These AP 10th Class Physics Important Questions and Answers 1st Lesson ఉష్ణం will help students prepare well for the exams.
AP Board 10th Class Physical Science 1st Lesson Important Questions and Answers ఉష్ణం
10th Class Physics 1st Lesson ఉష్ణం 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
ఆర్ధత అనగానేమి?
జవాబు:
గాలిలోని నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ధత అంటాం.
ప్రశ్న 2.
ద్రవీభవన గుప్తోష్ణం అనగానేమి?
జవాబు:
స్థిర ఉష్ణోగ్రత వద్ద 1గ్రాం. ఘన పదార్థం పూర్తిగా ద్రవంగా మారడానికి కావలసిన ఉష్టాన్ని ‘ద్రవీభవన గుప్తోష్ణం” అంటారు.
- m ద్రవ్యరాశి గల ఘన పదార్థం ద్రవంగా మారడానికి ‘Q’ కెలోరీల ఉష్ణం అవసరం అనుకుందాం. 1 గ్రాం ద్రవ్యరాశి గల ఘన పదార్థం ద్రవంగా మారడానికి కావలసిన ఉష్ణం \(\frac{Q}{M}\) అవుతుంది.
- ద్రవీభవన గుప్తోష్ణం L = \(\frac{Q}{M}\)
- మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ 80 కెలోరీలు / గ్రాం.
ప్రశ్న 3.
రమ మంచినీరు త్రాగుతుంటే నీరు ఒలికి (చింది) కిందపడింది. కొంతసేపటి తరువాత అక్కడ నీరు కనిపించలేదు. నీరు ఏమైంది?
జవాబు:
ఈ సందర్భంలో నీరు కనిపించకుండా పోవుటకు గల కారణము బాష్పీభవన ప్రక్రియే. బాష్పీభవనం అనునది ఉపరితలానికి చెందిన దృగ్విషయం. ఉపరితల వైశాల్యం పెరిగిన, బాష్పీభవన రేటు కూడా పెరుగును.
ప్రశ్న 4.
బాష్పీభవనం (ఇగురుట) అనేది శీతలీకరణ ప్రక్రియ అని తెలిపేందుకు ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
- మన అరచేతిలో పోసుకున్న స్పిరిట్ లేదా పెట్రోల్ వంటి పదార్థాలు ఆవిరి అయినప్పుడు మన అరచేయి చల్లగా అనిపిస్తుంది.
- మన శరీరానికి చెమట పట్టినప్పుడు శరీరానికి గాలితగిలి చెమట ఆవిరి అవుతున్నప్పుడు మన శరీరం చల్లగా అవుతుంది.
- ఎండాకాలం స్నానాలగదిలో స్నానం చేసి బయటకు రాగానే మన శరీరంపై నీరు ఆవిరిగా మారుతుంటే మన శరీరం చల్లబడినట్లు అనిపిస్తుంది.
ప్రశ్న 5.
రెండు వస్తువులు ఉష్ట్రీయ స్పర్శలో ఉన్నప్పుడు ఇంకే విధమైన ఉష్ణనష్టం జరగనంత వరకు
వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణం = చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణం
పై వాక్యం ఒక సూత్రాన్ని సూచిస్తోంది. ఆ సూత్రం పేరు వ్రాయండి.
జవాబు:
మిశ్రమాల పద్ధతి సూత్రం.
ప్రశ్న 6.
పరమశూన్య ఉష్ణోగ్రత అనగానేమి?
జవాబు:
0 K (కెల్విన్) గానీ, – 273°C ఉష్ణోగ్రతను పరమశూన్య ఉష్ణోగ్రత అంటారు.
ప్రశ్న 7.
మానవుని శరీర ఉష్ణోగ్రతను వివిధ ప్రమాణాలలో తెల్పండి.
జవాబు:
మానవుని శరీర ఉష్ణోగ్రత ఫారెన్ హీట్ లో – 98.4°F, సెంటీగ్రేడ్ లో – 37°C, కెల్విన్‌మానంలో 310 K
ప్రశ్న 8.
క్రింది పట్టికను గమనించండి.
పదార్థం | విశిష్టోష్ణం (Cal/g-C° లలో) |
సీసం | 0.031 |
ఇతడి | 0.092 |
ఇనుము | 0.115 |
అల్యూమినియం | 0.21 |
కిరోసిన్ | 0.5 |
నీరు | 1 |
పై పదార్థాలను సమాన ద్రవ్యరాశిగా తీసుకొని, సమాన పరిమాణంలో ఉష్ణం అందిస్తున్నారనుకుందాం. పై పదార్థాలలో దేని ఉష్ణోగ్రత త్వరగా పెరుగుతుంది? దేని ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరుగుతుంది? ఎందుకు?
జవాబు:
- సమాన ద్రవ్యరాశిగా తీసుకొని, సమాన పరిమాణంలో ఉష్ణం అందిస్తున్నా ఉష్ణోగ్రతలో మార్పు అనేది పదార్థ విశిష్టోష్ణంపై ఆధారపడును.
- తక్కువ విశిష్టోష్ణం గల పదార్థాలలో ఉష్ణోగ్రత మార్పు ఎక్కువగా ఉంటుంది. కనుకనే అవి త్వరగా వేడెక్కి, త్వరగా చల్లబడును.
పై పట్టిక నుండి సీసం ఉష్ణోగ్రత త్వరగా పెరుగును, నీటి ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరుగును.
ప్రశ్న 9.
27°C గది ఉష్ణోగ్రతను కెల్విన్లో తెల్పుము.
జవాబు:
కెల్విన్ మానం = 273 + °C = 273 + 27 = 300 K
ప్రశ్న 11.
318K ను సెంటీగ్రేడ్ లోకి మార్చుము.
జవాబు:
సెంటీగ్రేడ్ మానం = కెల్విన్ మానం – 273 = 318 – 273 = 45°C
ప్రశ్న 12.
పదార్థ స్థితులను ప్రభావితం చేసే భౌతిక రాశులేవి?
జవాబు:
పదార్థ స్థితులను ప్రభావితం చేసే భౌతిక రాశులు రెండు. అవి :
- ఉష్ణోగ్రత
- పీడనం
ప్రశ్న 13.
వేడినీటి కంటే, నీటి ఆవిరి వలన ఎక్కువ గాయాలగును. ఎందువల్ల?
జవాబు:
వేడి నీటికి ఉష్ణోగ్రత గరిష్ఠంగా 100°C ఉండును. వేడినీరు శరీరంపై పడితే గాయాలగును. కానీ నీటి ఆవిరి బాష్పీభవన గుప్తోష్ణం విలువ 540 Cal/gram. అనగా నీటిఆవిరి శరీరాన్ని తాకి సాంద్రీకరణం చెందినపుడు 540 కేలరీల ఉష్ణశక్తిని విడుదల చేయును. ఈ అధికమైన ఉష్ణశక్తి వలన మనకు తీవ్రమైన గాయాలగును. కాబట్టి వేడినీటి కంటే నీటి ఆవిరి తగలటం ఎక్కువ ప్రమాదకరం.
ప్రశ్న 14.
ఉష్ట్రీయ స్పర్శలోనున్న A, B అనే రెండు వ్యవస్థలు విడివిడిగా C అనే వ్యవస్థతో ఉష్ణ సమతాస్థితిలో ఉంటే (A, B లతో ఉయ స్పర్శలో ఉంది) A, B వ్యవస్థలు ఒకదానితోనొకటి ఉష్ణ సమతాస్థితిలో ఉంటాయా?
జవాబు:
- A అనే వ్యవస్థ C అనే వ్యవస్థతో ఉష్ణ సమతాస్థితిలో ఉంటే, ఆ రెండు వ్యవస్థలు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉంటాయని మనకు తెలుసు.
- అదే విధంగా B, C లు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉంటాయి.
- కనుక A, B లు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉంటాయి మరియు A, B లు ఒకదానికొకటి ఉష్ణ సమతాస్థితిలో ఉంటాయి.
ప్రశ్న 15.
వస్తువుల మధ్య ఉష్ణశక్తి ఎందుకు బదిలీ అవుతుంది?
జవాబు:
రెండు వస్తువులను ఒకదానితోనొకటి తాకుతూ ఉంచినపుడు ఆ రెండు ‘వస్తువుల ఉష్ణోగ్రతలలోని తేడా వల్ల ఉష్ణశక్తి అధిక ఉష్ణోగ్రత ఉన్న వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత ఉన్న వస్తువుకు బదిలీ అవుతుంది.
ప్రశ్న 16.
అంతర్గత శక్తి అనగానేమి?
జవాబు:
ఒక వ్యవస్థలోని కణాలు వేరు వేరుగా శక్తులను కలిగి ఉంటాయి. అవి రేఖీయ గతిశక్తి, భ్రమణ గతిశక్తి, కంపన శక్తి, మరియు అణువుల మధ్య స్థితిశక్తి. వీటన్నింటి మొత్తాన్ని వ్యవస్థ అంతర్గత శక్తి అంటారు.
ప్రశ్న 17.
ఏకాంక ద్రవ్యరాశి గల పదార్ధ ఉష్ణోగ్రతను 1°C పెంచడానికి ఎంత ఉష్ణశక్తి కావాలి?
జవాబు:
ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను 1°C పెంచడానికి, ఆ పదార్థ విశిష్టోష్ణానికి సమానమైన ఉష్ణశక్తి కావాలి. అనగా 1 cal/g°C.
1 cal/g°C = 1 k cal/ kg – K = 4.2 x 103 J/kg- K
ప్రశ్న 18.
ఫ్యాను క్రింద తెరచి ఉంచిన పెట్రిడి లోని స్పిరిట్, మూత ఉంచిన పెట్రీడి లోని స్పిరిట్ కన్నా త్వరగా ఆవిరైపోవడానికి కారణమేమి?
జవాబు:
తెరచి ఉంచిన పాత్రలోని ద్రవానికి గాలి వీస్తే, ద్రవం నుండి బయటికి వెళ్ళి తిరిగి ద్రవంలోకి వచ్చి చేరే అణువుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఎందుకంటే, గాలి వీయడం వల్ల ద్రవం నుండి బయటకు వెళ్ళిన అణువులు ద్రవం పరిధిని దాటి దూరంగా నెట్టివేయబడతాయి. దానివల్ల బాష్పీభవన రేటు పెరుగుతుంది. కనుక, మూత ఉంచిన పెట్రిడిలోని స్పిరిట్ కంటే ఫ్యాన్ గాలికి ఉంచిన పెట్రెడిష్ లోని స్పిరిట్ త్వరగా బాష్పీభవనం చెందుతుంది.
ప్రశ్న 19.
ఏదైనా పని చేస్తున్నపుడు మనకు చెమట ఎందుకు పడుతుంది?
జవాబు:
మనం పని చేసేటప్పుడు మన శక్తిని ఖర్చు చేస్తాం. మన శరీరం నుండి శక్తి ఉష్ణరూపంలో విడుదలవుతుంది. తద్వారా చర్మం ఉష్ణోగ్రత పెరుగుతుంది. అప్పుడు స్వేదగ్రంథులలోని నీరు బాష్పీభవనం చెందడం ప్రారంభిస్తుంది. అందువల్ల శరీరం చల్లబడుతుంది.
ప్రశ్న 20.
నీటికి నిరంతరాయంగా ఉష్ణాన్ని అందిస్తూ ఉంటే నీటి ఉష్ణోగ్రత నిరంతరాయంగా పెరుగుతూ ఉంటుందా?
జవాబు:
నీటికి నిరంతరాయంగా ఉష్ణాన్ని అందిస్తూ ఉంటే, నీటి ఉష్ణోగ్రత 100°C ని చేరేవరకు, నీటి ఉష్ణోగ్రత నిరంతరంగా పెరుగుతుంది. ఆ తర్వాత నీటి ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉండదు. 100°C వద్ద ఇంకా ఉష్ణాన్ని అందిస్తున్నా, ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉండదు.
ప్రశ్న 21.
మూత కలిగిన ఒక చిన్న గాజుసీసాను తీసుకోండి. సీసాలో ఎటువంటి గాలి బుడగలు లేకుండా పూర్తిగా నీటితో నింపండి. సీసాలోని నీరు బయటకుపోయే అవకాశం లేకుండా గట్టిగా మూతను బిగించండి. ఈ సీసాను ఫ్రిజ్ లో కొన్ని గంటలు ఉంచి తర్వాత బయటకు తీసిచూస్తే, సీసాకు పగుళ్ళు ఏర్పడుటను గమనిస్తాము. ఎందుకు?
జవాబు:
సీసాలో పోసిన నీటి ఘనపరిమాణం, సీసా ఘనపరిమాణానికి సమానం. కాని నీరు ఘనీభవించినపుడు వ్యాకోచిస్తుంది. అనగా నీటి ఘనపరిమాణం పెరిగింది. అందువల్ల సీసా పగులుతుంది.
ప్రశ్న 22.
థర్మామీటర్ ను వేడినీటిలో ఉంచినపుడు దానిలోని పాదరస మట్టం పెరుగుటను, చల్లని నీటిలో ఉంచినపుడు పాదరస మట్టం ఎత్తు పడిపోవుటను గమనిస్తాము. ఎందుకు?
జవాబు:
- రెండు వస్తువులు ఉద్ధీయ స్పర్శలోనున్నపుడు, ఉష్ణం ఒక పదార్థం నుండి మరొక పదార్థానికి, ఉష్ణ సమతాస్థితిని పొందునంత వరకు ప్రసరిస్తుంది.
- థర్మామీటరును వేడినీటిలో ఉంచినపుడు ఉష్ణం వేడినీటి వస్తువు నుండి చల్లని వస్తువు (థర్మామీటరులోని పాదరసం)కు ప్రసరించింది. అందువల్ల పాదరస మట్టం పెరుగుతుంది.
- థర్మామీటరను చల్లని నీటిలో ఉంచినపుడు, ఉష్ణం వేడి వస్తువు (పాదరసం) నుండి చల్లని నీటిలోకి ప్రసరిస్తుంది. అందువల్ల పాదరస మట్టం పడిపోతుంది.
ప్రశ్న 23.
ఉష్ణోగ్రతకు, కణాల గతిజశక్తికి గల సంబంధం ఏమిటి?
జవాబు:
- అణువుల / కణాల సరాసరి గతిజశక్తి చల్లని వస్తువులో కంటే వేడి వస్తువులో ఎక్కువగా ఉంటుంది.
- ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత దానిలోని అణువుల సరాసరి గతిజశక్తిని సూచిస్తుందని చెప్పవచ్చు.
- ఒక వస్తువులోని అణువుల సరాసరి గతిజశక్తి దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది.
K.E(సరాసరి) ∝ T
ప్రశ్న 24.
ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రతలోని పెరుగుదల (తరుగుదల) రేటుకు, విశిష్టోష్ణానికి ఏమైనా సంబంధం ఉన్నదా?
జవాబు:
- ఉష్ణోగ్రతలోని పెరుగుదల (తరుగుదల) పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది. అనగా ఒక పదార్థ విశిష్టోష్ణం ఆ పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది.
- ఒకే పరిమాణంలో ఉష్ణాన్ని అందించినప్పటికి, పదార్థ విశిష్టోష్ణం విలువ ఎక్కువగా ఉంటే, దాని ఉష్ణోగ్రతలోని పెరుగుదల (తరుగుదల) రేటు తక్కువగా ఉంటుంది.
- ఒక పదార్థం దాని ఉష్ణోగ్రత మార్పుకు ఎంత మేర విముఖత చూపుతుందనే భావాన్ని విశిష్టోష్ణం తెలియజేస్తుంది.
ప్రశ్న 25.
గాలిలో నీటి ఆవిరి ఎక్కడి నుండి వస్తుంది?
జవాబు:
కాలువలు, చెరువులు, నదులు, సముద్రాలు మొదలైన వాటి ఉపరితలాల నుండి నీరు బాష్పీభవనం చెందడం ద్వారా, తడి బట్టలు ఆరవేసినపుడు, చెమట మొదలగు ప్రక్రియల ద్వారా గాలిలో నీటి ఆవిరి చేరుతుంది.
ప్రశ్న 26.
20 కి.గ్రా. నీటి యొక్క ఉష్ణోగ్రతను 25°C నుండి 75°C కు పెంచడానికి ఎంత ఉష్ణశక్తి కావాలి?
జవాబు:
m = 20 కి.గ్రా. = 20,000 గ్రా.
t1 = 25°C
t2 = 75°C
S = 1 cal/gm°C.
Q = mS∆T
= 20000 × 1 × (75 – 25)
= 20000 × 1 × 50
= 1000000 కెలోరీలు
= 10³ కిలో కెలోరీలు
ప్రశ్న 27.
20°C వద్దనున్న 200 మి.లీ. నీటిని త్రాగినపుడు మన శరీరం నుండి నీరు గ్రహించు ఉష్ణశక్తి ఎంత? (మానవ శరీర ఉష్ణోగ్రత 37°C).
జవాబు:
m = 200 మి.లీ.
t1 = 20°C
t2 = 37°C
S = 1 cal/gm°C
Q = mS∆T
= 200 × 1 × (37-20)
= 200 × 1 × 17
= 3400 కెలోరీలు.
ప్రశ్న 28.
మిశ్రమాల పద్ధతి యొక్క సూత్రం వ్రాయుము.
జవాబు:
మిశ్రమాల పద్ధతి సూత్రం :
వివిధ ఉష్ణోగ్రతల వద్దనున్న రెండు లేదా అంతకన్నా ఎక్కువ వస్తువులను ఉద్దీయ స్పర్శలో ఉంచితే ఉష్ణ సమతాస్థితి సాధించే వరకు వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణానికి సమానం.
వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం = చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణం.
ప్రశ్న 29.
రెండు వస్తువులు ఉష్ణ సమతాస్థితిని సాధించాయని ఎలా చెప్పగలవు?
జవాబు:
రెండు వస్తువులు ఒకదానికొకటి ఉష్ణస్పర్శలో ఉంచినపుడు, వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణశక్తి బదిలీ అవుతుంది. ఆ రెండు వస్తువులు ఒకే వెచ్చదనం స్థాయి’ పొందే వరకు ఈ ఉష్ణశక్తి బదిలీ కొనసాగుతుంది. అప్పుడు, ఆ రెండు వస్తువులు ఉష్ణ సమతాస్థితిని పొందాయని చెప్పవచ్చు.
ప్రశ్న 30.
ఉష్ణం అనగానేమి?
జవాబు:
అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపాన్ని ఉష్ణం అంటారు.
ప్రశ్న 32.
‘కెలోరి’ అనగానేమి?
జవాబు:
ఉష్ణానికి CGS ప్రమాణం కెలోరి. ఒక గ్రాము నీటి ఉష్ణోగ్రతను 1°C పెంచడానికి అవసరమైన ఉష్ణాన్ని కెలోరి అంటారు.
ప్రశ్న 33.
విశిష్టోష్ణమును నిర్వచించి, దాని CGS మరియు SI ప్రమాణాలు తెలుపుము.
జవాబు:
ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ పెంచడానికి కావలసిన ఉష్ణరాశిని ఆ పదార్థ విశిష్టోష్ణం అంటారు.
CGS ప్రమాణాలు : Cal/g°C
SI ప్రమాణాలు : J/kg-K
ప్రశ్న 34.
ద్రవం యొక్క బాష్పీభవన రేటు ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది?
జవాబు:
ద్రవం యొక్క బాష్పీభవన రేటు
1) ఆ ద్రవ ఉపరితల వైశాల్యం
2) ఉష్ణోగ్రత మరియు
3) వాని పరిసరాలలో అంతకుముందే చేరియున్న ద్రవ బాష్పం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రశ్న 35.
సాంద్రీకరణము అనగానేమి?
జవాబు:
వాయువు ద్రవంగా స్థితి మార్పు చెందడమే సాంద్రీకరణం.
ప్రశ్న 36.
శీతాకాలపు ఉదయం వేళల్లో పూలపై, గడ్డిపై లేదా కిటికీ అద్దాలపై నీటి బిందువులు ఎలా ఏర్పడతాయి.?
జవాబు:
శీతాకాలంలో రాత్రివేళ వాతావరణ ఉష్ణోగ్రత బాగా తగ్గుతుంది. అందువల్ల కిటికీ అద్దాలు, పూలు, గడ్డి మొదలైనవి మరీ చల్లగా అవుతాయి. వాటి చుట్టూ ఉన్న గాలిలో నీటి ఆవిరి సంతృప్త స్థితిలో ఉన్నపుడు, అది సాంద్రీకరణం చెందడం ప్రారంభిస్తుంది. ఇలా వివిధ ఉపరితలాలపై సాంద్రీకరణం చెందిన నీటి బిందువులను తుషారం అంటారు.
ప్రశ్న 37.
గాలిలో పొగమంచు ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
శీతాకాలంలో రాత్రివేళ ఉష్ణోగ్రత బాగా తగ్గితే, ఆ ప్రాంతంలోని వాతావరణం అధిక మొత్తంలో నీటి ఆవిరిని కలిగి ఉంటుంది. ఆవిరిలో ఉన్న నీటి అణువులు గాలిలోని ధూళి కణాలపై సాంద్రీకరణం చెంది చిన్న చిన్న నీటి బిందువులుగా ఏర్పడతాయి. ఈ నీటి బిందువులు గాలిలో తేలియాడుతూ, పలుచని మేఘం వలె / పొగ వలె మనకు దూరంలోనున్న వస్తువులను కనబడనీయకుండా చేస్తాయి. దీనినే పొగమంచు అంటారు.
ప్రశ్న 38.
మరుగుట, మరియు మరుగు స్థానం అనగానేమి?
జవాబు:
ఏదేని పీడనం, స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలోని పదార్థం వాయుస్థితిలోకి మారడాన్ని మరుగుట అంటాం. ఆ ఉష్ణోగ్రతను ఆ ద్రవం యొక్క మరుగు స్థానం అంటాం.
ప్రశ్న 39.
బాష్పీభవన గుప్తోష్ణం అనగానేమి?
జవాబు:
బాష్పీభవన గుప్తోష్ణం : నీరు ద్రవ స్థితి నుండి వాయుస్థితికి మారడానికి వినియోగింపబడే ఉష్ణాన్ని “బాష్పీభవన గుప్తోష్ణం” అంటారు.
- బాష్పీభవన గుప్తోషాన్ని ‘L’ తో సూచిస్తారు.
- L = \(\frac{Q}{M}\)
- నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ 540 కెలోరీలు / గ్రాం.
ప్రశ్న 40.
ద్రవీభవనం అనగానేమి?
జవాబు:
స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థం ద్రవస్థితిలోకి మారే ప్రక్రియను ద్రవీభవనం అంటాం.
ప్రశ్న 41.
ద్రవీభవన గుప్తోష్ణం అనగానేమి?
జవాబు:
స్థిర ఉష్ణోగ్రత వద్ద 1 గ్రా. ఘన పదార్థం పూర్తిగా ద్రవంగా మారడానికి కావలసిన ఉష్ణాన్ని ద్రవీభవన గుప్తోష్ణం అంటారు. L = Q/M
ప్రశ్న 42.
ఘనీభవనం అనగానేమి?
జవాబు:
ద్రవ స్థితిలో ఉన్న ఒక పదార్థం కొంత శక్తిని కోల్పోవడం ద్వారా ఘన స్థితిలోకి మారే ప్రక్రియను ఘనీభవనం అంటాం.
ప్రశ్న 43.
ఎత్తైన పర్వత ప్రాంతాలతో, మైదాన ప్రాంతాలతో పోల్చినపుడు ఆహార పదార్థాలను ఉడికించడం కష్టం అంటారు. దీనికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
భూ ఉపరితలం నుండి పైకి పోవు కొలది వాతావరణ పీడనం తగ్గుతుంది. కనుక తక్కువ ఉష్ణోగ్రత విలువకే నీరు మరుగును. కానీ ఆహార పదార్థాలు అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడుకుతాయి. కనుక ఎత్తుకు పోవుకొలది ఆహారపదార్థాలు ఉడికే ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్దనే నీరు మరుగును కానీ పదార్థాలు ఉడకవు.
ప్రశ్న 44.
4 కేజీల నీరు, 100 °C వద్ద ఉందనుకొనుము. 4 కేజీల నీరు పూర్తిగా బాష్పంగా మారుటకు కావలసిన ఉష్ణశక్తి విలువ ఎంత?
జవాబు:
నీరు ద్రవ్యరాశి = m = 4 కి. = 4 × 10³ గ్రా||
నీటి బాష్పీభవన గుప్తోష్ణం = L = 540 కాలరీలు
కావలసిన ఉష్ణశక్తి = Q = mL = 4 × 10³ × 540 = 216 × 104 = 2.16 × 106 కాలరీలు
ప్రశ్న 45.
కుండలో నీరు చల్లగా ఉండుటకు గల కారణమేమిటి?
జవాబు:
- మట్టితో చేసిన కుండకు అనేక సూక్ష్మరంధ్రాలుంటాయి.
- కుండలో నీరు పోసినపుడు, ఈ సూక్ష్మరంధ్రాల ద్వారా నీరు ఉపరితలంపై చెమ్మగా చేరుతుంది.
- ఉపరితలంపై గల నీరు లోపలి ఉష్ణాన్ని గ్రహించి బాష్పీభవనం చెందును.
- ఈ విధంగా కుండ లోపలి నీరు ఉష్ణం కోల్పోవుట వలన చల్లగా ఉండును.
ప్రశ్న 46.
పందులు బురదలో దొర్లుతాయి. ఎందుకు?
జవాబు:
పందుల చర్మంపై స్వేద గ్రంథులు ఉండవు. కనుక వాటి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసుకొనుటకు అవి ఎక్కువ భాగము బురదలోనే దొర్లుతుంటాయి.
ప్రశ్న 47.
0°C వద్ద గల 1 గ్రాము మంచును (0 °C వద్ద గల 1 గ్రాము నీరుగా మార్చుటకు అందించవలసిన ఉష్ణరాశి విలువ ఎంత?
జవాబు:
0°C వద్ద గల 1 గ్రాము మంచును 0°C వద్ద ఉన్న 1 గ్రాము నీరుగా మార్చడానికి అందించవలసిన ఉష్ణరాశి 80 కేలరీలు.
ప్రశ్న 48.
0°C వద్ద గల మంచుకు ఎంత ఉష్ణాన్ని అందించినప్పటికీ అది నీరుగా మారేంత వరకు దాని ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు. ఎందువల్ల?
జవాబు:
మనం అందించిన ఉష్ణం దాని స్థితిని మార్చడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉండదు.
ప్రశ్న 49.
ప్రెషర్ కుక్కర్ లో వంట చేయడం తేలిక. ఎందుకు?
జవాబు:
పీడనం పెరిగితే నీటి మరుగు స్థానం పెరుగుతుంది. ప్రెషర్ కుక్కర్ లో నీటి మరుగు స్థానం 120°C వరకు పెరుగుతుంది. కాబట్టి వంట చేయడం తేలిక.
ప్రశ్న 50.
నీటిని శీతలీకరణిగా వాడతారు. ఎందుకు?
జవాబు:
నీరు అత్యధిక విశిష్టోష్ణం కలిగిన ద్రవం కావున అధిక ఉష్టాన్ని గ్రహించి కూడా తొందరగా వేడెక్కదు. కాబట్టి నీటిని శీతలీకరణిగా వాడతారు.
ప్రశ్న 51.
మంచు నీటిపై తేలుతుంది. ఎందుకు?
జవాబు:
మంచు ఘనపరిమాణం నీటికంటే ఎక్కువ. కాబట్టి మంచు సాంద్రత నీటికంటే తక్కువ. కాబట్టి మంచు నీటిపై తేలుతుంది.
ప్రశ్న 52.
చిన్న కప్పు మరియు పెద్ద డిష్ లో ఒకే పరిమాణం గల ద్రవాన్ని ఉంచితే ఏది త్వరగా బాష్పీభవనం చెందుతుంది?
జవాబు:
పెద్ద డిష్ లోని ద్రవం తొందరగా బాష్పీభవనం చెందుతుంది. కారణం ఉపరితల వైశాల్యం పెరిగితే బాష్పీభవన రేటు పెరుగుతుంది.
ప్రశ్న 53.
వేసవి రోజుల్లో కుక్కలు నాలుకను బయటకు చాచి ఉంచడానికి గల కారణాన్ని బాష్పీభవనం భావనతో వివరింపుము.
జవాబు:
కుక్కల శరీరంపై స్వేద రంధ్రాలు ఉండవు. కావున వేసవిలో నాలుక బయటకు చాచుట వలన నాలుకపై నీరు బాష్పీభవనం చెంది తద్వారా శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ విధంగా కుక్కలు శరీరాన్ని చల్లబరుచుకొంటాయి.
10th Class Physics 1st Lesson ఉష్ణం 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
శీతాకాలపు ఉదయం వేళల్లో పూలపై, గడ్డిపై నీటి బిందువులు (తుషారం) ఏర్పడుటకు కారణం ఏమి?
జవాబు:
i) శీతాకాలపు ఉదయం వేళల్లో భూ ఉపరితలం, భూమిపై నున్న గడ్డి, పూలు, ఇతర వస్తువుల ఉష్ణోగ్రత బాగా తగ్గిపోతుంది.
ii) అతి శీతలంగా ఉన్న ఆ గడ్డి, ఇతర వస్తువులకు గాలిలోని నీటి ఆవిరి తగిలినపుడు సాంద్రీకరణం జరిగి గడ్డిపై నీటి బిందువులు (తుషారం) ఏర్పడతాయి.
ప్రశ్న 2.
వివిధ సమయాల్లో రెండు పట్టణాలకు సంబంధించి ఉష్ణోగ్రతలు ఇవ్వబడ్డాయి.
పై పట్టిక ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
A) ఉదయం 6 గంటలకు గల ఉష్ణోగ్రతను పోలిస్తే ఏ పట్టణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది?
B)ఏ సమయంలో రెండు పట్టణాలలోను ఒకే ఉష్ణోగ్రత కలదు?
జవాబు:
A) ‘B’ పట్టణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది.
B) 11 : 30 AM వద్ద రెండు పట్టణాలలో ఒకే ఉష్ణోగ్రత కలదు.
ప్రశ్న 3.
2 కి.గ్రా. ల ద్రవ్యరాశి గల ఇనుముకు 12,000 Cal. ఉష్ణాన్ని అందించారు. ఇనుము యొక్క తొలి ఉష్ణోగ్రత 20°C. దాని విశిష్టోష్ణం 0.1 Cal/g-°C. ఇనుము పొందే తుది ఉష్ణోగ్రత ఎంత?
జవాబు:
ఇనుము ద్రవ్యరాశి (m) = 2 కి.గ్రా. × 1000 గ్రా. = 2000 గ్రా.
అందించబడిన ఉష్ణము = Q = 12,000 కేలరీలు.
తొలి ఉష్ణోగ్రత = θi = 20°C ; తుది ఉష్ణోగ్రత = θf = ?
ఇనుము విశిష్టోష్ణము విలువ (S) = 0.1 కి./గ్రా. °C.
ఉష్ణము = Q = mS∆θ = Q = mS(θf – θi)
∴ తుది ఉష్ణోగ్రత = θf= 60 + 20 = 80°C
ప్రశ్న 4.
మంచు ఖండాల (Iceberg) చుట్టూ అధికంగా పొగమంచు ఉంటుంది. చర్చించండి.
జవాబు:
మంచు ఖండాల యొక్క ఉపరితలాలపై సాంద్రీకరణ చెందిన నీటి బిందువుల యొక్క ఉష్ణోగ్రత విలువ తగ్గిన, ఆ ప్రదేశంలో అధిక మొత్తంలో గల నీటిఆవిరి రూపంలోని నీటి అణువులు చిన్న చిన్న నీటి బిందువులుగా ఏర్పడును. ఇవి గాలిలో తేలియాడుతూ, పలుచని మేఘం లేదా పొగ వలె ఏర్పడతాయి.
ప్రశ్న 5.
A అనే 10 గ్రా. వస్తువుకు 50 కేలరీల ఉష్ణశక్తి అందించబడినది. B అనే 20 గ్రా. వస్తువుకు 80 కేలరీల ఉష్ణశక్తి అందించబడినది. ఈ రెండు వస్తువులను ఉయ స్పర్శలో ఉంచినపుడు ఏ వస్తువు నుండి ఏ వస్తువుకు ఉష్ణ ప్రసారం జరుగును?
జవాబు:
రెండు వస్తువులను ఉద్ధీయ స్పర్శలో ఉంచినపుడు A నుండి ఉష్ణశక్తి Bలోనికి ప్రవేశించును.
ప్రశ్న 6.
తుషారం మరియు పొగమంచు (Dew and Fog) ల మధ్య భేదాలను వ్రాయుము.
జవాబు:
తుషారం (Dew) | పొగమంచు (Fog) |
1. ఉదయం లేదా సాయంత్రం సమయాలలో వివిధ ఉపరితలాలపై (ఆకులు, గడ్డి, మొక్కలు మొ||) సాంద్రీకరణం చెందిన నీటి బిందువులను తుషారం అంటారు. | 1. పొగ వలె గాలిలో తేలియాడే నీటి బిందువులను పొగ మంచు అంటాం. |
2. తుషారం వస్తువులను కనబడనీయకుండా చేయదు. | 2. పొగమంచు మనకు దూరంగా ఉన్న వస్తువులను కనబడనీయకుండా చేస్తుంది. |
3. సాపేక్ష ఆర్థత. ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉన్నపుడు తుషారం ఏర్పడుతుంది. | 3. పరిసరాలలోని సముద్రాలు లేదా పెద్ద నీటి వనరుల ఉష్ణోగ్రత కన్నా భూ ఉష్ణోగ్రత అధికంగా ఉన్నపుడు పొగమంచు ఏర్పడుతుంది. |
ప్రశ్న 7.
లలిత అల్యూమినియం గోళీల యొక్క విశిష్టోష్ణం కనుగొనాలని అనుకొంది. ఈ ప్రయోగం నిర్వహించడానికి ఏ విధమైన పరికరాలు లేదా సామగ్రి అవసరమవుతాయో వివరించండి.
జవాబు:
అవసరమయిన వస్తువులు :
కెలోరీమీటర్, ఉష్ణమాపకం, మిశ్రమాన్ని కలిపే కాడ లేదా స్టర్రర్, నీరు, నీటిఆవిరి గది, చెక్కపెట్టి మరియు అల్యూమినియం గోళీలు.
ప్రశ్న 8.
ఉష్ణోగ్రతలో నిర్ణీత పెరుగుదలకు గాను దిగువ పదార్థాలలో ఏది ఎక్కువ సమయం తీసుకొంటుంది? కారణం తెల్పండి.
జవాబు:
నీరు అధిక సమయం తీసుకొంటుంది. కారణం నీటి విశిష్టోష్ణం అధికం కాబట్టి వేడెక్కడానికి అధిక సమయం తీసుకొంటుంది. చల్లబడడానికి అధిక సమయం తీసుకొంటుంది.
ప్రశ్న 9.
ఫ్రిజ్ నుండి బయటకు తీసిన పుచ్చకాయ ఎక్కువ సమయం పాటు చల్లగా ఉండటంలో విశిష్టోష్ణం పాత్రను వివరింపుము.
జవాబు:
పుచ్చకాయ ఎక్కువ శాతం నీటిని కలిగి ఉండటం మరియు అది అధిక విశిష్టోష్ణం కలిగి ఉండటం వలన ఫ్రిజ్ నుంచి తీసిన పుచ్చకాయ ఎక్కువ సమయం చల్లదనాన్ని నిలుపుకొంటుంది.
ప్రశ్న 10.
తుషారము మరియు పొగమంచు మధ్య భేదాలను తెల్పండి.
జవాబు:
తుషారం :
వివిధ ఉపరితలాలపై సాంద్రీకరణం చెందిన నీటి బిందువులను తుషారం అంటారు. ఇది కాలుష్య రహితం.
పొగమంచు :
వాతావరణంలోని నీటి ఆవిరి గాలిలోని ధూళికణాలపై సాంద్రీకరణం చెంది పొగ వలె గాలిలో తేలియాడే నీటి బిందువులను ఏర్పరుస్తుంది. దీనినే పొగమంచు అంటారు. ఇది కాలుష్యాన్ని కలుగజేస్తుంది. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి ప్రమాదకరం.
ప్రశ్న 11.
30°C ఉష్ణోగ్రత గల 60 గ్రా|| నీటిని, 60 °C ఉష్ణోగ్రత గల 60 గ్రాముల నీటికి కలిపితే మిశ్రమ ఫలిత ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది?
జవాబు:
ప్రశ్న 12.
మీ ఉపాధ్యాయులు తరగతి గదిలో తుషారము మరియు హిమము ఏర్పడుటను ప్రయోగపూర్వకంగా చూపించినారు కదా ! తుషారము మరియు హిమము ఏర్పడుటను నీవు ప్రయోగపూర్వకంగా ఏ విధంగా నిర్వహించెదవు?
జవాబు:
ఫ్రిజ్ లో ఉంచిన నీటి బాటిల్ ను బయటకు తీస్తే బాటిల్ లోపల మంచు ఏర్పడటం గమనించవచ్చు. అది హిమానికి ఉదాహరణ. బాటిల్ బయట నీటిఆవిరి సాంద్రీకరణం చెందడం వలన బిందువులు ఏర్పడుతాయి. అది తుషారానికి ఉదాహరణ.
ప్రశ్న 13.
నీరు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ఆవిరి అవుతుంది? ఉదాహరణతో వివరించండి.
జవాబు:
- వర్షాకాలంలో మనము నేలపై గల గచ్చును తుడిచిన అది కొంతసేపటికి ఆరిపోవును. అనగా నేలపై తడి ఆవిరైపోయినది.
- ఆరుబయట ఆరవేసిన బట్టలు శీతాకాలంలో కూడా ఆరిపోవుటకు కారణము వాటిలోని నీరు ఆవిరైపోవుటయే.
- గాలిలో ఆవిరి రూపంలో నీటి అణువులు ఉంటాయి.
పై దృగ్విషయాలను బట్టి నీరు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ఆవిరి అవుతుంది.
ప్రశ్న 14.
20°C ఉష్ణోగ్రత గల 50 గ్రాముల నీటిని, 40°C ఉష్ణోగ్రత గల 50 గ్రాముల నీటికి కలిపితే మిశ్రమం ఫలిత ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది?
జవాబు:
∴ మిశ్రమం ఫలిత ఉష్ణోగ్రత = 30°C.
ప్రశ్న 15.
కింది వానిని కెల్విన్ మానంలోకి మార్చుము. i) 40°C ii) 27°C iii) – 273°C
జవాబు:
కెల్విన్ మానంలో ఉష్ణోగ్రత = 273 + సెల్సియస్ మానంలో ఉష్ణోగ్రత
- 40°C ను కెల్విన్ మానంలో వ్రాయగా = 273 + 40 = 313K
- 27°C ను కెల్విన్ మానంలో వ్రాయగా = 273 + 27 = 300 K
- – 273°C ను కెల్విన్ మానంలో వ్రాయగా = 273 + (-273) = 0 K
ప్రశ్న 16.
ఒక పదార్థం గ్రహించిన (కోల్పోయిన) ఉష్ణరాశికి సూత్రం వ్రాసి అందులోని పదాలను వ్రాయండి.
జవాబు:
ఉష్ణరాశి Q = m∆T
ఇచ్చట Q = ఉష్ణరాశి, m = పదార్థం ద్రవ్యరాశి
s = పదార్థం విశిష్టోష్ణం , ∆T = ఉష్ణోగ్రతలో మార్పు
10th Class Physics 1st Lesson ఉష్ణం 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
బాష్పీభవన ప్రక్రియను ప్రభావితం చేయు అంశాలను వ్రాసి, ఉదాహరణలతో వివరింపుము.
జవాబు:
బాష్పీభవన ప్రక్రియను ప్రభావితం చేయు అంశాలు :
ఉష్ణోగ్రత, ద్రవ ఉపరితల వైశాల్యం గాలిలో అంతకుముందే చేరి ఉన్న ద్రవబాష్పం (ఆర్థత), గాలి వేగం ప్రభావితం చేయును.
– ఉష్ణోగ్రత పెరిగితే బాష్పీభవన రేటు పెరుగును.
ఉదాహరణ – 1:
- రెండు పెట్రెడిషన్లు తీసుకొని వాటిలో సుమారు ఒకే పరిమాణంలో స్పిరిట్ ను తీసుకొండి.
- ఒక పెట్రెడిషన్ను ఫ్యాన్ గాలి తగిలే విధంగా ఉంచాలి. రెండవ దానిపైన మూత పెట్టి ఉంచాలి.
- కొంత సమయం తరువాత రెండింటిలోని స్పిరిట్ పరిమాణాన్ని పరిశీలించండి.
- ఫ్యాన్ గాలికి ఉంచిన పెట్రెడిష్ లోని స్పిరిట్ ఏమీ లేకపోవడం, మూత పెట్టి ఉంచిన పెట్రెడిష్ లోని స్పిరిట్ అంతే ఉండటం మనం గమనించవచ్చు.
ఉదాహరణ – 2:
- ఒకే పరిమాణం గల వేడి ‘టీ’ని ఒక కప్పులోనూ, ఒక ‘సాసర్’లోనూ తీసుకోండి.
- సుమారు 5 నిమిషాల తర్వాత రెండింటిలోనూ ‘టీ’ పరిమాణాన్ని పరిశీలించండి.
- టీ కప్పులోని టీ కంటే సాసర్ లోని టీ త్వరగా చల్లబడుతుంది.
ఉదాహరణ – 3:
- తడి బట్టలలోని నీరు మామూలు పరిస్థితులలో కన్నా ఫ్యాన్ గాలి క్రింద ఉంచినపుడు త్వరగా బాష్పీభవనం చెందుతుంది.
- తడి బట్టలలోని నీరు ఎక్కువ ఆర్ధత ఉన్న సందర్భంలో కంటే తక్కువ ఆర్ధత గల సందర్భాలో తొందరగా బాష్పీభవనం చెందుతుంది.
ప్రశ్న 2.
పట్టికను పరిశీలించి, దిగువ ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
పదార్థం | విశిష్టోష్ణం cal/g°C. |
సీసం | 0.031 |
అల్యూమినియం | 0.21 |
రాగి | 0.095 |
నీరు | 1.00 |
ఇనుము | 0.115 |
a) విశిష్టోష్ణం యొక్క SI ప్రమాణాలు వ్రాయండి.
b) విశిష్టోష్ణం విలువలు ఆధారంగా ఇచ్చిన పదార్థాలను ఆరోహణ క్రమంలో అమర్చండి.
c) ఒకే పరిమాణం గల ఉష్ణం అందిస్తే వీటిలో ఏది త్వరగా వేడెక్కుతుంది?
d) 1kg ఇనుము ఉష్ణోగ్రతను 10°C పెంచడానికి కావలసిన ఉష్ణం ఎంతో లెక్కించండి.
జవాబు:
a) బౌల్ / కి.గ్రా. కెల్విన్
b) సీసం, రాగి, ఇనుము, అల్యూమినియం, నీరు
c) సీసం
d) Q = ms∆T = 1000 x 0.115 x 10 = 1150 కేలరీలు.
ప్రశ్న 3.
మంచు నీరుగా మారినపుడు ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు కనిపించదని తెలుపుటకు ఒక ప్రయోగాన్ని సూచించండి. 0°C వద్ద ఉన్న 5 గ్రాముల మంచు 0°C వద్ద నీరుగా మారడానికి ఎంత ఉష్ణం అవసరం అవుతుంది? (మంచు ద్రవీభవన గుప్తోష్ణం 80 Callgram).
జవాబు:
1) ఒక బీకరులో కొన్ని మంచుముక్కలు తీసుకొని, థర్మామీటరు సహాయంతో ఉష్ణోగ్రతను కొలవవలెను.
2) బీకరును బర్నర్ పై ఉంచి వేడిచేస్తూ ప్రతి నిమిషం ఉష్ణోగ్రతను నమోదు చేయవలెను.
3) మంచుముక్కలు కరిగేటప్పుడు మనం ఈ క్రింది విషయాలను గమనిస్తాము.
a) ప్రారంభంలో మంచు తక్కువ ఉష్ణోగ్రత 0°C లేదా అంతకంటే తక్కువగా ఉంటుందని గమనిస్తాము.
b) 0°C కంటే తక్కువగా ఉంటే 0°C ను చేరే వరకు ఉష్ణోగ్రత నిరంతరము పెరుగుతుంది.
c) మంచు కరగడం ప్రారంభం అవగానే ఎంత ఉష్ణాన్ని అందిస్తున్నా ఉష్ణోగ్రతలో మార్పు లేకపోవడం గమనిస్తాము.
4) ఈ విధముగా జరగడానికి గల కారణము :
a) మంచుముక్కలకు మనం అందించిన ఉష్ణం మంచు అణువుల అంతర్గత శక్తిని పెంచుతుంది.
b) ఇలా పెరిగిన అంతర్గత శక్తి మంచులోని అణువుల (H2O) మధ్య గల బంధాలను బలహీనపరచి, తెంచుతుంది.
c) అందువల్ల మంచు (ఘన స్థితి), నీరు (ద్రవస్థితి) గా మారుతుంది.
d) ఈ ప్రక్రియ స్థిర ఉష్ణోగ్రత (0°C లేదా 273K) వద్ద జరుగుతుంది. ఈ ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం (melting point) అంటాం.
5) ద్రవీభవన స్థానం :
స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉన్న పదార్థం ద్రవస్థితిలోకి మారే ప్రక్రియనే ద్రవీభవనం అంటారు.
6) ద్రవీభవనం చెందేటప్పుడు ఉష్ణోగ్రత మారదు.
7) ఎందుకనగా, మంచుకు అందించబడిన ఉష్ణం పూర్తిగా నీటి అణువుల మధ్య గల బంధాలను తెంచడానికే వినియోగపడుతుంది.
మంచు ద్రవ్యరాశి = m = 5 గ్రాముల
మంచు ద్రవీభవన గుప్తోష్ణం = Lf = 80 కెలోరి/గ్రాము
అవసరమైన ఉష్ణము = Q = mLf = 5 × 80 = 400 కెలోరి / గ్రాము
ప్రశ్న 4.
ద్రవీభవన ప్రక్రియ (process of melting) మరియు ద్రవీభవన గుప్తోష్ణాలను (latent heat of fusion) వివరించండి.
జవాబు:
ద్రవీభవన ప్రక్రియను పరిశీలించడానికి వేడిచేసినప్పుడు ద్రవంగా మారే మంచు, మైనం వంటి ఏదైనా ఒక పదార్థాన్ని ఎంచుకోవాలి.
- ఎంచుకున్న పదార్థాన్ని బీకరులో తీసుకుని థర్మామీటరు సహాయంతో దాని ఉష్ణోగ్రతను కొలవాలి.
- ఆ బీకరును బర్నర్ లేదా స్టవ్ పై వేడిచేస్తూ ప్రతి నిమిషానికి ఉష్ణోగ్రతలో మార్పును పరిశీలించాలి.
- పదార్థాన్ని వేడి చేస్తున్నప్పుడు కొంత సమయం వరకూ పదార్థ ఉష్ణోగ్రత పెరుగుతుంది. తదుపరి ఒకానొక ఉష్ణోగ్రత వద్ద పదార్థం ద్రవ రూపంలోకి మారడం ప్రారంభమైనప్పుడు ఉష్ణాన్ని అందిస్తూ ఉన్నప్పటికీ ఉష్ణోగ్రతలో, మార్పు ఉండదు. మనం అందించే ఉష్ణం పదార్థం స్థితి మారడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. పదార్థం పూర్తిగా ద్రవస్థితిలోకి మారిన తర్వాత థర్మామీటరులో ఉష్ణోగ్రత పెరుగుదలను గమనించవచ్చు.
- ఈ విధంగా స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘన స్థితిలో ఉన్న పదార్థం ద్రవ స్థితిలోకి మారే ప్రక్రియను ద్రవీభవనం అంటాం.
- ఈ విధంగా ఒక గ్రాము పదార్థాన్ని ఘన స్థితి నుండి పూర్తిగా ద్రవంగా మార్చడానికి కావలసిన ఉష్ణాన్ని ఆ పదార్థం యొక్క ద్రవీభవన గుప్తోష్ణం అంటారు.
ప్రశ్న 5.
‘వివిధ పదార్థాల విశిష్టోష్ణం విలువలు వేరువేరుగా ఉంటాయి’. దీనికి కారణాలు వివరించండి.
జవాబు:
- పదార్థానికి / వ్యవస్థకు ఉష్ణశక్తిని అందించినప్పుడు అది అందులోని కణాల రేఖీయ గతి శక్తి, కంపన శక్తి, భ్రమణ శక్తి మరియు అణువుల మధ్య స్థితి శక్తి వంటి వివిధ రూపాలలోకి వితరణ చెందుతుంది.
- ఉష్ణశక్తిని పంచుకునే విధానం పదార్థాన్ని బట్టి మారుతుంది.
- పదార్థానికి ఇచ్చిన ఉష్ణశక్తిలో ఎక్కువ భాగం దాని అణువుల రేఖీయ గతిజ శక్తిని పెంచడానికి ఉపయోగించబడితే ఆ వస్తువులో ఉష్ణోగ్రత పెరుగుదల ఎక్కువగా ఉంటుంది.
- వివిధ పదార్థాలు తమకు అందిన ఉష్ణాన్ని రేఖీయ గతి శక్తి పెంపుదలకు వినియోగించుకొనే విధానంలో మార్పు ఉండడం వలన వాటి విశిష్టోష్ణాలు వేరు వేరుగా ఉంటాయి.
ప్రశ్న 6.
మంచు నీటి ఆవిరిగా మారేవరకు వేడిచేసిన ప్రక్రియలో వివిధ ఉష్ణోగ్రత విలువలు లో చూపబడ్డాయి. గ్రాఫ్ ను పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (ఈ గ్రాఫ్ పరిమాణాత్మక విలువలనివ్వడం లేదు మరియు ఖచ్చితమైన ‘స్కేలు’కు అనుగుణంగా ఇవ్వబడినది కాదు. ఇది కేవలం గుణాత్మకమైనది.)
a) ఏ ఉష్ణోగ్రత వద్ద మంచు నీరుగా మారుతుంది?
b) \(\overline{\mathrm{DE}}\) ఏమి తెలియజేస్తుంది?
c) ఏ ఏ ఉష్ణోగ్రతల మధ్య నీరు ద్రవరూపంలో ఉంటుంది?
d) గ్రాలోని ఏ భాగం మంచు నీరుగా మారడాన్ని తెలియజేస్తుంది?
జవాబు:
a) 0°C
b) నీరు, నీటి ఆవిరిగా మారుటను (స్థితి మార్పును) తెలియజేయును.
c) 0°C నుండి 100°C వరకు
d) \(\overline{\mathrm{BC}}\)
ప్రశ్న 7.
A) “మిశ్రమాల పద్ధతి” సూత్రంను వ్రాయుము.
B) 50°C ల ఉష్ణోగ్రత గల 60 గ్రాముల నీటిని 70°C ఉష్ణోగ్రత గల 50 గ్రాముల నీటితో కలిపితే మిశ్రమం ఫలిత ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది?
జవాబు:
A) వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం = చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణం
ప్రశ్న 8.
ఒక పాత్రలో 0°C వద్ద నీరు తీసుకున్నారు. దీనిని పటంలో చూపిన విధంగా ఒక పెద్ద గాజుపాత్రతో మూసినారు. దానికి గల వాయురేచకం వాడి లోపల ప్రాంతాన్ని శూన్యంగా మార్చారు.
a) ఏమి జరుగును? వివరించండి.
b) పాత్రలో కొంత నీరు గడ్డ కడుతుంది. గడ్డ కట్టే నీటి పరిమాణం ఎంత?
జవాబు:
a) 0°C వద్ద నీరు ద్రవరూపమును కలిగి ఉండును. అదే విధముగా 0°C వద్ద కూడా మంచు సాధ్యము. కారణమేమనగా శూన్యంలోని గాలి ఉష్ణోగ్రతను పెంచును. ఇక్కడ సాధ్యము కనుక బాష్పీభవనం జరుగును.
b) 0°C వద్ద ‘y’ మి.లీ.ల నీరు తీసుకున్నారనుకొనుము.
‘x’ మి.లీ.ల నీరు బాష్పీభవనం చెందినదనుకొనుము.
బాష్పీభవన గుప్తోష్ణం విలువ = Lఆవిరి = 540 Cal/g.
మంచు బాష్పీభవన గుప్తోష్ణం విలువ = Lమంచు = 80 Cal/g.
కొంత సేపటికి నీరు మంచుగా మారు ప్రక్రియ ఆగిపోయి ఉష్ణసమతాస్థితి ఏర్పడును. కనుక
540 x = (y- x) 80
540 x = 80y – 80 x
540x + 80 x = 80 y
620 x = 80 y ⇒ \(\frac{x}{y}=\frac{80}{620}=\frac{4}{31}=\frac{1}{8}\) (దాదాపు)
∴ దాదాపు \(\frac{1}{8}\) వ భాగం నీరు బాష్పీభవనం చెందును.
(1- \(\frac{1}{8}\))వ భాగపు నీరు ఘనీభవించును అనగా మంచుగా మారును.
ప్రశ్న 9.
Q = ms∆T ల మధ్య సంబంధాన్ని ఉత్పాదించండి.
జవాబు:
1) ఒకే విధమైన ఉష్ణోగ్రత మార్పుకు, ఒక పదార్థం గ్రహించిన ఉష్ణశక్తి (Q), దాని ద్రవ్యరాశికి (m) అనులోమానుపాతంలో ఉంటుంది.
∴ Q ∝ m (∆T స్థిరం ) —– (1)
2) ఒక బేకరులో 1 లీటరు నీటిని తీసుకొని ఏకరీతి మంటపై వేడి చేయండి. ప్రతి 2 నిమిషాలకు ఉష్ణోగ్రతలోని మార్పు (∆T) ను గుర్తించండి.
3) ఉష్ణాన్ని అందించే సమయానికి అనుగుణంగా ఉష్ణోగ్రతలో పెరుగుదల స్థిరంగా ఉంటుంది. దీనిని బట్టి స్థిర ద్రవ్యరాశి గల నీటి ఉష్ణోగ్రతలోని మార్పు, అది గ్రహించిన ఉష్ణానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
∴ Q & ∆T (ద్రవ్యరాశి స్థిరం) ——– (2)
(1), (2) సమీకరణాల నుండి Q ∝ m.∆T
Q = m.s.∆T (∴ s స్థిరాంకం)
ప్రశ్న 10.
విశిష్టోష్ణం యొక్క అనువర్తనాలను తెలుపుము.
జవాబు:
- సూర్యుడు ప్రతిరోజు అధిక పరిమాణంలో శక్తిని విడుదల చేస్తాడు. వాతావరణ ఉష్ణోగ్రతను సాపేక్షంగా, స్థిరంగా ఉంచడానికి భూమిపై ఉన్న నీరు, ప్రత్యేకంగా సముద్రాలు ఈ శక్తిని గ్రహించుకొని పరిసరాల ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి.
- ఫ్రిజ్ నుండి బయటకు తీసి ఉంచిన వివిధ రకాల పండ్లతో పోల్చినపుడు పుచ్చకాయ ఎక్కువ సమయం పాటు చల్లదనాన్ని నిలిపి ఉంచుకుంటుంది. దీనికి కారణం పుచ్చకాయలో అధికంగా నీరు ఉండటం మరియు నీటి విశిష్టోష్ణం విలువ అధికంగా ఉండటం.
- సమోసాను చేతితో తాకినపుడు వేడిగా అనిపించకపోయినా, దానిని తింటే లోపలి పదార్థాలు వేడిగా ఉన్నాయని తెలుస్తుంది. దీనికి కారణం సమోసా లోపల ఉన్న పదార్థాల విశిష్టోష్ణం ఎక్కువ.
- నీటికున్న అధిక విశిష్టోష్ణ విలువ వలన దానిని థర్మల్ విద్యుత్ కేంద్రాలలోను, కార్ల రేడియేటర్లలోను శీతలీకరణిగా వాడుతారు.
- నీటి యొక్క అధిక విశిష్టోష్ణ విలువ వలననే జంతువుల మరియు మొక్కల జీవనం సాధ్యపడుతున్నది.
ప్రశ్న 11.
బాష్పీభవన ప్రక్రియను వివరించుము.
జవాబు:
- డిష్ లో ఉంచిన స్పిరిట్ అణువులు నిరంతరంగా వివిధ దిశలలో, వివిధ వేగాలతో కదులుతూ ఉంటాయి. అందువల్ల అణువులు పరస్పరం అఘాతం చెందుతాయి.
- అభిఘాతం చెందినపుడు ఈ అణువులు ఇతర అణువులకు శక్తిని బదిలీ చేస్తాయి. ద్రవం లోపల ఉన్న అణువులు ఉపరితలం వద్ద ఉండే అణువులతో అఘాతం చెందినపుడు ఉపరితల అణువులు శక్తిని గ్రహించి, ద్రవ ఉపరితలాన్ని వదిలి పైకి వెళతాయి.
- ఇలా ద్రవాన్ని వీడిన అణువులలో కొన్ని గాలి అణువులతో అభిఘాతం చెంది తిరిగి ద్రవంలోకి చేరతాయి.
- ద్రవంలోకి తిరిగి చేరే అణువుల సంఖ్య కన్నా ద్రవాన్ని వీడిపోయే అణువుల సంఖ్య ఎక్కువగా ఉంటే ద్రవంలోని అణువుల సంఖ్య తగ్గుతుంది.
- కనుక ఒక ద్రవానికి గాలి తగిలేలా ఉంచినపుడు, ఆ దద్రం పూర్తిగా ఆవిరైపోయే వరకు ద్రవ ఉపరితలంలోని అణువులు గాలిలోకి చేరుతూనే ఉంటాయి. ఈ ప్రక్రియను “బాష్పీభవనం” అంటారు.
ప్రశ్న 12.
బాష్పీభవనమును నిర్వచించండి. బాష్పీభవనమును ప్రభావితం చేయు అంశాలను తెల్పి, అవి ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెల్పండి.
జవాబు:
బాష్పీభవనం :
ద్రవంలోని అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ఉపరితలాన్ని వీడిపోయే ప్రక్రియను బాష్పీభవనం అంటారు.
బాష్పీభవనం ఆధారపడు అంశాలు :
- ఉష్ణోగ్రత : ఉష్ణోగ్రత పెరిగితే బాష్పీభవన ప్రక్రియ పెరుగుతుంది.
- గాలివేగం : గాలివేగం పెరిగితే బాష్పీభవన ప్రక్రియ పెరుగుతుంది.
- ఉపరితల వైశాల్యం : ఉపరితల వైశాల్యం పెరిగితే బాష్పీభవన ప్రక్రియ పెరుగుతుంది.
- ఆర్ధత : ఆర్థత పెరిగితే బాష్పీభవనం తగ్గుతుంది.
ప్రశ్న 13.
మిశ్రమాల పద్ధతి సూత్రాన్ని ఒక కృత్యం ద్వారా వివరింపుము.
జవాబు:
- m1, m2 ద్రవ్యరాశులు గల రెండు పదార్థాల తొలి ఉష్ణోగ్రతలు వరుసగా T1, T2 (అధిక ఉష్ణోగ్రత T1, అల్ప ఉష్ణోగ్రత T2).
- మిశ్రమ తుది ఉష్ణోగ్రత T.
- మిశ్రమ ఉష్ణోగ్రత వేడి పదార్థం ఉష్ణోగ్రత (T1) కన్నా తక్కువగా, చల్లని పదార్థ ఉష్ణోగ్రత (T2) కన్నా ఎక్కువగా ఉంటుంది.
- కాబట్టి వేడి వస్తువు ఉష్ణాన్ని కోల్పోయింది. చల్లని వస్తువు ఉష్ణాన్ని గ్రహించింది.
- వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణం = చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణం
ప్రశ్న 14.
సమాన పరిమాణం గల వివిధ రకాలైన లోహపు ముక్కలను ఒకే ఉష్ణోగ్రతకు వేడిచేసి వాటి వెంటనే ఒకే పరిమాణంలో నీరు గల బీకర్లలో ముంచి వాటి ఉష్ణోగ్రతలలో తేడాలను గుర్తించండి. మీ పరిశీలనలను రాయండి.
జవాబు:
ఉద్దేశ్యం :
వివిధ లోహాల ఉష్ణోగ్రతలను పరిశీలించుట.
కావలసిన పరికరాలు :
రాగి, ఇనుము, అల్యూమినియం లోహాల ముక్కలు, మూడు బీకర్లు, కొలిమి, 3 థర్మామీటర్లు.
ప్రక్రియ:
- సమాన పరిమాణం గల రాగి, ఇనుము, అల్యూమినియం లోహాల ముక్కలను సేకరించుము.
- ఈ లోహాలను కొలిమిలో 80°C వద్దకు వేడి చేయుము.
- ముందుగా మూడు బీకర్లలో సమాన పరిమాణం గల నీటిని తీసుకొనుము.
- కొలిమి నుండి లోహపు ముక్కలను తీసుకొని వెళ్ళి బీకర్లలో వేయుము.
- బీకర్లలో మూడు వేర్వేరు థర్మామీటర్లను ఉంచుము.
- ఆ థర్మామీటర్ల రీడింగులను 2 నిమిషాల తరువాత సేకరించుము.
- థర్మామీటరు రీడింగులను గమనించగా వాటి విలువలు వేర్వేరుగా ఉండుటను గమనించవచ్చును.
- దీనిని బట్టి ఉష్ణోగ్రత పదార్థ స్వభావంపై ఆధారపడును.
10th Class Physics 1st Lesson ఉష్ణం Important Questions and Answers
ప్రశ్న 1.
ఒక కి.గ్రా ద్రవ్యరాశి గల పదార్థంకు అందించిన ఉష్ణం (H) మరియు పదార్థ ఉష్ణోగ్రత (T) అయిన H,T లకు సంబంధించిన గ్రాఫు ఇవ్వడమైనది. గ్రాఫు నందు ‘O’ అనునది పదార్థపు ఘనస్థానమైన, గ్రాఫు ద్వారా క్రింది ప్రశ్నలకు సమాధానాలిమ్ము.
1. ఘన పదార్థం యొక్క ద్రవీభవన స్థానము ………..
2. పదార్థపు ద్రవీభవన గుప్తోష్ణము విలువ …………….
3. పదార్థపు బాష్పీభవన గుప్తోష్ణము విలువ …………
4. పదార్థపు మరుగు స్థానము విలువ ………….
జవాబు:
1. (H1, T1)
2. (H1, T1) నుండి (H2, T2) అగును.
3. (H3, T3) నుండి (H4, T4) అనునది బాష్పీభవన గుప్తోష్ణము.
4. (H3, T3) పదార్ధపు మరుగు స్థానము.
ప్రశ్న 2.
ఇచ్చిన పటంలో ఉష్ణోగ్రతకు, కాలంకు మధ్యన గల ఒక గ్రాఫు ఇవ్వడమైనది. ఆ గ్రాఫులో A, B మరియు C అను పదార్థాల విశిష్టోష్ణాలు ఇవ్వడమైన, వాటిలో ఏది అధిక విశిష్టోష్ణం కల్గి వుంది?
జవాబు:
1. ఒక పదార్థ ఉష్ణోగ్రత దానిలోని కణాల సరాసరి గతిశక్తికి అనులోమానుపాతంలో వుంటుంది.
2. ‘A’ అను పదార్థపు వాలు ఎక్కువగా గలదు. కనుక దాని విశిష్టోష్ణం ఎక్కువ.
ప్రశ్న 3.
మరిగే స్థానం వద్ద నీటి విశిష్టోష్ణం విలువ ఎంత?
జవాబు:
మరిగే స్థానం వద్ద నీటి విశిష్టోష్ణం విలువ 1.007 K cal / Kg, K లేక 4.194 KJ / Kg.K
ప్రశ్న 4.
100°C వద్ద గల వేడినీటి కన్నా అదే 100°C వద్ద గల నీటి ఆవిరి వలన ఎక్కువ గాయాలగును. ఎందువలన?
జవాబు:
వేడి నీటికి ఉష్ణోగ్రత గరిష్ఠంగా 100°C ఉండును. వేడి నీరు శరీరంపై పడితే గాయాలగును. కానీ నీటి ఆవిరి బాష్పీభవన గుప్తోష్ణం విలువ 540 cal/grams అనగా నీటి ఆవిరి శరీరాన్ని తాకి సాంద్రీకరణం చెందినపుడు 540 కేలరీల ఉష్ణశక్తిని విడుదల చేయును. ఈ అధికమైన ఉష్ణశక్తి వలన మనకు తీవ్ర గాయాలగును. కాబట్టి వేడినీటి కంటే నీటిఆవిరి తగలటం ఎక్కువ ప్రమాదకరము.
ప్రశ్న 5.
A, B మరియు C అను పదార్థాల ఉష్ణోగ్రతలు వరుసగా 20°C, 30°C మరియు 40°C లు. సమాన ద్రవ్యరాశులు గల A మరియు Bల మిశ్రమ ఫలిత ఉష్ణోగ్రత విలువ 26°C. సమాన ద్రవ్యరాశులు గల A మరియు C ల మిశ్రమ ఫలిత ఉష్ణోగ్రత విలువ 33°C. అయిన వాటి విశిష్టోష్ణాల నిష్పత్తిని కనుగొనుము.
జవాబు:
A, B మరియు C పదార్థాల ఉష్ణోగ్రతలు వరుసగా ty, t, మరియు 1, లయిన వాటి విలువలు 20°C, 30°C మరియు 40°C లు అగును.
∴ t1 = 20°; t2 = 30°C మరియు t3 = 40°C
పదార్థాల విశిష్టోష్ణాలు వరుసగా S1, S2 మరియు S3 లనుకొనుము.
Case – I
A మరియు B ల సమాన ద్రవ్యరాశులు గల పదార్థాలను కలుపగా వాటి మిశ్రమ ఉష్ణోగ్రత విలువ 26°C.
∴ m1 = m2 = m, Tఫలిత = 26°C, t1 = 20°C, t2 = 30°C
కెలోరిమితి సూత్రం ప్రకారం :
పదార్థం కోల్పోయిన లేదా గ్రహించిన ఉష్ణరాశి = Q = mis.t
మిశ్రమ పద్ధతి ప్రకారం :
వేడి వస్తువు కోల్పోవు ఉష్ణరాశి = చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణరాశి
Case – II
B మరియు C అను ద్రవ్యరాశి గల పదార్థాలను కలుపగా వాటి మిశ్రమ ఉష్ణోగ్రత విలువ 33°C అగును.
∴ m2 = m3 = m, Tఫలిత = 33°C, t2 = 30°C మరియు t3 = 40°C అగును.
మిశ్రమ పద్ధతి ప్రకారం :
(1) మరియు (2) ల నుండి s1 : s2 : s3 = 2 × 7 : 3 × 7 : 3 × 3
A, B, C ల విశిష్టోష్ణాల నిష్పత్తి = s1 : s2 : s3 = 14 : 21 : 9
ప్రశ్న 6.
నీటిలో నింపిన గాజు సీసాను ఫ్రిజ్ లో కొన్ని గంటలుంచిన తర్వాత బయటకు తీసిచూస్తే, సీసాకు పగుళ్ళు ఏర్పడడం జరుగును. ఎందుకు?
జవాబు:
నీరు ఘనీభవించినప్పుడు వ్యాకోచించును అనగా ఘనపరిమాణం పెరుగును. కనుక ఫ్రిజ్ లో ఉంచిన గాజు సీసాపై పగుళ్ళు ఏర్పడును.
ప్రశ్న 7.
ఒక వస్తువు యొక్క గతిజశక్తి శూన్యమగునా?
జవాబు:
ఒక పదార్థ ఉష్ణోగ్రత దానిలోని కణాల సగటు గతిజశక్తికి అనులోమానుపాతంలో వుండును. కనుక వస్తువు యొక్క గతిజశక్తి ఎన్నటికీ శూన్యము కాదు.
ప్రశ్న 8.
ప్రెజర్ కుక్కర్ లో చేయు వంట, మూతలేని పాత్రలో చేయు వంటకన్నా వేగమెక్కువ. ఎందుకు?
జవాబు:
ప్రెజర్ కుక్కర్ లో నీటి ఆవిరి బంధించబడి ఉండుట వలన మరియు వేడి నీటిఆవిరి గుప్తోష్ణం విలువ 100°C వద్ద 540 cal – grms ఉండుట వలన పదార్థాలపై 540 కేలరీల ఉష్ణశక్తిని విడుదల చేయును. అదే మూతలేని పాత్రలో నీరు వేడెక్కును గానీ పదార్థాలకు తక్కువ ఉష్ణశక్తి అందును.
ప్రశ్న 9.
‘x’ గ్రా||ల పదార్ధము యొక్క ఉష్ణోగ్రతను t1°C కు పెంచుటకు అవసరమైన ఉష్ణ పరిమాణం అదే ‘y’ గ్రా|| నీటిని ఉష్ణోగ్రతలో t2°C పెరుగుటకు సరిపోయిన, వాటి యొక్క విశిష్టోష్ణాల నిష్పత్తి ఎంత?
జవాబు:
m1 = x గ్రా|| మరియు m2 = y గ్రా||
T1 = t1°C మరియు T2 = t2 °C, ఫలిత ఉష్ణోగ్రత = T
మిశ్రమ పద్ధతి ప్రకారం :
10th Class Physics 1st Lesson ఉష్ణం 1/2 Mark Important Questions and Answers
1. క్రింది పటంలో చూపిన ప్రయోగంలో ఏ థర్మామీటర్ లో పాదరస మట్టం పెరుగుతుంది?
జవాబు:
థర్మామీటర్ – A
2. క్రింది ఏ సందర్భంలో నీవు చల్లదనాన్ని పొందుతావు?
సందర్భం-1 : నీ శరీరం నుండి ఉష్ణం బయటకు ప్రవహించినపుడు
సందర్భం-2 : నీ శరీరంలోకి ఉష్ణం ప్రవహించినపుడు
జవాబు:
సందర్భం – 1
3. ఏ భౌతిక రాశిని ‘చల్లదనం లేదా వెచ్చదనం స్థాయి’గా నిర్వచిస్తారు?
జవాబు:
ఉష్ణోగ్రత
4. ఉష్ణానికి SI ప్రమాణం ఏమిటి?
జవాబు:
జౌల్
5. 1 గ్రాము నీటి యొక్క ఉష్ణోగ్రతను 1°C పెంచడానికి ఎంత ఉష్ణశక్తి అవసరం అవుతుంది?
జవాబు:
1 కేలరీ లేదా 4.186 పౌల్
6. 1 కేలరీ ఎన్ని ఔళ్ళకి సమానం అవుతుంది?
జవాబు:
4. 186 జోళ్ళు
7. ఉష్ణోగ్రతకి S.I ప్రమాణాలు రాయుము.
జవాబు:
కెల్విన్ (K)
8. 0°C ను కెల్విన్లోకి మార్చుము.
జవాబు:
273K
9. డిగ్రీ సెల్సియలో ఉన్న ఉష్ణోగ్రతను, కెల్విన్లోకి మార్చు సూత్రము రాయుము.
జవాబు:
కెల్విన్లో ఉష్ణోగ్రత = 273 + °C లో ఉష్ణోగ్రత
10. 100°C ను పరమ ఉష్ణోగ్రతా మానంలోకి మార్చుము.
జవాబు:
373 K
11. Q = msAT లో ‘S’ అనే పదం దేనిని సూచిస్తుంది?
జవాబు:
విశిష్టోష్ణం
12. ‘విశిష్టోష్ణం’నకు ఒక సూత్రం రాయుము.
జవాబు:
\(\mathrm{s}=\frac{\mathrm{Q}}{\mathrm{m} \Delta \mathrm{T}}\)
13. విశిష్టోష్ణం యొక్క C.G.S. ప్రమాణాలు రాయుము.
జవాబు:
14. విశిష్టోష్టానికి S.I. ప్రమాణాలు రాయుము.
జవాబు:
15. ఖాళిను పూరించుము.
జవాబు:
4.186 × 10³
16. ఒక పదార్థం యొక్క విశిష్టోష్ణానికి, ఉష్ణోగ్రత పెరుగుదల రేటుకి మధ్య సంబంధం ఏమిటి ?
జవాబు:
విలోమానుపాతం
17. ‘ఉష్ణ భాండాగారాలు’ అని వేటిని అంటారు?
జవాబు:
సముద్రాలను
18. నీటి యొక్క విశిష్టోష్ణం విలువ ఎంత
జవాబు:
19. A, B, C, D, E మరియు F పదార్థాల విశిష్టోష్ణాలు
వరుసగా 0.031, 0.033, 0.095, 0.115, 0.50,
a) ఏ పదార్థం తక్కువ ఉష్ణంతో త్వరగా వేడెక్కును?
జవాబు:
పదార్థం – A
b) పదార్థం – C యొక్క ఉష్ణోగ్రతను 1°C పెంచడానికి ఎంత ఉష్ణం కావాలి?
జవాబు:
0.095 కాలరీలు
20. ద్రవాల మిశ్రమం యొక్క ఫలిత ఉష్ణోగ్రతను కనుగొనుటకు వినియోగించే ఒక సూత్రం రాయుము.
జవాబు:
\(\mathbf{T}=\frac{\left(m_{1} \mathbf{T}_{1}+m_{2} \mathbf{T}_{2}\right)}{\left(m_{1}+m_{2}\right)}\)
21. మిశ్రమాల పద్ధతి సూత్రాన్ని రాయుము.
జవాబు:
వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణం = చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణం
22. 100 మి.లీ. నీరు 90°C వద్ద, 200 మి.లీ. నీరు 60°C వద్ద కలవు. వీటిని కలపగా ఏర్పడిన మిశ్రమం ఉష్ణోగ్రత ఎంత వుంటుంది?
జవాబు:
23. ఇచ్చిన ఘనపదార్థం విశిష్టోష్ణం కనుగొనుటకు కావలసిన పరికరాలను రెండింటిని రాయుము.
జవాబు:
కెలోరీమీటర్, థర్మామీటరు
24. సీసం విశిష్టోష్ణం కనుగొనుటకు ఉపయోగించే సూత్రం రాయుము.
జవాబు:
(1 = సీసం, c = కెలోరీమీటర్, W = నీరు)
25. గదిలో నీరు కొద్ది సేపటి తరువాత కనిపించదు. కారణాన్ని రాయండి.
జవాబు:
బాష్పీభవనం వలన
26. బాష్పీభవనానికి నిజ జీవిత వినియోగం రాయుము.
జవాబు:
తడిబట్టలు ఆరుట
27. ఏ ఉష్ణోగ్రత వద్దనైనా నీరు ఆవిరి అవడాన్ని ఏమంటారు?
జవాబు:
బాష్పీభవనం
28. ద్రవం ఉపరితలం దగ్గర మాత్రమే నీరు ఆవిరిగా మారు ప్రక్రియ.
A) మరుగుట
B) బాష్పీభవనం
C) A మరియు B
D) సాంద్రీకరణం
జవాబు:
B) బాష్పీభవనం
29. వాక్యం a : బాష్పీభవనం ఉపరితల ప్రక్రియ.
వాక్యం b : బాష్పీభవనంలో వ్యవస్థ ఉష్ణోగ్రత తగ్గును.
జవాబు:
రెండూ
30. జతపరుచుము
a) బాష్పీభవనం i) ఉయ ప్రక్రియ
b) సాంద్రీకరణం ii) శీతలీకరణ ప్రక్రియ
జవాబు:
a – ii, b-i
31. మన శరీరంపై ‘చెమట పట్టి ఆరినపుడు చల్లగా ఉండడానికి కారణం ఏమిటి?
జవాబు:
బాష్పీభవనం
32. బాష్పీభవన రేటు ఆధారపడని అంశం
A) ఉపరితల వైశాల్యం
B) ఉష్ణోగ్రత
C) ఆర్థత
D) ద్రవ్యరాశి
జవాబు:
D) ద్రవ్యరాశి
33. బాష్పీభవనానికి వ్యతిరేక ప్రక్రియ ఏమిటి?
జవాబు:
సాంద్రీకరణం
34. చల్లని నీరు పోసిన సీసాను గదిలో ఉంచితే నీవు గమనించే అంశం ఏమిటి?
జవాబు:
సీసా చుట్టూ నీటి బిందువులను గమనిస్తాను.
35. పై కృత్యంలో సీసాలో నీటి ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పు వచ్చును?
జవాబు:
పెరుగును
36. సాంద్రీకరణలో స్థితులు ఎలా మారుతాయి?
జవాబు:
వాయువు నుండి ద్రవానికి.
37. స్నానాల గదిలో స్నానం చేసిన తర్వాత వెచ్చగా అనిపిస్తుంది. కారణం ఏమిటి?
జవాబు:
సాంద్రీకరణం
38. గాలిలో గల నీటి ఆవిరి పరిమాణాన్ని ఏమంటారు?
జవాబు:
ఆర్ద్రత
39. తుషారం లేదా పొగమంచు ఏర్పడుటలో ఇమిడియున్న దృగ్విషయం ఏది?
జవాబు:
సాంద్రీకరణం
40. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించడానికి శరీరంలో జరిగే ఒక జీవక్రియను రాయుము.
జవాబు:
చెమట పట్టుట
41. వాతావరణంలో ధూళి కణాల పై నీటి ఆవిరి సాంద్రీకరించే ప్రక్రియ వలన ఏమి ఏర్పడును?
జ. పొగమంచు
42. సరియైన జత కానిది ఏది?
1) మేఘాలు – బాష్పీభవనం వలన ఏర్పడును
2) పొగమంచు – సాంద్రీకరణ వలన ఏర్పడును
జవాబు:
రెండూ సరియైనవే / సరికానివి ఏవీ లేవు.
43. నీటి యొక్క మరుగు స్థానం ఎంత? ఏది సరైనది?
జవాబు:
100°C లేదా 373 K
44. ద్రవం వాయువుగా ఈ క్రింది సందర్భంలో మారగలదు.
A) ఏ ఉష్ణోగ్రత వద్దనైనా
B) స్థిర ఉష్ణోగ్రత వద్ద
C) A మరియు B
జవాబు:
C) A మరియు B
45.
a) ద్రవీభవన గుప్తోష్ణం సూచించు భాగం ఏది?
జవాబు:
BC
b) ఏ భాగం మరగడాన్ని సూచిస్తుంది?
జవాబు:
DE
46. బాష్పీభవన గుప్తోష్ణం ప్రమాణం ఏమిటి?
జవాబు:
కాలరీ / గ్రా. (లేదా) బౌల్/కి. గ్రా.
47. నీటికి బాష్పీభవన గుప్తోష్ణం విలువ ఎంత?
జవాబు:
540 కాలరీ / గ్రాం.
48. మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ ఎంత?
జవాబు:
80 కాలరీ / గ్రా.
49. ఏ ఉష్ణోగ్రత వద్ద మంచు కరుగుతుంది?
జవాబు:
0°C లేదా 273K
50. 2 గ్రాముల మంచు 0°C వద్ద కలదు. అది పూర్తిగా నీరుగా మారుటకు కావలసిన. ఉష్ణం ఎంత?
జవాబు:
160 కాలరీలు
51. క్రింది ఏ ప్రక్రియలో ఉష్ణం విడుదలగును?
A) ద్రవీభవనం
B) మరగడం
C) బాష్పీభవనం
D) సాంద్రీకరణం
జవాబు:
D) సాంద్రీకరణం
52. రిఫ్రిజిరేటర్ లో జరిగే ప్రక్రియ ఏమిటి?
జవాబు:
ఘనీభవనం
53. a) వాయువు నుండి ద్రవం i) మంచు తుషారం
b) ద్రవం నుండి వాయువు ii) పొగమంచు
c) ద్రవం నుండి ఘనం iii) తడిబట్టలు
జవాబు:
(a) – ii; (b) – iii; (c) – i
54. క్రింది ఇచ్చిన సందర్భానికి నిత్యజీవిత ఉదాహరణ ఇమ్ము.
“నీటి సాంద్రత కన్నా మంచు సాంద్రత తక్కువ”
జవాబు:
1) మంచు నీటిపై తేలుట,
2) గాజు సీసా నిండా నీరు పోసి మూత బిగించి, ఫ్రిజ్ లో పెట్టిన సీసాపై పగుళ్ళు ఏర్పడుట.
55. జతపరుచుము :
జవాబు:
1 – a, 2 – b, 3 – c, 4 – d
56. A, B మరియు C అనే పదార్థాల ఉష్ణోగ్రతలు వరుసగా 60°C, 2301, 333K. ఏయే పదార్థాలు ఉష్ణసమతాస్థితిలో ఉన్నవి?
జవాబు:
A మరియు C
57. 0°C వద్ద ఉన్న కొంత పరిమాణం మంచుకి 160 కాలరీలు ఇచ్చినప్పుడు అది పూర్తిగా నీరుగా మారింది. వినియోగించిన మంచు పరిమాణం ఎంత ఉండ వచ్చును?
జవాబు:
2 గ్రా
58. 100°C వద్ద గల 1 గ్రాము నీటి కన్నా, 1 గ్రాము నీటి ఆవిరిలో ఎంత అధిక ఉష్ణం దాగి ఉంటుంది?
జవాబు:
540 కాలరీలు
59. ఉక్కపోతకు కారణమైన దృగ్విషయం ఏది?
జవాబు:
ఆర్ద్రత
60. ఏఏ పట్టణాలలో ఒకే ఉష్ణోగ్రత నమోదు చేయబడింది?
జవాబు:
A మరియు B
61. – 4°C ను కెల్విన్లోకి మార్చండి.
జవాబు:
269 K
62. ఫ్రిజ్ నుండి తీసిన నీటిలో వేలు ముంచినప్పుడు చల్లగా ఆరుట అనిపిస్తుంది. ఎందుకు?
జవాబు:
శరీరం నుండి నీటికి ఉష్ణం ప్రవహించడం వలన
63. కొన్ని చుక్కల పెట్రోల్ చేతిపై పడినప్పుడు, చల్లగా అనిపిస్తుంది. కారణమైన ప్రక్రియ ఏది?
జవాబు:
బాష్పీభవనం (శీతలీకరణ ప్రక్రియ)
64. 100°C వద్ద గల 1 గ్రా. నీరు 100°C గల నీరుగా మారడానికి బదిలీ కావలసిన ఉష్ణరాశి ఎంత?
జవాబు:
540 కాలరీలు
65. మరగడం మరియు బాష్పీభవనం మధ్య తేడాలను తెలుసుకొనుటకు ఒక ప్రశ్నను తయారుచేయుము.
జవాబు:
మరగడం మరియు బాష్పీభవనం అనే ప్రక్రియలలో ఏ ప్రక్రియ ఏ ఉష్ణోగ్రత వద్దనైనా జరుగుతుంది?
66. మంచు ముక్కలు నీటిపై తేలడానికి కారణం ఏమిటి?
జవాబు:
నీటి సాంద్రత కన్నా మంచు సాంద్రత తక్కువ.
67. సమాన పరిమాణంలో నీటిని ఒక కప్పు మరియు ఒక ప్లేట్లో తీసుకొనుము. కొద్దిసేపటి తరువాత దేనిలో నీరు నీరు త్వరగా బాష్పీభవనం చెందును?
జవాబు:
ప్లేట్ లో నీరు
68. శీతలీకరణిగా వినియోగించే ద్రవం ఏమిటి?
జవాబు:
నీరు
69. తడి బట్టలు పొడిగా మారినప్పుడు ఆ నీరు ఏమవుతుంది?
జవాబు:
బాష్పీభవనం చెందును.
70. ‘బాష్పీభవన రేటు ఉపరితల వైశాల్యంపై ఆధారపడును’ అనే వాక్యాన్ని ప్రయోగం ద్వారా నిరూపించడానికి కావలసిన పరికరాలేవి?
జవాబు:
1) కప్పు,
2) సాసర్ / ప్లేట్
71. భూగోళంపై ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించుటలో ఉపయోగపడే నీటి యొక్క ధర్మం ఏమిటి?
జవాబు:
అధిక విశిష్టోష్ణం
72. ఏ పదార్థానికి అధిక విశిష్టోష్ణం కలదు?
జవాబు:
నీటికి
73. తడిబట్టలు త్వరగా పొడిబట్టలుగా మారుటకు కావలసిన కొన్ని కారకాలు రాయుము.
జవాబు:
గాలి వీచు వేగం, ‘గాలిలో తేమ, ఉష్ణోగ్రత
74. మంచులో గల అణువుల మధ్య బంధాలను తెంచుటకు వినియోగింపబడు శక్తిని ఏమంటారు?
జవాబు:
ద్రవీభవన గుప్తోష్ణం
75. వర్షం పడిన కొద్ది సేపటి తర్వాత రోడ్డు పై నీరు మాయమగును. కారణం ఏమిటి?
జవాబు:
బాష్పీభవనం
76. కెల్విన్ మానంలో నీటి ద్రవీభవన, బాష్పీభవన స్థానాల మధ్య ఉష్ణోగ్రత భేదాన్ని రాయుము.
జవాబు:
100 K
77. వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రతను కొలుచునపుడు సందర్భం
a) థర్మామీటర్ లో రీడింగు పెరగడం / తగ్గడం ఆగిన తర్వాత కొలవాలి
b) థర్మామీటర్ లో రీడింగు పెరుగుతున్నప్పుడు కొలవాలి. పై ఏ సందర్భం సరియైనది?
జవాబు:
‘a’ సరియైనది.
78. ఏ శక్తి వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకి ప్రవహించును?
A) ఉష్ణం
B) నీరు
C) ఉష్ణోగ్రత
D) A (or) B
జవాబు:
A) ఉష్ణం
79.
పై పటంలో చూపిన ప్రయోగంలో ఏ థర్మామీటర్ రీడింగ్ త్వరగా పెరుగును?
జవాబు:
మొదటి థర్మా మీటరు (ఎడమ వైపు).
80. బాష్పీభవనం చెందినపుడు వ్యవస్థ ఉష్ణోగ్రత
a) తగ్గును
b) పెరుగును
C) స్థిరంగా ఉండును
జవాబు:
a
81. ప్రమీల శీతాకాలం ఉదయం కారు అద్దాలపై నీటి బిందువులను గమనించింది. దీనికి కారణం
a) తుషారం, బాష్పీభవనం
b) తుషారం, సాంద్రీకరణం
c) పొగమంచు, సాంద్రీకరణం
d) పొగమంచు, బాష్పీభవనం
జవాబు:
b) తుషారం, సాంద్రీకరణం
82. ‘నీటికి ఉష్ణోగ్రత ఇస్తూవుంటే, దాని ఉష్ణోగ్రత పెరుగుతూనే ఉంటుంది’. ఈ వాక్యంను సమర్థిస్తావా?
జవాబు:
సమర్థించను.
83. క్రింది ఏ ప్రక్రియలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉండదు?
a) బాష్పీభవనం
b) మరగడం
c) ద్రవీభవనం
జవాబు:
a) బాష్పీభవనం
84. a) ద్రవం నుండి వాయువు
b) ద్రవం నుండి ఘనం
c) ఘనం నుండి ద్రవం
పై వానిలో ఏది ఘనీభవనాన్ని సూచించును?
జవాబు:
b) ద్రవం నుండి ఘనం
85. నీటి ఆవిరి నీరుగా మారినప్పుడు పరిసర గాలి ఎలా మారుతుంది?
జవాబు:
వేడెక్కును
10th Class Physics 1st Lesson ఉష్ణం 1 Mark Bits Questions and Answers
సరియైన సమాధానమును గుర్తించండి.
1. పళ్ళెం, కప్పు, సాసర్ మరియు వాచ్ గ్లాలో సమాన పరిమాణంలో స్పిరిట్ ను తీసుకుంటే దేనిలో స్పిరిట్ నెమ్మదిగా బాష్పీభవనం చెందును?
A) సాసర్
B) వాచ్ గ్లాస్
C) కప్పు
D) పళ్ళెం
జవాబు:
C) కప్పు
2. 10వ తరగతి విద్యార్థిని పరీక్షించిన వైద్యుడు అతని శరీర ఉష్ణోగ్రత 310K గా చెప్పాడు. ఆ విద్యార్థి శరీర ఉష్ణోగ్రత సెల్సియస్ మానంలో …….
A) 273°C
B) 30°C
C) 98.4°C
D) 37°C
జవాబు:
D) 37°C
3. ప్రవచనం A : బాష్పీభవనం ఒక శీతలీకరణ ప్రక్రియ.
ప్రవచనం B : మరగటం ఒక ఉద్ధీయ ప్రక్రియ.
A) A సరైనది, B సరైనది
B) A సరైనది, B సరియైనది కాదు
C) A సరియైనది కాదు, B సరైనది
D) A సరియైనది కాదు, B సరియైనది కాదు
జవాబు:
B) A సరైనది, B సరియైనది కాదు
4. ఉష్ణానికి S.I ప్రమాణాలు
A) కెలోరి
B) బౌల్
C) కెలోరి / p°C
D) బౌల్/కి.గ్రా. – కెల్విన్
జవాబు:
B) బౌల్
5. m1, m2 ద్రవ్యరాశులు గల ఒకే పదార్థానికి చెందిన నమూనాల ఉష్ణోగ్రతలు వరుసగా T1, T2 అయితే, వాటిని కలుపగా ఏర్పడే మిశ్రమం ఫలిత ఉష్ణోగ్రత
జవాబు:
B
6. కింది వాటిలో ‘తుషారం’ ఏర్పడడం అనేది దేనికి ఉదాహరణ?
A) మరగడం
B) ద్రవీభవనం
C) సాంద్రీకరణం
D) బాష్పీభవనం
జవాబు:
C) సాంద్రీకరణం
7. నీరు మరుగుతున్న సందర్భంలో దాని ఉష్ణోగ్రత …….
A) స్థిరంగా ఉంటుంది
B) పెరుగుతుంది
C) తగ్గుతుంది
D) చెప్పలేము
జవాబు:
A) స్థిరంగా ఉంటుంది
8. ఇది ఉపరితలానికి చెందిన దృగ్విషయము ……..
A) ఘనీభవనం
B) మరగడం
C) బాష్పీభవనము
D) పైవన్నీ
జవాబు:
C) బాష్పీభవనము