These AP 10th Class Physical Science Chapter Wise Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం will help students prepare well for the exams.
AP Board 10th Class Physical Science 6th Lesson Important Questions and Answers పరమాణు నిర్మాణం
10th Class Physics 6th Lesson పరమాణు నిర్మాణం 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
క్రోమియం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని వ్రాయండి.
జవాబు:
క్రోమియం ఎలక్ట్రాన్ విన్యాసము : 1s²2s²2p63s²2p64s¹3d5 or [Ar] 4s¹3d5.
ప్రశ్న 2.
ఇనుప కడ్డీని క్రమంగా అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేయటాన్ని పరిశీలించినప్పుడు ఏ ఏ రంగులు కనబడుతాయి?
జవాబు:
ఉష్ణోగ్రత పెరుగుతున్న కొలదీ ఇనుప కడ్డీపై ఎరుపు, నారింజ, పసుపు, నీలము లేక తెల్లని రంగులు ఏర్పడును.
ప్రశ్న 3.
1s² 2s¹ 2p4 అనే ఎలక్ట్రాన్ విన్యాసం రాయడంలో ఏ నియమం ఉల్లంఘించబడింది ? కారణాలు తెల్పండి.
జవాబు:
1s² 2s¹ 2p4 అనే ఎలక్ట్రాన్ విన్యాసం రాయడంలో ఆఫ్ భౌ నియమం ఉల్లంఘించబడినది.
కారణం : ఈ నియమం ప్రకారం 25 నిండిన తరువాతనే 22 కి నింపాలి.
ప్రశ్న 4.
మెగ్నీషియం (Z = 12) మూలక పరమాణువులో బాహ్య కర్పరం యొక్క సంకేతం (Bymbol)ను వ్రాయండి. మెగ్నీషియం బాహ్య కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి?
జవాబు:
మెగ్నీషియంలో బాహ్య కర్పరం (3వ కర్పరం) సంకేతం M మెగ్నీషియం బాహ్య కర్పరంలోని ఎలక్ట్రాన్ల సంఖ్య = 2
ప్రశ్న 5.
స్కాండియమ్ (Sc) పరమాణువులో 21వ ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటమ్ సంఖ్యల విలువలు కింది పట్టికలో ఇవ్వబడినాయి. అయితే స్కాండియమ్ పరమాణువులోని 20వ ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటమ్ సంఖ్యల విలువలను పట్టిక రూపంలో వ్రాయండి.
జవాబు:
ప్రశ్న 6.
n = 3 అయినపుడు కర్పరంలో ఉండే ఆర్బిటాళ్ళను తెల్పి, ఆ కర్పరంలో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్యను రాయండి.
జవాబు:
n = 3 అయినప్పుడు కర్పరంలో ఉండే ఆర్బిటాళ్ళు s, p, d. ఆ కర్పరంలో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య 18.
ప్రశ్న 7.
ఎలక్ట్రాన్ ను కనుగొన్నదెవరు? ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం, ద్రవ్యరాశులను తెల్పండి.
జవాబు:
ఎలక్ట్రాన్ ను కనుగొన్నది J.J. థామ్సన్. దీని సంకేతం 0-1e.
ఎలక్ట్రాన్ ఆవేశం ఋణావేశం. ఆవేశ పరిమాణం – 1.602 × 10-19 కూలుంట్లు. ద్రవ్యరాశి 9.1 × 10-31kg.
ప్రశ్న 8.
ప్రోటాన్ ను కనుగొన్నది ఎవరు? ప్రోటాన్ యొక్క ఆవేశం, ద్రవ్యరాశులను తెల్పండి.
జవాబు:
ప్రోటాన్ ను కనుగొన్నది “గోల్డ్ స్టీన్.” దీని సంకేతం 1+1P. ప్రోటాన్ ధనావేశం కలిగి ఉండును. దీని ఆవేశ పరిమాణం +1.602 × 10-19 కూలుంట్లు. ద్రవ్యరాశి 1.675 × 10-27kg.
ప్రశ్న 9.
న్యూట్రాన్ ను కనుగొన్నది ఎవరు? న్యూట్రాన్ యొక్క ఆవేశం, ద్రవ్యరాశులను తెల్పండి.
జవాబు:
న్యూట్రాన్ ను కనుగొన్నది చాడ్విక్. దీని సంకేతం 10n.
ఆవేశం లేదు. ద్రవ్యరాశి 1.675 × 10-27 kg.
ప్రశ్న 10.
పరమాణు నమూనా అనగానేమి?
జవాబు:
పరమాణువులో ధనావేశాలు, ఋణావేశాలు ఏ విధంగా పంపిణీ జరిగినవో తెలియజేసే దానిని “పరమాణు నమూనా” అంటారు.
ప్రశ్న 11.
మొట్టమొదటి పరమాణు నమూనాను ఏమని పిలుస్తారు?
జవాబు:
మొట్టమొదటి థామ్సన్ పరమాణు నమూనాను “పుచ్చకాయ నమూనా” అని పిలుస్తారు.
ప్రశ్న 12.
రూథర్ ఫోర్డ్ పరమాణు నమూనాను ఏమని పిలుస్తారు?
జవాబు:
రూథర్‌ఫోర్డ్ పరమాణు నమూనాను “గ్రహమండల నమూనా” అని పిలుస్తారు.
ప్రశ్న 13.
బోర్ పరమాణు నమూనా ఏ సూత్రం ఆధారంగా నిర్ధారించబడినది?
జవాబు:
బోర్ పరమాణు నమూనా “మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం” ఆధారంగా నిర్ధారించబడినది.
ప్రశ్న 14.
స్థిర కక్ష్యలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:
స్థిర కక్ష్యలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త “నీల్స్ బోర్”.
ప్రశ్న 15.
ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం అనగానేమి?
జవాబు:
ఎలక్ట్రాన్ అధిక శక్తి గల కక్ష్య నుండి తక్కువ శక్తి గల కక్ష్యలోకి దూకినపుడు విడుదలయ్యే వికిరణపు శక్తి (E), వికిరణపు పౌనఃపున్యానికి (υ) అనులోమానుపాతంలో ఉంటుంది. E ∝ υ (E = hυ)
ప్రశ్న 16.
ప్లాంక్ స్థిరాంకం విలువ మరియు ప్రమాణాలు వ్రాయుము.
జవాబు:
ప్లాంక్ స్థిరాంకం విలువ h = 6.626 x 10-34 బౌల్. సెకను లేదా h = 6.626 x 10-27 ఎర్గ్. సెకన్.
ప్రశ్న 17.
దృగ్గోచర వర్ణపటం అనగానేమి?
జవాబు:
మానవుని కంటితో నేరుగా చూడగల రంగుల సమూహాన్ని దృగ్గోచర వర్ణపటం అంటారు. దీనిని VIBGYOR తో తెలియజేస్తారు.
ప్రశ్న 18.
దృగ్గోచర వర్ణపటంలో ఎక్కువ శక్తి గల రంగు ఏది?
జవాబు:
ఏ తరంగానికైనా శక్తి అనేది పౌనఃపున్యంపై ఆధారపడును. ఊదా రంగు అధిక పౌనఃపున్యం కలిగి ఉండుట వలన, ఎక్కువ శక్తిని కలిగి ఉండును.
ప్రశ్న 19.
దృగ్గోచర వర్ణపటంలో ఎక్కువ తరంగదైర్ఘ్యం గల తరంగాలేవి?
జవాబు:
దృగ్గోచర వర్ణపటంలో అధిక తరంగదైర్ఘ్యం గల తరంగాలు ఎరుపురంగు తరంగాలు. ఇవి అధిక దూరం ప్రయాణించగలవు.
ప్రశ్న 20.
విద్యుదయస్కాంత వర్ణపటంలో ఎక్కువ పౌనఃపున్యం కలిగిన శక్తివంతమైన వికిరణాలేవి?
జవాబు:
విద్యుదయస్కాంత వర్ణపటంలో ఎక్కువ పౌనఃపున్యం కలిగినవి కాస్మిక్ వికిరణాలు. వీటి తర్వాత Y – వికిరణాలు. వీటికి అత్యధిక శక్తి ఉండును. ఇవి ప్రమాదకరమైన వికిరణాలు.
ప్రశ్న 21.
విద్యుదయస్కాంత వికిరణాలలో ఎక్కువ తరంగదైర్ఘ్యం గల వికిరణాలేవి?
జవాబు:
విద్యుదయస్కాంత వర్ణపటంలో ఎక్కువ తరంగదైర్ఘ్యం గల తరంగాలు ప్రసార పట్టీలు. వాటి తర్వాత రేడియో తరంగాలు. ఇవి తక్కువ శక్తి గలవి. విశ్వంలో ఏ ప్రదేశానికైనా వెళ్ళిరాగలవు.
ప్రశ్న 22.
విద్యుదయస్కాంత వర్ణపటంలోని వికిరణాల వేగాలను తెల్పుము.
జవాబు:
c = υλ; c = కాంతి వేగం, υ = పౌనఃపున్యం, λ = తరంగదైర్ఘ్యం. ఇవి 3 × 108 మీ/సె వేగంతో ప్రయాణిస్తాయి.
ప్రశ్న 23.
నీబోర్ పరమాణు నమూనా వివరించి హైడ్రోజన్ వర్ణపటాన్ని వివరించటాన్ని నీవు ఎలా అభినందిస్తావు?
జవాబు:
నీల్స్ బోర్ పరమాణు నమూనా, వివరించడంలో విజయం సాధించడమే కాకుండా, హైడ్రోజన్ వర్ణపటాన్ని చక్కగా వివరించగలిగాడు. కావున నీల్స్ బోర్ చేసిన కృషిని ప్రశంసించవలసియున్నది.
ప్రశ్న 24.
పదార్థం విభజింప శక్యం కాదు అనే భావన నుండి పరమాణు నమూనాలను వివరించే స్థాయికి శాస్త్రాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల కృషిని ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
పదార్థం విభజింప శక్యం కాని కణాలతో నిర్మితమైందనే డాల్టన్ భావన నుండి J.J. థామ్సన్, రూథర్‌ఫోర్డ్, నీల్స్ బోర్, సోమర్ ఫెల్డ్, జోడింగర్ మొదలైన అనేకమంది కృషి ఫలితంగా సైన్స్ విజ్ఞానం క్రొత్త పుంతలు తొక్కింది. వారి కృషిని మిక్కిలి ప్రశంసించవలసియున్నది.
ప్రశ్న 25.
మాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం యొక్క అనేక రంగాలలోని ఉపయోగాలను ఎలా అభినందిస్తావు?
జవాబు:
ఆధునిక భౌతికశాస్త్ర పితామహుడిగా గుర్తించబడిన మాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ఆధారంగా అనేక వస్తువులు పనిచేస్తున్నాయి. వాటిలో α, β, γ వికిరణాలను అర్థం చేసుకోవడానికి, లేజర్లు, కంప్యూటర్లు, సి.డి.లు, రసాయన బంధాల (D.N.A.) గురించి తెలుసుకోవడానికి క్వాంటం సిద్ధాంతం ఉపయోగపడినది. కాబట్టి మా ప్లాంక్ చేసిన కృషిని అభినందించవలసి ఉన్నది.
ప్రశ్న 26.
దీపావళి పండుగ నాడు నీవు కాల్చిన టపాసుల నుండి రంగురంగుల కాంతి వెలువడటానికి కారణం ఏమిటి?
జవాబు:
దీపావళి పండుగనాడు కాల్చిన టపాసుల నుండి రంగురంగుల కాంతి వెలువడటానికి కారణం వాటిలో ఒక్కొక్క పరమాణువు ఒక్కొక్క కాంతిని వెదజల్లుతుంది.
ప్రశ్న 27.
పసుపు వర్ణంలో కాంతిని వెదజల్లే పరమాణువులేవి?
జవాబు:
సోడియం మూలకాన్ని వేడిచేసినపుడు పసుపు వర్ణంలో కాంతిని ఉద్గారించును.
ప్రశ్న 28.
ట్రాఫిక్ సిగ్నల్, సెల్ టవర్లు, వాహనాల వెనుక ఎర్రని లైట్ ను ఎందుకు అమర్చుతారు?
జవాబు:
దృగ్గోచర వర్ణపటంలో ఎక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతి ఎరుపు. ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న కాంతి ఎక్కువ దూరం ప్రయాణించును. కాబట్టి ఎక్కువ దూరంలో ఉన్న వ్యక్తి కూడా స్పష్టంగా చూడగలడు.
ప్రశ్న 29.
γ – వికిరణాలను వైద్యరంగంలో ఎందుకు వాడతారు?
జవాబు:
γ- వికిరణాలను కేన్సర్ కణుతులను నిర్మూలించటానికి కీమోథెరపి చికిత్సలో వాడతారు.
ప్రశ్న 30.
X – కిరణాలను వైద్యరంగంలో ఎందుకు వాడతారు?
జవాబు:
- X – కిరణాలు రెండు రకాలు. 1) కఠిన X – కిరణాలు 2) మృదు X – కిరణాలు.
- మృదు X – కిరణాలను వైద్యరంగంలో రోగాన్ని నిర్ధారించడానికి, రోగచికిత్సకు వాడతారు.
ప్రశ్న 31.
మైక్రో తరంగాల ఉపయోగాలేవి?
జవాబు:
సెల్ ఫోన్, రాడార్లు, మైక్రో ఓవెన్లు మైక్రో తరంగాల ఆధారంగా పనిచేస్తాయి.
ప్రశ్న 32.
ఎలక్ట్రాన్ విన్యాసం రాయటానికి ఉపయోగపడే నియమాలేవి?
జవాబు:
ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయటానికి ఉపయోగపడే నియమాలు మూడు :
- ఆఫ్ బౌ నియమం
- హుండ్ నియమం
- పౌలీవర్జన నియమం
ప్రశ్న 33.
ఎలక్ట్రాన్ విన్యాసం రాయటానికి మాదిరి పటం లాగా ఉపయోగపడేది ఏది?
జవాబు:
ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సులువుగా రాయటానికి ఉపయోగపడేది మాయిలర్ పటము.
ప్రశ్న 34.
సమశక్తి గల ఆర్బిటాల్ లో ఎలక్ట్రాన్లు నింపవలసి వచ్చినపుడు ఉపయోగపడే నియమం ఏది?
జవాబు:
హుండ్ నియమం
ప్రశ్న 35.
వర్ణపటంలోని సూక్ష్మరేఖలను పరిశీలించటానికి ఉపయోగపడే పరికరం ఏది?
జవాబు:
అధికశక్తి గల వర్ణపట దర్శిని (Spectroscope).
ప్రశ్న 36.
రేఖా వర్ణపటంలో ఉపరేఖలుగా విడిపోవటాన్ని బోర్ నమూనా వివరించగలిగినదా?
జవాబు:
రేఖా వర్ణపటంలో ఉపరేఖలుగా విడిపోవటాన్ని బోర్ నమూనా వివరించలేదు. సోమర్ ఫెల్డ్ నమూనా వివరించగలిగినది.
ప్రశ్న 37.
తరంగదైర్ఘ్యము అనగానేమి?
జవాబు:
ఒక తరంగంలో రెండు వరుస శృంగాల మధ్య దూరం లేదా రెండు వరుస ద్రోణుల మధ్య దూరంను ఆ తరంగం యొక్క తరంగదైర్ఘ్యం (λ) అంటాం.
ప్రశ్న 38.
విద్యుదయస్కాంత తరంగం యొక్క పటం గీయుము. (లేదా) విద్యుత్ మరియు అయస్కాంత తరంగాలు ఒకదానికొకటి లంబంగా ఉండి, తరంగ వ్యాప్తి దిశకు లంబంగా కంపిస్తూ ఉంటాయి. దీనిని పటరూపంలో చూపించండి. .
జవాబు:
ప్రశ్న 39.
పౌనఃపున్యం అనగానేమి?
జవాబు:
ఒక సెకను కాలంలో ఒక బిందువు నుండి ప్రయాణించిన తరంగాల సంఖ్యను పౌనఃపున్యం (υ) అంటారు.
ప్రశ్న 40.
విద్యుదయస్కాంత వర్ణపటం అనగానేమి?
జవాబు:
విద్యుదయస్కాంత తరంగాలు విస్తృత వైవిధ్యం గల పౌనఃపున్యాల సముదాయం. విద్యుదయస్కాంత తరంగాల మొత్తం పౌనఃపున్యాల సముదాయాన్నే విద్యుదయస్కాంత వర్ణపటం అంటారు.
ప్రశ్న 41.
ప్లాంక్ సిద్ధాంత ప్రతిపాదనలోని విశిష్టత ఏమిటి?
జవాబు:
విద్యుదయస్కాంత శక్తి శోషణం లేదా ఉద్గారం అనేది అవిచ్ఛిన్న రూపంలో కాకుండా, నిర్దిష్ట విలువలు గల భాగాలుగా ఉంటుంది.
ప్రశ్న 42.
పరమాణు వర్ణపటాలలోని రేఖల ఉపయోగమేమిటి?
జవాబు:
వేలిముద్రలను బట్టి మనుషులను గుర్తించినట్లుగానే పరమాణు వర్ణపటాల్లోని రేఖలను బట్టి ఆయా పరమాణువులను తేలికగా గుర్తించవచ్చు.
ప్రశ్న 43.
భూ స్థాయి అనగానేమి?
జవాబు:
ఎలక్ట్రాన్ యొక్క ప్రాథమిక శక్తి స్థాయిని భూస్థాయి అంటారు.
ప్రశ్న 44.
ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించినపుడు ఏమి జరుగుతుంది?
జవాబు:
ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించినపుడు అది ఎక్కువ శక్తి స్థాయికి చేరుతుంది. అప్పుడు ఎలక్ట్రాన్ ఉత్తేజిత స్థాయిలో ఉన్నదని అంటారు.
ప్రశ్న 45.
బోర్ పరమాణు నమూనాలోని లోపాలేవి?
జవాబు:
- బోర్ పరమాణు నమూనా, రేఖా వర్ణపటంలోని రేఖలు కొన్ని ఉపరేఖలుగా విడిపోవడాన్ని వివరించలేకపోయింది.
- ఒకటికన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు గల పరమాణువుల వర్ణపటాన్ని వివరించలేకపోయింది.
ప్రశ్న 46.
పరమాణు నిర్మాణంలో సోమర్ ఫెల్డ్ పాత్ర ఏమిటి?
జవాబు:
రేఖా వర్ణపటంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవడాన్ని వివరించేందుకు సోమర్ ఫెల్డ్ బోర్ నమూనాని స్వల్పంగా ఆధునీకరించాడు. అతను దీర్ఘవృత్తాకార కక్ష్య అనే భావనను ప్రవేశపెట్టినాడు.
ప్రశ్న 47.
‘ఆర్బిటాల్’ అనగానేమి?
జవాబు:
పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ కనుగొనగలిగే సంభావ్యత ఏ ప్రాంతంలో అయితే అధికంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఆర్బిటాల్ అంటారు.
ప్రశ్న 48.
క్వాంటం సంఖ్యలు అనగానేమి?
జవాబు:
పరమాణువులోని ప్రతి ఎలక్ట్రాన్ ను n, l, ml అనే మూడు సంఖ్యల సమితులతో సూచిస్తారు. ఈ సంఖ్యలనే క్వాంటం సంఖ్యలు అంటారు.
ప్రశ్న 49.
క్రింది పట్టికను పూరించి, ఏ నియమం ప్రకారం పూరించావో రాయుము.
జవాబు:
పై పట్టికను పూరించడానికి నేను ఉపయోగించిన సూత్రం (2l + l).
ప్రశ్న 50.
ఎలక్ట్రాన్ విన్యాసం అనగానేమి?
జవాబు:
పరమాణువులోని కర్పరాలు, ఉపకర్పరాలు మరియు ఆర్బిటాళ్ళలో ఎలక్ట్రాన్ల పంపిణీని ఎలక్ట్రాన్ విన్యాసం అంటారు.
ప్రశ్న 51.
పౌలీవర్జన నియమాన్ని రాయుము.
జవాబు:
ఒకే పరమాణువుకి చెందిన ఏ రెండు ఎలక్ట్రాన్లకి నాలుగు క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు.
ప్రశ్న 52.
ఆఫ్ బౌ నియమాన్ని రాయుము.
జవాబు:
పరమాణువు భూస్థాయిలో ఉన్నపుడు ఎలక్ట్రానులు అతి తక్కువ శక్తి కలిగిన ఆర్బిటాల్ లో చేరుతూ, అలా మొత్తం ఎలక్ట్రానుల సంఖ్య పరమాణు సంఖ్యకి సమానం అయ్యేవరకు నిండేలా దాని ఎలక్ట్రాన్ విన్యాసం నిర్మించబడుతుంది.
ప్రశ్న 53.
హుండ్ నియమం రాయుము.
జవాబు:
ఈ నియమం ప్రకారం సమానశక్తి కలిగిన అన్ని ఖాళీ ఆర్బిటాళ్ళు ఒక్కొక్క ఎలక్ట్రాన్ చే ఆక్రమించబడిన తరువాతనే ఎలక్ట్రాన్లు జతగూడడం ప్రారంభిస్తాయి.
ప్రశ్న 54.
3s, ap, 28, 4s, 3p, 1s మరియు 3d ఆర్బిటాళ్ళను వాటి ఆరోహణ క్రమంలో వ్రాయండి.
జవాబు:
1s < 2s < 3s, 3p < 4s < 3d
ప్రశ్న 55.
K, L, M మరియు N శక్తి స్థాయిలను వాటి శక్తి విలువల ఆరోహణ క్రమంలో రాయండి.
జవాబు:
K
ప్రశ్న 56.
ఒక ఎలక్ట్రాన్ శక్తిని గ్రహిస్తే ఏం జరుగుతుంది?
జవాబు:
ఒక ఎలక్ట్రాన్ శక్తిని గ్రహిస్తే అది అధిక శక్తి స్థాయికి లేదా ఉత్తేజిత స్థాయికి చేరును.
10th Class Physics 6th Lesson పరమాణు నిర్మాణం 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
సోడియం మూలక పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసం 1s²2s²2p63s¹. ఇది ఇచ్చే సమాచారం ఏమి?
జవాబు:
- దీని పరమాణు సంఖ్య – 11
- ఇది S – బ్లాకు మూలకం
- ఇది 3వ పీరియడకు చెందినది
- ఇది 1వ గ్రూపునకు చెందినది.
- ఇది ఒక లోహం
- దీని వేలన్సీ (సంయోజకత) – 1
- ఇది ఏక ధనాత్మక అయానను ఏర్పరుస్తుంది.
ప్రశ్న 2.
3d మరియు 4s లలో దేనికి (n+1) విలువ ఎక్కువ ? వివరింపుము.
జవాబు:
- 3d మరియు 4s లలో 3d యొక్క (n+1) విలువ ఎక్కువ.
- 3d యొక్క n + 1 విలువ = 3 + 2 = 5
4s యొక్క n+1 విలువ = 4 + 0 = 4
కావున 4s కన్నా 3d యొక్క శక్తి ఎక్కువ.
ప్రశ్న 3.
ఒక ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉండగలవు అని తెలిపే నియమం పేరు తెలిపి, వివరించండి.
జవాబు:
పౌలీవర్జన నియమం
ఒక ఆర్బిటాల్ లోని ఏ రెండు ఎలక్ట్రాన్లకు నాలుగు క్వాంటం సంఖ్యలు సమానం కావు.
ప్రశ్న 4.
ఒక పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం గురించి వివరించడానికి ఉపాధ్యాయుడు నల్లబల్లపై nlx అని రాశాడు. దానిని చూసినప్పుడు విద్యార్థి మదిలో ఏ ఏ ప్రశ్నలు ఉదయించే అవకాశం ఉంది ? ఏవైనా రెండు ప్రశ్నలను రాయండి.
జవాబు:
- n, l, x అక్షరాలు పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసానికి సంబంధించిన ఏ ఏ అంశాలను సూచిస్తాయి?
- nlx ఆధారంగా పరమాణువులోని ఎలక్ట్రాన్ స్థానాన్ని తెలుసుకోవచ్చా?
ప్రశ్న 5.
పరమాణు సంఖ్య 11 గల మూలక పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయండి. ఈ ఎలక్ట్రాన్ విన్యాసం రాయడంలో మీరు. పాటించిన సూత్రాలు, నియమాల పేర్లను తెల్పండి.
జవాబు:
పాటించిన నియమాలు :
ఆఫ్భౌ నియమం, హుండ్ నియమం, పౌలీవర్జన నియమం
ప్రశ్న 6.
“ఎలక్ట్రాన్ ‘3p’ ఆర్బిటాల్ నిండిన తర్వాత ‘3d’ లోకి కాకుండా ‘4s’ లోకి వెళ్తుంది.” దీనికి గల కారణం వివరించండి.
జవాబు:
(n+ l) విలువల ఆధారంగా 3d ఆర్బిటాల్ శక్తి విలువ 3 + 2 = 5. 4s ఆర్బిటాల్ శక్తి విలువ 4 + 0 = 4. 3d ఆర్బిటాల్ కన్నా 4వ ఆర్బిటాల్ శక్తి తక్కువ. ఆఫ్ భౌ నియమం ప్రకారం ఎలక్ట్రాన్ తక్కువ శక్తి గల ఆర్బిటాల్ లోకి ముందుగా చేరుతుంది. కనుక 3p ఆర్బిటాల్ నిండిన తర్వాత ఎలక్ట్రాన్ ‘3d’ లోకి కాకుండా 48 లోకి వెళ్తుంది.
ప్రశ్న 7.
“సమశక్తి ఆర్బిటాళ్ళలో ఎలక్ట్రాన్ల అమరిక” ను తెలియజేసే నియమాన్ని వివరించండి.
జవాబు:
హుండ్ నియమం ప్రకారం సమశక్తి ఆర్బిటాళ్ళలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ చేరిన తర్వాతే జతగూడడం జరుగుతుంది.
ఉదా : కార్బన్ ఎలక్ట్రాన్ విన్యాసము 1s² 2s² 2p²
చివరి రెండు ఎలక్ట్రాన్లు వేరు వేరు p ఆర్బిటాళ్ళని ఆక్రమిస్తాయి.
ప్రశ్న 8.
Na+, Cl-1 ల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలను రాయండి.
జవాబు:
ప్రశ్న 9.
పరమాణువుకు, వర్ణపటానికి సంబంధమేమి?
జవాబు:
మూలకాలను వేడిచేసినపుడు అవి శక్తిని కాంతి రూపంలో విడుదల చేస్తాయి. ఈ శక్తిని పట్టకంపై పడేలా చేస్తే తెరపై రంగు గీతలతో వర్ణపటం ఏర్పడును. ప్రతి మూలకం ఒక్కొక్క ప్రత్యేక రంగులు గల గీతలను తెరపై ఏర్పరచును. ఈ రంగుల గీతలను మానవుని వేలి ముద్రలతో పోల్చవచ్చు. ఏ ఇద్దరి మానవుల వేలి ముద్రలూ ఒకేలా ఉండవు, అలానే ఏ రెండు మూలకాల రేఖావర్ణపటంలో ఒకే రంగుల గీతలు ఉండవు.
ఉదా : హైడ్రోజన్ – పింక్ రంగు గీతలు
క్యూప్రిక్ క్లోరైడ్ – ఆకుపచ్చ రంగు
స్ట్రాన్షియం రైడ్ – ఎరుపు రంగు
ఈ రంగులనుబట్టి పదార్థంలోని పరమాణువుల ఉనికిని తెలుసుకొంటారు.
ప్రశ్న 10.
కాపర్, క్రోమియం, ఎలక్ట్రాన్ విన్యాసం రాయండి.
జవాబు:
1) క్రోమియం 24Cr యొక్క పరమాణు సంఖ్య = 24
ఎలక్ట్రాన్ విన్యాసం [Ar] 4s¹ 3d5
2) కాపర్ యొక్క 29Cu యొక్క పరమాణు సంఖ్య = 29
ఎలక్ట్రాన్ విన్యాసం [Ar] 4s¹ 3d10
ప్రశ్న 11.
సమశక్తి గల ఆర్బిటాళ్ళు అనగానేమి?
జవాబు:
ఏ పరమాణు ఆర్బిటాళ్ళు సమాన శక్తి కలిగి ఉండునో ఆ ఆర్బిటాళ్లను సమశక్తి గల ఆర్బిటాళ్ళు అంటారు.
ఉదా 1 : p – ఆర్బిటాళ్లు
p – ఆర్బిటాళ్ళలోని px, py, pz. మూడింటికి సమాన శక్తి ఉండును.
ఉదా 2 : d – ఆర్బిటాళ్ళు
d ఉపస్థాయిలోని ఐదు ఆర్బిటాళ్ళు ఒకే శక్తిని కలిగి ఉండును.
10th Class Physics 6th Lesson పరమాణు నిర్మాణం 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
హుండ్ నియమాన్ని ఒక ఉదాహరణతో వివరించండి.
జవాబు:
హుండ్ నియమం :
ఈ నియమం ప్రకారం సమాన శక్తి కలిగిన అన్ని ఖాళీ ఆర్బిటాళ్ళు ఒక్కొక్క ఎలక్ట్రాన్ చే ఆక్రమింపబడిన తర్వాతనే ఎలక్ట్రాన్లు జతగూడడం ప్రారంభిస్తాయి.
కార్బన్ పరమాణు సంఖ్య Z = 6. ఎలక్ట్రాన్ విన్యాసం 1s²2s²2p² ఇందులో మొదటి నాలుగు ఎలక్ట్రాన్లు 1s మరియు 2వ ఆర్బిటాళ్ళలోకి చేరతాయి. తరువాత రెండు ఎలక్ట్రానులు వేరు వేరు 22 ఆర్బిటాళ్ళని ఆక్రమిస్తాయి. ఆ రెండు ఎలక్ట్రానుల స్పిన్ ఒకేవిధంగా ఉంటుంది.
ప్రశ్న 2.
పట్టికలో ఇచ్చిన సమాచారం ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానం వ్రాయుము.
i) 4వ ప్రధాన కక్ష్యలో గల m, కు ఎన్ని విలువలు కలవు? అవి ఏవి?
జవాబు:
1) 4వ ప్రధాన కక్ష్యలో గల m, కు గల విలువలు = 16 అవి
4వ ఆర్బిటాల్ కి m, విలువల సంఖ్య = 1 [0]
4p ఆర్బిటాల్ కి m విలువల సంఖ్య = 3 [-1, 0, 1]
4d ఆర్బిటాల్ కి m, విలువల సంఖ్య = 5 [-2, -1, 0, 1, 2]
4f ఆర్బిటాల్ కి m, విలువల సంఖ్య =76-3, -2, -1, 0, 1, 2, 3]
మొత్తం m, విలువల సంఖ్య = 16
ii) n = 3, l = 1 అయిన ఉపకక్ష్యలో గల ఎలక్ట్రాన్ ml విలువలు రాయుము.
జవాబు:
n = 3, l = 1 అయిన ఉపకక్ష్యలో గల ఎలక్ట్రాన్ ml విలువలు = -1, 0, 1.
iii) ‘N’ కర్పరం, ప్రధాన క్వాంటం సంఖ్య విలువ వ్రాసి, ఈ కర్పరంలో గల ఉపకర్పరాలను వ్రాయుము.
జవాబు:
‘N’ కర్పరం ప్రధాన క్వాంటం సంఖ్య విలువ = 4 ‘N’ కర్పరంలో ఉపకర్పరాలు = 4s, 4p, 4d, 4f.
iv) పై పట్టికలోని ml విలువలను పరిశీలించి ml మరియు l మధ్యగల సంబంధాన్ని తెలిపే ఫార్ములా వ్రాయుము.
జవాబు:
ml మరియు l మధ్య సంబంధం ⇒ m = 2l + 1.
ప్రశ్న 3.
క్రింది క్వాంటం సంఖ్యల విలువల పట్టికను పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
i) గోళాకృతి కల్గిన ఉపకర్పరాన్ని సూచించు ‘l’ విలువ ఎంత ? ఆ ఉపకర్పరం సంకేతం రాయండి.
ii) l = 2 కు ఎన్ని ‘ml‘ విలువలు ఉంటాయి ? అవి ఏవి?
iii) l = 1 ఉపకర్పరంలోని ఆర్బిటాళ్ళ సంకేతాలు రాయండి.
iv) l = 2 ఉపకర్పరం ఏ ఆకృతిని కల్గి ఉంటుంది? ఈ ఉపకర్పరంలో గరిష్ఠంగా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండగలవు?
జవాబు:
i) l = 0, ఉపకర్పరం – ‘S’.
ii) l = 2 కు m, విలువలు 5 ఉంటాయి. అవి : -2, -1, 0, 1, 2.
iii) l = 1 అయిన ఉప కర్పరాల సంకేతాలు px, py, pz.
iv) l = 2 ఉప కర్పరం డబుల్ డంబెల్ ఆకృతి కల్గి ఉంటుంది. ఈ ఉపకర్పరంలో గరిష్ఠంగా 10 ఎలక్ట్రాన్లు ఉంటాయి.
ప్రశ్న 4.
ఆర్బిటాళ్ల శక్తి క్రమాలను చూపి, మాయిలర్ పటం గీయుము. (లేదా) ఆర్బిటాళ్ళ (n+1) విలువ పెరిగే క్రమాన్ని సూచించే పటాన్ని గీయండి.
(లేదా)
ఆరోహణక్రమంలో పరమాణు ఆర్బిటాళ్ళ వివిధ శక్తి స్థాయిలను చూపే మాయిలర్ పటాన్ని గీయుము.
జవాబు:
ఆర్బిటాళ్ల శక్తి క్రమాలు :
1s < 2s < 2p < 3s < 3p < 4s < 3d< 4p< 5s < 4d < 5p < 6s < 4f < 5d < 6p <7s < 5f < 6d <7p < 8s.
ప్రశ్న 5.
బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనాను, దాని పరిమితులను వ్రాయండి.
(లేదా)
బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనాలోని ప్రతిపాదనలు మరియు పరిమితులు రాయండి.
జవాబు:
బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనా :
- పరమాణువులో ఎలక్ట్రానులు, కేంద్రకం నుండి నిర్దిష్ట దూరాలలో ఉన్న నియమిత శక్తి స్థాయిలలో లేదా స్థిర కర్పరాలలో వుంటాయి.
- ఎలక్ట్రాన్ తక్కువ శక్తి స్థాయి (భూస్థాయి) నుండి ఎక్కువ శక్తిస్థాయి (ఉత్తేజిత స్థాయి) లోకి చేరినపుడు శక్తిని గ్రహిస్తుంది. అదేవిధంగా ఎక్కువ శక్తి స్థాయి నుండి తక్కువ శక్తి స్థాయికి దూకినప్పుడు శక్తిని విడుదల చేస్తుంది.
- పరమాణువులో గల ఎలక్ట్రానులకు నిర్దిష్టమైన శక్తి విలువలు ఉంటాయి. అవి E1, E2, E3 ……. అంటే ఎలక్ట్రానుల శక్తి క్వాంటీకరణం చెందుతుంది. ఈ శక్తులకు సంబంధించిన స్థాయిలను స్థిర స్థాయిలు అని, వీటికుండే శక్తి విలువలను శక్తి స్థాయిలు అని అంటారు.
పరిమితులు :
బోర్ పరమాణు నమూనా, రేఖా వర్ణపటంలోని రేఖలు కొన్ని ఉపరేఖలుగా విడిపోవటాన్ని వివరించలేకపోయింది.
ప్రశ్న 6.
ఒక పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము ఈ విధంగా ఉంది. 1s² 2s² 2p²
అ) ఇది ఏ మూలక పరమాణువును సూచిస్తున్నది?
ఆ) చిట్టచివరి ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్ లో ఉన్నది?
ఇ) చివరి ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటం సంఖ్యలు రాయండి.
ఈ) మొదటి డబ్బాలోని రెండు ఎలక్ట్రాన్ ప్రధాన క్వాంటం సంఖ్య విలువ ఎంత?
జవాబు:
ఇచ్చిన పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s² 2s² 2p²
అ) ఇది “కార్బన్” మూలక పరమాణువును సూచిస్తున్నది.
ఆ) చిట్టచివరి ఎలక్ట్రాన్ 22 ఆర్బిటాల్ నందు కలదు.
ఇ) చివరి ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటం సంఖ్యలు n = 2, l = 1, ml = 0, ms = + ½
ఈ) మొదటి డబ్బాలోని ఎలక్ట్రానుల యొక్క ప్రధాన క్వాంటం సంఖ్య విలువ 1.
ప్రశ్న 7.
బోర్ పరమాణు నమూనాలోని ప్రతిపాదనలు మరియు లోపాలేవి?
జవాబు:
ప్రతిపాదనలు :
- పరమాణువులో ఎలక్ట్రానులు అత్యధిక వేగంతో నిర్దిష్ట మార్గాలలో తిరుగుతాయి. వీటిని “కక్ష్యలు” అంటారు.
- ఈ కక్ష్యలలో ఎలక్ట్రాన్లు తిరుగుతున్నంత సేపూ శక్తి గ్రహించటంగానీ, కోల్పోవటంగానీ జరగదు. వీటిని ‘స్థిర కక్ష్యలు” అంటారు.
- వీటిని K, L, M, N లతో సూచిస్తారు. వీటికి నిర్దిష్ట శక్తులు కలవు.
- ఎలక్ట్రాన్ పై కక్ష్య నుండి లోపలి కక్ష్యకు దూకినపుడు శక్తి వికిరణ రూపంలో విడుదలగును. E2 – E1 = hυ.
- ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం : mvr = \(\frac{\mathrm{nh}}{2 \pi}\)
- కోణీయ ద్రవ్యవేగం క్వాంటీకరణం చెందినది.
లోపాలు :
- He, Li, Be, B వంటి బహు ఎలక్ట్రాన్ల వర్ణపటాలను వివరించలేదు.
- రేఖా వర్ణపటంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవడాన్ని వివరించలేదు.
- కోణీయ ద్రవ్యవేగం ఎందుకు క్వాంటీకరణం చెందినదో వివరించలేదు.
- రసాయన బంధాల గురించి వివరించలేదు.
ప్రశ్న 8.
హుండ్ నియమాన్ని రాసి, ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
నియమం : సమశక్తి గల ఆర్బిటాళ్ళలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జతకూడటం జరుగుతుంది.
1) కార్బన్లో మొదటి, రెండవ ఎలక్ట్రానులు 1s లోనికి, మూడవ, నాలుగవ ఎలక్ట్రానులు 28 లోనికి ప్రవేశించును.
2) ఐదవ ఎలక్ట్రాన్ 2p సమశక్తి గల ఆర్బిటాల్ కాబట్టి 2px లోనికి ప్రవేశించును.
3) ఆరవ ఎలక్ట్రాన్ హుండ్ నియమాన్ని పాటిస్తూ 2py లోనికి ప్రవేశించును.
4) నైట్రోజన్లో మొదటి, రెండవ, మూడవ, నాలుగవ ఎలక్ట్రాన్లు కార్బన్ ఎలక్ట్రాన్ విన్యాసం వలె 1s, 2s లోనికి ప్రవేశించును.
5) ఐదవ ఎలక్ట్రాన్ 2px లోనికి ప్రవేశించును.
6) ఆరవ ఎలక్ట్రాన్ 2py లోనికి ప్రవేశించును.
7) ఏడవ ఎలక్ట్రాన్ 2pz లోనికి ప్రవేశించును.
ఆక్సిజన్ పరమాణువులో ఎలక్ట్రాన్ విన్యాసం 7 ఎలక్ట్రాన్ల వరకు నైట్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పోలి ఉండును.
8) 8వ ఎలక్ట్రాన్ 2px లోనికి ప్రవేశించి ఎలక్ట్రాన్ తో జతకూడును.
ప్రశ్న 9.
ఆఫ్ బౌ నియమం లేదా ఊర్ద్వ నిర్మాణ నియమాన్ని రాసి, ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
నియమం : ఎలక్ట్రాను తక్కువ శక్తి గల ఆర్బిటాల్ లోనికి ముందు ప్రవేశించును.
(లేదా)
ఎలక్ట్రాను ఏ ఆర్బిటాల్ యొక్క (n + l) విలువ కనిష్ఠమో దానిలోనికి ముందు ప్రవేశించును.
పొటాషియంలో చిట్టచివరి ఎలక్ట్రాన్ 3d లోనికి ప్రవేశించకుండా, 4s లోనికి ప్రవేశించింది. కారణం 4s యొక్క n + l విలువ తక్కువ.
ఉదా 3 : స్కాండియం 21Sc. 1s² 2s 2p6 3s² 3p6 4s² 3d¹
స్కాండియంలో చిట్టచివరి 21వ ఎలక్ట్రాన్ 4p లోనికి ప్రవేశించకుండా 3d లోనికి ప్రవేశించింది. దీనికి కారణం 4p, 3dల n + l విలువలు సమానం అయినప్పటికీ n విలువ 3d ఆర్బిటాల్ కు కనిష్టం కాబట్టి ఎలక్ట్రాన్ 3d లోనికి ప్రవేశించింది.
ప్రశ్న 10.
బోర్ – సోమర్ ఫెల్డ్ పరమాణు నమూనాను వివరించుము.
జవాబు:
- రేఖా వర్ణపటంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవడాన్ని విశదీకరించేందుకు, సోమర్ ఫెల్డ్ దీర్ఘవృత్తాకార కక్ష్య అనే భావనను ప్రవేశపెట్టాడు.
- బోర్ ప్రతిపాదించిన వృత్తాకార కక్ష్యలను అలాగే ఉంచుతూ, ఇతను రెండవ కక్ష్యకి ఒక దీర్ఘవృత్తాకార కక్ష్యని, మూడవ కక్ష్యను రెండు దీర్ఘవృత్తాకార కక్ష్యలను కలుపుతూ, పరమాణు కేంద్రకం, ఈ దీర్ఘవృత్తాకార కక్ష్య యొక్క రెండు ప్రధాన నాభులలో ఒకదానిపై ఉంటుందని ప్రతిపాదించాడు.
- ఒక కేంద్ర బలం యొక్క ప్రభావానికి లోనై ఆవర్తన చలనంలో ఉన్న కణం ధీర్ఘవృత్తాకార కక్ష్యల ఏర్పాటుకు దారి తీస్తుందనే విషయం అతను ఈ ప్రతిపాదన చేయడానికి దారితీసింది.
లోపాలు :
ఒకటికన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లున్న పరమాణువుల యొక్క పరమాణు వర్ణపటాలను వివరించడంలో ఈ నమూనా విఫలమైంది.
ప్రశ్న 11.
క్వాంటం యాంత్రిక పరమాణు నమూనాను వివరించుము.
జవాబు:
- ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ నిర్దిష్టమైన మార్గాలను అనుసరించవు కాబట్టి, పరమాణువుకు నిర్ణీతమైన సరిహద్దు అంటూ ఏమీ ఉండదు. కాబట్టి పరమాణువులో ఎలక్ట్రాన్ కచ్చితంగా ఎక్కడ ఉంటుందో చెప్పడం కష్టం.
- ఈ పరిస్థితులలో పరమాణువులోని ఎలక్ట్రానుల ధర్మాలను అర్థం చేసుకోవడానికి ఇర్విన్ ప్రోడింగర్ క్వాంటం యాంత్రిక పరమాణు నమూనాను ప్రతిపాదించాడు.
- ఈ నమూనా ప్రకారం, ఒక నిర్దిష్ట సమయంలో ఎలక్ట్రానులు, పరమాణువులో కేంద్రకం చుట్టూ నిర్ణీత ప్రాంతంలో అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ ప్రాంతాలనే ఆర్బిటాళ్ళు అంటారు.
- ఒకే శక్తి స్థాయిలకు చెందిన ఆర్బిటాళ్ళు గురించి క్వాంటం సంఖ్యల ఆధారంగా తెలుసుకోవచ్చు.
ప్రశ్న 12.
పౌలీవర్జన నియమమును ఒక ఉదాహరణతో వివరించుము.
జవాబు:
పౌలీవర్జన నియమం :
ఒకే పరమాణువుకి చెందిన ఏ రెండు ఎలక్ట్రాన్లకి నాలుగు క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు.
ఉదా : He, Z = 2
ఎలక్ట్రాన్ విన్యాసం : 1s²
నాలుగు క్వాంటం సంఖ్యలు :
ప్రశ్న 13.
p – ఆర్బిటాల్ పటాలను గీయుము.
జవాబు:
p యొక్క కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య విలువ l = 1.
వీటి అయస్కాంత క్వాంటం సంఖ్య విలువలు ml = – 1, 0, + 1.
p ఆర్బిటాల్ యొక్క ఆకృతి డంబెల్ ఆకారంలో ఉండును.
ప్రశ్న 14.
d – ఆర్బిటాళ్ల ఆకృతులు గీయుము.
జవాబు:
d ఉపస్థాయి యొక్క కోణీయ ద్రవ్యవేగం క్వాంటం సంఖ్య విలువ l = 2.
d ఉపస్థాయి యొక్క అయస్కాంత క్వాంటం సంఖ్య విలువలు ml = – 2 – 1, 0, 1, 2.
ప్రశ్న 15.
విద్యుదయస్కాంత వర్ణపటం గీచి, వివిధ వికిరణాల తరంగదైర్ఘ్యాలను చూపుము.
జవాబు:
ప్రశ్న 16.
“ఆక్సిజన్ కన్నా నైట్రోజన్ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది”. ఈ వాక్యాన్ని సమర్థిస్తావా?
జవాబు:
అవును. నేను సమర్థిస్తాను.
నైట్రోజన్లో ఉన్న మూడు p – ఆర్బిటాళ్ళు ఒక్కొక్క ఎలక్ట్రాన్ తో సగం నిండి ఉంటాయి.
“సమశక్తి ఆర్బిటాళ్ళు సగం నిండినా లేదా పూర్తిగా నిండిన దానికి స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది.
కనుక ఆక్సిజన్ కన్నా నైట్రోజన్ కు స్థిరత్వం ఎక్కువ.
10th Class Physics 6th Lesson పరమాణు నిర్మాణం ½ Mark Important Questions and Answers
1. పరమాణువులోని ఉపకణాల పేర్లు రాయుము.
జవాబు:
ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్
2. దృగొగోచర కాంతి వడి ఎంత?
జవాబు:
3 × 108 ms-1
3. తరంగంలో రెండు వరుస శృంగాల మధ్య దూరాన్ని ఏమంటారు?
జవాబు:
తరంగదైర్యం (λ)
4. ఒక సెకనులో ఒక బిందువును దాటే తరంగాల సంఖ్యను ఏమంటారు?
జవాబు:
పౌనఃపున్యం (υ)
5. పౌనఃపున్యం యొక్క ప్రమాణం ఏమిటి?
జవాబు:
హెర్ట్జ్ (లేదా) \(\frac{1}{s}\) (లేదా) s-1,
6. \(\frac{\text { c }}{\lambda}\) దేనిని సూచించును?
జవాబు:
పౌనఃపున్యం
7. తరంగదైర్ఘ్యం (λ), పౌనఃపున్యం (υ) మరియు కాంతి తరంగ వేగం (c) ల మధ్య సంబంధమేమిటి?
జవాబు:
c = υλ
8. c = υλ. లో υ పెరిగితే? ఎలా మారుతుంది?
జవాబు:
తగ్గుతుంది
9. విద్యుదయస్కాంత తరంగాల వివిధ తరంగదైర్ఘ్యాల సముదాయాన్ని ఏమంటారు?
జవాబు:
విద్యుదయస్కాంత వర్ణపటం
10. సహజంగా ఏర్పడే వర్ణపటంనకు ఉదాహరణనిమ్ము.
జవాబు:
ఇంద్రధనుస్సు
11. క్రింది ఇవ్వబడిన కిరణాలను వాటి తరంగదైర్ఘ్యం ఆధారంగా ఆరోహణ క్రమంలో రాయండి.
γ (గామా) కిరణాలు, అతినీలలోహిత కిరణాలు, పరారుణ కిరణాలు, దృగ్గోచర కాంతి.
జవాబు:
γ కిరణాలు < అతినీలలోహిత కిరణాలు < దృగ్గోచర కాంతి < పరారుణ కిరణాలు
12. దృగ్గోచర కాంతి తరంగదైర్ఘ్యం ఎంత?
జవాబు:
400 nm నుండి 700 nm
13. క్రింది వానిలో దేనికి తక్కువ తరంగదైర్ఘ్యం కలదు?
A) కాస్మిక్ కిరణాలు
B) γ – కిరణాలు
C) మైక్రో కిరణాలు
జవాబు:
A) కాస్మిక్ కిరణాలు
14. విద్యుదయస్కాంత శక్తి గ్రహించినా, విడుదలయినా ఇలా ఉంటుంది.
a) అవిచ్ఛిన్నంగా
b) విచ్ఛిన్నంగా
జవాబు:
b) విచ్ఛిన్నంగా
15. ప్లాంక్ స్థిరాంకం విలువ ఎంత?
జవాబు:
6.626 × 10-34 J
16. ‘υ’ పౌనఃపున్యం గల విద్యుదయస్కాంత తరంగం ఎంత శక్తి (E) ని విడుదల చేయగలదు?
జవాబు:
E = hυ
17. ఒక విద్యుదయస్కాంత తరంగం యొక్క తరంగదైర్ఘ్యం తగ్గించినా లేదా పౌనఃపున్యం పెంచినా తరంగ శక్తి ఎలా మారుతుంది?
జవాబు:
తగ్గును
18. క్యూప్రిక్ క్లోరైడ్ ను మండించినపుడు ఏ రంగును పరిశీలిస్తావు?
జవాబు:
ఆకుపచ్చ రంగు
19. స్ట్రాన్షియం క్లోరైడ్ ను సన్నని జ్వాలపై మండించినప్పుడు ఏ రంగులో మండుతుంది?
జవాబు:
క్రిమ్సన్ ఎరుపు
20. రమేష్ కు వీథి దీపాలు కొన్ని పసుపురంగులో వెలుగుతూ కనిపించాయి. ఆ పసుపురంగుకి కారణం ఏమిటో ఊహించుము.
జవాబు:
సోడియం ఆవిరి
21. రేఖావర్ణపటం ఉపయోగం ఏమిటి?
జవాబు:
తెలియని పరమాణువులను గుర్తించుటకు
22. ఒక పరమాణువులోని ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించి ఉత్తేజ స్థితికి వెళ్తుంది. ఉత్తేజ స్థితిలో ఎప్పటికీ ఉండగలుగుతుందా?
జవాబు:
ఉండలేదు.
23. జతపర్చుము.
a) ఎలక్ట్రాన్ భూస్థాయి నుండి ఉత్తేజిత స్థాయికి వెళ్ళినపుడు ( ) i) శోషణ వర్ణపటం
b) ఎలక్ట్రాన్ ఉత్తేజిత స్థాయి నుండి భూస్థాయికి వెళ్ళినపుడు ( ) ii) ఉద్గార వర్ణపటం
జవాబు:
a – i, b – ii
24. రేఖావర్ణపటంలోని రేఖలు కొన్ని ఉపరేఖలుగా విడిపోవడాన్ని వివరించలేని పరమాణు నమూనా ఏది?
జవాబు:
బోర్ పరమాణు నమూనా
25. దీర్ఘ వృత్తాకార కక్ష్యలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:
సోమర్ ఫెల్డ్
26. బోర్ మొదటి వృత్తాకార కక్ష్యకు, సోమర్ ఫెల్డ్ ఎన్ని దీర్ఘవృత్తాకార కక్ష్యలను జోడించాడు?
జవాబు:
సున్న
27. హైడ్రోజన్ పరమాణు వర్ణపటంలోని సూక్ష్మరేఖలను గూర్చి వివరించిన పరమాణు నమూనా ఏది?
జవాబు:
బోర్ – సోమర్ ఫెల్డ్
28. ఒకటి కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లున్న పరమాణువుల యొక్క వర్ణపటాలను వివరించడంలో విఫలమైన నమూనా
A) బోర్
B) బోర్-సోమర్ ఫెల్డ్
C) A మరియు B
D) రెండూ కావు.
జవాబు:
C) A మరియు B
29. క్వాంటం సిద్ధాంత రూపకర్త ఎవరు?
జవాబు:
మ్యాక్స్ ప్లాంక్
30. క్వాంటం యాంత్రిక పరమాణు నమూనా ప్రతిపాదించిన వారు ఎవరు?
జవాబు:
ఇర్విన్ జోడింగర్
31. పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ ను కనుగొనగలిగే సంభావ్యత ఏ ప్రాంతంలో అయితే అధికంగా వుంటుందో ఆ ప్రాంతాన్ని ఏమంటారు?
జవాబు:
ఆర్బిటాల్
32. పరమాణువులో ఎలక్ట్రాన్లు ఎక్కడ కనిపిస్తాయి?
జవాబు:
ఆర్బిటాళ్ళలో
33. పరమాణువులో, కేంద్రకం చుట్టూ ఉండే ప్రదేశంలో ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యతను సూచించే సంఖ్యలను ఏమంటారు?
జవాబు:
క్వాంటం సంఖ్యలు
34. ప్రధాన కర్పర పరిమాణం, దాని శక్తిని గూర్చి తెలుపు క్వాంటం సంఖ్య ఏది?
జవాబు:
ప్రధాన క్వాంటం సంఖ్య (n)
35. ప్రధాన క్వాంటం సంఖ్య (n) విలువలు రాయుము.
జవాబు:
n = 1, 2, 3, ……..
36. క్రింది. ఏ ఆర్బిట్ పరిమాణం ఎక్కువ? జ.
A) n = 1
B) n = 3
C) n = 2
D) ఏదీకాదు
జవాబు:
B) n = 3
37. కర్సరాలు K,L,M,N లకు సరిపోవు…’n’ విలువలను రాయుము.
జవాబు:
n = 1, 2, 3, 4
38.
• ఏ కర్పరం కేంద్రకానికి దగ్గరగా ఉంటుంది?
జవాబు:
K (లేదా) n = 1
• ఏ కర్పరం శక్తి స్థాయి ఎక్కువగా ఉంటుంది?
జవాబు:
N (లేదా) n = 4
• పై పట్టికలోని విలువలు ఏ క్వాంటం సంఖ్యను సూచిస్తాయి?
జవాబు:
ప్రధాన క్వాంటం సంఖ్య
39. ప్రతి n విలువకు ‘1’ విలువలు రాయండి.
జవాబు:
0 నుండి n – 1
40. ఏ క్వాంటం సంఖ్య ఉపకర్పరాన్ని సూచించును?
జవాబు:
‘l’ కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య).
41. ఉపకర్పరం యొక్క ఆకృతిని తెలియజేయు క్వాంటం సంఖ్య ఏది?
జవాబు:
‘l’ (కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య)
42. l = 2 అయిన ఉపకర్పరం ఏది?
జవాబు:
‘d’
43. 1 = 0 అయిన ఉపకర్పరం దేనిని సూచించును?
జవాబు:
‘s’
44. n = 1 మరియు 1 = 0 అయిన ఆర్బిటాల్ పేరు రాయండి.
జవాబు:
‘1s’
45. n = 2 ప్రధాన కర్పరంలో ఉండే ఉపకర్పరాల పేర్లు రాయండి.
జవాబు:
2s, 2p
46. f-ఆర్బిటాల్ యొక్క కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య ఎంత?
జవాబు:
3 ( l = 3)
47. n = 4 అయిన ‘l’ యొక్క గరిష్ఠ విలువ ఎంత?
జవాబు:
3
48. n = 4 అయిన ‘I’ యొక్క విలువలు రాయండి. రాయుము.
జవాబు:
l = 0, 1, 2, 3
49. ‘n’ కి గరిష్ట ‘l’ విలువ ఎంత?
జవాబు:
(n – 1)
50. ‘l’ విలువకు ఎన్ని అయస్కాంత క్వాంటం సంఖ్య విలువలు వుంటాయి?
జవాబు:
(2l + 1) (-l, (-l + 1), -0, 1, (+l -l), + l]
51. l విలువకు అయస్కాంత క్వాంటం సంఖ్య ఏఏ విలువలను కలిగి ఉంటుంది?
జవాబు:
-l, 0, +l
52. పరమాణువులో గల ఆర్బిటాళ్ళ ప్రాదేశిక దిగ్విన్యాసాన్ని ఏ క్వాంటం సంఖ్య సూచిస్తుంది?
జవాబు:
అయస్కాంత క్వాంటం సంఖ్య
53. l = 0 అయితే m, విలువలు ఎన్ని ఉంటాయి?
జవాబు:
ఒకటి (0)
54. l = 0 అయితే ఏ ఆర్బిటాల్ ను సూచిస్తుంది?
జవాబు:
‘s’
55. l = 1 అయితే m, విలువలు ఎన్ని వుంటాయి?
జవాబు:
3 [ ∵ (px, py, pz); (-1, 0, +1)]
56. ఒక ఉపకర్సరంలో ఉండే ఆర్బిటాళ్ళను ఏమంటారు?
జవాబు:
సమశక్తి ఆర్బిటాళ్ళు
57. క్రింది ఇచ్చిన l విలువలకు సమశక్తి ఆర్బిటాళ్ళ సంఖ్యను రాయండి.
l = 0, l = 1, l = 2, l = 3
జవాబు:
l = 0 — సమశక్తి ఆర్బిటాళ్ళ సంఖ్య = 1 (0)
l = 1 — సమశక్తి ఆర్బిటాళ్ళ సంఖ్య = 3 (-1, 0, +1)
l = 2 — సమశక్తి ఆర్బిటాళ్ళ సంఖ్య = 5 (-2, -1, 0 + 1, +2)
l = 3 — సమశక్తి ఆర్బిటాళ్ళ సంఖ్య = 7 (-3, -2, -1, 0, +1, +2, +3)
58. S ఆర్బిటాల్ కి ml విలువ ఎంత?
జవాబు:
‘0’
59. 1=1 అయిన డీ జనరేటెడ్ ఆర్బిటాళ్ళ సంఖ్య ఎంత? అవి ఏవి?
జవాబు:
3; px, py, pz.
60. ఇచ్చిన ‘1’ విలువకి ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాళ్ల సంఖ్యను తెలుసుకొనుటకు ఉపయోగపడు సూత్రం
జవాబు:
21 + 1
61. ప్రతి ఉపకర్పరంలో గరిష్ఠంగా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి?
జవాబు:
ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాళ్ళ సంఖ్యకు రెట్టింపు.
62. s,p,d,f ఉపకర్పరాలలో ఉండే గరిష్ఠ ఎలక్ట్రానుల సంఖ్యను రాయుము.
జవాబు:
2, 6, 10, 14
63. S ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాళ్ళ సంఖ్య ఎంత?
జవాబు:
1
64. p ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాళ్ళ సంఖ్య ఎంత?
జవాబు:
3
65. గరిష్ఠంగా 5 ఆర్బిటాళ్లు గల ఉపకర్పరం పేరు ఏమిటి?
జవాబు:
‘d’
66. l = 3 ఉపకర్పరంలో ఆర్బిటాళ్ళ సంఖ్య ఎంత?
జవాబు:
‘7’
67. l = 3 కి m, విలువలు రాయుము.
జవాబు:
-3, -2, -1, 0, + 1, +2, +3
68. ఆర్బిటాళ్ళ ప్రాదేశిక దిగ్విన్యాసాన్ని సూచించు క్వాంటం సంఖ్య ఏది?
జవాబు:
అయస్కాంత క్వాంటం సంఖ్య
69. S – ఆర్బిటాల్ ఆకృతి ఏమిటి?
జవాబు:
గోళాకారం
70. p- ఆర్బిటాల్ ఆకృతి ఏమిటి?
జవాబు:
డంబెల్
71. d – ఆర్బిటాల్ ఆకృతి ఏమిటి?
జవాబు:
డబుల్ డంబెల్
72. ఈ ఆర్బిటాల్ పేరు ఏమిటి?
జవాబు:
S – ఆర్బిటాల్
73. ఈ ఆర్బిటాల్ పేరు రాయుము.
జవాబు:
py – ఆర్బిటాల్
74. ఈ ఆర్బిటాల్ పేరు రాయుము.
జవాబు:
dxy– ఆర్బిటాల్
75. d-ఆర్బిటాళ్ళ జ్యామితీయ ఆకృతుల పేర్లు రాయుము.
జవాబు:
dxy, dyz dzx dx²-y² dz²
76. 5-డీజనరేటెడ్ ఆర్బిటాళ్ళు గల ఉపకర్పరం ఏది?
జవాబు:
‘d’
77. ఉపకర్పరం (1) కి, గరిష్ఠ ఎలక్ట్రానికి మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
2(2l + l)
78. ఒక ఆర్బిటాల్ లో గల గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత?
జవాబు:
‘2’
79. జతపరుచుము.
a) ఆర్బిటాల్ పరిమాణం ( ) i) l
b) ఆకారం ( ) ii) ml
c) ప్రాదేశిక దిగ్విన్యాసం ( ) iii) n
జవాబు:
a – iii, b – i, c-ii
80. ‘ms‘ యొక్క విలువలు రాయండి.
జవాబు:
+ ½ మరియు – ½
81. ఎలక్ట్రాన్ యొక్క అభిలక్షణాలను వివరించే క్వాంటం సంఖ్య ఏది?
జవాబు:
స్పిన్ క్వాంటం సంఖ్య (ms)
82. ఎలక్ట్రాన్స్ రెండు రకాల స్పిన్ విలువలు ధనాత్మకం అయితే ఆ స్పిన్లు ఎలా ఉంటాయి?
జవాబు:
సమాంతరంగా (↓↓) లేదా (↑↑)
83. ఎలక్ట్రాన్స్ దిగ్విన్యాసాలను వివరించే క్వాంటం సంఖ్య ఏది?
జవాబు:
స్పిన్
84. పరమాణువులోని కర్పరాలు, ఉపకర్పరాలు మరియు ఆర్బిటాళ్ళలో ఎలక్ట్రాన్ల పంపిణీని ఏమంటారు?
జవాబు:
ఎలక్ట్రాన్ విన్యాసం
85. సాధారణంగా సవ్యదిశలో ఉన్న స్పిన్ ను ఎలా సూచిస్తారు?
జవాబు:
↑ లేదా + ½
86. ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సూచించే సంక్షిప్త సంకేతాన్ని రాయండి.
జవాబు:
nlx
87. nlx లో n, 1, x లు వేటిని సూచిస్తాయి?
జవాబు:
n = ప్రధాన శక్తి స్థాయి
1 = ఉపశక్తి స్థాయి
X = ఎలక్ట్రాన్ల సంఖ్య
88. nlx పద్ధతిలో ఎన్ని క్వాంటం సంఖ్యలు వున్నాయి?
జవాబు:
‘2’ (n, l)
89. 1s’ లో ఉన్న ఎలక్ట్రాన్ యొక్క అన్ని క్వాంటం సంఖ్యలు రాయండి.
జవాబు:
n = 1, l = 0, ml = 0, ms = + ½ (లేదా) – ½
90. హీలియం పరమాణువులో గల రెండు ఎలక్ట్రాన్ల యొక్క క్వాంటం సంఖ్యలలో వేరుగా గలది ఏది?
జవాబు:
స్పిన్ క్వాంటం సంఖ్య
91. a) ఒక ఆర్బిటాల్ లో గరిష్ఠంగా రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి.
b) ఒక ఆర్బిటాల్ లో గల రెండు ఎలక్ట్రాన్లు కచ్చితంగా వ్యతిరేక స్పినను కలిగి ఉంటాయి.
పై వాక్యా లలో ఏది సరైనది?
జవాబు:
రెండూ సరియైనవే
92. ఊర్ధ్వ నిర్మాణ నియమం అని దేనికి పేరు?
జవాబు:
ఆబౌ నియమానికి
93. పౌలీవర్జన నియమం రాయుము.
జవాబు:
ఒకే పరమాణువుకి చెందిన ఏ రెండు ఎలక్ట్రాన్లకి నాలుగు క్వాంటం సంఖ్యలు సమానం కావు.
94. జంట స్పిన్లు గల ఎలక్ట్రాన్లను ఎలా సూచిస్తారు?
జవాబు:
95. ఒకే ఆర్బిటాల్ లో గల రెండు ఎలక్ట్రాన్ స్పి న్లు ఎలా ఉంటాయి?
A) ఒకే దిశలో
B) వ్యతిరేక దిశలో
C) A లేదా B
జవాబు:
B) వ్యతిరేక దిశలో
96. ఒక ఆర్బిటాల్ లో గరిష్ఠంగా ఉంచగలిగే ఎలక్ట్రాన్స్ సంఖ్యను తెలియజేయు నియమం ఏమిటి?
జవాబు:
పౌలీవర్జన నియమం
97. ఒక ఆర్బిటాల్ కి ఎన్ని m విలువలు ఉంటాయి?
జవాబు:
2
98. హీలియం పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయుము.
జవాబు:
99. ఒక కర్పరం (n) లో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత?
జవాబు:
2n²
100. ఒక ఉపకర్పరం (!) లో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత?
జవాబు:
2(2l + l)
101. ఆఫ్ బౌ అనగా అర్థం ఏమిటి?
జవాబు:
ఆఫ్ బౌ అనగా ఊర్ధ్వ నిర్మాణం
102. ఆర్బిటాళ్ళలోని ఎలక్ట్రాన్లు నిండే క్రమం ఎలా ఉంటుందని ఆఫ్ బౌ నియమం చెప్పింది?
జవాబు:
ఆర్బిటాళ్ళ ఆరోహణ శక్తి క్రమం
103. 4s, 3d లలో ఎలక్ట్రాన్ దేనిని ముందుగా చేరును?
జవాబు:
4s
104. 1s, 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p, 4d, 5s, 5p, 4f, 6s, 5d లను వాటి శక్తి క్రమంలో రాయుము.
జవాబు:
1s < 2s < 2p < 3s < 3p < 4s < 3d <4p < 5s < 4d < 5p < 6s < 4f < 5d
105. 4s, 4p, 4d, 3d లలో ఏది తక్కువ శక్తి గలది?
జవాబు:
4s
106. మాయిలర్ చిత్రం దేనిని సూచిస్తుంది?
A) పౌలీవర్జన నియమం
B) ఆఫ్ బౌ నియమం
C) హుండ్ నియమం
జవాబు:
B) ఆఫ్ బౌ నియమం
107. ‘సమశక్తి గల ఆర్బిటాళ్ళలో ఒక్కొక్క ఎలక్ట్రాతో నిండిన తర్వాతే జతకూడడం జరుగును”. ఈ నియమం పేరేమిటి?
జవాబు:
హుండ్ నియమం
108. కార్బన్ పరమాణువులో భూస్థాయిలో p ఆర్బిటాళ్ళలో ఒకే స్పిన్ గల ఎలక్ట్రాన్లు ఎన్ని కలవు?
జవాబు:
2
109. నిర్దిష్ట పౌనఃపున్యాలు గల కాంతి శక్తి మాత్రమే శోషణం లేదా ఉద్గారం చెందడం వలన ఏర్పడే పటాన్ని ఏమంటారు?
జవాబు:
పరమాణు రేఖా వర్ణపటం
110. పరమాణువు వికిరణ శక్తి నిర్దిష్ట విలువ ప్రమాణాన్ని ఏమంటారు?
జవాబు:
క్వాంటం
111. అనేక తరంగదైర్యాల లేదా పౌనఃపున్యాల సముదాయాన్ని ఏమందురు?
జవాబు:
వర్ణపటం
112. 1s² 2s² 2px² ఏ నియమాన్ని ఉల్లంఘించింది?
జవాబు:
హుండ్ నియమం
113. He : ↑↑ ఏ నియమాన్ని ఉల్లంఘించింది?
జవాబు:
పౌలీవర్జన నియమం
114. 1s² 2s² 2p6 3s² 3p6 3d10 ఏ నియమాన్ని ఉల్లంఘించింది?
జవాబు:
ఆఫ్ బౌనియమం
115. క్రోమియం ఎలక్ట్రాన్ విన్యాసం రాయుము.
జవాబు:
1s² 2s² 2p6 3s² 3p6 4s¹ 3d5
116. రాగి (కాపర్) ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయుము.
జవాబు:
1s² 2s² 2p6 3s² 3p6 4s¹ 3d10
117.
ఇది ఏ నియమాన్ని ఉల్లంఘించింది?
జవాబు:
హుండ్ నియమం
118. 1s°2s² 2p4 లో ఏ నియమం ఉల్లంఘింపబడింది?
జవాబు:
ఆబౌ నియమం
119. సోడియం పరమాణువులో చివరిగా చేరే ఎలక్ట్రాన్ యొక్క అన్ని క్వాంటం సంఖ్యలు రాయండి.
జవాబు:
n = 2, l = 1, ml = +1, ms = +½ (లేదా) -½
120. ‘K’ మరియు ‘I’ కక్ష్యలలో దేనికి ఎక్కువ శక్తి గలదు?
జవాబు:
‘L’
121. M – కర్పరంలో ఉండగల గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత?
జవాబు:
18
122. ఒక విద్యుదయస్కాంత తరంగదైర్ఘ్యం 1మీ. దాని పౌనఃపున్యం ఎంత?
జవాబు:
అదనపు ప్రాక్టీస్ ప్రశ్నలు
ప్రశ్న 1.
“ప్రతి మూలకం, తనదైన ఒక విలక్షణమైన రంగును ఉద్గారం చేస్తుంది”. దీనిని నిరూపించే ప్రయోగాన్ని వివరించండి.
జవాబు:
- చిటికెడు క్యూప్రిక్ క్లోరైడ్ ను వాచ్ గ్లాసులో తీసుకొని, గాఢ హైడ్రోక్లోరికామ్లం కలిపి ముద్దలా చేయండి.
- ఒక ప్లాటినం తీగ చివరను రింగులా మడచి లూప్ లాగా చేసి దానిపై ముద్దను తీసుకొని సన్నని జ్వాలపై పెట్టండి.
- ఇది ఆకుపచ్చ రంగు మంటని ఇస్తుంది.
- ఇదే ప్రయోగాన్ని ఫ్రాన్షియం క్లోరైడ్ తో చేయండి.
- ఇది ఎరుపు రంగు మంటను ఇస్తుంది.
పై ప్రయోగాల ద్వారా ప్రతి మూలకం తనదైన ఒక విలక్షణమైన రంగును ఉద్గారం చేస్తుందని ఋజువౌతుంది.
ప్రశ్న 2.
వివిధ మూలకాలను ఒకే జ్వాలపై వేడిచేసినపుడు వేరు వేరు రంగులు గల మంటలను ఎందుకు ఏర్పరుస్తాయి?
జవాబు:
వివిధ మూలకాలు ఒకే జ్వాలపై వేడిచేసినపుడు వేరు వేరు రంగులు గల మంటలను ఏర్పరచుటకు కారణం ఆయా మూలకాలలోని ఎలక్ట్రాన్లు వెలువరించే విద్యుదయస్కాంత తరంగాల వైవిధ్యభరితమైన పౌనఃపున్యాలు.
ప్రశ్న 3.
ఒక పరమాణువులో ఎలక్ట్రాన్లు నిర్దిష్టమైన మార్గంలో తిరగవు అని ఎలా చెప్పగలవు?
జవాబు:
ఎలక్ట్రాన్లు కంటికి కనిపించని కణాలు. కాబట్టి ఆ ఎలక్ట్రాన్ల వేగాన్ని, స్థానాన్ని కనుగొనడానికి కూడా తగిన కాంతి సహాయాన్ని తీసుకుంటాము. ఎలక్ట్రానులు అత్యంత సూక్ష్మమైనవి. కాబట్టి అతి తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతినే ఈ పనికి వాడుకోవలసి ఉంటుంది. ఈ తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతి ఎలక్ట్రాన్ ను తాకినపుడు అది ఎలక్ట్రాన్ చలనాన్ని ప్రభావితం చేసి దాని చలనంలో మార్పుని కలుగజేస్తుంది. అందువల్ల ఎలక్ట్రాన్ స్థానాన్ని గాని, వేగాన్ని గాని కచ్చితంగా ఒకేసారి కనుక్కోలేం. దీనిని బట్టి ఎలక్ట్రాన్ ఒక నిర్దిష్టమైన మార్గాన్ని అనుసరించదని తెలుస్తుంది.
ప్రశ్న 4.
బోర్ పరమాణు నమూనా యొక్క ముఖ్యమైన లోపమేమిటి?
జవాబు:
బోర్ పరమూణు నమూనా, రేఖా వర్ణపటంలోని రేఖలు కొన్ని ఉపరేఖలుగా విడిపోవడాన్ని వివరించలేకపోయింది.
ప్రశ్న 5.
సోమర్ ఫెల్డ్ ప్రతిపాదించిన దీర్ఘవృత్తాకార కక్ష్యలు అనగానేమి?
జవాబు:
- రేఖా వర్ణ పటంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవడాన్ని విశదీకరించేందుకు సోమర్ ఫెల్డ్ బోర్ నమూనాని స్వల్పంగా ఆధునీకరించినాడు. అతడు దీర్ఘ వృత్తాకార కక్ష్య అనే భావనను ప్రవేశపెట్టాడు.
- బోర్ ప్రతిపాదించిన వృత్తాకార కక్ష్యను అలాగే వుంచుతూ ఇతను రెండవ కక్ష్యకి ఒక దీర్ఘవృత్తాకార కక్ష్యను, మూడవ కక్ష్యకు రెండు దీర్ఘవృత్తాకార కక్ష్యలను కలుపుతూ, పరమాణువు కేంద్రకం ఈ దీర్ఘ వృత్తాకార కక్ష్య యొక్క రెండు ప్రధాన నాభిలలో ఒకదానిపై ఉంటుందని ప్రతిపాదించాడు.
- ఒక కేంద్ర బలం యొక్క ప్రభావానికి లోనై ఆవర్తన చలనంలో ఉన్న కణం దీర్ఘవృత్తాకార కక్ష్యలు ఏర్పడుటకు దారి తీస్తుందనే విషయం అతను ఈ ప్రతిపాదన చేయడానికి దారితీసింది.
ప్రశ్న 6.
బోర్ – సోమర్ ఫెల్డ్ నమూనాలో ప్రధాన లోపం ఏమిటి?
జవాబు:
ఒకటికన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు గల మూలకాల యొక్క పరమాణు వర్ణపటాన్ని ఈ నమూనా వివరించలేకపోయింది.
ప్రశ్న 7.
క్వాంటం సంఖ్యల ఉపయోగమేమిటి?
జవాబు:
కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ యొక్క కచ్చితమైన స్థానాన్ని కనుగొనడానికి క్వాంటం సంఖ్యలు ఉపయోగపడతాయి.
ప్రశ్న 8.
ఎలక్ట్రాన్ విన్యాసము అనగానేమి?
జవాబు:
ఒక పరమాణువు లోపల ఎలక్ట్రాన్లు కర్పరాలు, ఉపకర్షరాలు, ఆర్బిటాళ్ళలో అమరివుండే అమరికను తెలిపేదే ఎలక్ట్రాన్ విన్యాసము.
ప్రశ్న 9.
ఒక ఆర్బిటాల్ కేవలం రెండు ఎలక్ట్రాన్లను మాత్రమే ఎందుకు ఉంచుకోగలదు?
జవాబు:
పౌలీవర్జన సూత్రం ప్రకారం రెండు ms విలువలు మాత్రమే కలవు. ఈ రెండు విలువలు రెండు వేరు వేరు ఎలక్ట్రాన్ల వ్యతిరేక స్పినను తెలుపుతుంది. కావున ఒక ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్లను మాత్రమే ఉంచగలం.
ప్రశ్న 10.
‘N’ కర్పరంలో ఉంచగలిగిన గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? అది ఏ నియమాన్ని అనుసరించింది?
జవాబు:
‘N’ కర్పరంలో ఉంచగలిగిన గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య 32.
ఇది 2n² అనే నియమాన్ని అనుసరిస్తుంది.
‘N’ కర్పరానికి ‘n’ విలువ 4
∴ 2n² = 2 × 4² = 2 x 16 = 32
ప్రశ్న 11.
ఒక దృగ్గోచర వర్ణపటం యొక్క తరంగదైర్ఘ్యం విలువలు ఊదా (400 nm) నుండి ఎరుపు (750 nm) వరకు విస్తరించి ఉన్నాయి. ఈ విలువలను పౌనఃపున్యం రూపంలో తెలపండి. (lnm = 10-9 m)
జవాబు:
ప్రశ్న 12.
పసుపు రంగు ఉద్గారము యొక్క తరంగదైర్ఘ్యం 580 A అయిన దీని పౌనఃపున్యాన్ని లెక్కించండి. (1Å = 10-10m)
జవాబు:
ప్రశ్న 13.
ఒక కక్ష్య యొక్క ‘n’ విలువ 2. అయిన సాధ్యమయ్యే ” మరియు ml విలువలు ఏవి?
జవాబు:
n = 2 l = 0 అయిన ml = 0
l యొక్క విలువలు 0, 1. l = 1 అయిన ml = – 1, 0, + 1.
ప్రశ్న 14.
కొన్ని ఎలక్ట్రాన్ల క్వాంటం సంఖ్యల సమితులు ఇవ్వబడ్డాయి. వీటిని వాటి శక్తిని బట్టి ఆరోహణ క్రమంలో అమర్చుము.
a) n = 5, 1 = 1, m, = 1, m, = + 1/2
b) n = 4, 1 = 0, m, = 0, m, = – 1/2
c) n = 4, 1 = 1, m, = + 1, m, = – 1/2
d) n = 5, 1 = 0, m, = 0, m, = + 1/2
జవాబు:
ఇచ్చిన క్వాంటం సంఖ్యలను బట్టి a) 5p b) 4s c) 4p d) 5s
ఆరోహణ క్రమం 4s, Ap, 53, 5p అనగా b, c, d, a.
పట్టికలు
పట్టిక – 1
పట్టిక – 2
పట్టిక – 3
10th Class Physics 6th Lesson పరమాణు నిర్మాణం 1 Mark Bits Questions and Answers
సరియైన సమాధానమును గుర్తించండి.
1. p ఆర్బిటాల్ ఆకృతి ……….
A) గోళం
B) రేఖీయం
C) డంబెల్
D) డబుల్ డంబెల్
జవాబు:
C) డంబెల్
2. K కర్పరంలో గల గరిష్ఠ ఎలక్ట్రానుల సంఖ్య ………
A) 2
B) 4
C) 6
D) 8
జవాబు:
A) 2
3. ప్లాంక్ స్థిరాంకం విలువ ……..
A) 6.023 × 10-34 JS
B) 6.626 × 1034 JS
C) 6.626 × 10-36 Js
D) ఏదీ కాదు
జవాబు:
D) ఏదీ కాదు
4. 3d ఆర్బిటాల్ నిండిన తర్వాత ఎలక్ట్రాన్ ………. లోనికి ప్రవేశించును.
A) 4s
B) ap
C) 5s
D) 4p
జవాబు:
D) 4p
5. 1s²2s°2p² అనే ఎలక్ట్రాన్ విన్యాసంలో ఏ నియమం ఉల్లంఘించబడినది?
A) ఆఫ్ బౌ నియమం
B) హుండ్ నియమం
C) పౌలీవర్జన నియమం
D) అష్టక నియమం
జవాబు:
A) ఆఫ్ బౌ నియమం
6. n = 2 అయిన దాని కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య l విలువలు = ……….
A) 0, 1
B) 0, 1, 2
C) 0
D) 1, 2
జవాబు:
A) 0, 1
7. l = 3 విలువ గల ఆర్బిటాళ్ళలో నిండగల గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య
A) 6
B) 10
C) 14
D) 18
జవాబు:
C) 14
8. ఒకే పరమాణువుకి చెందిన ఏ రెండు ఎలక్ట్రానులకు నాలుగు క్వాంటమ్ సంఖ్యల విలువలు సమానంగా ఉండవని తెలియజేసినది
A) పౌలీ వర్జన సూత్రం
B) ఆఫ్ బౌ సూత్రం
C) హుండ్ సూత్రం
D) ఫ్లెమింగ్ ఎడమచేయి సూత్రం
జవాబు:
A) పౌలీ వర్జన సూత్రం
9. ప్రధాన క్వాంటం సంఖ్య 3 కింది వాటిలో దేనిని తెలియజేస్తుంది?
A) M – ప్రధాన కర్పరం
B) f – ఉప కర్పరం
C) N – ప్రధాన కర్పరం
D) d – ఉప కర్పరం
జవాబు:
A) M – ప్రధాన కర్పరం
10. కింది వాటిలో ఏ పరమాణువు నిర్మాణంను ‘నీల్స్ బోర్’ సిద్ధాంతం సరిగ్గా వివరించింది?
A) హైడ్రోజన్ పరమాణువు
B) హీలియం పరమాణువు
C) కార్బన్ పరమాణువు
D) అన్ని పరమాణువులు
జవాబు:
A) హైడ్రోజన్ పరమాణువు
11. ఒక ప్రధాన కర్పరం (n) లో ఉండగల గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య ……
A) 2n
B) 2n²
C) n²
D) n
జవాబు:
B) 2n²
12. ప్లాంక్ స్థిరాంకం విలువ …….. .
A) 6.626 × 10-27 J.sec
B) 6.626 × 10-34 J.sec
C) 6.626 × 1027 J.sec.
D) 6.626 × 1034 J.sec
జవాబు:
B) 6.626 × 10-34 J.sec
13. n = 4; l = 2 అయిన ఆ ఆర్బిటాల్……..
A) 4s
B) 4p
C) 4d
D) 4f
జవాబు:
C) 4d
14. క్రింది వాటిని జతపరుచుము.
A | B |
1) కర్పర పరిమాణం, శక్తి | P) కోణీయ ద్రవ్యవేగ క్వాంటమ్ సంఖ్య |
ii) ఉప కర్పరం ఆకృతి | Q) అయస్కాంత క్వాంటమ్ సంఖ్య |
iii) ఆర్బిటాల్ ప్రాదేశిక దృగ్విన్యాసం | R) ప్రధాన క్వాంటమ్ సంఖ్య |
A) (i) – P, (ii) – Q, (iii) – R
B) (i) – R, (ii) – P, (iii) – Q
C) (i) – R, (ii) – Q, (iii) – P
D) (i) – Q, (ii) – R, (iii) – P
జవాబు:
B) (i) – R, (ii) – P, (iii) – Q
15. రేఖా వర్ణపటంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవటాన్ని విశదీకరించిన శాస్త్రవేత్త ………
A) మాక్స్ ప్లాంక్
B) సోమర్ ఫెల్డ్
C) మోస్లీ
D) లూయిస్
జవాబు:
B) సోమర్ ఫెల్డ్
16. పరమాణువు అయాన్ గా మారుటకు దోహదపడునది ఏది?
A) కేంద్రక ఆవేశం
B) ద్రవ్యరాశి సంఖ్య
C) న్యూట్రాన్ల సంఖ్య
D) ఎలక్ట్రాన్ల సంఖ్య
జవాబు:
D) ఎలక్ట్రాన్ల సంఖ్య
17. ఆఫ్ బౌ నియమం ప్రకారం క్రింది వాటిలో ఏ ఆర్బిటాల్ లోకి ఎలక్ట్రాన్లు ముందుగా ప్రవేశించును?
A) 4s
B) 4p
C) 3d
D) 4f
జవాబు:
A) 4s
18. గరిష్ఠంగా 32 ఎలక్ట్రాన్లు ఉండగల కర్పరం
A) N
B) M
C) L
D) K
జవాబు:
A) N