AP 10th Class Physical Science Notes 10th Lesson విద్యుదయస్కాంతత్వం

Students can go through AP Board 10th Class Physical Science Notes 10th Lesson విద్యుదయస్కాంతత్వం to understand and remember the concept easily.

AP Board 10th Class Physical Science Notes 10th Lesson విద్యుదయస్కాంతత్వం

→ విద్యుత్ ప్రవాహం గల తీగ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది.

→ ఒక అయస్కాంత క్షేత్రంలో గల బలరేఖల సంఖ్యను అభివాహం (Φ) అంటారు.

→ ప్రమాణ వైశాల్యం గుండా వెళ్ళే అయస్కాంత అభివాహాన్ని అయస్కాంత అభివాహ సాంద్రత (B) అంటారు.

→ విద్యుత్ ప్రవాహ దిశలో మీ చేతివేళ్లను ముడిస్తే మీ బొటనవేలు దిశ అయస్కాంత క్షేత్ర దిశను సూచిస్తుంది.

→ ‘q’ ఆవేశం, ‘V’ వేగంతో అయస్కాంత క్షేత్రం ‘B’ కు లంబంగా కదులుతున్న ఆ ఆవేశంపై పనిచేసే అయస్కాంత బలాన్ని F = qvB గా వ్రాస్తారు.

→ అయస్కాంత క్షేత్ర దిశకు లంబంగా తీగలో విద్యుత్ ప్రవాహ దిశ ఉన్నప్పుడు F = ILBను వాడవచ్చును.

AP 10th Class Physical Science Notes 10th Lesson విద్యుదయస్కాంతత్వం

→ విద్యుత్ ప్రవాహం గల తీగపై పనిచేసే బలదిశను కుడిచేతి నిబంధనను ఉపయోగించి కనుగొనవచ్చును.

→ విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మార్చు పరికరము విద్యుత్ మోటర్.

→ విద్యుత్ ప్రవాహం గల తీగచుట్టను ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు అది భ్రమణం చెందును.

→ సంపూర్ణ వలయంలో జనించిన ప్రేరిత విద్యుచ్ఛాలకబలం దాని గుండా పోయే అయస్కాంత అభివృద్ధి రేటుకు సమానము.

→ సంపూర్ణ వలయంలో ప్రవహించే ప్రేరిత విద్యుత్ దానికి కారణమైన అయస్కాంత అభివాహంలో మార్పులను వ్యతిరేకించినట్లు ప్రవహిస్తుంది.

→ విద్యుత్ జనరేటర్లు యాంత్రికశక్తిని విద్యుచ్ఛక్తిగా మారుస్తాయి.

→ అయస్కాంత అభివాహం : అయస్కాంత క్షేత్రానికి లంబంగా గల తలం గుండా ప్రయాణించు బలరేఖల సంఖ్య.

→ అయస్కాంత అభివాహ సాంద్రత : ప్రమాణ వైశాల్యం గుండా వెళ్ళే అయస్కాంత అభివాహాన్ని అయస్కాంత అభివాహ సాంద్రత అంటారు.

→ విద్యుత్ మోటర్ : ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో గల తీగచుట్ట గుండా విద్యుత్ ప్రహహం వలన దానిలో భ్రమణాలు ఏర్పడునట్లు చేయు అమరిక గల పరికరము.

→ స్లిప్ రింగ్స్ : విద్యుత్ మోటర్ లో తీగచుట్టతో కలుపబడిన షాఫ్ట్ కు ఆని, బ్రష్ లతో అనుసంధానం చేయబడి ఉన్నవి.

→ ప్రేరిత విద్యుత్ ప్రవాహం : ఒక తీగచుట్టలో అయస్కాంత అభివాహాన్ని నిరంతరంగా మార్చుట వలన దానిలో ప్రవహించు విద్యుత్ .

→ ప్రేరిత విద్యుచ్ఛాలక బలం : ఒక తీగచుట్టలో ప్రేరిత విద్యుత్ ప్రవాహానికి కారణమైన బలమే విద్యుచ్ఛాలక బలం.

AP 10th Class Physical Science Notes 10th Lesson విద్యుదయస్కాంతత్వం

→ విద్యుత్ జవరేటర్ : యాంత్రిక శక్తిని, విద్యుత్ శక్తిగా మార్చు పరికరము.

→ ఏకముఖ విద్యుత్ ప్రవాహం : కాలంతో పాటు విద్యుత్ ప్రవాహం యొక్క పరిమాణం మరియు దిశలు స్థిరంగా (డి.సి.) గల విద్యుత్.

→ ఏకాంతర విద్యుత్ ప్రవాహం (ఎ.సి.) : కాలంతో పాటు ప్రవాహం విద్యుత్ యొక్క పరిమాణం మరియు దిశ మారుతున్న దానిని ఏకాంతర విద్యుత్ అంటారు.

→ rms విలువలు : ఎ.సి. విద్యుచ్చాలక బలాలను, ఏకాంతర విద్యుత్ ప్రవాహాలను rms విలువలలో వ్యక్తపరుస్తాం.

AP 10th Class Physical Science Notes 10th Lesson విద్యుదయస్కాంతత్వం 1