These AP 10th Class Physics Important Questions and Answers 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం will help students prepare well for the exams.
AP Board 10th Class Physical Science 3rd Lesson Important Questions and Answers సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం
10th Class Physics 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
ప్రకాశవంతమైన ఒక లోహపు గోళాన్ని తీసుకొని, కొవ్వొత్తి నుండి వచ్చే మసితో గోళాన్ని నల్లగా చేయండి. ఆ గోళాన్ని నీటిలో ముంచండి. నీవు గుర్తించిన ఒక పరిశీలన వ్రాయుము.
జవాబు:
- పరిశీలన : లోహపు గోళం మెరుస్తూ కనబడుతుంది.
- నీటిలో పైకి లేచినట్లు కనబడుతుంది.
ప్రశ్న 2.
సందిగ్ధ కోణంను నిర్వచింపుము.
జవాబు:
సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి ప్రయాణించే కాంతికిరణం ఏ పతన కోణం వద్ద యానకాలను విభజించే తలానికి సమాంతరంగా ప్రయాణిస్తుందో ఆ పతనకోణాన్ని ఆ రెండు యానకాలకు సంబంధించిన “సందిగ్ధ కోణం” అంటారు.
ప్రశ్న 3.
ఒక గాజు యొక్క వక్రీభవన గుణకము 3/2. అయిన ఆ గాజులో కాంతి వేగము ఎంత?
జవాబు:
ప్రశ్న 4.
ఎండమావులు ఏర్పడే విధానంపై ఏవైనా రెండు ప్రశ్నలు రాయండి.
జవాబు:
- ఎండమావులు ఎలా ఏర్పడుతాయి?
- ఎండమావులకి, సంపూర్ణాంతర పరావర్తనానికి సంబంధం ఉందా?
- ఎండమావులు ఏర్పడడంలో ఉన్న సైన్సు సూత్రం ఏమిటి?
ప్రశ్న 5.
దృశ్యా తంతువు (OFC)లను సమాచార ప్రసారం కోసం తరచూ వినియోగిస్తూ ఉంటాము. ఇది ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది?
జవాబు:
సంపూర్ణాంతర పరావర్తనం
ప్రశ్న 6.
గాజు, వజ్రాలతో తయారైన వస్తువులను పరిశీలిస్తే ఏది ఎక్కువగా మెరుస్తుంది? ఎందుకు?
జవాబు:
వజ్రాలతో తయారైన వస్తువు ఎక్కువగా మెరుయును. ఎందుకనగా దీని సందిగ్ధకోణం విలువ 24.4° కన్నా తక్కువగా ఉండుటయే.
ప్రశ్న 7.
నక్షత్రాలు మిణుకు మిణుకుమనడం అనే దృగ్విషయానికి గల కారణంను వివరించండి.
జవాబు:
నక్షత్రాలు మిణుకు మిణుకుమనడానికి కారణం కాంతి వక్రీభవనం.
ప్రశ్న 8.
కాంతి కిరణం సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి వెళ్తున్నపుడు సందిగ్ధ కోణం కన్నా పతన కోణం ఎక్కువైనపుడు కాంతి కిరణ మార్గాన్ని చూపు పటం గీయుము.
జవాబు:
ప్రశ్న 9.
ఏ సందర్భంలో పతనకోణం, వక్రీభవన కోణం సమానంగా ఉంటాయి?
జవాబు:
రెండు యానకాల యొక్క వక్రీభవన గుణకాలు సమానమైనప్పుడు, పతనకోణం మరియు వక్రీభవన కోణాలు సమానంగా ఉంటాయి.
ప్రశ్న 10.
నీటిలో ఏర్పడ్డ చిన్న గాలిబుడగలపై కాంతిని పతనం చెందిస్తే, ఆ కాంతిని ఆ బుడగలు అపసరణం (diverge) చేస్తున్నాయి. దీనికి గల కారణాన్ని తెలపండి.
జవాబు:
కుంభాకార కటకాన్ని, దాని వక్రీభవన గుణకం కన్నా ఎక్కువ వక్రీభవన గుణకం గల యానకంలో ఉంచిన, ఆ కటకం వికేంద్రీకరణ కటకం వలె పని చేయును. నీరు వక్రీభవన గుణకం 1.33 మరియు గాలి వక్రీభవన గుణకం ‘1’ కనుక నీటిలో ఏర్పడిన చిన్న చిన్న గాలి బుడగలపై పడిన కాంతిని ఆ బుడగలు అపసరణం చెందిస్తాయి.
ప్రశ్న 11.
నాని, అనిల్ స్నేహితులు. వీరు మధ్యాహ్న సమయంలో తారు రోడ్డుపై నడుస్తున్నారు. అనిల్ రోడ్డుపై నీటిఛాయలు చూశాడు. నానికి చూపించాడు. అనిల్, నానికి ఆ నీటి ఛాయలకు కారణాలను ఊహించమన్నాడు. నీవయితే ఏమి ఊహిస్తావు?
జవాబు:
- ఎండాకాలంలో కొన్నిసార్లు తారురోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డుపై నీటి ఛాయలు గమనిస్తుంటాము. అదే విధంగా ఇవి ఏర్పడి ఉంటాయని భావించాను.
- ఇది దృఢమ వలన ఏర్పడతాయి.
- ఇవి యానకంలోని వక్రీభవన గుణకంలోని భేదాలు మరియు సంపూర్ణాంతర పరావర్తనాల వలన ఏర్పడతాయి.
ప్రశ్న 12.
కటకాన్ని నీటిలో ముంచి, ఆ నీటి అడుగుభాగాన ఉన్న రాయిని చూస్తూ మీరు నిర్వహించిన ప్రయోగం ద్వారా ఏం తెలుసుకున్నారు?
జవాబు:
ఈ ప్రయోగం నుండి నీటిలో ఉంచినపుడు కటకం యొక్క నాభ్యంతరం పెరిగినదని తెలుసుకున్నాను.
ప్రశ్న 13.
క్రింది పట్టికను గమనించండి.
పదార్థం | వక్రీభవన గుణకం |
మంచు | 1.31 |
నీరు | 1.33 |
బెంజీన్ | 1.5 |
కార్బన్ డై సల్ఫైడ్ | 1.63 |
పై విలువల ఆధారంగా, ఏ పదార్థంలో కాంతి వేగం స్వల్పం?
జవాబు:
యానకంలో కాంతివేగం దాని వక్రీభవన గుణకంకు విలోమానుపాతంలో ఉండును. పై పట్టిక నుండి కార్బన్ డై సల్ఫైడ్ . నందు కొంతి వేగం స్వల్పం.
ప్రశ్న 14.
“ఫెర్మాట్ సూత్రం” అంటే ఏమిటి?
జవాబు:
ఏవైనా రెండు బిందువుల మధ్య కాంతి ప్రయాణించేటప్పుడు అతి తక్కువ సమయం పట్టే మార్గంలోనే ప్రయాణించును.
ప్రశ్న 15.
కొంతి ఒక యానకం నుండి వేరొక యానకంలోకి ప్రయాణించునపుడు ఏమి జరుగును?
జవాబు:
కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించునపుడు కాంతి ప్రయాణదిశ మారుతుంది. కాంతి లంబం వద్ద, లంబానికి దగ్గరగా గాని లేదా దూరంగా గాని వంగి ప్రయాణించును.
ప్రశ్న 16.
కాంతి వేగం ఎప్పుడు తగ్గును?
జవాబు:
కాంతి విరళయానకం నుండి సాంద్రతర యానకంలోకి ప్రయాణించేటప్పుడు దాని వేగం తగ్గును.
ప్రశ్న 17.
సాంద్రతర యానకమంటే ఏమిటి?
జవాబు:
ఏ యానకానికైతే ఎక్కువ దృక్ సాంద్రత ఉండునో దానిని “సాంద్రతర యానకం” అంటారు.
ప్రశ్న 18.
వక్రీభవనం అంటే ఏమిటి?
జవాబు:
వక్రీభవనం :
ఒక యానకం నుండి మరొక యానకంలోకి కాంతి ప్రయాణించేటప్పుడు రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతి దిశ మారే దృగ్విషయాన్ని కాంతి “వక్రీభవనం” అంటారు.
ప్రశ్న 19.
వక్రీభవన గుణకం (లేదా) పరమ వక్రీభవన గుణకం అంటే ఏమిటి?
జవాబు:
ఏదైనా యానకపు కాంతి వేగానికి, శూన్యంలో కాంతి వేగానికి గల నిష్పత్తిని ఆ యానకపు “వక్రీభవన గుణకం” (లేదా) “పరమ వక్రీభవన గుణకం” అంటారు.
ప్రశ్న 20.
ఒక యానకం యొక్క వక్రీభవన గుణకము ఏ అంశాలపై ఆధారపడును?
జవాబు:
వక్రీభవన గుణకము పదార్థ స్వభావం మరియు కాంతి తరంగదైర్ఘ్యంపై ఆధారపడును.
ప్రశ్న 21.
సాపేక్ష వక్రీభవన గుణకం (లేదా) తారతమ్య వక్రీభవన గుణకం అంటే ఏమిటి?
జవాబు:
ఏవైనా రెండు యానకాలలో రెండవ యానకపు వక్రీభవన గుణకం (n2), మొదటి యానకపు వక్రీభవన గుణకం (n1) లకు గల నిష్పత్తిని “సాపేక్ష వక్రీభవన గుణకం (లేదా) తారతమ్య వక్రీభవన గుణకం” అంటారు.
ప్రశ్న 22.
కాంతి సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి ప్రయాణించేటప్పుడు ఏమి జరుగును?
జవాబు:
కాంతి సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి ప్రయాణించునపుడు లంబానికి దూరంగా వంగుతుంది.
ప్రశ్న 23.
కాంతి విరళయానకం నుండి సాంద్రతర యానకంలోకి ప్రయాణించేటప్పుడు ఏమి జరుగును?
జవాబు:
కాంతి విరళయానకం నుండి సాంద్రతర యానకంలోకి ప్రయాణించునపుడు లంబానికి దగ్గరగా వంగుతుంది.
ప్రశ్న 24.
విస్థాపనము అంటే ఏమిటి?
జవాబు:
ఒక గాజు దిమ్మె నుండి వెలువడిన పతనకిరణాలు మరియు వక్రీభవన కిరణాలను పొడిగించగా ఏర్పడిన సమాంతర రేఖల మధ్య దూరాన్ని “విస్థాపనం” అంటారు.
ప్రశ్న 25.
స్నెల్ నియమాన్ని నిర్వచించుము.
జవాబు:
కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు ఆ యానకాలలో కాంతి వేగాల నిష్పత్తి \(\frac{\mathrm{v}_{1}}{\mathrm{v}_{2}}\) , ఆ యానకాల వక్రీభవన గుణకాల నిష్పత్తి \(\frac{\mathrm{n}_{2}}{\mathrm{n}_{1}}\) కు సమానంగా ఉంటుంది. దీనినే “స్నెల్ నియమం” అంటారు.
ప్రశ్న 26.
కాంతి శూన్యంలో ఎందుకు ప్రయాణించును?
జవాబు:
కాంతి ప్రసరించుటకు యానకముపై ఆధారపడదు కావున శూన్యంలో కూడా ప్రయాణించును.
ప్రశ్న 27.
ఏ రకపు కోణం పతన కోణం వద్ద వక్రీభవన కిరణం యానకాలను వేరుచేసే రేఖ వెంబడి ప్రయాణించును?
జవాబు:
సందిగ్ధ కోణం వద్ద ఇది సాధ్యపడును.
ప్రశ్న 28.
వక్రీభవన గుణకం ఆధారపడు అంశాలేవో సమాచారం సేకరించుము.
జవాబు:
వక్రీభవన గుణకం 1) పదార్థ స్వభావం 2) వాడిన పదార్థపు తరంగదైర్ఘ్యాలపై ఆధారపడును.
ప్రశ్న 29.
పరావర్తన కోణపు sin విలువకు, వక్రీభవన కోణపు sin విలువకు గల నిష్పత్తి దేనిని తెల్పును?
జవాబు:
వక్రీభవనపు గుణకం పరావర్తన కోణపు sin విలువకు, వక్రీభవన కోణపు sin విలువకు గల నిష్పత్తిని తెల్పును.
ప్రశ్న 30.
ఒక పాత్రలోని నీటిలో వేసిన నాణెం కొంత ఎత్తులో కనబడుటకు కారణమేమి?
జవాబు:
కాంతి యొక్క వక్రీభవన లక్షణం వలన ఇది సాధ్యపడును.
ప్రశ్న 31.
కాగితంపై గల అక్షరాలపై ఒక మందపాటి గాజు పలక ఉంచి చూసిన ఆ అక్షరాలు కాగితంపై నుండి కొంత ఎత్తులో కనపడుటకు కారణం ఏమిటి?
జవాబు:
కాంతి యొక్క వక్రీభవన లక్షణం వలన అక్షరాలు అలా ఎత్తుగా కనబడతాయి.
ప్రశ్న 32.
ఒక గాజు గ్లాసులోని నీటిలో ఉంచిన నిమ్మకాయ పరిమాణం పెరిగినట్లు కనపడుతుంది. దీనికి కారణం ఏమిటి?
జవాబు:
కాంతి యొక్క వక్రీభవన లక్షణం వలన నిమ్మకాయ పరిమాణం పెరిగినట్లు కనబడుతుంది.
ప్రశ్న 33.
వేసవి కాలంలో తారురోడ్ల మీద మనం ప్రయాణించేటప్పుడు కనబడే “ఎండమావులు” దేనికి ఉదాహరణ?
జవాబు:
ఎండలో తారురోడ్డు మీద కనిపించే ఎండమావులు కాంతి సంపూర్ణాంతర పరావర్తనానికి ఒక నిజజీవిత ఉదాహరణ.
ప్రశ్న 34.
ఎండమావులు దేని వలన ఏర్పడతాయి?
జవాబు:
ఎండమావులు దృఢమ వల్ల ఏర్పడతాయి.
ప్రశ్న 35.
వజ్రాలు ప్రకాశించడానికి ముఖ్య కారణమేమి?
జవాబు:
వజ్రాలు ప్రకాశించడానికి ముఖ్యకారణం సంపూర్ణాంతర పరావర్తనం.
ప్రశ్న 36.
ఆప్టికల్ ఫైబర్స్ దేనిపై ఆధారపడి పనిచేస్తాయి?
జవాబు:
ఆప్టికల్ ఫైబర్స్ సంపూర్ణాంతర పరావర్తనంపై ఆధారపడి పనిచేస్తాయి.
ప్రశ్న 37.
సమాచార సంకేతాలను ప్రసారం చేయుటకు వేటిని వాడతారు?
జవాబు:
సమాచార సంకేతాలను ప్రసారం చేయుటకు ఆప్టికల్ ఫైబర్స్ ను విరివిగా వాడతారు.
ప్రశ్న 38.
మానవ శరీరంలోని లోపలి అవయవాలను చూచుటకు వైద్యులు వేటిని వాడతారు?
జవాబు:
మానవ శరీరంలోని లోపలి అవయవాలను చూచుటకు వైద్యులు ఆప్టికల్ ఫైబర్స్ ను వాడతారు.
ప్రశ్న 39.
“లైట్ పైప్” అంటే ఏమిటి?
జవాబు:
సుమారు 1 మైక్రోమీటర్ (10-6 మీ) వ్యాసార్ధం గల సన్నని తీగల సముదాయాన్ని “లైట్ పైప్” అంటారు.
ప్రశ్న 40.
కాంతి వేగము మరియు వక్రీభవన గుణకముల మధ్య సంబంధమేమిటి?
జవాబు:
ఒక యానకము యొక్క వక్రీభవన గుణకము ఎక్కువగా ఉంటే దానిలో కాంతివేగము తక్కువగా ఉండును.
ప్రశ్న 41.
గాజు యొక్క వక్రీభవన గుణకము 1.5. దీని అర్థమేమిటి?
జవాబు:
- వక్రీభవన గుణకం ‘n’ అనగా ఆ యానకంలో కాంతి వేగం, శూన్యంలో కాంతి వేగంలో ‘n’ వ భాగం అని అర్థం.
- గాజు వక్రీభవన గుణకం 1.5 అనగా గాజులో కాంతి వేగం = \(\frac{1}{1.5}\) × 3 × 108 = 2 × 108 మీ/సె.
ప్రశ్న 42.
స్నెల్ సూత్రమును రాయుము.
జవాబు:
స్నెల్ సూత్రము : n1 sin i = n2 sin r
n1 = మొదటి యానకంలో కాంతివేగం
n2 = రెండవ యానకంలో కాంతివేగం
i = పతన కోణము
r = వక్రీభవన కోణము
ప్రశ్న 43.
వక్రీభవన సూత్రాలను పేర్కొనుము.
జవాబు:
- పతన కిరణము, వక్రీభవన కిరణము, పతన బిందువు వద్ద రెండు యానకాలు వేరయ్యే తలంలో గీసిన లంబం, ఒకే తలంలో వుంటాయి.
- వక్రీభవనం చెందునపుడు కాంతి స్నెల్ నియమాన్ని పాటిస్తుంది.
n1 sini = n2 sinr (లేదా) \(\frac{\sin i}{\sin r}\) = స్థిరరాశి
ప్రశ్న 44.
క్రింది పట్టికను పరిశీలించండి.
క్రింది ప్రశ్నలకు సమాధానం రాయండి.
ఎ) అత్యధిక ధృక్ సాంద్రత మరియు అత్యల్ప దృక్ సాంద్రత కలిగిన యానకాలేవి? ఎందుకు?
జవాబు:
- అత్యధిక దృక్ సాంద్రత కలిగిన యానకం వజ్రం. ఎందుకనగా దాని వక్రీభవన గుణకం అత్యధికం.
- గాలి అత్యల్ప దృక్ సాంద్రత కలిగిన యానకం, కారణం గాలి యొక్క వక్రీభవన గుణకం చాలా తక్కువ.
బి) కిరోసిన్, టర్పెంటైన్ ఆయిల్ మరియు నీరులలో కాంతి వేగం దేనిలో ఎక్కువ?
జవాబు:
నీటిలో కాంతి ఎక్కువ వేగంతో ప్రయాణించును. ఎందుకనగా మిగిలిన వాటితో పోల్చినపుడు నీటి వక్రీభవన గుణకం తక్కువ. వక్రీభవన గుణకాలు వరుసగా కిరోసిన్ : 1.44; టర్పెంటైన్ ఆయిల్ : 1.47; నీరు : 1:33.
సి) వజ్రం యొక్క వక్రీభవన గుణకం 2.42. దీని అర్థమేమిటి?
జవాబు:
శూన్యంలో కాంతి వేగం, వజ్రంలో కాంతి వేగంకన్నా 2.42 రెట్లు ఎక్కువ.
డి) కాంతి నీటిలోనుండి క్రౌన్ గాజులోకి ప్రవేశించునపుడు ఏమి జరుగును?
జవాబు:
కాంతి కిరణం, లంబము వైపు వంగును.
ఇ) కాంతి కిరణం వజ్రం నుండి గాలిలోకి ప్రవేశించునపుడు ఏమి జరుగును?
జవాబు:
కాంతికిరణం, లంబం నుండి దూరంగా జరుగును.
ప్రశ్న 45.
“పాత్ర నీటిలో అడుగున ఉన్న నాణెం పైకి కొంత ఎత్తులో కనబడుటకు కారణం ఏమి?
జవాబు:
కాంతి విరళయానకం నుండి సాంద్రతర యానకంలో ప్రయాణించడం వలన, లంబంవైపుకు వంగడం వలన నాణెం పైకి వచ్చినట్లు కనబడుతుంది.
ప్రశ్న 46.
వక్రీభవనమును నిర్వచించండి.
జవాబు:
కాంతి వేర్వేరు యానకం గుండా ప్రయాణించునపుడు కాంతివేగం మారడం వలన కాంతి వంగి ప్రయాణించే దృగ్విషయాన్ని వక్రీభవనం అంటారు.
ప్రశ్న 47.
సంపూర్ణాంతర పరావర్తనాన్ని తెలుపుటకు ఒక కృత్యాన్ని వ్రాయండి.
జవాబు:
నీటిలో నూనెను వేస్తే రంగులు ఏర్పడడం.
ప్రశ్న 48.
గాజు దిమ్మెను నిర్వచించండి.
జవాబు:
రెండు సమాంతర తలాలను కలిగియుండి, దాని పరిసరాలలోని యానకం నుండి వేరుచేయబడిన పారదర్శక యానకం.
10th Class Physics 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
గాజు దిమ్మె గుండా ప్రయాణించే కాంతి పొందే విచలన కోణమెంత? దానిని కిరణ చిత్రంతో చూపండి.
జవాబు:
- విచలన కోణం : పతన కిరణం, బహిర్గత కిరణాల మధ్య కోణమే విచలన కోణం.
- గాజు దిమ్మె గుండా ప్రయాణించే కాంతి పొందే విచలన కోణం ‘0’ (సున్న).
కారణం :
పతన కిరణం, బహిర్గత కిరణాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. దీనిని పటంలో గమనించవచ్చును.
ప్రశ్న 2.
కాంతి గాలి నుండి X అనే యానకంలోకి ప్రవేశించింది. గాలిలో కాంతివేగం 3 × 108 మీ/సె, X యానకంలో కాంతివేగం 1.5 × 108 మీ/సె అయిన X యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని కనుగొనండి.
జవాబు:
ప్రశ్న 3.
నిజ జీవితంలో ఫైబర్ ఆప్టిక్స్ ఉపయోగాలను రెండింటిని రాయండి.
జవాబు:
- సమాచార సంకేతాలను ప్రసారం చేయడానికి ఆప్టికల్ ఫైబర్లను విరివిగా వినియోగిస్తున్నారు. దాదాపు 2000 టెలిఫోన్ సిగ్నళ్ళను ఒకేసారి ఆప్టికల్ ఫైబర్ గుండా ప్రసారం చేయవచ్చును. ఈ సిగ్నల్స్ చాలా స్పష్టంగా, వేగవంతంగా ఉంటాయి.
- సన్నని ఆప్టికల్ ఫైబర్ తీగలు కొన్ని కలిసి లైట్ పైప్ గా ఏర్పడతాయి. డాక్టర్లు లైట్ పైప్ ను రోగి నోటి ద్వారా పొట్టలోకి పంపుతారు. ఆప్టికల్ ఫైబర్ కాంతిని పొట్టలోకి పంపుతుంది. ఆ కాంతి పొట్టభాగాలను ప్రకాశవంతం చేస్తుంది. లోపలి దృశ్యాలను కంప్యూటర్ ద్వారా చూడవచ్చును.
ప్రశ్న 4.
ఒక గాజుదిమ్మె వల్ల కలిగే లంబ విస్తాపనాన్ని కనుగొనడానికి వస్తువును ఎక్కడ అమర్చాలో తెలిపే పటాన్ని గీయండి.
జవాబు:
ప్రశ్న 5.
ప్రక్క పటంలో NM అనేవి రెండు యానకాలను వేరుచేసే తలం, NN అనేది MM తలానికి, బిందువు వద్ద గీసిన లంబం. MM కు ఇరువైపులా ఉన్న a, b ప్రాంతాలలో ఉన్న యానకాలలో ఏది సాంద్రతర యానకం?
జవాబు:
పటంను గమనించగా కాంతి కిరణము ‘b’ యానకంలో లంబమునకు దూరంగా ప్రయాణించుచున్నది కనుక ‘a’ సాంద్రతర యానకం అగును.
ప్రశ్న 6.
వజ్రాల ప్రకాశం గురించి రాయుము.
జవాబు:
- వజ్రాల ప్రకాశానికి ముఖ్యకారణం సంపూర్ణాంతర పరావర్తనమే.
- వజ్రం యొక్క సందిగ్ధ కోణము విలువ చాలా తక్కువ (24.49).
- కావున వజ్రంలోకి ప్రవేశించే కాంతికిరణం సులభంగా సంపూర్ణాంతర పరావర్తనం చెంది, వజ్రం ప్రకాశవంతంగా కనబడునట్లు చేస్తుంది.
ప్రశ్న 7.
సంపూర్ణాంతర పరావర్తనం అనగానేమి? దీని అనువర్తనాలు ఏవి?
జవాబు:
సంపూర్ణాంతర పరావర్తనం :
సందిగ్ధకోణం కన్నా పతన కోణం ఎక్కువైనపుడు యానకాలను వేరుచేసే తలం వద్ద కాంతికిరణం తిరిగి సాంద్రతర యానకంలోనికి పరావర్తనం చెందుతుంది. ఈ దృగ్విషయాన్ని ‘సంపూర్ణాంతర పరావర్తనం’ అంటారు.
అనువర్తనాలు :
1) వజ్రాల ప్రకాశం :
వజ్రం యొక్క సందిగ్ధ కోణం విలువ చాలా తక్కువ (24.49) కాబట్టి వజ్రంలోకి ప్రవేశించే కాంతి కిరణం సులభంగా సంపూర్ణాంతర పరావర్తనం చెంది, వజ్రం ప్రకాశవంతంగా కనబడేటట్లు చేస్తుంది.
2) ఆప్టికల్ ఫైబర్స్ :
సమాచార, సాంకేతిక రంగాలలో వాడే ఆప్టికల్ ఫైబర్స్ కూడా ‘సంపూర్ణాంతర పరావర్తనం’ అనే సూత్రం ఆధారంగా పనిచేస్తాయి.
ప్రశ్న 8.
గ్రహాలు ఎందుకు మెరవవు?
జవాబు:
- గ్రహాలు, భూమికి చాలా దగ్గరగా వుండడం వలన అవి భూమిచుట్టూ ఉన్న అదనపు వస్తువులుగా కనిపిస్తాయి.
- గ్రహాలపై పడిన కాంతి, అనేక సూక్ష్మకాంతి బిందువుల సముదాయమని భావిస్తే, ఆ గ్రహాల నుండి మనకంటిని. చేరే సరాసరి కాంతి, గ్రహాల కాంతితో పోలిస్తే శూన్యము. కావున గ్రహాల ప్రకాశాన్ని మనం చూడలేము.
ప్రశ్న 9.
గాజుగ్లాసులోని నీటిలో ఒక ఖాళీ పరీక్ష నాళికను ఉంచి పై నుండి చూసినపుడు, పాదరసంతో నింపబడినట్లుగా కనబడుతుంది. ఎందుకు?
జవాబు:
- నీటి గుండా ప్రయాణించే కాంతికిరణాలు, నీటి యొక్క సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ కోణంలో, పరీక్షనాళిక, గాజు మరియు నీరుల ఉపరితలాలను వేరుచేసే తలం వద్ద ప్రవేశిస్తాయి. దీనివల్ల ఆ కిరణాలు సంపూర్ణాంతర పరావర్తనానికి గురౌతాయి.
- ఈ విధంగా సంపూర్ణాంతర పరావర్తనం చెందిన కిరణాలు, పరీక్షనాళిక ఉపరితలం నుండి వచ్చినట్లుగా కనబడతాయి. అందువల్ల పరీక్షనాళిక పాదరసంలో నిండినట్లుగా కనిపిస్తుంది.
ప్రశ్న 10.
అక్వేరియంలో బుడగలు వెండిలా మెరుస్తుంటాయి. ఎందుకు?
జవాబు:
- అక్వేరియంలోని నీటిలో ప్రయాణించే కిరణాలు, నీటి సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ కోణంలో, నీరు బుడగలను వేరు చేసే యానక ఉపరితలాన్ని ఢీకొంటాయి. అందువల్ల ఇవి సంపూర్ణాంతర పరావర్తనానికి గురవుతాయి.
- ఈ కిరణాలు కంటిని తాకినపుడు, అవి బుడగల నుండి వస్తున్నట్లుగా అనిపిస్తాయి. అందువల్ల బుడగలు వెండిలా మెరుస్తుంటాయి.
ప్రశ్న 11.
సమాచార విజ్ఞాన శాస్త్రంలో ఆప్టికల్ ఫైబర్స్ యొక్క ఉపయోగమేమిటి?
జవాబు:
- సమాచార సంకేతాలను లైట్ పైపుల ద్వారా ప్రసారం చేయుటకు ఆప్టికల్ ఫైబర్స్ పాడతారు.
- సుమారు 2000 టెలిఫోన్ సంకేతాలను, కాంతి తరంగాలతో కలిపి ఒకేసారి ప్రసారం చేయడానికి ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా అవకాశం ఉంది.
- ఈ విధానం ద్వారా ప్రసారం చేయబడిన సంకేతాలు అత్యంత స్పష్టమైనవిగా ఉంటాయి.
ప్రశ్న 12.
వక్రీభవన గుణకం అనగానేమి? యానకం యొక్క వక్రీభవన గుణకానికి, ఆ యానకంలోని కాంతి వేగానికి గల సంబంధాన్ని తెలుపండి.
జవాబు:
వక్రీభవన గుణకం :
శూన్యంలో కాంతి వేగానికి, యానకంలో కాంతి వేగానికి మధ్యగల నిష్పత్తిని యానక వక్రీభవన గుణకం అంటారు.
\(\mathbf{n}=\frac{\mathrm{C}}{\mathrm{V}}\)
వక్రీభవన గుణకం పెరిగితే యానకంలో కాంతివేగం తగ్గుతుంది.
ప్రశ్న 13.
కాంతి వక్రీభవన నియమాలను తెలుపండి.
జవాబు:
- పతనకిరణం, వక్రీభవన కిరణం, రెండు యానకాలను వేరుచేసే తలం వద్ద, పతన బిందువు వద్ద గీసిన లంబం అన్నీ ఒకే తలంలో ఉంటాయి.
- వక్రీభవనంలో కాంతి స్నెల్ నియమాన్ని పాటిస్తుంది.
n1 sin i = n2 sin r లేదా sin i/sin r = స్థిరాంకం
ప్రశ్న 14.
పార్శ్వవిస్థాపనము, నిలువు విస్థాపనము అనగానేమి?
జవాబు:
పార్శ్వ విస్థాపనము :
గాజుదిమ్మె ఉంచినపుడు పతన మరియు బహిర్గత సమాంతర కిరణాల మధ్యగల దూరాన్ని పార్శ్వ విస్థాపనము అంటారు.
నిలువు విస్థాపనము :
గాజుదిమ్మె నుంచి చూచినపుడు వస్తువుకు, దాని ప్రతిబింబానికి మధ్యగల లంబ దూరాన్ని నిలువు విస్థాపనము అంటారు.
ప్రశ్న 15.
పతన కోణానికి, వక్రీభవన కోణానికి మధ్యగల సంబంధాన్ని గుర్తించు ప్రయోగంలోని పరికరాలను వ్రాయండి.
జవాబు:
కావలసిన వస్తువులు :
ప్రొ సర్కిల్, తెల్ల డ్రాయింగ్ షీట్, స్కేలు, నలుపురంగు వేసిన చిన్న కార్డ్ బోర్డ్ ముక్క (10 సెం.మీ. × 10 సెం.మీ.), 2 సెం.మీ. మందం గల అర్ధవృత్తాకారపు గాజుపలక, పెన్సిల్ మరియు లేజర్ లైట్.
ప్రశ్న 16.
గాజుదిమ్మె గుండా వక్రీభవనం అను ప్రయోగానికి ఉద్దేశ్యం, కావలసిన వస్తువులను వ్రాయండి.
జవాబు:
ఉద్దేశ్యం :
గాజు దిమ్మెతో ఏర్పడే ప్రతిబింబ స్వభావం, స్థానాలను గుర్తించడం.
కావలసిన వస్తువులు :
డ్రాయింగ్ బోర్డ్, డ్రాయింగ్ చార్ట్, క్లాంట్లు, స్కేలు, పెన్సిలు, పలుచని గాజుదిమ్మె మరియు గుండు సూదులు.
ప్రశ్న 17.
వ్రేలాడే దీపపు స్తంభాలు (షాండ్లియర్స్) నుండి మిరుమిట్లు గొలిపే కాంతి వెదజల్లుటను నీవు ఎలా అభినందిస్తావు?
జవాబు:
వ్రేలాడే దీపపు స్తంభాలు సంపూర్ణ అంతర పరావర్తనం వలన అద్భుతమైన కాంతిని వెదజల్లుతాయి. కాబట్టి దీనికి కారణమైన అంతర పరావర్తన దృగ్విషయాన్ని అభినందిస్తున్నాను.
ప్రశ్న 18.
ఎండమావులు ఏర్పడడానిని గురించి తెలుసుకొనుటకు ప్రశ్నలను తయారుచేయండి.
జవాబు:
- ఎండమావి అనగానేమి?
- తారురోడ్డు ఎండాకాలం నీళ్ళు నిలచినట్లు కనపడుతుంది దానికి కారణం తెల్పండి.
- ఎండమావి ఎక్కడైనా ఏర్పడుతుందా?
- ఎండమావి ఏర్పడడానికి అవసరమయ్యే పరిస్థితులు తెల్పండి.
ప్రశ్న 19.
ప్రకృతిలోని సంపూర్ణాంతర పరావర్తన ప్రక్రియను నీవు ఎలా అభినందిస్తావు?
జవాబు:
- వజ్రం ప్రకాశవంతంగా మెరవడానికి సంపూర్ణ అంతర పరావర్తన దృగ్విషయం కారణం.
- సమాచార ప్రసారణలో, వైద్యరంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆప్టికల్ ఫైబర్స్ సంపూర్ణ అంతర పరావర్తనం ఆధారంగా పనిచేస్తుంది. కాబట్టి సంపూర్ణ అంతర పరావర్తన పాత్రను అభినందిస్తున్నాను.
ప్రశ్న 20.
ఒక పారదర్శక యానకం (గాజు) యొక్క వక్రీభవన గుణకం 3/2 అయిన ఆ యానకంలో కాంతి వేగాన్ని కనుక్కోండి.
జవాబు:
ప్రశ్న 21.
సందిగ్ధకోణం, సంపూర్ణాంతర పరావర్తనం మధ్య భేదాలు వ్రాయుము.
జవాబు:
సందిగ్ధకోణం | సంపూర్ణాంతర పరావర్తనం |
సాంద్రతర యానకం నుండి విరళయానకంలోనికి ప్రయాణించే కాంతి కిరణం ఏ పతనకోణం వద్ద యానకాలను విభజించే తలానికి సమాంతరంగా ప్రయాణిస్తుందో ఆ పతనకోణాన్ని ఆ రెండు యానకాలకు సంబంధించిన “సందిగ్ధకోణం” అంటారు. | సందిగ్ధ కోణం కన్నా పతనకోణం ఎక్కువైనపుడు యానకాలను వేరు చేసే తలంవద్ద కాంతి కిరణం తిరిగి సాంద్రతర యానకంలోకి పరావర్తనం చెందుతుంది. ఈ దృగ్విషయాన్ని “సంపూర్ణాంతర పరావర్తనం” అంటారు. |
10th Class Physics 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
సంపూర్ణాంతర పరావర్తనమును తెలిపే ఏవైనా రెండు ఉదాహరణలు వివరించండి.
జవాబు:
సంపూర్ణాంతర పరావర్తనమును తెలిపే ఉదాహరణలు :
- వజ్రాల ప్రకాశానికి ముఖ్య కారణం సంపూర్ణాంతర పరావర్తనమే. వజ్రం యొక్క సందిగ్ధ కోణం విలువ చాలా తక్కువ (24.49). కావున వజ్రంలోకి ప్రవేశించే కాంతికిరణం సులభంగా సంపూర్ణాంతర పరావర్తనం చెంది వజ్రం ప్రకాశవంతంగా కనబడేటట్లు చేస్తుంది.
- ఆప్టికల్ ఫైబర్స్ సంపూర్ణాంతర పరావర్తనంపై ఆధారపడి పనిచేస్తాయి. ఆప్టికల్ ఫైబర్ యొక్క అతి తక్కువ వ్యాసార్ధం వల్ల దానిలోకి ప్రవేశించే కాంతి, దాని లోపలి గోడలకు తగులుతూ పతనం చెందుతుంది. పతనకోణం సందిగ్ధకోణం కన్నా ఎక్కువ ఉండడం వల్ల సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది. తద్వారా ఆప్టికల్ ఫైబర్ గుండా కాంతి ప్రయాణిస్తుంది.
ప్రశ్న 2.
స్నెల్ సూత్రమును రాయుము. (లేక) n1 sin i = n2 sin r ను నిరూపించుము.
జవాబు:
1) పటంలో చూపిన విధముగా B అనే బిందువు వద్ద ఒక వ్యక్తి నీటిలో పడి సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు అనుకొనుము.
2) పటంలో X బిందువు గుండా అడ్డంగా గీసిన రేఖ నీటి ప్రాంతానికి ఒడ్డును తెలియచేసే రేఖ అని భావించుము.
3) మనం నేలపై A బిందువు దగ్గర ఉన్నామనుకొనుము.
4) మనం ఆ వ్యక్తిని కాపాడాలనుకుంటే కొంతదూరం నేలమీద, కొంతదూరం నీటిలో ప్రయాణించాలి.
5) పటం. 3లో చూపిన విధంగా నేలపై ప్రయాణించు మార్గాలను అనగా AD, AC లను చూడుము.
6) ADB మార్గం గుండా ప్రయాణిస్తే EC దూరం నేల మీద ప్రయాణించడానికి పట్టే కాలం ఆదా అవుతుంది.
7) నీటిలో DF దూరం ప్రయాణించడానికి పట్టేకాలం అధికంగా అవసరం అవుతుంది. ఈ రెండు కాలాలు సమానం కావాలి.
8) E నుండి C కి, D నుండి F కు ప్రయాణించుటకు పట్టేకాలం ∆t అనుకొనుము.
9) నేలపై అతని వేగం v1, నీటిలో అతని వేగం v2 అగును.
10) పటం నుండి EC = v1 ∆t నుండి DF = v2 ∆t
ప్రశ్న 3.
ఆప్టికల్ ఫైబర్ ద్వారా రోగి శరీరంలోని లోపలి భాగాలను ఎలా చూడగలుగుతారు?
జవాబు:
- మానవ శరీరం లోపలి అవయవాలను డాక్టర్ కంటితో చూడలేరు.
- డాక్టర్ ‘లైట్ పైప్’ను నోటి ద్వారా పొట్టలోనికి పంపుతారు. ఆ కాంతి పొట్టలోపలి భాగాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.
- ఆ లోపలి కాంతి, లైట్ పైలోని మరికొన్ని ఆప్టిక్ ఫైబర్స్ ద్వారా బయటకు వస్తుంది.
- ఆ ఫైబర్స్ రెండవ చివరి నుండి వచ్చే కాంతిని కంప్యూటర్ స్క్రీన్ పై చూసి పరిశీలించడం ద్వారా పొట్టలోపలి భాగాల చిత్రాన్ని డాక్టర్స్ తెలుసుకుంటారు.
ప్రశ్న 4.
పరావర్తనము, సంపూర్ణాంతర పరావర్తనముల మధ్య ఏవైనా 4 భేదాలను వ్రాయుము.
జవాబు:
పరావర్తనము | సంపూర్ణాంతర పరావర్తనము |
1) నునుపైన, మెరుగు పెట్టబడిన ఉపరితలంపై పరావర్తనం జరుగును. | 1) సంపూర్ణాతర పరావర్తనం ఏ ఉపరితలం మీదనైనా జరుగును. |
2) ఏ పతనకోణం విలువకైనా పరావర్తనం జరుగును. | 2) పతనకోణం విలువ, సందిగ్ధ కోణం విలువకన్నా ఎక్కువ అయినపుడు మాత్రమే సంపూర్ణాంతర పరావర్తనం జరుగును. |
3) కాంతికిరణాలు విరళయానకం నుండి సాంద్రతర యానకంలోనికి లేదా అపారదర్శక యానకంలోనికి ప్రవేశించునపుడు పరావర్తనం చెందుతాయి. | 3) కాంతి కిరణాలు సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోనికి ప్రవేశించునపుడు సంపూర్ణాంతర పరావర్తనానికి గురవుతాయి. |
4) పరావర్తన ఉపరితలం కొంతకాంతిని శోషించుకుంటుంది. | 4) పరావర్తన ఉపరితలం కాంతిని శోషించుకోదు. |
ప్రశ్న 5.
సంపూర్ణాంతర పరావర్తనం అనగానేమి? సందిగ్ధకోణం, సంపూర్ణాంతర పరావర్తనల మధ్యగల సంబంధాల్ని ఉత్పాదించండి.
జవాబు:
సంపూర్ణ అంతర పరావర్తనం :
సందిగ్ధ కోణం కంటే పతన కోణం ఎక్కువైనప్పుడు యానకాలను వేరుచేసే తలం వద్ద కాంతి కిరణం తిరిగి సాంద్రతర యానకంలోకి పరావర్తనం చెందుతుంది. ఈ దృగ్విషయాన్ని సంపూర్ణ అంతర పరావర్తనం అంటారు.
5) సందిగ్ధ కోణం కన్నా పతన కోణం ఎక్కువయినపుడు యానకాలను వేరుచేసే తలం వద్ద కాంతికిరణం తిరిగి సాంద్రతర యానకంలోకి పరావర్తనం చెందును. దీనినే సంపూర్ణ అంతర పరావర్తనం అంటారు.
ప్రశ్న 6.
స్నెల్ నియమాన్ని వాడి గాజు దిమ్మెపై కొంత పతనకోణంతో పడిన కాంతికిరణం, బహిర్గత కిరణం ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయని నిరూపించండి.
లేదా
గాజు దిమ్మె గుండా ప్రయాణించే కాంతిపొందే విచలన కోణం ఎంత? దానిని కిరణ చిత్రంతో చూపండి.
జవాబు:
- ఒక గాజు దిమ్మె రెండు జతల సమాంతర భుజాలు కలిగి ఉండును.
- కాంతికిరణం, ఒక గాజు తలంపై పతనమైనపుడు అనగా విరళ యానకం నుండి సాంద్రతర యానకంలోకి ప్రయాణించుచున్నది.
- ఈ సందర్భంలో వక్రీభవన కోణం విలువ, పతన కోణం విలువ కన్నా తక్కువగా ఉంటుంది. కావున కాంతి కిరణం లంబంవైపుగా వంగును.
- గాజు దిమ్మెలోని వక్రీభవన కాంతి రెండవ సమాంతర ‘తలం నుండి బయటకు వచ్చు సందర్భంలో లంబానికి దూరంగా వంగును.
- దీనికి కారణం కాంతి సాంద్రతర యానకంలో నుండి విరళ యానకంలోకి ప్రయాణించునపుడు వక్రీభవన కోణం విలువ, పతన కోణం కన్నా ఎక్కువగా ఉండును.
ABCD – గాజుదిమ్మె
∠i – పతనకోణం ; ∠r – వక్రీభవన కోణం ; n – వక్రీభవన గుణకం
10th Class Physics 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం ½ Mark Important Questions and Answers
1. క్రింది వానిని జతపరచి, సమాధానం రాయుము.
1. వక్రీభవన గుణక సూత్రం P) \(\frac{v}{c}\)
2. వక్రీభవన గుణకం యొక్క విలువ Q) \(\frac{c}{v}\)
R) > 1
S) < 1
జవాబు:
1 – Q, 2 – R
2.
పై పటంలో చూపిన కృత్యంలో ఇమిడియున్న దృగ్విషయం ఏమిటి?
జవాబు:
సమతలాల వద్ద కాంతి వక్రీభవనం
3. కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రవేశించేటపుడు దేనిలో మార్పు వచ్చును?
జవాబు:
కాంతి వడి
4. “కాంతి కిరణం యానకం – A నుండి యానకం – B లోనికి వెళ్ళినపుడు లంబం వైపు వంగినది”. పై దత్తాంశం ప్రకారం ఏ యానకం సాంద్రతర యానకం?
జవాబు:
యానకం – B.
5.
ప్రక్కన చూపిన కాంతి కిరణం యొక్క పతన కోణం ఎంత?
జవాబు:
50° [∵ 90° = 40° = 50°]
6. శూన్యంలో కాంతి వేగం ఎంత?
జవాబు:
3 × 108 m/s
7. వక్రీభవన గుణకం యొక్క ప్రమాణం ఏమిటి?
జవాబు:
ప్రమాణాలు ఉండవు
8. గాజులో కాంతి వేగం 2 × 108 మీ./సె. అయిన గాజు యొక్క వక్రీభవన గుణకం ఎంత?
జవాబు:
9. ఒక యానకం యొక్క వక్రీభవన గుణకం 1.33 అయిన
జవాబు:
10. వక్రీభవన గుణకం యానకం
1.44 – A
1.71 – B
• పై ఏ యానకంలో కాంతి వేగం ఎక్కువ?
జవాబు:
యానకం – A
• పై ఏ యానకం యొక్క దృక్ సాంద్రత తక్కువ?
జవాబు:
యానకం – A
11. జతపరిచి సరియైన సమాధానం రాయుము.
వక్రీభవన గుణకం | యానకం |
a) 1.0003 | (1) వజ్రం |
b) 1.50 | (2) గాలి |
c) 2.42 | (3) బెంజీన్జ |
జవాబు:
a – 2, b – 3, c-1
12. క్రింది వానిలో ఏ వాక్యం సరియైనది?
వాక్యం a : నీటి యొక్క దృశా సాంద్రత కిరోసిన్ కన్నా తక్కువ.
వాక్యం b : కిరోసిన్ యొక్క పదార్ధ సాంద్రత నీటి కన్నా తక్కువ.
A) a
B) b
C) a మరియు b.
D) రెండూ కావు
జవాబు:
B) b
13. వక్రీభవన గుణకం ఆధారపడే అంశాలు ఏవి?
జవాబు:
పదార్థ స్వభావం, కాంతి తరంగదైర్ఘ్యం
14. క్రింది వానిలో సరియైనది ఏది?
c) రెండూ
జవాబు:
c) రెండూ
15. n1 = 1, n2 = 1.33 అయిన n21 విలువ ఎంత? ఆ యానకంలో కాంతి వేగం ఎంత?
జవాబు:
1.33
16. పతన కోణం (i), వక్రీభవన కోణం (r) ల మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
\(\frac{\sin i}{\sin r}\) = స్థిరాంకం
17. కాంతి విరళ యానకం నుండి సాంద్రతర యానకంలోనికి ప్రవేశించినపుడు
A) r < i
B) r > i
C) r = i
జవాబు:
A) r < i
18. స్నెల్ నియమంను రాయుము. వక్రీభవన గుణకం యానకం
జవాబు:
19. రెండు యానకాల వక్రీభవన గుణకాలకి, కాంతి వేగాలకి మధ్య సంబంధాన్ని రాయుము. ‘
జవాబు:
\(\frac{\mathbf{v}_{1}}{\mathbf{v}_{2}}\) = \(\frac{\mathrm{n}_{2}}{\mathrm{n}_{1}}\)
20. n1 = 1.33 అయితే \(\frac{\mathbf{v}_{1}}{\mathbf{v}_{2}}\) ఎంత?
జవాబు:
1.33
21. ‘కాంతి వక్రీభవన గుణకం దృష్ట్యా సరియైనది ఏది?
a) ∠i = ∠r
b) n1 sin i = n2 sin r
c) రెండూ
జవాబు:
b) n1 sin i = n2 sin r
22. సందిగ్ధ కోణం వద్ద వక్రీభవన కోణం ఎంత ?
జవాబు:
900
23. r= 90° అయితే పతన కోణంను ఏమని పిలుస్తారు?
జవాబు:
సందిగ్ధ కోణం
24. sin C విలువ ఎంత ?
జవాబు:
sin C = \(\frac{1}{\mathrm{n}_{21}}\) (లేదా) sin C = \(\frac{\mathrm{n}_{2}}{\mathrm{n}_{1}}\)
25. సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి ప్రయాణించే కాంతి కిరణానికి ఏ పతనకోణం వద్ద వక్రీభవన కిరణం యానకాలను వేరు చేసే తలం గుండా ప్రయాణిస్తుందో ఆ పతన కోణాన్ని సాంద్రతర యానకం యొక్క ………… అంటారు.
జవాబు:
సందిగ్ధ కోణం
26. సందిగ్ధ కోణం వద్ద వక్రీభవన కిరణం ఎలా ప్రయాణిస్తుంది?
జవాబు:
యానకాలు వేరు చేసే తలం గుండా
27. ఏ సందర్భంలో వక్రీభవన కోణం 90° అవుతుందో ఊహించి రాయుము.
జవాబు:
సందిగ్ధ కోణం వద్ద
28. Sin C = \(\frac{1}{\mathrm{n}_{12}}\) లో ‘C’ అనగానేమి?
జవాబు:
సందిగ్ధ కోణం
29. ‘సందిగ్ధ కోణం కన్నా పతనకోణం ఎక్కువైనపుడు యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతి కిరణం తిరిగి సాంద్రతర యానకంలోకి పరావర్తనం చెందుతుంది’. ఈ దృగ్విషయాన్ని ఏమంటారు?
జవాబు:
సంపూర్ణాంతర పరావర్తనం
30.
‘2’ పతన కిరణం యొక్క వక్రీభవన కిరణం ఏది?
జవాబు:
3
31.
పై పటంలో చూపిన ప్రయోగంలో పరిశీలింపబడే ముఖ్య కాంతి దృగ్విషయం ఏమిటి?
జవాబు:
సంపూర్ణాంతర పరావర్తనం
32. వేసవి మధ్యాహ్నం సమయంలో తారు రోడ్ పై దూరంగా నీరు కనిపించింది. కానీ అక్కడ నిజానికి నీరు లేదు. కారణం ఏమిటి?
జవాబు:
కాంతి సంపూర్ణాంతర పరావర్తనం
33. ఒకే యానకంలో వక్రీభవన గుణకం మారే సందర్భానికి ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
ఎండమావి ఏర్పడుట
34. ఎండమావిలో ఏర్పడే ప్రతిబింబం లక్షణాలేవి?
జవాబు:
మిథ్యా ప్రతిబింబం.
35. ఎండమావిని ఫోటో తీయగలమా?
జవాబు:
తీయగలం
36. వజ్రం యొక్క సందిగ్ధ కోణం (గాలి దృష్ట్యా) ఎంత?
జవాబు:
24.4°
37. వజ్రం మెరవడానికి కారణం ఏమిటి?
జవాబు:
వజ్రం సందిగ్ధ కోణం చాలా తక్కువ
38. వజ్రం మెరవడంలో ఇమిడి వున్న దృగ్విషయం ఏది?
జవాబు:
సంపూర్ణాంతర పరావర్తనం
39. సన్నని ఫైబర్ తీగలు కొన్ని కలిసి ఏర్పడేది?
a) హాట్ పైప్
b) టైట్ పైప్
c) లైట్ పైప్
d) బ్లాక్ పైప్
జవాబు:
c) లైట్ పైప్
40. సాధారణంగా ఆప్టికల్ ఫైబర్ వ్యాసార్ధం ఎంత వుంటుంది?
జవాబు:
1 మైక్రోమీటర్ (10-6 మీ.)
41. ఆప్టికల్ ఫైబర్ లో కాంతి ప్రయాణ మార్గం
a) సరళరేఖ
b) జిగ్ జాగ్
c) సర్పిలం
జవాబు:
b) జిగ్ జాగ్
42. ఆప్టికల్ ఫైబర్ ఒక వినియోగం రాయుము.
జవాబు:
సమాచార సాంకేతాలను ప్రసారం చేయడానికి
43. సంపూర్ణాంతర పరావర్తనానికి ఒక నిజజీవిత వినియోగం రాయుము.
జవాబు:
వజ్రం మెరుపు / ఎండమావి / ఆప్టికల్ ఫైబర్
44. రెండు సమాంతర తలాలను కలిగియుండి, దాని పరిసరాలలోని యానకం నుండి వేరు చేయబడివున్న ఒక పారదర్శక యానకం
a) పట్టకం
b) గాజు పలక
c) ఆప్టికల్ ఫైబర్
జవాబు:
b) గాజు పలక
45. గాజు వక్రీభవన గుణకం కనుగొనుటకు సూత్రం రాయుము.
జవాబు:
వక్రీభవన గుణకం =
46. Sin C = \(\frac{\mathrm{n}_{2}}{\mathrm{n}_{1}}\) (n1 = 1వ యానకం యొక్క వక్రీభవన గుణకం)
(n2 = 2వ యానకం యొక్క వక్రీభవన గుణకం)
దీనిలో ఏది సాంద్రతర యానకం?
జవాబు:
n1
47. నీటి పరంగా గాజు వక్రీభవన గుణకం 9/8. గాజు పరంగా నీటి వక్రీభవన గుణకం ఎంత?
జవాబు:
8/9
48. గాజు పలక ద్వారా వచ్చే కాంతి విచలన కోణం ఎంత?
జవాబు:
0°
49. గాజు యొక్క వక్రీభవన గుణకం ‘2’ అయిన గాజు యొక్క సందిగ్ధ కోణం ఎంత?
జవాబు:
30°
50. నక్షత్రాలు మిణుకుమిణుకుమనడానికి కారణం ఏమిటి?
జవాబు:
వాతావరణంలో వివిధ సాంద్రతలు గల పొరల వలన
51. ఒక గాజుపలక మందం 3 సెం.మీ. నిలువు విస్తాపనం 1 సెం.మీ. అయిన గాజుపలక వక్రీభవన గుణకం ఎంత?
జవాబు:
52. నీటిలో ఈదే చేపను తుపాకీతో కాల్చడం కష్టం. కారణం ఏమిటి?
జవాబు:
కాంతి వక్రీభవనం
సాధించిన సమస్యలు
1. కాంతి గాలి నుండి నీటిలోనికి ప్రయాణిస్తున్నపుడు నీటి యొక్క వక్రీభవన గుణకం 1.33 అయిన కాంతి నీటినుండి గాలిలోనికి ప్రయాణిస్తున్నపుడు వక్రీభవన గుణకం ఎంత?
సాధన:
గాలి వక్రీభవన గుణకం (n1) = 1
నీటి యొక్క వక్రీభవన గుణకం (n2) = 1.33
కాంతి నీటి నుంచి గాలిలోకి ప్రయాణిస్తున్నప్పుడు వక్రీభవన గుణకం = \(\frac{\mathrm{n}_{1}}{\mathrm{n}_{2}}\) = \(\frac{1}{1.33}\) = 0.75
2. వజ్రం వక్రీభవన గుణకం 2.42, గాజు వక్రీభవన గుణకం 1.5 అయిన సందిగ్ధకోణమును పోల్చండి.
(C = 24° వజ్రంకు) (C = 42° గాజుకు).
సాధన:
వజ్రం వక్రీభవన గుణకం (n1) = 2.42
10th Class Physics 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 1 Mark Bits Questions and Answers
సరియైన సమాధానమును గుర్తించండి.
1. వక్రీభవన గుణకానికి ప్రమాణాలు
A) సెంటీమీటర్
B) డయాప్టరు
C) డిగ్రీ
D) ప్రమాణాలు లేవు
జవాబు:
D) ప్రమాణాలు లేవు
2. టార్చ్, సెర్చ్ లైట్, వాహనాల హెడ్ లైట్ లో బల్బు ఉంచబడే స్థానం
A) పరావర్తకపు నాభి మరియు ధృవాల వద్ద
B) పరావర్తకం నాభి వద్ద
C) పరావర్తకం యొక్క వక్రతా కేంద్రం వద్ద
D) పరావర్తకం యొక్క నాభి మరియు కేంద్రం మధ్య
జవాబు:
B) పరావర్తకం నాభి వద్ద
3. ఒక పాత్రలోని నీటిలో నిర్దిష్ట కోణంతో ముంచబడిన పరీక్ష నాళికను ఒక ప్రత్యేక స్థానం నుండి చూచినపుడు పరీక్షనాళిక గోడ అద్దం వలె కనిపించడానికి కారణం ……. నోట్ : పరీక్షనాళికలో నీరు చేరరాదు.
A) పరావర్తనం
B) వక్రీభవనం
C) పరీక్షేపణం
D) సంపూర్ణాంతర పరావర్తనం
జవాబు:
C) పరీక్షేపణం
4. వివిధ పదార్ధ యానకాల వక్రీభవన గుణకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
పై వాటిలో దేనిలో కాంతివేగం ఎక్కువగా ఉంటుందో ఊహించండి.
A) సఫైర్
B) క్రౌన్ గాజు
C) మంచుముక్కలు
D) రూబీ
జవాబు:
C) మంచుముక్కలు
5. వస్తువును ఏ స్థానం వద్ద ఉంచినప్పుడు కుంభాకార కటకం అదే పరిమాణంలో తలక్రిందులైన నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచును?
A) C వద్ద
B) F వద్ద
C) F మరియు C ల మధ్య
D) F మరియు కటక దృక్ కేంద్రం మధ్య
జవాబు:
B) F వద్ద
6. 10 సెం.మీ. నాభ్యంతరం గల కుంభాకార కటకాన్ని నీటిలో ముంచితే దాని నాభ్యంతరం
A) పెరుగుతుంది
B) తగ్గుతుంది
C) మారదు
D) సున్నాకు చేరును
జవాబు:
A) పెరుగుతుంది
7. పటంలో సరిగా గుర్తించబడిన కోణాలు
A) ∠i మరియు ∠r
B) ∠i మరియు ∠e
C) ∠r మరియు ∠e
D) ∠i, ∠r మరియు ∠e.
జవాబు:
A) ∠i మరియు ∠r
8. నక్షత్రాలు మిణుకు మిణుకుమనడానికి కారణం ……………..
A) సంపూర్ణాంతర పరావర్తనం
B) పరిక్షేపణం
C) విక్షేపణం
D) వాతావరణంలో కాంతి వక్రీభవనం
జవాబు:
D) వాతావరణంలో కాంతి వక్రీభవనం
9. భావన ‘A’ : గాజు గ్లాసులోని నీటిలో ఉంచిన నిమ్మకాయ పరిమాణం, దాని అసలు పరిమాణం కంటే పెద్దగా కనిపిస్తుంది.
కారణం ‘R’: పతనకోణం విలువ, సందిగ్ధకోణం విలువకన్నా ఎక్కువ అయినపుడే సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది.
క్రింది వాటిలో ఏది సరైనది?
A) A సరియైనది కాని R తప్పు
B) A, R రెండూ సరైనవే, R, A కు సరైన వివరణ
C) A, R రెండూ సరైనవే, R, A కు సరైన వివరణ కాదు
D) A, R రెండూ తప్పు
జవాబు:
C) A, R రెండూ సరైనవే, R, A కు సరైన వివరణ కాదు
10. ఎండమావులు ఏర్పడటానికి ……. కారణం.
A) విక్షేపణం
B) పరిక్షేపణం
C) వ్యతికరణం
D) సంపూర్ణాంతర పరావర్తనం
జవాబు:
D) సంపూర్ణాంతర పరావర్తనం