను ఏర్పరచును.
Ca(OH)2 + CO2 → ↓CaCO3 + H2O
కాల్షియం కార్బోనేట్ తెల్లగా, స్పష్టంగా కనిపించును.
ప్రశ్న 31.
NaOH యొక్క పారిశ్రామిక ఉపయోగాలేవి?
జవాబు:
NaOH ను కాస్టిక్ సోడా అంటారు. దీనిని సబ్బులు, పేపర్, కృత్రిమ దారాలు, మందుల తయారీలో వాడతారు.
ప్రశ్న 32.
KOH యొక్క పారిశ్రామిక ఉపయోగాలేవి?
జవాబు:
KOHను ఒంటి సబ్బుల తయారీలో విరివిగా వాడుచున్నారు.
ప్రశ్న 33.
మానవ లేదా జంతువుల ఎముకలలో ఎటువంటి లవణాలు ఉండును?
జవాబు:
మానవ లేదా జంతువుల ఎముకలలో కాల్షియం ఫాస్ఫేటు (Ca3(PO4)2) లాంటి లవణాలు ఉండును.
ప్రశ్న 34.
బోరిక్ ఆమ్లాన్ని ఎందుకు వాడతారు?
జవాబు:
బోరిక్ ఆమ్లాన్ని కళ్లను శుభ్రం చెయ్యటానికి వాడతారు.
ప్రశ్న 35.
బట్టలపై మరకలను శుభ్రం చెయ్యటానికి వాడే ఆమ్లమేది?
జవాబు:
ఆక్జాలిక్ ఆమ్లం.
ప్రశ్న 36.
కూల్ డ్రింకులు, సోడాలలో వాడే ఆమ్లం ఏది?
జవాబు:
కార్బోనిక్ ఆమ్లం (H2CO3).
ప్రశ్న 37.
ఏంటాసిడ్ గా వాడే క్షారం ఏది?
జవాబు:
మెగ్నీషియం హైడ్రాక్సైడ్.
ప్రశ్న 38.
బట్టల పైన అంట్టిన గ్రీజు మరకలను తొలగించడానికి వాడే క్షాతం ఏది?
జవాబు:
అమ్మోనియం హైడ్రాక్సైడ్ (NH4OH).
ప్రశ్న 39.
ఆమ్ల సమక్షంలో లిట్మస్ కాగితం ఏవిధంగా మారుతుంది?
జవాబు:
ఆమ్ల సమక్షంలో నీలి లిట్మస్ ఎర్రగా మారుతుంది. కానీ ఎర్ర లిట్మస్ రంగు మారదు.
ప్రశ్న 40.
లిట్మస్ ద్రావణం అనగానేమి?
జవాబు:
లిట్మస్ అనేది ఒక రంజనము. దీనిని థాలోఫైటా వర్గానికి చెందిన ‘లైకెన్’ అనే మొక్క నుండి సేకరిస్తారు.
ప్రశ్న 41.
క్షార సమక్షంలో లిట్మస్ కాగితం ఏవిధంగా మారుతుంది?
జవాబు:
క్షార సమక్షంలో ఎర్రలిట్మస్ నీలిగా మారుతుంది. నీలి లిట్మస్ తన రంగును మార్చుకోదు.
ప్రశ్న 42.
లోహాలతో ఆమ్ల, క్షార చర్యలకు రెండు ఉదాహరణలిమ్ము.
జవాబు:
లోహాలు, ఆమ్లాలు, లేదా క్షారాలతో చర్య పొందినపుడు H2 వాయువును విడుదల చేయును.
ఉదా : 1) 2HCl + Zn → ZnCl2 + H2
2) 2NaOH + Zn → Na2ZnO2 + H2
ప్రశ్న 43.
కార్బొనేట్లు మరియు లోహ హైడ్రోజన్ కార్బొనేట్లతో ఆమ్లాల చర్యలను వ్రాయుము.
జవాబు:
ఆమ్లాలు కార్బొనేట్లు, లోహ హైడ్రోజన్ కార్బొనేట్లతో చర్య పొందినపుడు CO2 వాయువు వెలువడును.
ఉదా : 1) Na2CO3 + 2HCl → 2NaCl + H2O + CO2
2) NaHCO3 + HCl → NaCl + H2O + CO2
ప్రశ్న 44.
ఆల్కలీ అనగానేమి?
జవాబు:
నీటిలో కరిగే క్షారాలను ‘ఆల్కలీ’ అంటారు.
ప్రశ్న 45.
ఆమ్ల, క్షార బలాలను ఎలా నిర్ణయిస్తారు?
జవాబు:
ఒక ద్రావణంలోని H3O+ అయానుల సంఖ్య లేదా OH– అయానుల సంఖ్య ఆధారంగా ఆమ్ల, క్షారాల బలాలను నిర్ణయిస్తారు.
ప్రశ్న 46.
ఒక ద్రావణం యొక్క ‘pH’ అనగానేమి?
జవాబు:
ఒక ద్రావణం ఆమ్లమా, క్షారమా అని నిర్ణయించే ఒక సంఖ్యాత్మక విలువ, ఆ ద్రావణం యొక్క pH.
ప్రశ్న 47.
ఒక ఆమ్లం, క్షారం మధ్య తటస్థీకరణ చర్య జరిగి ఏర్పడిన లవణం యొక్క లక్షణాన్ని ఎలా నిర్ణయిస్తారు?
జవాబు:
తటస్థీకరణ చర్యలో ఏర్పడిన లవణం యొక్క స్వభావం ఆ చర్యలో పాల్గొన్న ఆమ్ల, క్షార బలాలపై ఆధారపడి ఉంటుంది.
ఉదా : బలమైన ఆమ్లం + బలమైన క్షారం → తటస్థ లవణం
బలమైన ఆమ్లం + బలహీన క్షారం → ఆమ్ల లవణం
బలహీన ఆమ్లం + బలమైన క్షారం → క్షార లవణం
బలహీన ఆమ్లం + బలహీన క్షారం → ఆమ్ల-క్షారాల సాపేక్ష బలంపై ఆధారపడి ఉంటుంది.
ప్రశ్న 48.
స్ఫటికీకరణ జలం అనగానేమి?
జవాబు:
ఒక లవణం యొక్క ఫార్ములా యూనిట్‌లో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువులను స్ఫటికీకరణ జలం అంటారు.
ప్రశ్న 49.
జిప్సం నుండి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను ఎలా తయారుచేస్తారు?
జవాబు:
జిప్సంను 373 K ఉష్ణోగ్రత వద్ద నెమ్మదిగాను, అతి జాగ్రత్తగాను వేడి చేస్తే, పాక్షికంగా నీటి అణువులను కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ గా మారుతుంది. దీనినే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (CaSO4.½H2O) అంటారు.
ప్రశ్న 50
సాధారణ ఉప్పు నుండి లభించే ఇతర లవణాలు ఏవి?
జవాబు:
సాధారణ ఉప్పు నుండి సోడియం హైడ్రాక్సైడ్ (NaOH), వంటసోడా (NaHCO3), ఉతికే సోడా (Na2CO3), బ్లీచింగ్ పౌడర్ (CaOCl3) వంటి లవణాలు ఏర్పడుతాయి.
ప్రశ్న 51.
హైడ్రోక్లోరికామ్లం యొక్క ఉపయోగాలు తెలుపుము.
జవాబు:
స్టీలు వస్తువులు, గచ్చు మరియు టాయిలెట్లు శుభ్రపరిచే ద్రవాలలో హైడ్రోక్లోరికామ్లాలు వాడతారు. అంతేగాక మందులు, సౌందర్య సాధనాల తయారీలో కూడా హైడ్రోక్లోరికామ్లాన్ని వాడతారు.
ప్రశ్న 52.
రాతి ఉప్పు అనగానేమి?
జవాబు:
ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఘన సోడియం క్లోరైడ్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ నిక్షేపాలలో ఉండే సోడియం క్లోరైడ్ స్పటికాలు మలినాలతో కలిసి ఉండడం వలన ముదురు గోధుమ రంగులో ఉంటాయి. దీనినే రాతి ఉప్పు (Rock Salt) అంటారు.
ప్రశ్న 53.
Na2CO3 . 10H2O అనే ఫార్ములాలో 10H2O అనగానేమి?
జవాబు:
Na2CO3 . 10H2O అనే ఫార్ములాలో, 10H2O అనేది Na2CO,3 యొక్క ఒక ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశిలో 10 నీటి అణువులు ఉన్నాయని సూచిస్తుంది. కాని Na2CO3 తడిగా వుండదు.
ప్రశ్న 54.
ఎసిటిక్ ఆమ్లము నీలిలిట్మస్ కాగితంను ఎరుపుగా మార్చదు. ఎందుకు?
జవాబు:
ఎసిటిక్ ఆమ్లము బలహీన ఆమ్లం కాబట్టి నీలి లిట్మసను ఎరుపుగా మార్చదు.
ప్రశ్న 55.
బ్లీచింగ్ పౌడర్ యొక్క రెండు ఉపయోగాలు తెల్పుము.
జవాబు:
- దీనిని విరంజనకారిణిగా ఉపయోగిస్తారు.
- రసాయన పరిశ్రమలలో ఆక్సీకరణిగా ఉపయోగిస్తారు.
ప్రశ్న 56.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్, జిప్సంల ఫార్ములాలు వ్రాయుము.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ – CaSO4 . ½H2O
జిప్సం – CaSO4 . 2H2O
ప్రశ్న 57.
ఏవేని రెండు ఆమ్ల-క్షార సూచికలను తెల్పుము.
జవాబు:
మిథైల్ ఆరెంజ్, లిట్మస్, ఫినాఫ్తలీన్.
ప్రశ్న 58.
బోరాక్స్ తయారీలో ఉపయోగించు లవణం ఏది?
జవాబు:
వాషింగ్ సోడా (Na2CO3 . 10H2O)
ప్రశ్న 59.
మానవ శరీరంలోని రసాయనాల pH విలువ తగ్గితే ఏమవుతుంది?
జవాబు:
పుల్లని పదార్థాలు అధికంగా తినడం వల్ల మానవ జీర్ణాశయంలోని pH తగ్గుతుంది. కాబట్టి అజీర్తికి గురి అవుతారు.
ప్రశ్న 60.
తటస్థ, ఆమ్ల, క్షార పదార్థాల PH విలువలు తెల్పుము.
జవాబు:
తటస్థ పదార్థ pH విలువ 7. ఆమ్ల పదార్థాల PH 7 కంటే తక్కువ. క్షార పదార్థాల PH 7 కంటే ఎక్కువ.
10th Class Physics 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
రెండు పరీక్షనాళికలు X, Y లలో ఒకే పరిమాణంలో మెగ్నీషియం రిబ్బన్ ను తీసుకోవడం జరిగింది. X పరీక్షనాళికలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, Y పరీక్షనాళికలో ఎసిటికామ్లాన్ని పోస్తే, ఏ పరీక్షనాళికలో రసాయన చర్య వేగంగా జరుగుతుంది? ఎందుకు?
జవాబు:
X పరీక్షనాళికలో రసాయన చర్య వేగంగా జరుగుతుంది.
కారణం :
హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఎసిటికామ్లం కన్నా బలమైన ఆమ్లం. కావున ఎసిటికామ్లం కంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, మెగ్నీషియం రిబ్బన్లో వేగంగా చర్య జరుగుతుంది.
ప్రశ్న 2.
సాధారణ ఉప్పు నుండి తయారుచేయగల రసాయనాలకు 4 ఉదాహరణలు ఇవ్వండి. వాటి సాంకేతికాలను రాయండి.
జవాబు:
సాధారణ ఉప్పు నుండి తయారు చేయగల రసాయనాలు :
- సోడియం హైడ్రాక్సైడ్ – NaOH
- బేకింగ్ సోడా / వంట సోడా / సోడియం బైకార్బొనేట్ / సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ – NaHCO3
- బట్టల సోడా / వాషింగ్ సోడా / సోడియం కార్బొనేట్ – Na2CO3. 10H2O
- బ్లీచింగ్ పౌడర్ / కాల్షియం ఆక్సీక్లోరైడ్ – CaOCl2
ప్రశ్న 3.
కింది పట్టికలో ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి, పట్టిక కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పదార్థం (జల ద్రావణంలో) | నీలి లిట్మ తో సూచించే రంగు మార్పు | రెడ్ లిట్మతో సూచించే రంగు మార్పు |
A | ఎరుపు | మార్పు లేదు |
B | మార్పు లేదు | నీలం |
C | మార్పు లేదు | మార్పు లేదు |
i) A, B, C పదార్థాలలో తటస్థ లవణం ఏది?
ii) B పదార్థానికి కొన్ని చుక్కల ఫినాఫ్తలీన్ కలిపితే ఏం జరుగుతుంది?
జవాబు:
(i) C
(ii) పింక్ (గులాబి) రంగులోకి మారుతుంది.
ప్రశ్న 4.
ఆంటాసిడ్ ఎందుకు ఉపయోగిస్తారో తెల్పి, దాని స్వభావమును రాయండి.
జవాబు:
- ఎసిడిటి సమస్య ఉన్నప్పుడు / అజీర్తి సమస్య ఉన్నప్పుడు జీర్ణాశయంలో / కడుపులో మంట, అసహనం కలుగుతాయి.
- జీర్ణాశయంలో అధికమైన ఆమ్లాన్ని తటస్థీకరించి ఉపశమనం కలగడానికి ఆంటాసిడ్ ఉపయోగిస్తారు.
- ఆంటాసిడ్ క్షారస్వభావాన్ని కలిగి యుంటుంది.
ప్రశ్న 5.
CaO ను నీటిలో కరిగించిన ఏర్పడు పదార్థం ఏది? దాని స్వభావాన్ని ఎలా నిర్ధారిస్తారు?
జవాబు:
- CaO నీటితో చర్య జరిపినప్పుడు ఏర్పడే పదార్థం కాల్షియం హైడ్రాక్సైడ్ Ca(OH)2
- కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం స్వభావాన్ని సాధారణంగా ఎరుపు లిట్మస్ కాగితం లేదా pH కాగితంతో నిర్ధారిస్తారు.
- Ca(OH)2 ఎరుపు లిట్మసు నీలిరంగుకు మారుస్తుంది. కనుక దానికి క్షార స్వభావం ఉందని చెప్పవచ్చు.
(లేదా)
Ca(OH)2 ను pH కాగితంతో పరీక్షింపగా దాని pH విలువ 7 కన్నా ఎక్కువ అని తెలుస్తుంది. కనుక అది క్షార స్వభావాన్ని కలిగి ఉందని చెప్పవచ్చు.
ప్రశ్న 6.
వాషింగ్ సోడా యొక్క ఏవేని నాలుగు ఉపయోగాలు రాయండి.
జవాబు:
వాషింగ్ సోడా ఉపయోగాలు :
- గాజు, సబ్బులు, కాగితం పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
- బోరాక్స్ వంటి సోడియం సమ్మేళనాల తయారీకి ఉపయోగిస్తారు.
- గృహావసరాలలో వస్తువులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు.
- నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి ఉపయోగిస్తారు.
ప్రశ్న 7.
ఆమ్ల, క్షార మాధ్యమాలలో సూచిక రంగులు ఏ విధంగా మారతాయో తెల్పండి.
జవాబు:
సూచిక | ఆమ్ల మాధ్యమం | క్షార మాధ్యమం |
1. లిట్మస్ | నీలి లిట్మ స్ ఎరుపురంగులోకి మారును |
ఎర్రలిట్మస్ నీలిరంగులోకి మారును |
2. ఫినాఫ్తలీన్ | రంగు లేదు | పింక్ రంగులోకి మారును |
3. మిథైల్ ఆరెంజ్ | ఎరుపు రంగులోకి మారును | పసుపు రంగులోకి మారును |
4. పసుపు రసం | పసుపురంగులోనే ఉండును | ముదురు ఎరుపు రంగులోకి మారును |
ప్రశ్న 8.
pH మానముపై లఘు వ్యాఖ్య వ్రాయుము.
జవాబు:
- ఒక ద్రావణంలోని హైడ్రోజన్ అయానుల గాఢతను లెక్కించడానికి వాడే మానమే pH మానము.
- ఒక ద్రావణం ఆమ్లమా, క్షారమా అని నిర్ణయించే ఒక సంఖ్యాత్మక విలువే pH.
- pH విలువ 0 నుండి 14 వరకు వుంటుంది.
- pH = 7 అయిన ఆ ద్రావణం తటస్థ ద్రావణం
pH < 7 అయిన ఆ ద్రావణం ఆమ్ల ద్రావణం
pH > 7 అయిన ఆ ద్రావణం క్షార ద్రావణం - pH విలువ 7 నుండి 14కు పెరుగుతూ ఉంటే, ఆ ద్రావణంలో H3O+ అయానుల గాఢత తగ్గి, OH– అయానుల గాఢత పెరుగుతూ ఉన్నదని అర్థం.
ప్రశ్న 9.
మన జీర్ణక్రియలో pH పాత్ర ఏమిటి?
జవాబు:
- జీర్ణక్రియలో మన జీర్ణాశయం హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. ఇది జీర్ణాశయానికి నష్టం కలుగకుండా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది.
- అజీర్తి సందర్భంలో మన జీర్ణాశయం అధిక పరిమాణంలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడం వలన కడుపులో మంట, అసహనం కలుగుతాయి.
- ఈ దుష్ప్రభావం నుండి విముక్తి పొందడానికి మనం ఏంటాసిడ్లుగా పిలువబడే క్షారాలను తీసుకుంటాం.
- ఏంటాసిడ్ లు కడుపులో అధికమైన ఆమ్లాన్ని తటస్థీకరిస్తాయి.
ప్రశ్న 10.
సాధారణ ఉప్పు నుండి సోడియం హైడ్రాక్సైడ్ ను పొందే విధానాన్ని వివరించుము.
జవాబు:
- సోడియం క్లోరైడ్ జలద్రావణం (జైన్ ద్రావణం) గుండా విద్యుత్ ను ప్రసరింపజేస్తే అది వియోగం చెంది సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది.
- ఈ ప్రక్రియను క్లోరో – ఆల్కలీ ప్రక్రియ అంటాం.
Nacl + 2 H2O → 2NaOH + Cl2 + H2 - క్లోరిన్ వాయువు ఆనోడ్ వద్ద, హైడ్రోజన్ వాయువు కాథోడ్ వద్ద విడుదలవుతాయి.
- కాథోడ్ వద్ద సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఏర్పడుతుంది. ఈ చర్యలో ఏర్పడే ఉత్పన్నాలు అనేక రకాలుగా – ఉపయోగపడుతున్నాయి.
ప్రశ్న 11.
సార్వత్రిక ఆమ్ల, క్షార సూచిక అనగానేమి?
జవాబు:
- సార్వత్రిక ఆమ్ల, క్షార సూచికనుపయోగించి ఆమ్లాల, క్షారాల బలాలను నిర్ణయించవచ్చు.
- ఇది అనేక సూచికల మిశ్రమం.
- ఇది ద్రావణంలో ఉండే వేర్వేరు హైడ్రోజన్ అయాన్ల గాఢతలను బట్టి వేర్వేరు రంగులను చూపుతుంది.
ప్రశ్న 12.
స్వీయ రక్షణ కోసం, మొక్కలు, కీటకాలు, జంతువులు రసాయనాలను ఉపయోగించుకొనే సందర్భాలను రాయుము.
జవాబు:
- తేనెటీగ కుట్టినప్పుడు, దాని కొండి ద్వారా మిథనోయిక్ ఆమ్లం చర్మం క్రిందకు చేరి తీవ్రమైన నొప్పి, మంట, దురద కలుగుతాయి.
- బేకింగ్ సోడా వంటి బలహీనమైన క్షారంను, కుట్టిన ప్రదేశంలో రుద్దితే నొప్పి తీవ్రత తగ్గుతుంది.
- ఆకులపై ముండ్లు ఉండే ‘దూలగొండి’ మొక్క మనకు గుచ్చుకున్నప్పుడు, అవి మిథనోయిక్ ఆమ్లాన్ని శరీరంలోనికి ప్రవేశ పెట్టడం వలన తీవ్రమైన మంట కలుగుతుంది.
- ‘దుష్టపాకు’ ఆకులతో, కుట్టిన ప్రదేశంలో రుద్దితే ఉపశమనం ఉంటుంది.
ప్రశ్న 13.
ఆమ్ల, క్షార ధర్మాలను పోల్చుము.
జవాబు:
ఆమ్ల ధర్మాలు | క్షార ధర్మాలు |
1) ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి. | 1) క్షారాలు జారుడు స్వభావం కలిగి ఉంటాయి. |
2) లోహాలతో చర్య జరిపినపుడు H2 వాయువులు విడుదల చేయును. | 2) లోహాలతో చర్య జరిపినపుడు H2 వాయువును విడుదల చేయును. |
3) నీలి లిట్మసను ఎర్రగా మార్చును. | 3) ఎర్ర లిట్మసను నీలంగా మార్చును. |
4) ఆమ్లాలన్నింటిలో H3O+ అయాన్ వుండును. | 4) క్షారాలన్నింటిలో OH– అయాన్ వుండును. |
ప్రశ్న 14.
క్రింద ఇవ్వబడిన పదార్థాలను ఆమ్లాలు, క్షారాలు లేదా లవణాలుగా వర్గీకరించండి.
జవాబు:
ఆమ్లాలు : నిమ్మరసం, చింతపండు రసం
క్షారాలు : సర్ఫ్ నీరు, సున్నపు నీరు, సబ్బు నీరు.
లవణాలు : ఉప్పు నీరు
ప్రశ్న 15.
పసుపు సూచికను ఎలా తయారుచేస్తావు? దాని ఉపయోగమేమి?
జవాబు:
పసుపు కొమ్ములను ఎండబెట్టి దానిని చూర్ణం చేస్తారు. ఈ పసుపు పొడికి నీటిని కలిపితే ఏర్పడే పసుపు ద్రావణం సూచికగా పనిచేస్తుంది. ఈ పసుపు ద్రావణానికి క్షార ద్రావణం కలిపితే ఎరుపురంగులో మారుతుంది. కాబట్టి క్షార ద్రావణాలను పసుపు సూచిక ద్వారా గుర్తించవచ్చు.
ప్రశ్న 16.
స్ఫటిక జలాన్ని కలిగి ఉన్న ఏవైనా రెండు లవణాల పేర్లు మరియు వాటి ఫార్ములాలను వ్రాయండి.
జవాబు:
- ఆర్థ కాపర్ సల్ఫేట్ – CuSO4 . 5H2O
- ఎప్సం లవణం – MgSO4 . 7H2O
ప్రశ్న 17.
తటస్థీకరణం అనగానేమి? తటస్థీకరణానికి రెండు ఉదాహరణలిమ్ము.
జవాబు:
ఆమ్లము క్షారానికి కలిపినపుడు లవణము, నీరు ఏర్పడే ప్రక్రియను తటస్థీకరణం అంటారు.
NaOH+ HCl → NaCl + H2O
ప్రశ్న 18.
ఆమ్లము, లోహంతో చర్య జరిపినపుడు విడుదలయ్యే వాయువు ఏది? రెండు ఉదాహరణలిమ్ము,
జవాబు:
ఆమ్లము, లోహంతో చర్య జరిపితే హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది.
Zn+ 2HCl → ZnCl2 + H2
Mg+ H2SO4 → MgSO4 + H2
ప్రశ్న 19.
పెరుగు మరియు పుల్లని పదార్థాలను రాగి మరియు కంచు పాత్రలలో నిల్వ చేయకూడదు. ఎందుకు?
జవాబు:
- పెరుగు మరియు పుల్లని పదార్థాలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి.
- ఇవి రాగి మరియు కంచు వంటి లోహాలతో చర్యజరిపి విష స్వభావం ఉన్న లవణాలను ఏర్పరుస్తాయి.
- కనుక పెరుగు మరియు పుల్లని పదార్థాలను రాగి మరియు కంచు పాత్రలలో నిల్వ చేయరాదు.
ప్రశ్న 20.
గాఢ సల్ఫ్యూరికామ్లాన్ని (గాఢ H2SO4) విలీనం చేయడానికి దానికి నీటిని కలుపవచ్చా తెలుపుము.
జవాబు:
- గాఢ సల్ఫ్యూరికామ్లాన్ని విలీనం చేయడానికి నీటిని కలపరాదు.
- విలీనం చేయడానికి నీటికి ఆమ్లాన్ని చుక్కలు, చుక్కలుగా కలపాలి.
- కాని ఆమ్లానికి నీటిని కలపకూడదు.
ప్రశ్న 21.
కుళాయి నీరు విద్యుత్ వాహకం, స్వేదన జలం విద్యుత్ అవాహకం (విద్యుత్ ప్రవహించదు). ఎందుకు?
జవాబు:
- కుళాయి నీరు కొన్ని లవణాలను కలిగి ఉంటుంది. లవణాలు ఉండటం వలన కుళాయి నీరు నుండి విద్యుత్ ప్రవహిస్తుంది.
- స్వేదన జలంలో లవణాలు ఉండవు కనుక స్వేదన జలంలో విద్యుత్ ప్రవహించదు.
ప్రశ్న 22.
వంటసోడా తయారీని సూచించే రసాయన సమీకరణం రాయండి.
జవాబు:
వంటసోడా తయారీ :
- వంటసోడా రసాయననామం సోడియం హైడ్రోజన్ కార్బొనేట్. దీని ఫార్ములా NaHCO3.
- దీని తయారీని సూచించే సమీకరణం
NaCl + H2O + CO2 + NH3 → NH4Cl + NaHCO3
ప్రశ్న 23.
ఉతికే సోడా Na2CO3 ని ఎలా తయారుచేస్తారు?
జవాబు:
1) బట్టల సోడా (ఉతికే సోడా) ను సోడియం క్లోరైడ్ నుండి తయారుచేస్తారు.
2) NaCl + H2O + CO2 + NH3 → NH3Cl + NaHCO3
పై చర్యలో ఏర్పడిన వంటసోడా (NaHCO3) ని వేడిచేస్తే బట్టల సోడా ఏర్పడుతుంది.
3) సోడియం కార్బొనేట్ ను ఘనఃస్ఫటికీకరణం చేస్తే ఉతికేసోడా లభిస్తుంది.
Na2CO3 + 10H2O → Na2CO3 . 10H2O.
10th Class Physics 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
CuSO4 • 5H2O లో స్ఫటిక జలంను గూర్చి తెలిపే ఒక కృత్యాన్ని వివరించండి.
జవాబు:
CuSO4 • 5H2O లో స్ఫటిక జలంను గూర్చి తెలిపే కృత్యం :
- కొన్ని కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను పొడిగానున్న పరీక్ష నాళికలో ఉంచి వేడి చేయాలి.
- నీలిరంగు కాపర్ స్ఫటికాలు తమ రంగును కోల్పోవును.
- పరీక్షనాళిక లోపలి గోడలపై నీటి బిందువులు ఏర్పడినాయి.
- వేడి చేయగా లభించిన కాపర్ సల్ఫేటకు 2-3 చుక్కలు నీటిని కలిపిన నీలిరంగు తిరిగి వచ్చును.
ప్రశ్న 2.
పట్టికలో ఇవ్వబడిన సమాచారం ఆధారంగా కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
a) పై పట్టికలో ఇచ్చిన ఆమ్లాలను తెల్పండి.
b) ఫినాఫ్తలీన్ ద్రావణంతో చర్యజరిపి ఎరుపు రంగును ఇచ్చే ద్రావణాల స్వభావాన్ని తెల్పండి.
c) పై పట్టికలో ఇచ్చిన తటస్థ ద్రావణాలను తెల్పండి.
d) ఇచ్చిన ద్రావణాలలో అత్యంత బలమైన ఆమ్లాన్ని, అత్యంత బలమైన క్షారాన్ని తెల్పండి.
జవాబు:
a) పై పట్టికలోని ఆమ్లాలు HCl, నిమ్మరసం.
b) క్షారాలు
c) స్వేదన జలం
d) అత్యంత బలమైన
ఆమ్లం : HCL, అత్యంత బలమైన క్షారం : NaOH
ప్రశ్న 3.
ఈ క్రింది పట్టికలో సమాన గాఢతలు గల వివిధ పదార్థాల జల ద్రావణాల యొక్క pH విలువలు ఇవ్వబడినాయి. పట్టిక క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
i) పై పట్టికలోని ఆమ్లాలలో అత్యంత బలహీన ఆమ్లం ఏది? ఎందువల్ల?
జవాబు:
బలహీనమైన ఆమ్లం ‘C’ – ఎందుకనగా దీని pH విలువ 7 కన్నా తక్కువగా ఉండి, 7 కి దగ్గరగా ఉంది.
ii) పై ద్రావణాలలో అత్యంత బలమైన క్షారం ఏది? ఎందువల్ల?
జవాబు:
బలహీనమైన క్షారం ‘D’ – ఎందుకనగా దీని pH విలువ 14 కి దగ్గరగా ఉంది.
iii) పట్టికలోని ఏ రెండు పదార్థాల జలద్రావణాల మధ్య రసాయనిక చర్య వలన ఎక్కువ ఉష్ణం విడుదల అవుతుంది? ఈ ఉష్ణమును ఏమంటారు?
జవాబు:
“B” మరియు “D” ల మధ్య రసాయన చర్య వలన అధిక ఉష్ణం వెలువడును. ఈ వెలువడిన ఉష్ణాన్ని తటస్థీకరజోష్ణం అంటారు.
iv) పట్టికలోని ద్రావణాలలో స్వేదనజలం యొక్క pH విలువను కలిగిన ద్రావణం ఏది? ఈ pH విలువను కలిగిన ద్రావణాలను ఏమంటారు?
జవాబు:
స్వేదన జలము యొక్క pH విలువను కలిగియున్న పదార్థం G. ఈ pH విలువలు కలిగిన ద్రావణాలను తటస్థ పదార్థాలు అంటారు.
ప్రశ్న 4.
ఆమ్ల, క్షార ద్రావణాలు అయాన్లను కలిగియున్నాయా, లేదా తెలుసుకొనుటకు నిర్వహించే ప్రయోగానికి కావలసిన పరికరాల జాబితా రాయండి. ప్రయోగ విధానాన్ని వివరించండి.
జవాబు:
కావలసిన పరికరాలు :
బీకరు, బల్బు, గ్రాఫైట్ కడ్డీలు, విద్యుత్ వాహక తీగలు, 230 V AC కరెంటు, నీరు, వివిధ ఆమ్లాలు, క్షారాలు.
ప్రయోగ విధానము :
రెండు విద్యుత్ వాహక తీగలకు గ్రాఫైట్ కడ్డీలు కలపాలి. ఈ గ్రాఫైట్ కడ్డీలను ఒక గాజు బీకరులో ఒకదానికొకటి తగలకుండా అమర్చాలి. వలయంలో, విద్యుత్ బల్బు అమర్చాలి. బీకరులో సజల ఆమ్లాన్ని పోయాలి. విద్యుత్ వాహక తీగల రెండవ చివరలను 230 V AC కి కలిపి వలయంలో విద్యుత్ ప్రసరింపజేయాలి. ఈ విధముగా వివిధ ఆమ్లాలు, క్షారాలను మార్చుతూ ప్రయోగాన్ని చేయాలి. ఆమ్లాలు, క్షారాలతో ప్రయోగాన్ని చేసిన ప్రతి సందర్భంలోనూ బల్బు వెలుగుతుంది. అనగా ఆమ్లాలు, క్షారాలు అయానులను కలిగి ఉన్నాయని చెప్పవచ్చు.
ప్రశ్న 5.
హైడ్రోక్లోరికామ్లంతో NaHCO3 చర్య వలన CO2 విడుదల అగునని చూపు ప్రయోగానికి కావలసిన పరికరాల జాబితాను రాసి, ప్రయోగ విధానమును వివరించండి.
జవాబు:
కావలసిన పదార్థాలు : స్టాండు, పరీక్ష నాళికలు, వాయు వాహక నాళము, థిసిల్ గరాటు, రెండు రంధ్రములు గల రబ్బరు బిరడా, Ca(OH)2, NaHCO3, HCl.
ప్రయోగ విధానము :
- ఒక పరీక్ష నాళికలో NaHCO3 తీసుకొని దానికి రెండు రంధ్రాల రబ్బరు బిరడాని బిగించవలెను.
- ఒక రంధ్రం గుండా థిసిల్ గరాటును, రెండవ రంధ్రం గుండా వాయు వాహక నాళం ఒక కొనను అమర్చాలి. వాయు వాహక నాళం రెండవ చివరను Ca(OH)2 గల మరొక పరీక్షనాళికలో ఉంచాలి.
- థిసిల్ గరాటు గుండా సజల HCl ఆమ్లంను పోయాలి. NaHCO3, HCl ల మధ్య చర్య జరగడం ప్రారంభమవుతుంది.
- చర్యలో విడుదలైన వాయువు వాయు వాహక నాళం గుండా ప్రయాణించి Ca(OH)2 ని తెల్లని పాలవలె మార్చును. ఇది CO2 వాయువు అని నిర్ధారించవచ్చును.
ప్రశ్న 6.
X, Y, Z అనే ద్రావణాల pH విలువలు వరుసగా 13, 6, 2 అయిన
అ) ఏ ద్రావణం బలమైన ఆమ్లము? ఎందుకు?
జవాబు:
Z అను ద్రావణము యొక్క pH విలువ ‘2’, ఈ విలువ మిగిలిన ద్రావణాల కన్నా తక్కువ కనుకనే ‘Z’ ద్రావణము బలమైన ఆమ్లము అగును.
ఆ) ఏ ద్రావణంలో ద్రావితపు అణువులతోపాటు అయానులు కూడా ఉంటాయి?
జవాబు:
బలహీన ఆమ్లంకు ద్రావితపు అణువులతోపాటు అయానులు కూడా ఉంటాయి. ఇచ్చిన ద్రావణాలలో ‘X’ బలహీన ఆమ్లం కనుక దీనికి ద్రావితపు అణువులతో పాటు అయానులు కూడా ఉంటాయి.
ఇ) ఏ ద్రావణం బలమైన క్షారం? ఎందుకు?
జవాబు:
ఏ ద్రావణపు pH విలువ ఎక్కువగా ఉండునో అది బలమైన క్షార స్వభావంను ప్రదర్శించును. కనుక ఇచ్చిన ద్రావణాలలో ‘X’ బలమైన క్షారంగా ప్రవర్తించును.
ఈ) ఒక ద్రావణానికి క్షారాన్ని కలిపినపుడు దాని pH విలువ పెరుగుతుందా? తగ్గుతుందా? ఎందుకు?
జవాబు:
ఏదైనా ఒక ద్రావణంకు క్షారంను కలిపిన ఆ ద్రావణంలోని OH– అయానుల గాఢత పెరిగి pH విలువ పెరుగును.
ప్రశ్న 7.
X అనే ద్రావణం నీలిలిట్మస్ ను ఎరుపు రంగులోకి, Y అనే ద్రావణం ఎరుపు లిట్మసను నీలిరంగులోకి మార్చినాయి.
అ) X, Y ద్రావణాలను రెండింటినీ కలిపినపుడు ఏ ఏ ఉత్పన్నాలు ఏర్పడవచ్చు?
జవాబు:
X మరియు Yలను కలుపుట అనగా అమ్లంతో క్షారంను కలిపినా వాటి మధ్య రసాయనిక చర్య జరిగి లవణము మరియు నీరు ఏర్పడును.
ఆ) X ద్రావణంలో మెగ్నీషియం ముక్కలు వేసినపుడు ఏ వాయువు విడుదలౌతుంది?
జవాబు:
X ద్రావణం అనగా ఆమ్లంలో మెగ్నీషియం ముక్కలు వేసినపుడు H2 వాయువు విడుదలగును. అనగా అమ్లంలు, అలోహాలతో చర్య జరిపి H2 వాయువును విడుదల చేయును.
ఇ) Y ద్రావణంలో జింకు ముక్కలు వేసినపుడు రసాయనిక చర్య జరుగుతుందా? ఎందుకు?
జవాబు:
Y ద్రావణం అనగా క్షారంలో జింకు ముక్కలు వేసినపుడు అవి రసాయన చర్యలో పాల్గొని, H2 వాయువును విడుదల చేయును.
అనగా క్షారాలు, లోహాలతో చర్య జరిపి H2 వాయువును విడుదల చేయును.
ఈ) పై రెండింటిలో హైడ్రోజన్ అయానులు ఎక్కువగా ఉండే ద్రావణం ఏది?
జవాబు:
ఆమ్లాలలో H+ అయానులు ఎక్కువగా ఉండును. అనగా ఇచ్చిన వాటిలో X ద్రావణం నందు ఎక్కువగా హైడ్రోజన్ అయానులుండును.
ప్రశ్న 8.
నిత్యజీవితంలో pH యొక్క ప్రాముఖ్యతను తెలుపు కొన్ని ఉదాహరణలను క్లుప్తంగా చర్చించండి.
జవాబు:
- జీవ సంబంధ ప్రాణులన్నీ pH విలువలలోని అతిస్వల్ప మార్పులకు లోబడి మాత్రమే జీవించగలవు.
ఉదా : తక్కువ pH విలువలు గల నదీజలాలలో ఉండే జలచరాల జీవనం సంక్లిష్టస్థితిలో ఉండును. - pH లోని మార్పు దంతక్షయానికి కారణమగును.
- జీర్ణవ్యవస్థలో జీర్ణక్రియ జరుగుటకు విడుదలగు ఆమ్లాల pH ముఖ్యపాత్ర వహించును.
- మొక్కలు ఆరోగ్యవంతంగా. పెరుగుటకు నిర్దిష్ట పరిమితిలో pH గల మట్టి అవసరం.
- స్వీయరక్షణ కొరకు మొక్కలు, కీటకాలు, జంతువులు కొంత pH గల రసాయనాలను ఉపయోగించుకుంటాయి.
ప్రశ్న 9.
బలమైన ఆమ్లము, క్షారం, బలహీనమైన ఆమ్లం, క్షారం అనగానేమి? ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
బలమైన ఆమ్లము :
ఏ ఆమ్లాలైతే 100% అయనీకరణం చెందుతాయో ఆ ఆమ్లాలను బలమైన ఆమ్లాలు అంటారు.
ఉదా : HCl, H2SO4, HNO3.
బలహీనమైన ఆమ్లం :
ఏ ఆమ్లాలైతే 100% అయనీకరణం చెందవో ఆ ఆమ్లాలను బలహీన ఆమ్లాలు అంటారు.
ఉదా : CH3COOH, H2CO3, H3PO4.
బలమైన క్షారం :
ఏ క్షారాలైతే 100% అయనీకరణం చెందుతాయో వాటిని బలమైన క్షారాలంటారు.
ఉదా : NaOH, KOH.
బలహీన క్షారం :
ఏ క్షారాలైతే 100% అయనీకరణం చెందవో వాటిని బలహీన క్షారాలంటారు.
ఉదా : NH4OH, Ca(OH)2, Mg(OH)2.
ప్రశ్న 10.
బ్లీచింగ్ పౌడరును పారిశ్రామికంగా ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు? దాని ఉపయోగాలేవి?
జవాబు:
తేమలేని కాల్షియం హైడ్రాక్సైడ్ పై క్లోరిన్ వాయువు చర్య వలన బ్లీచింగ్ పౌడర్ తయారగును.
Ca(OH)2 + Cl2 → CaOCl2 + H2O
ఉపయోగాలు :
- వస్త్ర పరిశ్రమలలో కాటన్ మరియు కాగితాలను విరంజనం చెయ్యటానికి వాడతారు.
- అనేక రసాయన పరిశ్రమలలో దీనిని ఆక్సీకరణిగా వాడతారు.
- తాగే నీటిలోని క్రిములను సంహరించటానికి క్రిమిసంహారిణిగా వాడతారు.
- క్లోరోఫాం తయారీలో కారకంగా ఉపయోగిస్తారు.
ప్రశ్న 11.
కొన్ని రసాయనాల సాంకేతిక నామాలను తెల్పుము.
జవాబు:
సాధారణ నామం | సాంకేతికం |
1. బ్రైన్ ద్రావణం | Nacl ద్రావణం |
2. కాస్టిక్ సోడా | NaOH |
3. కాస్టిక్ పొటాష్ | KOH |
4. క్విక్ లైమ్ | CaO |
5. స్లేక్ డ్ లైమ్ | Ca(OH)2 |
6. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ | CaSO4 ½H2O |
7. జిప్సం | Ca SO4.2H2O |
8. బేకింగ్ సోడా | NaHCO3 |
9. వాషింగ్ సోడా | Na2CO310H2O |
10. సోడాయాష్ | Na2CO3 |
11. మార్బుల్ | CaCO3 |
12. వెనిగర్ | CH3COOH |
13. బ్లీచింగ్ పౌడర్ | CaOCl2 |
ప్రశ్న 12.
ఆమ్లాల యొక్క రసాయన ధర్మాలను ఏవేని నాలిగింటిని తెల్పండి.
జవాబు:
ఆమ్ల ధర్మాలు :
1) ఆమ్లాలు చర్యాశీలత కల లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి.
Mg + 2HCl → MgCl2 + H2
2) ఆమ్లాలు, క్షారాలతో చర్య జరిపి లవణము మరియు నీటిని ఏర్పరుస్తాయి.
HCI+ NaOH — Nacl + H2O
3) ఆమ్లాలు కార్బొనేట్లు మరియు హైడ్రోజన్ కార్బొనేట్లతో చర్య జరిపి లవణము, నీరు మరియు కార్బన్ డై ఆక్సెలను ఏర్పరుస్తాయి.
CaCO3 + 2HCl → CaCl2 + H2O + CO2
NaHCO3 + HCl → NaCl + H2O + CO2
4) ఆమ్లాలు, లోహ ఆక్సెతో చర్య జరిపి లవణము మరియు నీటిని ఏర్పరుస్తాయి.
2HCl + Ca0 → CaCl2 + H2O
ప్రశ్న 13.
క్రింద తెలుపబడిన లవణాల ఫార్ములాలను వ్రాయండి. – ఎ) సోడియం సల్ఫేట్
బి) అమ్మోనియం క్లోరైడ్ పైన సూచించిన లవణాలు ఏ ఏ ఆమ్లముల మరియు క్షారాల మధ్య జరిగే చర్యల వలన ఏర్పడతాయో తెల్పండి. సంబంధిత రసాయన చర్యల సమీకరణాలను వ్రాయండి. అవి ఏ రకపు రసాయన చర్యలో పేర్కొనండి.
జవాబు:
సోడియం సల్ఫేట్ ఫార్ములా – Na2SO4
అమ్మోనియం క్లోరైడ్ ఫార్ములా – NH4Cl
1) సోడియం హైడ్రాక్సైడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపినపుడు సోడియం సల్ఫేట్ ఏర్పడుతుంది.
2NaOH + H2SO4 → Na2SO4 + 2H2O
2) అమ్మోనియం హైడ్రాక్సైడ్, హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినపుడు అమ్మోనియం క్లోరైడ్ ఏర్పడుతుంది.
NH4OH + HCl → NH4Cl + H2O
ఈ రెండు తటస్థీకరణ చర్యలు.
ప్రశ్న 14.
కొన్ని పదార్థాల (ఆమ్ల / క్షార / తటస్థ)కు మరియు సూచికలకు మధ్య జరిగే చర్యల ఫలితాలకు సంబంధించి క్రింద ఇవ్వబడిన పట్టికను పూర్తిచేయండి.
జవాబు:
ప్రశ్న 15.
A, B, C, D&E అనే ద్రావణాల pH విలువలు సార్వత్రిక సూచిక ద్వారా పరీక్షించినపుడు అవి వరుసగా 5,2,13,7 &9 గా గుర్తించబడినాయి. వీటిలో ఏది?
ఎ) తటస్థ ద్రావణం బి) బలమైన క్షారం సి) బలమైన ఆమ్లం డి) బలహీన ఆమ్లం ఇ) బిలహీన క్షారం –
వీటిలో H+ అయాన్ల సంఖ్య యొక్క పెరిగే దిశలో ఆరోహణ క్రమంలో రాయండి.
జవాబు:
ఎ) E ద్రావణం బి) C ద్రావణం సి) B ద్రావణం డి) A ద్రావణం ఇ) E ద్రావణం
H+ అయాన్ల సంఖ్య పెరిగే దిశలో ఆరోహణక్రమం : E, B, A, E, C.
ప్రశ్న 16.
తినేసోడా (బేకింగ్ సోడా), ఉతికేసోడా (వాషింగ్ సోడా)ల యొక్క ఏవేని నాలుగు ఉపయోగాలు వ్రాయుము.
జవాబు:
తినేసోడా ఉపయోగాలు : .
- బేకింగ్ పౌడర్ తయారీలో ఉపయోగిస్తారు.
- యాంటాసిడ్ లో ఉపయోగిస్తారు.
- అగ్నిమాపక యంత్రాలలో సోడా ఆమ్లంగా ఉపయోగిస్తారు.
- యాంటీ సెప్టిక్ గా కూడా ఉపయోగపడుతుంది.
ఉతికే సోడా ఉపయోగాలు :
- గాజు, సబ్బులు, కాగితం పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
- బోరాక్స్ తయారీలో ఉపయోగిస్తారు.
- వస్తువులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు.
- నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు.
10th Class Physics 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు Important Questions and Answers
ప్రశ్న 1.
ఒక లవణం అర్ధ లవణమా? అనార్థ లవణమా? నిర్ణయించుటకు నిర్వహించే పరీక్ష ఏది?
జవాబు:
లవణమును ఒక పరీక్ష నాళికలో ఉంచినపుడు,
- ఒకవేళ అది ఆర్ధ లవణమైనట్లయితే పరీక్ష నాళికను వేడి చేసినపుడు దాని గోడలపై తేమను గమనించవచ్చును.
- అదే అనార్ధ లవణమైనట్లయితే పరీక్ష నాళికను వేడి చేసినపుడు దాని గోడలపై ఎట్టి తేమ ఏర్పడదు.
ప్రశ్న 2.
నీకివ్వబడిన అర్ధ స్పటికంలోని నీటిని తొలగించుటకు నీవు అనుసరించు విధానమును తెలుపుము.
జవాబు:
నాకివ్వబడిన ఆర్ధ స్ఫటికం ‘తడిగా లేకున్నప్పటికి వాటిలో స్పటిక జలం ఉండును. వాటిని వేడి చేసినపుడు ఈ స్పటిక జలం ఆవిరగును.
ప్రశ్న 3.
P.O.P (Plaster of Parts) సిమెంటు, కాల్షియం క్లోరైడ్ లాంటి వాటిని గాలి సోకని, తేమ లేని విధంగా సీలు చేసి ఉంచుతారు. కారణమేమి?
జవాబు:
- సాధారణ ఉష్ణోగ్రత వద్ద వీటిలో అనగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు కాల్షియం క్లోరైడ్ లో నీటి అణువులుండును కనుక, ఇవి
- మొదటగా తడిగా మారి, వాటి స్ఫటిక లక్షణం కోల్పోయి చివరకు గ్రహించిన తేమ నీటిలో కరిగి ద్రావణంను ఏర్పరచును.
- ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మాత్రము జిప్సంను ఏర్పరచును.
- ప్లాస్టర్ ఆఫ్ పారిస్, CaCl, 6H,Oలు ఆర్థ లవణాలు కనుక.
ప్రశ్న 4.
ఆర్థ, అనార్థ లవణాలకు కొన్ని ఉదాహరణలివ్వండి.
జవాబు:
అనార్ధ లవణములు :
i) కోబాల్ట్ (ii) క్లోరైడ్ – COCl2
ii) కాపర్ (ii) సల్ఫేట్ – Cu2SO4
iii) కాల్షియం క్లోరైడ్ – CaCl2
ఆర్ధ లవణములు :
i) సోడియం కార్బోనేట్ – Na2CO3.10H2O
ii) మెగ్నీషియం సల్ఫేట్ – MgSO4.7H2O
iii) కాల్షియం సల్ఫేట్ – CaSO4.2H2O
iv) కాపర్ సల్ఫేట్ – CuSO4.5H2O
v) ఫెర్రస్ సల్ఫేట్ – FeSO4.7H2O\
ప్రశ్న 5.
ఇచ్చిన పదార్థం (లవణం) ఆర్థ, అనార్థ పదార్థమా నిర్ధారించుటకు నీవు అనుసరించు పద్ధతిని వివరించుము.
జవాబు:
- మనకు ఇచ్చిన పదార్ధమును కొంతసేపు ఆరుబయట ఉంచిన, దానిలోని నీటి లవణాలు కోల్పోయి, రంగులో మార్పు ఏర్పడినట్లయితే అది ఒక ఆర్ధ లవణంగా భావిస్తాము.
- అదే విధముగా మనకు ఇచ్చిన పదార్ధంను వేడి చేసినపుడు అది దాని రంగును కోల్పోయినట్లయితే ఆ పదార్థము అనార్ధ లవణం అగును. “అదే అనార్ధ లవణంకు నీటిని కలిపిన అది ఆర్ధ లవణంగా మారును.
ప్రశ్న 6.
అనార్థ లవణం, అర్థ లషణాలను వేడి చేసినపుడు నీ పరిశీలనలు ఏవి?
జవాబు:
- ఉదాహరణకు కోబాల్డ్ క్లోరైడ్ (COCl2) ను బీకరులో తీసుకున్నపుడు దాని రంగు పింకు గాను, గది ఉష్ణోగ్రత వద్ద
ముదురు వంకాయ రంగులోను, వేడి చేయగా నీలంగా మారును. అనగా COCl2 అనునది ఒక అనార్థ లవణం కనుక దానిని వేడి చేయగా రంగులో మార్పు ఏర్పడును. - అర్ధ లవణంను వేడి చేయగా అది కూడా దానిలో ఉండు నీటిని కోల్పోయి రంగు మారును.
- రెండు రకాల లవణాల యొక్క ద్రవ్యరాశులలో మార్పు జరుగును.
ప్రశ్న 7.
నీ దైనందిన జీవితంలో అర్థ, అనార్ధ స్ఫటికాలను ఉపయోగించే సందర్భాలను రెండింటిని పేర్కొనండి.
జవాబు:
అనార్థ లవణాల నిత్య జీవిత ఉపయోగాలు :
- ప్రయోగాలలో, ప్రయోగ సమయములో ఏర్పడు ఆవిరులను, తుంపరలను తొలగించుటకు.
- వేసవి కాలంలో రహదారులను సరైన కండిషన్లో ఉంచుటకు తరచుగా అనార్ధ లవణాలను వాడతారు.
- గాజు, పేపరు మరియు రసాయనాల తయారీ పరిశ్రమలలో వీటిని తరచుగా వాడతారు.
- తోళ్ళ పరిశ్రమలలో విరివిగా వాడతారు.
ఆర్ద్ర లవణాల ఉపయోగాలు :
- వాషింగ్ సోడా తయారీలో.
- నీటిని శుద్ధి చేయటకు వాడు పట్టిక తయారీలో.
- రక్తం కారుచున్న చిన్న గాయాలను అదుపులోనికి తెచ్చుటకు పట్టికను వాడతారు.
- ఇంకుల తయారీలో.
ప్రశ్న 8.
అర్ధ లవణం నుండి జలాణువులను తొలగించుటను సూచించు పటంలో లోపాన్ని గుర్తించండి.
జవాబు:
- నీటిఆవిరులు ఏర్పడటం కన్పించుట లేదు.
- CuSO4 స్ఫటికాలను సరైన ప్రాంతంలో వేడి చేయుట లేదు. అనగా బున్ సైన్ దీపంపై సరైన రీతిలో ఉంచకపోవటం.
- పరీక్షనాళిక గట్టి గాజుతో తయారైనది కాదు.
ప్రశ్న 9.
Na2CO3, Nacl, NaHCO3, CUSO4, Na2S2O3, MgSO4, CaCO3, ZNCO3, CuCO3 ఈ లవణాలలో ఏవి – ఆర్థ, అనార్థ లవణాలో పట్టికలో పొందుపరచండి.
జవాబు:
ఆర్ధ లవణం | అనార్థ లవణం |
Na2CO3, NaHCO3, CuSO4 | Na2S2O3, Ag SO4 Nacl, ZnCO3, CaCO3 |
10th Class Physics 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 1/2 Mark Important Questions and Answers
1. ఒక పరీక్ష నాళికలో 2 మి.లీ. NaOH ను తీసుకొని దానికి 2 చుక్కల ఫినాఫ్తలీన్ ద్రావణాన్ని కలుపుము. నీవు పరిశీలించే రంగు ఏమిటి?
జవాబు:
పింక్ (గులాబి)
2. ఏదేని ఒక సహజ సూచికను రాయుము.
జవాబు:
లిట్మస్ / బీట్ రూట్ / ఎర్ర క్యాబేజీ / పసుపు ద్రావణం.
3. ఆమ్లానికి ఉదాహరణ రాయుము.
జవాబు:
HCl/H2SO4/HNO3/CH3COOH, మొ॥.
4. క్షారానికి ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
NaOH/Ca(OH)2/Mg(OH)2/ KOH, మొ||.
5.
పై ఏ ద్రావణం ఫినాఫ్తలీన్ ద్రావణాన్ని ‘పింక్ రంగులోకి మార్చగలదు?
జవాబు:
ద్రావణం ‘A’
6. సువాసన సూచికకు ఉదాహరణనిమ్ము.
జవాబు:
ఉల్లి | వెనిల్లా ఎసెన్స్ / లవంగ నూనె మొ||
7. ఒక ద్రావణం ఎర్రలిట్మసను నీలి రంగులోకి మార్చింది. అయిన ఆ ద్రావణం మిథైల్ ఆరెంజ్ సూచికను ఏ రంగులోకి మార్చును?
జవాబు:
పసుపు రంగు
8. నిజ జీవితంలో సువాసన సూచికనొకదానిని రాయుము. ఏది?
జవాబు:
వెనిల్లా ఎసెన్స్
9. ప్రవచనం (A) : ఊరగాయ మరియు పుల్లని పదార్థాలను ఇత్తడి, రాగి వంటి పాత్రలలో నిల్వ చేయరాదు.
కారణం (R) : ఆమ్లాలు లోహాలతో చర్య జరుపును.
A) A, Rలు సరైనవి మరియు A ను R సమర్థిస్తుంది.
B) A, Rలు సరైనవి మరియు A ను R సమర్ధించదు.
C) A సరియైనది, B సరైనది కాదు.
D) A సరియైనది కాదు. B సరియైనది.
జవాబు:
A) A, Rలు సరైనవి మరియు A ను R సమర్థిస్తుంది.
10. ఆమ్లంతో ఒక లోహం చర్య జరిపితే ఏ వాయువు విడుదలగును?
జవాబు:
హైడ్రోజన్
11. a) లోహాలు అన్ని ఆమ్లాలతో హైడ్రోజన్ ను ఇస్తాయి.
b) లోహాలు అన్ని క్షారాలతో హైడ్రోజన్ ను ఇస్తాయి.
A) a మరియు b లు సరియైనవి.
B) ‘a’ మాత్రమే సరియైనది.
C) ‘b’ మాత్రమే సరియైనది.
D) a, b లు సరియైనవి కావు
జవాబు:
B) ‘a’ మాత్రమే సరియైనది.
12. హైడ్రోజన్ వాయువును పరిశీలించుటకు నీవు వినియోగించు పరికరం ఏది?
జవాబు:
మండుతున్న క్రొవ్వొత్తి / మండుతున్న అగ్గిపుల్ల.
13. మండుతున్న క్రొవ్వొత్తిని హైడ్రోజన్ వాయువు వద్దకు తీసుకువచ్చినపుడు ఏమి జరుగును?
జవాబు:
‘టప్’ మనే శబ్దంతో వాయువు మండును.
14. ప్రయోగశాలలో హైడ్రోజన్ పొందుటకు కావల్సిన రెండు పదార్థాలను రాయుము.
జవాబు:
HCl, Zn.
15. క్రింది రసాయనిక చర్యలో లభించే పదార్థాలు ఏవి?
ఆమ్లం + లోహం →
జవాబు:
లవణం + హైడ్రోజన్
16. NaOH, Zn తో చర్య జరిపినపుడు ఏర్పడు లవణం ఏమిటి?
జవాబు:
Na2ZnO2 (సోడియం జింకేట్).
17. కార్బొనేట్ తో ఆమ్లం చర్య జరిపిన వెలువడు వాయువు
జవాబు:
CO2 వాయువు
18. CO2 వాయువును పరీక్షించుటకు వినియోగించు రసాయన పదార్థం ఏమిటి?
జవాబు:
Ca(OH)2 ద్రావణం/ కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం.
19. క్రింది చర్యలలో ఏది / ఏవి CO, ను ఇచ్చును?
A) Na2CO, + HCl →
B) NaHCO3 + HCl →
C) Zn + HCl →
జవాబు:
A, B
20. క్రింది సమీకరణంలో చర్యను ఏమని పిలుస్తారు?
క్షారం + ఆమ్లం – నీరు + లవణం
జవాబు:
తటస్థీకరణ చర్య
21. ఆంటాసిడ్ గుళికను తీసుకొన్నప్పుడు కడుపులో జరుగు చర్య ఏమిటి?
జవాబు:
తటస్థీకరణ చర్య
22. లోహ ఆక్సైడ్ లు ఆమ్లంతో చర్యను ఏ చర్య అంటారు?
జవాబు:
తటస్థీకరణ చర్య
23. లోహ ఆక్సైడ్ లు ఎటువంటి స్వభావాన్ని కలిగి యుంటాయి?
జవాబు:
క్షార స్వభావం
24. అలోహ ఆక్సైడ్లు ఎటువంటి స్వభావాన్ని కలిగి యుంటాయి?
జవాబు:
ఆమ్ల స్వభావం
25. బీకరులో గల HCl ద్రావణానికి కాపర్ ఆక్సైడ్ కలిపిన, ద్రావణం ఏ రంగులోకి మారును?
జవాబు:
నీలి-ఆకుపచ్చ
26. వాక్యం – a : అన్ని అలోహ ఆక్సైడ్ లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి.
వాక్యం – b: అన్ని లోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి.
పై వానిలో ఏది సరియైన వాక్యం?
జవాబు:
రెండూ కావు.
27. ఆమ్లాల సాధారణ ధర్మం ఏమిటి?
జవాబు:
జలద్రావణంలో H+/H3O+ అయాన్లు ఇచ్చును.
28. క్షారాల సాధారణ ధర్మం ఏమిటి?
జవాబు:
జలద్రావణంలో OH- అయాన్లు ఇచ్చును.
29. క్రింది వానిలో సరికాని వాక్యం / వాక్యాలు ఏవి?
A) హైడ్రోజన్ ను కలిగి వున్న అన్ని సమ్మేళనాలు ఆమ్లాలే.
B) హైడ్రోజనను కలిగి వున్న అన్ని సమ్మేళనాలు క్షారాలే.
C) హైడ్రోజన్ ను కలిగి ఉన్న అన్ని సమ్మేళనాలు ఆమ్లాలు కావు.
జవాబు:
A మరియు B.
30.
పై పటంలో చూపిన ప్రయోగంలో ఏయే ద్రావణాలకి బల్బ్ వెలుగుతుంది?
1) ఆల్కహాల్
2) గ్లూకోజ్
3) హైడ్రోక్లోరికామ్లం
4) సల్ఫ్యూరికామ్లం
జవాబు:
3, 4
31. జలద్రావణంలో H+ అయాన్లు ఇచ్చు పదార్థం ఒక దానిని రాయుము.
జవాబు:
HCl
32. తడిగాలిని పొడిగాలిగా చేయుటకు నీవు వినియోగించే పదార్థం ఏమిటి?
జవాబు:
కాల్షియం క్లోరైడ్
33. హైడ్రోనియం అయాను అనగానేమి?
జవాబు:
H3O<+
34. ఆల్కలీ అని వేటినందురు?
జవాబు:
నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీ అందురు.
35. పొడి నీలి లిట్మస్ కాగితాన్ని పొడి HCl లో ముంచినపుడు ఏమి జరుగునో ఊహించుము.
జవాబు:
లిట్మస్ కాగితం రంగు మారదు.
36. క్రింది వానిలో నీవు అవలంబించే సరియైన పద్దతి ఏమిటి?
a) ఆమ్లాన్ని నీటికి నెమ్మదిగా కలపాలి.
b) నీటిని ఆమ్లానికి నెమ్మదిగా కలపాలి.
జవాబు:
‘a’
37. ‘ఆమ్ల, క్షార బలాలను కనుగొనుటకు వినియోగించు ఒక సూచికను రాయుము.
జవాబు:
సార్వత్రిక సూచిక. (యూనివర్శల్ ఇండికేటర్)
38. ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ గాఢతను తెలుసుకొనే స్కేలు ఏమిటి?
జవాబు:
pH స్కేలు
39. తటస్థ ద్రావణం pH విలువ ఎంత?
జవాబు:
‘7’
40. సరియైన జతలు రాయుము.
a) ఆమ్లం pH – 1) <7
b) cho pH – 2) = 7
c) తటస్థ ద్రావణం pH – 3) > 7
జవాబు:
a – 1, b – 3, c – 2.
41. pH విలువల వ్యాప్తి ఎంత?
జవాబు:
0-14
42. నోటిలో దంతక్షయం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
జవాబు:
నోటిలో pH విలువ 5.5 కన్నా తగ్గినప్పుడు
43. ఆంటాసిడ్ కి ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
మెగ్నీషియం హైడ్రాక్సైడ్ (మిల్క్ ఆఫ్ మెగ్నీషియా)
44. ఒక పరీక్ష నాళికలో ఆంటాసిడ్ మాత్రను పొడి చేసి వేయుము. దానికి మిథైల్ ఆరెంజ్ సూచికను కలుపుము. నీవు గమనించు రంగు ఏమిటి?
జవాబు:
పసుపు
45. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, కడుపులో గల ఆమ్లంతో జరిపే చర్యా సమీకరణం రాయుము.
జవాబు:
Mg(OH)2 + 2HCl → 2H2O + MgCl2
46. ఒక రైతు తన పొలాన్ని కాల్షియం కార్బొనేట్ తో తటస్థీకరిస్తున్నాడు. ఆ నేల స్వభావాన్ని ఊహించుము.
జవాబు:
ఆమ్ల స్వభావం.
47. తేనెటీగలు కుట్టినప్పుడు వంటగదిలో వినియోగించే ఏ పదార్థాన్ని వినియోగించవచ్చును?
జవాబు:
బేకింగ్ సోడా
48. దురదగొండి ఆకు ఏ ఆమ్లం ఉత్పత్తి చేయును?
జవాబు:
మిథనోయికామ్లం / ఫార్మికామ్లం
49. బలమైన ఆమ్ల, క్షారాల చర్య వలన ఏర్పడే లవణం pH ఎంత వుంటుంది?
జవాబు:
pH = 7
50. టేబుల్ సాల్ట్ రసాయన నామం ఏమిటి?
జవాబు:
సోడియం క్లోరైడ్ (NaCl)
51. క్లోరో-ఆల్కలీ పద్ధతిలో మూల పదార్థం ఏమిటి?
జవాబు:
Nacl
52. క్లోరో – ఆల్కలీ పద్ధతిలో ఏర్పడే ఆల్కలీ ఏమిటి?
జవాబు:
సోడియం హైడ్రాక్సైడ్
53. క్లోరో – ఆల్కలీ పద్ధతిలో లభించే పదార్థాలు ఏవి?
జవాబు:
NaOH, CL, H,
54. పొడిసున్నంతో క్లోరిన్ చర్య వలన ఏర్పడే పదార్థం ఏమిటి?
జవాబు:
బ్లీచింగ్ పౌడర్
55. క్రింది వానిని జతపరుచుము
a) బ్లీచింగ్ పౌడర్ – 1) Na2CO3.10 H2O
b) బేకింగ్ సోడా – 2) NaHCO3
c) వాషింగ్ సోడా – 3) CaoCl2
జవాబు:
a – 3; b – 2; c -1
56. బేకింగ్ సోడా రసాయన నామం ఏమిటి?
జవాబు:
సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ (NaHCO3).
57. బేకింగ్ సోడాను వేడి చేసిన విడుదలయ్యే వాయువేది?
జవాబు:
CO2
58. అగ్నిమాపక పరికరాలలో వినియోగించే లవణం ఏమిటి?
జవాబు:
NaHCO3.
59. వాషింగ్ సోడా అణువులో ఎన్ని నీటి అణువులు ఉంటాయి?
జవాబు:
10[Na2CO3.10H30]
60. CuSO4. 5H2O రంగు ఏమిటి?
జవాబు:
నీలం.
61. జిప్సం అణువులో ఉండే నీటి అణువుల సంఖ్య ఎంత?
జవాబు:
‘2’ [CaSO4.2H2O]
62. క్రింది వానిని జతపరుచుము.
a) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ 1) CaSO4.½H2O
b) జిప్సం 2) Na2CO3.10H2O
c) వాషింగ్ సోడా – 3) CaSO4.2H2O
జవాబు:
a) – 1, b) – 3, c) – 2
63. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయనిక నామం ఏమిటి?
జవాబు:
కాల్షియం సల్ఫేట్ హెమి హైడ్రేట్ (CaSO4.½H20).
64. P.O.P. కి తడి తగిలిన ఏమవుతుంది?
జవాబు:
జిప్సం ఏర్పడును
65. క్రింది వానిలో దేనిని గాలి చొరబడని పాత్రలలో ఉంచాలి?
A) CaoCl2
B) CaSO4. ½H2O
C) CaSO4.2H2O
D) పైవన్నియు
జవాబు:
B) CaSO4. ½H2O
66. CaSO4. ½H2O ను గాలి తగిలే చోట ఉంచితే ఏమగును?
జవాబు:
గట్టిగా మారును / జిప్సంగా మారును.
67. క్షార ద్రావణాన్ని పరీక్షించడానికి వినియోగించే పరికరం పదార్థం ఏమిటి?
జవాబు:
ఎర్రలిట్మ స్ పేపర్
68.
• ఏ పదార్థం ఆమ్లం?
జవాబు:
‘A’.
• ఏ పదార్థం లిట్మస్ పేపర్ రంగు మార్చలేదు?
జవాబు:
‘A’.
69.
పటంలో చూపిన ప్రయోగంలో ఏ వాయువు విడుదలగును?
జవాబు:
CO2
70. ఒక పదార్థం ఫినాఫ్తలీన్ సూచికను పింక్ రంగులోకి మార్చింది. ఆ పదార్థం మిథైల్ ఆరెంజ్ సూచికలో ఏ రంగు ఇచ్చును?
జవాబు:
పసుపు
71. కాల్షియం హైడ్రాక్సైడ్ ను ఏ వాయువును పరీక్షించడానికి వినియోగించవచ్చును?
జవాబు:
CO2
72. 10 మి.లీ. నీటిని పరీక్ష నాళికలో తీసుకొని, దానికి కొన్ని సోడియం హైడ్రాక్సైడ్ గుళికలను కలిపి పరీక్ష నాళిక అడుగున పట్టుకుంటే ఎలా అనిపిస్తుందో రాయుము.
జవాబు:
చల్లగా ఉంటుంది.
73. pH – పదార్థం
1) 12 – A) టమాట రసం
2) 4 – B) నీరు
3) 7 – C) వంట సోడా
జతచేసి రాయుము.
జవాబు:
1 – C; 2 – A; 3 – B.
74. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అణువులో ఉండే నీటి అణువులు ఎన్ని?
జవాబు:
½
75. ఒక యూనిట్ ఫార్ములా లవణంలో ఉండే నీటి అణువులను ఏమంటారు?
జవాబు:
స్ఫటిక జలం
76. కార్బన్ డయాక్సైడ్
a) అలోహ ఆక్సైడ్ మరియు ఆమ్లం
b) అలోహ ఆక్సైడ్ మరియు క్షారం
c) లోహ ఆక్సైడ్ మరియు ఆమ్లం
d) ఏదీకాదు.
జవాబు:
a) అలోహ ఆక్సైడ్ మరియు ఆమ్లం
77. వ్యక్తి (A) : అన్ని ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి CO2 వాయువునిచ్చును.
వ్యక్తి (B) : కొన్ని క్షారాలు లోహాలతో చర్య జరిపి H2 వాయువునిచ్చును.
ఏ వ్యక్తిది సరియైన ప్రవచనం?
జవాబు:
వ్యక్తి ‘B’.
78. క్రింది వానిలో క్షారం
a) లోహ ఆక్సైడ్
b) లోహ హైడ్రాక్సైడ్
c) పై రెండూ
జవాబు:
c) పై రెండూ
79. NaCl కి H2SO4 కలిపిన విడుదలయ్యే వాయువు ఏది?
జవాబు:
పొడి HCl
80. pH ను ప్రవేశపెట్టిన వారు ఎవరు?
జవాబు:
సోరెన్స న్
81. గృహంలో వినియోగించే వెనిగర్ లో వుండే ఆమ్లం ఏమిటి?
జవాబు:
ఎసిటికామ్లం
82. సున్నపు నీటి గుండా CO2 ను పంపినపుడు ఏర్పడు తెల్లని అవక్షేపం ఏమిటి?
జవాబు:
CaCO3
పట్టికలు
1. pH స్కేలు పట్టిక :
2. పటం pH విలువలను వివిధ రంగులలో చూపు సార్వత్రిక సూచిక :
10th Class Physics 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 1 Mark Bits Questions and Answers
సరియైన సమాధానమును గుర్తించండి.
1. ఒక ద్రావణం ఎర్ర లిట్మసు నీలిరంగులోనికి మార్చింది. దాని pH విలువ
A) 1
B) 4
C) 5
D) 10
జవాబు:
D) 10
2. రవి లోహ హైడ్రోజన్ కార్బొనేట్ కు ఆమ్లాన్ని కలిపినపుడు ఒక వాయువు వెలువడుటను గమనించాడు. ఆ వెలువడిన వాయువు …………
A) O2
B) N2
C) H2
D) CO2
జవాబు:
D) CO2
3. ఒక విద్యార్థి తనకిచ్చిన రంగులేని ద్రావణానికి కొన్ని చుక్కల సార్వత్రిక సూచికను కలిపాడు. ఆ ద్రావణం ఎరుపు రంగును పొందితే ఆ ద్రావణపు స్వభావం.
A) తటస్థ ద్రావణం
B) ఆమ్లం
C) క్షారం
D) ఆమ్లం కాని క్షారం కాని కావచ్చు
జవాబు:
B) ఆమ్లం
4. అజీర్తికి ఎంటాసిడ్ మందును ఉపయోగిస్తాం. ఎందుకంటే
A) ఎక్కువగా ఉత్పన్నమయిన ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది.
B) జీర్ణమైన ఆహారాన్ని తటస్థీకరిస్తుంది.
C) ఆహారాన్ని ఆక్సీకరణం చేస్తుంది.
D) జీర్ణరసాల ఉత్పత్తిలో సహకరిస్తుంది.
జవాబు:
A) ఎక్కువగా ఉత్పన్నమయిన ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది.
5. X అనే పదార్థ ద్రావణానికి ఇథనోయిక్ ఆమ్లాన్ని కలిపినపుడు రంగులేని, వాసనలేని వాయువు Y వెలువడింది. Y వాయువు సున్నపుతేటను పాలవలె మార్చినచో X పదార్థాన్ని గుర్తించండి.
A) NaHCO3
B) NaOH
C) CH3COONa
D) NaCl
జవాబు:
A) NaHCO3
6. క్రింద ఇవ్వబడిన ఒక లోహం ఆమ్లాలతోనూ, క్షారాలతోనూ చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేయును. అయిన ఆ లోహం ………..
A) Na
B) Fe
C) Cu
D) Zn
జవాబు:
D) Zn
7. అసిడిటీతో బాధపడే వ్యక్తికి ఉపశమనానికి ఈ క్రింది వానిలో దేనిని ఇస్తారు?
A) సోడానీరు
B) వంటసోడా
C) వినిగర్
D) నిమ్మకాయరసం
జవాబు:
B) వంటసోడా
8. ఒక కార్బొనేట్ జల ద్రావణం ఈ క్రింద తెలిపిన ఏ ద్రావణంతో చర్య జరిపిన CO2 ను వెలువరించును?
A) Na2CO3
B) CuSO4
C) HCl
D) KMnO4
జవాబు:
C) HCl
9. ‘యాంటాసిడ్’ లను దేనికొరకు ఉపయోగిస్తారు?
A) జీర్ణాశయంలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడం కోసం
B) జీర్ణాశయంలో నీటిని ఉత్పత్తి చేయడం కోసం
C) జీర్ణాశయంలో అధికంగా ఉన్న క్షారాన్ని తటస్థీకరించడం కోసం
D) జీర్ణాశయంలో అధికంగా ఉన్న ఆమ్లాన్ని తటస్థీకరించడం కోసం
జవాబు:
D) జీర్ణాశయంలో అధికంగా ఉన్న ఆమ్లాన్ని తటస్థీకరించడం కోసం
10. ఒక ద్రావణానికి ఫినాఫ్తలీన్ సూచిక కలిపితే ఆ ద్రావణం గులాబీ రంగుకి మారింది. అయిన ఆ ద్రావణం pH విలువ ………
A) 5
B) 6
C) 7
D) 10
జవాబు:
D) 10
11. బేకింగ్ పౌడరు తయారీలో ఉపయోగించే పదార్థం
A) Na2CO3
B) NaHCO3
C) NaOH
D) Nacl
జవాబు:
B) NaHCO3
12. క్రింది వానిలో ఓల్ ఫ్యాక్టరీ సూచిక కానిది …….
A) ఉల్లిపాయ
B) వెనీలా ఎసెన్స్
C) శనగకాయ
D) లవంగ నూనె
జవాబు:
C) శనగకాయ
13. కాపర్ సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్, సోడియం సల్ఫేట్ ద్రావణాలు వరుసగా X, Y, Z అని గుర్తించబడినవి. ప్రతిదానికి కొన్ని అల్యూమినియం ముక్కలు కలిపినట్లయితే ఏఏ ద్రావణాలలో మార్పు కనిపించును?
A) సోడియం క్లోరైడ్
B) బ్లీచింగ్ పౌడర్
C) సోడియం బైకార్బోనేట్
D) ప్లాస్టర్ ఆఫ్ పారిస్
జవాబు:
A) సోడియం క్లోరైడ్
14. 2 మి.లీ. సల్ఫ్యూరిక్ ఆమ్లం, 10 మి.లీ. నీటికి కలిపితే కింది పరిశీలనలో ఏది నిజం?
A) ఒక పారదర్శక ద్రావణం ఏర్పడును.
B) కలిపిన వెంటనే తెల్లని అవక్షేపం ఏర్పడును.
C) రెండు వేర్వేరు పొరలుగా కనిపించును.
D) రంగు, వాసనలేని వాయువు వెలువడును.
జవాబు:
A) ఒక పారదర్శక ద్రావణం ఏర్పడును.
15. క్రింది వానిలో త్రాగు నీటిని శుభ్రపరచడానికి ఉపయోగించునది.
A) ప్లాస్టర్ ఆఫ్ పారిస్
B) వాషింగ్ సోడా
C) వంటసోడా
D) బ్లీచింగ్ పౌడర్
జవాబు:
D) బ్లీచింగ్ పౌడర్
16. అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగించు రసాయనం
A) X మరియు Y
B) Y మరియు Z
C) X మరియు Z
D) X, Y మరియు Z
జవాబు:
C) X మరియు Z
మీకు తెలుసా?
లైకెన్ అనే (Lichen) మొక్క థాలో ఫైటా వర్గానికి చెందినది. దీని నుండి సేకరించిన రంజనమే (dye) లిట్మస్. ‘తటస్థ ద్రావణంలో దీని రంగు ముదురు ఊదా (Purple). హైడ్రాంజియా (Hydrangea), పిటూనియా(Petunia) మరియు జెరేనియం(Geranium) వంటి మొక్కల యొక్క రంగుపూల ఆకర్షక పత్రాలు కూడా సూచికలుగా ఉపయోగపడతాయి.
సజల ఆమ్లాలు, క్షారాలలో H+ అయాన్ల గాఢతలో ఋణఘాతాన్ని తొలగించేందుకు సోరెన్ సెన్ pH విలువలను ప్రవేశపెట్టాడు.
1 మోల్ కంటే తక్కువ H+ అయాన్ల గాఢత గల ద్రావణాలకు ఈ pH స్కేలు పరిమితమవుతుంది.
pH వ్యాప్తి ఎలా చదవాలి?
pH స్కేలు సాధారణంగా 0 నుండి 14 వరకు వ్యాప్తి , చెంది ఉంటుంది. ఈ pH విలువ H+ అయానుల గాఢతను సూచిస్తుంది. ఉదాహరణకు pH విలువ సున్న వద్ద, హైడ్రోనియం అయాన్ గాఢత ఒక మోలార్ ఉంటుంది. నీటిలో చాలా ద్రావణాల H+ అయాన్ల గాఢత 1 M (DH = 0) నుండి 10-14 M (pH = 14) వరకు విస్తరించి ఉంటుంది.
pH స్కేలులో కొన్ని సాధారణ ద్రావణాల స్థానాలు పక్కనున్న పటంలో చూపబడినాయి.
pH మీటర్ :
pH మీటర్ అనునది జల ద్రావణాలలో హైడ్రోజన్ అయాన్ల చర్యాశీలత ఆధారంగా ఆమ్లత్వం లేదా క్షారత్వాన్ని pH రూపంలో తెలియచేయు సాధనం. దీనిని ప్రయోగశాల స్థాయి నుండి పరిశ్రమల స్థాయి వరకు ఉపయోగిస్తున్నారు.
ఉప్పు స్వాతంత్ర్య పోరాటానికి ఒక సంకేతం
మనం తినే ఆహారపదార్థాలకు రుచిని కలిగించే పదార్థంగా సామాన్య ఉప్పు మీకు పరిచయం. కానీ ఇది స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రజలను ప్రేరేపించడంలో ఒక గొప్ప పాత్రను పోషించింది. ఆ సామాన్య ఉప్పుపై బ్రిటిష్ ప్రభుత్వం విధించిన పన్ను ధనికులు, పేదవారు అనే భేదం లేకుండా అందరినీ ఏకం చేసి స్వాతంత్ర్య పోరాటానికి కార్యోన్ముఖులను చేసింది.
మహాత్మాగాంధీ నిర్వహించిన “దండి సత్యాగ్రహ కవాతు” గురించి వినే ఉంటారు. ఇది ఉప్పు సత్యాగ్రహంగా పిలవబడుతూ స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది.